నాలుగు భాషల్లో థ్రిల్‌ | Sumanth Ashwin's next is a quadrilingual horror-thriller | Sakshi
Sakshi News home page

నాలుగు భాషల్లో థ్రిల్‌

Published Thu, Nov 1 2018 1:05 AM | Last Updated on Thu, Nov 1 2018 1:05 AM

Sumanth Ashwin's next is a quadrilingual horror-thriller - Sakshi

సుమంత్‌ అశ్విన్‌, శ్రీనివాసరాజు

లవర్‌బాయ్‌ ఇమేజ్‌ ఉన్న సుమంత్‌ అశ్విన్‌ ప్రేక్షకులను భయపెట్టేందుకు రెడీ అయ్యారు. ఆయన హీరోగా ‘దండుపాళ్యం’ ఫేమ్‌ శ్రీనివాసరాజు దర్శకత్వంలో ఓ భారీ హారర్‌ థ్రిల్లర్‌ సినిమా రూపుదిద్దుకోనుంది. జ్యోస్టార్‌ ఎంటర్‌ప్రైజెస్‌ పతాకంపై ‘గరుడవేగ’ వంటి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను నిర్మించిన ఎం.కోటేశ్వరరాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో చిత్రీకరణ జరుపుకోనున్న ఈ చిత్రం ఈ నెల రెండో వారంలో ప్రారంభం కానుంది. శ్రీనివాసరాజు మాట్లాడుతూ– ‘‘చాలా మంచి సబ్జెక్ట్‌ ఇది.

అందుకే నాలుగు భాషల్లో తెరకెక్కిస్తున్నాం. ఇతర పాత్రల్లో భారీ తారాగణం నటిస్తారు. రీ–రికార్డింగ్‌కి ఎక్కువ ప్రాధాన్యం ఉన్న హారర్‌ థ్రిల్లర్‌ ఇది. అందుకే మణిశర్మగారు ఈ సినిమాకి మ్యూజిక్‌ చేస్తున్నారు. హారర్‌ థ్రిల్లర్స్‌లోనే ఈ సినిమా ఓ కొత్త ట్రెండ్‌ సెట్టర్‌ అవుతుంది’’ అన్నారు. ‘‘ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ స్టార్ట్‌ అయింది. నాలుగు భాషల్లో ఒకేసారి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ విజయ్‌వర్మ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా శ్యామ్‌ప్రసాద్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement