సాక్షి, హైదరాబాద్ : దుబ్బాక ఉప ఎన్నికలో సంచలన విజయాన్ని నమోదు చేసిన బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు ప్రమాణ స్వీకారానికి సిద్ధమయ్యారు. 18వ తేదీన మధ్యాహ్నం ఒంటి గంటకు దుబ్బాక ఎమ్మెల్యేగా రఘునందన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేకెత్తించిన దుబ్బాక ఫలితాల్లో 1079 ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థిగా విజయం సాధించిన విషయం తెలిసిందే. అనూహ్య రీతిలో అధికార టీఆర్‌ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతపై గెలుపొందారు. ఈ విజయంతో రాష్ట్ర వ్యాప్తంగా రఘునందన్ ఒక్కసారిగా హాట్‌టాపిక్‌గా మారారు. తాజాగా ప్రమాణస్వీకారానికి సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు అభినందనలు వెళ్లువెత్తుతున్నాయి. (దుబ్బాకలో బీజేపీ సంచలన విజయం)
Comments
Please login to add a commentAdd a comment