Actor Sumanth Ashwin Interesting Comments About 7 Days 6 Nights Movie, Deets Inside - Sakshi
Sakshi News home page

Sumanth Ashwin: ఎన్ని జన్మలెత్తినా ఎంఎస్ రాజు గారి అబ్బాయిలాగే పుట్టాలి

Published Sat, Jun 18 2022 4:23 PM | Last Updated on Sat, Jun 18 2022 4:41 PM

Sumanth Ashwin Talk About 7 Days 6 Nights - Sakshi

మా నాన్న(నిర్మాత, దర్శకుడు ఎంఎస్‌ రాజు) ఎలాంటి ఫాదర్‌ అని ఎప్పుడు ఆలోచించలేదు. నాకు ఏది కావాలంటే అది ఇచ్చారు. ఆయనే ఫర్ఫెక్ట్‌ ఫాదర్‌. మరో జన్మంటూ ఉంటే.. దేవుడు వచ్చి ఏం కావాలని అడిగితే.. మళ్లీ ఎంఎస్‌ రాజు దంపతులు కడుపునే పుట్టాలని కోరుకుంటా’అని యంగ్‌ హీరో సుమంత్‌ అశ్విన్‌ అన్నారు. సుమంత్‌ అశ్విన్‌, రోహన్‌ హీరోలుగా ఎంఎస్‌ రాజ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘7 డేస్‌ 6నైట్స్‌’.సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో సుమంత్ అశ్విన్ .ఎం, రజనీకాంత్ .ఎస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. వైల్డ్ హనీ ప్రోడక్షన్స్, వింటేజ్ పిక్చర్స్ మరియు ఏబిజి క్రియేషన్స్ వారు చిత్రనిర్మాణంలో భాగస్వాములు. జూన్ 24న సినిమా విడుదల అవుతోంది. ఈ సందర్భంగా సుమంత్ అశ్విన్‌ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..

నా కెరీర్‌లో సక్సెస్ ఫుల్ సినిమాలు ఉన్నాయి. డిజప్పాయింట్ చేసినవీ ఉన్నాయి. అయితే, ఈ జర్నీ చాలా అందంగా ఉంది. నా తొలి మూవీ'తూనీగ తూనీగ’విడుదలైన 10 ఏళ్లు కావోస్తుంది. ఈ పదేళ్ల కూడా చాలా స్పీడ్‌గా వెళ్లింది.

'తూనీగ తూనీగ' కోసం మూడు నాలుగు సినిమాలకు పెట్టినంత ఎఫర్ట్ పెట్టాం. ప్రశంసలు వచ్చాయి కానీ ఆశించిన వసూళ్లు రాలేదు. కొన్ని సినిమాలు పేపర్ మీద బావుంటాయి. ఎక్కడో చిన్న తప్పు వల్ల అనుకున్న ఫలితాలు రాకపోవచ్చు. అయితే, మనం చేసే హార్డ్ వర్క్ విషయంలో ఎటువంటి లోపం ఉండకూడదు. 

ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలతో కంపేర్‌ చేస్తే..'7 డేస్ 6 నైట్స్’లో డిఫరెంట్‌ రోల్‌ చేశా.రియాలిటీకి దగ్గరగా ఉన్న పాత్ర అది.  ఇప్పుడు ప్రేక్షకులు కూడా డిఫరెంట్ రోల్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు. కరోనా వల్ల కావచ్చు, మరొకటి కావచ్చు... ప్రేక్షకులు వరల్డ్ సినిమా చూశారు. అప్‌డేట్‌ అయ్యారు. వేరే లెవెల్‌లో ఉన్నారు. వాళ్ళకు రీచ్ అవ్వాలంటే మనం కూడా నెక్స్ట్ లెవెల్ థింగ్స్ చేయాలి. టైమ్ పట్టినా కొత్త రోల్స్ చేయాలనుకుంటున్నాను.   

ఈ సినిమాలో నేను ఒక నార్మల్‌ యంగ్‌స్టర్‌ పాత్ర చేశాను. అతను ఫిల్మ్ మేకర్ అవ్వాలని అనుకుంటాడు. జీవితంలో తనకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. స్ట్రగుల్ అవుతూ ఉంటాడు. ఎక్కువ స్మోక్ చేస్తాడు. వెయిట్ చేస్తాడు. తన మీద కేర్ తీసుకోడు. అటువంటి మనిషి ఎలా ఉంటాడో... నా లుక్ కూడా అలాగే ఉంటుంది.  

ఇందులో రోహన్‌ది ఇంపార్టెంట్ రోల్. అతడిని నాన్నే సెలెక్ట్ చేశారు. ముందు ఎస్టాబ్లిష్ హీరోని తీసుకుంటే బావుంటుందని అనుకున్నా. సినిమా చూశాక పర్ఫెక్ట్ కాస్టింగ్ అనిపించింది. మెహర్ ఎంత బాగా చేసిందంటే... ఆమెను 'సతి' సినిమాలో కూడా తీసుకున్నాం. 

నాన్న(ఎంఎస్‌ రాజు) ఇప్పుడు ఫుల్‌ ఫైర్‌లో ఉన్నాడు. ఎంఎస్ రాజు 2.0 అనుకోవచ్చు. 'డర్టీ హరి'తో ఆయన ప్రూవ్ చేసుకున్నారు.  నాన్నతో సన్నిహితంగా ఉంటాను కాబట్టి ఆయనేంటో నాకు తెలుసు. 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' తర్వాత మధ్యలో ఎక్కడో 'ప్రేక్షకులకు ఏం కావాలో అదే ఇవ్వాలి. సేఫ్ గేమ్... ఫ్యామిలీలు, టార్గెట్ ఆడియన్స్' అంటూ చేసిన సినిమాలు కథల పరంగా కొంత డిజప్పాయింట్ చేసి ఉండొచ్చు. అవన్నీ పక్కన పెట్టి... నాన్నగారు కంప్లీట్ అప్ గ్రేడ్ అయ్యి సినిమాలు చేస్తున్నారు. నాకు అది బాగా నచ్చింది. '7 డేస్ 6 నైట్స్'లో ఎంఎస్ రాజు మార్క్ ఉంటుంది. అదే సమయంలో 20 ఏళ్ళ దర్శకుడు తీసినట్టు ఉంటుంది. 

 చిన్నప్పుడు, బాగా వెయిట్ ఉండేవాడిని. అప్పుడు వెంకటేష్, ప్రభాస్, మహేష్ బాబు గారిని చూస్తే ఫిట్‌గా, హ్యాండ్సమ్‌గా ఉండేవారు. మంచి డ్రస్సులు వేసుకునేవారు. నేను వెయిట్ వల్ల  అటువంటి డ్రస్సులు వేసుకోలేకపోయేవాడిని. డ్యాన్సులు చేసేవారు. షూటింగ్స్ చేసేటప్పుడు వాళ్ళను చూసి... నేను అలా చేయలేనని అనుకున్నా. అప్పుడు సినిమాటోగ్రాఫర్ లేదా డైరెక్టర్ కావాలనుకున్నా. 'వర్షం' సమయంలో నిక్సన్ మాస్టర్ పరిచయం అయ్యారు. ఆయన దగ్గర ఏరోబిక్, డ్యాన్సులో కొన్ని క్లాసులు తీసుకున్నా. అప్పుడు వెయిట్ తగ్గా. మా సినిమాల్లో హీరో హీరోయిన్ల ఫోటోషూట్స్ టైమ్‌లో వెళితే... నా ఫోటోలు కొన్ని తీశారు. అవి త్రివిక్రమ్ గారు, ప్రభుదేవా గారు చూసి 'చాలా బావున్నాడు. బాడీ బిల్డ్ చేస్తే మంచి హీరో అవుతాడు' అని చెప్పారు. నా మనసులో అది ఉండిపోయింది. దాంతో ముంబై వెళ్లి యాక్టింగ్ కోర్స్ చేశా. హీరో కావాలనుకున్నా.

► నాకు బోల్డ్ అనే పదం నచ్చదు. యువత అడల్ట్ కంటెంట్ కోసం థియేటర్లకు రావాల్సిన అవసరం లేదు. ఎవరూ రారు కూడా! ఇంటర్నెట్‌లో బోలెడు కంటెంట్ ఉంది. కథ ఉంటేనే ఎవరైనా థియేటర్లకు వస్తారు.'7 డేస్ 6 నైట్స్' ఫ్యామిలీతో చూసే మూవీ 

► 'డర్టీ హరి'తో నిర్మాతలకు మంచి లాభాలు వచ్చాయి. దాని తర్వాత ఏ సినిమా చేయాలని నాన్న ఆలోచిస్తున్నారు. ఆయన దగ్గర ఆరేడు కథలు ఉన్నాయి. అందులో ఇది చేద్దామని అనుకున్నప్పుడు... నేను ప్రొడ్యూస్ చేయాలనుకున్నా. చిరంజీవి గారి దగ్గర నుంచి ఇండస్ట్రీలో చాలా మంది  దర్శక, నిర్మాతలు నాన్నగారిని హానీ అని పిలుస్తారు. 'డర్టీ హరి' తర్వాత నాన్నగారు వైల్డ్ గా అనిపించారు. అందుకని 'వైల్డ్ హనీ ప్రొడక్షన్స్' అని పేరు పెట్టా.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement