సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పాలిటిక్స్‌లో బీజేపీ, అధికార టీఆర్‌ఎస్ పార్టీ నేతల మధ్య మాటల వార్ పీక్ స్టేజ్‌కు చేరుకున్నాయి. సీఎం కేసీఆర్.. జాతీయ పార్టీ బీఆర్‌ఎస్ ఏర్పాటుపై బీజేపీ నేతలు సెటైరికల్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.
కాగా, తాజాగా తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్.. టీఆర్‌ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘టీఆర్‌ఎస్ వేస్ట్ పార్టీ. సీఎం కేసీఆర్.. తెలంగాణలో అమ్రిష్‌పురిలా మారిపోయాడు. ఫాంహౌస్‌లో నిమ్మకాయలు పెడుతున్నాడు. టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చాలంటే మంత్రాలు చేయాలని చెప్పారట. సచివాలయానికి వెళ్లొద్దు అంటే.. వెళ్లడం లేదు. రేపో మాపో మంత్రగాడికి రాష్ట్రం ఇచ్చి వెళ్లిపోతాడు’ అంటూ ఎద్దేవా చేశారు.
మరోవైపు, దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌కు వీఆర్‌ఎస్ ఇచ్చాం. బీఆర్‌ఎస్‌కు కంపల్సరీ రిటైర్మెంట్ స్కీం ఇస్తాము అని కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment