న్యూయార్క్: ముంబై దాడుల సూత్రధారి లష్కరే తోయిబా కమాండర్ జకీర్ రెహమాన్ లఖ్వీని విడుదల చేసిన పాకిస్తాన్‌పై చర్యను కోరుతూ ఐక్యరాజ్యసమితి (ఐరాస)లో భారత్ చేసిన డిమాండ్‌కు చైనా అడ్డుకట్ట వేసింది. ఐరాస తీర్మానాన్ని ఉల్లంఘించి లఖ్వీని జైలు నుంచి విడుదల చేసిన పాక్‌పై చర్య తీసుకోవాలన్న భారత్ అభ్యర్థన మేరకు ఐరాస ఆంక్షల కమిటీ ఇక్కడ సమావేశమైంది. లఖ్వీ విడుదలపై పాక్‌ను వివరణ కోరాలని నిర్ణయించింది.
అయితే భారత్ పూర్తి సమాచారం ఇవ్వలేదంటూ ఈ నిర్ణయానికి చైనా అడ్డుకట్ట వేసిందని అధికార వర్గాలు తెలిపాయి. పాక్ కోర్టు లఖ్వీని విడుదల చేస్తూ తీసుకున్న నిర్ణయం ఐరాస తీర్మానాన్ని ఉల్లంఘించడమేనని ప్రస్తుత ఐరాస ఆంక్షల కమిటీ చైర్మన్ జిమ్ మెక్ లే, ఐరాస భారత శాశ్వత ప్రతినిధి అశోక్ ముఖర్జీ గత నెలలోనే ఒక ప్రకటనలో వ్యాఖ్యానించారు. చైనా చర్యపై భారత ప్రధాని నరేంద్రమోదీ అసంతృప్తిని వ్యక్తం చేశారు. చైనా ప్రభుత్వానికి తన నిరసనను తెలిపారు.
పాక్‌పై చర్యకు మన ముందడుగు.. చైనా తొండి
Published Wed, Jun 24 2015 2:23 AM | Last Updated on Sat, Mar 23 2019 8:09 PM
Advertisement
Advertisement