
లఖ్వీ విడుదల దురదృష్టకరం: రాజ్ నాథ్
న్యూఢిల్లీ: పాకిస్థాన్ జైలులో ఉన్న ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారి, లష్కరే తోయిబా ఆపరేషన్స్ కమాండర్ జకీవుర్ రెహ్మన్ లఖ్వీని విడుదల చేయడంపై భారత ప్రభుత్వం స్పందించింది. లఖ్వీని విడుదల చేయడం దురదృష్టకరం, నిరుత్సాహకరమని పేర్కొంది.
'పాకిస్థాన్ చర్చలు జరపాలని భారత్ కోరుకుంటోంది. కానీ లఖ్వీ విషయంలో పాకిస్థాన్ నిర్ణయం దురదృష్టకరం, నిరుత్సాహకరం ' అని హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. 26/11 ముంబై ముట్టడి కుట్రదారుడైన లఖ్వీని పాకిస్థాక్ కోర్టు శుక్రవారం విడుదల చేసింది.