ప్రభాస్‌.. ‘రాజా సాబ్‌’లో ఆత్మ...? | The Raja Saab Latest Update | Sakshi
Sakshi News home page

ప్రభాస్‌.. ‘రాజా సాబ్‌’లో ఆత్మ...?

Published Sun, Apr 7 2024 2:16 AM | Last Updated on Sun, Apr 7 2024 5:11 AM

The Raja Saab Latest Update - Sakshi

రాజా సాబ్‌తో ఆత్మరూపంలో మాట్లాడుతున్నారట సంజయ్‌ దత్‌. ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రాజా సాబ్‌’. ఈ హారర్‌ థ్రిల్లర్‌ మూవీకి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో మాళవికా మోహనన్, నిధీ అగర్వాల్, రిద్ది కుమార్‌ హీరోయిన్లుగా, ఓ కీలక పాత్రలో సంజయ్‌ దత్‌ కనిపిస్తారనే టాక్‌ ఎప్పట్నుంచో వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. 

‘రాజాసాబ్‌’ తాత–మనవడి నేపథ్యంలో సాగే కథ అని, ప్రభాస్‌కు తాతగా సంజయ్‌ దత్‌ కనిపిస్తారని టాక్‌. అంతేకాదు.. ఈ సినిమాలో ఆత్మ రూపంలో ప్రభాస్‌తో సంజయ్‌ దత్‌ మాట్లాడిన తర్వాతే కథ కీలక మలుపు తిరుగుతుందని ఫిల్మ్‌నగర్‌ భోగట్టా. మరి.. సంజయ్‌ దత్‌ ఆత్మగా ప్రభాస్‌తో ఏం చె΄్పారు? అనేది తెలియాలంటే ‘రాజా సాబ్‌’ చిత్రం రిలీజయ్యే వరకు ఎదురు చూడాల్సిందే. ఈ సినిమా వచ్చే ఏడాదిప్రారంభంలో రిలీజ్‌ అయ్యే అవకాశం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement