BJP spokesperson
-
సోనియా గాంధీపై పరుష పదజాలం.. జేపీ నడ్డాకు జైరాం రమేశ్ లేఖ
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్. బీజేపీ అధికార ప్రతినిధి ప్రేమ్ శుక్లా.. శనివారం ఓ జాతీయ ఛానల్లో మాట్లాడుతూ సోనియా గాంధీపై పరుషపదజాలన్ని ఉపయోగించడంపై మండిపడ్డారు. మరోసారి ఇలా మాట్లాడితే పరువునష్టం దావా వేస్తామని హెచ్చరించారు. ఈమేరకు జైరాం రమేశ్.. జేపీ నడ్డాకు లేఖ రాశారు. ఎప్పుడు సంస్కృతి సంప్రదాయాల గురించి మాట్లాడే బీజేపీ అధికార ప్రతినిధులు, ఒక జాతీయ పార్టీ అధ్యక్షురాలైన 75 ఏళ్ల సోనియా గాంధీ గురించి అభ్యంతరకరంగా మాట్లాడారని జైరాం రమేశ్ ఆరోపించారు. ఆ పార్టీ మహిళలకు వ్యతిరేకం అనేందుకు ఇదే నిదర్శనమన్నారు. ఇలాంటి మాటలవల్ల దేశంలో రాజకీయాలు దిగుజారుతున్నాయని ధ్వజమెత్తారు. మోదీ సహా ఎంతో మంది బీజేపీ నేతలు మహిళల పట్ల పలుమార్లు అగౌరవంగా మాట్లాడిన విషయం దేశం మొత్తానికి తెలుసన్నారు. బీజేపీ అధికార ప్రతినిధి అనుచిత వ్యాఖ్యలకు బాధ్యతగా దేశంలోని మహిళలందరికీ ప్రధాని మోదీ, జేపీ నడ్డా క్షమాపణలు చెప్పాలని జైరాం రమేశ్ డిమాండ్ చేశారు. . కానీ ఇప్పటివరకు బీజేపీ నేతలు మహిళలకు క్షమాపణలు చెప్పిన దాఖలాలు లేవని అన్నారు. చదవండి: అగ్నిపథ్‌తో దేశ భద్రత, యువత భవిష్యత్తు అంధకారం -
లైంగిక ఆరోపణలపై స్పందించిన రఘునందన్
సాక్షి, హైదరాబాద్ : బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్‌రావు తనపై అత్యాచారం చేశాడని మెదక్ జిల్లాకు చెందిన రధారమణి అనే మహిళ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆమె చేసిన ఆరోపణలపై రఘునందన్ స్పందిచారు. ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ. ‘ఆమె చేస్తున్న ఆరోపణలను నూటికి నూరు శాతం అవాస్తవాలు. ఇప్పటి వరకు నాకు ఎవరి వద్ద నుంచి ఎలాంటి నోటీసులు రాలేదు. నేను ఏనేరం చేయలేదు. ఇలాంటి ఆరోపణలు ఎందుకు వస్తున్నాయో తెలీదు. పూర్తి వివరాలను తెలుసుకుని దీనిపై స్పష్టత ఇస్తా’ అని అన్నారు. (రఘునందన్‌తో ప్రాణహాని ఉంది) కాగా రఘునందన్ తనపై పలుమార్లు లైంగిక దాడికి దిగినట్లు సోమవారం రాధారమణి సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్‌ను కలిసి వినతిపత్రాన్ని అందజేసిన విషయం తెలిసిందే. 2007లో రఘునందన్‌రావు తనని ఆఫీసుకు పిలిపించుకుని కాఫీలో మత్తుమందు కలిపి తనపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా తనకు ప్రాణహాని కూడా ఉందని అన్నారు. ఆమె ఫిర్యాదుపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. (రఘనందన్ లైంగికంగా వేధించారు) -
రఘునందన్‌పై సంచలన ఆరోపణలు చేసిన మహిళ
సాక్షి, హైదరాబాద్ : బీజేపీ అధికార ప్రతినిధి, ప్రముఖ న్యాయవాది రఘునందన్ రావుపై ఓ మహిళ సంచలన ఆరోపణలు చేశారు. తనపై లైంగికదాడికి పాల్పడ్డారని రాధారమణి అనే మహిళా సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్‌ను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. మెదక్ జిల్లా ఆర్సీపురంకి చెందిన రాధారమణికి తన భర్తతో విభేదాలు కారణంగా 2003 స్థానిక పోలీసు స్టేషన్ ఫిర్యాదు చేశారు. అడ్వకేట్ రఘునందన్ సలహా మేరకు తన భర్తపై మెయింటెనెన్స్ కేసు ఫైల్ చేశారు. ఈ నేపథ్యంలోనే కేసు నిమిత్తం 2007లో రఘునందన్‌రావు తనని ఆఫీసుకు పిలిపించుకుని కాఫీలో మత్తుమందు కలిపి తనపై అత్యాచారానికి పాల్పడినట్లు బాధిత మహిళ ఫిర్యాదులో పేర్కొన్నారు. అప్పటి నుంచి తన వద్ద అశ్లీల చిత్రాలు ఉన్నాయని, ఎవరికైనా చెబితే వాటిని సోషల్ మీడియాలో పెడుతానంటు బెదిరించి తనపై పలుమార్లు అత్యాచారం చేశారని ఆరోపించారు. ఈ విషయంపై ఇప్పటికే హెచ్ఆర్సీని ఆశ్రయించానని, రఘునందన్‌పై కేసు నమోదు చేయాలని గత నెలలో ఆర్డర్ ఇచ్చినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే సీపీ సజ్జనార్‌ను కలిసి.. ఇప్పటికైనా తనకు న్యాయం చేయాలని కోరినట్లు వెల్లడించారు. కాగా న్యాయవాదిగా, బీజేపీ అధికార ప్రతినిధిగా మంచి పేరు గుర్తింపు ఉన్న రఘునందన్‌పై ఇలాంటి ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఆయన ఇప్పటి వరకు స్పందించక పోవడం గమనార్హం. -
సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన బీజేపీ నేత
సాక్షి, విజయవాడ : ఏపీలో వంశపారంపర్య అర్చకత్వానికి ఆమోదం తెలిపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట నిలుపుకున్నారని బీజేపీ అధికార ప్రతినిధి లక్ష్మీపతి రాజా పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న అర్చకుల కుటుంబాల్లో వెలుగు నింపినట్లుయిందని వ్యాఖ్యానించారు. హిందూ ధర్మ పరిరక్షణకు ఈ చర్య ఎంతో ఉపకరిస్తుందని ఆయన వెల్లడించారు. మరోవైపు చంద్రబాబు హయాంలో నిర్దాక్షిణ్యంగా కూల్చేసిన దేవాలయాలను తిరిగి నిర్మించాలని నిర్ణయించడం సంతోషదాయకమని రాజా అభిప్రాయం వ్యక్తం చేశారు. -
అప్పుడెందుకు అనుమానం రాలేదు?
సాక్షి, విజయవాడ: ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే చంద్రబాబు నాయుడు ఈవీఎంలు పని చేయడం లేదని నాటకాలు ఆడుతున్నారని బీజేపీ అధికార ప్రతినిధి వి. శ్రీనివాసరాజు విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు ఈవీఎంలు గురించి మాట్లాడని చంద్రబాబు పోలింగ్ తర్వాతే ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. ఒకవైపు 130 సీట్లు వస్తాయంటూనే, మరోవైపు ఈవీఎంలు పని చేయలేదని చెబుతున్న చంద్రబాబు.. ఇందులో ఏది నిజమో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. 2014 ఎన్నికలు, నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ గెలిచినపుడు ఈవీఎంలపై ఎందుకు చంద్రబాబు ఆరోపణలు చేయలేదని నిలదీశారు. ఎన్నికల కమిషన్ స్వతంత్ర వ్యవస్థ అని, దాన్ని ఎవరు ప్రభావితం చేయలేరని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంపై చంద్రబాబు చేసిన వాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, ఈ విషయంలో గవర్నర్ నరసింహన్ జోక్యం చేసుకోవాలని శ్రీనివాసరాజు కోరారు. (చదవండి: దురుద్దేశంతోనే ప్రభుత్వ పెద్దల దుష్ప్రచారం) -
నిబంధనలను అతిక్రమించిన కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ఈ ఎన్నికల్లో ఒంటరి పోటీ ద్వారా తమ పార్టీ సామర్థ్యం బయట పడిందని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు పేర్కొన్నారు. తెలంగాణలో 119 స్థానాలకుగాను 118 స్థానాల్లో పోటీ చేయడం ఇదే మొదటిసారని, ప్రజాస్వామ్యంలో తాము ఈ ప్రయత్నం చేయడమే గెలుపుగా భావిస్తున్నామన్నారు. గురువారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గత 20 రోజుల్లో కేంద్రంలో తాము ఏం చేస్తున్నామన్నది ప్రజలకు స్పష్టంగా చెప్పగలిగామన్నారు. ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చినా శిరసావహిస్తామని, ఎన్ని సీట్లిచ్చిన బాధ్యతగా పనిచేస్తామని పేర్కొన్నారు. చింతమడకలో సీఎం కేసీఆర్ ఓటువేసిన తర్వాత టీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పి కోడ్ ఉల్లంఘించారన్నారు. ఎన్నికల బూత్ దగ్గర నిలబడి తమ ప్రభుత్వానికి వ్యతిరేకత లేదని, పవనాలు తమవైపే వీస్తున్నాయని చెప్పడం నిబంధనలను అతిక్రమించడమేనని పేర్కొన్నారు. ఆపద్ధర్మ సీఎం ఇలా చేయడం ఘోరమని, ఆయన వైఖరిని ఖండిస్తున్నామన్నారు. దీనిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశామని, ఆయన అభ్యర్థిత్వాన్ని కొట్టివేయాలని, అనర్హుడిగా ప్రకటించాలని కోరినట్లు వెల్లడించారు. కల్వకుర్తిలో జరిగిన దాడిలో తమ పార్టీకి సంబంధం లేదని, అది కాంగ్రెస్ పార్టీ చేసిన సింపతి డ్రామా అని పేర్కొన్నారు. దాడిపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. -
అతడో పాము.. మిమ్మల్నీ కాటేస్తాడు!
ముంబై ఉగ్రదాడుల సూత్రధారి జకీవుర్ రెహ్మాన్ లఖ్వీ పాము లాంటివాడని, అతడు భారతదేశంతో పాటు చైనాను కూడా కాటేస్తాడని బీజేపీ అధికార ప్రతినిధి, సీనియర్ పాత్రికేయుడు ఎంజే అక్బర్ వ్యాఖ్యానించారు. ఈ అంశాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ తీవ్రంగానే పరిగణిస్తోందన్నారు. చైనా కూడా వివేకం చూపించి, ఉగ్రవాదాన్ని అర్థం చేసుకుంటుందనే భావిస్తున్నామని ఆయన అన్నారు. ముఖ్యంగా అత్యంత విషపూరితమైన లఖ్వీ లాంటి ఉగ్రవాదులు పాముల్లాంటి వాళ్లని, అత్యంత క్రూరంగా చైనాను కూడా కాటేసే ప్రమాదం ఉందని అక్బర్ చెప్పారు. లఖ్వీని జైలు నుంచి విడుదల చేయడాన్ని ఐక్యరాజ్యసమితిలో భారత్ చేసిన వాదనకు చైనా అడ్డుచెప్పిన నేపథ్యంలో ఎంజే అక్బర్ ఈ వ్యాఖ్యలు చేశారు. -
కాంగ్రెస్ ... రాష్ట్రాన్ని కాదు ప్రజలను విభజిస్తుంది: జవదేకర్
తెలుగుదేశం పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకునే పరిస్థితి లేదని ఆ పార్టీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ స్పష్టం చేశారు. తమ పార్టీతో తెలుగుదేశం పొత్తు అంటూ వస్తున్న వార్తలు అన్ని ఊహాగానాలే అని ఆయన పేర్కొన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని నెక్లస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో నిర్వహించిన సమైక్యత పరుగులో ఆయన పాల్గొన్నారు. అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ప్రకాశ్ జవదేకర్ మాట్లాడుతూ... మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రమాణ స్వీకారోత్సవానికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు హాజరైనంత మాత్రన పొత్తు కుదురుతుందా అంటూ ప్రకాశ్ జవదేకర్ ఎదురు ప్రశ్నించారు. అయితే రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వైఖరి పట్ల ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర విభజనకు బదులు కాంగ్రెస్ పార్టీ ప్రజలను విభజిస్తుందని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశ పెడుతుందన్న నమ్మకం లేదని జవదేకర్ తెలిపారు. అందుకు లోక్‌పాల్ బిల్లు, మహిళ బిల్లులే మంచి ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు. అటు తెలంగాణ ఇటు సీమాంధ్ర ప్రాంతాల్లో ఆ పార్టీ ఘోరంగా ఒడిపోతుందని జోస్యం చెప్పారు. సర్థార్ పటేల్ వర్థంతి సందర్బంగా ఆదివారం దేశవ్యాప్తంగా నిర్వహించిన సమైక్యత పరుగుకు మంచి స్పందన వచ్చిందన్నారు. కేంద్ర మాజీ హోం శాఖ మంత్రి సర్థార్ పటేల్ 63వ వర్థంతిని పురస్కరించుకుని ఆదివారం సమైక్యత పరుగుకు బీజేపీ పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే. -
జమ్మూలో తీవ్రవాదుల దాడి ఖండించిన బీజేపీ
జమ్మూ కాశ్మీర్లో ఈ రోజు ఉదయం పాక్ ప్రేరేపిత తీవ్రవాదుల జంట దాడులను భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తీవ్రంగా ఖండించింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జావదేకర్ గురువారం న్యూఢిల్లీలో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... భారత్‌లో తీవ్రవాద దాడుల ద్వారా పాక్ ప్రచ్ఛన్న యుద్దానికి పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. పాక్ తన భూభాగంలో ఉండి భారత్‌పై తీవ్రవాదుల దాడికి ఉసిగొల్పుతోందని ఆయన పేర్కొన్నారు. దేశంలో తీవ్రవాదుల దాడుల జరగకుండ భారత ప్రధాని పార్లమెంట్ ఉభయ సభల ద్వారా ఇచ్చిన భరోసా గాలిలో దీపమైందని ఆయన అభివర్ణించారు. ఆ దాడులు అరికట్టేందుకు ప్రధాని కనీసం ఎటువంటి చర్యలు చేపట్టారనేది నేటిని అంతుపట్టని విషయంగా ఆయన వ్యాఖ్యానించారు. జమ్ము కాశ్మీర్‌లోని కథువా జిల్లాలోని హీరా నగర్ పోలీసు స్టేషన్‌పై అలాగే సాంబ సెక్టార్ సైనిక శిబిరంపై తీవ్రవాదులు దాడి చేశారు. ఆ ఘటనలలో మొత్తం 9 మంది మరణించారు. వారిలో సైనిక అధికారి కూడా ఉన్నారు. రాష్ట్రంలో చోటు చేసుకున్న రెండు తీవ్రవాదుల దాడులను జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఖండించారు.