raghunandhan rao
-
సోనియా గాంధీ ఇంటికి వెళ్లిన ఎంపీ రఘునందన్ రావు
-
కేసీఆర్ ఇంటికి ఈడీ రాక తప్పదు: ఎంపీ రఘునందన్ రావు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పలు కేసుల్లో అన్ని వేళ్లు మాజీ సీఎం కేసీఆర్‌వైపే చూపిస్తున్నాయి. కేసీఆర్ ఇంటికి ఈడీ రాక తప్పదు అంటూ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. అలాగే, బీజేపీ రాష్ట్ర బీజేపీ చీఫ్ పోస్టుపై రఘునందన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.కాగా, పార్టీ రాష్ట్ర కొత్త అధ్యక్షుడిని నియమిస్తారనే ప్రచారంపై రఘునందన్ స్పందించారు. ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ..‘పార్టీ అధిష్ఠానం ఆదేశాలను తప్పకుండా పాటిస్తాను. క్రమశిక్షణ గల కార్యకర్తగా పనిచేస్తాను. ప్రజాస్వామ్యంలో ఎవరైనా అభిప్రాయాలు చెప్పవచ్చు. ఈ క్రమంలోనే రాజాసింగ్ తన అభిప్రాయం చెప్పారు అని అన్నారు.ఇదే సమయంలో తెలంగాణ రాజకీయాలపై కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో గొర్రెల స్కాం, ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన అధికారులు అంతా కేసీఆర్ పేరే చెబుతున్నారు. అన్ని వేళ్లు కేసీఆర్‌వైపే చూపిస్తున్నాయి. త్వరలోనే కేసీఆర్ ఇంటికి ఈడీ రాక తప్పదు అంటూ వ్యాఖ్యలు చేశారు. -
దుబ్బాక: ఓటర్ల తీర్పెటు? బీఆర్ఎస్లో హైటెన్షన్
దుబ్బాక నియోజకవర్గంలో నాల్గవసారి సోలిపేట రామలింగారెడ్డి విజయం సాదించినప్పటికి ఆయన అనారోగ్యంతో 2020లో కన్నుముశారు. ఆ కారణంగా జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి రఘునందన్‌రావు టీఆర్ఎస్ అభ్యర్ధి, దివంగతుడు అయిన రామలింగారెడ్డి సతీమణి సుజాతను కేవలం 1,079 ఓట్ల తేడాతో ఓడించి సంచలన విజయం అందుకున్నారు. ఎమ్. రఘునందన్‌రావుకు 63352 ఓట్లు రాగా, సుజాతకు 62273 ఓట్లు వచ్చాయి. దుబ్బాక నియోజకవర్గం నుండి పోటీలో ఉండొచ్చు అని భావిస్తున్న అభ్యర్థులు: బీజేపీ పార్టీ: మాధవనేని రఘునందన్ రావు (ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే) బీఆర్ఎస్ పార్టీ కొత్త ప్రభాకర్ రెడ్డి (ప్రస్తుత మెదక్ ఎంపీ) కాంగ్రెస్ పార్టీ: చెరుకు శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి ముత్యం రెడ్డి కుమారుడు కత్తి కార్తీక డాక్టర్ శ్రావణ్ కుమార్ రెడ్డి ఎన్నికలలో ప్రభావితం చేసే అంశాలు: దుబ్బాక నియోజకవర్గం లో మహిళా ఓటర్ల సంఖ్య పురుష ఓటర్ల సంఖ్య కంటే ఎక్కువగా ఉంది. కావున వచ్చే ఎన్నికల్లో మహిళ ఓట్లే కీలకం కానున్నాయి.. నిత్యవసర వస్తువుల ధరలు, సిలిండర్ ధరలు, బస్సు చార్జీలు, కరెంటు బిల్లులు విపరీతంగా పెరగడంతో ఇల్లు గడపడం కుటుంబ ఖర్చులు కొనసాగించడం కష్టంగా ఉందని మహిళలు భావిస్తున్నారు. మహిళలకు డ్వాక్రా రుణాలు, అర్హులందరికీ రెండు పడకల గదుల ఇల్లు నిర్మించి ఇవ్వాలని ఆశిస్తున్నారు. ప్రభుత్వం ఇవ్వదలచిన మూడు లక్షలు ఇల్లు నిర్మాణానికి సరిపోవని మహిళలు భావిస్తున్నారు. నూతన మండలాలైన భూంపల్లి,రాయపొల్ మండలాల్లో ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించాలని, మెరుగైన రోడ్డు రవాణా సౌకర్యాలు కల్పించాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. ఆయా వర్గాలకు కులస్తులకు ఇస్తున్న ఆర్థిక సహాయం పథకాలు అన్ని వర్గాలకు వర్తింపజేయాలని అన్ని కులస్తులకు వర్తింపజేయాలని కోరుతున్నారు. విద్యాలయాలు, ఆసుపత్రులు నూతన భవనాలు నిర్మించి వాటిలో సిబ్బందిని పెంచాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు సామాన్యులకు విద్యా వైద్యం అందాలని కోరుతున్నారు. ధరణి లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని లేదా నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాల కల్పన చేయాలని ఈ ప్రాంత నిరుద్యోగులు కోరుతున్నారు. దుబ్బాక నియోజకవర్గం లోని ఆయా మండల కేంద్రాల్లో డిగ్రీ కళాశాలలు నెలకొల్పాలని ఈ ప్రాంత ప్రజలు ఆశిస్తున్నారు -
కేటీఆర్, కవిత సన్నిహితులకే ఓఆర్ఆర్ లీజ్..
సాక్షి, హైదరాబాద్: ఔటర్ రింగ్‌రోడ్డు (ఓఆర్ఆర్) 30 ఏళ్ల లీజ్ టెండర్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలే అక్రమాలకు పాల్పడ్డారని బీజేపీ ఎమ్మెల్యే ఎం.రఘునందన్ రావు ఆరోపించారు. కేటీఆర్, కవిత సన్నిహితులకే ఈ లీజు దక్కిందని నిందించారు. ఐఆర్ఎల్ కంపెనీ రూ.7,272 కోట్లకు టెండర్ వేస్తే రూ.7,380 కోట్లకు దక్కించుకుందని ప్రభు త్వం ఎలా ప్రకటిస్తుందని ప్రశ్నించారు. వేసిన బిడ్ కంటే ఆ కంపెనీ ఎందుకు ఎక్కువ ఇస్తోందని ప్రశ్నించారు. ఎక్కువ టెండర్ వేసిన కంపెనీకి లీజును కట్టబెట్టిన ప్రభుత్వం 16 రోజుల పాటు బిడ్‌ను బహిర్గతం, చేయకపోవడం వెనక ఆంతర్యమేమిటని నిలదీశారు. ఈ బిడ్‌ను ఓపెన్ చేశాక బేరసారాలతో ఐఆర్‌ఎల్‌కు అప్పగించారా అన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. మంగళవారం రఘునందన్ రావు మీడియాతో మాట్లాడుతూ ఓఆర్ఆర్ కాంట్రాక్టు బిడ్‌ను వాస్తవానికి ఈ ఏప్రిల్ 11న తెరిచారని, కానీ ఏప్రిల్ 27న ఈ విషయాన్ని మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ మీడియాకు ప్రకటన విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేశారు. బిడ్ ఓపెన్ చేసిన 16 రోజుల తర్వాత ఈ విషయాన్ని ఎందుకు బయటపెట్టారని ప్రశ్నించారు. ఓఆర్ఆర్ పై బేస్‌ప్రైజ్ ను నిర్ణయించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. కనీసం హెచ్ 1, హెచ్ 2, హెచ్ 2, హెచ్ 4 కంపెనీలను పిలిచి బేస్‌ప్రైజ్ కు తక్కువగా బిడ్కోడ్ చేసినందున టెండర్‌ను క్యాన్సిల్ చేస్తామని ప్రభుత్వం ప్రకటిస్తే బాగుండేదన్నారు. ఫోన్ కాల్ వివరాలు బయట పెట్టాలి అరవింద్ కుమార్ ఫోన్ కాల్ వివరాలు బయట పెట్టాలని రఘునందన్‌రావు డిమాండ్ చేశారు. 16 రోజుల్లో ఆయనతో పాటు మంత్రి గాని ఇంకా ఎవరైనా విదేశాలకు వెళ్లారా.. అని ప్రశ్నించారు. ఆ వివరాలు బయటపెట్టకపోతే తామే ఆడియో లు వీడియోలు బయట పెడతామని హెచ్చరించారు. ఐఆర్ఎల్పై ఇప్పటికే సీబీఐ విచారణ జరుగుతున్నందున ఈ టెండర్ ను వెంటనే రద్దు చేయాలని, లేని పక్షంలో తామే కోర్టుకు , వివిధ విచారణ ఏజెన్సీలకి పిర్యాదు చేస్తామన్నారు. కాగా, ఎమ్మెల్యేలకే సెక్రటేరియట్ లో ఎంట్రీ లేక పోతే ఎలా అని ప్రశ్నించారు. ఈ విషయమై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి క్లారిటీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఇది కూడా చదవండి: తడిసినా కొంటాం -
ఇది ప్రజాస్వామ్యానికి చీకటిరోజు
-
మల్లారెడ్డి తన ఫోన్‌ను చెత్తబుట్టలో ఎందుకు దాచిపెట్టారు: రఘునందన్ రావు
సాక్షి, హైదరాబాద్: ఐటీ దాడులపై తెలంగాణ మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఖండించారు. మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని విమర్శించారు. ఈ అంశానికి రాజకీయ కోణాన్ని ఆపాదించడం సరికాదని సూచించారు. చట్టం ముందు అందరూ సమానమేనని తెలిపారు. ఏ అధికారి చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఎవరినీ కొట్టరని అన్నారు. ఐటీ అధికారులకు వచ్చిన ఫిర్యాదు ప్రకారమే దాడులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. కొడుకును కొట్టారంటూ మల్లారెడ్డి చేసిన ఆరోపణలు సరైనవి కాదని హితవు పలికారు. మల్లారెడ్డి కొడుకు అస్వస్థతకు గురవ్వడంపై ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ.. ఎవరికి నోటీసులు ఇచ్చినా గుండె నొప్పి అంటూ ప్రతి ఒక్కరూ అసుపత్రికి వెళుతున్నారని మండిపడ్డారు. సోమవారం ఉదయం కూడా వాకింగ్ చేశరు కదా.. నోటీసులు ఇవ్వగానే గుండె నొప్పి వస్తుందా అని ధ్వజమెత్తారు. మల్లారెడ్డి సంస్థల్లో పని చేసే వారే ఐటీకి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోందని తెలిపారు. సంబంధిత వార్త: ఆస్పత్రి ఎదుట మంత్రి మల్లారెడ్డి ధర్నా.. కుమారుడి ఆరోగ్యంపై డాక్టర్లు ఏం చెప్పారంటే.. మల్లారెడ్డి తన ఫోన్‌ను చెత్తబుట్టలో ఎందుకు దాచిపెట్టారని ప్రశ్నించారు. ఫోన్లు దాచిపెట్టుకున్నారంటేనే ఏదో జరిగిందని అర్థమవుతోందని అనుమానం వ్యక్తం చేశారు. ఐటీ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తే సరిపోతుందని అన్నారు. మల్లారెడ్డి తప్పు చేయనప్పుడు విచారణకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. అధికారం అడ్డుపెట్టుకుని తప్పు చేసిన వారే భయపడతారని విమర్శించాఉ. మల్లారెడ్డి ఫైర్ మంత్రి మల్లారెడ్డి ఐటీ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. సురారం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన కొడుకును చూసేందుకు వెళ్లిన మంత్రిని సీఆర్పీఎఫ్ బలగాలు అడ్డుకున్నాయి. దీంతో మల్లారెడ్డి ఆసుపత్రి బయట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తరువాత తిరిగి ఇంటికి వెళ్లారు. తన కొడుకును సీఆర్పీఎఫ్ బలగాలతో కొట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. కక్ష సాధింపుతోనే ఐటీ దాడులు జరుపుతోందని విమర్శించారు. -
కేసీఆర్.. తెలంగాణలో అమ్రిష్‌పురిలా మారిపోయాడు: బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పాలిటిక్స్‌లో బీజేపీ, అధికార టీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య మాటల వార్ పీక్ స్టేజ్‌కు చేరుకున్నాయి. సీఎం కేసీఆర్.. జాతీయ పార్టీ బీఆర్ఎస్ ఏర్పాటుపై బీజేపీ నేతలు సెటైరికల్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. కాగా, తాజాగా తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్.. టీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘టీఆర్ఎస్ వేస్ట్ పార్టీ. సీఎం కేసీఆర్.. తెలంగాణలో అమ్రిష్‌పురిలా మారిపోయాడు. ఫాంహౌస్‌లో నిమ్మకాయలు పెడుతున్నాడు. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చాలంటే మంత్రాలు చేయాలని చెప్పారట. సచివాలయానికి వెళ్లొద్దు అంటే.. వెళ్లడం లేదు. రేపో మాపో మంత్రగాడికి రాష్ట్రం ఇచ్చి వెళ్లిపోతాడు’ అంటూ ఎద్దేవా చేశారు. మరోవైపు, దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్కు వీఆర్ఎస్ ఇచ్చాం. బీఆర్ఎస్కు కంపల్సరీ రిటైర్మెంట్ స్కీం ఇస్తాము అని కామెంట్స్ చేశారు. -
కేంద్రం ఎగ్గొట్టిన 4వేలకోట్లు తీసుకురండి: హరీశ్
సాక్షి,దుబ్బాక టౌన్: తెలంగాణకు న్యాయంగా రావాల్సిన రూ.4వేల కోట్లను కేంద్ర ప్రభుత్వం ఎగ్గొట్టిందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. దుబ్బాక నియోజకవర్గంలోని ఆరపల్లి, మహ్మద్‌షాపూర్ గ్రామాలకు చెందిన‘దళితబంధు’లబ్ధిదారులకు యూనిట్స్‌ను గురువారం దుబ్బాక పట్టణంలో పంపిణీ చేశారు. ఎమ్మెల్యే రఘునందన్‌రావు అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ ‘బీజేపీ నేతలు బాగా మాట్లాడుతుండ్రు గదా.. ఎమ్మెల్యే రఘునందన్‌రావు గారు ముందుగా ఢిల్లీ నుంచి రావాల్సిన పైసలు తీసుకరండ్రి’అంటూ సూచించారు. తెలంగాణ ప్రజలు కేంద్రానికి చెల్లించిన పన్నుల వాటానే అడుగుతున్నాం తప్ప.. అడుక్కోవడం లేదన్నారు. బీఆర్జీఎఫ్ కింద ఏటా ఇవ్వాల్సిన రూ.450కోట్లు మూడేళ్ల నుంచి (రూ.1,350 కోట్లు) ఇవ్వడం లేదని, 15వ ఆర్థిక సంఘానికి చెందిన రూ.763 కోట్లు, 2021–22కు సంబంధించిన అభివృద్ధి నిధులు రూ.1,200 కోట్లు, మొత్తం రూ.4వేల కోట్లు ఇవ్వాల్సి ఉందని వివరించారు. -
‘సినిమా వాళ్ల కంటే గొప్పనటులు కేసీఆర్, హరీశ్’
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ కాలి గాయం, చికిత్సపై ఆర్థికమంత్రి హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలు సరికాదని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. హుజూరాబాద్ ఉపఎన్నికల ప్రచారానికి బీజేపీ నాయకులు వీల్ చైర్లో, స్ట్రెక్చర్లపై వస్తున్నారంటూ దిగజారి మాట్లాడడం సరికాదన్నారు. అసలు డ్రామాలకే పర్యాయపదం కేసీఆర్ కుటుంబమని, సినీనటుల కంటే గొప్పనటులు కేసీఆర్, హరీశ్‌రావులని దుయ్యబట్టారు. మంగళవారం పార్టీ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు యెండల లక్ష్మీనారాయణ, ఏనుగు రవీందర్‌రెడ్డితో కలిసి రఘునందన్‌రావు మీడియాతో మాట్లాడారు. ఉద్యమ సందర్భంగా తన వెంట పెట్రోల్ తెచ్చుకున్న హరీశ్ 50 పైసల అగ్గిపెట్టె మర్చిపోవటం డ్రామాలో భాగం కాదా? అని ప్రశ్నించారు. ఆనాటి ఫొటోలను మీడియాకు ప్రదర్శించారు. తన ఆత్మబలిదానంతో మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని రగిలించిన అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ ఎమ్మెల్సీ పదవికి కూడా అర్హరాలు కాదా? అని నిలదీశారు. రేవంత్‌రెడ్డికి పీసీసీ పదవి కేసీఆర్ ఇప్పించారా? లేదా? అనేది కాలమే సమాధానం చెబుతుందన్నారు. ఈటలపై చేసిన వ్యాఖ్యలకు హరీశ్ క్షమాపణలు చెప్పాలని రవీందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. -
స్థానికులకు ఉద్యోగాలివ్వాలి
సాక్షి, హైదరాబాద్: పరిశ్రమల్లో స్థానికులకు నిర్ధారిత మొత్తంలో ఉద్యోగాలు ఇచ్చేలా చట్టం తేవాలని దుబ్బాక శాసనసభ్యుడు రఘునందన్‌రావు ప్రభుత్వాన్ని కోరారు. స్థానికంగా పరిశ్రమలున్నప్పటికీ స్థానిక నిరుద్యోగులకు ఉపయోగం లేకుండా వేరే ప్రాంతాల వారికి ఉద్యోగాలు ఇస్తున్నారని, ఈ తీరు మారాలని గురువారం ఆయన శాసనసభలో పేర్కొన్నారు. పద్దులపై చర్చ సందర్భంగా మాట్లాడారు. కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కూడా ఇదే డిమాండ్ చేశారు. దుబ్బాక నియోజకవర్గం పరిధిలోకి వచ్చే చేగుంట ప్రాంతంలో 62 పరిశ్రమలున్నాయని, కానీ వాటిల్లో ఏ వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయో కూడా తెలియనీయకుండా వ్యవహరిస్తున్నారని, కనీసం ఆ పరిశ్రమలకు బోర్డులు కూడా లేవని రఘునందన్‌రావు తెలిపారు. వేరే రాష్ట్రాల నుంచి వచ్చే కార్మికులకు కనీస వేతనాలు కూడా ఇవ్వట్లేదని, ప్రమాదం జరిగి కార్మికులు చనిపోతే స్థానికులు కానందున వారి తరఫున మాట్లాడే వారూ లేకుండా పోతున్నారన్నారు. ఇక్కడ పరిశ్రమలు ఎక్కువగా ఉంటున్నందున స్థానికంగా ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని, కార్మిక సంక్షేమ నిధి నుంచి ఓ విద్యాలయం, కార్మికుల కోసం ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేయాలని కోరారు. నా ఇలాఖాలో సింగిల్ రోడ్డు..కేటీఆర్ ఇలాఖాలో డబుల్ రోడ్డా.. ముస్తాబాద్ నుంచి దుబ్బాక మండల కేంద్రానికి ఉన్న రోడ్డు విషయంలో వివక్ష ఉందన్న భావన కలుగుతోందని రఘునందన్‌రావు పేర్కొన్నారు. ఈ రోడ్డు తన ఇలాఖాలో సింగిల్ రోడ్డుగా ఉండగా పొరుగునే ఉండే కేటీఆర్ నియోజకవర్గం పరిధిలో డబుల్ రోడ్డుగా ఉందని సభ దృష్టికి తెచ్చారు. వెంటనే తన పరిధిలోనూ డబుల్ రోడ్డు చేయాలని కోరారు. దౌల్తాబాద్–చేగుంట రోడ్డును కూడా రెండు వరుసలకు విస్తరించాలన్నారు. చేగుంట మండలంలోని 8 పంచాయతీల పరిధిలో రిజర్వ్ ఫారెస్టు భూమిని సాగుచేస్తున్నారంటూ రైతులకు కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వట్లేదని రఘునందన్‌రావు సభలో ఫిర్యాదు చేశారు. -
కేంద్ర మంత్రిని కలిసిన ఎమ్మెల్యే
దుబ్బాకటౌన్: కేంద్ర మానవ వనరులు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్‌రావు ఆదివారం హైదరాబాద్‌లోని ఓ హోటల్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దుబ్బాక నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం సీఎస్ఆర్ ఫండ్స్ కేటాయించాలని వినతిపత్రం అందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను కలిసి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని కోరినట్లు తెలిపారు. బాధితులకు న్యాయం చేయాలి దుబ్బాకటౌన్: మల్లన్నసాగర్ ప్రాజెక్టు ముంపు బాధితులకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరుగవద్దని ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్‌రావు అన్నారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణం, ముంపు బాధితుల సమస్య తదితర విషయాలపై సంబంధిత అధికారులతో శనివారం రాత్రి క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు నిర్మాణం, కాలువల నిర్మాణంతో నష్టపోతున్న బాధితులకు అందించిన సాయంపై ఆరా తీశారు. బాధితులకు న్యాయం జరిగేలా పరిహారం అందించాలన్నారు. పరిహారం పంపిణీలో అన్ని ప్రాంతాలకు సమన్యాయం ఉండాలన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో సర్వం కోల్పోయిన బాధితులకు అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉండాలన్నారు. ఈ సమీక్షలో మల్లన్నసాగర్ ప్రాజెక్టు అధికారులు తదితరులు ఉన్నారు. -
మా లక్ష్యం బావ, బావమరిది కాదు: రఘునందన్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ నాయకత్వం గ్రేటర్ ఎన్నికలను సీరియస్‌గా తీసుకుందని, జీహెచ్ఎంసీ ఎలక్షన్‌ని ఎదుర్కొవడానికి బీజేపీ దగ్గర ప్రత్యేక ప్రణాళికలున్నాయన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు. ఎంఐఎంను మేయర్ పీఠంపై కూర్చోబెట్టడానికి కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ జర్నలిస్టు యూనియన్ సోమవారం నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’లో రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘టీఆర్ఎస్కు ఓటు వేస్తే.. ఎంఐఎంకు ఓటు వేసినట్లే. హైదరాబాద్‌ను బెంగాల్, కోల్‌కతాగా మార్చవద్దని గ్రేటర్ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నాను. పాతబస్తీలో జరుగుతోన్న అసాంఘిక కార్యక్రమాలను బయటకు తీస్తాం. గ్రేటర్ ఎన్నికల తర్వాత కేటీఆర్ కళ్ళు కిందకు దిగుతాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సమాచారాన్ని సేకరించే పనిలో ఉన్నాను. బావ, బావమరిది కాదు.. మా లక్ష్యాన్ని చేరుకోవటమే బీజేపీకి ముఖ్యం’ అన్నారు రఘునందన్ రావు. (చదవండి: సంక్రాంతికి ‘జీహెచ్ఎంసీ’ గిఫ్ట్ ఇస్తారు..) ఆయన మాట్లాడుతూ.. ‘వరద సాయాన్ని టీఆర్ఎస్ ఓట్లు కొనుగోలుగా మార్చింది. జోనల్ కమిషనర్‌కు 2 లక్షల రూపాయల కంటే ఎక్కువ డబ్బులు డ్రా చేసే అధికారం లేదు. గ్రేటర్ ఎన్నికల తర్వాత 2 లక్షల కంటే ఎక్కువ డ్రా చేసిన జోనల్ కమిషనర్లను కోర్టుకు ఈడ్చుతాం. టీఆర్ఎస్లో అవమానాలు ఎదుర్కొంటోన్నఅసలసిసలైన ఉద్యమకారులను బీజేపీ గౌరవిస్తోంది. టీఆర్ఎస్ పార్టీని ఓడింవచ్చన్న స్పూర్తిని దుబ్బాక ఇచ్చింది. బీజేపీని.. రఘునందనరావును వేరుచేసి చూడవద్దని మనవి చేస్తున్నాను. గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లకు మాత్రమే కేసీఆర్ ముఖమంత్రి కాదు. సిద్ధిపేటతో సమానంగా కోట్లాడి దుబ్బాకకు నిధులు తీసుకెళ్తాను. గ్రామీణ ప్రాంతం కాబట్టే కేంద్ర నిధులతో దుబ్బాకను అభివృద్ధి చేస్తాను. ఇకపై ప్రతి ఎన్నికలోనూ బీజేపీనే గెలిచేలా దుబ్బాకను అభివృద్ధి చేస్తాను. మల్లన్న సాగర్ నిర్వాసితుల కోసం కోర్టులో స్వయంగా పోరాటం చేస్తాను. దుబ్బాక బస్టాండ్ నిధులను గోల్ మాల్ వ్యవహారం త్వరలో బయటకు వస్తుంది అన్నారు రఘునందన్ రావు. -
రఘునందన్ ప్రమాణ స్వీకారానికి రంగం సిద్ధం
సాక్షి, హైదరాబాద్ : దుబ్బాక ఉప ఎన్నికలో సంచలన విజయాన్ని నమోదు చేసిన బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు ప్రమాణ స్వీకారానికి సిద్ధమయ్యారు. 18వ తేదీన మధ్యాహ్నం ఒంటి గంటకు దుబ్బాక ఎమ్మెల్యేగా రఘునందన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేకెత్తించిన దుబ్బాక ఫలితాల్లో 1079 ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థిగా విజయం సాధించిన విషయం తెలిసిందే. అనూహ్య రీతిలో అధికార టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతపై గెలుపొందారు. ఈ విజయంతో రాష్ట్ర వ్యాప్తంగా రఘునందన్ ఒక్కసారిగా హాట్‌టాపిక్‌గా మారారు. తాజాగా ప్రమాణస్వీకారానికి సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు అభినందనలు వెళ్లువెత్తుతున్నాయి. (దుబ్బాకలో బీజేపీ సంచలన విజయం) -
దుబ్బాక విజయంతో బీజేపీ సంబరాలు
-
తీర్పు చారిత్రాత్మకం : రఘునందన్
సాక్షి, సిద్దిపేట : ఉత్కంఠ బరితంగా సాగిన దుబ్బాక ఉప ఎన్నికల పోరులో బీజేపీ అభ్యర్థ రఘునందన్‌రావు విజయం సాధించడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. అధికార టీఆర్ఎస్పై అనుహ్య రీతిలో గెలుపొంది.. గులాబీ దళానికి సవాలు విసురుతున్నారు. రానున్న ఎన్నికల్లోనూ దుబ్బాక ఫలితమే పునరావృత్తం అవుతుందని గట్టి హెచ్చరికలు పంపుతున్నారు. అధికార పార్టీ నేతలు ఎన్ని అవాంతరాలు, అడ్డంకులు సృష్టించినా.. దుబ్బాకలో కాషాయ జెండా ఎగరేశామని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. (తొలిదెబ్బ.. ఫలించని హరీష్ ఎత్తుగడలు) ఇక ఈ ఫలితాలు ఎంతో చారిత్రాత్మకమైనవని విజేత రఘునందన్‌రావు అన్నారు. తనకు విజయాన్ని అందించిన దుబ్బాక ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ విజయం నియోజకవర్గ ప్రజలకు అంకితమన్నారు. ఫలితాల అనంతరం సిద్దిపేటలో ఇందూరు కాలేజీ వద్ద రఘునందన్‌రావు సాక్షితో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో తన గెలుపును అడ్డుకోవాడానికి టీఆర్ఎస్ నేతలు అన్ని విధాల ప్రయత్నించారని విమర్శించారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, అసెంబ్లీ వేదికగా వారి తీరును ఎండగడతానని అన్నారు. అక్రమ కేసులు, నిర్బంధాలను తట్టుకుంటూ పోరాటం సాగిస్తామన్నారు. (దుబ్బాకలో బీజేపీ సంచలన విజయం) ‘దుబ్బాక ప్రజానీకానికి శిరస్సు వంచి నమస్సులు తెలుపుతున్నా . ఈ విజయం దుబ్బాక ప్రజలకు అంకితం . ఏ గడ్డ నుంచి అయితే తెలంగాణ ఉద్యమం ప్రారంచించామో గొంతె త్తామో అదే గడ్డ ఇచ్చిన తీర్పు ప్రగతి భవన్ వరకూ పోవాలి. రాష్ట్రంలో నిరంకుశ నియంత్రుత్వ పాలనకు చరమ గీతం పాడేలా రీ సౌండ్ ఇచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా, బండి సంజయ్‌కు ధన్యవాదములు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి ఊదిన నాయకుల్లా రా కలిసి రండి. ఏకమై పోరాడుదాం’ అని వ్యాఖ్యానించారు. -
దుబ్బాక ఫలితం.. దిమ్మతిరిగిపోయింది
సాక్షి, సిద్దిపేట : దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్కు ఎదురుదెబ్బ తగిలింది. అధికార పార్టీ సిట్టింగ్ స్థానంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు విజయం సాధించి.. టీఆర్ఎస్కు ఊహించిన షాక్ ఇచ్చారు. సమీప అభ్యర్థి సోలిపేట సుజాతపై 1079 ఓట్ల మెజార్టీ సాధించి.. తొలిసారి చట్టసభకు ఎన్నికయ్యారు. ఇరు పార్టీల మధ్య హోరా హోరీగా సాగిన పోరులో అనూహ్య రీతిలో బీజేపీ విజయం సాధించి... అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తితింది. ఈ విజయంతో బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాల్లో మునిగిపోయారు. దుబ్బాక ఇచ్చిన తీర్పుతో రానున్న రోజుల్లో రాష్ట్రంలో మరింత బలోపేతం అవుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఉప ఎన్నిక ఫలితం టీఆర్ఎస్ శ్రేణులను తీవ్ర నిరాశకు గురిచేసింది. రెండు దశాబ్ధాలుగా టీఆర్ఎస్కు కంచుకోటగా ఉన్న దుబ్బాకలో ఓటమి చెందడం ఆ పార్టీ నేతలు ఏమాత్రం జీర్ణించుకోలేపోతున్నారు. సానుభూతి పనిచేసిందా..? టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అకాల మరణంతో దుబ్బాకలో ఉప ఎన్నిక అనివార్యమైంది. అభ్యర్థి ఎంపికపై తొలినుంచి వ్యూహత్మకంగా వ్యవహరించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. అందరూ ఊహించిన విధంగానే సోలిపేట సుజాతను బరిలో నిలిపారు. స్థానిక అభ్యర్థి కావడంతోపాటు సానుభూతి కూడా కలిసొస్తుందని అందరూ ఊహించారు. దుబ్బాక చుట్టూ సిరిసిల్ల, గజ్వేల్, సిద్దిపేట వంటి స్థానాల్లో కేటీఆర్, సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు ఉండటంతో ఉప ఎన్నిక విజయం ఖాయమనుకున్నారు. మరోవైపు ప్రచార బాధ్యతలన్నీ మొదటి నుంచి మంత్రి హరీష్ రావు దగ్గరుండి చూసుకున్నారు. దుబ్బాక అభివృద్ధి తన బాధ్యతంటూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలు కేవలం ఓట్ల సమయంలోనే ప్రజల్లో కనిపిస్తారని, దుబ్బాక అభివృద్ధికి టీఆర్ఎస్కే ఓటు వేయాలని అభ్యర్థించారు. మరోవైపు బీజేపీ నుంచి పెద్ద ఎత్తున నేతలను టీఆర్ఎస్లో చేర్చుకున్నారు. అయినప్పటికీ దుబ్బాక ప్రజలు మార్పును కోరుకున్నారు. గతంలో ఇదే స్థానం నుంచి రెండు సార్లు అసెంబ్లీకి, ఓసారి మెదక్ పార్లమెంట్ స్థానానికి పోటీచేసి ఓటమి చవిచూసిన రఘునందన్‌కు ఈసారి అవకాశం కల్పించారు. వరుస మూడు పరాజయాలకు తోడు వ్యక్తిగతంగా కొంత సానుభూతి కలిసొచ్చింది. ఉప ఎన్నికలకు షెడ్యూల్ కూడా విడుదల కాకముందే రఘునందన్ దుబ్బాకలో వాలిపోయారు. స్థానిక అభ్యర్థి కావడంతో పాటు తొలినుంచి ప్రజలకు అందుబాటులో ఉంటాడనే నమ్మకం విజయానికి దారి తీసింది. అలాగే రాష్ట్ర స్థాయిలోనూ అతనికి మంచి గుర్తింపు ఉంది. టీవీ షోలతో పాటు.. సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉంటూ.. అనునిత్యం ప్రజా సమస్యలపై గళమెత్తే నేతగా గుర్తింపు పొందారు. అనర్గళంగా మాట్లాడే తత్వంతో పాటు చొరవ ఉన్న నేతగా పెద్ద ఎత్తున అభిమానులను సొంతం చేసుకున్నారు. వ్యక్తిగతంగా న్యాయవాది కావడం రఘునందన్‌కు రాజకీయాల్లో మరింత కలిసొచ్చింది. మరోవైపు టీఆర్ఎస్ అభ్యర్థిగా సుజాత బరిలో నిలవడం కూడా రఘునందన్‌కు కొంచె అనుకూలంగా మారింది. సుజాత డమ్మీ అభ్యర్థి అని, ఆమెను గెలిపిస్తే దుబ్బాక వచ్చే నిధులు కూడా సిద్దిపేట, సిరిసిల్లకు వెళ్లడం ఖాయమని బీజేపీ నేతలు చేసిన ప్రచారం బాగా వర్కౌట్ అయ్యింది. అంతేకాకుండా సీఎం కేసీఆర్‌పై ఆయన చేసే ఆరోపణలు, విమర్శలు ప్రజల్లోకి మరింత చొచ్చుకెళ్లాయి. దిమ్మతిరిగిపోయే ఫలితం.. ఇక దుబ్బాకలో ఓటమి అధికార టీఆర్ఎస్ ఊహించనిది. ముఖ్యంగా మంత్రి హరీష్‌రావు దాదాపు రెండు నెలలకు పైగా అక్కడే మకాం వేసినప్పటికీ.. ఫలితాలు తారుమారు కావడం ఆ పార్టీ నేతలకు తీవ్ర నిరాశ కలిగిస్తోంది. టీఆర్ఎస్కు కంచుకోటగా గుర్తింపు పొందిన దుబ్బాక గడ్డపై కాషాయం జెండా ఎగరడం అంత సామాన్య విషయం కాదని, దాదాపు లక్ష మెజార్టీ ఖాయమని టీఆర్ఎస్ నేతలు తొలి నుంచీ ధీమా వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ప్రచారంలో హరీష్‌రావు అనేక మార్లు ఇదే అంశాన్ని ప్రస్తావించారు. అయినప్పటికీ ఉత్కంఠ బరిత పోరులో చివరికి విజయం బీజేపీనే వరించింది. తాజా విజయంపై బీజేపీ నేతలు మాట్లాడుతూ.. ఈ ఫలితంతో టీఆర్ఎస్కు దిమ్మతిరిగిపోయిందని, భవిష్యత్‌లోనూ జరిగే ఎన్నికల్లో ఇదే తీరు ఫలితాలు పునరావృత్తం అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఓటమి చెందడం ఇది తొలిసారి. గతంలో పాలేరు, నారాయణ్‌ఖేడ్ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ప్రత్యర్థి స్థానంలోనూ టీఆర్ఎస్ విజయం సాధించింది. -
దుబ్బాక గెలుపు అతనికే అంకితం : బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ సంచలన విజయం సాధించింది. నువ్వా నేనా అన్న రీతిలో సాగిన పోరులో అనూహ్య రీతిలో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు విజయం సాధించారు. 1470 ఓట్ల మెజార్టీతో సమీప టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతపై రఘునందన్ విజయం సాధించారు. 23 రౌండ్లకు గాను 12 రౌండ్లల్లో బీజేపీ అధిక్యం సాధించింది. ఉత్కంఠ పోరులో విజయం సాంధించిన రఘునందన్‌కు అభినందనలు వెల్లువెత్తువెత్తున్నాయి. (చదవండి : దుబ్బాక ఫలితాలపై స్పందించిన కేటీఆర్ ) దుబ్బాక గెలుపును ఇటీవల బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముందు ఆత్మహత్యకు పాల్పడిన కార్యకర్త గంగుల శ్రీనివాస్‌కు అంకితం చేస్తున్నామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని బీజేపీ నాయకురాలు డీకే అరుణ అన్నారు. తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని చెప్పారు. ఇందుకు ఉదాహరణ దుబ్బాక ఉపఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడమే అని ఆమె అన్నారు. ఈ గెలుపు తెలంగాణ మొత్తం ప్రభావం చూపుతుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తాము మరింత ఉత్సాహంగా పనిచేసేందుకు ఈ గెలుపు దోహపడుతుందన్నారు. ఏ ఎన్నికల్లో అయినా అభ్యర్థి ప్రాధాన్యతగానే ఎన్నికలు జరుగుతాయని, అభ్యర్థి గెలుపును, పార్టీ గెలుపును విడదీయలేమని కిషన్‌రెడ్డి అన్నారు. (చదవండి : దుబ్బాకలో టీఆర్ఎస్కు ఎదురుదెబ్బ) -
దుబ్బాకలో బీజేపీ సంచలన విజయం
సాక్షి, సిద్దిపేట : రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన దుబ్బాక ఉప ఎన్నికలో సంచలన విజయం నమోదైంది. నువ్వా నేనా అన్న రీతిలో సాగిన పోరులో అనూహ్య రీతిలో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు విజయం సాధించారు. నరాలు తెగే ఉత్కంఠ నడమ సాగిన పోరులో చివరి నాలుగు రౌండ్లలో బీజేపీ ఆధిక్యం కనబర్చి టీఆర్ఎస్ కంచుకోటలో తొలిసారి కాషాయ జెండా ఎగరేసింది. 1079 ఓట్ల మెజార్టీతో సమీప టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతపై రఘునందన్ విజయం సాధించారు. టీ-20 మ్యాచ్‌లా సాగిన పోరులో మొదటి పది రౌండ్స్‌లో బీజేపీ పూర్తిస్థాయి ఆధిక్యం కనబర్చగా.. అనుహ్యంగా పుంజుకున్న టీఆర్ఎస్ 11 నుంచి 20 రౌండ్ వరకు ఆధిక్యంలోకి దూసుకొచ్చి బీజేపీకి సవాలు విసిరింది. ఆధిక్యం నుంచి ఓటమికి.. ఓ సమయంలో టీఆర్ఎస్ విజయం ఖాయమనే రీతిలో ఆధిక్యం కనబర్చింది. అయితే పడిలేచిన కెరటంలా చివరి నాలుగు రౌండ్స్‌లో బీజేపీ లీడ్‌లోకి వచ్చి.. ఉత్కంఠకు తెరదించింది. 19వ రౌండ్ ముగిసే సరికి అధికార టీఆర్ఎస్ 450 ఓట్ల ఆధిక్యంలో ఉండటంతో దాదాపు విజయం ఖాయమనుకున్నారు. అయితే వరుసగా 20, 21, 22, 23 రౌండ్స్‌లో బీజేపీ ఆధిక్యంలోకి వచ్చి.. సంచలన విజయాన్ని నమోదు చేసింది. 20 రౌండ్లు ముగిసే సరికి బీజేపీకి 241 ఓట్ల ఆధిక్యం, 21వ రౌండ్లో 428 ఓట్ల, 22వ రౌండ్లో 438 ఓట్ల ఆధిక్యంతో పాటు 23వ రౌండ్లోనూ బీజేపీ ఆధిక్యం లభించడంతో 1,079 ఓట్ల మెజార్టీతో రఘునందన్ విజయం సాధించారు. దుబ్బాకలో మొత్తం 1,62,516 ఓట్లు పోలవ్వగా.. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌కు 62,773 ఓట్లు వచ్చాయి. టీఆర్ఎస్ అభ్యర్థి సుజాత 61,302 ఓట్లు తెచ్చుకుని గట్టిపోటీ ఇచ్చి రెండో స్థానంలో నిలిచారు. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి కేవలం 21,819 ఓట్లకే పరిమితం అయ్యారు. దుబ్బాక విజయంతో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద బండి సంజయ్ కార్యకర్తలతో సంబరాలు జరుపుకున్నారు. బీజేపీ విజయంపై హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు దుబ్బాక ఫలితం టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ షాకింగ్‌కు గురిచేసింది. ప్రచారంలో మంత్రి హరీష్ రావు అన్నీ తానై వ్యవహరించినప్పటికీ.. ఓటర్లు రఘునందన్‌వైపే మొగ్గుచూపారు. లక్ష మెజార్టీ వస్తుందని హరీష్ అంచనా వేసినప్పటికీ.. బీజేపీ ధాటికి పరాజయం పాలవ్వక తప్పలేదు. -
దుబ్బాక: బీజేపీ అభ్యర్థి ఇంట్లో సోదాలు
సాక్షి, సిద్ధిపేట : దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా బీజేపీ అభ్యర్థి బంధువుల ఇంట్లో, కార్యాలయాల్లో పోలీసులు సోమవారం సోదాలు చేపట్టారు. రఘునందన్ రావు అత్తగారిల్లు, సమీప బంధువుల ఇళ్లతో సహా ఎనిమిది చోట్ల ఏక కాలంలో సోదాలు చేస్తున్నారు. ఈ సోదాల్లో రఘునందరన్‌రావు మామ ఇంట్లో రూ. 18 లక్షల 65 వేలు స్వాధీనం చేసుకున్నారు. ఇదిలావుండగా పోలీసుల చర్యలకు వ్యతిరేకంగా బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు, కార్యకర్తలు నిరసనకు దిగారు. మరోవైపు సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ రాజనర్స్ ఇంట్లో పోలీసులు సోదా చేస్తున్నారు. చదవండి: దుబ్బాక అభివృద్ధి బాధ్యత నాది: హరీశ్ రావు -
రఘునందన్‌ను వెంటాడుతున్న మహిళ
సాక్షి, సిద్దిపేట : బీజేపీ సీనియర్ నేత, ఆ పార్టీ దుబ్బాక ఉప ఎన్నిక అభ్యర్థి రఘునందన్‌రావు ఎన్నికల ముందు కొత్త చిక్కులు వచ్చిపడుతున్నాయి. వరుసగా మూడోసారి దుబ్బాక బరిలో నిలిచిన విజయ కోసం పరితపిస్తున్న ఆయనకు ఓ మహిళ రూపంలో అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే తన అనుచరులు 40 లక్షల రూపాయలతో పోలీసులకు చిక్కగా.. తాజాగా మరో సమస్య వచ్చిపడింది. గతంలో రఘునందన్‌పై సంచలన ఆరోపణలు చేసి వార్లల్లో నిలిచిన మహిళ మరోసారి తెరపైకి వచ్చింది. (వెంటాడుతున్న గతం.. ఓటమి తప్పదా?) తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ రాధారమణి అనే మహిళ గత ఫిబ్రవరిలో మీడియా ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఓకేసు నిమిత్తం న్యాయవాది అయిన రఘునందన్‌ను ఆశ్రయిస్తే.. తనకు మత్తుమందుఇచ్చి లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపించింది. ఆమె తాజాగా దుబ్బాక ఉప ఎన్నికల్లో అతనికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తోంది. ఇంటింటికి తిరుగుతూ రఘునందన్ తనకు చేసిన అన్యాయాన్ని మహిళలకు చెబుతూ అతనికి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహిస్తోంది. అంతేకాకుండా ఎంతోమంది పోలీసులను, మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించిన తనకు న్యాయం జరగలేదని చెబుతోంది. ఈ ఎన్నికల్లో అతన్ని ఓడించడమే తన లక్క్ష్యమని రాధారామణి ప్రచారం చేస్తోంది. (రఘునందన్‌తో ప్రాణహాని: అమ్మాయిలకు మత్తుమందు ఇచ్చి) మరోవైపు ఆమె ప్రచారంపై రఘునందర్రావు అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిని ప్రత్యర్థుల కుట్రగా భావిస్తున్నారు. ప్రచారంలో తమకంటే ముందున్న బీజేపీ అభ్యర్థిని ఎలాగైనా ఓడించాలని ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడుతున్నారు. -
వెంటాడుతున్న గతం.. ఓటమి తప్పదా?
సాక్షి, హైదరాబాద్ : దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికతో తెలంగాణలో మరోసారి రాజకీయ వేడి మొదలైంది. టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అకాల మరణంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. నవంబర్ 3న జరిగే ఈ ఎన్నిక కోసం ప్రధాన పార్టీలైన అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ గెలుపే లక్క్ష్యంగా బరిలో నిలిచాయి. అంతేకాకుండా మూడు పార్టీలు ఈ స్థానాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. చుట్టపక్కల సిరిసిల్ల, గజ్వేల్, సిద్దిపేట లాంటి టీఆర్ఎస్ కంచుకోటలు ఉండటంతో దుబ్బాకలో తొలినుంచి టీఆర్ఎస్ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. అక్కడి నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి రామలింగారెడ్డి ఇప్పటి వరకు నాలుగుసార్లు విజయం సాధించారు. అయితే తాజాగా జరుగుతున్న ఉప ఎన్నికలో పోటీ భిన్నంగా ఉండబోతుందని స్థానిక రాజకీయ విశ్లేషకుల మాట. (ముచ్చటగా మూడోసారి: విజయం దక్కుతుందా?) గతంలో కాంగ్రెస్ (చెరుకు ముత్యంరెడ్డి) ఇక్కడ బలమైన నేతగా పేరొందినా.. ప్రస్తుతం చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆ స్థానం బీజేపీ ఆక్రమించినట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఎన్నికల్లో టీఆర్ఎస్కు కాంగ్రెస్ నుంచి కంటే బీజేపీ నుంచే తీవ్రమైన పోటీ ఎదురైయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన రఘునందన్ గతంలో ఇదే స్థానం నుంచి రెండుసార్లు పోటీ చేసి ఓటమి చెందారు. ముచ్చటగా మూడోసారి బరిలోకిదిగి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. ఎలానైనా విజయం సాధించాలని పట్టుదలతో ఉన్న రఘునందన్.. ప్రచారంలో ఇరు పార్టీల కంటే ఓ అడుగు ముందే ఉన్నారు. టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన చెరుకు శ్రీనివాసరెడ్డి హస్తం పార్టీ తరఫున, రామలింగారెడ్డి సతీమణి సుజాత టీఆర్ఎస్ తరఫున బరిలో నిలిచారు. స్థానికతతో పాటు, సానుభూతి కూడా తోడవుతుంది భావించిన టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సుజాతను బరిలోకి దింపారు. (కాంగ్రెస్‌లో చేరిక.. టికెట్ కన్ఫాం) సానుభూతి పనికొస్తుందా..? ఎన్నికల్లో సానుభూతి పనికొస్తుది? అనేది గత అనుభవాలు స్పష్టంగా చెబుతున్నాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఉమ్మడి మెదక్ జిల్లా నారాయణ్‌ఖేడ్ ఎమ్మెల్యే పీ. కిృష్టారెడ్డి అనారోగ్యం కారణంగా మృతిచెందారు. కాంగ్రెస్ పార్టీ సాంప్రదాయం ప్రకారం సిట్టింగ్ ప్రజాప్రతినిధి చనిపోతే రాబోయ్యే ఉప ఎన్నికల్లో వారి కుటుంబంలోనే ఒకరికి సీటును కేటాయిస్తారు. లేకపోతే విపక్షాలు ఒప్పుకుంటే కుటుంబ సభ్యుడిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు. ఈ క్రమంలో నారాయణ్‌ఖేడ్ ఎన్నికల్లో కిృష్టారెడ్డి కుటుంబసభ్యుడినే కాంగ్రెస్ అధిష్టానం బరిలో నిలపగా.. ఆయనపై అధికార టీఆర్ఎస్ పార్టీ భూపాల్‌రెడ్డిని పోటీకి నిలిపి విజయం సాధించింది. సిట్టింగ్ అభ్యర్థి మరణంతో సానుభూతి కలిసొచ్చిందనుకున్న కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బే తగిలింది. రికార్డు మెజార్టీతో కారుపార్టీ విజయం సాధించింది. సీను రిపీటైతే టీఆర్ఎస్కు ఓటమి తప్పదు.. కొంతకాలానికే ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీమంత్రి రాంరెడ్డి వెంకట్‌రెడ్డి అనారోగ్యంతో మృతిచెందారు. అక్కడ కూడా తన భార్య సుచరితా రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం బరిలో నిలబెట్టింది. 2016లో ఉప ఎన్నిక జరిగిన ఈ స్థానానికి అప్పటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావును టీఆర్ఎస్ అధిష్టానం పోటీకి ఆదేశించింది. అప్పటికే మండలిలో సభ్యుడిగా ఉండి.. కేసీఆర్ మంత్రివర్గంలో కొనసాగుతున్న తుమ్మలకు పాలేరు ప్రజలు భారీ మెజార్టీ కట్టబెట్టారు. దాదాపు 47వేలకు పైగా ఆధిక్యంతో తుమ్మల నాగేశ్వరరావు విజయం సాధించారు. సిట్టింగ్ స్థానం అయిన్పటికీ కాంగ్రెస్ అభ్యర్థి దారుణ పరాజయం మూటగట్టకున్నారు. ఈ రెండు ఉప ఎన్నికల్లో ఏ ఒక్కచోటైనా సానుభూతి పనికొస్తే కాంగ్రెస్ అభ్యర్థులే విజయం సాధించాలి. కానీ అలా జరుగలేదు. తాజాగా దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో సానుభూతి అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఆ రెండు స్థానాల్లో వచ్చిన ఫలితమే దుబ్బాకలోనూ పునరావృత్తమైతే అధికార టీఆర్ఎస్కు ఓటమి తప్పదు. టీఆర్ఎస్ నేతలను సైతం ఇదే వెంటాడుతోంది. అయితే స్థానికంగా పార్టీ బలంగా ఉండటంతో పాటు మంత్రి హరీష్ రావు ప్రచారాన్ని ముందుండి నడిపిస్తున్నారు. దుబ్బాక ప్రజలు సానుభూతికి ఓటేస్తారా లేక, విపక్షాలను ఎన్నుకుంటారా అనేది నవంబర్ 10న తేలనుంది. దుబ్బాక ఉప ఎన్నిక షెడ్యూల్.. నామినేషన్ల దాఖలు ప్రారంభం: అక్టోబర్ 9 నామినేషన్ల చివరి తేదీ : అక్టోబర్ 16 నామినేషన్ల పరిశీలన : అక్టోబర్ 17 ఉపసంహరణ చివరి తేదీ: అక్టోబర్ 19 పోలింగ్ తేదీ : నవంబర్ 3 కౌంటింగ్ తేదీ నవంబర్: 10 కేసీఆర్‌ను వెంటాడుతున్న గతం.. ఓటమి తప్పదా? -
ముచ్చటగా మూడోసారి బరిలో: ఈసారైనా..!
సాక్షి, సిద్దిపేట : దుబ్బాక ఉప ఎన్నికలో ఏ పార్టీ నుంచి ఎవరికి టికెట్ వస్తుందోనన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. అధికార టీఆర్ఎస్ పార్టీ అందరికన్నా ముందుగా తమ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సుజాత పేరును ప్రకటించింది. మంగళవారం బీజేపీ అభ్యర్థిగా రఘునందన్‌రావు పేరును ఆ పార్టీ జాతీయ ఎన్నికల కమిటీ ప్రకటించింది. టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి ముత్యంరెడ్డి కుమారుడు శ్రీనివాస్‌రెడ్డి పేరును ఖరారు చేస్తూ ఏఐసీసీ నుంచి బుధవారం ప్రకటన విడుదల చేశారు. మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారు కావడంతో నామినేషన్ల దాఖలు, ప్రచార వ్యూహాలపై నేతలు కసరత్తు ప్రారంభించారు. అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ ఆశించిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూ వచ్చినా చివరకు అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ అందరూ ఊహించినట్లుగానే సుజాత పేరును ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలో ముందుగా వెంకటనర్సింహారెడ్డి, తర్వాత శ్రావణ్‌కుమార్ రెడ్డి, అనంతరం శ్రీనివాస్‌రావు, నర్సారెడ్డి పేర్లు వినిపించాయి. చివరకు నర్సారెడ్డి పేరును ఖారారు చేసేందుకు సిద్ధమైన కాంగ్రెస్ మరో ఆలోచనగా మాజీ మంత్రి ముత్యంరెడ్డి కుమారుడిని పోటీలో దింపాలనే ఆలోచనకు వచ్చింది. ఇందుకు అనుగుణంగా ఆయనను పార్టీలోకి ఆహ్వానించి.. శ్రీనివాస్‌రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు. దేశ వ్యాప్తంగా 55 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏఐసీసీ నుంచి అభ్యర్థుల జాబితా విడుదలైంది. మొదటి నుంచి భారతీయ జనతా పార్టీ దుబ్బాక నియోజకవర్గంపై కన్నేసింది. ఇందులో భాగంగానే రెండు నెలలుగా ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఘునందన్‌రావు నియోజకవర్గంలో తిరుగుతూ ప్రచారం ప్రారంభించారు.(పట్టుబడ్డ నగదు: వివాదంలో రఘునందన్) ముచ్చటగా మూడోసారి బరిలో.. అయితే ఈ సారి తనకు టికెట్ ఇవ్వాలని జిల్లా కిసాన్ మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కమలాకర్ రెడ్డి ఆశించడంతో ఇద్దరి మధ్య పోటీ పెరిగింది. ఈ విషయంపై తర్జనభర్జన చేసిన అధినాయకత్వం రఘునందన్‌రావును ప్రకటించారు. 2014,18 వరుస ఎన్నికలతో పాటు గత లోక్‌సభ ఎన్నికల్లోనూ పోటీ చేసి ఓటమి చవిచూసిన రఘునందన్ ఈసారి ఎలాగైన విజయం సాధించి తొలిసారి చట్టసభల్లో అడుగుపెట్టాలని ఆతృతగా ఉన్నారు. దుబ్బాక అసెంబ్లీ స్థానంలో ముచ్చటగా మూడోసారి బరిలోకి దిగిన ఆయనకు ఉప ఎన్నిక ఎలాంటి ఫలితానిస్తుందో అనేది ఆసక్తికరంగా మారింది. అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులతో పోల్చుకుంటే రఘునందన్ ప్రచారంలో ఓ అడుగు ముందే ఉన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీష్‌రావుతో పాటు కేటీఆర్‌లపైనే ఆయన ప్రధానంగా విమర్శలు గుప్పిస్తున్నారు. సిద్దిపేట, సిరిసిల్లపై ఉన్న ప్రేమ టీఆర్ఎస్ నేతలకు దుబ్బాకపై లేదని, ప్రశ్నించే గొంతుకగా తనకు అవకాశం ఇవ్వాలని ఓటర్లును అభ్యర్థిస్తున్నారు. గత రెండు ఎన్నికల్లోనూ ఇక్కడే పోటీ చేసి ఓటమి చవిచూసిన తనపై ఈసారి దుబ్బాక ఓటర్లు సానూభూతి చూపిస్తారని, మొదటి సారి అసెంబ్లీలోఅడుగుపెట్టే అవకాశం దక్కడం ఖాయమని గంపెడు ఆశలు పెట్టుకున్నారు. ముమ్మరంగా ప్రచారం.. ఉప ఎన్నికలో మొదటి ఘట్టం అభ్యర్థుల ప్రకటన దాదాపుగా పూర్తయింది. దీంతో నామినేషన్ల స్వీకరణ, ప్రచార వ్యూహాలపై కసరత్తు ప్రారంభించారు. 9వ తేదీన ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ఉండటంతో.. ఎప్పుడు నామినేషన్ వేయాలి? ఎంత మందితో వేయాలి? నామినేషన్లు వేసే ప్రక్రియకు ఎవరు హాజరు అవుతారు అనే విషయంపై అన్ని పార్టీల్లో చర్చ సాగుతోంది. అదేవిధంగా నామినేషన్ వేసిన తర్వాత ఇరువై రోజులు మాత్రమే గడువు ఉండటంతో ఇప్పటి నుంచే ప్రచా ర వేగం పెంచారు. టీఆర్ఎస్ గెలుపు బాధ్యత భుజాన వేసుకున్న మంత్రి హరీశ్‌రావు రెండు రోజులుగా అభ్యర్థి సుజాతతో కలిసి ప్రచారంలో వేగం పెంచారు. బీజేపీ నుంచి రఘునందన్‌రావు ఒంటరి పోరాటం చేస్తూ ప్రచారం ము మ్మరం చేశారు. మంగళవారం గాంధీ భవన్లో శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరడమే ఆలస్యంగా బుధవారం సిద్దిపేటలో మాజీ ఎంపీ హనుమంతరావు, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క ప్రచారం ప్రారంభించారు. -
పట్టుబడ్డ నగదు: వివాదంలో రఘునందన్
సాక్షి, హైదరాబాద్ : దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు ఎన్నికల ముందు వివాదంలో చిక్కుకున్నారు. 40 లక్షల రూపాయలతో వెళ్తున్న అతని అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నగర పోలీసుల సమాచారం మేరకు.. మంగళవారం సాయంత్రం శామీర్‌పేటలో రూ.40 లక్షల అక్రమ డబ్బుతో కొంతమంది వ్యక్తులు పట్టుబడ్డారు. పోలీసులుకు చిక్కిన నలుగురు వ్యక్తులను డీసీపీ పద్మజ విచారించగా.. ఆ డబ్బును రఘునందన్‌రావుకు ఇచ్చేందుకు తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. పటాన్చెరు నుంచి సిద్దిపేటకు డబ్బు తరలిస్తుండగా పట్టుకున్నామని పద్మజ పేర్కొన్నారు. నిందితులతో రఘునందన్‌రావు పీఏ సంతోష్ ఫోన్ సంభాషణను గుర్తించామని వెల్లడించారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు తరలిస్తున్న నలుగురిపై కేసులు నమోదు చేశామని తెలిపారు. ఓ వైపు దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారం ఊపుమీద ఉండగా ఇంత మొత్తంలో డబ్బు పట్టుబడటం కలకలం రేపుతోంది. (కాంగ్రెస్‌లో చేరిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి) -
లైంగిక ఆరోపణలపై స్పందించిన రఘునందన్
సాక్షి, హైదరాబాద్ : బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్‌రావు తనపై అత్యాచారం చేశాడని మెదక్ జిల్లాకు చెందిన రధారమణి అనే మహిళ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆమె చేసిన ఆరోపణలపై రఘునందన్ స్పందిచారు. ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ. ‘ఆమె చేస్తున్న ఆరోపణలను నూటికి నూరు శాతం అవాస్తవాలు. ఇప్పటి వరకు నాకు ఎవరి వద్ద నుంచి ఎలాంటి నోటీసులు రాలేదు. నేను ఏనేరం చేయలేదు. ఇలాంటి ఆరోపణలు ఎందుకు వస్తున్నాయో తెలీదు. పూర్తి వివరాలను తెలుసుకుని దీనిపై స్పష్టత ఇస్తా’ అని అన్నారు. (రఘునందన్‌తో ప్రాణహాని ఉంది) కాగా రఘునందన్ తనపై పలుమార్లు లైంగిక దాడికి దిగినట్లు సోమవారం రాధారమణి సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్‌ను కలిసి వినతిపత్రాన్ని అందజేసిన విషయం తెలిసిందే. 2007లో రఘునందన్‌రావు తనని ఆఫీసుకు పిలిపించుకుని కాఫీలో మత్తుమందు కలిపి తనపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా తనకు ప్రాణహాని కూడా ఉందని అన్నారు. ఆమె ఫిర్యాదుపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. (రఘనందన్ లైంగికంగా వేధించారు) -
రఘునందన్‌తో ప్రాణహాని: అమ్మాయిలకు మత్తుమందు ఇచ్చి..
సాక్షి, హైదరాబాద్ : బీజేపీ అధికార ప్రతినిధి, ప్రముఖ న్యాయవాది రఘునందన్‌రావుతో తనకు ప్రాణహాని ఉందని రాధారమణి మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. తనపై పలుమార్లు లైంగిక దాడికి దిగినట్లు సోమవారం ఆమె సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్‌ను కలిసి వినతిపత్రాన్ని అందజేసిన విషయం తెలిసిందే. 2007లో రఘునందన్‌రావు తనని ఆఫీసుకు పిలిపించుకుని కాఫీలో మత్తుమందు కలిపి తనపై అత్యాచారానికి పాల్పడినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఆమె మరోసారి మీడియా సమావేశంలో మాట్లాడారు. రఘునందన్ తనను, తన కుమారుడిని హత్య చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తనకు ప్రాణహాని ఉందన్నారు. కేసుల పరిష్కారం కోసం వచ్చిన అమ్మాయిలకు మత్తుమందు కలిపి వారిపై అత్యాచారం చేసేవారని తెలిపారు. అంతేకాకుండా ఓ టాలీవుడ్ ప్రముఖ హీరో సోదరుడికి రఘునందన్ అమ్మాయిలను సరఫరా చేస్తున్నారని పేర్కొన్నారు.(రఘనందన్ లైంగికంగా వేధించారు) ఆమె మీడియా సమావేశాలు మాట్లాడుతూ రఘునందన్‌పై పలు ఆరోపణలు చేశారు. ‘నన్ను శారీరకంగా ఎంతో టార్చర్ చేస్తున్నారు. నా భర్తతో కలిసి నన్ను హత్య చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ముంబై కేంద్రంగా రఘునందన్ అమ్మాయిలను సరఫరా చేస్తున్నారు. దీనికి ఆర్సీపురం సీఐ రాజేశేఖర్‌రెడ్డి సహాయం కూడా ఉంది. పోలీసులను అడ్డుపెట్టుకుని, శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావుతో కలిసిన రఘునందన్ అమ్మాయిల బిజినెస్ చేస్తున్నారు. కేసుల పరిష్కారం వచ్చే వారిని లొంగదీసుకుని లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారు. నా మెయింటెనెన్స్ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ను మార్చేశారు. తనకు న్యాయం చేయాలని అనేక మంది చుట్టూ తిరిగాను. చివరికి విసిగిపోయి మానవహక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ)ని ఆశ్రయించాను.’ అని అన్నారు.