Sumanth Ashwin 7 Days 6 Nights Trailer Out Now - Sakshi

7 Days 6 Nights Trailer: 7 డేస్‌ 6 నైట్స్‌ ట్రైలర్‌ వచ్చేసింది..

Published Sun, Jun 12 2022 2:39 PM | Last Updated on Sun, Jun 12 2022 3:48 PM

Sumanth Ashwin 7 Days 6 Nights Trailer Out Now - Sakshi

‘7 డేస్‌ 6 నైట్స్‌’. సుమంత్‌ అశ్విన్, మెహెర్‌ చాహల్, రోహన్, క్రితిక శెట్టి హీరోహీరోయిన్లుగా నటించారు. సుమంత్‌ ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ సమర్పణలో సుమంత్‌ అశ్విన్, రజనీకాంత్‌ .ఎస్‌ నిర్మించారు. వైల్డ్‌ హనీ ప్రొడక్షన్స్‌, వింటేజ్‌ పిక్చర్స్, ఏబీజీ క్రియేషన్స్‌ చిత్రనిర్మాణంలో భాగస్వాములైన ఈ చిత్రం ఈ నెల 24న రిలీజ్‌ కానుంది. తాజాగా ఈ చిత్రం నుంచి కొత్త ట్రైలర్‌ని విడుదల చేశారు.

దర్శకుడు ఎంఎస్‌ రాజు మాట్లాడుతూ–‘‘యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘7 డేస్‌ 6 నైట్స్‌’. ఈ చిత్రం అన్ని వర్గాల వారిని అలరిస్తుంది. సుమంత్‌ అశ్విన్‌ తన పాత్రలో పూర్తిగా ఒదిగిపోయి నటించాడు. మెహర్‌ చాహల్, రోహన్, క్రితికా శెట్టి తమ పాత్రలకి పూర్తి న్యాయం చేశారు’’ అన్నారు. ‘‘ఆద్యంతం నవ్వించే, కవ్వించే సన్నివేశాలతో అందరికీ నచ్చే యూత్‌ సినిమా ఇది. హైదరాబాద్, బెంగళూరు, ఉడిపి, గోకర్ణ, గోవాలో చిత్రీకరించాం’’ అన్నారు సుమంత్‌ అశ్విన్‌. ఈ చిత్రానికి సంగీతం: సమర్థ్‌ గొల్లపూడి, కెమెరా: నాని చమిడిశెట్టి, కో ప్రొడ్యూసర్స్‌: జె.శ్రీనివాసరాజు, మంతెన రాము.

చదవండి: నా సినిమా ఫ్లాప్‌ అయినా కూడా రానా బాగుందనేవాడు
పొట్టి బట్టలు వేసుకోవడం తప్పు అనడం లేదు.. సాయిపల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
 
Advertisement