ఢాకా: మైనారిటీ హిందువులే లక్ష్యంగా బంగ్లాదేశ్ యంత్రాంగం వ్యవహరిస్తున్నదనేందుకు తాజా ఉదాహరణ. మైనారిటీలకు రక్షణ కల్పించేందుకు చట్టాలు తేవాలంటూ ఇటీవల చత్తోగ్రామ్‌లో హిందువులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు కాషాయ జెండా ఎగురవేశారు. దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో 18 మందిపై దేశ ద్రోహ చట్టం కింద కేసు నమోదైంది. మరో 20 మంది వరకు గుర్తు తెలియని వ్యక్తులపైనా అక్టోబర్ 25న కేసు నమోదు చేశారు.
తమ 8 డిమాండ్ల అజెండాకు బంగ్లాదేశ్‌లోని అవామీ లీగ్, భారత ప్రభుత్వం సాయంగా నిలిచాయని పుండరీక్ ధామ్ ప్రెసిడెంట్, కేసు బాధితుడు అయిన చిన్మయ్ కృష్ణ దాస్ బ్రహ్మచారి తెలిపారు. తమ నిరసన బంగ్లా ప్రభుత్వానికి వ్యతిరేకం కానే కాద న్నారు. కాగా, ఈ చర్యను అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ సైతం ఎన్నికల ప్రచారంలో ఖండించడం గమనార్హం. ఇలా ఉండగా, హోం మంత్రిత్వ శాఖ అనుమతి ఉంటేనే తప్ప, పోలీస్‌స్టేషన్ ఇన్‌చార్జి దేశ ద్రోహం కేసును తనంత తానే నమోదు చేయలేరని పరిశీలకులు అంటున్నారు. నేరం రుజువైతే జీవిత కాల జైలు శిక్ష పడవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment