జైల్లో ఉన్న చిన్మయ్ దాస్‌ను కలిసేందుకు వెళ్లగా ఘటన
ఢాకాలోని ఇస్కాన్ కేంద్రంపై దాడి
ఢాకా: బంగ్లాదేశ్‌లో హిందువుల నిర్బంధం, అఘాయిత్యాలు కొనసాగుతున్నాయి. ముస్లిం అతివాదులు మైనారిటీలు, ముఖ్యంగా హిందువులు లక్ష్యంగా దాడులకు పాల్పడుతుండటం తెలిసిందే. ఇప్పటికే హిందూ మత పెద్ద చిన్మయ్ కృష్ణ దాస్‌ను దేశ ద్రోహం నేరం మోపి జైలులో పెట్టిన బంగ్లా మధ్యంతర ప్రభుత్వం తాజాగా ఆయన శిష్యులిద్దరినీ అరెస్ట్ చేసింది. ఇస్కాన్ కార్యాలయంపై శనివారం గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు.
చిట్టోగ్రామ్‌లోని జైలులో ఉన్న చిన్మయ్ దాస్‌కు గురువారం ఆహారం ఇచ్చేందుకు వెళ్లిన ఆయన శిష్యులు రుద్రకోటి కేశబ్ దాస్, రంగనాథ్ శ్యామ సుందర్ దాస్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని కుండలినీ ధామ్ మఠానికి చెందిన ప్రొఫెసర్ కుశాల్ బరుణ్ చక్రవర్తి తెలిపారు. ఈ విషయాన్ని కోల్‌కతా ఇస్కాన్ ఉపాధ్యక్షుడు రాధారాం దాస్ ‘ఎక్స్’లో వెల్లడించారు. ముందుగా ఎటువంటి హెచ్చరికలు లేకుండానే వీరిని నిర్బంధంలోకి తీసుకున్నారని వివరించారు. అదేవిధంగా, ఢాకాలోని కిశోర్‌గంజ్ జిల్లా భైరబ్‌లో ఉన్న ఇస్కాన్ కార్యాలయంపై దుండుగులు దాడి చేసిన దృశ్యాలను కూడా ఆయన పోస్ట్ చేశారు.
బంగ్లాదేశీయులకు ఆస్పత్రుల్లో నో ఎంట్రీ
కోల్‌కతా/అగర్తలా: బంగ్లాదేశీయులకు తాము వైద్యం చేయబోమని కోల్‌కతాలోని జేఎన్ రే హాస్పిటల్, త్రిపుర రాజధాని అగర్తలాలో ఉన్న ఐఎల్‌ఎస్ ఆస్పత్రి ప్రకటించాయి. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు, భారత జాతీయ పతాకాన్ని అవమానించిన ఘటనలకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి. తదుపరి నిర్ణయం ప్రకటించే వరకు బంగ్లాదేశ్ పౌరులను చేర్చుకోబోమని శుక్రవారం స్పష్టం చేశాయి.
అఘాయిత్యాలను అడ్డుకోండి: ఆర్‌ఎస్‌ఎస్
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతు న్న అఘాయిత్యాలపై రా్రïÙ్టయ స్వయంసేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్)తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. హిందువులపై దాడులను అరికట్టేందుకు చర్యలు తీ సుకోవాలని అక్కడి మధ్యంతర ప్రభుత్వాన్ని కోరింది. అదేవిధంగా, హిందూ మత పెద్ద చిన్మయ్ కృష్ణ దాస్‌ను తక్షణమే జైలు నుంచి విడుదల చేయాలంది. ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హొసబళె శనివారం ఈ మేరకు ఒక ప్రకటన చేశారు.
Comments
Please login to add a commentAdd a comment