సాక్షి, హైదరాబాద్: ఔటర్ రింగ్‌రోడ్డు (ఓఆర్‌ఆర్) 30 ఏళ్ల లీజ్ టెండర్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలే అక్రమాలకు పాల్పడ్డారని బీజేపీ ఎమ్మెల్యే ఎం.రఘునందన్ రావు ఆరోపించారు. కేటీఆర్, కవిత సన్నిహితులకే ఈ లీజు దక్కిందని నిందించారు. ఐఆర్‌ఎల్ కంపెనీ రూ.7,272 కోట్లకు టెండర్ వేస్తే రూ.7,380 కోట్లకు దక్కించుకుందని ప్రభు త్వం ఎలా ప్రకటిస్తుందని ప్రశ్నించారు. వేసిన బిడ్ కంటే ఆ కంపెనీ ఎందుకు ఎక్కువ ఇస్తోందని ప్రశ్నించారు. ఎక్కువ టెండర్ వేసిన కంపెనీకి లీజును కట్టబెట్టిన ప్రభుత్వం 16 రోజుల పాటు బిడ్‌ను బహిర్గతం, చేయకపోవడం వెనక ఆంతర్యమేమిటని నిలదీశారు.
ఈ బిడ్‌ను ఓపెన్ చేశాక బేరసారాలతో ఐఆర్‌ఎల్‌కు అప్పగించారా అన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. మంగళవారం రఘునందన్ రావు మీడియాతో మాట్లాడుతూ ఓఆర్‌ఆర్ కాంట్రాక్టు బిడ్‌ను వాస్తవానికి ఈ ఏప్రిల్ 11న తెరిచారని, కానీ ఏప్రిల్ 27న ఈ విషయాన్ని మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ మీడియాకు ప్రకటన విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేశారు. బిడ్ ఓపెన్ చేసిన 16 రోజుల తర్వాత ఈ విషయాన్ని ఎందుకు బయటపెట్టారని ప్రశ్నించారు. ఓఆర్‌ఆర్ పై బేస్‌ప్రైజ్ ను నిర్ణయించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. కనీసం హెచ్ 1, హెచ్ 2, హెచ్ 2, హెచ్ 4 కంపెనీలను పిలిచి బేస్‌ప్రైజ్ కు తక్కువగా బిడ్‌కోడ్ చేసినందున టెండర్‌ను క్యాన్సిల్ చేస్తామని ప్రభుత్వం ప్రకటిస్తే బాగుండేదన్నారు.
ఫోన్ కాల్ వివరాలు బయట పెట్టాలి
అరవింద్ కుమార్ ఫోన్ కాల్ వివరాలు బయట పెట్టాలని రఘునందన్‌రావు డిమాండ్ చేశారు. 16 రోజుల్లో ఆయనతో పాటు మంత్రి గాని ఇంకా ఎవరైనా విదేశాలకు వెళ్లారా.. అని ప్రశ్నించారు. ఆ వివరాలు బయటపెట్టకపోతే తామే ఆడియో లు వీడియోలు బయట పెడతామని హెచ్చరించారు. ఐఆర్‌ఎల్‌పై ఇప్పటికే సీబీఐ విచారణ జరుగుతున్నందున ఈ టెండర్ ను వెంటనే రద్దు చేయాలని, లేని పక్షంలో తామే కోర్టుకు , వివిధ విచారణ ఏజెన్సీలకి పిర్యాదు చేస్తామన్నారు. కాగా, ఎమ్మెల్యేలకే సెక్రటేరియట్ లో ఎంట్రీ లేక పోతే ఎలా అని ప్రశ్నించారు. ఈ విషయమై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి క్లారిటీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: తడిసినా కొంటాం
Comments
Please login to add a commentAdd a comment