షరీఫ్‌ కోర్టుకు రావాల్సిందే | Lahore Court Summons To Nawaz Sharif | Sakshi
Sakshi News home page

Published Mon, Sep 24 2018 8:47 PM | Last Updated on Mon, Sep 24 2018 9:11 PM

Lahore Court Summons To Nawaz Sharif - Sakshi

లాహోర్‌: పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌కు మరో షాక్‌ తగిలింది. ఇటీవలే అక్రమాస్తుల కేసులో ఊరట పొందిన షరీఫ్‌ను.. లాహోర్‌ హైకోర్టు రాజద్రోహం కేసులో అక్టోబర్‌ 8వ తేదీన న్యాయస్థానంలో హాజరు కావాల్సిందిగా ఆదేశించింది. ఓ ఇంటర్వ్యూలో ముంబై దాడుల గురించి మాట్లాడినందకు ఆయనపై రాజ్యద్రోహం కేసు నమోదైంది. ఈ ఏడాది మేలో ఆయన డాన్‌ పత్రికతో మాట్లాడుతూ.. ముంబై దాడుల వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని పరోక్షంగా అంగీకరించారు. దాడులకు పాల్పడింది పాక్‌ ఉగ్రవాదులేనని తెలిపారు. పాక్‌లో ఉగ్రవాదులు కదలికలు ఎక్కువగానే ఉన్నట్టు పేర్కొన్నారు. కాగా ఈ వ్యాఖ్యలపై  అమీన్‌ మాలిక్‌ అనే మహిళ కోర్టును ఆశ్రయించారు. 

‘2017లో సుప్రీం కోర్టు షరీఫ్‌ను ప్రధాని పదవికి అనర్హుడిగా ప్రకటించింది. అక్రమాస్తుల కేసులో కోర్టు ఆయనకు పదేళ్లు జైలు శిక్ష విధించింది. అయినా ముంబై దాడులో పాక్‌ ప్రమేయం ఉందని మాట్లాడి షరీఫ్‌ దేశద్రోహానికి పాల్పడ్డాడ’ని ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన లాహోర్‌ హైకోర్టు ఈ కేసులో డాన్‌ జర్నలిస్టు సిరిల్‌ ఆల్మైడాకు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీచేసింది. కానీ అతడు కోర్టుకు హాజరుకాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్టోబర్‌ 8న అతన్ని కోర్టులో హాజరుపరచాల్సిందిగా పంజాబ్‌ డీఐజీని ఆదేశించింది. షరీఫ్‌ కోర్టుకు హాజరుకాకపోవడంపై  కూడా ఆయన న్యాయవాది నాసిర్‌ భుట్టోను ప్రశ్నించింది. దీనికి నాసిర్‌ ఆయన తదుపరి వాయిదాకు హాజరవుతారని తెలిపారు. భార్య చనిపోవడం వల్ల ఆయన బాధలో ఉన్నట్టు వివరించారు.

అక్రమాస్తులు కేసులో శిక్షలు అనుభవిస్తున్న షరీఫ్‌తోపాటు, ఆయన కుటుంబసభ్యులకు విధించిన జైలు శిక్ష రద్దు చేస్తూ ఇస్లామాబాద్‌ హైకోర్టు గతవారం ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement