సాక్షి, హైదరాబాద్ : బీజేపీ అధికార ప్రతినిధి, ప్రముఖ న్యాయవాది రఘునందన్ రావుపై ఓ మహిళ సంచలన ఆరోపణలు చేశారు. తనపై లైంగికదాడికి పాల్పడ్డారని రాధారమణి అనే మహిళా సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్‌ను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. మెదక్ జిల్లా ఆర్సీపురంకి చెందిన రాధారమణికి తన భర్తతో విభేదాలు కారణంగా 2003 స్థానిక పోలీసు స్టేషన్ ఫిర్యాదు చేశారు. అడ్వకేట్ రఘునందన్ సలహా మేరకు తన భర్తపై మెయింటెనెన్స్ కేసు ఫైల్ చేశారు. ఈ నేపథ్యంలోనే కేసు నిమిత్తం 2007లో రఘునందన్‌రావు తనని ఆఫీసుకు పిలిపించుకుని కాఫీలో మత్తుమందు కలిపి తనపై అత్యాచారానికి పాల్పడినట్లు బాధిత మహిళ ఫిర్యాదులో పేర్కొన్నారు.
అప్పటి నుంచి తన వద్ద అశ్లీల చిత్రాలు ఉన్నాయని, ఎవరికైనా చెబితే వాటిని సోషల్ మీడియాలో పెడుతానంటు బెదిరించి తనపై పలుమార్లు అత్యాచారం చేశారని ఆరోపించారు. ఈ విషయంపై ఇప్పటికే హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించానని, రఘునందన్‌పై కేసు నమోదు చేయాలని గత నెలలో ఆర్డర్ ఇచ్చినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే సీపీ సజ్జనార్‌ను కలిసి.. ఇప్పటికైనా తనకు న్యాయం చేయాలని కోరినట్లు వెల్లడించారు. కాగా న్యాయవాదిగా, బీజేపీ అధికార ప్రతినిధిగా మంచి పేరు గుర్తింపు ఉన్న రఘునందన్‌పై ఇలాంటి ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఆయన ఇప్పటి వరకు స్పందించక పోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment