Zakiur Rehman Lakhvi
-
ఆ నలుగురు
న్యూఢిల్లీ: జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్, లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ మహమ్మద్ సయీద్, ముంబై ఉగ్రవాద దాడుల నిందితుడు జకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీ, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంలను వ్యక్తిగత హోదాలో ఉగ్రవాదులుగా కేంద్ర హోంశాఖ ప్రకటించింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల (నియంత్రణ) సవరణ చట్టం(యూఏపీఏ)–1967కు కీలక సవరణలకు పార్లమెంటు ఆమోదం తెలిపిన ఒక నెలలోనే ఈ నలుగురిని కొత్త చట్టం కింద ఉగ్రవాదులుగా ప్రకటించినట్లు కేంద్ర హోంశాఖ అధికారి ఒకరు వెల్లడించారు. ఇప్పటివరకు యూఏపీఏ కింద చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన సంస్థలనే ఉగ్రవాదులుగా ప్రకటించేవారు. కానీ కొత్తగా అమల్లోకి వచ్చిన ఈ చట్టం ప్రకారం వ్యక్తుల్ని సైతం ఉగ్రవాదులుగా ప్రకటించే వెసులుబాటు ఉంది. ఈ చట్టం కింద ఉగ్రవాదుల్ని ప్రకటించడం ఇదే మొదటిసారి. ఇప్పటికే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి వీరిని అంతర్జాతీయ ఉగ్రవాదులుగా ముద్రవేసి వారిపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది. -
లఖ్వీకి వ్యతిరేకంగా మెజిస్ట్రేటు వాంగ్మూలం
ఇస్లామాబాద్: 2008 నాటి ముంబై దాడుల సూత్రధారి జకీవుర్ రెహ్మాన్ లఖ్వీకి వ్యతిరేకంగా.. ఆ కేసును విచారిస్తున్న ఉగ్రవాద వ్యతిరేక కోర్టులో ఒక జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ వాంగ్మూలం ఇచ్చారు. లఖ్వీ సహా ఏడుగురు నిందితులకు వ్యతిరేకంగా ఇద్దరు వ్యక్తులు ఇచ్చిన సాక్ష్యాలను తాను నమోదు చేశానని మేజిస్ట్రేట్ అక్రమ్ అబ్బాసీ రావల్పిండిలోని అదియాలా జైల్లో బుధవారం జరిగిన విచారణలో స్పష్టం చేశారు. వాటిని కోర్టు ముందుంచినట్లు తెలిపారు. లఖ్వీ ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నాడు. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ లఖ్వీ దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు ఇంకా ఏ నిర్ణయం తీసుకోనప్పటికీ.. బుధవారం నాటి విచారణకు లఖ్వీ హాజరు కాలేదు. -
అతడో పాము.. మిమ్మల్నీ కాటేస్తాడు!
ముంబై ఉగ్రదాడుల సూత్రధారి జకీవుర్ రెహ్మాన్ లఖ్వీ పాము లాంటివాడని, అతడు భారతదేశంతో పాటు చైనాను కూడా కాటేస్తాడని బీజేపీ అధికార ప్రతినిధి, సీనియర్ పాత్రికేయుడు ఎంజే అక్బర్ వ్యాఖ్యానించారు. ఈ అంశాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ తీవ్రంగానే పరిగణిస్తోందన్నారు. చైనా కూడా వివేకం చూపించి, ఉగ్రవాదాన్ని అర్థం చేసుకుంటుందనే భావిస్తున్నామని ఆయన అన్నారు. ముఖ్యంగా అత్యంత విషపూరితమైన లఖ్వీ లాంటి ఉగ్రవాదులు పాముల్లాంటి వాళ్లని, అత్యంత క్రూరంగా చైనాను కూడా కాటేసే ప్రమాదం ఉందని అక్బర్ చెప్పారు. లఖ్వీని జైలు నుంచి విడుదల చేయడాన్ని ఐక్యరాజ్యసమితిలో భారత్ చేసిన వాదనకు చైనా అడ్డుచెప్పిన నేపథ్యంలో ఎంజే అక్బర్ ఈ వ్యాఖ్యలు చేశారు. -
పాక్‌పై చర్యకు మన ముందడుగు.. చైనా తొండి
న్యూయార్క్: ముంబై దాడుల సూత్రధారి లష్కరే తోయిబా కమాండర్ జకీర్ రెహమాన్ లఖ్వీని విడుదల చేసిన పాకిస్తాన్‌పై చర్యను కోరుతూ ఐక్యరాజ్యసమితి (ఐరాస)లో భారత్ చేసిన డిమాండ్‌కు చైనా అడ్డుకట్ట వేసింది. ఐరాస తీర్మానాన్ని ఉల్లంఘించి లఖ్వీని జైలు నుంచి విడుదల చేసిన పాక్‌పై చర్య తీసుకోవాలన్న భారత్ అభ్యర్థన మేరకు ఐరాస ఆంక్షల కమిటీ ఇక్కడ సమావేశమైంది. లఖ్వీ విడుదలపై పాక్‌ను వివరణ కోరాలని నిర్ణయించింది. అయితే భారత్ పూర్తి సమాచారం ఇవ్వలేదంటూ ఈ నిర్ణయానికి చైనా అడ్డుకట్ట వేసిందని అధికార వర్గాలు తెలిపాయి. పాక్ కోర్టు లఖ్వీని విడుదల చేస్తూ తీసుకున్న నిర్ణయం ఐరాస తీర్మానాన్ని ఉల్లంఘించడమేనని ప్రస్తుత ఐరాస ఆంక్షల కమిటీ చైర్మన్ జిమ్ మెక్ లే, ఐరాస భారత శాశ్వత ప్రతినిధి అశోక్ ముఖర్జీ గత నెలలోనే ఒక ప్రకటనలో వ్యాఖ్యానించారు. చైనా చర్యపై భారత ప్రధాని నరేంద్రమోదీ అసంతృప్తిని వ్యక్తం చేశారు. చైనా ప్రభుత్వానికి తన నిరసనను తెలిపారు. -
‘దావూద్, సయీద్ ఆస్తులను సీజ్ చేయండి’
న్యూఢిల్లీ: అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న ఉగ్రవాదులు హఫీజ్ సయీద్, జకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీల ఆస్తులను సీజ్ చేయాలని పాకిస్తాన్‌ను భారత్ కోరనుంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆంక్షల జాబితాలో ఉన్న ఈ ముగ్గురు పాక్‌లో ఉన్నందున ఆ దేశం వీరి ఆస్తులను సీజ్ చేయాల్సి ఉంటుంది. ఐరాస మండలిలోని అల్ కాయిదా, తాలిబాన్ ఆంక్షల కమిటీ దావూద్‌పై 2003లో, లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు సయీద్, ముంబై ఉగ్రదాడుల సూత్రధారి లఖ్వీలపై 2008లో ఆంక్షలు విధించింది. అందువల్ల వీరి ఆస్తులను సీజ్ చేయడం ఐరాస సభ్య దేశమైన పాక్ బాధ్యత. ‘ఈ ముగ్గురి ఆస్తులను సీజ్ చేశారో లేదో తెలుసుకోవాలనుకుంటున్నాం. ఒకవేళ సీజ్ చేయకుంటే ఇప్పుడు తక్షణమే వారి ఆస్తులను సీజ్ చేయండి. దీనిపై పాక్‌కు త్వరలోనే లేఖ రాయాలనుకుంటున్నాం’ అని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ఐరాస ఆంక్షల జాబితాలో ఉంటే వారి ఆస్తులను సీజ్ చేయడంతోపాటు వారి ఆయుధాలను, ప్రయాణాలను నిషేధించాల్సి ఉంటుంది. -
పాక్ సైన్యం నెత్తుటి క్రీడ
త్రికాలమ్ లఖ్వీని విడుదల చేయడాన్ని అమెరికా ప్రభుత్వం ఖండించింది. ఇంకా చాలా దేశాలు పాకిస్తాన్ నిజ స్వరూపాన్ని గుర్తిస్తున్నాయి. పాకిస్తాన్‌ను ఒంటరి చేయడం ఇండియాకు మాత్రమే సాధ్యమయ్యే పనికాదు. అందుకు పాకిస్తాన్ సైన్యం దండిగా సహకరిస్తున్నది కనుక భారత్‌కు బెంగ అనవసరం. పాకిస్తాన్‌తో దౌత్య సంబంధాలు కొనసాగి స్తూనే, చర్చలు జరుపుతూనే ఉండవచ్చు. కానీ వాటిపైన పెద్దగా ఆశలు పెట్టుకోనక్కరలేదు. తమ దేశం ముక్కలు చెక్కలు కావాలో, శాంతిసుస్థిరతలతో విలసిల్లాలో తేల్చుకోవలసింది పాకిస్తాన్ సైన్యం మాత్రమే. ‘సరిహద్దులలో మన జవాన్ల తలలు తెగిపడుతుంటే యూపీఏ సర్కార్ చేతులు ముడుచుకొని కూర్చున్నది. చేతకాని ప్రభుత్వం, చేతన లేని ప్రధాని దేశానికి అరిష్టం.’ అంటూ ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్రమోదీ ఎన్నికల ప్రచారసభలలో చేసిన గర్జన బీజేపీకి అనేక లక్షల ఓట్లు సంపాదించి ఉంటుంది. మన్మోహన్ సింగ్ స్థానంలో నరేంద్రమోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం కూడా సరిహద్దులో పరిస్థితి మారలేదు. పాకిస్తాన్ వైఖరి మార బోదు. భారత్-పాకిస్థాన్ సంబంధాలపైన అవగాహన ఉన్నవారికి ఈ సంగతి తెలుసు. 2008 నవంబర్ 26న పది మంది పాకిస్తానీ ఉగ్రదాడులను ముంబ య్‌లో దాడులు చేయడాన్ని కరాచీలో ఉంటూ మొబైల్ సందేశాలతో నడిపిం చిన లష్కరే తయ్యబా కమాండర్ జకీవుర్ రెహ్మాన్ లఖ్వీని కోర్టు ఆదేశాల మేరకు విడుదల చేసినప్పుడు నరేంద్రమోదీ ప్రభుత్వం ఏమి చేస్తున్నదంటూ కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు మీరేం చేశారని బీజేపీ నాయకులు తిరుగుదాడికి దిగారు. వాస్తవం ఏమంటే ఎవరు అధికా రంలో ఉన్నప్పటికీ ఈ విషయంలో తక్షణం చేయగలిగింది ఏమీలేదు. ఆవేశం తగ్గించుకొని ఆలోచన పెంచుకుంటే, పాకిస్తాన్ నిజస్వరూపం అర్థం చేసుకోవ డానికి ప్రయత్నిస్తే మన నిస్సహాయ స్థితి బోధపడుతుంది. భారత్ మాత్రమే కాదు, అమెరికా సైతం నిధులు కుమ్మరించినా ఫలితం లేక ఎవరికి చెప్పుకో వాలో తెలియక పాకిస్తాన్ మాయాజాలంలో పడిపోయి కొట్టుకుంటోంది. ఈ క్రీడ వల్ల పాకిస్తాన్‌కి ఏైమైనా ప్రయోజనమా? శూన్యం. పైగా అపారమైన నష్టం. ఆత్మహత్యాసదృశం. ఇస్లామీయవాదం ఆయుధంగా... ఇస్లామీయవాదాన్ని తలకెక్కించుకొని, దానిని ఒక ఆయుధంగా ప్రయోగిస్తూ పబ్బం గడుపుకోవడమే విదేశాంగ విధానంగా పాకిస్తాన్ కొనసాగిస్తున్నది. పాకిస్తాన్ ఏర్పడిన వెంటనే 1947లోనే గిరిజనుల ముసుగులో కశ్మీర్‌పై దాడి చేసింది మొదలు లఖ్వీ విడుదల దాకా పరిశీలిస్తే స్పష్టమైన వ్యూహం కని పిస్తుంది. పాకిస్తాన్లో ప్రభుత్వాలు మారినా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తులు మారినా ఈ వ్యూహం మాత్రం మారడం లేదు. అమలు చేస్తున్నది సైన్యం కనుక. సేనాధిపతులందరికీ ఇస్లామీయ శక్తులను వినియోగించడం ద్వారా దేశంలో ఆధిపత్యం చెలాయించడం, ప్రభుత్వాన్నీ, కోర్టులనూ అదు పులో పెట్టుకోవడం అలవాటైనది కనుక ఈ విధానం మారదు. లఖ్వీ జైలులో ఉన్నా, జైలు వెలుపల ఉన్నా ఇండియాకు సంబంధిం చినంత వరకూ తేడా లేదు. దాడులు చేయించాలంటే జైలులో ఉండి కూడా ప్రణాళిక రచించి అమలు చేసే అవకాశం లఖ్వీబోటి ఉగ్రవాదులకు ఉన్నది. జైలులో ఉంటూనే తండ్రి కాగలిగిన లఖ్వీ ఏమైనా చేయగలడు. పాకిస్తాన్ పాలక వ్యవస్థ అటువంటి వెసులుబాటు ఉగ్రవాదులకు కల్పిస్తున్నది. దావూద్ ఇబ్రహీం దర్జాగా తిరుగుతున్నా, లష్కరే తయ్యబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ హీరోలాగా సంచరిస్తున్నా షరీఫ్ సర్కార్‌కు అభ్యంతరం లేదు. దేశ రాజధాని సమీపంలో అల్‌ఖాయిదా అధినేత ఒసామాబిన్ లాదెన్ను రహ స్యంగా (అమెరికా మట్టుపెట్టేవరకూ)దాచిన సైనిక వ్యవస్థ అది. ముంబయ్‌లో 166 మందిని పాక్ ఉగ్రవాదులు చంపిన ఘటన ప్రభుత్వ వైఖరిని కానీ సైన్యం ధోరణిని కానీ ఇసుమంతైనా మార్చలేదు. పాకిస్తాన్ సైన్యం పోడకలపై పుస్తకం రాసిన క్రిస్టియన్ ఫెయిర్ విశ్లేషణ ప్రకారం ఉగ్రవాదాన్ని పోషిస్తూనే ఉగ్రవాదం వల్ల నష్టబోతున్న దేశంగా గుర్తిం పు పొందడం, ఉగ్రవాదాన్ని అరికట్టడానికి ప్రయత్నిస్తున్న దేశంగా అమెరికా నుంచీ, ఇతర పాశ్చాత్య దేశాల నుంచీ అపారమైన ఆర్థిక సహాయం పొందడం పాకిస్తాన్ పాటిస్తున్న విదేశాంగ నీతి. అణ్వస్త్రాలు తయారు చేయడం ద్వారా ఇండియా ముందరి కాళ్ళకు బంధం వేయగలిగింది పాకిస్తాన్. లష్కరే తయ్య బాను అమెరికా నిషేధించిన తర్వాత ఆ సంస్థ తన కార్యకలాపాలను జమాత్ ఉద్ దవా, జైషే మహమ్మద్‌ల ద్వారా కొనసాగిస్తోంది. ఈ రెండు సంస్థలూ కలిసి మొత్తం 162 దాడులు జరిపి 1,132 మంది పౌరులను చంపినట్టూ, 2, 423 మందిని గాయపరచినట్టూ అమెరికాలోని మేరీల్యాండ్ యూనివర్శిటీ పరిశోధనలో తేలింది. ఈ ఉగ్రవాద సంస్థలపైన పాకిస్తాన్లో అదుపాజ్ఞలు లేవు. క్రిస్టియన్ ఫెయిర్ అంచనా ప్రకారం ఇంతవరకూ అమెరికా పాకిస్తాన్ ప్రభుత్వానికీ, సైన్యానికీ 31 వందల కోట్ల డాలర్లు ఉచితంగా ఇచ్చింది. బదులుగా అమెరికాకు ఓరిగింది ఏమిటి? అఫ్ఘానిస్తాన్ నుంచి సోవియెట్ యూనియన్ను తరిమివేయడం ఒక్కటే అగ్రరాజ్యం సాధించిన విజయం. ఆ క్రమంలో పాకిస్తాన్‌తో కలిసి అమెరికా సృష్టించిన ఉగ్రవాదులు తాలిబాన్. వారి దాడులలో అఫ్ఘానిస్తాన్‌లోని అమెరికా సైనికులూ, మిత్రదేశాల సైనికులూ, ఆఫ్ఘాన్ సైనికులూ వేలమంది చనిపోయారు. తాలిబాన్ పాకిస్తాన్లో సైతం నెత్తుడి క్రీడ కొనసాగిస్తున్నది. తాలిబ్లను నిలువరించేందుకు చేసిన ప్రయ త్నంలో పాకిస్తాన్ సైనికులు సైతం మరణిస్తున్నారు. ఫ్రాంకెన్‌స్టీన్ అనే శాస్త్రవేత్త సృష్టించిన పెనుభూతం ఆ శాస్త్రవేత్తనే బలితీసుకున్నట్టు పాకిస్తాన్ తయారు చేసిన తాలిబాన్ ఆ దేశానికే ప్రమాదంగా పరిణమించింది. పొరుగుదేశం కనుకా, కశ్మీర్ సమస్య అపరిష్కృతంగా మిగిలిపోయింది కనుకా పాకిస్తాన్ ఉగ్ర వాద విధానం ప్రభావం నుంచి తప్పించుకోవడం భారత్‌కు సాధ్యం కాకపో వచ్చు. అటల్ బిహారీ వాజపేయి చెప్పినట్టు మన పొరుగున ఎవరు ఉండాలో మనం నిర్ణయించుకునే అవకాశం లేదు. పాకిస్తాన్ అస్తిత్వానికి ఏర్పడుతున్న ముప్పును గ్రహించి ఉగ్రవాదాన్ని అణచివేయాలని ఆ దేశంలోని సైన్యాధిప తులు నిర్ణయించుకుంటే తప్పించి ఈ విపత్తు తొలగిపోయే అవకాశం లేదు. ఉగ్రవాదం నుంచి తనను తాను కాపాడుకోవడానికే ఇండియా ప్రయత్నించాలి. పాకిస్తాన్‌పైన అంతర్జాతీయంగా ఒత్తిడి పెంచడానికి దౌత్యపరంగా కృషి చేస్తూనే కశ్మీరీల హృదయాలు గెలుచుకునే మార్గం అన్వేషించాలి. ఇది అనుకు న్నంత సులభం కాదు. క శ్మీర్ లోయలో భారత వ్యతిరేకత తీవ్రంగా ఉంది. పాకిస్తాన్ పట్ల ప్రేమ తగ్గుతున్నది కానీ భారత్ పట్ల సుముఖత పెరగడం లేదు. ముఫ్తీ మహమ్మద్ సయీద్ నాయకత్వంలో పీడీపీ-బీజేపీ ప్రభుత్వం అనుసరించే విధానాలు జనరంజకంగా ఉంటే, ప్రజలలో కొన్నేళ్ళుగా పేరుకొని పోయిన వ్యతిరేక భావం తగ్గించగలిగితే, భారత్‌లో భాగంగా ఉండటమే శ్రేయస్కరమనీ, లాభదాయకమనే అభిప్రాయం కశ్మీరీల మనస్సులో బలంగా నాటుకుంటే పాకిస్తాన్ చేయగలిగిన హాని ఏమీ లేదు. ఇందుకు భిన్నంగా పరిణామాలు సంభవించి, విభేదాల కారణంగా పీడీపీ-బీజేపీ ప్రభుత్వం కూలి పోయి రాజకీయ అనిశ్చితి చోటు చేసుకుంటే పరిస్థితి మరోసారి దిగజారు తుంది. పాకిస్తాన్ అటు అఫ్ఘానిస్తాన్‌పై పోరాటానికి తాలిబాన్‌ను ప్రేరేపిస్తూనే ఇటు కశ్మీర్‌ను వశం చేసుకోవడానికి ఇస్లామీయవాదాన్ని వినియోగించుకుం టుంది. దీనికి విరుగుడు ఢిల్లీలో లేదు. శ్రీనగర్‌లో ఉంది. ముఫ్తీ ప్రభుత్వం పనితీరులో ఉంది. కశ్మీర్లో తిరిగి కుంపటి రాజేసే అవకాశం పాకిస్తాన్‌కు ఇవ్వనంత వరకూ లఖ్వీ వంటి ఉగ్రవాదుల నుంచి ప్రమాదం ఉండదు. కశ్మీరీల సహకారం, భాగస్వామ్యం లేకుండా ఆ లోయలో అశాంతిని రగిలించడం ఉగ్రవాదుల వల్ల కాదు. పాక్ సైన్యం బరితెగింపు భారత్‌లో మారణహోమం సాగించి, విధ్వంసం సృష్టించిన పేరుమోసిన ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం, రాచమర్యాదలు చేయడం, పాక్ భూభాగం నుంచి ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగించేందుకు సదుపాయం కల్పించడం పాకిస్తాన్ సైన్యం బరితెగింపునకు నిదర్శనాలు. లఖ్వీని విడుదల చేయడాన్ని అమెరికా ప్రభుత్వం ఖండించింది. ఇంకా చాలా దేశాలు పాకిస్తాన్ నిజ స్వరూ పాన్ని గుర్తిస్తున్నాయి. పాకిస్తాన్‌ను ఒంటరి చేయడం ఇండియాకు మాత్రమే సాధ్యమయ్యే పనికాదు. అందుకు పాకిస్తాన్ సైన్యం దండిగా సహకరిస్తున్నది కనుక భారత్‌కు బెంగ అనవసరం. పాకిస్తాన్‌తో దౌత్య సంబంధాలు కొనసాగి స్తూనే, చర్చలు జరుపుతూనే ఉండవచ్చు. కానీ వాటిపైన పెద్దగా ఆశలు పెట్టుకోనక్కరలేదు. తమ దేశం ముక్కలు చెక్కలు కావాలో, శాంతిసుస్థిరతలతో విలసిల్లాలో తేల్చుకోవలసింది పాకిస్తాన్ సైన్యం మాత్రమే. సైన్యాధికారుల వైఖరి మారనంతవరకూ పాకిస్తాన్ ప్రజలు సైతం నిస్సహాయులే. ఇస్లామీయ శక్తులనూ, తాలిబాన్‌నూ వినియోగించుకొని అఫ్ఘానిస్తాన్‌ను జయించాలనే తాపత్రయం, కశ్మీర్‌ను కాజేయాలన్న కాంక్ష వీడకపోతే పాకిస్తాన్ ఉనికికే ప్రమా దం. ఇది ఇండియా స్వాగతించవలసిన దృశ్యం కాదు. పాకిస్తాన్ ప్రజలు క్షేమంగా, సంతోషంగా ఉండాలనే భారతీయులంతా అభిలషించాలి. పాకిస్తాన్ సైన్యం ఆత్మాహుతి చేసుకోవడాన్ని నివారించే శక్తి సైతం ఇండియాకు లేదు. అదే విషాదం. -
'లఖ్వీ విడుదల ఆశ్యర్యం`
తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసిన ఇజ్రాయెల్ న్యూఢిల్లీ: 26/11 ముంబై పేలుళ్ల సూత్రధారి జాకీర్ రెహమాన్ లఖ్వీ విడుదలపై ఇజ్రాయెల్ ఆశ్యర్యాన్ని వ్యక్తం చేసింది. ఇండియా, ఇజ్రాయెల్‌పై ఆయన తిరిగి దాడులు చేసే అవకాశం ఉందని అందువల్ల లఖ్వీ విడుదల నిరాశకు గురిచేసిందని ఇజ్రాయెల్ బ్రాండ్ అంబాసిడర్ డానియల్ కార్మన్ వ్యాఖ్యానించారు. జాకీర్ రెహమాన్ లఖ్వీ అంతర్జాతీయ ఉగ్రవాది అని అలాంటి వారు ప్రపంచానికే ప్రమాదకరమని ఆయన అన్నారు. ప్రపంచానికి మంచిది కాదు: ఫ్రాన్స్ ఫ్రాన్స్‌లో పర్యటిస్తున్న భారత ప్రధాని మోదీ శుక్రవారం ఆ దేశాధ్యక్షుడు హోలాండ్‌తో జరిపిన చర్చల్లోనూ ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. లఖ్వీ విడుదల తీవ్ర దిగ్భ్రాంతికరమని హోలాండ్ పేర్కొన్నారు. పాక్ హామీలకు వ్యతిరేకం: భారత్ ఉగ్రవాదుల విషయంలో పాక్ ద్వంద్వ ప్రమాణాలు అనుసరిస్తోందని మండిపడింది. లఖ్వీ విడుదల ముంబై ఉగ్ర దాడుల బాధితులకు అవమానకరమని, ఈ విషయంలో పాక్ ద్వంద్వ వైఖరిని అంతర్జాతీయ సమాజం గుర్తించాలంది. లఖ్వీ విడుదల దురదృష్టకరమని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. పాక్‌తో చర్చలను భారత్ కోరుకుంటున్నప్పటికీ తాజా పరిణామం దురదృష్టకరమని, అసంతృప్తిని కలిగిస్తోందని అన్నారు. ఇలాంటి నిర్ణయాలు ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక బంధాన్ని ప్రభావితం చేస్తాయన్నారు. లఖ్వీకి సంబంధించిన కీలక వివరాలను కోర్టు ముందుంచడంలో పాక్ ప్రభుత్వం విఫలమైందన్నారు. మరోవైపు లఖ్వీ విడుదల నేపథ్యంలో భారత్‌కు ముప్పు పొంచి ఉందని, ఉగ్రవాద చర్యలను ఎదుర్కొనడానికి దేశం సిద్ధంగా ఉండాలని భద్రతా నిపుణులు సూచిస్తున్నారు. -
పాక్ జైలు నుంచి లఖ్వీ విడుదల
కోర్టు ఆదేశాలను పాటించిన జైలు అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసిన భారత్ న్యూఢిల్లీ: ముంబై దాడుల సూత్రధారి జకీర్ రెహ్మాన్ లఖ్వీ పాకిస్తాన్ జైలు నుంచి విడుదలయ్యాడు. అతని నిర్బంధాన్ని లాహోర్ హైకోర్టు తప్పుబట్టడంతో ఆరేళ్ల జైలు జీవితం నుంచి లఖ్వీకి విముక్తి కలిగింది. కోర్టు నుంచి ఉత్తర్వులు అందగానే రావల్పిండిలోని అడియాల జైలు అధికారులు శుక్రవారం మధ్యాహ్నం లఖ్వీని విడిచిపెట్టారు. ఒంటి గంట ప్రాంతంలో నాలుగైదు కార్లు జైలు వద్దకు వచ్చాయి. లఖ్వీ తరఫు లాయర్ తెచ్చిన పత్రాలను పరిశీలించిన అధికారులు అతని విడుదల ప్రక్రియను పూర్తి చేశారు. అనంతరం జైలు నుంచి బయటకు వచ్చిన లఖ్వీ నేరుగా తన కారులో కూర్చుని ఇస్లామాబాద్‌లోని నివాసానికి వెళ్లిపోయాడు. లఖ్వీ విడుదలపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని, అతని లాయర్ కోర్టు ఉత్తర్వులను తెచ్చివ్వడంతో విడుదల చేశామని జైలు అధికారులు వెల్లడించారు. అయితే లఖ్వీని నిర్బంధంలోనే ఉంచడానికి ప్రభుత్వం సమాలోచనలు జరిపినప్పటికీ అందుకు ఎలాంటి న్యాయపరమైన మార్గాలూ లేకపోవడంతో మిన్నకుండిపోయింది. శాంతిభద్రతల నిర్వహణ కింద ముందుజాగ్రత్తగా లఖ్వీని నిర్బంధంలోనే ఉంచాలని ఇప్పటికే రెండుసార్లు ఇచ్చిన ఆదేశాలను ఇస్లామాబాద్, లాహోర్ హైకోర్టులు తోసిపుచ్చాయని, ఇక మళ్లీ అలాంటి ఆదేశాలు ఇవ్వలేమని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. అందుకే ఈసారి కోర్టు ఆదేశాలను పాటించాల్సి వచ్చినట్లు వివరించారు. ప్రపంచానికి మంచిది కాదు: ఫ్రాన్స్ ఫ్రాన్స్‌లో పర్యటిస్తున్న భారత ప్రధాని మోదీ శుక్రవారం ఆ దేశాధ్యక్షుడు హోలాండ్‌తో జరిపిన చర్చల్లోనూ ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. లఖ్వీ విడుదల తీవ్ర దిగ్భ్రాంతికరమని హోలాండ్ పేర్కొన్నారు. లఖ్వీ విడుదల భారత్‌కు, ప్రపంచానికి మంచిది కాదని మోదీని కలుసుకున్న ఫ్రాన్స్ ఎంపీలలో ఒకరు అన్నారు. ఉగ్రవాద నిరోధంపై ఫ్రాన్స్, భారత్‌లది ఒకే వైఖరి అని మోదీ అన్నారు. పాక్ హామీలకు వ్యతిరేకం: భారత్ లష్కరే తోయిబా ఆపరేషన్స్ కమాండర్‌గా ఉన్న లఖ్వీ విడుదలపై భారత్ ముందునుంచీ తీవ్ర అభ్యంతరం తెలుపుతూ వస్తోంది. లాహోర్ హైకోర్టు నిర్ణయంపైనా అసంతృప్తిని వ్యక్తం చేసింది. సీమాంతర ఉగ్రవాదంపై పాక్ తమకు ఇచ్చిన హామీలకు ఇది వ్యతిరేకమని పేర్కొంది. ఉగ్రవాదుల విషయంలో పాక్ ద్వంద్వ ప్రమాణాలు అనుసరిస్తోందని మండిపడింది. లఖ్వీ విడుదల ముంబై ఉగ్ర దాడుల బాధితులకు అవమానకరమని, ఈ విషయంలో పాక్ ద్వంద్వ వైఖరిని అంతర్జాతీయ సమాజం గుర్తించాలంది. లఖ్వీ విడుదల దురదృష్టకరమని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. పాక్‌తో చర్చలను భారత్ కోరుకుంటున్నప్పటికీ తాజా పరిణామం దురదృష్టకరమని, అసంతృప్తిని కలిగిస్తోందని అన్నారు. ఇలాంటి నిర్ణయాలు ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక బంధాన్ని ప్రభావితం చేస్తాయన్నారు. లఖ్వీకి సంబంధించిన కీలక వివరాలను కోర్టు ముందుంచడంలో పాక్ ప్రభుత్వం విఫలమైందన్నారు. కాగా, సిమీ, ఇతర ఉగ్రవాద సంస్థలతో సంబంధమున్న ఐదుగురు విచారణ ఖైదీలను తెలంగాణ పోలీసులు ఎన్కౌంటర్ చేయడంపై మీడియా ప్రశ్నించగా.. అది రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారమని దాటవేశారు. మరోవైపు లఖ్వీ విడుదల నేపథ్యంలో భారత్‌కు ముప్పు పొంచి ఉందని, ఉగ్రవాద చర్యలను ఎదుర్కొనడానికి దేశం సిద్ధంగా ఉండాలని భద్రతా నిపుణులు సూచిస్తున్నారు. లఖ్వీ విడుదలపై పాక్‌లోని తమ హైకమిషనర్ ఆ దేశ విదేశాంగ కార్యదర్శికి నిరసన తెలిపారని విదేశాంగ శాఖ తెలిపింది. కాగా, ముంబై దాడుల విచారణలో సహకరించేందుకు భారత్ మితిమీరిన జాప్యం చేయడంతో ప్రాసిక్యూషన్ వాదన బలహీనమై, లఖ్వీ విడుదలకు దారితీసిందని పాక్ విదేశాంగ ప్రతినిధి తాస్నిమ్ ఆరోపించారు. -
లఖ్వీ విడుదల దురదృష్టకరం: రాజ్ నాథ్
న్యూఢిల్లీ: పాకిస్థాన్ జైలులో ఉన్న ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారి, లష్కరే తోయిబా ఆపరేషన్స్ కమాండర్ జకీవుర్ రెహ్మన్ లఖ్వీని విడుదల చేయడంపై భారత ప్రభుత్వం స్పందించింది. లఖ్వీని విడుదల చేయడం దురదృష్టకరం, నిరుత్సాహకరమని పేర్కొంది. 'పాకిస్థాన్ చర్చలు జరపాలని భారత్ కోరుకుంటోంది. కానీ లఖ్వీ విషయంలో పాకిస్థాన్ నిర్ణయం దురదృష్టకరం, నిరుత్సాహకరం ' అని హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. 26/11 ముంబై ముట్టడి కుట్రదారుడైన లఖ్వీని పాకిస్థాక్ కోర్టు శుక్రవారం విడుదల చేసింది. -
ముంబై పేలుళ్ల సూత్రధారి లఖ్వీ విడుదల
లాహోర్: పాకిస్థాన్ జైలులో ఉన్న ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారి, లష్కరే తాయిబా ఆపరేషన్స్ కమాండర్ లఖ్వీని విడుదల చేశారు. లఖ్వీపై నిర్బంధాన్ని రద్దు చేసి, తక్షణమే విడుదల చేయాలన్న లాహోర్ హైకోర్టు ఆదేశాల మేరకు గురువారం రాత్రి పాక్ అతన్ని విడుదల చేసింది. కాగా లఖ్వీని విడిచి పెట్టరాదని భారత్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసినా, పాక్ పట్టించుకోలేదు. 2008 నవంబర్‌లో భారత వాణిజ్య రాజధాని ముంబైపై దాడి కేసులో లఖ్వీ ప్రధాన సూత్రధారి అన్న విషయం తెలిసిందే. 2009 ఫిబ్రవరిలో లఖ్వీతోపాటు మరో ఆరుగురిని పాక్ ప్రభుత్వం అదుపులోకి తీసుకుంది. అనంతరం వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దాడి జరిగిన సమయంలో తీవ్రవాద సంస్థ లష్కరే ఈ తోయిబాకు లఖ్వీ అపరేషనల్ హెడ్‌గా ఉన్నాడని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ముంబైలో 26/11 దాడిలో 166 మంది మరణించారు. -
లఖ్వీని విడుదల చేయండి: పాక్ కోర్టు
లష్కరే తాయిబా ఆపరేషన్స్ కమాండర్, 26/11 ముంబై దాడుల ప్రధాన సూత్రధారి జకీ ఉర్ రహమాన్ లఖ్వీపై నిర్బంధాన్ని రద్దుచేసి, తక్షణమే అతణ్ని విడుదల చేయాలని లాహోర్ హైకోర్టు గురువారం పాక్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. లాహోర్ హైకోర్టు న్యాయమూర్తి మహ్మద్ అన్వర్ ఉల్ హక్ తీర్పును వెలువరిస్తూ,, పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ కింద లఖ్వీని నిర్బంధించిన పంజాబ్ ప్రభుత్వం అతనిని దోషిగా నిరూపించే సాక్ష్యాధారాల్ని సమర్పించలేకపోయినందున నిర్బంధాన్ని ఎత్తివేస్తూ విడుదలకు ఆదేశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఒకొక్కటి రూ.10 లక్షల విలువైన రెండు సెక్యూరిటీ బాండ్లను పూచికత్తుగా సమర్పించాలని లఖ్వీ తరఫు న్యాయవాదికి సూచించారు. కావాలసిన ఆధారాలన్నింటిని సమర్పించినప్పటికీ కోర్టు తమ వాదనను పరిగణనలోకి తీసుకోకుండా లఖ్వీ విడుదలకు మొగ్గుచూపిందని హైకోర్టు ఉన్నతాధికారులు చెప్పారు. -
'టెర్రరిస్టుల్లో మంచివారు, చెడ్డవారు ఉండరు'
న్యూఢిల్లీ : ముంబైపై దాడి కేసులో ప్రధాన సూత్రధారి లఖ్వీ విడుదల చేయాలని ఇస్లామాబాద్ హైకోర్టు ఆదేశించడం పట్ల భారత విదేశాంగ శాఖ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ముంబై దాడి కేసులో లఖ్వీకు సంబంధించిన సరైన ఆధారాలు పాక్ కోర్టు ముందు పెట్టడంలో నవాజ్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించింది. లఖ్వీ విడుదల కాకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పాకిస్థాన్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది. టెర్రరిస్టుల్లో మంచివారు, చెడ్డవారు ఉండరనే సంగతి గుర్తుంచుకోవాలని భారత విదేశాంగ శాఖ... పాక్ ప్రభుత్వానికి సూచించింది. 2008 ముంబైపై దాడిలో కీలక సూత్రధారి లఖ్వీ నిర్బంధం అక్రమమని ఇస్లామాబాద్ హైకోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. అతడిని జైలు నుంచి వెంటనే విడుదల చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.ఈ నేపథ్యంలో భారత విదేశాంగ శాఖపై విధంగా స్పందించింది. -
లఖ్వీని విడుదల చేయండి
ఇస్లామాబాద్: 2008 ముంబైపై దాడిలో కీలక సూత్రధారి లఖ్వీ నిర్బంధం అక్రమమని ఇస్లామాబాద్ హైకోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. అతడిని జైలు నుంచి వెంటనే విడుదల చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు మీడియా కథనాన్ని వెలువరించింది. తనను జైలు నుంచి వెంటనే విడుదల చేయాలని లఖ్వీ చేసుకున్న అభ్యర్థను ఇస్లామాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నూరుల్ హక్ పరిగణలోకి తీసుకుని... ఈ తీర్పు వెలువరించారు. అయితే లఖ్వీ గతంలో ఇదేవిధంగా చేసుకున్న అభ్యర్థను హైకోర్టు తోసిపుచ్చిన విషయం విదితమే. 2008 నవంబర్‌లో భారత వాణిజ్య రాజధాని ముంబైపై దాడి కేసులో లఖ్వీ ప్రధాన సూత్రధారి అన్న విషయం తెలిసిందే. 2009 ఫిబ్రవరిలో లఖ్వీతోపాటు మరో ఆరుగురిని పాక్ ప్రభుత్వం అదుపులోకి తీసుకుంది. అనంతరం వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అలాగే ఈ కేసులో అరెస్ట్ అయిన ఆరుగురిని అడియాల జైలులో నిర్బంధంలో ఉన్నారు. దాడి జరిగిన సమయంలో తీవ్రవాద సంస్థ లష్కరే ఈ తోయిబాకు లఖ్వీ అపరేషనల్ హెడ్‌గా ఉన్నాడని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ముంబైలో 28/11 దాడిలో 166 మంది మరణించిన సంగతి తెలిసిందే. -
మరి కొన్నాళ్లు జైల్లోనే!
లష్కరే తాయిబా ఉగ్రవాది జకీ ఉర్ రెహమాన్ లఖ్వీ మరికొన్నాళ్లు జైల్లోనే ఉండబోతున్నాడు. కిడ్నాప్ ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో తాజాగా పాకిస్తాన్ కోర్టు లఖ్వీ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. 2008 ముంబై పేలుళ్లకు ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ ఉగ్రవాదిపై ఇప్పటికే పలు కేసులు ఉండగా, వాటిలో ఓ కిడ్నాప్ కేసు కూడా నమోదైంది. తనపై తప్పుడుకేసు నమోదు చేశారంటూ, దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై వాదిస్తూ, ఆరున్నర ఏళ్ల క్రితం నమోదైన కేసు ఇంకా నడుస్తోందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ నబీ తాబిష్ వాదించారు. విచారణ పూర్తికాకుండా ఎఫ్ఐఆర్ను రద్దుచేయడం సాధ్యం కాదన్నారు. జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ నవీద్ ఖాన్ లఖ్వీ బెయిల్ పిటిషన్ ను తిరస్కరించారు. ఈ కరడుగట్టిన ఉగ్రవాదికి బెయిల్ లభించే అవకాశాలు ఇప్పట్లో లేనట్టే. -
26/11 సూత్రధారి లఖ్వీకి బెయిల్
-
లఖ్వీ వ్యవహారం: పాక్ రాయబారికి భారత్ సమన్లు
ముంబై పేలుళ్ల సూత్రధారి జకీవుర్ రెహ్మాన్ లఖ్వీ నిర్బంధాన్ని సస్పెండ్ చేస్తూ పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్ హైకోర్టు తీసుకున్న నిర్ణయంపై భారత్ తీవ్రంగా స్పందించింది. భారతదేశంలోని పాక్ రాయబార కార్యాలయంలో పనిచేస్తున్న పాక్ హైకమిషనర్‌కు భారత విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది. లఖ్వీ నిర్బంధాన్ని ఇస్లామాబాద్ హైకోర్టు సస్పెండ్ చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. -
ముందస్తు నిర్బంధంలో లఖ్వీ
-
ముందస్తు నిర్బంధంలో లఖ్వీ
మూడు నెలల పాటు జైలులోనే లఖ్వీకి బెయిల్‌పై భారత్ నిరసనతో పాక్ నిర్ణయం కరడుగట్టిన ఉగ్రవాదికి బెయిల్ ఇవ్వడం షాక్‌కు గురిచేసిందన్న మోదీ పాక్ తీరును గర్హిస్తూ పార్లమెంట్ ఏకగ్రీవ తీర్మానం న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: ముంబై దాడుల సూత్రధారి జకీఉర్ రెహ్మాన్ లఖ్వీ బెయిల్‌పై జైలు నుంచి బయటకురాకుండా పాకిస్తాన్ ప్రభుత్వం అడ్డుకుంది. ముందస్తు నిర్బంధ చట్టం కింద అతన్ని మూడు నెలలపాటు నిర్బంధించింది. నిషేదిత ఉగ్రవాద సంస్థ లష్కరేతోయిబా ఆపరేషన్స్ కమాండర్ లఖ్వీకి పాక్ కోర్టు బెయిల్ ఇవ్వడంపై భారత్ నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవడం, పెషావర్ సైనిక స్కూలులో నరమేధంతో అంతర్జాతీయ మీడియా దృష్టి సారించిన దృష్ట్యా పక్ ఈ చర్య చేపట్టింది. ప్రస్తుతం రావల్పిండి అడియాలా జైలులో ఉన్న లఖ్వీ శుక్రవారం ఉదయం బెయిల్‌పై విడుదలకావాల్సి ఉంది. అయితే అంతకుముందే పాక్ అధికారులు స్పందించారు. ప్రజా భద్రత నిర్వహణ(ఎంపీవో) చట్టం నిబంధనలను ప్రయోగించి, లఖ్వీ జైలు నుంచి బయటకురాకుండా ఉత్తర్వులిచ్చారు. జైలు అధికారులకు సంబంధిత ఉత్తర్వుల కాపీని అందించారు. ఈ విషయాన్ని భారత్‌కూ తెలియజేశారు. అలాగే ఉగ్రవాద వ్యతిరేక కోర్టు తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేయాలని పాక్ నిర్ణయించింది. సోమవారం కోర్టులో పిటిషన్ వేయనుంది. పెషావర్‌లో 148 మంది స్కూలు పిల్లలను ఉగ్రవాదులు దారుణంగా కాల్చి చంపిన నేపథ్యంలో లఖ్వీని విడుదల చేస్తే అంతర్జాతీయంగా పాక్‌కు చెడ్డపేరు వస్తుందని షరీఫ్ అభిప్రాయపడినట్లు సమాచారం. దీనిపై భారత్ నుంచీ ఒత్తిడి వస్తుందని, లఖ్వీని ఎలాగైనా నిర్బంధంలోనే ఉంచాలని ప్రధాని ఆదేశించినట్లు వెల్లడించాయి. మరోవైపు ముంబై దాడుల కేసులో మరో 15 మంది సాక్షులను విచారించకుండానే లఖ్వీకి కోర్టు బెయిల్ ఇవ్వడంపై న్యాయవర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. బెయిల్‌ను రద్దు చేయండి: భారత్ లఖ్వీ బెయిల్ రద్దయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని పాక్‌ను భారత్ గట్టిగా కోరింది. లఖ్వీకి బెయిల్ ఇవ్వడంపై పార్లమెంట్ శుక్రవారం తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసింది. పాక్ కోర్టు నిర్ణయాన్ని లోక్‌సభలో అన్ని పార్టీలు ముక్తకంఠంతో ఖండించాయి. ముంబై దాడి ముష్కరులకు శిక్ష పడేలా కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలన్నాయి. దీనిపై ప్రధాని మోదీ స్పందిస్తూ.. లఖ్వీకి బెయిల్ రావడం షాక్‌కు గురి చేసిందన్నారు. పాక్ పిల్లల ఊచకోతపై బాధతో బరువెక్కిన గుండెలు ఇంకా తేలికపడకముందే ఈ నిర్ణయం వెలువడటం దారుణమన్నారు. దీనిపై భారత అభ్యంతరాలను పాక్‌కు గట్టిగా చెప్పామని, పార్లమెంట్ వ్యక్తం చేసిన అభిప్రాయాల మేరకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంద పేర్కొన్నారు. ఉగ్రవాదంపై పోరులో పాక్‌కు చిత్తశుద్ధి లేదని లఖ్వీ బెయిల్తె రుజువవుతోందని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ అన్నారు. బెయిల్‌ను ఉపసంహరించుకోవాలనిడిమాండ్ చేశారు. ముంబై దాడుల బాధ్యులకు శిక్ష పడేలా చూడాల్సిన బాధ్యత పాక్‌దేనని వ్యాఖ్యానించారు. పాక్‌లో 67 మంది మిలిటెంట్ల హతం పాకిస్థాన్‌లోని ఉత్తర వజీరిస్థాన్‌లో శుక్రవారం ఆ దేశ భద్రతా బలగాలు మిలిటెంట్ల స్థావరాలపై భారీ ఎత్తున జరిపిన దాడిల్లో 67 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఫజ్లుల్లాపై ద్రోన్ దాడులకు పాక్ నిర్ణయం పెషావర్‌లో నరమేధం సృష్టించిన తాలిబాన్ మిలిటెంట్లతో ఫోన్ సంభాషణలు సాగించిన తెహ్రీక్ ఎ తాలిబాన్ చీఫ్ ముల్లా ఫజ్లుల్లాపై ద్రోన్ దాడులు జరపాలని పాక్ సైన్యంతోపాటు అఫ్ఘాన్‌లోని సంకీర్ణ దళాలు నిర్ణయించాయి. -
26/11 సూత్రధారి లఖ్వీకి బెయిల్
* మంజూరు చేసిన పాకిస్తాన్ కోర్టు * తీవ్రంగా ఖండించిన భారత్ * బెయిల్ రద్దుకు పాక్ ప్రయత్నించాలన్న రాజ్‌నాథ్ ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: 26/11 ముంబై దాడుల సూత్రధారి, నిషేధిత లష్కరే తోయిబా ఆపరేషన్స్ కమాండర్ జకీఉర్ రెహ్మన్ లఖ్వీకి స్థానిక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఉగ్రవాదాన్ని ఈ ప్రాంతం నుంచే తరిమేద్దామని, పాక్‌లో ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలిద్దామని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ పిలుపునిచ్చిన మర్నాడే లఖ్వీ జైలు నుంచి విడుదలవ్వడం విశేషం. ‘ఈ నిర్ణయాన్ని మేం ఊహించలేదు. బెయిల్ మంజూరు కన్నా ముందే మరిన్ని సాక్ష్యా లను మేం కోర్టుకు హాజరుపరిస్తే బావుండేది’ అని ప్రాసిక్యూషన్ చీఫ్ చౌధ్రీ అజహర్ అన్నారు. లఖ్వీపై సాక్ష్యాధారాలు బలంగా లేనందువల్ల ఆయనకు బెయిల్ మంజూరైందని లఖ్వీ తరఫు న్యాయవాది రాజా రిజ్వాన్ అబ్బాసీ తెలిపారు. 26/11 కేసుకు సంబంధించిన మరో ఆరుగురు నిందితులకు కూడా బెయిల్ కోరుతూ త్వరలో కోర్టులో దరఖాస్తు చేస్తామన్నారు. భద్రతాకారణాల వల్ల ఈ కేసును రావల్పిండిలోని అడియాల జైల్లో రహస్యంగా విచారిస్తున్నారు. 2008లో ముంబైపై దాడి జరగగా, 2009 నవంబర్‌లో ప్రారంభమైన ఈ కేసు విచారణ వరుస వాయిదాలు, సాంకేతిక కారణాలతో నత్తనడకన నడుస్తోంది. లఖ్వీకి బెయిల్ మంజూరవడంపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఆశ్రయమిస్తోందనడానికి ఇదో మరో రుజువని ఆరోపించింది. బెయిల్ నిర్ణయాన్ని నిరసిస్తూ పాక్‌లోని భారతీయ రాయబార కార్యాలయం ఒక కఠిన ప్రతిస్పందనను రూపొందిస్తోంది. లఖ్వీకి బెయిల్ లభించడంపై భారతదేశ హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాకిస్తాన్ తీరును తప్పుబట్టారు. కేసు దర్యాప్తులో ప్రాసిక్యూషన్ లోపభూయిష్టంగా వ్యవహరించడం వల్లనే లఖ్వీకి లభించిందన్నారు. కింది కోర్టు ఇచ్చిన ఈ తీర్పును పాక్ ప్రభుత్వం పై కోర్టులో సవాలు చేసి, బెయిల్‌ను రద్దు చేయిస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ముంబై దాడి కేసు విచారణను భారత్‌లో తొందరగా ముగించామని, ముఖ్యమైన సాక్ష్యాధారాలన్నింటినీ అందించినప్పటికీ పాక్‌లో మాత్రం విచారణ నత్తనడకన సాగుతోందని విమర్శించారు. లఖ్వీకి బెయిల్ లభించడం 26/11 కేసు విచారణకు పెద్ద దెబ్బ అని భారత్‌లో ఆ కేసును వాదించిన న్యాయవాది ఉజ్వల్ నికమ్ పేర్కొన్నారు. లఖ్వీ బెయిల్‌పై బయట ఉంటే.. వారికి వ్యతిరేకంగా సాక్ష్యమిచ్చేందుకు సాక్షులు ముందుకు రాలేరన్నారు. హఫీజ్ సయీద్.. మానవత్వానికే శత్రువు ఉగ్రవాదంపై పోరులో పాక్‌కు చిత్తశుద్ధి ఉంటే.. భారత్‌కు మోస్ట్ వాంటెడ్ టైస్టులైన దావూద్ ఇబ్రహీం, హఫీజ్ సయీద్‌లను వెంటనే తమకు అప్పగించాలని భారత్ డిమాండ్ చేసింది. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు వేర్వేరుగా ఈ డిమాండ్ చేశారు. ఉగ్రవాదాన్ని పెంచి, పోషిస్తున్న హఫీజ్ సయీద్.. మానవత్వానికే ప్రధాన శత్రువని వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు.