సాక్షి, హైదరాబాద్ : బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్‌రావు తనపై అత్యాచారం చేశాడని మెదక్ జిల్లాకు చెందిన రధారమణి అనే మహిళ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆమె చేసిన ఆరోపణలపై రఘునందన్ స్పందిచారు. ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ. ‘ఆమె చేస్తున్న ఆరోపణలను నూటికి నూరు శాతం అవాస్తవాలు. ఇప్పటి వరకు నాకు ఎవరి వద్ద నుంచి ఎలాంటి నోటీసులు రాలేదు. నేను ఏనేరం చేయలేదు. ఇలాంటి ఆరోపణలు ఎందుకు వస్తున్నాయో తెలీదు. పూర్తి వివరాలను తెలుసుకుని దీనిపై స్పష్టత ఇస్తా’ అని అన్నారు. (రఘునందన్‌తో ప్రాణహాని ఉంది)
కాగా రఘునందన్ తనపై పలుమార్లు లైంగిక దాడికి దిగినట్లు సోమవారం రాధారమణి సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్‌ను కలిసి వినతిపత్రాన్ని అందజేసిన విషయం తెలిసిందే. 2007లో రఘునందన్‌రావు తనని ఆఫీసుకు పిలిపించుకుని కాఫీలో మత్తుమందు కలిపి తనపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా తనకు ప్రాణహాని కూడా ఉందని అన్నారు. ఆమె ఫిర్యాదుపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. (రఘనందన్ లైంగికంగా వేధించారు)
Comments
Please login to add a commentAdd a comment