లఖ్వీని విడుదల చేయండి: పాక్ కోర్టు
లష్కరే తాయిబా ఆపరేషన్స్ కమాండర్, 26/11 ముంబై దాడుల ప్రధాన సూత్రధారి జకీ ఉర్ రహమాన్ లఖ్వీపై నిర్బంధాన్ని రద్దుచేసి, తక్షణమే అతణ్ని విడుదల చేయాలని లాహోర్ హైకోర్టు గురువారం పాక్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
లాహోర్ హైకోర్టు న్యాయమూర్తి మహ్మద్ అన్వర్ ఉల్ హక్ తీర్పును వెలువరిస్తూ,, పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ కింద లఖ్వీని నిర్బంధించిన పంజాబ్ ప్రభుత్వం అతనిని దోషిగా నిరూపించే సాక్ష్యాధారాల్ని సమర్పించలేకపోయినందున నిర్బంధాన్ని ఎత్తివేస్తూ విడుదలకు ఆదేశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఒకొక్కటి రూ.10 లక్షల విలువైన రెండు సెక్యూరిటీ బాండ్లను పూచికత్తుగా సమర్పించాలని లఖ్వీ తరఫు న్యాయవాదికి సూచించారు. కావాలసిన ఆధారాలన్నింటిని సమర్పించినప్పటికీ కోర్టు తమ వాదనను పరిగణనలోకి తీసుకోకుండా లఖ్వీ విడుదలకు మొగ్గుచూపిందని హైకోర్టు ఉన్నతాధికారులు చెప్పారు.