
లఖ్వీకి వ్యతిరేకంగా మెజిస్ట్రేటు వాంగ్మూలం
ఇస్లామాబాద్: 2008 నాటి ముంబై దాడుల సూత్రధారి జకీవుర్ రెహ్మాన్ లఖ్వీకి వ్యతిరేకంగా.. ఆ కేసును విచారిస్తున్న ఉగ్రవాద వ్యతిరేక కోర్టులో ఒక జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ వాంగ్మూలం ఇచ్చారు. లఖ్వీ సహా ఏడుగురు నిందితులకు వ్యతిరేకంగా ఇద్దరు వ్యక్తులు ఇచ్చిన సాక్ష్యాలను తాను నమోదు చేశానని మేజిస్ట్రేట్ అక్రమ్ అబ్బాసీ రావల్పిండిలోని అదియాలా జైల్లో బుధవారం జరిగిన విచారణలో స్పష్టం చేశారు. వాటిని కోర్టు ముందుంచినట్లు తెలిపారు.
లఖ్వీ ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నాడు. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ లఖ్వీ దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు ఇంకా ఏ నిర్ణయం తీసుకోనప్పటికీ.. బుధవారం నాటి విచారణకు లఖ్వీ హాజరు కాలేదు.