![BJP MP Raghunandan Rao Key Comments Over KCR](/styles/webp/s3/article_images/2024/06/22/Ragunandhan.jpg.webp?itok=iHLCZcSK)
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పలు కేసుల్లో అన్ని వేళ్లు మాజీ సీఎం కేసీఆర్‌వైపే చూపిస్తున్నాయి. కేసీఆర్ ఇంటికి ఈడీ రాక తప్పదు అంటూ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. అలాగే, బీజేపీ రాష్ట్ర బీజేపీ చీఫ్ పోస్టుపై రఘునందన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
కాగా, పార్టీ రాష్ట్ర కొత్త అధ్యక్షుడిని నియమిస్తారనే ప్రచారంపై రఘునందన్ స్పందించారు. ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ..‘పార్టీ అధిష్ఠానం ఆదేశాలను తప్పకుండా పాటిస్తాను. క్రమశిక్షణ గల కార్యకర్తగా పనిచేస్తాను. ప్రజాస్వామ్యంలో ఎవరైనా అభిప్రాయాలు చెప్పవచ్చు. ఈ క్రమంలోనే రాజాసింగ్ తన అభిప్రాయం చెప్పారు అని అన్నారు.
ఇదే సమయంలో తెలంగాణ రాజకీయాలపై కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో గొర్రెల స్కాం, ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన అధికారులు అంతా కేసీఆర్ పేరే చెబుతున్నారు. అన్ని వేళ్లు కేసీఆర్‌వైపే చూపిస్తున్నాయి. త్వరలోనే కేసీఆర్ ఇంటికి ఈడీ రాక తప్పదు అంటూ వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment