న్యూఢిల్లీ: అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న ఉగ్రవాదులు హఫీజ్ సయీద్, జకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీల ఆస్తులను సీజ్ చేయాలని పాకిస్తాన్‌ను భారత్ కోరనుంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆంక్షల జాబితాలో ఉన్న ఈ ముగ్గురు పాక్‌లో ఉన్నందున ఆ దేశం వీరి ఆస్తులను సీజ్ చేయాల్సి ఉంటుంది. ఐరాస మండలిలోని అల్ కాయిదా, తాలిబాన్ ఆంక్షల కమిటీ దావూద్‌పై 2003లో, లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు సయీద్, ముంబై ఉగ్రదాడుల సూత్రధారి లఖ్వీలపై 2008లో ఆంక్షలు విధించింది.
అందువల్ల వీరి ఆస్తులను సీజ్ చేయడం ఐరాస సభ్య దేశమైన పాక్ బాధ్యత. ‘ఈ ముగ్గురి ఆస్తులను సీజ్ చేశారో లేదో తెలుసుకోవాలనుకుంటున్నాం. ఒకవేళ సీజ్ చేయకుంటే ఇప్పుడు తక్షణమే వారి ఆస్తులను సీజ్ చేయండి. దీనిపై పాక్‌కు త్వరలోనే లేఖ రాయాలనుకుంటున్నాం’ అని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ఐరాస ఆంక్షల జాబితాలో ఉంటే వారి ఆస్తులను సీజ్ చేయడంతోపాటు వారి ఆయుధాలను, ప్రయాణాలను నిషేధించాల్సి ఉంటుంది.
‘దావూద్, సయీద్ ఆస్తులను సీజ్ చేయండి’
Published Mon, May 25 2015 2:51 AM | Last Updated on Sun, Sep 3 2017 2:37 AM
Advertisement