అతడో పాము.. మిమ్మల్నీ కాటేస్తాడు! | lakhvi is a snake, he will bite china too, says mj akbar | Sakshi
Sakshi News home page

అతడో పాము.. మిమ్మల్నీ కాటేస్తాడు!

Published Wed, Jun 24 2015 6:27 PM | Last Updated on Sun, Sep 3 2017 4:18 AM

అతడో పాము.. మిమ్మల్నీ కాటేస్తాడు!

అతడో పాము.. మిమ్మల్నీ కాటేస్తాడు!

ముంబై ఉగ్రదాడుల సూత్రధారి జకీవుర్ రెహ్మాన్ లఖ్వీ పాము లాంటివాడని, అతడు భారతదేశంతో పాటు చైనాను కూడా కాటేస్తాడని బీజేపీ అధికార ప్రతినిధి, సీనియర్ పాత్రికేయుడు ఎంజే అక్బర్ వ్యాఖ్యానించారు. ఈ అంశాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ తీవ్రంగానే పరిగణిస్తోందన్నారు. చైనా కూడా వివేకం చూపించి, ఉగ్రవాదాన్ని అర్థం చేసుకుంటుందనే భావిస్తున్నామని ఆయన అన్నారు.

ముఖ్యంగా అత్యంత విషపూరితమైన లఖ్వీ లాంటి ఉగ్రవాదులు పాముల్లాంటి వాళ్లని, అత్యంత క్రూరంగా చైనాను కూడా కాటేసే ప్రమాదం ఉందని అక్బర్ చెప్పారు. లఖ్వీని జైలు నుంచి విడుదల చేయడాన్ని ఐక్యరాజ్యసమితిలో భారత్ చేసిన వాదనకు చైనా అడ్డుచెప్పిన నేపథ్యంలో ఎంజే అక్బర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement