
సాక్షి, హైదరాబాద్ : దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు ఎన్నికల ముందు వివాదంలో చిక్కుకున్నారు. 40 లక్షల రూపాయలతో వెళ్తున్న అతని అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నగర పోలీసుల సమాచారం మేరకు.. మంగళవారం సాయంత్రం శామీర్‌పేటలో రూ.40 లక్షల అక్రమ డబ్బుతో కొంతమంది వ్యక్తులు పట్టుబడ్డారు. పోలీసులుకు చిక్కిన నలుగురు వ్యక్తులను డీసీపీ పద్మజ విచారించగా.. ఆ డబ్బును రఘునందన్‌రావుకు ఇచ్చేందుకు తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. పటాన్‌చెరు నుంచి సిద్దిపేటకు డబ్బు తరలిస్తుండగా పట్టుకున్నామని పద్మజ పేర్కొన్నారు. నిందితులతో రఘునందన్‌రావు పీఏ సంతోష్ ఫోన్ సంభాషణను గుర్తించామని వెల్లడించారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు తరలిస్తున్న నలుగురిపై కేసులు నమోదు చేశామని తెలిపారు. ఓ వైపు దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారం ఊపుమీద ఉండగా ఇంత మొత్తంలో డబ్బు పట్టుబడటం కలకలం రేపుతోంది. (కాంగ్రెస్‌లో చేరిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి)
Comments
Please login to add a commentAdd a comment