anti-terrorism court
-
కోర్టులో పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఊరట
ఇస్లామాబాద్ కోర్టులో పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఊరట లభించింది. తనపై నమోదైన తీవ్రవాద ఆరోపణలకు చెందిన ఎనిమిది కేసుల్లో బెయిల్ లభించింది. ఇస్లామాబాద్‌లోని ఉగ్రవాద నిరోధక కోర్టు మంగళవారం ఇమ్రాన్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఇమ్రాన్‌కు పాక్ మిలటరీ, ప్రభుత్వం నుంచి కాస్తా ప్రశాంతత దక్కినటైంది. కాగా పీటీఐ చీఫ్‌కు 8 వరకు బెయిల్ లభించిందని ఆయన న్యాయమూర్తి మహమ్మద్ అలి బోఖారి తెలిపారు. కాగా పాకిస్థాన్ ప్రధానిగా ఉన్నప్పుడు అవినీతికి పాల్పడ్డారని ఇమ్రాన్ ఖాన్‌పై దాదాపు 150 కేసులు నమోదయ్యాయి. పదవిలో ఉన్నప్పుడు అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అల్ ఖదీర్ ట్రస్ట్ కేసును విచారిస్తున్న ‘నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో’ ముందు ఇమ్రాన్ హాజరు కావాల్సి ఉంది. అయితే విచారణకు ముందే మళ్లీ తనని అరెస్టు చేసే అవకాశం 80 శాతం ఉందని పీటీఐ చీఫ్ హెచ్చరించారు. ఒకవేళ తనను కస్టడీలోకి తీసుకున్నా శాంతియుతంగా ఉండాలని ఆయన తన మద్దతుదారులకు సూచించారు. ఇదిలా ఉండగా అల్-ఖాదిర్ ట్రస్ట్ కేసుకు సంబంధించి నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో ముందు హాజరు కావడానికి కొన్ని గంటల ముందు ఇమ్రాన్ భార్య బుష్రా బీబీ అకౌంటబిలిటీ కోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందింది. మే 31 వరకు బెయిల్ మంజూరు చేసింది. చదవండి: విపత్తు దిశగా పాక్.. పిరికిపందల్లా పారిపోను: ఇమ్రాన్ ఖాన్ -
సయీద్‌కు 11 ఏళ్ల జైలు
లాహోర్: ముంబై ఉగ్రదాడుల సూత్రధారి, జమాత్ ఉద్ దవా అధ్యక్షుడు హఫీజ్ సయీద్‌కు పాక్‌లో జైలు శిక్ష పడింది. ఉగ్రవాదానికి నిధులు అందించారన్న కేసులో విచారణ జరిపిన పాకిస్తాన్‌లోని ఉగ్రవ్యతిరేక (ఏటీసీ) పదకొండేళ్ల జైలుశిక్ష విధిస్తూ బుధవారం తీర్పు చెప్పింది. సయీద్‌తోపాటు అతడి సన్నిహిత సహచరుడు జఫర్ ఇక్బాల్‌కూ 11 ఏళ్ల శిక్ష విధిస్తూ ఏటీసీ జడ్జి అర్షద్ హుస్సేన్ భుట్టా ఆదేశాలు జారీ చేశారు. సయీద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్య సమితి గతంలోనే ప్రకటించింది. అతడి తలకు అమెరికా గతంలో కోటి డాలర్ల వెలకట్టింది. గత ఏడాది జూలై 17న అరెస్ట్ అయిన సయీద్ లాహోర్‌లోని కోట్ లఖ్‌పత్ జైల్లో ఉన్నారు. లాహోర్, గుజ్రన్‌వాలాల్లో దాఖలైన రెండు కేసుల్లో సయీద్‌కు శిక్ష విధించారని, ఒక్కో కేసులో ఐదున్నర ఏళ్లు జైలు శిక్ష, మొత్తం 15 వేలరూపాయల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చిందని, రెండు శిక్షలు ఒకేసారి అమలవుతాయని కోర్టు అధికారి ఒకరు తెలిపారు. ఏటీసీ కోర్టు గత ఏడాది డిసెంబర్ 11న సయీద్, అతడి సన్నిహిత సహచరులను దోషులుగా ప్రకటించగా..శిక్ష ఖరారును ఫిబ్రవరి 11వ తేదీ వరకూ వాయిదా వేయడం తెల్సిందే. ఉగ్రవాదానికి ఆర్థిక సాయం అందిస్తున్న వ్యక్తులు, సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామన్న పాకిస్తాన్ హామీని నెరవేర్చాలని పారిస్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ ఒకటి ఇచ్చిన పిలుపుతో పాక్ ప్రభుత్వం సయీద్, అతడి అనుచరులపై విచారణ ప్రారంభించింది. -
ఉగ్ర సయీద్ దోషే
లాహోర్: ముంబై ఉగ్రదాడుల వ్యూహకర్త, నిషేధిత ఉగ్రవాద సంస్థ జమాత్ ఉద్ దావా అధ్యక్షుడు హఫీజ్ సయీద్‌ను పాకిస్తాన్ కోర్టు ఒకటి దోషిగా ప్రకటించింది. పంజాబ్ ప్రాంతంలోని పలు నగరాల్లో సయీద్ ఉగ్రవాదానికి ఆర్థిక సాయం అందించారని స్పష్టం చేస్తూ యాంటీ టెర్రరిజమ్ కోర్టు జడ్జి మాలిక్ అర్షద్ భుట్టా తీర్పునిచ్చారు. పంజాబ్ ప్రావిన్స్‌కు చెందిన ఉగ్రవాద వ్యతిరేక విభాగం ఈ ఏడాది జూలైలో సయీద్, అతడి అనుచరులపై ఈ కేసు దాఖలు చేసింది. హఫీజ్ సయీద్‌ను అరెస్ట్ చేసి కోట్ లఖ్‌పత్ జైల్లో ఉంచింది. పంజాబ్‌తోపాటు లాహోర్, గుజ్రన్‌వాలా, ముల్తాన్ నగరాల్లో ఉగ్రవాదానికి ఆర్థిక సాయం అందించే లక్ష్యంతో సయీద్, అతడి అనుచరులు నిధులు సేకరించారని పోలీసులు ఆరోపిస్తున్నారు. -
లఖ్వీకి వ్యతిరేకంగా మెజిస్ట్రేటు వాంగ్మూలం
ఇస్లామాబాద్: 2008 నాటి ముంబై దాడుల సూత్రధారి జకీవుర్ రెహ్మాన్ లఖ్వీకి వ్యతిరేకంగా.. ఆ కేసును విచారిస్తున్న ఉగ్రవాద వ్యతిరేక కోర్టులో ఒక జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ వాంగ్మూలం ఇచ్చారు. లఖ్వీ సహా ఏడుగురు నిందితులకు వ్యతిరేకంగా ఇద్దరు వ్యక్తులు ఇచ్చిన సాక్ష్యాలను తాను నమోదు చేశానని మేజిస్ట్రేట్ అక్రమ్ అబ్బాసీ రావల్పిండిలోని అదియాలా జైల్లో బుధవారం జరిగిన విచారణలో స్పష్టం చేశారు. వాటిని కోర్టు ముందుంచినట్లు తెలిపారు. లఖ్వీ ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నాడు. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ లఖ్వీ దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు ఇంకా ఏ నిర్ణయం తీసుకోనప్పటికీ.. బుధవారం నాటి విచారణకు లఖ్వీ హాజరు కాలేదు. -
డైవోర్స్ ఇచ్చిందని యాసిడ్ దాడి, 117ఏళ్ల జైలు
కరాచీ: తనకు విడాకులు ఇచ్చి వేరే పెళ్లి చేసుకున్న మాజీ భార్య, ఆమె భర్తపై యాసిడ్ దాడి చేసిన ఘటనలో ఓ వ్యక్తికి కోర్టు ఏకంగా 117 ఏళ్లపాటు జైలుశిక్ష విధించింది. పాకిస్తాన్‌లోని లాహోర్ ముల్తాన్ జిల్లాకు చెందిన మహ్మద్ అంజాద్ గత ఏడాది డిసెంబర్లో మాజీ భార్య జావెదన్ బీబీ, ఆవిడ రెండో భర్త మహమ్మద్ రియాజ్‌పై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన జావెద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఇక మహమ్మద్ రియాజ్ చికిత్స అనంతరం ప్రాణాపాయ స్థితి నుంచి బయట పడ్డాడు. అయితే తనకు విడాకులు ఇచ్చి వేరే పెళ్లి చేసుకున్నందునే దాడి చేసినట్లు మహ్మద్ అంజాద్ నేరాన్ని అంగీకరించాడు. దాంతో జిల్లా యాంటీ టెర్రరిజం కోర్టు నిందితుడికి కఠిన కారాగార శిక్ష విధించటమే కాకుండా, రూ.10 లక్షల జరిమానా కూడా విధించింది.