లాహోర్: పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి నవాజ్ షరీష్ భారత్‌తో చేసుకున్న ఒప్పదంపై కీలక వ్యాఖ్యలు చేశారు. 1999లో తాను,అప్పటి భారత ప్రధాని అటల్ బిహారీ వాజపేయి సంతకాలు చేసిన ‘లాహోర్ డిక్లరేషన్’ఒప్పందం ఉల్లంఘించామని తెలిపారు. ఆయన మంగళవారం పాకిస్తాన్ ముస్లిం లీగ్(ఎన్) పార్టీ సమావేశంలో మాట్లాడారు.
‘మే 28, 1998న పాకిస్తాన్ ఐదు అణుబాంబు పరీక్షలు చేపట్టింది. అనంతరం భారత్ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి లాహోర్‌కు వచ్చారు. ఆయన మాతో లాహోర్ ఒప్పందం చేసుకున్నారు. అయితే ఆ ఒప్పందాన్ని మేం ఉల్లంఘించాము. అది మా తప్పే. అప్పటి అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ఉద్దేశపూర్వకంగా అగ్రిమెంట్‌ను అతిక్రమించారు’ అని అన్నారు.
మార్చి,1999లో ముషారఫ్ పాక్ ఆర్మీకి ఫోర్ స్టార్ జనరల్‌గా ఉన్నారు. లడ్డాక్‌లోని కార్గీల్‌లో రహస్యంగా చొరబాడటానికి ఆదేశించారు. ఈ విషయంతో అప్రమత్తమైన ఇండియా యుద్ధం చేసి విజయం సాధించింది. ఆ సమయంలోనే తాను ప్రధానిగా ఉన్నానని నవాజ్ షరీఫ్ గుర్తుచేశారు. పాకిస్తాన్ మొదటి అణు బాంబు పరీక్షించి 26 ఏళ్లు అవుతోందని తెలిపారు.
‘అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఆనాడు పాక్.. అణుపరీక్ష ఆపేందుకు 5 బిలియన్ డాలర్లను ఇస్తానని ఆఫర్ చేశాడు. కానీ, నేను అమెరికా అఫర్‌ను తిరస్కరించాను. ఆ సమయంలో మాజీ ప్రధానిగా ఇమ్రాన్ ఉండి ఉంటే క్లింటన్ ఆఫర్‌కు అంగీకరించేవాడు’అని ఇమ్రాన్‌పై విమర్శలు గుప్పించారు.
లాహోర్ డిక్లరేషన్ ఇరు దేశాల మధ్య ఏర్పాటు చేసుకున్న శాంతి ఒప్పందం. ఈ ఒప్పందంపై ఇరు దేశాల ప్రధానులు 21, ఫిబ్రవరి 1999లో సంతాకాలు చేశారు. అనంతరం పాకిస్తాన్ జమ్ము కశ్మీర్‌లోని కార్గిల్‌లోకి చొరబడటంతో యుద్ధానికి దారి తీసింది. ఈ యుద్ధంలో భారత్ విజయం సాధించింది. ఇక..ద తాజాగా మంగళవారం నవాజ్ షరీష్ మరోసారి పీఎంఎల్-ఎన్ పార్టీకి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment