7 Days 6 Nights
-
ఓటీటీకి 7 డేస్ 6 నైట్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే
సుమంత్ అశ్విన్, రోహన్ హీరోలుగా మెహర్ చాహల్, కృతికా శెట్టి హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘7 డేస్ 6 నైట్స్’. సుమంత్ అశ్విన్ .ఎం, రజనీకాంత్ .ఎస్ నిర్మించిన ఈ సినిమా జూన్ 24న విడుదలైన ఈ చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది. చాలా గ్యాప్ అనంతరం ఈ మూవీ మంచి కంబ్యాక్ ఇస్తుందని ఆశించిన సుమంత్‌కు ఈ సినిమా నిరాశే మిగిల్చింది. చదవండి: చై-సామ్ విడాకులపై సమంత తండ్రి ఎమోషనల్ పోస్ట్ ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో ఈ చిత్రం త్వరలో విడుదల కాబోతోంది. తాజాగా మూవీ స్ట్రీమింగ్ డేట్‌ను ఆహా అధికారికంగా ప్రకటించింది. సెప్టెంబర్ 9న ఈ సినిమా స్ట్రీమింగ్ కానుందని వెల్లడిస్తూ.. ట్రైలర్ విడుదల చేసింది ఆహా. మరి బాక్సాఫీసు వద్ద బొల్తా పడ్డ ఈ చిత్రం ఓటీటీ ఏమేర ఆకట్టుకుంటుందో చూడాలి. -
‘7 డేస్ 6 నైట్స్’ వసూళ్లు పెరుగుతున్నా చిన్న వెలితి: ఎంఎస్ రాజు
‘‘మా ‘7 డేస్ 6 నైట్స్’ సినిమాని ప్రేక్షకులతో కలిసి థియేటర్లో చూశాను.. వారు బాగా ఎంజాయ్ చేస్తున్నారు.. చాలా సంతోషంగా అనిపించింది’’ అని డైరెక్టర్ ఎంఎస్ రాజు అన్నారు. సుమంత్ అశ్విన్, రోహన్ హీరోలుగా మెహర్ చాహల్, కృతికా శెట్టి హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘‘7 డేస్ 6 నైట్స్’. సుమంత్ అశ్విన్ .ఎం, రజనీకాంత్ .ఎస్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదలయింది. (చదవండి: అప్పుడు నాకు ఆ సెన్స్, జ్ఞానం లేదు: నాగబాబు) ఈ చిత్రం సక్సెస్ మీట్లో చిత్రదర్శకుడు ఎంఎస్ రాజు మాట్లాడుతూ– ‘‘శంకరాభరణం’ నుంచి ఇప్పటివరకు క్లాసిక్ సినిమాల వసూళ్లు మౌత్ టాక్ వల్ల పెరిగాయి. మా సినిమాకి కూడా మౌత్ టాక్‌తో ప్రతి షోకి అన్ని చోట్ల వసూళ్లు పెరుగుతుండటం హ్యాపీ. అయితే, ఒక చిన్న వెలితి. ఈ రోజు తెలుగు ఇండస్ట్రీ పెద్ద సినిమాలకు మాత్రమే పరిమితం అయ్యిందనేది చాలా మంది ఉద్దేశం. ఇప్పుడు దాసరి నారాయణరావుగారిలా, కె.బాలచందర్గారిలా చిన్న సినిమాలు, ప్రయోగాత్మక చిత్రాలు చేస్తే?, ఈ రోజు ‘హ్యాపీ డేస్’ లాంటి సినిమాలు వస్తే? పరిస్థితి ఏంటి? అని ఆలోచించాల్సిన పరిస్థితి. చిన్న సినిమాలకు, నాలుగు కోట్ల బడ్జెట్ లోపు చిత్రాలకు టికెట్ రేట్లు తగ్గించాలి. రూ.200 టికెట్ పెట్టి చిన్న సినిమాలను ఎవరు చూస్తారు?. ప్రభుత్వాలతో చర్చించి ధర తగ్గించేలా నిర్ణయం తీసుకోవాలి’’ అన్నారు. -
కొత్త హీరోయిన్లు అని అలుసుగా చూడలేదు: ఎంఎస్ రాజు
'డర్టీ హరి'తో గతేడాది బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న ఎంఎస్ రాజు దర్శకత్వం వహించిన తాజా సినిమా '7 డేస్ 6 నైట్స్'. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో సుమంత్ అశ్విన్, ఎస్.రజనీకాంత్ నిర్మించారు. సుమంత్ అశ్విన్, రోహన్ హీరోలు. మెహర్ చాహల్, కృతికా శెట్టి హీరోయిన్లు. ఈ సినిమా శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఎంఎస్ రాజుతో ఇంటర్వ్యూ... '7 డేస్ 6 నైట్స్' కథకు మూలం ఏమిటి? మీ మనసులో ఎప్పుడు ఈ ఆలోచన వచ్చింది? నేను మొదటి నుంచి న్యూ జనరేషన్ సినిమాలతో పాటు పాత చిత్రాలు చూస్తుంటాను. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మలయాళం... ఎపిక్ సినిమాలు చూస్తా. ఆ సినిమాల్లో స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఉంటాయి. అంటే... ఇప్పుడు లేవని కాదు. 'బాహుబలి' లాంటి సినిమాలు వస్తున్నాయి. మొదటి మూడు రోజుల్లో డబ్బులు చేసుకోవాలని కొన్ని సినిమాలు వస్తున్నాయి. నేను అలా కాకుండా స్ట్రాంగ్ క్యారెక్టర్లతో సినిమా తీయాలనుకున్నాను. కరోనా కాలంలో 'డర్టీ హరి' తర్వాత కొన్ని కథలు అనుకుంటున్నాను. అప్పుడు రాజ్ కపూర్ 'బర్సాత్' చూశా. అందులో రెండు పాత్రలు నాకు బాగా నచ్చాయి. ఒకడు అతి మంచోడు. వాడికి ఎప్పుడూ ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది. హీరో ఎప్పుడూ ఏదో ఒక డేంజర్ లో ఉంటాడు. అప్పుడే సినిమా బావుంటుంది. 'ఖుషి'లో విలన్ లేకపోయినా... అమ్మాయి ఓకే అనదు. అదొక కాన్ఫ్లిక్ట్ అన్నమాట. 'బర్సాత్' క్యారెక్టర్లు నచ్చడంతో వాటిని స్ఫూర్తిగా తీసుకుని కొత్త కథ రాశా. ఈ సినిమాలో మీ అబ్బాయి సుమంత్ అశ్విన్ పాత్ర ఎలా ఉంటుంది? 'బర్సాత్'లో రాజ్ కపూర్ క్యారెక్టర్ తరహాలో సుమంత్ పాత్ర ఉంటుంది. తనను గడ్డం పెంచమని, బరువు పెరగమని చెప్పాను. అదొక కేర్లెస్ రోల్. జీవితంలో అతడికి ఒక లక్ష్యం ఉంటుంది. దాన్ని ఇంకా చేరుకోలేదు. మరో వైపు ప్రేమించిన అమ్మాయి అమెరికా వెళుతుంది. ఆ డిప్రెషన్ కనిపించాలంటే గడ్డం పెంచి, బరువు పెరగాలని చెప్పాను. పెరిగాడు కూడా! డాక్టర్‌కు సైతం అందని డిప్రెషన్లో ఉంటారు. 'బర్సాత్'లో రాజ్ కపూర్ ఫ్రెండ్ రోల్ ప్రేమనాథ్ చేశారు. మన సినిమాలో అటువంటి రోల్ రోహన్ నటించాడు. కథ, నేపథ్యాలు వేర్వేరు. కథ రాసేటప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? కథ, కాన్ఫ్లిక్ట్స్ బాగా కుదిరాయి. అయితే, యూత్‌ఫుల్ సినిమా కదా! డైలాగ్స్, సీన్స్ ఎలా రాయాలి? అనుకున్నా. అప్పుడు ఒక్కడినే గోవా వెళ్ళాను. మా ఇంట్లో కూడా చెప్పలేదు. రాజమండ్రిలో అమ్మానాన్న దగ్గరకు వెళుతున్నానని చెప్పా. డ్రైవర్ కూడా లేడు. నేనే నడుపుతూ వెళ్ళాను. గోవా వెళ్ళాక ఫోన్ స్విచ్ఛాఫ్ చేశా. ఐదారు రోజులు అంతా తిరిగా. నిర్మాతగా నేను విజయాలు సాధించా. అయితే, దర్శకుడిగా ఆశించిన విజయాలు అందుకోలేదు. అందుకని పట్టుదలతో '7 డేస్ 6 నైట్స్' కథ రాశా. గోవాలో యువత తిరిగే ప్రదేశాలు తిరిగా. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో గమనించాను. కొంత మందికి 'వీడు మనల్ని కిడ్నాప్ చేస్తాడా?' అనే ఫీలింగ్ కూడా వచ్చింది. అయినా చాలా రీసెర్చ్ చేశా. బయోపిక్ కోసమే కాదు, ఇటువంటి యూత్ ఫిలిమ్స్ చేయాలనుకున్నప్పుడు కూడా రీసెర్చ్ అవసరమే. ప్రతి సినిమాకు నేను ఈ విధంగా కష్టపడతా. ఇండస్ట్రీలో ఎవరూ అటెంప్ట్ చేయని సినిమాలు చేయాలనుకుంటున్నారా? రిటైర్మెంట్ వయసు వచ్చిన తర్వాత ఎవరైనా అలసిపోయామని, ఇక విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటారు. నాలో రోజురోజుకూ తపన పెరుగుతోంది. నేను మధ్యలో వదిలేసిన గ్యాప్ ఉంది కదా! దాన్ని భర్తీ చేసుకునేలా సినిమాలు తీస్తున్నాను. ఇండస్ట్రీలో ఎవరూ అటెంప్ట్ చేయని జానర్ సినిమాలు అని కాదు, ఒక్కసారి సినిమా స్టార్ట్ అయితే అలా వెళ్లిపోయే సినిమాలు చేయాలనుకుంటున్నా. ఒక్కోసారి చిన్న ట్విస్ట్ సినిమాను తిప్పేస్తున్నాయి. అటువంటి సినిమాలు తీయాలనుంది. '7 డేస్ 6 నైట్స్'లో ఇద్దరు కొత్త హీరోయిన్లు ఉన్నారు. వాళ్ళు ఎలా చేశారు? కొత్త హీరోయిన్లు అని అలుసుగా చూడలేదు. మహేష్ బాబు - భూమిక, ప్రభాస్ - త్రిష, సిద్ధార్థ్ - ఇలియానా నుంచి కొత్త హీరో హీరోయిన్ల వరకూ ఎవరికైనా నేను ఇచ్చే గౌరవం ఒక్కటే. పాత్రలకు తగ్గట్టు వాళ్ళిద్దరూ బాగా చేశారు. ఇది దర్శకుడిగా మీరు నిలబడే ప్రయత్నమా? మీ అబ్బాయిని హీరోగా నిలబెట్టే ప్రయత్నమా? మా అబ్బాయిని హీరోగా నిలబెట్టాలంటే 'డర్టీ హరి' చేసేవాడిని. అది నాకు కరెక్ట్ కాదనిపించింది. తను ఏ పాత్రకు సూట్ అవుతాడో... ఆ పాత్రకు తీసుకోవాలి. '7 డేస్ 6 నైట్స్'లో ఇద్దరు హీరోలు ఉన్నారు. రోహన్ చేసే కామెడీకి జనాలు నవ్వుతారు. పక్కన మరో ఎమోషనల్ రోల్ ఉంది. దానికి సుమంత్ సూట్ అవుతాడని అతడిని తీసుకున్నా. '7 డేస్ 6 నైట్స్' అంటే ఏదో అమ్మాయిలను తీసుకుని బీచ్‌కు వెళ్లడం కాదు, ఇందులో ఎమోషనల్ కంటెంట్ చాలా ఉంది. మీ అబ్బాయికి రొమాంటిక్ సీన్స్ వివరించేటప్పుడు ఇబ్బంది ఏమైనా పడ్డారా? సెట్లో మా ఇద్దరి మధ్య ప్రొఫెషనల్ రిలేషన్షిప్ ఉండేది. సుమంత్ అశ్విన్ జన్మించే సమయానికి నేను సినిమాల్లో ఉన్నాను. షూటింగ్ వాతావరణంలో పెరిగాడు. సన్నివేశాల గురించి ఇంట్లో నా భార్యకు వివరించేటప్పుడు వినేవాడు. అందుకని, ఇబ్బంది ఏమీ లేదు. ప్రొఫెషనల్స్ గా ఉన్నాం. సెట్లో నా దగ్గరకు వచ్చి నెమ్మదిగా ఎలా చేయాలని అడిగేవాడు. చెప్పినట్టు చేశాడు. ఇది అడల్ట్ కంటెంట్ సినిమా కాదు, ఫ్యామిలీ సినిమా కూడా! 'సతి' సినిమా కంప్లీట్ చేసినట్టున్నారు! అవును. రాజమండ్రి లాంటి ప్రాంతంలో భార్యాభర్తల మధ్య జరిగే కథతో తీసిన సినిమా 'సతి'. మిస్టరీ జానర్ సినిమా అని చెప్పవచ్చు. మీరు గతంలో తీసిన సినిమాలకు సీక్వెల్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? ఒక సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాను. దాన్ని 14 భాషల్లో తీస్తాం. అక్టోబర్‌లో స్టార్ట్ కావచ్చు. చాలా పెద్ద స్కేల్ లో ఉంటుంది. చదవండి: రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ' రిలీజ్ డేట్ ఫిక్స్.. ఓటీటీలో చేయను, ఎప్పటికీ నేను బిగ్ స్క్రీన్ హీరోనే! -
చిన్న సినిమాలకు ఇదే సరైన సమయం
‘‘7 డేస్ 6 నైట్స్’ డీసెంట్ ఫిల్మ్.. యువతరంతో పాటు ఫ్యామిలీ అందరూ చూడొచ్చు. మార్చి తర్వాత ‘ఆర్ఆర్ఆర్’, ‘కేజీఎఫ్ 2’ సినిమాలు విడుదలై, మంచి హిట్టయ్యాయి. చిన్న సినిమాలు రావడానికి సరైన సమయం ఇదేనని భావిస్తున్నాను’’ అన్నారు దర్శక–నిర్మాత ఎంఎస్ రాజు. సుమంత్ అశ్విన్, రోహన్ హీరోలుగా, మెహర్ చాహల్, కృతికా శెట్టి హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘7 డేస్ 6 నైట్స్’. సుమంత్ అశ్విన్ .ఎం, రజనీకాంత్ .ఎస్ నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 24న విడుదలవుతున్న సందర్భంగా కొత్త ట్రైలర్‌ను విడుదల చేశారు. చిత్రదర్శకుడు ఎంఎస్ రాజు మాట్లాడుతూ– ‘‘చిన్న సినిమా ఎన్ని వండర్స్ క్రియేట్ చేస్తుందో చూపించాలనుకుంటున్నాం. మా చిత్రాన్ని యువతరంతో పాటు కుటుంబ ప్రేక్షకులు కూడా చూడాలని తక్కువ టికెట్ రేట్స్ పెడుతున్నాం. ఈ సినిమాతో నిర్మాతలుగా మారిన మా అబ్బాయి సుమంత్, అమ్మాయి రిషితా దేవికి ఆల్ ది బెస్ట్’’ అన్నారు. ‘‘ఈ సినిమా ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది’’ అన్నారు రిషితా దేవి. ‘‘7 డేస్ 6 నైట్స్’ నాకు ఒక మాస్టర్ పీస్‌లా అనిపిస్తోంది’’ అన్నారు సుమంత్ అశ్విన్. నిర్మాత రజనీకాంత్ .ఎస్, కో ప్రొడ్యూసర్ శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు. -
ఈ వారం థియేటర్, ఓటీటీలో రిలీజవుతున్న సినిమాలు
సమ్మర్ హాలీడేస్ అయిపోయాయి. స్కూళ్లు, కాలేజీలు తెరవడంతో పిల్లలు, యువత పుస్తకాలు తిరిగేసేందుకు రెడీ అవుతున్నారు. దీంతో బాక్సాఫీస్ దగ్గర పెద్ద సినిమాల సందడి తగ్గినట్లే కనిపిస్తోంది. భారీ బడ్జెట్ సినిమాలతో పోటీపడలేక వాయిదాపడ్డ చిన్న చిన్న సినిమాలు ఇప్పుడు రిలీజ్‌కు రెడీ అంటూ బాక్సాఫీస్ బరిలో దూకుతున్నాయి. ఈ క్రమంలో జూన్ నాలుగో వారంలో అటు థియేటర్లో, ఇటు ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలేంటో ఓ లుక్కేయండి.. కొండా సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం కొండా. కొండా మురళి- సురేఖ దంపతుల జీవితకథ ఆధారంగా ఈ బయోపిక్ రూపుదిద్దుకుంది. సురేఖ పాత్రలో ఇర్రా మోర్, మురళి పాత్రలో త్రిగుణ్ నటించారు. ఈ సినిమా ఈ నెల 23న విడుదల కానుంది. సమ్మతమే తన ప్రతి సినిమాకు తెలుగు టైటిల్స్‌నే పెట్టుకుంటూ వస్తున్నాడు కిరణ్ అబ్బవరం. తాజాగా సమ్మతమే సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. గోపీనాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో చాందినీ చౌదరి కథానాయిక. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు. జూన్ 24న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. చోర్ బజార్ ప్రముఖ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి కథానాయకుడిగా నటించిన చిత్రం చోర్ బజార్. జీవన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం గెహాన సిప్పీ హీరోయిన్. సురేశ్ బొబ్బిలి సంగీతం అందించిన ఈ మూవీ జూన్ 24న రిలీజ్ కానుంది. 7 డేస్ 6 నైట్స్ తెలుగు చిత్రసీమకు ఎన్నో హిట్స్ అందించారు దర్శకనిర్మాత ఎంఎస్ రాజు. ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం 7 డేస్ 6 నైట్స్. సుమంత్ అశ్విన్ హీరోగా నటిస్తుండగా మెహర్ చాహల్ హీరోయిన్స్‌గా కనిపించనున్నారు. ఈ సినిమా జూన్ 24న రిలీజ్ అవుతోంది. గ్యాంగ్‌స్టర్ గంగరాజు లక్ష్ చదలవాడ హీరోగా నటించిన చిత్రం గ్యాంగ్‌స్టర్ గంగరాజు. వేదిక దత్ కథానాయిక. ఇషాన్ సూర్య దర్శకత్వం వహించిన ఈ మూవీ జూన్ 24న తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతోంది. సదా నన్ను నడిపే లంకా ప్రతీక్ ప్రేమ్ హీరోగా వైష్ణవి పట్వర్దన్ హీరోయిన్గా నటించిన చిత్రం సదా నన్ను నడిపే. ఈ సినిమాకు హీరో ప్రతీకే దర్శకుడు కావడం విశేషం. జూన్ 24న ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సందడి చేయనుంది. ఇవే కాకుండా సాఫ్ట్వేర్ బ్లూస్, కరణ్ అర్జున్ సహా తదితర సినిమాలు రిలీజవుతున్నాయి. ఈ వారం ఓటీటీలో సందడి చేసే సినిమాలేంటంటే... అమెజాన్ ప్రైమ్ సర్కారువారి పాట - జూన్ 23 ఆహా మన్మథ లీల - జూన్ 24 సోనీ లివ్ నెంజుక్కు నీది (తమిళ్) - జూన్ 23 అవరోధ్ (హిందీ వెబ్ సిరీస్) - జూన్ 24 నెట్‌ఫ్లిక్స్ లవ్ అండ్ గెలాటో - జూన్ 22 మ్యాన్ వర్సెస్ బీ - జూన్ 24 కుట్టవుమ్ శిక్షాయుమ్ (మలయాళం) - జూన్ 24 గ్లామర్ గాళ్స్ - జూన్ 24 మనీ హెయిస్ట్ (కొరియన్)- జూన్ 24 హాట్‌స్టార్ డాక్టర్ స్ట్రేంజ్ - జూన్ 22 జీ5 ఫోరెన్సిక్ - జూన్ 24 చదవండి: హనీమూన్‌కు చెక్కేసిన నయనతార దంపతులు ‘విరాట పర్వం’ మూవీపై ప్రముఖ తమిళ డైరెక్టర్ కామెంట్స్ వైరల్ -
దేవుడు వరమిస్తే.. మళ్లీ ఎంఎస్ రాజు గారి అబ్బాయిగానే పుడతా: సుమంత్ అశ్విన్
మా నాన్న(నిర్మాత, దర్శకుడు ఎంఎస్ రాజు) ఎలాంటి ఫాదర్ అని ఎప్పుడు ఆలోచించలేదు. నాకు ఏది కావాలంటే అది ఇచ్చారు. ఆయనే ఫర్ఫెక్ట్ ఫాదర్. మరో జన్మంటూ ఉంటే.. దేవుడు వచ్చి ఏం కావాలని అడిగితే.. మళ్లీ ఎంఎస్ రాజు దంపతులు కడుపునే పుట్టాలని కోరుకుంటా’అని యంగ్ హీరో సుమంత్ అశ్విన్ అన్నారు. సుమంత్ అశ్విన్, రోహన్ హీరోలుగా ఎంఎస్ రాజ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘7 డేస్ 6నైట్స్’.సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో సుమంత్ అశ్విన్ .ఎం, రజనీకాంత్ .ఎస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. వైల్డ్ హనీ ప్రోడక్షన్స్, వింటేజ్ పిక్చర్స్ మరియు ఏబిజి క్రియేషన్స్ వారు చిత్రనిర్మాణంలో భాగస్వాములు. జూన్ 24న సినిమా విడుదల అవుతోంది. ఈ సందర్భంగా సుమంత్ అశ్విన్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► నా కెరీర్లో సక్సెస్ ఫుల్ సినిమాలు ఉన్నాయి. డిజప్పాయింట్ చేసినవీ ఉన్నాయి. అయితే, ఈ జర్నీ చాలా అందంగా ఉంది. నా తొలి మూవీ'తూనీగ తూనీగ’విడుదలైన 10 ఏళ్లు కావోస్తుంది. ఈ పదేళ్ల కూడా చాలా స్పీడ్‌గా వెళ్లింది. ►'తూనీగ తూనీగ' కోసం మూడు నాలుగు సినిమాలకు పెట్టినంత ఎఫర్ట్ పెట్టాం. ప్రశంసలు వచ్చాయి కానీ ఆశించిన వసూళ్లు రాలేదు. కొన్ని సినిమాలు పేపర్ మీద బావుంటాయి. ఎక్కడో చిన్న తప్పు వల్ల అనుకున్న ఫలితాలు రాకపోవచ్చు. అయితే, మనం చేసే హార్డ్ వర్క్ విషయంలో ఎటువంటి లోపం ఉండకూడదు. ►ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలతో కంపేర్ చేస్తే..'7 డేస్ 6 నైట్స్’లో డిఫరెంట్ రోల్ చేశా.రియాలిటీకి దగ్గరగా ఉన్న పాత్ర అది. ఇప్పుడు ప్రేక్షకులు కూడా డిఫరెంట్ రోల్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు. కరోనా వల్ల కావచ్చు, మరొకటి కావచ్చు... ప్రేక్షకులు వరల్డ్ సినిమా చూశారు. అప్డేట్ అయ్యారు. వేరే లెవెల్లో ఉన్నారు. వాళ్ళకు రీచ్ అవ్వాలంటే మనం కూడా నెక్స్ట్ లెవెల్ థింగ్స్ చేయాలి. టైమ్ పట్టినా కొత్త రోల్స్ చేయాలనుకుంటున్నాను. ►ఈ సినిమాలో నేను ఒక నార్మల్ యంగ్‌స్టర్ పాత్ర చేశాను. అతను ఫిల్మ్ మేకర్ అవ్వాలని అనుకుంటాడు. జీవితంలో తనకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. స్ట్రగుల్ అవుతూ ఉంటాడు. ఎక్కువ స్మోక్ చేస్తాడు. వెయిట్ చేస్తాడు. తన మీద కేర్ తీసుకోడు. అటువంటి మనిషి ఎలా ఉంటాడో... నా లుక్ కూడా అలాగే ఉంటుంది. ►ఇందులో రోహన్‌ది ఇంపార్టెంట్ రోల్. అతడిని నాన్నే సెలెక్ట్ చేశారు. ముందు ఎస్టాబ్లిష్ హీరోని తీసుకుంటే బావుంటుందని అనుకున్నా. సినిమా చూశాక పర్ఫెక్ట్ కాస్టింగ్ అనిపించింది. మెహర్ ఎంత బాగా చేసిందంటే... ఆమెను 'సతి' సినిమాలో కూడా తీసుకున్నాం. ►నాన్న(ఎంఎస్ రాజు) ఇప్పుడు ఫుల్ ఫైర్‌లో ఉన్నాడు. ఎంఎస్ రాజు 2.0 అనుకోవచ్చు. 'డర్టీ హరి'తో ఆయన ప్రూవ్ చేసుకున్నారు. నాన్నతో సన్నిహితంగా ఉంటాను కాబట్టి ఆయనేంటో నాకు తెలుసు. 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' తర్వాత మధ్యలో ఎక్కడో 'ప్రేక్షకులకు ఏం కావాలో అదే ఇవ్వాలి. సేఫ్ గేమ్... ఫ్యామిలీలు, టార్గెట్ ఆడియన్స్' అంటూ చేసిన సినిమాలు కథల పరంగా కొంత డిజప్పాయింట్ చేసి ఉండొచ్చు. అవన్నీ పక్కన పెట్టి... నాన్నగారు కంప్లీట్ అప్ గ్రేడ్ అయ్యి సినిమాలు చేస్తున్నారు. నాకు అది బాగా నచ్చింది. '7 డేస్ 6 నైట్స్'లో ఎంఎస్ రాజు మార్క్ ఉంటుంది. అదే సమయంలో 20 ఏళ్ళ దర్శకుడు తీసినట్టు ఉంటుంది. ► చిన్నప్పుడు, బాగా వెయిట్ ఉండేవాడిని. అప్పుడు వెంకటేష్, ప్రభాస్, మహేష్ బాబు గారిని చూస్తే ఫిట్‌గా, హ్యాండ్సమ్గా ఉండేవారు. మంచి డ్రస్సులు వేసుకునేవారు. నేను వెయిట్ వల్ల అటువంటి డ్రస్సులు వేసుకోలేకపోయేవాడిని. డ్యాన్సులు చేసేవారు. షూటింగ్స్ చేసేటప్పుడు వాళ్ళను చూసి... నేను అలా చేయలేనని అనుకున్నా. అప్పుడు సినిమాటోగ్రాఫర్ లేదా డైరెక్టర్ కావాలనుకున్నా. 'వర్షం' సమయంలో నిక్సన్ మాస్టర్ పరిచయం అయ్యారు. ఆయన దగ్గర ఏరోబిక్, డ్యాన్సులో కొన్ని క్లాసులు తీసుకున్నా. అప్పుడు వెయిట్ తగ్గా. మా సినిమాల్లో హీరో హీరోయిన్ల ఫోటోషూట్స్ టైమ్‌లో వెళితే... నా ఫోటోలు కొన్ని తీశారు. అవి త్రివిక్రమ్ గారు, ప్రభుదేవా గారు చూసి 'చాలా బావున్నాడు. బాడీ బిల్డ్ చేస్తే మంచి హీరో అవుతాడు' అని చెప్పారు. నా మనసులో అది ఉండిపోయింది. దాంతో ముంబై వెళ్లి యాక్టింగ్ కోర్స్ చేశా. హీరో కావాలనుకున్నా. ► నాకు బోల్డ్ అనే పదం నచ్చదు. యువత అడల్ట్ కంటెంట్ కోసం థియేటర్లకు రావాల్సిన అవసరం లేదు. ఎవరూ రారు కూడా! ఇంటర్నెట్లో బోలెడు కంటెంట్ ఉంది. కథ ఉంటేనే ఎవరైనా థియేటర్లకు వస్తారు.'7 డేస్ 6 నైట్స్' ఫ్యామిలీతో చూసే మూవీ ► 'డర్టీ హరి'తో నిర్మాతలకు మంచి లాభాలు వచ్చాయి. దాని తర్వాత ఏ సినిమా చేయాలని నాన్న ఆలోచిస్తున్నారు. ఆయన దగ్గర ఆరేడు కథలు ఉన్నాయి. అందులో ఇది చేద్దామని అనుకున్నప్పుడు... నేను ప్రొడ్యూస్ చేయాలనుకున్నా. చిరంజీవి గారి దగ్గర నుంచి ఇండస్ట్రీలో చాలా మంది దర్శక, నిర్మాతలు నాన్నగారిని హానీ అని పిలుస్తారు. 'డర్టీ హరి' తర్వాత నాన్నగారు వైల్డ్ గా అనిపించారు. అందుకని 'వైల్డ్ హనీ ప్రొడక్షన్స్' అని పేరు పెట్టా. -
ఇందులో నాది బోల్డ్ రోల్ కాదు: హీరోయిన్
‘‘7 డేస్ 6 నైట్స్’ ఒక ఫన్ ఫిల్మ్. టీనేజ్, యంగ్‌స్టర్ వైబ్స్ ఉన్న కథ. ఎంఎస్ రాజుగారి సినిమాలు చూశాను. ఆయన దర్శకత్వంలో సినిమా అనగానే ఎగ్జయిట్ అయ్యాను. కథ కూడా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశాను’’ అని హీరోయిన్ మెహర్ చాహల్ అన్నారు. సుమంత్ అశ్విన్, రోహన్ హీరోలుగా, కృతికా శెట్టి, మెహర్ చాహల్ హీరోయిన్లుగా ఎం.ఎస్. రాజు దర్శకత్వం వహించిన సినిమా ‘7 డేస్ 6 నైట్స్’. సుమంత్ అశ్విన్, రజనీకాంత్ నిర్మించిన ఈ సినిమా జూన్ 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా మెహర్ చాహల్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘నేను అస్సాంలో పుట్టాను. మా నాన్నగారు టీ ప్లాంటేషన్స్‌లో పని చేయడం వల్ల దేశంలో చాలా ప్రాంతాలు తిరిగాను. చదవండి: డేటింగ్ సైట్లో తల్లి పేరు ఉంచిన కూతురు.. అసభ్యకరంగా మెసేజ్‌లు ప్రస్తుతం నా తల్లిదండ్రులతో కలిసి కోల్‌కతాలో ఉంటున్నాను. అయితే సినిమాల కోసం ముంబైలో ఉన్నాను. ముంబైలో నన్ను చూసిన ఎంఎస్ రాజుగారు మా మేనేజర్‌తో మాట్లాడారు. హైదరాబాద్ వచ్చి ఆడిషన్ ఇచ్చాను.. సెలెక్ట్ చేశారు. ‘7 డేస్ 6 నైట్స్’లో నా పాత్ర పేరు రతికా. సుమంత్ అశ్విన్‌కి జోడీగా కనిపిస్తాను. ఇందులో నాది బోల్డ్ రోల్ కాదు. ఇదొక రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్. హిందీలో ‘హౌస్‌ఫుల్’ సిరీస్‌లో జోక్స్ ఎలా ఉంటాయో ఇందులోనూ అలా ఉంటాయి.. సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకులు ఫుల్‌గా నవ్వుకోవచ్చు. యూత్‌తో పాటు ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూడదగ్గ సినిమా ఇది’’ అన్నారు. -
మంగళం పాత్ర చేయడం ఛాలెంజింగ్‌గా అనిపించింది: రోహన్
‘‘7 డేస్ 6 నైట్స్’లో నా పాత్ర పేరు మంగళం. తర్వాత ఏమవుతుందో అని ఆలోచించకుండా జీవితంలో అనుకున్నది చేస్తాడు. స్నేహితుడు ఆనంద్ (సుమంత్ అశ్విన్)తో కలిసి మంగళం బ్యాచిలర్ ట్రిప్‌కి గోవా వెళతాడు. ఆ ట్రిప్‌లో ఏం జరిగింది? అనేది ‘7 డేస్ 6 నైట్స్’ కథ’’ అని రోహన్ అన్నారు. సుమంత్ అశ్విన్, రోహన్ హీరోలుగా, కృతికా శెట్టి, మెహర్ చాహల్ హీరోయిన్లుగా ఎం.ఎస్. రాజు దర్శకత్వం వహించిన చిత్రం ‘7 డేస్ 6 నైట్స్’. సుమంత్ అశ్విన్ .ఎం, రజనీకాంత్ .ఎస్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న రిలీజవుతోంది. (చదవండి: వాళ్లను విశ్లేషించడం మూర్ఖత్వం!) ఈ సందర్భంగా రోహన్ మాట్లాడుతూ– ‘‘నా షో రీల్ చూసిన సునీల్‌గారు ఎంఎస్ రాజుగారికి చూపించారట. రెండు ఆడిషన్స్ తర్వాత నన్ను ఫైనలైజ్ చేశారు రాజుగారు. తొలి సినిమాకే కామెడీ చేయడం కష్టం అనుకున్నాను. అయితే ఎంఎస్ రాజుగారు ఇచ్చిన కాన్ఫిడెన్స్‌తో చేశాను. మంగళం పాత్ర తెలంగాణ యాసలో మాట్లాడాలి.. అందుకోసం ఈ మధ్య వచ్చిన తెలంగాణ యాస చిత్రాలు చూశాను. నా నిజజీవితానికి ఆపోజిట్‌గా ఉండే మంగళం పాత్ర చేయడం ఛాలెంజింగ్‌గా అనిపించింది. హీరోగానే చేయాలనుకోవడం లేదు.. కథలో ఇంపార్టెన్స్ ఉంటే ముఖ్య పాత్రలు కూడా చేస్తాను’’ అన్నారు. -
7 డేస్ 6 నైట్స్ ట్రైలర్ వచ్చేసింది..
‘7 డేస్ 6 నైట్స్’. సుమంత్ అశ్విన్, మెహెర్ చాహల్, రోహన్, క్రితిక శెట్టి హీరోహీరోయిన్లుగా నటించారు. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో సుమంత్ అశ్విన్, రజనీకాంత్ .ఎస్ నిర్మించారు. వైల్డ్ హనీ ప్రొడక్షన్స్, వింటేజ్ పిక్చర్స్, ఏబీజీ క్రియేషన్స్ చిత్రనిర్మాణంలో భాగస్వాములైన ఈ చిత్రం ఈ నెల 24న రిలీజ్ కానుంది. తాజాగా ఈ చిత్రం నుంచి కొత్త ట్రైలర్‌ని విడుదల చేశారు. దర్శకుడు ఎంఎస్ రాజు మాట్లాడుతూ–‘‘యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘7 డేస్ 6 నైట్స్’. ఈ చిత్రం అన్ని వర్గాల వారిని అలరిస్తుంది. సుమంత్ అశ్విన్ తన పాత్రలో పూర్తిగా ఒదిగిపోయి నటించాడు. మెహర్ చాహల్, రోహన్, క్రితికా శెట్టి తమ పాత్రలకి పూర్తి న్యాయం చేశారు’’ అన్నారు. ‘‘ఆద్యంతం నవ్వించే, కవ్వించే సన్నివేశాలతో అందరికీ నచ్చే యూత్ సినిమా ఇది. హైదరాబాద్, బెంగళూరు, ఉడిపి, గోకర్ణ, గోవాలో చిత్రీకరించాం’’ అన్నారు సుమంత్ అశ్విన్. ఈ చిత్రానికి సంగీతం: సమర్థ్ గొల్లపూడి, కెమెరా: నాని చమిడిశెట్టి, కో ప్రొడ్యూసర్స్: జె.శ్రీనివాసరాజు, మంతెన రాము. చదవండి: నా సినిమా ఫ్లాప్ అయినా కూడా రానా బాగుందనేవాడు పొట్టి బట్టలు వేసుకోవడం తప్పు అనడం లేదు.. సాయిపల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు -
నవ్వించే.. కవ్వించేలా ‘7 డేస్ 6 నైట్స్’
‘డర్టీ హరి’ చిత్రం తర్వాత ఎంఎస్ రాజు దర్శకత్వం వహించిన మరో యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘7 డేస్ 6 నైట్స్’. సుమంత్ అశ్విన్, రోహన్ హీరోలుగా, మెహర్ చాహల్, క్రితికా శెట్టి హీరోయిన్లుగా నటించారు. సుమంత్ అశ్విన్, రజనీకాంత్ .ఎస్ నిర్మించారు. ఈ చిత్రాన్ని ఈ నెల 24న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఎంఎస్ రాజు మాట్లాడుతూ– ‘‘ఆకట్టుకునే కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, విజువల్స్, మ్యూజిక్‌తో ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది’’అన్నారు. ‘‘అందరికీ నచ్చే యూత్‌ఫుల్ సినిమా ఇది’’ అన్నారు సుమంత్ అశ్విన్. ‘‘ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు సహ నిర్మాతల్లో ఒకరైన జె. శ్రీనివాసరాజు. ఈ చిత్రానికి సంగీతం: సమర్థ్ గొల్లపూడి, కెమెరా: నాని చమిడిశెట్టి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత, కో–డైరెక్టర్: యువి సుష్మ, కో ప్రొడ్యూసర్: మంతెన రాము.