కరాచీ: తనకు విడాకులు ఇచ్చి వేరే పెళ్లి చేసుకున్న మాజీ భార్య, ఆమె భర్తపై యాసిడ్ దాడి చేసిన ఘటనలో ఓ వ్యక్తికి కోర్టు ఏకంగా 117 ఏళ్లపాటు జైలుశిక్ష విధించింది. పాకిస్తాన్లోని లాహోర్ ముల్తాన్ జిల్లాకు చెందిన మహ్మద్ అంజాద్ గత ఏడాది డిసెంబర్లో మాజీ భార్య జావెదన్ బీబీ, ఆవిడ రెండో భర్త మహమ్మద్ రియాజ్పై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు.
ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన జావెద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఇక మహమ్మద్ రియాజ్ చికిత్స అనంతరం ప్రాణాపాయ స్థితి నుంచి బయట పడ్డాడు. అయితే తనకు విడాకులు ఇచ్చి వేరే పెళ్లి చేసుకున్నందునే దాడి చేసినట్లు మహ్మద్ అంజాద్ నేరాన్ని అంగీకరించాడు. దాంతో జిల్లా యాంటీ టెర్రరిజం కోర్టు నిందితుడికి కఠిన కారాగార శిక్ష విధించటమే కాకుండా, రూ.10 లక్షల జరిమానా కూడా విధించింది.
డైవోర్స్ ఇచ్చిందని యాసిడ్ దాడి, 117ఏళ్ల జైలు
Published Sat, May 9 2015 12:20 PM | Last Updated on Fri, Aug 17 2018 2:10 PM
Advertisement