నవాజ్ షరీఫ్(ఫైల్‌ఫొటో)
లాహోర్ : పనామా పేపర్స్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొని అరెస్టైన నవాజ్ షరీఫ్ ప్రస్తుతం లాహోర్ జైల్లో శిక్షను అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. అయితే గత కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో నవాజ్ షరీఫ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
అనారోగ్యం కారణంగా మెడికల్ పర్మిటెన్స్ కింద నవాజ్ షరీఫ్‌కు లాహోర్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో జైలు అధికారులు షరీఫ్‌ను ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నవాజ్ షరీఫ్‌కు అత్యుత్తమ చికిత్స అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment