ముంబై పేలుళ్ల సూత్రధారి లఖ్వీ విడుదల
లాహోర్: పాకిస్థాన్ జైలులో ఉన్న ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారి, లష్కరే తాయిబా ఆపరేషన్స్ కమాండర్ లఖ్వీని విడుదల చేశారు. లఖ్వీపై నిర్బంధాన్ని రద్దు చేసి, తక్షణమే విడుదల చేయాలన్న లాహోర్ హైకోర్టు ఆదేశాల మేరకు గురువారం రాత్రి పాక్ అతన్ని విడుదల చేసింది. కాగా లఖ్వీని విడిచి పెట్టరాదని భారత్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసినా, పాక్ పట్టించుకోలేదు.
2008 నవంబర్లో భారత వాణిజ్య రాజధాని ముంబైపై దాడి కేసులో లఖ్వీ ప్రధాన సూత్రధారి అన్న విషయం తెలిసిందే. 2009 ఫిబ్రవరిలో లఖ్వీతోపాటు మరో ఆరుగురిని పాక్ ప్రభుత్వం అదుపులోకి తీసుకుంది. అనంతరం వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దాడి జరిగిన సమయంలో తీవ్రవాద సంస్థ లష్కరే ఈ తోయిబాకు లఖ్వీ అపరేషనల్ హెడ్గా ఉన్నాడని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ముంబైలో 26/11 దాడిలో 166 మంది మరణించారు.