Samirpet
-
పట్టుబడ్డ నగదు: వివాదంలో రఘునందన్
సాక్షి, హైదరాబాద్ : దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు ఎన్నికల ముందు వివాదంలో చిక్కుకున్నారు. 40 లక్షల రూపాయలతో వెళ్తున్న అతని అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నగర పోలీసుల సమాచారం మేరకు.. మంగళవారం సాయంత్రం శామీర్‌పేటలో రూ.40 లక్షల అక్రమ డబ్బుతో కొంతమంది వ్యక్తులు పట్టుబడ్డారు. పోలీసులుకు చిక్కిన నలుగురు వ్యక్తులను డీసీపీ పద్మజ విచారించగా.. ఆ డబ్బును రఘునందన్‌రావుకు ఇచ్చేందుకు తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. పటాన్చెరు నుంచి సిద్దిపేటకు డబ్బు తరలిస్తుండగా పట్టుకున్నామని పద్మజ పేర్కొన్నారు. నిందితులతో రఘునందన్‌రావు పీఏ సంతోష్ ఫోన్ సంభాషణను గుర్తించామని వెల్లడించారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు తరలిస్తున్న నలుగురిపై కేసులు నమోదు చేశామని తెలిపారు. ఓ వైపు దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారం ఊపుమీద ఉండగా ఇంత మొత్తంలో డబ్బు పట్టుబడటం కలకలం రేపుతోంది. (కాంగ్రెస్‌లో చేరిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి) -
కారును ఢీకొన్న లారీ
శామీర్‌పేట్, రాంగ్రూట్లో వేగంగా వచ్చిన ఓ లారీ రాజీవ్ రహదారిపై కారును ఢీకొంది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న దంపతులతో పాటు ఓ చిన్నారికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన మండల పరిధిలోని అలియాబాద్ చౌరాస్తా సమీపంలోని రాజీవ్ రహదారిపై సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. నగరంలోని అల్వాల్ ప్రాంతానికి చెందిన ప్రవీణ్, లలితలు దంపతులు. వీరికి కుమారుడు నితిన్ (5 నెలలు) ఉన్నాడు. సోమవారం దంపతులు లలిత పుట్టిల్లు సిద్దిపేట్ నుంచి కారులో నగరానికి రాజీవ్ రహదారి మీదుగా వస్తున్నారు. ఈక్రమంలో మండలంలోని అలియాబాద్ చౌరాస్తా సమీపంలోని పాత టోల్ గేటు వద్దకు రాగానే రాంగ్ రూట్లో వేగంగా వచ్చిన ఓ లారీ వీరి కారును ఢీకొంది. ప్రమాదంలో ప్రవీణ్‌తో పాటు భార్య లలిత, చిన్నారి నితిన్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని వారిని అల్వాల్‌లోని ఆక్సిజన్ ఆస్పత్రికి తరలించారు. లారీని స్థానికులు పట్టుకున్నారు.