ms raju
-
Madakasira: లోకలా.. నాన్ లోకలా?
మడకశిర: ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమైన మడకశిర రాజకీయం రసవత్తరంగా మారింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ....లోకల్, నాన్‌లోకల్ నినాదం ఊపందుకుంది. వైఎస్సార్ సీపీ అభ్యర్థి ఈరలక్కప్ప పక్కా లోకల్ కాగా... టీడీపీ అభ్యర్థి ఎంఎస్ రాజు నాన్ లోకల్. దీంతో నియోజకవర్గ ప్రజలంతా గతంలో నాన్ లోకల్‌ను గెలిపించి పడిన ఇబ్బందులను గుర్తు చేసుకుంటున్నారు. లోకల్‌కే తమ మద్దతు అంటూ స్పష్టం చేస్తున్నారు.ఎంఎస్ రాజు నాన్ లోకల్..అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గానికి చెందిన ఎంఎస్ రాజును టీడీపీ అధినేత చంద్రబాబు మడకశిర టీడీపీ అభ్యర్థిగా ప్రకటించారు. ఆయనకు మడకశిర నియోజకవర్గ ప్రజలతో ఏమాత్రం సంబంధాలు లేవు. అసలు మడకశిర నియోజకవర్గంపై కనీస అవగాహన కూడా లేదు. టీడీపీలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎంఎస్ రాజుకు మడకశిర టికెట్ కేటాయించారు. స్థానికులైన ఎంతో మంది దళిత నాయకులు దరఖాస్తు చేసుకున్నా... టీడీపీ హైకమాండ్ స్థానికేతరుడు ఎంఎస్ రాజుకు టికెట్ కేటాయించడంతో ఆ పార్టీ శ్రేణుల్లోనే వ్యతిరేకత వ్యక్తమైన విషయం తెలిసిందే. ‘లోకల్ ముద్దు...నాన్ లోకల్ వద్దు’ అంటూ టీడీపీ కార్యకర్తలే ఎంఎస్ రాజుకు వ్యతిరేకంగా ఆందోళనలు కూడా చేశారు. అయినా చంద్రబాబు స్థానికేతరుడికే మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలో మడకశిర ప్రజలు నాన్‌లోకల్ వద్దంటే వద్దంటున్నారు. గతంలో స్థానికేతరులను గెలిపించి తీవ్రంగా నష్టపోయామని, మరోసారి ఆ తప్పు చేయబోమంటున్నారు.ఈరలక్కప్ప... పక్కా లోకల్గుడిబండ మండలం ఫళారం గ్రామానికి చెందిన ఉపాధి హామీ కూలి ఈరలక్కప్పకు వైఎస్సార్ సీపీ టికెట్ ఇచ్చింది. ఆయన నిరుపేద. ప్రభుత్వం ఇచ్చిన గృహంలో తల్లితో కలిసి ఉంటున్నారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాన్ని నియోజకవర్గ ప్రజలంతా మెచ్చుకుంటున్నారు. రాజకీయాల్లోకి నిరుపేదలు కూడా రావాలన్న సంకల్పం మంచిదంటున్నారు. ఈరలక్కప్ప 2006–2011 మధ్య గుడిబండ సర్పంచ్‌గా పని చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. అంతేకాకుండా ప్రభుత్వ కార్యాలయాల వద్దకు వచ్చే ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేసేవారు. అందువల్లే ప్రస్తుతం ఈరలక్కప్ప ఏ గ్రామానికి వెళ్లినా... ప్రజలు అపూర్వ స్వాగతం పలుకుతున్నారు. ఈరలక్కప్ప ఎమ్మెల్యే అయితే అందరికీ అందుబాటులో ఉండి సేవలందిస్తారని చెబుతున్నారు. సామాన్యుడికి జగన్ అవకాశం ఇచ్చారని, తప్పకుండా అసెంబ్లీకి పంపుతామంటున్నారు.ఎస్సీ సామాజిక వర్గం నుంచే రాజుపై తీవ్ర వ్యతిరేకత..టీడీపీ అభ్యర్థి ఎంఎస్ రాజును ఆ పార్టీలోని ఎస్సీ వర్గానికి చెందిన నాయకులే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పార్టీ కోసం పనిచేసిన తమను కాదని స్థానికేతరుడు, వివాదాస్పదుడైన ఎంఎస్ రాజుకు టికెట్ ఇవ్వడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ టికెట్ కోసం ఎస్సీ వర్గానికే చెందిన స్థానిక నాయకులు మాజీ ఎమ్మెల్యే ఈరన్న, మంజునాథ్, సుబ్బరాయుడు, జయకుమార్, కృష్ణమూర్తి, మల్లికార్జున తదితరులు ప్రయత్నించారు. అయితే టీడీపీ హైకమాండ్ మాజీ ఎమ్మెల్యే ఈరన్న తనయుడు సునీల్‌కు తొలుత టికెట్ కేటాయించింది. దాదాపు 50 రోజుల పాటు సునీల్ నియోజకవర్గంలో ప్రచారం చేశారు. చివరకు టీడీపీ తరఫున నామినేషన్ కూడా వేశారు. అయితే చివరి నిమిషంలో టీడీపీ అధినేత చంద్రబాబు సునీల్‌ను పక్కనపెట్టి ఎంఎస్ రాజుకు బీఫాం ఇచ్చారు. దీంతో స్థానిక ఎస్సీ వర్గాల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈక్రమంలోనే కొందరు స్థానిక ఎస్సీ సంఘాల నాయకులు ఎంఎస్ రాజుకు వ్యతిరేకంగా ప్రకటనలు కూడా చేశారు. ఎంఎస్ రాజుపై 54 కేసులు ఉన్నాయని, అతను గెలిచినా పెద్దగా ఉపయోగం ఉండదంటున్నారు. వాయిదాల కోసం కోర్టుల చుట్టూ తిరగడానికే సమయం సరిపోతుందని చెబుతున్నారు. ప్రజలు కూడా ఆలోచించి స్థానికులకే పట్టం కట్టాలని కోరుతున్నారు.1983లో నాన్ లోకల్ అభ్యర్థిని చిత్తుగా ఓడించిన ప్రజలు..1983లో మడకశిర టీడీపీ అభ్యర్థిగా అనంతపురానికి చెందిన జగదోద్ధారకగుప్తా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో పలువురు స్థానికులు టికెట్ ఆశించినా ఎన్టీఆర్ పట్టించుకోలేదు. దీంతో మడకశిర వాసులు రగిలి పోయారు. ఆ ఎన్నికల్లో ఎన్టీఆర్ గాలి పెద్ద ఎత్తున వీచినా...మడకశిరలో మాత్రం స్థానికేతరుడైన టీడీపీ అభ్యర్థి జగదోద్ధారకగుప్తా చిత్తుగా ఓడిపోయారు. డిపాజిట్ కూడా దక్కలేదు. ప్రస్తుతం ఎంఎస్ రాజుకు ఇదే పరిస్థితి ఎదురవుతుందనే రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.స్థానికేతరుల హయాంలో అభివృద్ధికి నోచుకోని మడకశిర..మడకశిర 1962 నుంచి 1972 వరకు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంగా కొనసాగింది. ఆ పదేళ్లలో మూడుసార్లు అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. 1967, 1972 ఎన్నికల్లో స్థానికేతరులు మడకశిర నుంచి పోటీ చేశారు. 1967 స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన స్థానికేతరుడైన ఎంబీ రాజారావు గెలుపొందారు. అదే విధంగా 1972లో స్థానికేతరుడు యల్లప్ప కాంగ్రెస్ తరుఫున పోటీ చేసి గెలుపొందారు. కానీ వారిద్దరూ నియోజకవర్గ అభివృద్ధిని విస్మరించారు. అసలు నియోజకవర్గ ప్రజలకే అందుబాటులో ఉండేవారు కాదు. దీంతో చిన్నచిన్న సమస్యలు కూడా ఎవరికి చెప్పుకోవాలో తెలియక ప్రజలు ఇబ్బందులు పడ్డారు. తాజాగా టీడీపీ స్థానికేతరుడైన ఎంఎస్ రాజుకు టికెట్ ఇవ్వడంతో నాటి రోజులను నియోజకవర్గ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. -
మహేష్ గారిని మొదటిసారి చూసినప్పుడే..!
-
మహిష సినిమాకు సీక్వెల్ కథ సిద్ధం..!
-
ఈ సినిమాతో మహేష్ కు సెంటిమెంట్ గా మారిన కర్నూలు కొండారెడ్డి బురుజు
-
నరేశ్‌పై 'మళ్లీపెళ్లి' ఎఫెక్ట్
నరేశ్, పవిత్ర లోకేశ్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు ఎం.ఎస్. రాజు తెరకెక్కించిన 'మళ్లీపెళ్లి' ఇప్పటికే విడుదలై ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. కానీ ఈ సినిమాతో నరేశ్, పవిత్ర పలు వివాదాలతో మరింత పాపులర్ అయ్యారు. సినిమా విడుదలను ఆపేయాలంటూ గతంలో నరేశ్ భార్య రమ్య రఘుపతి కోర్టుకు వెళ్లింది. కానీ ఇదీ సినిమా మాత్రమే అని మేకర్స్ తెలపడంతో మూవీకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. (ఇదీ చదవండి: బాలీవుడ్‌ను భయపెడుతున్న ప్రభాస్.. కారణాలు ఇవే) తాజాగా ఈ సినిమా ఆహా, అమెజాన్ ప్రైమ్ ఓటీటీ వేదికగా (నేడు జూన్ 24) విడుదలైంది. దీంతో సినిమా స్ట్రీమింగ్‌ను ఆపేయాలంటూ ఆహాతో పాటు అమెజాన్‌కు రమ్య నోటీసులు జారీ చేశారు. సృజనాత్మక భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో వాస్తవాన్ని పక్కదారి పట్టిస్తున్నారని నోటీసులో తెలిపారు. రమ్య రఘుపతిని టార్గెట్ చేస్తూ పరువు తీయడానికే మేకర్స్ సినిమాను నిర్మించారని పేర్కొన్నారు. ఇలాంటి పనుల కోసం చలనచిత్రం వంటి కళారూపాన్ని ఉపయోగించుకోవడం సిగ్గుచేటని ఆమె మండిపడ్డారు. ఈ సినిమా వల్ల తన గౌరవం దెబ్బతింటుందని తెలిపారు. (ఇదీ చదవండి: యూత్‌ను టార్గెట్ చేస్తూ.. బోల్డ్ కామెంట్స్ చేసిన నటి) ఇప్పుడున్న పరిస్థితుల్లో OTT ఫ్లాట్‌ఫామ్‌ను వినియోగించే వారి సంఖ్య భారీగా పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు అధిక సంఖ్యలో కంటెంట్‌ను రీచ్ చేస్తున్నాయి. కాబట్టి చిత్రంలో రమ్యరఘుపతి పాత్ర వల్ల తను మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని రమ్య తరుపున న్యాయవాది తెలిపారు. ఈ నోటీసుల వల్ల ఆమెజాన్ ప్రైమ్‌లో 'మళ్లీపెళ్లి' సినిమా స్ట్రీమింగ్‌ను నిలిపేశారు.. కానీ 'ఆహా' వారు మాత్రం ఈ చిత్రాన్ని ప్రస్తుతానికి అందుబాటులో ఉంచారు. తర్వాత ఆహా కూడా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. -
Malli Pelli Review: ‘మళ్ళీ పెళ్లి’ మూవీ రివ్యూ
టైటిల్: మళ్ళీ పెళ్లి నటీనటులు: వీకే నరేశ్, పవిత్రా లోకేష్, శరత్ బాబు, జయసుధ, అన్నపూర్ణమ్మ తదితరులు నిర్మాణ సంస్థ: విజయకృష్ణ మూవీస్ నిర్మాత: వీకే నరేశ్ దర్శకత్వం: ఎమ్మెస్ రాజు సంగీతం: సురేష్ బొబ్బిలి సినిమాటోగ్రఫీ: బాల్ రెడ్డి ఎడిటర్: జునైద్ సిద్ధిక్యూ విడుదల తేది: మే 26, 2023 ప్రశ్న: ‘నరేశ్ గారు.. ‘మళ్ళీ పెళ్లి’ రమ్యా రఘుపతిపై రివేంజ్ తీర్చుకోవడానికి తీశారా? జవాబు: ఆమె పై పగ తీర్చుకోవడానికి 15 కోట్లు పెట్టి సినిమా తియ్యాలా? ఇది ఎవరిని ఉద్దేశించి తీసిన సినిమా కాదు. ఒక వయస్సు వచ్చిన తర్వాత తోడు కావాలని అనిపిస్తుంది. అలా రెండు మనసులు ఎలా కలుసుకున్నాయి? అనేదే మేము ఈ చిత్రం చెప్పాం. ప్రశ్న: ఎమ్మెస్ రాజు గారు.. ట్రైలర్ చూస్తే ఇది నరేశ్‌గారి జీవితంలో జరిగిన సంఘటనలే గుర్తు చేస్తున్నాయి. ఇది నరేశ్‌గారి బయోపిక్ అనుకోవచ్చా? జవాబు: అలా ఎలా అనుకుంటారు? ఇది ట్రెండింగ్ టాపిక్. ట్రైలర్లో చూపించిన సీన్స్ నరేశ్ నిజ జీవితంలో జరిగినే అని ఎందుకు అనుకుంటారు? యూట్యూబ్‌లో వందల వీడియోలు ఉంటాయి. అలాంటివే ఇవి. ఇది సినిమా ప్రమోషన్స్‌లో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు చిత్రబృందం ఇచ్చిన సమాధానం. టైటిల్.. ట్రైలర్.. అందులో చెప్పించిన సంభాషణలు అన్ని నరేశ్ జీవితానికి సంబధించినవే అయినప్పటికీ.. ఎక్కడా ఇది నా కథ అనిఆయన చెప్పలేదు. మరి ఇది ఎవరి కథ? నరేశ్-పవిత్రల బయోపికా? లేదా కల్పిత కథనా? ‘మళ్ళీ పెళ్లి’ కథేంటంటే.. టాలీవుడ్‌కి చెందిన సీనియర్ హీరో నరేంద్ర(వీకే నరేశ్)కు, ఆయన మూడో భార్య సౌమ్యా సేనపతి(వనితా విజయ్ కుమార్) మధ్య విభేదాలు తలెత్తుతాయి. వ్యాపారం అంటూ ఆమె.. సినిమా అంటూ నరేంద్ర ఇద్దరూ బిజీ బిజీగా గడుపుతారు. అదే సమయంలో నరేంద్రకు కన్నడ నటి పార్వతి(పవిత్రా లోకేష్) పరిచయం అవుతుంది. పార్వతికి ఇద్దరు పిల్లలు. భర్త ఫణింద్ర(అద్దూరి రవివర్మ)తో గొడవలు ఉంటాయి. ఇలా ఇద్దరి వ్యక్తిగత జీవితాల్లో సంతోషం అనేది ఉండదు. సినిమా షూటింగ్ సమయంలో ఇద్దరు ప్రేమలో పడతారు. ఆ తర్వాత ఏం జరిగింది. అసలు నరేంద్రకు మూడో భార్య సౌమ్య సేతుపతికి మధ్య గొడవలు ఏంటి? నటుడు, రచయిత అయిన ఫణింద్ర.. భార్య పార్వతికి ఎందుకు దూరంగా ఉంటున్నాడు? బెంగళూరు మీడియాను అడ్డుపెట్టుకొని సౌమ్య ఆడిన నాటకం ఏంటి? నరేంద్ర, పార్వతి కలిసి ఓ రోజు హోటల్లో ఎందుకు గడపాల్సి వచ్చింది? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. నరేశ్ నిజజీవితంలోకి పవిత్రా లోకేష్ వచ్చాక జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు ఎమ్మెస్ రాజు. ఈ విషయాన్ని సినిమా ప్రమోషన్స్‌లో ఎక్కడా చెప్పకపోయినా.. సినిమా చూస్తే అందరికి అర్థమైపోతుంది. మొత్తం ఐదు చాప్టర్లుగా సినిమాను తీర్చి దిద్దారు. మొదటి చాప్టర్లో నరేశ్-పవిత్రల పరిచయాన్ని .. రెండో చాప్టర్లో రమ్య రఘుపతిని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో చూపించారు. ఇక మూడో చాప్టర్లో పవిత్రా లోకేష్ కెరీర్.. పెళ్లి సంఘటనలను చూపించారు.నాలుగు, ఐదు చాప్టర్లలో నరేశ్-పవిత్రలు కలిసి ఉండడం.. మూడో భార్య మీడియాకెక్కడం తదితర సంఘటనలను చూపించారు. అయితే సినిమా మొత్తం చూస్తే.. నరేశ్-పవిత్ర మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకోవడంలో తప్పులేదు. నరేశ్ మూడో భార్య, పవిత్ర భర్తలు అస్సలు మంచి వాళ్లు కాదు. ఆస్తి కోసం వాళ్లను పెళ్లి చేసుకున్నారనేది ప్రేక్షకులకు అర్థమవుతుంది. మరి ఇందులో వాస్తవం ఎంతో, కల్పితం ఎంతో చెప్పలేం. కానీ సినిమాలో కొన్ని విషయాలను చాలా బోల్డ్‌గా చూపించారు ఎమ్మెస్ రాజు. ఫ్రంట్- బ్యాక్ స్క్రీన్ ప్లే తో కథనాన్ని ఆసక్తికరంగా మలిచాడు. అలాగే పవిత్రా లోకేష్ వ్యక్తిగత జీవితానికి సబంధించి తెలుగు ప్రేక్షకులకు తెలియని విషయాలను చూపించారు. ఇంటర్వెల్ సీన్ సెండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. అయితే ఇక్కడ మైనస్ ఏంటంటే.. నరేష్, పవిత్ర జీవితంలో జరిగిన ఘటనలు.. వారి నేపథ్యం గురించి అంతగా తెలియని ప్రేక్షకులకు అంతగా అర్థం కాకపోవచ్చు. కానీ బెంగళూరులో రమ్య రఘుపతి ప్రెస్ మీట్ ఎందుకు పెట్టింది? నరేశ్-పవిత్ర హోటల్లో మీడియాకు ఎలా దొరికిపోయారు? అనేది తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ఉన్నవాళ్లకు మళ్లీ పెళ్లి నచ్చుతుంది. అయితే ఇదంతా నరేశ్-పవిత్రల వెర్షన్ మాత్రమే. మరి రమ్య రఘుపతి వెర్షన్ ఏంటి అనేది ఇలాగే సినిమాను తెరకెక్కించి చెబుతారా? లేదా ప్రెస్ మీట్లో చెబుతారా అనేది తెలియాలంటే కొన్నాళ్లు మనం ఎదురు చూడాల్సిందే. ఎవరెలా చేశారంటే.. నరేంద్ర పాత్రలో నరేశ్, పార్వతి పాత్రలో పవిత్రా లోకేశ్ తమ తమ పాత్రల్లో జీవించేశారు. కొన్ని రొమాంటిక్ సీన్స్ అద్భుతంగా పండించారు. సౌమ్యా సేతుపతిగా వనితా విజయ్ కుమార్ అద్భుతంగా నటించారు. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర తనది. అయితే తెలుగు డబ్బింగ్ మాత్రం అంతగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. ఇక సూపర్‌స్టార్ పాత్రలో శరత్ బాబు, నరేంద్ర తల్లి విమలమ్మ పాత్రలో జయసుధ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక యంగ్ పార్వతిగా అనన్యా నాగళ్ల తెరపై చాలా అందంగా కలిపించింది. మిగిలిన నటీనటులు తమ పాత్రకు న్యాయం చేశారు. సాంకేతిక విషయాలకొస్తే.. సురేష్ బొబ్బిలి సంగీతం బాగుంది. పాటలతో కథలో భాగంగా వస్తుంటాయి. బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి ఫ్రేమ్‌ని చాలా అందంగా చూపించారు. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో నరేశ్ ఎక్కడా కాంప్రమైజ్ కాలేదని సినిమా చూస్తే అర్థమతుంది. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
నరేశ్, పవిత్ర గొప్ప నటులు.. ‘మళ్లీ పెళ్లి’ ఎవరి కథో తెలిసేది అప్పుడే!
‘‘మళ్ళీ పెళ్లి’లో లవ్, డ్రామాతోపాటు సెన్సేషనల్ అంశాలు ఉన్నాయి. నా కెరీర్లో ఈ మూవీకి బెస్ట్ స్క్రీన్‌ప్లే ఇచ్చాను’’ అని డైరెక్టర్ ఎంఎస్ రాజు అన్నారు. వీకే నరేశ్, పవిత్రా లోకేశ్ జంటగా నటించిన చిత్రం ‘మళ్ళీ పెళ్లి’. విజయకృష్ణ మూవీస్ బ్యానర్‌పై వీకే నరేశ్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26న విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు ఎంఎస్ రాజు మాట్లాడుతూ – ‘‘విజయ నిర్మల, కృష్ణగారు నెలకొల్పిన బేనర్ విజయ కృష్ణ మూవీస్. నరేశ్‌గారి 50 ఏళ్ల కెరీర్‌ను బేస్ చేసుకుని మంచి సినిమా చేయాలని ‘మళ్ళీ పెళ్లి’ కథని నరేశ్, పవిత్రలకు చెప్పాను. వారికి బాగా నచ్చింది. ఈ స్టోరీని నేను రాశాను కాబట్టి ఇది నా కథా? లేక నరేశ్ కథా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. ‘మళ్ళీ పెళ్లి’ కథ మొత్తం కల్పితం అని చెప్పలేను. నరేశ్, పవిత్ర గొప్ప నటులు. వారి నుంచి 50 శాతం పైగా నటన రాబట్టాను. వారి జీవితంలో జరిగిన కథే ఈ మూవీ అనుకోవచ్చు. కాలాన్ని బట్టి పరిస్థితులు, ఆలోచనలు మారుతుంటాయి. ఒంటరితనం అనేది ఎలా ఉంటుంది? వంటి అంశాలను ‘మళ్ళీ పెళ్లి’లో చూపించాం. ‘ఒక్కడు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, డర్టీ హరి’ వంటి సినిమాలు ట్రెండీగా తీసినవే. ‘డర్టీ హరి’ చేయమని ఓ యువ డైరెక్టర్ని అడిగితే.. ‘బోల్డ్ కంటెంట్.. చేయను’ అనడంతో నేనే దర్శకత్వం వహించాను. కొత్తదనంతో సినిమా తీయాలనే తపనతో నేను దర్శకునిగా మారాను.. లేదంటే ఇంట్లో కూర్చునేవాణ్ణి’’ అన్నారు. -
ఇండియాలోనే నరేష్ బెస్ట్ యాక్టర్
-
మళ్లీ పెళ్లి ట్రైలర్.. రియల్ లైఫ్ స్టోరీని దింపేశాడుగా!
సీనియర్ నటుడు నరేష్-పవిత్రా లోకేశ్ జంటగా నటిస్తున్న చిత్రం 'మళ్లీ పెళ్లి'. ఎంఎస్ రాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు నరేష్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తెలుగు, కన్నడ భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. లేటు వయసులో ప్రేమ, పెళ్లి నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి స్పందన లభించింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్ర బృందం. 'తెలుగు ఇండస్ట్రీ కన్నడ వైపు చూపు తిప్పిందేంటి?..' అన్న డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. పార్వతి.. మీ ఆయన నిన్ను బాగా చూసుకుంటాడా? అని నరేశ్ అడగ్గా.. చాలా బాగా చూసుకుంటాడని బదులిచ్చింది పవిత్ర అలియాస్ పార్వతి. అయినా పెళ్లైన ఆవిడతో మీకు లవ్వేంటి? సర్ అని మధ్యలో ఓ డైలాగ్ నరేశ్ మనసులోని మాటను బయటపెట్టింది. 'అసలైన సూపర్‌స్టార్ పెద్ద భార్య కొడుకే నరేంద్ర.. ఆయనకు మూడు పెళ్లిళ్లయ్యాయి..', 'నీతో రిలేషన్ ఉందని ఒప్పుకుంటే వాళ్లడిగే మొదటి ప్రశ్న.. ఉంచుకున్నారా? అని!' అంటూ వచ్చే డైలాగులు నరేశ్ రియల్ స్టోరీని గుర్తు చేసేలా ఉన్నాయి.. అలాగే నరేశ్ తన మూడో భార్యను తన్నడం.. చివర్లో నరేశ్, పవిత్ర ఒక హోటల్ గదిలో ఉంటే అతడి మూడో భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకునేందుకు రెడీ అయిన సన్నివేశం చూపించారు. మొత్తానికి ఈ ట్రైలర్ ద్వారా నరేశ్ తన రియల్ లైఫ్ స్టోరీని సినిమాగా తీస్తున్నాడని ఇట్టే అర్థమైపోతుంది. చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన శాకుంతలం -
నరేశ్- పవిత్ర 'మళ్లీ పెళ్లి'.. ముహుర్తం పెట్టేశారుగా!
టాలీవుడ్ సీనియర్ నటుడు వీకే నరేశ్, పవిత్ర లోకేశ్ ప్రేమాయణం గురించి అందరికి తెలిసిందే. వీరిద్దరు కలిసి నటిస్తోన్న చిత్రం 'మళ్లీ పెళ్లి.' ఈ చిత్రానికి ఎంఎస్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నరేశ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. తాజా ఈ చిత్రానికి సంబంధించి మరో క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ చిత్రాన్ని ఈనెల 26న విడుదల చేయనున్నట్లు దర్శకుడు ఎంఎస్ సుబ్బరాజు ట్వీట్ చేశారు. (ఇది చదవండి: రెండు నెలల క్రితమే నరేశ్-పవిత్ర పెళ్లి చేసుకున్నారా? అరె ఏంట్రా ఇది!) కాగా.. సీనియర్ నటుడు వీకే నరేశ్, పవిత్ర లోకేశ్ ప్రేమాయణం గురించి అందరికి తెలిసిందే. గతంలోనే ఈ జంట తమ ప్రేమను వ్యక్తం చేస్తూ ఓ వీడియోని విడుదల చేసి అందరికీ షాకిచ్చారు. అయితే అది నిజ జీవితానికి సంబంధించినది కాదని.. ఓ సినిమా కోసం అలా వీడియో చేశారని తర్వాత తెలిసింది. అయితే తన నిజ జీవితంలో జరిగిన సంఘటనలే తెరపై చూపించే ప్రయత్నం చేస్తున్నారు నరేశ్. ఈ చిత్రంలో జయసుధ, శరత్‌బాబు, వనితా విజయ్ కుమార్, అనన్య నాగళ్ల, రోషన్, రవివర్మ, అన్నపూర్ణ, భద్రం, యుక్త, ప్రవీణ్ యండమూరి, మధు తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి స్వరాలు, అరుల్ దేవ్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు. (ఇది చదవండి: పెళ్లి చేసుకున్న నరేశ్-పవిత్ర?) Life Goes in a Full Circle 💞#MalliPelli Releasing in Worldwide Theaters On May 26th ❤️🔥 Lets Start the Celebrations with some crazy updates!🕺#MalliPelliOnMay26 💥@ItsActorNaresh #PavitraLokesh @MSRajuOfficial @vanithavijayku1@sureshbobbili9 @ArulDevofficial @VKMovies_… pic.twitter.com/RWJaL0JWkJ — MS Raju (@MSRajuOfficial) May 3, 2023 -
హీరోగా ఎంట్రీ ఇస్తున్న విజయనిర్మల మనవడు
దివంగత ప్రముఖ నటి–దర్శకురాలు విజయనిర్మల మనవడు శరణ్ కుమార్ (నరేశ్ కజిన్ రాజ్‌కుమార్ కొడుకు) హీరోగా రూపొందిన చిత్రం ‘మిస్టర్ కింగ్’. శశిధర్ చావలి దర్శకత్వంలో బీఎన్ రావు నిర్మించారు. యశ్విక నిష్కల, ఊర్వీ సింగ్ కథానాయికలు. ఈ నెల 24న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా శనివారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో అతిథిగాపాల్గొన్న దర్శక–నిర్మాత ఎంఎస్ రాజు మాట్లాడుతూ – ‘‘ట్రైలర్ ప్రామిసింగ్‌గా వుంది. కొత్త కాన్సెప్ట్‌తో సినిమాని రూపొందించారనిపిస్తోంది’’ అన్నారు. ‘‘మా అల్లుడు శరణ్ హీరోగా పరిచయమవుతున్నాడు. సూపర్‌స్టార్ కృష్ణ, విజయ నిర్మలగార్ల ఆశీస్సులు ఉంటాయి’’ అన్నారు నరేష్. ‘‘ఈ చిత్రంలో బలమైన పాత్ర చేశాను’’ అన్నారు శరణ్. ‘‘ఆత్మాభిమానం వున్న ఓ అబ్బాయి కథ ఇది’’ అన్నారు శశిధర్. ‘‘సినిమా అద్భుతంగా వచ్చింది’’ అన్నారు బీఎన్ రావు. -
‘7 డేస్ 6 నైట్స్’ వసూళ్లు పెరుగుతున్నా చిన్న వెలితి: ఎంఎస్ రాజు
‘‘మా ‘7 డేస్ 6 నైట్స్’ సినిమాని ప్రేక్షకులతో కలిసి థియేటర్లో చూశాను.. వారు బాగా ఎంజాయ్ చేస్తున్నారు.. చాలా సంతోషంగా అనిపించింది’’ అని డైరెక్టర్ ఎంఎస్ రాజు అన్నారు. సుమంత్ అశ్విన్, రోహన్ హీరోలుగా మెహర్ చాహల్, కృతికా శెట్టి హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘‘7 డేస్ 6 నైట్స్’. సుమంత్ అశ్విన్ .ఎం, రజనీకాంత్ .ఎస్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదలయింది. (చదవండి: అప్పుడు నాకు ఆ సెన్స్, జ్ఞానం లేదు: నాగబాబు) ఈ చిత్రం సక్సెస్ మీట్లో చిత్రదర్శకుడు ఎంఎస్ రాజు మాట్లాడుతూ– ‘‘శంకరాభరణం’ నుంచి ఇప్పటివరకు క్లాసిక్ సినిమాల వసూళ్లు మౌత్ టాక్ వల్ల పెరిగాయి. మా సినిమాకి కూడా మౌత్ టాక్‌తో ప్రతి షోకి అన్ని చోట్ల వసూళ్లు పెరుగుతుండటం హ్యాపీ. అయితే, ఒక చిన్న వెలితి. ఈ రోజు తెలుగు ఇండస్ట్రీ పెద్ద సినిమాలకు మాత్రమే పరిమితం అయ్యిందనేది చాలా మంది ఉద్దేశం. ఇప్పుడు దాసరి నారాయణరావుగారిలా, కె.బాలచందర్గారిలా చిన్న సినిమాలు, ప్రయోగాత్మక చిత్రాలు చేస్తే?, ఈ రోజు ‘హ్యాపీ డేస్’ లాంటి సినిమాలు వస్తే? పరిస్థితి ఏంటి? అని ఆలోచించాల్సిన పరిస్థితి. చిన్న సినిమాలకు, నాలుగు కోట్ల బడ్జెట్ లోపు చిత్రాలకు టికెట్ రేట్లు తగ్గించాలి. రూ.200 టికెట్ పెట్టి చిన్న సినిమాలను ఎవరు చూస్తారు?. ప్రభుత్వాలతో చర్చించి ధర తగ్గించేలా నిర్ణయం తీసుకోవాలి’’ అన్నారు. -
కొత్త హీరోయిన్లు అని అలుసుగా చూడలేదు: ఎంఎస్ రాజు
'డర్టీ హరి'తో గతేడాది బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న ఎంఎస్ రాజు దర్శకత్వం వహించిన తాజా సినిమా '7 డేస్ 6 నైట్స్'. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో సుమంత్ అశ్విన్, ఎస్.రజనీకాంత్ నిర్మించారు. సుమంత్ అశ్విన్, రోహన్ హీరోలు. మెహర్ చాహల్, కృతికా శెట్టి హీరోయిన్లు. ఈ సినిమా శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఎంఎస్ రాజుతో ఇంటర్వ్యూ... '7 డేస్ 6 నైట్స్' కథకు మూలం ఏమిటి? మీ మనసులో ఎప్పుడు ఈ ఆలోచన వచ్చింది? నేను మొదటి నుంచి న్యూ జనరేషన్ సినిమాలతో పాటు పాత చిత్రాలు చూస్తుంటాను. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మలయాళం... ఎపిక్ సినిమాలు చూస్తా. ఆ సినిమాల్లో స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఉంటాయి. అంటే... ఇప్పుడు లేవని కాదు. 'బాహుబలి' లాంటి సినిమాలు వస్తున్నాయి. మొదటి మూడు రోజుల్లో డబ్బులు చేసుకోవాలని కొన్ని సినిమాలు వస్తున్నాయి. నేను అలా కాకుండా స్ట్రాంగ్ క్యారెక్టర్లతో సినిమా తీయాలనుకున్నాను. కరోనా కాలంలో 'డర్టీ హరి' తర్వాత కొన్ని కథలు అనుకుంటున్నాను. అప్పుడు రాజ్ కపూర్ 'బర్సాత్' చూశా. అందులో రెండు పాత్రలు నాకు బాగా నచ్చాయి. ఒకడు అతి మంచోడు. వాడికి ఎప్పుడూ ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది. హీరో ఎప్పుడూ ఏదో ఒక డేంజర్ లో ఉంటాడు. అప్పుడే సినిమా బావుంటుంది. 'ఖుషి'లో విలన్ లేకపోయినా... అమ్మాయి ఓకే అనదు. అదొక కాన్ఫ్లిక్ట్ అన్నమాట. 'బర్సాత్' క్యారెక్టర్లు నచ్చడంతో వాటిని స్ఫూర్తిగా తీసుకుని కొత్త కథ రాశా. ఈ సినిమాలో మీ అబ్బాయి సుమంత్ అశ్విన్ పాత్ర ఎలా ఉంటుంది? 'బర్సాత్'లో రాజ్ కపూర్ క్యారెక్టర్ తరహాలో సుమంత్ పాత్ర ఉంటుంది. తనను గడ్డం పెంచమని, బరువు పెరగమని చెప్పాను. అదొక కేర్లెస్ రోల్. జీవితంలో అతడికి ఒక లక్ష్యం ఉంటుంది. దాన్ని ఇంకా చేరుకోలేదు. మరో వైపు ప్రేమించిన అమ్మాయి అమెరికా వెళుతుంది. ఆ డిప్రెషన్ కనిపించాలంటే గడ్డం పెంచి, బరువు పెరగాలని చెప్పాను. పెరిగాడు కూడా! డాక్టర్‌కు సైతం అందని డిప్రెషన్లో ఉంటారు. 'బర్సాత్'లో రాజ్ కపూర్ ఫ్రెండ్ రోల్ ప్రేమనాథ్ చేశారు. మన సినిమాలో అటువంటి రోల్ రోహన్ నటించాడు. కథ, నేపథ్యాలు వేర్వేరు. కథ రాసేటప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? కథ, కాన్ఫ్లిక్ట్స్ బాగా కుదిరాయి. అయితే, యూత్‌ఫుల్ సినిమా కదా! డైలాగ్స్, సీన్స్ ఎలా రాయాలి? అనుకున్నా. అప్పుడు ఒక్కడినే గోవా వెళ్ళాను. మా ఇంట్లో కూడా చెప్పలేదు. రాజమండ్రిలో అమ్మానాన్న దగ్గరకు వెళుతున్నానని చెప్పా. డ్రైవర్ కూడా లేడు. నేనే నడుపుతూ వెళ్ళాను. గోవా వెళ్ళాక ఫోన్ స్విచ్ఛాఫ్ చేశా. ఐదారు రోజులు అంతా తిరిగా. నిర్మాతగా నేను విజయాలు సాధించా. అయితే, దర్శకుడిగా ఆశించిన విజయాలు అందుకోలేదు. అందుకని పట్టుదలతో '7 డేస్ 6 నైట్స్' కథ రాశా. గోవాలో యువత తిరిగే ప్రదేశాలు తిరిగా. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో గమనించాను. కొంత మందికి 'వీడు మనల్ని కిడ్నాప్ చేస్తాడా?' అనే ఫీలింగ్ కూడా వచ్చింది. అయినా చాలా రీసెర్చ్ చేశా. బయోపిక్ కోసమే కాదు, ఇటువంటి యూత్ ఫిలిమ్స్ చేయాలనుకున్నప్పుడు కూడా రీసెర్చ్ అవసరమే. ప్రతి సినిమాకు నేను ఈ విధంగా కష్టపడతా. ఇండస్ట్రీలో ఎవరూ అటెంప్ట్ చేయని సినిమాలు చేయాలనుకుంటున్నారా? రిటైర్మెంట్ వయసు వచ్చిన తర్వాత ఎవరైనా అలసిపోయామని, ఇక విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటారు. నాలో రోజురోజుకూ తపన పెరుగుతోంది. నేను మధ్యలో వదిలేసిన గ్యాప్ ఉంది కదా! దాన్ని భర్తీ చేసుకునేలా సినిమాలు తీస్తున్నాను. ఇండస్ట్రీలో ఎవరూ అటెంప్ట్ చేయని జానర్ సినిమాలు అని కాదు, ఒక్కసారి సినిమా స్టార్ట్ అయితే అలా వెళ్లిపోయే సినిమాలు చేయాలనుకుంటున్నా. ఒక్కోసారి చిన్న ట్విస్ట్ సినిమాను తిప్పేస్తున్నాయి. అటువంటి సినిమాలు తీయాలనుంది. '7 డేస్ 6 నైట్స్'లో ఇద్దరు కొత్త హీరోయిన్లు ఉన్నారు. వాళ్ళు ఎలా చేశారు? కొత్త హీరోయిన్లు అని అలుసుగా చూడలేదు. మహేష్ బాబు - భూమిక, ప్రభాస్ - త్రిష, సిద్ధార్థ్ - ఇలియానా నుంచి కొత్త హీరో హీరోయిన్ల వరకూ ఎవరికైనా నేను ఇచ్చే గౌరవం ఒక్కటే. పాత్రలకు తగ్గట్టు వాళ్ళిద్దరూ బాగా చేశారు. ఇది దర్శకుడిగా మీరు నిలబడే ప్రయత్నమా? మీ అబ్బాయిని హీరోగా నిలబెట్టే ప్రయత్నమా? మా అబ్బాయిని హీరోగా నిలబెట్టాలంటే 'డర్టీ హరి' చేసేవాడిని. అది నాకు కరెక్ట్ కాదనిపించింది. తను ఏ పాత్రకు సూట్ అవుతాడో... ఆ పాత్రకు తీసుకోవాలి. '7 డేస్ 6 నైట్స్'లో ఇద్దరు హీరోలు ఉన్నారు. రోహన్ చేసే కామెడీకి జనాలు నవ్వుతారు. పక్కన మరో ఎమోషనల్ రోల్ ఉంది. దానికి సుమంత్ సూట్ అవుతాడని అతడిని తీసుకున్నా. '7 డేస్ 6 నైట్స్' అంటే ఏదో అమ్మాయిలను తీసుకుని బీచ్‌కు వెళ్లడం కాదు, ఇందులో ఎమోషనల్ కంటెంట్ చాలా ఉంది. మీ అబ్బాయికి రొమాంటిక్ సీన్స్ వివరించేటప్పుడు ఇబ్బంది ఏమైనా పడ్డారా? సెట్లో మా ఇద్దరి మధ్య ప్రొఫెషనల్ రిలేషన్షిప్ ఉండేది. సుమంత్ అశ్విన్ జన్మించే సమయానికి నేను సినిమాల్లో ఉన్నాను. షూటింగ్ వాతావరణంలో పెరిగాడు. సన్నివేశాల గురించి ఇంట్లో నా భార్యకు వివరించేటప్పుడు వినేవాడు. అందుకని, ఇబ్బంది ఏమీ లేదు. ప్రొఫెషనల్స్ గా ఉన్నాం. సెట్లో నా దగ్గరకు వచ్చి నెమ్మదిగా ఎలా చేయాలని అడిగేవాడు. చెప్పినట్టు చేశాడు. ఇది అడల్ట్ కంటెంట్ సినిమా కాదు, ఫ్యామిలీ సినిమా కూడా! 'సతి' సినిమా కంప్లీట్ చేసినట్టున్నారు! అవును. రాజమండ్రి లాంటి ప్రాంతంలో భార్యాభర్తల మధ్య జరిగే కథతో తీసిన సినిమా 'సతి'. మిస్టరీ జానర్ సినిమా అని చెప్పవచ్చు. మీరు గతంలో తీసిన సినిమాలకు సీక్వెల్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? ఒక సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాను. దాన్ని 14 భాషల్లో తీస్తాం. అక్టోబర్‌లో స్టార్ట్ కావచ్చు. చాలా పెద్ద స్కేల్ లో ఉంటుంది. చదవండి: రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ' రిలీజ్ డేట్ ఫిక్స్.. ఓటీటీలో చేయను, ఎప్పటికీ నేను బిగ్ స్క్రీన్ హీరోనే! -
చిన్న సినిమాలకు ఇదే సరైన సమయం
‘‘7 డేస్ 6 నైట్స్’ డీసెంట్ ఫిల్మ్.. యువతరంతో పాటు ఫ్యామిలీ అందరూ చూడొచ్చు. మార్చి తర్వాత ‘ఆర్ఆర్ఆర్’, ‘కేజీఎఫ్ 2’ సినిమాలు విడుదలై, మంచి హిట్టయ్యాయి. చిన్న సినిమాలు రావడానికి సరైన సమయం ఇదేనని భావిస్తున్నాను’’ అన్నారు దర్శక–నిర్మాత ఎంఎస్ రాజు. సుమంత్ అశ్విన్, రోహన్ హీరోలుగా, మెహర్ చాహల్, కృతికా శెట్టి హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘7 డేస్ 6 నైట్స్’. సుమంత్ అశ్విన్ .ఎం, రజనీకాంత్ .ఎస్ నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 24న విడుదలవుతున్న సందర్భంగా కొత్త ట్రైలర్‌ను విడుదల చేశారు. చిత్రదర్శకుడు ఎంఎస్ రాజు మాట్లాడుతూ– ‘‘చిన్న సినిమా ఎన్ని వండర్స్ క్రియేట్ చేస్తుందో చూపించాలనుకుంటున్నాం. మా చిత్రాన్ని యువతరంతో పాటు కుటుంబ ప్రేక్షకులు కూడా చూడాలని తక్కువ టికెట్ రేట్స్ పెడుతున్నాం. ఈ సినిమాతో నిర్మాతలుగా మారిన మా అబ్బాయి సుమంత్, అమ్మాయి రిషితా దేవికి ఆల్ ది బెస్ట్’’ అన్నారు. ‘‘ఈ సినిమా ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది’’ అన్నారు రిషితా దేవి. ‘‘7 డేస్ 6 నైట్స్’ నాకు ఒక మాస్టర్ పీస్‌లా అనిపిస్తోంది’’ అన్నారు సుమంత్ అశ్విన్. నిర్మాత రజనీకాంత్ .ఎస్, కో ప్రొడ్యూసర్ శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు. -
దేవుడు వరమిస్తే.. మళ్లీ ఎంఎస్ రాజు గారి అబ్బాయిగానే పుడతా: సుమంత్ అశ్విన్
మా నాన్న(నిర్మాత, దర్శకుడు ఎంఎస్ రాజు) ఎలాంటి ఫాదర్ అని ఎప్పుడు ఆలోచించలేదు. నాకు ఏది కావాలంటే అది ఇచ్చారు. ఆయనే ఫర్ఫెక్ట్ ఫాదర్. మరో జన్మంటూ ఉంటే.. దేవుడు వచ్చి ఏం కావాలని అడిగితే.. మళ్లీ ఎంఎస్ రాజు దంపతులు కడుపునే పుట్టాలని కోరుకుంటా’అని యంగ్ హీరో సుమంత్ అశ్విన్ అన్నారు. సుమంత్ అశ్విన్, రోహన్ హీరోలుగా ఎంఎస్ రాజ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘7 డేస్ 6నైట్స్’.సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో సుమంత్ అశ్విన్ .ఎం, రజనీకాంత్ .ఎస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. వైల్డ్ హనీ ప్రోడక్షన్స్, వింటేజ్ పిక్చర్స్ మరియు ఏబిజి క్రియేషన్స్ వారు చిత్రనిర్మాణంలో భాగస్వాములు. జూన్ 24న సినిమా విడుదల అవుతోంది. ఈ సందర్భంగా సుమంత్ అశ్విన్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► నా కెరీర్లో సక్సెస్ ఫుల్ సినిమాలు ఉన్నాయి. డిజప్పాయింట్ చేసినవీ ఉన్నాయి. అయితే, ఈ జర్నీ చాలా అందంగా ఉంది. నా తొలి మూవీ'తూనీగ తూనీగ’విడుదలైన 10 ఏళ్లు కావోస్తుంది. ఈ పదేళ్ల కూడా చాలా స్పీడ్‌గా వెళ్లింది. ►'తూనీగ తూనీగ' కోసం మూడు నాలుగు సినిమాలకు పెట్టినంత ఎఫర్ట్ పెట్టాం. ప్రశంసలు వచ్చాయి కానీ ఆశించిన వసూళ్లు రాలేదు. కొన్ని సినిమాలు పేపర్ మీద బావుంటాయి. ఎక్కడో చిన్న తప్పు వల్ల అనుకున్న ఫలితాలు రాకపోవచ్చు. అయితే, మనం చేసే హార్డ్ వర్క్ విషయంలో ఎటువంటి లోపం ఉండకూడదు. ►ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలతో కంపేర్ చేస్తే..'7 డేస్ 6 నైట్స్’లో డిఫరెంట్ రోల్ చేశా.రియాలిటీకి దగ్గరగా ఉన్న పాత్ర అది. ఇప్పుడు ప్రేక్షకులు కూడా డిఫరెంట్ రోల్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు. కరోనా వల్ల కావచ్చు, మరొకటి కావచ్చు... ప్రేక్షకులు వరల్డ్ సినిమా చూశారు. అప్డేట్ అయ్యారు. వేరే లెవెల్లో ఉన్నారు. వాళ్ళకు రీచ్ అవ్వాలంటే మనం కూడా నెక్స్ట్ లెవెల్ థింగ్స్ చేయాలి. టైమ్ పట్టినా కొత్త రోల్స్ చేయాలనుకుంటున్నాను. ►ఈ సినిమాలో నేను ఒక నార్మల్ యంగ్‌స్టర్ పాత్ర చేశాను. అతను ఫిల్మ్ మేకర్ అవ్వాలని అనుకుంటాడు. జీవితంలో తనకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. స్ట్రగుల్ అవుతూ ఉంటాడు. ఎక్కువ స్మోక్ చేస్తాడు. వెయిట్ చేస్తాడు. తన మీద కేర్ తీసుకోడు. అటువంటి మనిషి ఎలా ఉంటాడో... నా లుక్ కూడా అలాగే ఉంటుంది. ►ఇందులో రోహన్‌ది ఇంపార్టెంట్ రోల్. అతడిని నాన్నే సెలెక్ట్ చేశారు. ముందు ఎస్టాబ్లిష్ హీరోని తీసుకుంటే బావుంటుందని అనుకున్నా. సినిమా చూశాక పర్ఫెక్ట్ కాస్టింగ్ అనిపించింది. మెహర్ ఎంత బాగా చేసిందంటే... ఆమెను 'సతి' సినిమాలో కూడా తీసుకున్నాం. ►నాన్న(ఎంఎస్ రాజు) ఇప్పుడు ఫుల్ ఫైర్‌లో ఉన్నాడు. ఎంఎస్ రాజు 2.0 అనుకోవచ్చు. 'డర్టీ హరి'తో ఆయన ప్రూవ్ చేసుకున్నారు. నాన్నతో సన్నిహితంగా ఉంటాను కాబట్టి ఆయనేంటో నాకు తెలుసు. 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' తర్వాత మధ్యలో ఎక్కడో 'ప్రేక్షకులకు ఏం కావాలో అదే ఇవ్వాలి. సేఫ్ గేమ్... ఫ్యామిలీలు, టార్గెట్ ఆడియన్స్' అంటూ చేసిన సినిమాలు కథల పరంగా కొంత డిజప్పాయింట్ చేసి ఉండొచ్చు. అవన్నీ పక్కన పెట్టి... నాన్నగారు కంప్లీట్ అప్ గ్రేడ్ అయ్యి సినిమాలు చేస్తున్నారు. నాకు అది బాగా నచ్చింది. '7 డేస్ 6 నైట్స్'లో ఎంఎస్ రాజు మార్క్ ఉంటుంది. అదే సమయంలో 20 ఏళ్ళ దర్శకుడు తీసినట్టు ఉంటుంది. ► చిన్నప్పుడు, బాగా వెయిట్ ఉండేవాడిని. అప్పుడు వెంకటేష్, ప్రభాస్, మహేష్ బాబు గారిని చూస్తే ఫిట్‌గా, హ్యాండ్సమ్గా ఉండేవారు. మంచి డ్రస్సులు వేసుకునేవారు. నేను వెయిట్ వల్ల అటువంటి డ్రస్సులు వేసుకోలేకపోయేవాడిని. డ్యాన్సులు చేసేవారు. షూటింగ్స్ చేసేటప్పుడు వాళ్ళను చూసి... నేను అలా చేయలేనని అనుకున్నా. అప్పుడు సినిమాటోగ్రాఫర్ లేదా డైరెక్టర్ కావాలనుకున్నా. 'వర్షం' సమయంలో నిక్సన్ మాస్టర్ పరిచయం అయ్యారు. ఆయన దగ్గర ఏరోబిక్, డ్యాన్సులో కొన్ని క్లాసులు తీసుకున్నా. అప్పుడు వెయిట్ తగ్గా. మా సినిమాల్లో హీరో హీరోయిన్ల ఫోటోషూట్స్ టైమ్‌లో వెళితే... నా ఫోటోలు కొన్ని తీశారు. అవి త్రివిక్రమ్ గారు, ప్రభుదేవా గారు చూసి 'చాలా బావున్నాడు. బాడీ బిల్డ్ చేస్తే మంచి హీరో అవుతాడు' అని చెప్పారు. నా మనసులో అది ఉండిపోయింది. దాంతో ముంబై వెళ్లి యాక్టింగ్ కోర్స్ చేశా. హీరో కావాలనుకున్నా. ► నాకు బోల్డ్ అనే పదం నచ్చదు. యువత అడల్ట్ కంటెంట్ కోసం థియేటర్లకు రావాల్సిన అవసరం లేదు. ఎవరూ రారు కూడా! ఇంటర్నెట్లో బోలెడు కంటెంట్ ఉంది. కథ ఉంటేనే ఎవరైనా థియేటర్లకు వస్తారు.'7 డేస్ 6 నైట్స్' ఫ్యామిలీతో చూసే మూవీ ► 'డర్టీ హరి'తో నిర్మాతలకు మంచి లాభాలు వచ్చాయి. దాని తర్వాత ఏ సినిమా చేయాలని నాన్న ఆలోచిస్తున్నారు. ఆయన దగ్గర ఆరేడు కథలు ఉన్నాయి. అందులో ఇది చేద్దామని అనుకున్నప్పుడు... నేను ప్రొడ్యూస్ చేయాలనుకున్నా. చిరంజీవి గారి దగ్గర నుంచి ఇండస్ట్రీలో చాలా మంది దర్శక, నిర్మాతలు నాన్నగారిని హానీ అని పిలుస్తారు. 'డర్టీ హరి' తర్వాత నాన్నగారు వైల్డ్ గా అనిపించారు. అందుకని 'వైల్డ్ హనీ ప్రొడక్షన్స్' అని పేరు పెట్టా. -
7 డేస్ 6 నైట్స్ ట్రైలర్ వచ్చేసింది..
‘7 డేస్ 6 నైట్స్’. సుమంత్ అశ్విన్, మెహెర్ చాహల్, రోహన్, క్రితిక శెట్టి హీరోహీరోయిన్లుగా నటించారు. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో సుమంత్ అశ్విన్, రజనీకాంత్ .ఎస్ నిర్మించారు. వైల్డ్ హనీ ప్రొడక్షన్స్, వింటేజ్ పిక్చర్స్, ఏబీజీ క్రియేషన్స్ చిత్రనిర్మాణంలో భాగస్వాములైన ఈ చిత్రం ఈ నెల 24న రిలీజ్ కానుంది. తాజాగా ఈ చిత్రం నుంచి కొత్త ట్రైలర్‌ని విడుదల చేశారు. దర్శకుడు ఎంఎస్ రాజు మాట్లాడుతూ–‘‘యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘7 డేస్ 6 నైట్స్’. ఈ చిత్రం అన్ని వర్గాల వారిని అలరిస్తుంది. సుమంత్ అశ్విన్ తన పాత్రలో పూర్తిగా ఒదిగిపోయి నటించాడు. మెహర్ చాహల్, రోహన్, క్రితికా శెట్టి తమ పాత్రలకి పూర్తి న్యాయం చేశారు’’ అన్నారు. ‘‘ఆద్యంతం నవ్వించే, కవ్వించే సన్నివేశాలతో అందరికీ నచ్చే యూత్ సినిమా ఇది. హైదరాబాద్, బెంగళూరు, ఉడిపి, గోకర్ణ, గోవాలో చిత్రీకరించాం’’ అన్నారు సుమంత్ అశ్విన్. ఈ చిత్రానికి సంగీతం: సమర్థ్ గొల్లపూడి, కెమెరా: నాని చమిడిశెట్టి, కో ప్రొడ్యూసర్స్: జె.శ్రీనివాసరాజు, మంతెన రాము. చదవండి: నా సినిమా ఫ్లాప్ అయినా కూడా రానా బాగుందనేవాడు పొట్టి బట్టలు వేసుకోవడం తప్పు అనడం లేదు.. సాయిపల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు -
మహేశ్‌బాబు, ప్రభాస్‌లతో సినిమా చేయను: ప్రముఖ నిర్మాత
వర్షం, మనసంతా నువ్వే, నువ్వొస్తానంటే నేనొద్దంటానా.. వంటి ఎన్నో హిట్ సినిమాలను అందించాడు నిర్మాత ఎమ్ఎస్ రాజు. టాలీవుడ్లో బడా నిర్మాతగా పేరు తెచ్చుకున్న ఈయన పరిచయాలు ఉన్నాయి కదా అని పదేపదే స్టార్ హీరోలతో సినిమాలు తీయనని అంటున్నాడు. తనకు కథే ముఖ్యమని, ఎంత పెద్ద హీరో అయినా సరే స్క్రిప్ట్ బాగోలేకపోతే సినిమాను రిజెక్ట్ చేస్తానని చెప్పుకొచ్చాడు. ఆయన దర్శకుడిగా వ్యవహరించిన 7 డేస్ 6 నైట్స్ త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతోంది. ప్రమోషన్లలో భాగంగా ఓ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో ఎమ్ఎస్ రాజు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. '9 ఏళ్ల క్రితం గుణశేఖర్, మీరూ నేను కలిసి చేద్దామండీ అని రవితేజ అడిగారు. నేను కుదరదని చెప్పేశా. త్రివిక్రమ్‌తో కలిసి సినిమా చేద్దామని మహేశ్‌బాబు అడిగినా కూడా చేయనన్నాను. అలా ఖలేజా వదిలేశాను. ఆ తర్వాత అల్లు అర్జున్ రుద్రమదేవి నా దగ్గరకు వచ్చింది, దాన్ని కూడా వద్దనుకున్నాను. . మహేశ్, ప్రభాస్ కలిసి సినిమా చేద్దామన్నా నేను వారితో చేయను. ఒట్టేసి చెబుతున్నా.. డేట్స్ ఇచ్చి చేద్దామన్నా సరే నేను చేయను. నేను స్టార్ హీరోల కన్నా కథనే ఎక్కువగా నమ్ముతాను. నిజం చెప్పాలంటే పెద్ద హీరోల సినిమాల కంటే మనసంతా నువ్వే చిత్రంతో నాకు ఎక్కువ లాభాలొచ్చాయి. నాకు నచ్చిన సినిమాలే చేస్తాను' అని తెలిపాడు ఎమ్ఎస్ రాజు. చదవండి: రాముడు బుద్ధిమంతుడు అని చెప్తే ఇప్పుడు ఎవడూ వినడు మాడవీధుల్లో చెప్పులేసుకుని తిరిగిన నయనతార -
భూమిక ఇంగ్లీషులో భయంకరంగా తిట్టింది: నిర్మాత ఎంఎస్ రాజు
MS Raju Says Bhumika Serious On Fighter In Okkadu Shooting: ఒక్కడు, వర్షం, నువ్ వస్తానంటే నేనొద్దంటాన వంటి తదితర బ్లాక్‌బస్టర్ హిట్స్ ఇచ్చిన ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు. నిర్మాతగా ఎన్నో అవార్డులు అందుకున్న ఆయన 2008లో వచ్చిన 'వాన' సినిమాతో డైరెక్టర్‌గా మారారు. తర్వాత తూనిగ తూనిగ (2012), డర్టీ హరీ (2020) చిత్రాలతో దర్శకుడిగా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. తాజాగా ఆయన డైరెక్ట్ చేసిన చిత్రం '7 డేస్ 6 నైట్స్'. ఈ మూవీ జూన్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఎంఎస్ రాజు, ఆయన తనయుడు, హీరో సుమంత్ అశ్విన్ ఒక టాక్ షోలో పాల్గొన్నారు. ఈ ప్రోగ్రామ్‌లో అప్పట్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన భూమిక గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ఒక్కడు సినిమా షూటింగ్ సమయంలో ఫైటర్‌పై భూమిక సీరియస్ అయిందన్న విషయం గురించి హోస్ట్ అడిగాడు. అందుకు సమాధానంగా 'నేను, మహేశ్ బాబు, భూమిక పక్కపక్కన కూర్చున్నాం. ఒక్కసారిగా భూమిక పైకి లేచింది. ఏం తిట్టిందో తెలియదు. ఇంగ్లీషులో ఏదో తిట్టింది. అదేదో భయంకరంగా ఉంది.' అని ఎంఎస్ రాజు తెలిపారు. చదవండి: పెళ్లి కాకుండానే బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్.. ఇప్పుడు మరో నటుడితో ప్రేమాయణం ఆ పాత్ర నాకు నచ్చలేదు.. కానీ ఒప్పుకున్నా: సత్యరాజ్ -
నవ్వించే.. కవ్వించేలా ‘7 డేస్ 6 నైట్స్’
‘డర్టీ హరి’ చిత్రం తర్వాత ఎంఎస్ రాజు దర్శకత్వం వహించిన మరో యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘7 డేస్ 6 నైట్స్’. సుమంత్ అశ్విన్, రోహన్ హీరోలుగా, మెహర్ చాహల్, క్రితికా శెట్టి హీరోయిన్లుగా నటించారు. సుమంత్ అశ్విన్, రజనీకాంత్ .ఎస్ నిర్మించారు. ఈ చిత్రాన్ని ఈ నెల 24న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఎంఎస్ రాజు మాట్లాడుతూ– ‘‘ఆకట్టుకునే కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, విజువల్స్, మ్యూజిక్‌తో ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది’’అన్నారు. ‘‘అందరికీ నచ్చే యూత్‌ఫుల్ సినిమా ఇది’’ అన్నారు సుమంత్ అశ్విన్. ‘‘ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు సహ నిర్మాతల్లో ఒకరైన జె. శ్రీనివాసరాజు. ఈ చిత్రానికి సంగీతం: సమర్థ్ గొల్లపూడి, కెమెరా: నాని చమిడిశెట్టి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత, కో–డైరెక్టర్: యువి సుష్మ, కో ప్రొడ్యూసర్: మంతెన రాము. -
కొత్త సినిమా ప్రకటించిన ఎమ్ఎస్ రాజు, ఫస్ట్‌లుక్ రిలీజ్
‘డర్టీ హరి’ తర్వాత ప్రముఖ నిర్మాత ఎమ్ఎస్ రాజు దర్శకత్వం వహించిన ‘7 డేస్ 6 నైట్స్’ చిత్రం రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. మంగళవారం (మే 10)న ఆయన బర్త్ డే. ఈ సందర్భంగా ఎమ్ఎస్ రాజు దర్శకత్వంలో రానున్న ‘సతి’ ఫస్ట్ లుక్ రిలీజైంది. సుమంత్ అశ్విన్, మెహెర్ చాహల్ జంటగా నటిస్తున్నారు. సీనియర్ నటుడు నరేశ్ కీలక పాత్రలో నటించనున్నాడు. రఘురామ్, టి. సారంగ సురేష్‌కుమార్, డా. రవి దాట్ల, సుమంత్ అశ్విన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘‘కొత్త దంపతుల మధ్య జరిగే అనుకోని సంఘటనల చుట్టూ అల్లిన కథ ఇది. ఉద్వేగభరిత సన్నివేశాలతో రూపొందిస్తున్న ‘సతి’ నా కెరీర్లో గర్వించదగ్గ చిత్రంగా నిలుస్తుంది’’ అన్నారు ఎమ్ఎస్ రాజు. ఈ సినిమాకు సహనిర్మాత: జె.వాస రాజు. Presenting you the First Look of our next #Sathi 💥 A @SumanthArtPro proud presentation 😇 Produced By @WildHoneyPro & @RamantraCreate @MSumanthAshwin #MeherChahal @DrRaviPRaju @EditorJunaid @PulagamOfficial pic.twitter.com/zQJMQz8HWO — MS Raju (@MSRajuOfficial) May 10, 2022 -
‘‘7 డేస్ 6 నైట్స్’ షూటింగ్ పూర్తి..ఎం.ఎస్ రాజు ఎమోషనల్
‘‘7 డేస్ 6 నైట్స్’ చిత్రంతో మా అబ్బాయి సుమంత్ అశ్విన్‌ని నిర్మాతగా పరిచయం చేయడం హ్యాపీగా ఉంది. ఆకట్టుకునే సీన్స్, అద్భుతమైన విజువల్స్‌తో హృదయాన్ని హత్తుకునేలా ఈ కథ ఉంటుంది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు నిర్మించిన మా సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్‌కి ఈ చిత్రంతో పూర్వ వైభవం వస్తుంది’’ అన్నారు ఎంఎస్ రాజు. సుమంత్ అశ్విన్, మెహర్ చావల్, రోహన్, క్రితికా శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘7 డేస్ 6 నైట్స్’. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్ప ణలో ఎంఎస్ రాజు దర్శకత్వంలో సుమంత్ అశ్విన్ .ఎం, రజనీకాంత్ .ఎస్ నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ‘‘నిర్మాణం– దర్శకత్వం ఏదయినా నాన్నగారు ఎంతో పట్టుదలతో, ఇష్టంతో చేస్తారు’’ అన్నారు సుమంత్ అశ్విన్. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత, కో–డైరెక్టర్: యూవీ సుష్మ, సహనిర్మాతలు: జె. శ్రీనివాసరాజు, మంతెన రాము. చదవండి : ఆ స్టార్ హీరో సినిమా చూసి కన్నీరు పెట్టుకున్న రకుల్! అఫీషియల్ ప్రోమో: అమెజాన్‌లో 'టక్ జగదీష్' -
7 డేస్ 6 నైట్స్: గోవాలో 100 మంది.. 4 కెమెరాలు..
‘డర్టీ హరి’ తర్వాత ఎం.ఎస్. రాజు దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘7 డేస్ 6 నైట్స్’. సుమంత్ అశ్విన్, మెహెర్ చాహల్, రోహన్, క్రితికి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో ఎం. సుమంత్ అశ్విన్, ఎస్. రజనీకాంత్ నిర్మిస్తున్నారు. గోవా షెడ్యూల్ ముగించుకున్న చిత్రబృందం హైదరాబాద్ వచ్చేసింది. ఈ సందర్భంగా ఎం.ఎస్. రాజు మాట్లాడుతూ.. ‘విభిన్నమైన కథనం, సన్నివేశాలతో ‘7 డేస్ 6 నైట్స్’ కథ ఆసక్తికరంగా ఉంటుంది. సుమంత్ తన కెరీర్లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఈ చిత్రం ద్వారా 16 మంది కొత్తవారిని పరిచయం చేస్తున్నాం. గోవాలో ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరించాం. గోవాలో భారీ వర్షాలు కురుస్తున్నా, కరోనా నియమాలు కఠినంగా అమలవుతున్నప్పటికి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ...100 మంది బృందంతో, 4 కెమెరాలతో తెరకెక్కించాం. తర్వాతి షెడ్యూల్‌ను మంగళూరు, ఉడుపిలో ప్లాన్ చేశాం’ అన్నారు. అలాగే సహా నిర్మాత జె శ్రీనివాసరాజు మాట్లాడుతూ.. చిత్రీకరణ చివరి దశలో ఉండగానే మరోవైపు నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. -
‘7 డేస్ 6 నైట్స్’ ఫస్ట్ లుక్ విడుదల
'డర్టీహరి'తో డైరెక్టర్‌గా మారిన ఎమ్మెస్ రాజు తెరకెక్కిస్తున్న మరో చిత్రం '7 డేస్ 6 నైట్స్'. సుమంత్ అశ్విన్, ఎం. రజనీకాంత్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో సమంత్ అశ్విన్ హీరోగా నటిస్తున్నారు. అశ్విన్ సరసన మెహర్ చావల్ అనే కొత్త అమ్మాయి హీరోయిన్గా పరిచయం కానుంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఇప్పటికే 60 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ తర్వాతి షెడ్యూల్ ఈ నెల 28 నుంచి ఉంటుందని డైరెక్టర్ ఎమ్మెస్ రాజు తెలిపారు. ఇక రోహన్, కృతికా శెట్టి సైతం ఈ సినిమాలో కీలకపాత్రల్లో కనిపించనున్నారు. సమర్థ్ గొల్లపూడి సంగీతం అందిస్తున్నారు. Here's the first look of a refreshing tale of love n life #7Days6Nights Stay tuned for an @MSRajuOfficial directorial @SumanthArtPro @MSumanthAshwin @RajnikantSOffl @SamarthGollapu5 @EditorJunaid @WildHoneyPro #WintagePictures @AbgCreations @PulagamOfficial pic.twitter.com/C4Z1RRMbeu — BARaju's Team (@baraju_SuperHit) July 22, 2021 -
7 డేస్ 6 నైట్స్... షూటింగ్ మొదలైంది
'డర్టీ హరి' చిత్రం తర్వాత ఎంఎస్ రాజు దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం '7 డేస్ 6 నైట్స్'. సుమంత్ అశ్విన్, ఎం. రజనీకాంత్ ఎస్. నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్, హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఎంఎస్ రాజు మాట్లాడుతూ.. 'ఇదొక కూల్ అండ్ న్యూ ఏజ్ ఎంటర్టైన్మెంట్ సర్. వినోదానికి మంచి అవకాశం ఉంది. నటీనటుల వివరాల్ని గోప్యంగా ఉంచాం' అన్నారు. 'జూలై 10 వరకు హైదరాబాద్‌లో చిత్రీకరిస్తాం. ఆ తర్వాత 15 నుంచి గోవా, మంగుళూరు, ఉడిపి, అండమాన్- నికోబార్ దీవుల్లో చిత్రీకరిస్తాం. సెప్టెంబర్‌లో చిత్రాన్ని విడుదల చేస్తాం' అన్నారు సుమంత్ అశ్విన్. ఈ చిత్రానికి సంగీతం: సమర్థ్ గొల్లపూడి, కెమెరా: నాని చమిడిశెట్టి, లైన్ ప్రొడ్యూసర్: జె.శ్రీనివాసరాజు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: యువి సుష్మ, కో ప్రొడ్యూసర్: ఎం.రాము. చదవండి: '7 డేస్ 6 నైట్స్'.. డర్టీ హరీని మించి ఉంటుంది -
'ప్రభుదేవాతో గొడవలు'..క్లారిటీ ఇచ్చిన నిర్మాత ఎంఎస్ రాజు
వెంకటేశ్ హీరోగా వచ్చిన ‘శత్రువు’ సినిమాతో నిర్మాగా మారారు ఎంఎస్ రాజు. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకొని ఆ తర్వాత ఎన్నో హిట్ చిత్రాలను నిర్మించారు. ఆ తర్వాత ‘దేవి’, ‘మనసంతా నువ్వే’, ‘ఒక్కడు’, ‘వర్షం’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించారు. ప్రభుదేవా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం పౌర్ణమి. ఈ చిత్రాన్ని కూడా ఎంఎస్ రాజునే నిర్మించారు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ఆ సమయంలో డైరెక్టర్ ప్రభుదేవాకు, ఎంఎస్ రాజుకు మధ్య గొడవలు వచ్చాయని, ప్రభాస్ దీన్ని సద్దుమణిగించారని అప్పట్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఇదే విషయంపై ఓ ఇంటర్వ్యూలో ఎంఎస్ రాజు క్లారిటీ ఇచ్చారు. 'ప్రభుదేవాకు నాకు చాలా గొడవలు అయ్యాయని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదు. నిజానికి ప్రభుదేవా మంచి పొజిషన్లో ఉన్నాడని సంతోషిస్తాను కానీ అతనితో నాకు గొడవలు ఎందుకు ఉంటాయి? ఇది కేవలం పుకార్లు మాత్రమే' అని వివరించారు. ఇక నిర్మాతగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాను అందించిన ఎంఎస్ రాజు కొంతం గ్యాప్ తర్వాత దర్శకునిగా మారిన సంగతి తెలిసిందే. గత ఏడాది ‘డర్టీ హరి’తో దర్శకుడిగా మంచి విజయం అందుకున్న ఆయన తాజాగా తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో వైల్డ్ హనీ ప్రొడక్షన్ పతాకంపై ‘7 డేస్ 6 నైట్స్’ పేరుతో ఈ చిత్రం తెరకెక్కనుందని పేర్కొన్నారు. చదవండి : మెగాస్టార్ చిరంజీవికి చెల్లిగా అనుష్క నటించనుందా? Karnataka: సీఎం కావాలని ఉంది: ఉపేంద్ర -
'7 డేస్ 6 నైట్స్'.. డర్టీ హరీని మించి ఉంటుంది
‘శత్రువు’, ‘దేవి’, ‘మనసంతా నువ్వే’, ‘ఒక్కడు’, ‘వర్షం’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఎంఎస్ రాజు దర్శకునిగా మారిన సంగతి తెలిసిందే. గత ఏడాది ‘డర్టీ హరి’తో దర్శకుడిగా మంచి విజయం అందుకున్న ఎంఎస్ రాజు పుట్టినరోజు నేడు (మే 10). ఈ సందర్భంగా దర్శకుడిగా తన తదుపరి చిత్రాన్ని ప్రకటించారు. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో వైల్డ్ హనీ ప్రొడక్షన్ పతాకంపై ‘7 డేస్ 6 నైట్స్’ పేరుతో ఈ చిత్రం తెరకెక్కనుంది. వింటేజ్ పిక్చర్స్, ఏబీజీ క్రియేషన్స్ వారు ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వాములు. సుమంత్ అశ్విన్, రజనీకాంత్ .ఎస్ నిర్మాతలు. ఈ సందర్భంగా సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ– ‘‘జూన్ 7న ‘7 డేస్ 6 నైట్స్’ చిత్రీకరణ ప్రారంభించాలనుకుంటున్నాం. హైదరాబాద్, గోవా, మంగుళూరు, అండమాన్ నికోబార్ దీవుల్లో షూటింగ్ చేయనున్నాం. ప్రస్తుతానికి నటీనటుల వివరాలు గోప్యంగా ఉంచుతున్నాం’’ అన్నారు. ఎంఎస్ రాజు మాట్లాడుతూ– ‘‘న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రమిది. ‘డర్టీ హరి’ని మించి ఉంటుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సమర్థ్ గొల్లపూడి, కెమెరా: నాని చమిడిశెట్టి, లైన్ ప్రొడ్యూసర్: జె. శ్రీనివాసరాజు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: యువి సుష్మ, కో ప్రొడ్యూసర్: మంతెన రాము. -
నిర్మాతగా మారిన యంగ్ హీరో.. తండ్రితో తొలి సినిమా!
ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు కుమారుడు, యంగ్ హీరో సుమంత్ అశ్విన్ కొత్త జర్నీని మొదలుపెట్టబోతున్నాడు. ఇటీవల పెళ్లి చేసుకున్న ఆయన నటనకి కాస్త విరామం ఇచ్చి నిర్మాతగా రాణించాలనుకుంటున్నాడు. వైల్డ్ హనీ ప్రొడక్షన్స్ పేరుతో సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించి సినిమాలు నిర్మించబోతున్నాడు. తన తొలి సినిమాకి తండ్రి ఎంఎస్ రాజు దర్శకత్వం వహించబోతున్నారట. కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కబోతున్న ఈ సినిమాకి 7 డేస్… 6 నైట్స్ టైటిల్ ఫిక్స్ చేశారట. కాగా, నిర్మాత ఎంఎస్ రాజు ఇటీవల 'డర్టీ హరి' సినిమాతో దర్శకుడిగా మంచి హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీ అందించిన సక్సెస్ జోష్‌తోనే కొడుకు నిర్మాణ సంస్థలో కొత్త చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. తర్వలోనే ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికానున్నట్లు సమాచారం. ఇక సుమంత్ విషయానికి వస్తే.. తూనీగ తూనీగ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత కేరింత, కొలంబస్, ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్, హ్యాపీ వెడ్డింగ్, ప్రేమకథ చిత్రం 2 చిత్రాల్లో హీరోగా నటించి మెప్పించాడు. -
సుమంత్ పెళ్లి: ప్రభాస్ సర్ప్రైజ్ గిఫ్ట్
'వర్షం', 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా'' వంటి హిట్ చిత్రాల నిర్మాత ఎమ్ఎస్ రాజు ఏకైక కుమారుడు, టాలీవుడ్ యంగ్ హీరో సుమంత్ అశ్విన్ ఓ ఇంటివాడైన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 13న అత్యంత దగ్గరి బంధువుల సమక్షంలో దీపిక మెడలో మూడు ముళ్లు వేసి ఆమెను ఇల్లాలిని చేసుకున్నాడు. కరోనా నేపథ్యంలో టాలీవుడ్ సెలబ్రిటీలు ఈ పెళ్లికి హాజరు కాలేకపోయారు. అయితే నెట్టింట మాత్రం విషెస్ తెలిపారు. ఈ క్రమంలో తాజాగా బాహుబలి ప్రభాస్.. సుమంత్‌కు పెళ్లి శుభాకాంక్షలు చెప్తూ ప్రత్యేక బహుమతి పంపాడు. ఇందులో ఓ పుష్పగుచ్ఛంతో పాటు పట్టు వస్త్రాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. "కొత్త జీవితాన్ని ఆరంభించిన నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రభాస్ బొకేతో పాటు కానుకలు పంపాడు" అని చెప్తూ ఎమ్ఎస్ రాజు ఈ గిఫ్ట్ ఫొటోలను ట్విటర్లో షేర్ చేశాడు. #Prabhas sends gifts to #SumanthAshwin, wishing on his marriage with Deepika. Thank You for ur wishes Darling ❤️ pic.twitter.com/PVx14g9YGb — MS Raju (@MSRajuOfficial) February 17, 2021 కాగా నిర్మాతగా ఎమ్ఎస్ రాజు వర్షం సినిమాతో ప్రభాస్‌కు బ్లాక్‌బస్టర్ హిట్‌నిచ్చిన విషయం తెలిసిందే. ఆ తరువాత పౌర్ణమి సినిమాను కూడా ఎమ్ఎస్ రాజే నిర్మించాడు. ఈ రెండు సినిమాలు ప్రభాస్ సినీ కెరీర్లోనే ప్రత్యేకమైనవి కావడం విశేషం. చదవండి: -
ఎమ్ఎస్ రాజు కుమారుడు హీరో సుమంత్ అశ్విన్ పెళ్లి ఫోటోలు
-
ఇంటివాడైన యంగ్ హీరో సుమంత్.. ఫోటోలు వైరల్
ప్రముఖ నిర్మాత ఎమ్ఎస్ రాజు కుమారుడు, టాలీవుడ్ యంగ్ హీరో సుమంత్ అశ్విన్ ఓ ఇంటివాడయ్యాడు. హైదరాబాద్ కు చెందిన దీపికతో అతని వివాహం నగర శివార్లలోని ఫామ్ హౌస్ లో ఇరు వర్గాల కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. కరోనా నేపథ్యంలో కేవలం కుటుంబ సభ్యులు, కొద్ది మంది బంధువులు మాత్రమే ఈ వివాహ వేడుకకి హాజరయ్యారు. 'తూనీగ తూనీగ' సినిమాతో హీరోగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు సుమంత్. ఆతర్వాత ‘కేరింత’, ‘లవర్స్’, ‘ప్రేమకథా చిత్రం-2’ సినిమాల్లో నటించాడు. తాజాగా సుమంత్ నటించిన ‘మా కథ’ మూవీ కూడా మార్చి 19న విడుదలకు సిద్దంగా ఉంది -
హీరో సుమంత్ అశ్విన్ హల్దీ ఫంక్షన్.. ఫొటోలు వైరల్
ప్రముఖ నిర్మాత ఎమ్ఎస్ రాజు ఎకైక కూమారుడు, యువ హీరో సుమంత్ అశ్విన్ పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌కు చెందిన దీపిక అనే అమ్మాయి మెడలో శనివారం(ఫిబ్రవరి 13)సుమంత్ మూడుముళ్లు వేయనున్నాడు. ఈ నేపథ్యంలో గురువారం ఈ కొత్త జంట హల్దీ ఫంక్షన్ వేడుకను జరుపుకుంది. ఈ ఫంక్షన్లో సుమంత్ ‘కేరింత’ మూవీ సహా నటుడు విశ్వంత్, మరికొందరు నటీనటులు సందడి చేశారు. (చదవండి: దీపికతో సుమంత్ అశ్విన్ వివాహం) ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా కరోనా నేపథ్యంలో కేవలం కుటుంబ సభ్యులు, కొద్ది మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో హైదరాబాద్ పట్టణ శివారులోని వారి ఫాంహౌజ్‌లో సుమంత్-దీపికల వివాహ మహోత్సవం జరగనుంది. ‘తూనిగ తూనిగ’ మూవీతో హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సుమంత్ ఆ తర్వాత ‘కేరింత’, ‘లవర్స్’, ‘ప్రేమకథా చిత్రం-2’ లలో హీరోగా నటించాడు. తాజాగా సుమంత్ నటించిన ‘మా కథ’ మూవీ కూడా మార్చి 19న విడుదలకు సిద్దంగా ఉంది. (చదవండి: ‘నలుగురు అపరిచితులు.. గమ్యం ఒకటే’) -
హీరో సుమంత్ అశ్విన్ మెహందీ ఫంక్షన్ ఫోటోలు
-
హీరో సుమంత్ అశ్విన్ పెళ్లి డేట్ ఫిక్స్
వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా?, ఒక్కడు వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల నిర్మాత ఎమ్ఎస్ రాజు ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆయన ఏకైక కుమారుడు, హీరో సుమంత్ అశ్విన్ పెళ్లికి రెడీ అయ్యాడు. హైదరాబాద్‌కు చెందిన దీపిక అనే అమ్మాయి చిటికన వేలు పట్టుకుని ఏడడుగులు నడవనున్నాడు. ఫిబ్రవరి 13న వేదమంత్రాల సాక్షిగా ఈ వివాహం జరగనుంది. కరోనా నిబంధనలను దృష్టిలో పెట్టుకుని కేవలం ఇరు కుటుంబాలు, అత్యంత సన్నిహితుల మధ్యే ఈ పెళ్లి వేడుక జరగనున్నట్లు ఎమ్ఎస్ రాజు తెలిపాడు. (చదవండి: నమ్రత పోస్టుపై హర్ట్ అయిన నిర్మాత ఎమ్ఎస్ రాజు) సుమంత్ కెరీర్ విషయానికొస్తే.. తండ్రి ఎమ్ఎస్ రాజు డైరెక్షన్లో 'తూనీగ తూనీగ' సినిమా ద్వారా వెండితెరపై అడుగు పెట్టాడు. కానీ ఈ సినిమా అంచనాలను అందుకోలేక బొక్కబోర్లాపడింది. తర్వాత ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో చేసిన 'అంతకు ముందు ఆ తరువాత' హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇక మూడో చిత్రం 'లవర్స్' మాత్రం అతడికి కమర్షియల్ బ్రేకిచ్చి హీరోగా నిలబెట్టింది. కేరింతతో బిగ్ సక్సెస్ అందుకున్నాడు. ప్రస్తుతం ఇతడు శ్రీకాంత్, భూమిక, తాన్యా హోప్‌తో కలిసి 'ఇదే మా కథ'(రైడర్స్ స్టోరీ)లో నటిస్తున్నాడు. ఈ సినిమాకు గురుపవన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఎమ్ఎస్ రాజు విషయానికొస్తే.. ఆయన సక్సెస్ఫుల్ నిర్మాతగానే కాదు, మంచి దర్శకుడిగానూ పేరు తెచ్చుకున్నాడు. తూనీన తూనీగ, వాన సినిమాలకు డైరెక్షన్ చేసిన ఆయన ఈ మధ్య డర్టీ హరి సినిమాకు దర్శకత్వం వహించాడు. (చదవండి: పుష్ప రిలీజ్ డేట్‌పై సుకుమార్ అసంతృప్తి!) We're immensely Happy to announce the wedding of our son Chi. #Sumanth with Chi. #Deepika on Feb 13th 2021. Given the unusual times, the wedding is going to be a very private affair. Although we deeply miss ur presence, we shall rejoice your love & blessings to the newly weds ❤️ pic.twitter.com/mU3lPZibs3 — MS Raju (@MSRajuOfficial) February 3, 2021 -
త్వరలో ప్రముఖ టాలీవుడ్ హీరో పెళ్లి!
ప్రముఖ నిర్మాత, డర్టీ హరి దర్శకుడు ఎమ్ఎస్ రాజు ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నట్లు తెలుస్తోంది. ఆయన తనయుడు, హీరో సుమంత్ అశ్విన్ తొందర్లోనే ఓ ఇంటివాడు కాబోతున్నట్లు సమాచారం. దీపిక అనే అమ్మాయితో ఆయన వివాహం జరగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కరోనా కాలం కాబట్టి తక్కువ మంది సమక్షంలోనే అదీ హైదరాబాద్‌లోనే ఈ పెళ్లి తంతును కానిచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారట. నెట్టింట వైరల్‌గా మారిన ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందనేది తెలియాలంటే హీరో సుమంత్ అధికారికంగా ప్రకటించేవరకు వేచిచూడాల్సిందే! (చదవండి: మూగజీవాన్ని రక్షించిన హీరో, రేణూ ప్రశంస) ఇక సుమంత్ కెరీర్ విషయానికి వస్తే.. తండ్రి ఎమ్ఎస్ రాజు డైరెక్షన్లో 'తూనీగ తూనీగ' సినిమా ద్వారా వెండితెరపై అడుగు పెట్టాడు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టింది. తర్వాత ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో చేసిన 'అంతకు ముందు ఆ తరువాత' హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో కొంత బూస్ట్ వచ్చినట్లైంది. ఇక మూడో చిత్రం 'లవర్స్' మాత్రం అతడికి కమర్షియల్ బ్రేకిచ్చి హీరోగా నిలబెట్టింది. ప్రస్తుతం ఇతడు శ్రీకాంత్, భూమిక, తాన్యా హోప్‌తో కలిసి 'ఇదే మా కథ'(రైడర్స్ స్టోరీ)లో నటిస్తున్నాడు. ఈ సినిమాకు గురుపవన్ దర్శకత్వం వహిస్తున్నారు. (చదవండి: నమ్రత పోస్టుపై హర్ట్ అయిన నిర్మాత ఎమ్ఎస్ రాజు) -
నమ్రత పోస్టుపై హర్ట్ అయిన నిర్మాత..
సూపర్‌స్టార్ మహేష్‌బాబు నటించిన ‘ఒక్కడు’ సినిమా విడుదలై శుక్రవారానికి 18 ఏళ్లు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మహేష్ భార్య నమ్రతా శిరోద్కర్ ఒక్కడు సినిమాను గుర్తు చేసుకుంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ‘మహేష్ సినిమాల్లో ఒక్కడు క్లాసిట్ హిట్. మళ్లీ మళ్లీ చూడలనించే సినిమా.. ఒక్కడు నాకు ఆల్‌టైమ్ ఫేవరెట్ అని పేర్కొన్నారు. ఇక్కడి వరకు అంతా బానే ఉన్నా ఈ పోస్టు ప్రస్తుతం చర్చకు దారి తీసింది. పోస్టులో.. చిత్రయూనిట్ సభ్యులైన మహేష్, భూమిక, గుణశేఖర్, ప్రకాష్ రాజ్, ఫైట్ మాస్టర్ విజయన్, మణిశర్మ ఇలా అందరి పేర్లను నమ్రత ప్రస్తావించింది. అయితే వీరిలో నిర్మాత ఎమ్ఎస్ రాజును మాత్రం మర్చిపోయింది. చదవండి: మహేష్ సినిమాకు 18 ఏళ్లు.. నమ్రత కామెంట్ View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) తాజాగా ఈ విషయాన్ని గమనించిన నిర్మాత ఎమ్ఎస్ రాజు నమ్రత ట్వీట్‌పై స్పందించారు. ఒక్కడు సినిమా గురించి పేర్కొనే సమయంలో నమ్రత తన పేరును ప్రస్తావించలేదని ఎమ్ఎస్ రాజు హర్ట్ అయ్యారు. తనకు దక్కాల్సిన గౌరవం దక్కలేదన్న కారణంతో అప్సెట్ అయ్యారు. ఈ మేరకు ట్విటర్లో ‘ పొరపాట్లు జరుగుతుంటాయి బాబు. నమ్రతగారు ఒక్కడు గురించి మాట్లాడుతూ నా పేరును మర్చిపోయారు. అయినా నాకు సంతోషమే. ఈ సినిమా ఆమెకు ఫెవరెట్ మూవీ అయినందుకు. గుడ్‌లక్’ అంటూ ట్వీట్ చేసి మహేష్‌ను ట్యాగ్ చేశారు. మరి ఎమ్ఎస్ రాజు ట్వీట్‌ను మహేష్ చూస్తాడా.. దీనిపై నమ్రత స్పందిస్తుందో లేదో తెలియాలంటే వేచి చూడాలి. ఇదిలా ఉండగా ఈ ట్వీట్‌ను చూసిన నెటిజన్లు మాత్రం మీరు లేకుండా ఒక్కడు సినిమా లేదు సార్.. ఇంతటి గొప్ప సినిమాను అందించనందుకు కృతజ్ఞతలు అని కామెంట్ చేస్తున్నారు. @urstrulyMahesh Mistakes do happen babu...namratha garu forgot my name on Instagram while addressing 18 yrs of Okkadu...but I am happy it's her favorite classic...good luck — MS Raju (@MSRajuOfficial) January 15, 2021 -
బిగ్స్క్రీన్పై రొమాన్స్ చేయనున్న ‘డర్టీ హరి’
ప్రముఖ నిర్మాత ఎం.ఎస్. రాజు దర్శకత్వం వహించిన ‘డర్టీ హరి’ సినిమా ఓటీటీ వేదికగా విడుదలై ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫ్రైడే మూవీస్ అనే యాప్ ద్వారా విడుదలైన ఈ సినిమా యూత్‌ని బాగా అట్రాక్ట్ చేసింది. తక్కువ సమయంలోనే కోటి రూపాయలకు పైగా కలెక్షన్స్‌ను రాబట్టి సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత 'ఆహా'యాప్‌తో డీల్ కుదుర్చుకొని ప్రసారం చేయడంతో మరింత లాభాన్ని తెచ్చిపెట్టింది. ఇదిలా ఉంటే ఓటీటీలో సంచలనం సృష్టించిన ఈ చిత్రాన్ని ఇప్పుడు థియేటర్లలోకి తీసుకురానున్నారు. సినిమా మంచి టాక్ సొంతం చేసుకోవడంతో థియేటర్లలో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 8న ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఓటీటీలో అదరగొట్టిన ఈ సినిమా బిగ్స్క్రీన్పై ఎంత వరకు అలరిస్తుందో చూడాలి. -
మరీ అంత డర్టీ కాదు!
చిత్రం: ‘డర్టీ హరి’; తారాగణం: శ్రవణ్ రెడ్డి, సిమ్రత్ కౌర్, రుహానీ శర్మ, సురేఖావాణి; సంగీతం: మార్క్ కె. రాబిన్; కెమెరా: బాలరెడ్డి; నిర్మాతలు: గూడూరు సతీశ్ బాబు, గూడూరు సాయిపునీత్; రచన, దర్శకత్వం: ఎం.ఎస్. రాజు; ఏ.టి.టి: ఫ్రైడే మూవీస్. ఒకటే పాట. అంతకు మించి పాటలు లేవు. కామెడీ లేదు. అడల్ట్ సీన్లు మినహాయిస్తే... రెగ్యులర్ కమర్షియల్ సినిమాలో కనపడేవేవీ లేవు. ఒకరకంగా మొదలైన సినిమా మరో రకంగా ముగుస్తుంది. అయినా సరే, ఓ సినిమా మరీ అసంతృప్తికి గురి కానివ్వకపోవడం, జనాన్ని ఆద్యంతం కూర్చోబెట్టగలగడం విశేషమే. దర్శకుడిగా ఎం.ఎస్. రాజు చేసిన మ్యాజిక్... అదే ‘డర్టీ హరి’. బహుశా, అందుకే వివాదాస్పద వాల్ పోస్టర్లు, ట్రైలర్లతో వార్తల్లోకి వచ్చిన ‘డర్టీ హరి’ చూస్తున్నప్పుడు ఉన్నట్టుండి సర్ప్రైజ్ చేస్తుంది. అంతదాకా పెట్టుకున్న అంచనాలను మార్చేస్తుంది. అదే ఈ సినిమాకు ఉన్న బలం. కథేమిటంటే..: చేయి తిరిగిన చెస్ ప్లేయర్ హరి (శ్రవణ్ రెడ్డి). ఎలాగైనా జీవితంలో పైకి రావాలనే యాంబిషన్ ఉన్న ఆ కుర్రాడు అవకాశాల వేటలో హైదరాబాద్‌కు వస్తాడు. అక్కడ ఓ బడా కంపెనీ దంపతుల (అంబరీష అప్పాజీ, సురేఖావాణి) కుమార్తె – పెయింటరైన వసుధ (రుహానీ శర్మ)తో ప్రేమలో పడతాడు. మరోపక్క వసుధ కజిన్, హరికి స్నేహితుడూ అయిన ఆకాశ్ ఏమో సినిమాల్లోకి పైకి రావాలని ప్రయత్నిస్తున్న మోడల్ గర్ల్ జాస్మిన్ (సిమ్రత్ కౌర్)తో ప్రేమలో ఉంటాడు. వసుధతో ప్రేమ పెళ్ళి పీటలకెక్కే దశలో ఉన్నప్పటికీ, హరి మాత్రం తన స్నేహితుడి లవర్ మీద కన్నేస్తాడు. జాస్మిన్ కూడా హరికి లొంగిపోతుంది. తీరా ఆకాశ్‌తో ఆమె ప్రేమ బ్రేకప్ అవుతుంది. వసుధతో పెళ్ళయిపోయినా సరే జాస్మిన్‌తో ఎఫైర్‌ను మన యాంబిషియస్ హరి కొనసాగిస్తాడు. ఆ క్రమంలో జాస్మిన్ గర్భవతి అవుతుంది. ఆ వ్యవహారం చివరకు ఎక్కడ దాకా వెళ్ళింది, హరి వైవాహిక జీవితం ఏ మలుపు తిరిగింది, ఏమైంది అన్నది ఆసక్తికరంగా సాగే చివరి ముప్పావుగంట మిగతా కథ. ఎలా చేశారంటే..: దాదాపు రెండు గంటల సినిమాకు ప్రధాన బలం ప్రధాన పాత్రల్లో హరిగా నటించిన శ్రవణ్ రెడ్డి, జాస్మిన్‌గా కనిపించిన పంజాబీ పిల్ల సిమ్రత్ కౌర్. ఈ హీరోయిన్ గతంలో ‘పరిచయం’ లాంటి ఒకటీ అరా సినిమాల్లో చేసింది. కొంతకాలంగా ముంబయ్‌లో హిందీ సినిమాలు, సిరీస్‌లలో స్థిరపడ్డ తెలంగాణలోని కరీంనగర్ కుర్రాడైన శ్రవణ్ రెడ్డికి తెలుగులో ఇదే తొలి పెద్ద ఛాన్స్. అలా ఈ ప్రధాన పాత్రధారులిద్దరూ మన ప్రేక్షకులకు కొత్త ముఖాల కిందే లెక్క. అయినప్పటికీ, క్యారెక్టరైజేషన్లో కొన్ని లోటుపాట్లు ఉన్నప్పటికీ ఇద్దరూ తెరపై ఆకట్టుకుంటారు. ఫస్టాఫ్‌లో కథానుగుణంగా హీరో స్వభావాన్ని ఎస్టాబ్లిష్ చేసే క్లిష్టమైన అడల్ట్ సీన్లలో అచ్చంగా పాత్రలలానే ప్రవర్తించారు. ఇక, జీవితంలో పైకి ఎదగడానికి ఎత్తులు పైయెత్తుల ఆట, కళ్ళలోనే కనిపించేసే కామం, మనసులోని చెడును కనపడనివ్వకుండా పైకి మంచిగా ప్రవర్తించే తీరు, కోపం – ఇలా బోలెడన్ని వేరియేషన్లను హరి పాత్రలో శ్రవణ్ రెడ్డి బాగా చూపించారు. కడుపు పండాలని ఆరాటపడే అమ్మాయిగా రుహానీ శర్మ ఉన్నంతలో బాగానే చేశారు. మిగిలిన పాత్రలన్నీ కథానుగుణంగా వచ్చిపోతుంటాయి. చివరలో వచ్చే పోలీసు ఇంటరాగేషన్ సీన్ల లాంటివి మరికొంత బలంగా రాసుకొని ఉంటే ఇంకా బాగుండేది. ఎలా తీశారంటే..: ‘దేవి’, ‘మనసంతా నువ్వే’, ‘ఒక్కడు’, ‘వర్షం’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ లాంటి అభిరుచి గల చిత్రాలు నిర్మించి, భారీ విజయాలు అందుకున్న ప్రముఖ నిర్మాత ఎం.ఎస్. రాజుకు దర్శకుడయ్యాక లభించిన సక్సెస్ శూన్యం. ఈ నేపథ్యంలో ఆయన తన ట్రెండ్ మార్చి, ‘డర్టీ హరి’ లాంటి పేరుతో, పెద్దలకు మాత్రమే కంటెంట్‌తో న్యూ ఏజ్ సినిమా తీస్తుంటే సహజంగానే ఆశ్చర్యమేస్తుంది. తీరా సినిమా చూశాక కథాగమనం, కథలోని ట్విస్టులతో ఆశ్చర్యం పెరుగుతుంది. అందుకే, ఈ సినిమాకు కర్త, కర్మ, క్రియ – దర్శకుడు ఎం.ఎస్. రాజే! దర్శక – రచయిత, నిర్మాతలు ఎవరూ పైకి చెప్పకపోయినా, సినీ ప్రియులు ఈ కథకు మూలం ఇట్టే చెప్పేస్తారు. ఉడీ అలెన్ రచన, దర్శకత్వంలో పదిహేనేళ్ళ క్రితం వచ్చిన హాలీవుడ్ సినిమా ‘మ్యాచ్ పాయింట్’ (2005) కథను మనవాళ్ళు యథాతథంగా తీసుకొని, చివరి ఘట్టాలను మనదైన పద్ధతిలో మార్చేసుకున్నారు. ఆకట్టుకొనేలా, తెలివిగా ఆ కాపీ కొట్టడమే అసలైన సినీ ట్రేడ్ సీక్రెట్. హైక్లాస్ జీవితాన్ని చూపించే నేపథ్య నిర్మాణ విలువలు మొదలు కీలకమైన ఘట్టాల్లో రీరికార్డింగ్, కెమెరా వర్క్ దాకా అనేకం బాగా తీర్చిదిద్దారు. పనిలో పనిగా నవతరంలోని హైక్లాసు వర్గం వాడే అశ్లీల పదాలు ఈ సినిమాలో యథేచ్ఛగా వినిపిస్తాయి. ఫస్టాఫ్‌లో, అలాగే సెకండాఫ్ మొదట్లో కాసేపు శృంగారం మోతాదు మించి చూపించినా, చివరి ముప్పావుగంట థ్రిల్లింగ్ అంశాలు వాటిని మర్చిపోయేలా చేస్తాయి. ఒక్కమాటలో... ఫస్టాఫ్ డర్టీనెస్, క్లైమాక్స్ హెవీ హార్టెడ్నెస్ ఫీలింగ్! చూడడం పూర్తయ్యాక, సినిమా సంతృప్తిగా ఉందనే భావన కలిగిస్తాయి. చాలా గ్యాప్ వచ్చిన ఎం.ఎస్. రాజు మళ్ళీ లైమ్ లైట్లోకి వచ్చారనిపించేలా చేస్తాయి. అయితే, వచ్చిన చిక్కల్లా... థియేటర్లు పూర్తిగా ఓపెన్ కాని పరిస్థితుల్లో... ఎన్నిసార్లు చూస్తే, అన్నిసార్లు డబ్బులు కట్టి చూసే ‘పే పర్ వ్యూ’ పద్ధతిలో, టెక్నికల్ ఇబ్బందులుండే కొత్త ‘ఎనీ టైమ్ థియేటర్’ (ఏ.టి.టి.) యాప్‌లో సినిమా రిలీజు చేయడం! అది ఈ సినిమాకు ఎంత వరకు కలిసొస్తుందో వేచి చూడాలి. కొసమెరుపు: ఎంగేజింగ్ ఎరోటిక్ క్రైమ్ థ్రిల్లర్! బలాలు: ఊహించని ట్విస్టున్న కథ ఆలోచింపనివ్వని కథనం ప్రధాన పాత్రధారుల నటన, రీరికార్డింగ్ ప్రొడక్షన్ విలువలు, చివరి ముప్పావుగంట సినిమా బలహీనతలు: పిల్లాపాపలతో చూడలేని అడల్ట్ సీన్లు క్యారెక్టరైజేషన్లో ఎగుడుదిగుళ్ళు పెద్దగా పరిచయం లేని నటీనటులు. – రెంటాల జయదేవ -
డర్టీ హరి మూవీ రివ్యూ
టైటిల్ : డర్టీ హరి నటీనటులు : శ్రవణ్ రెడ్డి, రుహాణి శర్మ, సిమ్రత్ కౌర్, సురేఖ వాణి, అప్పాజీ, జబర్దస్త్ మహేష్ తదితరులు నిర్మాణ సంస్థ: ఎస్పీజే క్రియేషన్స్ నిర్మాత: గూడురు సతీష్ బాబు, గూడూరు సాయి పునీత్ స్క్రీన్‌ప్లై, దర్శకత్వం: ఎం.ఎస్. రాజు సంగీతం: మార్క్ కె రాబిన్ సినిమాటోగ్రఫీ: ఎంఎన్ బాల్ రెడ్డి ఎడిటర్ : జునైద్ సిద్ధిఖి విడుదల తేది : డిసెంబర్ 18, 2020 (ఫ్రైడే మూవీస్ ఏటీటీ ) కరోనా మహమ్మారి కారణంగా సినిమా థీయేటర్లన్నీ మూతబడటంతో కొత్త కొత్త మార్గాల్లో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అన్ని రకాల సినిమాలు ఓటీటీ వేదికగా ప్రేక్షకులను పలకరిస్తున్నాయి. ఈ క్రమంలోనే సీనియర్ నిర్మాత, దర్శకుడు ఎమ్.ఎస్ రాజు దర్శకత్వంలో వచ్చిన సినిమా డర్టీ హరి. ఈ చిత్రాన్ని ఫ్రైడే మూవీస్ ఏటీటీ (ఎనీ టైమ్ థియేటర్)లో డిసెంబర్ 18 సాయంత్రం 6 గంటలకు విడుదల చేసారు. వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి ప్రేమ కథా చిత్రాలను నిర్మించిన ఎం.ఎస్. రాజు తొలి సారి బోల్డ్ రొమాన్స్ డ్రామా సినిమాను తెరకెక్కించడం, ప్రచార చిత్రాలు కూడా వైరల్ కావడం సినిమాపై అంచనాలను పెంచాయి. మరి ఈ డర్టీ హరి అంచనాలను రీచ్ అయ్యాడో లేదో చూసేద్దాం. కథ మధ్యతరగతికి చెందిన హరి(శ్రవణ్ రెడ్డి) ఎన్నో కలలు కంటూ హైదరాబాద్‌కు వస్తాడు. అక్కడ వసుధ(రుహాని శర్మ) అనే ధనవంతుల అమ్మాయితో పరిచయడం ఏర్పడుతుంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్తుంది.ఇంతలో వసుధ సోదరుడి గర్ల్ ఫ్రెండ్ జాస్మిన్(సిమ్రాత్ కౌర్)కు హరి ఆకర్షితుడవుతాడు. వసుధతో ప్రేమలో ఉంటూనే జాస్మిన్‌తో ఎఫైర్ నడిపిస్తాడు. వసుధకి తెలియకుండా జాస్మిన్ వ్యవహారాన్ని హరి ఎలా దాచి పెట్టాడు? జాస్మిన్ ఎఫైర్ సీక్రెట్ గా దాస్తూ మేనేజ్ చేసే హరి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కున్నాడు? ఈ చిక్కు నుంచి బయట పడటానికి డర్టీ హరి ఏం చేసాడు? అనేది మిగతా కథ. విశ్లేషణ వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలతో సక్సెస్ ఫుల్ నిర్మాత గా మారిన ఎం ఎస్ రాజు.. దర్శకుడిగా కూడా అలాంటి ప్రేమ కథా సినిమాలే తీశాడు. వాన, తూనీగ తూనీగ సినిమాలు ప్లాప్ అయినప్పటికీ దర్శకుడిగా ఆయన ప్రతిభకి మంచి మార్కులు పడ్డాయి. అయితే ఈసారి ప్రేమ కథలను పక్కనబెట్టి అడల్ట్ కంటెంట్ ని నమ్ముకున్నాడు. డర్టీ హరి అనే టైటిల్ తో సినిమాలో డర్టీ ఎంతుంటుందో చెప్పకనే చెప్పేసాడు. ట్రైలర్లో కూడా అదే చూపించాడు. ఇలాంటి సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్‌కి నచ్చవని తెలిసినా కూడా ఎంఎస్ రాజు తొలిసారి పెద్ద సాహసమే చేశాడు. సినిమా స్టారింగ్లోనే బోల్డ్ సన్నివేశాలతో ప్రారంభించి రిచ్ లైఫ్ ని పరిచయం చెయ్యడం కోసం ప్రతి సీన్ లో ప్రతి ఒక్కరి చేతిలో మందు గ్లాస్, చేతిలో సిగరెట్స్, హీరోయిన్స్ తో స్కిన్ షోస్ తో బూతు డైలాగ్స్ తో సరిపెట్టాడు. యువతరం ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొనే ఈ సినిమాను తెరకెక్కించాడు. శృంగారాన్ని కూడా టైటిల్‌కు తగ్గట్టే చూపించాడు. ఫస్టాఫ్‌లో ఎక్కువగా శృంగార సన్నివేశాలను చూపించిన దర్శకుడు.. సెకండాఫ్‌లో మాత్రం అసలు కథను చూపించాడు. వేరే యువతితో ఎఫైర్ పెట్టుకోవడం వల్ల హీరో పడే కష్టాలు,తన ఇల్లీగల్ సంబంధాన్ని దాచలేక ఇద్దరి హీరోయిన్స్ మధ్యలో నలిగిపోయే హీరో ఇబ్బందులును, ఆ ఇబ్బందులను అధిగమించే క్రమంలో ఒక హత్య జరగడం, ఆ మర్డర్ కేసు నుండి హీరో ఎలా తప్పించుకున్నాడు లాంటి సన్నివేశాలను ఆసక్తికరంగా చూపించాడు. అయితే సినిమా మొత్తం వాస్తవానికి దూరంగా సినిమాటిక్‌గా సాగిపోతుంది. హీరో రావడంతో ధనవంతుల అమ్మాయితే ప్రేమలో పడిపోవడం, అలాగే వేరే యువతికి ఆకర్షితుడైపోవడం.. ఇవన్ని వాస్తవానికి చాలా దూరంగా ఉన్నట్లు కనిపిస్తాయి. ప్రేక్షకుడి ఊహకు తగ్గట్టుగానే సినిమా సాగుతోంది. ఇక సెకండాఫ్‌లో మాత్రం కొన్ని ట్విస్ట్ ఇచ్చి సినిమాను నిలబడేలా చేశాడు దర్శకుడు. సినిమాకు ప్రధాన బలం సెకండాఫ్ అనే చెప్పాలి. అలాగే హరి-జాస్మిన్ మధ్య వచ్చే సన్నివేశాలు ఆసక్తి కరంగా ఉంటాయి. హత్య కేసును కాస్త ఆసక్తికరంగా మలిస్తే బాగుండేది. నటీనటులు సినిమా మొత్తం మూడు కేరెక్టర్స్ చుట్టూనే తిరుగుతుంది. హరి పాత్రలో శ్రవణ్ రెడ్డి మెప్పిస్తాడు. ఆయన డైలాగ్ డెలివరీతో పాటు,యాక్టింగ్ చాల బాగుంది. హీరోయిన్స్ గా నటించిన రుహని శర్మ – సిమ్రత్ కౌర్ లు తమ పాత్రల్లో చెలరేగిపోయాయిరు. సిమ్రత్ కౌర్ అయితే బోల్డ్ రోల్ లో పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. కేవలం శృంగార సీన్స్‌లోనే కాకుండా తన నటనతో కూడా ప్రేక్షకులను కట్టిపడేశారు. సురేఖ వాణి, మహేష్ వంటి నటులు పాత్రల పరిధి మేర ఆకట్టుకున్నారు. మార్క్ కె రాబిన్ సంగీతం అంతగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. ఎంఎన్ బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. నిర్మాణ విలువలు కథానుసారం ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ కథ శ్రవణ్ రెడ్డి నటన యూత్‌ను మెప్పించే అంశాలు సెకండాఫ్ మైనస్ పాయింట్స్ థ్రిలింగ్ అంశాలు లేకపోవడం సన్నివేశాలు ప్రేక్షకుడి ఊహకు తగ్గట్టుగానే సాగుతుండటం ఫస్టాఫ్ సాగతీత -
రాజుగారు అలా వచ్చారు: ‘డర్టీ హరి’ హీరోయిన్
‘పరిచయం’ సినిమా తర్వాత సినిమాలు చెయ్యకూడదనుకున్నాను. ఎందుకంటే ఆ సినిమా కోసం చాలా కష్టపడ్డాను. పైగా చదువు ఆపేసి సినిమాల్లోకి వచ్చాను. చదువా? సినిమాలా? అనే డైలమాలో ఉన్నప్పుడు ‘డర్టీ హరి’ స్క్రిప్ట్‌తో ఎంఎస్ రాజుగారు దేవదూతలా వచ్చారు. స్క్రిప్ట్ కొత్తగా అనిపించింది. ఈ సినిమాలో చేసిన జాస్మిన్ పాత్ర నాకు బాగా నచ్చింది’ అన్నారు సిమ్రత్ కౌర్. శ్రవణ్ రెడ్డి, సిమ్రత్ కౌర్, రుహానీ శర్మ ముఖ్య పాత్రల్లో ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డర్టీ హరి’. ఈ సినిమా ఫ్రైడే మూవీస్ ఏటీటీ ప్లాట్‌ఫామ్ ద్వారా ఈ నెల 18న విడుదల కానుంది. సిమ్రత్ కౌర్ మాట్లాడుతూ– ‘నా మొదటి సినిమా ‘ప్రేమతో మీ కార్తీక్’లో ఫ్యామిలీ అమ్మాయిగా కనిపించా. కానీ, ‘డర్టీ హరి’లో నాది కాన్ఫిడెంట్ అండ్ బోల్డ్ పాత్ర. క్రీడా నేపథ్యం ఉన్న సినిమా చెయ్యాలన్నది నా కల. ఎందుకంటే మా అమ్మానాన్న ఒలింపిక్ ప్లేయర్స్. కరాటేలో నాకు గోల్డ్ మెడల్ ఉంది’ అన్నారు. చదవండి: రాముడు... రావణుడు కాదు! -
‘డర్టీ హరి’ మూవీ నిర్మాతపై కేసు
సాక్షి, హైదరాబాద్: ‘డర్టీ హరి’ మూవీ నిర్మాతపై హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు సుమోటో కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ పరిధిలోని వెంకటగిరి మెట్రో పిల్లర్లపై ఇటీవల అతికించిన ఈ మూవీ పోస్టర్లు స్త్రీలను అవమానించేలా.. అగౌరవపరిచేలా ఉన్నాయని, అంతేగాక యువతను తప్పదోవ పట్టించే విధంగా ఆసభ్యకరమై ఆశ్లీల చిత్రాలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. దీంతో నిర్మాత శివరామకృష్ణతో పాటు పబ్లిషింగ్ ఏజెన్సీపై ఐపీసీ సెక్షన్ 292 చట్టం కింద మంగళవారం పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. (చదవండి: నిర్మాతలు నష్టపోకూడదని...) అయితే ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్లో సన్నివేశాలు కూడా అసభ్యకరంగా ఉన్నాయని, ఇంకా కొన్ని సన్నివేశాలైతే శ్రుతిమించి ఉండటంతో సోషల్ మీడియాలో ఈ ట్రైలర్ హాట్ టాపిక్‌గా మారింది. అలాగే తాజాగా అతికించిన పోస్టర్లు సైతం మితిమీరి ఉండడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ప్రముఖ దర్శకనిర్మాత ఎంఎస్ రాజు రూపొందించిన ఈ చిత్రంలో శ్రావణ్‌రెడ్డి, రుహానీ శర్మ, సిమ్రత్ కౌర్‌లు హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. మార్క్ కె రోబిన్ సంగీతం అందించిన ఈ సినిమాను శివరామకృష్ణ, సతీశ్‌బాబు, సాయిపునీత్లు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఫ్రైడే మూవీస్‌లో ఈ సినిమాను డిసెంబర్ 18న విడుదల కానుంది. (చదవండి: రాముడు... రావణుడు కాదు!) -
రాముడు... రావణుడు కాదు!
‘‘నాది హైదరాబాద్. హిందీలో పలు సీరియల్స్, వెబ్ సిరీస్‌లు చేశాను. కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గానూ చేశాను. నేను నటించిన ‘థింకిస్థాన్’ వెబ్ సిరీస్ చూసి ‘డర్టీ హరి’ చిత్రం కోసం ఎం.ఎస్. రాజుగారు నన్ను తీసుకున్నారు’’ అని శ్రవణ్ రెడ్డి అన్నారు. శ్రవణ్ రెడ్డి హీరోగా, సిమ్రత్ కౌర్, రుహానీ శర్మ హీరోయిన్లుగా ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డర్టీ హరి’. గూడూరు శివరామకృష్ణ సమర్పణలో గూడూరు సతీష్ బాబు, గూడూరు సాయి పునీత్, కేదార్ సెలగం శెట్టి, వంశీ కారుమంచి నిర్మించిన ఈ సినిమా ఫ్రైడే మూవీస్ అనే ఏటీటీ ప్లాట్‌ఫామ్ ద్వారా ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రవణ్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘నేటి తరానికి కనెక్ట్ అయ్యే చిత్రం ‘డర్టీ హరి’. జీవితంలో ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తారు. వాటివల్ల ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయన్నదే కథ. మనుషుల్లో అంతర్లీనంగా దాగి ఉండే చెడు, పశుప్రవృత్తిని ఎలాంటి నాటకీయత లేకుండా వాస్తవిక కోణంలో చూపించారు రాజుగారు. ఇందులో నా పాత్ర రాముడిలా, రావణుడిలా కాకుండా మధ్యస్తంగా ఉంటుంది. కథలో భాగంగా రొమాన్స్ ఉంటుందే కానీ, సినిమా మొత్తం బోల్డ్‌గా ఉండదు. మా సినిమా ట్రైలర్, నా పాత్ర తీరును చూసి చాలా మంది ‘అర్జున్‌రెడ్డి’ సినిమాతో పోలుస్తున్నారు. ఆ చిత్రానికి, మా సినిమాకి ఎటువంటి పోలిక ఉండదు. నేను హీరోగానే చేయాలనుకోవడం లేదు. క£ý , పాత్ర నచ్చితే సహాయ నటుడిగా కనిపించడానికి కూడా అభ్యంతరం లేదు. ప్రస్తుతం హిందీలో ఓ వెబ్ సిరీస్ చేస్తున్నా’’ అన్నారు. -
ఒక్కోసారి గ్యాప్ సహజం
‘‘సినిమా ఇండస్ట్రీలో నా కెరీర్ స్టార్ట్ అయి 30ఏళ్లు నిండాయి. 1990 జనవరి 2న నా తొలి సినిమా ‘శత్రువు’ విడుదలైంది. వ్యాపారాల్లో, రాజకీయాల్లో, సినిమాల్లో.. ఇలా ఆయా రంగంలోనివారి జీవితాల్లో ఎత్తు పల్లాలు ఉన్నట్లే నా జీవితంలోనూ ఉన్నాయి. అందుకు భయపడి ప్రయత్నం ఆపకూడదు’’ అని దర్శక–నిర్మాత ఎం.ఎస్. రాజు అన్నారు. శ్రవణ్ రెడ్డి హీరోగా, సిమ్రత్ కౌర్, రుహానీ శర్మ హీరోయిన్లుగా ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డర్టీ హరి’. గూడూరు శివరామకృష్ణ సమర్పణలో గూడూరు సతీష్ బాబు, గూడూరు సాయి పునీత్, కేదార్ సెలగం శెట్టి, వంశీ కారుమంచి నిర్మించిన ఈ సినిమా ఏటీటీ ప్లాట్‌ఫామ్ ఫ్రైడే మూవీస్ ద్వారా ఈ నెల 18న రిలీజ్ కానుంది. ఈ సందర్భం గా ఎం.ఎస్. రాజు చెప్పిన విశేషాలు. ►‘మస్కా’ తర్వాత నిర్మాతగా, ‘ తూనీగ తూనీగ’ తర్వాత దర్శకునిగా గ్యాప్ వచ్చింది. ఒక్కోసారి గ్యాప్ రావడం సహజం. ‘హిట్లర్’ సినిమాకి ముందు చిరంజీవిగారికి కూడా ఏడాది గ్యాప్ వచ్చింది. ‘తూనీగ తూనీగ’ ఫ్లాప్ కావడంతో నిర్మాణమా? దర్శకత్వమా? అనే డైలమాలో ఉండిపోయాను. ఆ తర్వాత అడల్ట్ కంటెంట్‌తో ‘డర్టీ హరి’ కథ రాసుకున్నాను. మా సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్లో అన్ని జానర్ సినిమాలు తీశాను. ట్రెండ్‌కి తగ్గట్టు మారాలని అడల్ట్ కంటెంట్‌తో ‘డర్టీ హరి’ తీశా. ఈ సినిమాని నా కుటుంబ సభ్యులు చూసి, బాగుందన్నారు. ప్రేక్షకులు కూడా బాగుందంటారు. కుటుంబమంతా కలసి చూడదగ్గ చిత్రమిది. ►‘డర్టీ హరి’ని థియేటర్స్‌లో రిలీజ్ చేద్దామనుకున్నాం. కానీ, సినిమా చూసిన నిర్మాత ‘బన్నీ’ వాస్ చాలా బాగుంది, మా ‘ఫ్రైడే మూవీస్’ ఏటీటీలో రిలీజ్ చేద్దామన్నారు. ప్యాన్ ఇండియా కథతో రూపొందిన చిత్రం కాబట్టి ఇతర భాషల్లోనూ అనువదించి, రిలీజ్ చేస్తాం. -
భావోద్వేగాల హరి
ప్రముఖ నిర్మాత ఎం.ఎస్. రాజు దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘డర్టీ హరి’. శ్రవణ్ రెడ్డి హీరోగా పరిచయం అవుతున్నారు. సిమ్రత్ కౌర్, రుహాణి శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. గూడూరు సతీష్ బాబు, గూడూరు సాయి పునీత్ నిర్మిస్తున్న ఈ సినిమా రీ–రికార్డింగ్ మొదలయింది. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘రొమాంటిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న చిత్రమిది. ఇందులో బోల్డ్ అంశాలతో పాటు సున్నితమైన, భావోద్వేగభరితమైన సన్నివేశాలు ఉంటాయి. రొమా¯Œ్సని దర్శకుడు చాలా పొయెటిక్‌గా చూపిస్తున్నారు. ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీసిన దర్శక–నిర్మాత ఎం.ఎస్. రాజుగారికి ఇది కమ్‌బ్యాక్ చిత్రం అవ్వడంతో భారీ అంచనాలున్నాయి. త్వరలోనే టీజర్‌ని విడుదల చేసి, సినిమా రిలీజ్ డేట్‌ని ప్రకటిస్తాం’’ అన్నారు. -
క్లాసిక్ బాట వదిలి ‘డర్టీ హరి’గా..
‘ఆర్ఎక్స్ 100’ సినిమా తర్వాత పలువురు దర్శకనిర్మాతలు తమ పంథా మార్చుకుంటున్నారు. ముఖ్యంగా కొందరు యువ దర్శకులు బోల్డ్ కంటెంట్ సినిమాలకు అధిక ప్రాధ్యనతనిస్తూ సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఈ జాబితాలో సీనియర్ దర్శక నిర్మాత ఎంఎస్ రాజు కూడా చేరిపోయినట్లుగా తెలుస్తోంది. ఎన్నో ఫీల్ గుడ్ సినిమాలను టాలీవుడ్‌కు అందించిన ఎంఎస్ రాజు తన రూట్ మార్చుకున్నాడు. శ్రవణ్ రెడ్టి టైటిల్ రోల్లో ఎంఎస్ రాజు దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న చిత్రం ‘డర్టీ హరి’. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. బాత్ టబ్‌లో షర్ట్ లేకుండా ఉన్న హీరోకు ఓ అమ్మాయి తన కాళ్లతో సిగరెట్ అందిస్తున్నట్టుగా ఉన్న స్టిల్‌తో ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో నెటింట్లో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. ఈ పోస్టర్‌తోనే సినిమా ఎలా ఉండబోతుందో తెలిసిపోతుందని కొందరు కామెంట్ చేస్తుండగా.. ‘ఎంఎస్ రాజును కూడా మార్చేశారు కదా’అంటూ మరికొంత మంది సరదాగా పేర్కొంటున్నారు. . మనసంతా నువ్వే, ఒక్కడు, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి అద్భుత ప్రేమకథలను నిర్మించిన ఎంఎస్ రాజు.. వాన, తూనీగ తూనీగ వంటి లవ్ క్లాసికల్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. అయితే నిర్మాతగా సక్సెస్ సాధించినా.. కమర్షియల్ డైరెక్టర్‌గా రాణించలేకపోయాడు. ఈయన డైరెక్షన్లో వచ్చిన రెండు చిత్రాలకు మంచి పేరొచ్చినా.. కమర్షియల్‌గా హిట్ సాధించలేకపోయాయి. దీంతో సినిమాలకు చిన్న విరామం తర్వాత ‘డర్టీ హరి’ తో మరోసారి దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఎలాగైనా డైరెక్టర్‌గా విజయం సాధించాలనే ఉద్దేశంతో బోల్డ్ అండ్ అడల్ట్ కామెడీని డైరెక్టర్ ఎంచుకున్నాడని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక ఈ సినిమాకు సంబంధించి హీరోయిన్ వివరాలతో పాటు నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించి త్వరలో వెల్లడిస్తామని చిత్ర బృందం ప్రకటించింది. -
మాకు అడ్డు తగిలితే అంతుచూస్తా
అనంతపురం సెంట్రల్: ‘ఏం తమాషాగా ఉందా? మా పనులకు అడ్డు తగులుతున్నావంట.. అడ్డొస్తే నీ అంతు చూస్తానం’టూ టీడీపీ నాయకుడు ఎంఎస్ రాజు బెదిరింపులకు దిగాడని బాధితుడు టూటౌన్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితుని ఫిర్యాదు మేరకు... ప్రభుత్వశాఖల్లో సిబ్బంది వేతనాలు, ఇతరత్రా వాటికి సంబంధించి ఏజెన్సీల కోసం ప్రభుత్వం టెండర్లు పిలిచింది. గత నెల 18న టెండర్ల నోటిఫికేషన్ రాగా పలు సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి. కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న కమిటీ టెండర్లను ఖరారు చేయనుంది. ఈ నెల మూడో తేదీన ఐదు సంస్థలు ఎంపికైనట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఇందులో అవకతవకలు జరిగాయని, లోపాలు సరిదిద్దాలని రాడ్ సెక్యూరిటీ సర్వీసెస్ కంపెనీకి చెందిన ఓబిరెడ్డి ఇటీవల జాయింట్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అప్పటికే టెండర్లు దక్కించుకున్న ఎంఎస్ రాజు తమకు అడ్డొస్తే అంతు చూస్తానని ఈ నెల 24న బెదిరించాడని ఓబిరెడ్డి టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేయడానికి పోలీసులు వెనుకడుగు వేస్తున్నారు. దీనిపై టీడీపీ ముఖ్యనేత నుంచి ఒత్తిళ్లు వచ్చినట్లు సమాచారం. ఈ విషయమై సీఐ ఆరోహణరావును వివరణ కోరగా... ఫిర్యాదు వచ్చిన మాట వాస్తవమేనని, విచారించిన తర్వాత కేసు నమోదు చేస్తామని తెలిపారు. -
ఐదుగురు టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలలో గుబులు
సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందే టీడీపీలో టిక్కెట్ల లొల్లి మొదలైంది. ఐదుగురు సిట్టింగ్‌లకు టిక్కెట్లు ఇవ్వకూడదని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకున్నారని కొన్ని నెలలుగా ఆ పార్టీలో జోరుగా చర్చ సాగుతోంది. ఆ దిశగా అధిష్టానం తొలి పావు కదిపింది. శింగనమల టిక్కెట్ హామీతో మంత్రి కాలవ శ్రీనివాసులు ఎమ్మార్పీఎస్ నాయకుడు ఎంఎస్ రాజును టీడీపీలో చేర్పించడం చర్చనీయాంశంగా మారింది. ఈ నిర్ణయంపై విప్ యామినీబాల.. ఆమె తల్లి, ఎమ్మెల్సీ శమంతకమణి ఒంటి కాలిపై లేస్తున్నారు. శింగనమల పరిణామంతో మిగిలిన నలుగురు సిట్టింగ్‌లలోనూ వణుకు మొదలైందని సమాచారం. సాక్షి ప్రతినిధి, అనంతపురం: జిల్లాలో గత ఎన్నికల్లో రెండు ఎంపీ, 12 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఎన్నికల తర్వాత వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చాంద్‌బాషా టీడీపీలో చేరారు. వీరిలో ఐదుగురు సిట్టింగ్‌లకు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వకూడదని టీడీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుందనే ప్రచారం కొద్దినెలలుగా సాగుతోంది. ఈ క్రమంలో ఎమ్మార్పీఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఎస్ రాజును మంత్రి కాలవ శ్రీనివాసులు అమరావతిలో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేర్పించారు. శింగనమల టిక్కెట్టు రాజుకు ఇప్పిస్తానని కాలవ హామీ ఇచ్చి పార్టీలో చేర్పించినట్లు ఆ పార్టీలోని కీలక ఎమ్మెల్యే ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. ఈ చేరికపై శింగనమల ఎమ్మెల్యే, విప్ యామినీబాల.. ఎమ్మెల్సీ శమంతకమణి తీవ్రస్థాయిలో స్పందించినట్లు తెలిసింది. మంత్రులు దేవినేని ఉమామహేశ్వరావుతో పాటు కాలవ శ్రీనివాసులను గట్టిగా నిలదీసినట్లు సమాచారం. ఎంఎస్ రాజు వార్డు మెంబర్‌గా కూడా గెలవలేడని, అలాంటి వ్యక్తిని చంద్రబాబు సమక్షంలో చేర్పించడం వెనుక ఉద్దేశం ఏంటని ప్రశ్నించినట్లు తెలిసింది. పైగా శింగనమల టిక్కెట్టు ఇప్పిస్తామని మాట ఇచ్చారంట? మాకంటే రాజుకు ఉన్న స్థాయి ఏమిటి? అసలు రాజు గురించి మీకు పూర్తిగా తెలుసా? అని అడిగినట్లు చర్చ జరుగుతోంది. రాజు చరిత్ర ఏంటో వివరంగా ఓ నివేదికను మీకు పంపిస్తామని, పార్టీ కూడా విచారించాలని, స్వతంత్రంగా అనంతపురంలో ఓ వార్డు మెంబర్‌గా కానీ, లేదా శింగనమల నియోజకవర్గంలోని ఓ పంచాయతీ నుంచి సర్పంచ్‌గా గెలుస్తారని కానీ మీకు అనిపిస్తే రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటామని వారు గట్టిగా చెప్పినట్లు తెలుస్తోంది. అయితే టిక్కెట్టు విషయాలు తమకేమీ తెలియదని, పార్టీలో కలిసి పనిచేసేందుకు ఎవరు వచ్చినా చేర్పించే బాధ్యత తమపై ఉందని వారు శమంతకమణి, యామినీబాలకు చెప్పినట్లు సమాచారం. మీకేదైనా సందేహాలుంటే ముఖ్యమంత్రితో మాట్లాడాలని సూచించినట్లు తెలుస్తోంది. ఆ నలుగురిలో అలజడి ♦ అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి టిక్కెట్టు ఇవ్వకుండా మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి, ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ అధినేత అమిలేని సురేంద్రబాబులో ఒకరికి టిక్కెట్టు ఇవ్వాలని టీడీపీలోని ఓ వర్గం పట్టుబట్టినట్లు తెలిసింది. ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి కూడా అనంతపురం టిక్కెట్టు కచ్చితంగా మార్చాలని ముఖ్యమంత్రితో గట్టిగా చెప్పినట్లు సమాచారం. కొత్త అభ్యర్థి ఎవరు అనే సంగతి పక్కనపెడితే చౌదరిని మార్చడం ఖాయమని టీడీపీలో చర్చ నడుస్తోంది. ♦ కళ్యాణదుర్గం ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరికి వయసైపోయింది. వచ్చే ఎన్నికల్లో ఆయన కుమారుడు మారుతి.. లేదంటే కోడలు వరలక్ష్మికి టిక్కెట్టు వస్తుందని చౌదరి ఆశిస్తున్నారు. అయితే వారిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, అవినీతి ఆరోపణలు కూడా తీవ్రంగా ఉన్నాయనే కారణంతో బెళుగుప్పకు చెందిన ఉమామహేశ్వరావుకు టిక్కెట్టు ఇప్పించాలని టీడీపీలోని ఓ కీలక ప్రజాప్రతినిధి ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. ♦ గుంతకల్లు ఎమ్మెల్యే జితేంద్రగౌడ్‌కు టిక్కెట్టు దక్కే పరిస్థితి లేదని సమాచారం. గుంతకల్లు నుంచి మంత్రి కాలవ శ్రీనివాసులు పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ♦ ఇక పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డికి కూడా టిక్కెట్టు దక్కదనే ప్రచారం ఉంది. అయితే సామాజికవర్గ సమీకరణాలు బేరీజు వేస్తే తనకు టిక్కెట్టు ఖాయమనే ఆలోచనలో పల్లె ఉన్నారు. కాలవపై గుర్రు అనంతపురం, శింగనమల, గుంతకల్లు, కళ్యాణదుర్గంతో పాటు పుట్టపర్తిలో సిట్టింగ్‌లను మారుస్తారనే ప్రచారం టీడీపీలో సాగుతోంది. రాజు చేరిక శింగనమలలో అలజడి రేపగా.. తక్కిన నాలుగు స్థానాల్లోని అభ్యర్థుల్లోనూ ఆందోళన నెలకొంది. ఇన్చార్జ్ మంత్రితో పాటు అధిష్టానంతో మాట్లాడి, పార్టీ నిర్ణయం అదే అయితే ప్రత్యామ్నాయం చూసుకోవడం మంచిదనే నిర్ణయానికి వచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మంత్రి కాలవ శ్రీనివాసులు ఈ విషయాల్లో సీఎంకు తప్పుడు సమాచారం అందిస్తున్నారని, వీరంతా ఆయనపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద శింగనమల విషయంలో రేగిన చిచ్చు టీడీపీలో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాల్సిందే. -
టీడీపీని నామరూపాలు లేకుండా చేస్తాం
– దళితులపై దాడులు చేస్తే ప్రైవేట్ సైన్యంతో తిరగబడతాం – మహాసంకల్ప సభలో ఎమ్మార్పీఎస్ రాష్ట్రవర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఎస్ రాజు కళ్యాణదుర్గం: ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా అడుగడుగనా దళితులపై దాడులు చేయడం, ఉద్యమాలకు అణగదొక్కడానికి పూనుకుంటున్న సీఎం చంద్రబాబు తెలుగుదేశం పార్టీని నామరూపాల్లేకుండా చేస్తామని ఎమ్మార్పీఎస్ రాష్ట్రవర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఎస్ రాజు హెచ్చరించారు. స్థానిక కృష్ణమందిరంలో శనివారం మహాసంకల్ప సభ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజు మాట్లాడుతూ దేవినేని ఉమ అనుచరులతో పాటు రాష్ట్రంలో చాలా చోట్ల దళితులపై దాడులు చేస్తున్నారన్నారు. ఇలాగే దాడులు కొనసాగిస్తే ప్రైవేట్ సైన్యాన్ని తయారు చేసుకుని తిరగబడతామన్నారు. రాష్ట్ర విభజనలో రెండు కళ్ల సిద్దాంతాన్ని అవలంభించిన చంద్రబాబు ఎస్సీ వర్గీకరణలో రెండు నాల్కుల ధోరణి అవలంభిస్తున్నారని విమర్శించారు. కోట్లకు అధిపతులుగా ఉన్న కాపులను బీసీల్లో చేర్చేందుకు చూపుతున్న ప్రేమ, ఎస్సీ వర్గీకరణ పట్ల ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. ఎస్సీ వర్గీకరణ అమలు చేయాల్సింది పోయి ఉద్యమాలను అణగదొక్కేందుకు కుట్ర చేస్తున్నారని వాపోయారు. పోలీసులను అడ్డుపెట్టుకుని ఉద్యమాలు చేయకుండా చేస్తున్నారన్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కనివ్వమన్నారు. దళిత కాలనీలు ఎక్కడా అభివృద్ధికి నోచుకోలేదని, కేవలం ప్రభుత్వ ప్రకటనల్లో మాత్రమే కనిపిస్తుందన్నారు. బుడగ జంగాల పరిస్థితి దౌర్భాగ్యంగా ఉందని, వీరిని ఎస్సీలుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. వర్గీకరణ కోసం ఈనెల 27న ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జరిగే ధర్నాలో దళితుల సత్తాను చాటాలన్నారు. అంతకుముందు జగజ్జీవన్రామ్కు పూలమాల వేసి ర్యాలీగా వచ్చారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ గుత్తి ఇన్చార్జ్ ప్రసాద్, రాష్ట్ర నాయకులు కుంటిమద్ది ఓబులేశు, వన్నూరప్ప, స్వామిదాస్, చిన్నపెద్దన్న, జిల్లా అధ్యక్షుడు కృష్ణ, స్థానిక నాయకులు నాగరాజు, కుళ్ళాయప్ప, దొణస్వామి, అంజి తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు సర్కార్‌తో అమీతుమీ
– ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కోసం జూలై 5న సచివాలయ ముట్టడి – ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఎస్ రాజు గుంతకల్లు టౌన్ : ఎస్సీ వర్గీకరణ విషయంలో చంద్రబాబు సర్కార్‌తో అమీతుమీ తేల్చుకునేందుకు మాదిగలంతా సన్నద్ధం కావాలని ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఎస్ రాజు పిలుపునిచ్చారు. గుంతకల్లు పట్టణంలోని రాయల్ ఫంక్షన్‌హాలులో మంగళవారం ఎమ్మార్పీఎస్ రాయలసీమ అధ్యక్షుడు స్వామిదాస్ అధ్యక్షతన జరిగిన మాదిగల ఆత్మగౌరవ సదస్సులో ఆయన మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా పోలీసుల చేత అణచివేయించేందుకు కుట్ర పన్నుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్నిరోజులు తమ మంచితనాన్ని, ఓపికను పరీక్షించారని, ఇలాగే అణచివేతకు గురిచేస్తే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. అమరావతి, పట్టిసీమ పేరుతో కోట్లాది రూపాయలు దోచుకోవడంపై చూపిన శ్రద్ధ..వర్గీకరణపై లేదా అని ప్రశ్నించారు. వర్గీకరణకు చట్టబద్ధత, మాదిగలకు ప్రత్యేక కార్పొరేషన్, మిగులు భూముల కేటాయింపు కోసం జూలై 5న వెలగపూడిలోని సచివాలయాన్ని ముట్టడిస్తామని తెలిపారు. ఆత్మగౌరవ సదస్సుకు ముందు గుంతకల్లు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కోటయ్య, తూర్పుగోదావరి, గుంటూరు, అనంతపురం జిల్లాల అధ్యక్షులు సంజయ్, మేకలదాస్, కణేకల్ కృష్ణ, రాయలసీమ బీసీ సంఘం కార్యదర్శి రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
‘చైతన్యం కోసం కృషి’
చిలమత్తూరు : అన్ని కులాల్లో చైతన్యం తీసుకురావడం కోసం పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నామని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఎస్ రాజు, బీసీ సంక్షేమ సంఘం రాయలసీమ జిల్లాల అ«ధ్యక్షుడు మేకల వెంకటేష్‌గౌడ్ పేర్కొన్నారు. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా చైతన్య సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. బుధవారం వారు కొడికండ చెక్‌పోస్టులోని టూరిజం హోటల్లో విలేకరులతో మాట్లాడారు. అన్ని కుల సంఘాల చైతన్యం కోసం ఈ నెల 18న జిల్లా కేంద్రంలోని ఆర్ట్స్ కళాశాల ఆవరణలో మధ్యాహ్నం 3 గంటలకు బహిరంగ సభ ఏర్పాటు చేశామన్నారు. ఎస్సీల వర్గీకరణలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని మండిపడ్డారు. ఏప్రిల్ 5న వర్గీకరణ సాధన కోసం మాదిగల సంకల్ప యాత్రను తిరుపతిలో ప్రారంభిస్తామని చెప్పారు. అనంతరం మే 8న లక్షలాది మంది మాదిగల ఆధ్వర్యంలో విజయవాడలో బహిరంగ సభ నిర్వహిస్తామని వివరించారు. లేపాక్షి హబ్ భూములపై ప్రశ్నించే నైతిక హక్కు ఏ పార్టీకి లేదన్యనారు. భూములపై ఉద్యమాలు చేసింది ఎమ్మార్పీఎస్ మాత్రమే అన్నారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ యువసేన జిల్లా అ«ధ్యక్షుడు జింక సజ్జప్ప, నాయకులు శ్రీకాంత్‌గౌడ్, కదిరెప్ప, మురళీ, గోవిందు, నంజుండ, నరసింహులు, నరసప్ప తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మార్పీఎస్ ఇన్చార్జీల నియామకం
అనంతపురం న్యూటౌన్ : గ్రామీణ స్థాయిలో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ ఉద్యమాన్ని బలోపేతం చేసే దిశగా గ్రామ, మండల నియోజక వర్గాలకు పార్లమెంటు, అసెంబ్లీ ఇన్చార్జీలను నియమించినట్లు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంటు ఎంఎస్ రాజు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆ సంఘం కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఇన్చార్జీల వివరాలు వెల్లడించారు. అనంతపురం పార్లమెంటు ఇన్‌చార్జీలుగా చిన్నపెద్దన్న, కేఎల్ స్వామిదాసు, కణేకల్లు కష్ణ, హిందూపురం డివిజన్ ఇన్చార్జులుగా హనుమంతు, కుంటిమద్ది ఓబిలేసు, రంగనాథ్‌లను నియమించారు. అసెంబ్లీ ఇన్చార్జిగా అనంతపురానికి రవికుమార్, గుంతకల్లుకు అంజనప్రసాద్, ఉరవకొండకు రామదాసు, నాగరాజు, శింగనమలకు కదిరెప్ప, వీరనారాయణ, వేణు, రాం పుల్లయ్య, రామయ్య, తాడిపత్రికి ఎస్వీ రమణ, మహేష్, రామాంజి, రాయదుర్గానికి కేసీ నాగరాజు, కొల్లయ్య, మహేష్, కల్యాణదుర్గానికి ఆంజనేయులు, విజయ్, నాగరాజు, పెనుకొండకు శ్రీనివాసులు, మడకశిరకు రఘురాం, పుట్టపర్తికి గోవింద, హిందూపురానికి ఆనంద్, నరసింహులు, మురళి, ధర్మవరానికి వెంకటేష్, హరి, రాప్తాడుకు జయప్రకాష్, రమణ, కదిరికి గంగిశెట్టి రజనీకాంత్‌ను నియమించినట్లు తెలిపారు. -
టీడీపీ మహానాడును అడ్డుకుంటాం: ఎమ్మార్పీఎస్
టీడీపీ తిరుపతి మహానాడులో ఎస్సీ వర్గీకరణపై తగు తీర్మానం చేయకపోతే అడ్డుకుంటామని ఏపీ ఎమ్మార్పీఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఎస్ రాజు హెచ్చరించారు. శుక్రవారం ఏలూరులో నిర్వహించిన రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మహానాడు తొలిరోజున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో టీడీపీ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహిస్తామన్నారు. రెండో రోజున ఎన్టీఆర్ విగ్రహాల వద్ద నిరసన దీక్షలు చేస్తామని, అప్పటికీ వర్గీకరణపై తీర్మానం చేయకపోతే ఛలో తిరుపతి కార్యక్రమం నిర్వహించి మహానాడు వేదిక వద్ద ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎటువంటి ఘటనలు జరిగినా అందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే బాధ్యత వహించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణపై ఇంకా అలసత్వం వహిస్తే జూన్ 30న అనంతపురం ఆర్ట్స్ కాలేజీలో లక్ష మందితో దండయాత్ర మహాసభ నిర్వహిస్తామని హెచ్చరించారు. ఏపీ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు జన్ని రమణయ్య మాట్లాడుతూ వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో వర్గీకరణపై చర్చించి తీర్మానం చేయకపోతే 2019 ఎన్నికల అనంతరం చంద్రబాబును ప్రతిపక్షంలో కూర్చోబెడతామన్నారు. -
బస్సులో ప్రేమ కహానీ!
అతనో బస్ కండక్టర్. ఎస్. కోట నుంచి గవిటి వెళ్లే రూట్లో డ్యూటీ. బస్సు జర్నీలోనే ఓ బ్యూటీతో ప్రేమలో పడ్డాడు. ఆమెతో తన లవ్‌ను కూడా రైట్..రైట్ అనిపించు కున్నాడు. ఈ ఇద్దరి ప్రేమ ప్రయాణంతో పాటు అంతు చిక్కని మిస్టరీ కూడా ఈ సినిమాలో ఉంటుందంటోంది ‘రైట్ రైట్’ సినిమా టీమ్. సుమంత్ అశ్విన్, పూజా ఝవేరీ జంటగా మను దర్శకత్వంలో జె. వంశీకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాత, సుమంత్ అశ్విన్ తండ్రి ఎమ్మెస్ రాజు బర్త్‌డే సందర్భంగా మంగళవారం ఈ చిత్రం మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. ఎమ్మెస్ రాజు మాట్లాడుతూ- ‘‘సుమంత్ అశ్విన్ కె రీర్లోనే చెప్పుకునే చిత్రమవుతుంది. మేకింగ్ వీడియో ప్రామిసింగ్‌గా ఉంది’’ అన్నారు. ‘‘నాన్న గారి బర్త్‌డేకి మేకింగ్ వీడియో విడుదల చేయడం హ్యాపీగా ఉంది’’ అని సుమంత్ అశ్విన్ అన్నారు. ‘‘ఈ నెల 15న పాటలను రిలీజ్ చేస్తాం’’ అని నిర్మాత చెప్పారు. ఈ చిత్రా నికి సంగీతం: జె.బి, కెమెరా: శేఖర్ వి. జోసఫ్, సహ నిర్మాత: జె.శ్రీనివాసరాజు, సమర్పణ: వత్సవాయి వెంకటేశ్వర్లు. -
రైట్ రైట్ అంటూ విజిలేసిన సునీల్!
‘‘ఎమ్మెస్ రాజుగారు నిర్మించిన ‘మనసంతా నువ్వే’ సినిమాతో నా కెరీర్‌కు బలమైన పునాది పడింది. ఆ సినిమా అప్పట్నుంచీ సుమంత్ అశ్విన్ నాకు బాగా క్లోజ్. ఎమ్మెస్ రాజుగారు జస్ట్ స్టార్స్‌ని సూపర్ స్టార్స్‌ని చేశారు. సుమంత్ అశ్విన్ కూడా స్టార్ హీరో కావాలని కోరకుంటున్నా’’ అని హాస్యనటుడు, హీరో సునీల్ అన్నారు. సుమంత్ అశ్విన్, పూజా జవేరి జంటగా మను దర్శకత్వంలో శ్రీ సత్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై జె. వంశీకృష్ణ నిర్మిస్తున్న చిత్రం ‘రైట్ రైట్’. ఈ చిత్రం మోషన్ పోస్టర్‌ను సునీల్ రైట్ రైట్ అంటూ విజిల్ ఊది, ఆవిష్కరించారు. సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ- ‘‘నా చిన్నతనంలో షూటింగ్స్‌కు వె ళ్లినప్పుడు సునీల్‌ని బాగా గమనించేవాణ్ణి. ఈ చిత్రంలో ప్రభాకర్, నా కాంబినేషన్లో వచ్చే సీన్స్ కొత్తగా ఉంటాయి’’ అని తెలిపారు. ‘మర్యాద రామన్న’ సినిమా సమయంలో సునీల్ సహకారాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ‘రైట్ రైట్’ నాకు బ్రేక్‌నిస్తుంది’’ అని ‘కాలకేయ’ ప్రభాకర్ అన్నారు. మార్చి 9 వరకు జరిపే షెడ్యూల్‌తో ఓ పాట మినహా సినిమా పూర్తవుతుందనీ, ఏప్రిల్‌లో పాటలనూ, మేలో చిత్రాన్నీ విడుదల చేస్తామని జె. వంశీకృష్ణ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: జె.బి, పాటలు: శ్రీమణి, కెమెరా: శేఖర్ వి.జోసఫ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: జె .శ్రీనివాసరాజు, కో-ప్రొడ్యూసర్: ఎం.వి. నరసింహులు. -
తడిపి తడిపి తనతో నడిపి..
సినిమా వెనుక స్టోరీ - 22 హైదరాబాద్‌లో వర్షం అనుకోని అతిథి లాంటిది. ఎప్పుడొస్తుందో తెలీదు. ఆ రోజు అలానే ఊహించని విధంగా వర్షం కురిసింది. ఎమ్మెస్ రాజు కారు బంజారా హిల్స్ రోడ్లమీద వేగంగా పరిగెడుతోంది. ఆయనప్పుడే సూర్యనారాయణరాజుని కలిసి వస్తున్నారు. సూర్యనారాయణరాజు అంటే ‘రెబల్ స్టార్’ కృష్ణంరాజుకి సొంత తమ్ముడు. వాళ్లబ్బాయ్ ప్రభాస్ అప్పుడే హీరోగా ఎంటరయ్యాడు. ‘ఈశ్వర్’, ‘రాఘవేంద్ర’... రెండు సినిమాలు చేశాడు. ‘‘మావాణ్ణి మీ చేతుల్లో పెడు తున్నాను. ఎలా చేస్తారో, ఏం చేస్తారో మీ ఇష్టం’’ అన్నారు సూర్యనారాయణరాజు. అంత ఫ్రీడమ్ ఇస్తే ఎమ్మెస్ రాజు లాంటి ఫిల్మ్మేకర్కి ఫుల్ హ్యాపీ. దాంతో పాటే కొండంత ఒత్తిడి కూడాను. ‘‘నన్ను నమ్మి వాళ్లబ్బాయిని అప్పగిస్తున్నారు. ఎలాగైనా వాళ్ల నమ్మకాన్ని నిలబెట్టాలి.’’ కారు కన్నా వేగంగా పరుగులు తీస్తోంది ఎమ్మెస్ రాజు మనసు. వర్షం వెలిసి పోవడంతో హైదరాబాద్ తడితడి అందాలతో మెరిసిపోతోంది. ‘ఒక్కడు’ ఆల్‌టైమ్ సూపర్‌హిట్. ఎమ్మెస్ రాజు నెక్స్ట్ ఏం చేస్తారు? ఇండస్ట్రీ అంతా వెయిటింగ్. ఎమ్మెస్ రాజు ఎక్కువ మాట్లాడరు. ఆయన చేతల మనిషి. ఏం చేసినా సెలైంట్‌గానే చేస్తారు. ప్రభాస్‌తో పక్కా యాక్షన్ ఫిల్మ్ చేయడానికి కావాల్సిన సరంజామా సిద్ధం చేస్తున్నారాయన. పరుచూరి బ్రదర్స్ దగ్గర వీరు పోట్ల అసిస్టెంట్. ఫుల్ జెమ్. అతనో యాక్షన్ ఎపిసోడ్ చెప్పాడు. ఎమ్మెస్ రాజుకి విపరీతంగా నచ్చేసింది. దాని చుట్టూరా స్క్రిప్టు అల్లుతున్నారు. రామాయణం లాంటి కథ. సీతను రావణుడు మోహించి లంకలో బంధిస్తాడు. ఆ లంక నుంచి సీతను విడిపించడమే రాముడి లక్ష్యం. సేమ్ టు సేమ్ అలాంటి ప్యాట్రనే. ఓ అందమైన అమ్మాయి. ఆమె చుట్టూ గుడ్, బ్యాడ్, అగ్లీ క్యారెక్టర్స్. గుడ్ అంటే హీరో. బ్యాడ్ అంటే విలన్. అగ్లీ అంటే హీరోయిన్ ఫాదర్. ఈ నలుగురితో పాటు వర్షానిది కూడా ఇంపార్టెంట్ రోల్. ఇదంతా ఓకే. కానీ బ్యాక్‌డ్రాప్ అదిరి పోవాలి. ఇంతవరకూ ఏ సినిమాలోనూ వచ్చి ఉండకూడదు. ఏవేవో ఆలోచిస్తుంటే ఫైనల్‌గా దొరికింది. వరంగల్ బ్యాక్‌డ్రాప్. వేయి స్తంభాల గుడి, మిగతా హిస్టారికల్ ప్లేసెస్. ఆడియన్స్‌కి ఇంట్రస్టింగ్‌గా అనిపిస్తుంది. ఇవన్నీ ఇన్క్లూడ్ చేసు కుంటూ స్టోరీ సెట్ చేశారు. హిందీ సినిమా ‘తేజాబ్’లో కొన్ని క్యారెక్టర్స్ చాలా ఇంట్రస్టింగ్‌గా ఉంటాయి. కూతుర్ని ఉపయోగించుకుని కోటీశ్వరుడు కావాలని కలలు కనే తండ్రిగా అనుపమ్ ఖేర్ చేశాడు. అందులో అనిల్‌కపూర్ - మాధురీ దీక్షిత్ మనస్పర్థలొచ్చి విడిపోతారు. వీటన్నిటి ఇన్స్పిరేషన్తో స్క్రిప్ట్ ఫైనల్ అయ్యింది. ఇంతకూ ఈ కథను ఎమ్మెస్ రాజు ఎవరితో డెరైక్ట్ చేయిస్తారు? ఎవరా లక్కీ గై? ‘బాబి’ సినిమా డిజాస్టర్ కావడంతో డెరైక్టర్ శోభన్ పాపం ఫుల్లీ డిప్రెస్డ్. అలాంటి టైమ్‌లో ఎమ్మెస్ రాజు నుంచి ఫోన్. పోన్లే... తుపాన్ టైమ్‌లో రొట్టె ముక్క అయినా దొరుకుతోంది. డెరైక్టర్‌గా ఎలాగూ భవిష్యత్తు లేదు. రైటర్గానైనా స్థిరపడదాం... శోభన్ ఊపిరి పీల్చుకున్నాడు. జీరో క్యాండిల్ బల్బులాగా సుమంత్ ఆర్ట్స్ ఆఫీసులోకి అడుగుపెట్టినవాడు, ఫ్లడ్ లైట్‌లాగా బయటికొచ్చాడు. నెవర్ ఎక్స్‌పెక్టింగ్ ఆఫర్. ప్రభాస్ సినిమాకి స్క్రిప్ట్ వర్క్ చేయమంటారనుకుంటే... ఏకంగా డెరైక్షన్ ఆఫర్ ఇచ్చారు. స్టార్ కాని ప్రభాస్‌తో... అట్టర్ ఫ్లాప్ డెరైక్టర్‌తో... ఎమ్మెస్ రాజు సినిమానా? మరీ ఇంత మొండి ధైర్యమా? ఈ టైమ్‌లో ఏటికి ఎదురీదడం అవసరమా? ఈ కామెంట్స్ అన్నీ ఎమ్మెస్ రాజు చెవిన పడుతున్నాయి. కానీ ఇవేవీ పట్టించుకునే స్థితిలో లేరాయన. ఓ పక్క స్క్రిప్ట్ ఫైనల్ డిస్కషన్స్. మరోపక్క కాస్టింగ్ సెలెక్షన్. కె. రాఘవేంద్రరావు ‘గంగోత్రి’ సినిమాలో ఓ కొత్తమ్మాయిని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అదితీ అగర్వాల్. హీరోయిన్ ఆర్తీ అగర్వాల్ సిస్టర్. అదిరిపోయేలా ఉందని టాక్. ప్రభాస్ పక్కన బాగానే ఉండేట్టు ఉంది. కానీ ‘గంగోత్రి’ కంప్లీట్ అయితే తప్ప, డేట్స్ దొరకవు. వేరే ఆప్షన్ చూసుకోవాల్సిందే. చెన్నైలో ‘నాని’ షూటింగ్. సరదాగా మహేశ్‌ని కలవడానికెళ్లారు ఎమ్మెస్ రాజు. ఎయిర్పోర్ట్ నుంచి హోటల్కెళ్తుంటే - జెమినీ ఫ్లై ఓవర్ దగ్గర అప్పుడే ఓ కొత్త సినిమా వినైల్ ఫిక్స్ చేస్తున్నారు. అందులో మెరుపులాగా ఓ అమ్మాయి కనిపించింది. ఎమ్మెస్ రాజు వెంటనే ఎంక్వైరీ మొదలుపెట్టారు. విక్రమ్ పక్కన ‘సామి’ అనే తమిళ సినిమాలో చేస్తోందట. తెలుగులో కూడా ‘నీ మనసు నాకు తెలుసు’ అనే సినిమా చేస్తోంది. ఆ చిత్ర నిర్మాత ఎ.ఎం.రత్నం ద్వారా ఆ అమ్మాయిని కాంటాక్ట్ చేశారు. వెంటనే లైన్లోకొచ్చిందా అమ్మాయి. ఎమ్మెస్ రాజు చూచాయగా కథ చెబితే థ్రిల్లయిపోయింది. ఆ అమ్మాయే త్రిష. శైలజ పాత్రకు త్రిష రెడీ. ‘జయం’, ‘నిజం’ సినిమాల్లో విలన్‌గా చేసి మంచి స్వింగ్ మీదున్నాడు గోపీచంద్. ఇందులో భద్రన్న పాత్రకు అతనే ఫస్ట్ చాయిస్. ఒడ్డూ పొడుగు, క్యారెక్టర్స్ పరంగా ప్రభాస్‌తో పోటాపోటీగా ఉండాలి. గోపీచంద్ ఓకే. హీరోయిన్ ఫాదర్‌గా ప్రకాశ్‌రాజ్‌ను మించిన ఆప్షన్ ఎవరుంటారు? డైలాగ్ రైటర్ సత్యమూర్తి కొడుకైన దేవిశ్రీ ప్రసాద్‌ను ‘దేవి’తో మ్యూజిక్ డెరైక్టర్ని చేసింది ఎమ్మెస్ రాజే. ఆ తర్వాత మళ్లీ పిలవలేదు. ఈ సినిమాకు మాత్రం దేవిశ్రీతోనే మ్యూజిక్ చేయించుకోవాలని ముందే ఫిక్స్. గోల్డెన్ చాన్స్. దేవి చెలరేగిపోయాడు. ఎమ్మెస్ రాజు ఒక ట్యూన్ అడిగితే వంద ఆప్షన్లిచ్చేవాడు. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి అంటే ఎమ్మెస్ రాజుకి భక్తి, గౌరవం, ఆరాధన. ఆయనకు స్క్రిప్టు ఇచ్చేసి, ‘‘మీ ఇష్టం గురువుగారూ... ఎంతైనా తీసుకోండి. నాకు మంచి పాటలు కావాలి’’ అన్నారు ఎమ్మెస్ రాజు. పగలబడి నవ్వేశారు సిరివెన్నెల. అంతే... పాటల కనక వర్షం కురిసింది. టైటిల్ ‘వర్షం’ అయితే బాగుంటుంది. కానీ వీఎన్ ఆదిత్య అప్పటికే ఇదే టైటిల్‌తో నాగార్జున కోసం ఓ స్క్రిప్ట్ చేసుకుంటున్నాడు. ఎమ్మెస్ రాజు అడగ్గానే టైటిల్ ఇచ్చేశాడు. రూట్ క్లియర్. మార్చి 14... ఎమ్మెస్ రాజు శ్రీమతి పుట్టినరోజు. సెంటిమెంటల్ డే. ‘ఒక్కడు’ అదే రోజు మొదలైంది. ‘వర్షం’ కూడా అదే రోజున స్టార్ట్. ఫస్ట్ షెడ్యూల్ వర్క్ జరుగుతోంది. ఎమ్మెస్ రాజు నాట్ శాటిస్ఫైడ్ విత్ దట్ వర్క్. షూటింగ్ ఆపేశారు. 2 నెలలు బ్రేక్. మళ్లీ స్క్రిప్ట్ మీద కూర్చున్నారు. లోపాలన్నీ పట్టిపట్టి వెతుకుతున్నారు. హీరోకు విలన్‌కు మధ్య ఒకసారి ఫైట్ జరిగింది. రెండోసారి కూడా ఫైట్ పెట్టాల్సిన పరిస్థితి. కానీ పెట్టకూడదు. అంత ఎఫెక్ట్ వచ్చేంత డైలాగ్ పడాలి. పరుచూరి బ్రదర్స్ ఇలాంటి వాటిల్లో మాస్టర్స్. ‘‘శైలు కోసం నేను వందసార్లు చస్తాను. నువ్వు ఒక్కసారి చస్తావా?’’ అని హీరో, విలన్ని అడుగుతాడు. ఆ ఒక్క డైలాగ్‌తో విలన్ బుర్ర తిరిగిపోయేలా కొట్టాడు హీరో. ఇలాంటి కరెక్షన్స్ అన్నీ చేసేశారు. ఇప్పుడు స్క్రిప్ట్ పర్ఫెక్ట్. మళ్లీ షూటింగ్ స్టార్ట్. రైల్వేస్టేషన్లో ఓ పాట. అలా ఇలా ఉండకూడదు. మోతెక్కిపోవాలి. ప్రభుదేవా లాంటి కొరియోగ్రాఫర్ కావాలి. అప్పుడతను ఆర్టిస్టుగా చాలా బిజీగా ఉన్నాడు. ఎంత బిజీ అంటే కొరియోగ్రఫీ కూడా పక్కన పెట్టేశాడు. కానీ ఎమ్మెస్ రాజు లాంటివాడు అడిగితే కాదనగలడా? జీ హుజూర్ అంటూ వచ్చేశాడు. తిరుపతికి 40 కిలోమీటర్ల దూరంలో ‘పనపాకం’ రైల్వేస్టేషన్. ప్రభాస్, త్రిష, వందలాది మంది జూనియర్ ఆర్టిస్టులు, 60-70 మంది మోడల్స్‌తో వన్ వీక్ తీశారా పాట... ‘ఇన్నాళ్లకు గుర్తొచ్చానా వాన... ఎన్నాళ్లని దాక్కుంటావే పైన’. పూతలపట్టు రైల్వేస్టేషన్... పాత బస్తీలోని సుల్తాన్ బజార్... శంకర్పల్లి దగ్గర భారీ సెట్... ఇలా చాలా చోట్ల యాక్షన్ ఎపిసోడ్స్ తీశారు. వరంగల్‌లో టెన్ డేస్ షెడ్యూల్ చేశారు. ‘‘ఇక్కడ తీసిన సినిమాలేవీ ఆడలేదు’’ అన్నాడు ఒకతను. ‘‘ఈ సినిమాతో ఆ సెంటిమెంట్ పోతుందిలే’’ చెప్పారు ఎమ్మెస్ రాజు చాలా కాన్ఫిడెంట్‌గా. ఎమ్మెస్ రాజుకి అరకు వ్యాలీ సెంటిమెంట్. అక్కడ తీసిన ఆయన సినిమాలన్నీ హిట్టే. అందుకే అరకులో కొన్ని యాక్షన్ సీన్స్, ఒక సాంగ్ తీశారు. ఇంట్రడక్షన్ షాట్ హెవీ రిస్క్. క్వారీలో బాంబు పేలుళ్ల మధ్య షాట్స్ తీయాలి. డూప్ పెడదామంటే ప్రభాస్ ఒప్పుకోలేదు. 140 వర్కింగ్ డేస్‌లో సినిమా షూటింగ్ కంప్లీటెడ్. 5 కోట్ల బడ్జెట్ తేలింది. ఈ సినిమాతో ప్రభాస్ పెద్ద రేంజ్కెళ్తాడు. ఇది ఎమ్మెస్ రాజు ప్రిడిక్షన్. ఇంతకు మించి ‘వర్షం’ గురించి ఒక్క ముక్క మాట్లాడలేదాయన. 2004 సంక్రాంతి. మంచి పోటాపోటీ సీజన్. ఎమ్మెస్ రాజు కాన్ఫిడెన్సే గెలిచింది. వర్షం... సూపర్ డూపర్ హిట్. 120 ప్రింట్స్... 200 థియేటర్స్. సెకండ్ వీక్కొచ్చేసరికి ఇంకో 80 ప్రింట్స్ పెంచాల్సిన పరిస్థితి. ప్రభాస్ ఇప్పుడు స్టార్. ‘చిరంజీవి’కి ‘ఖైదీ’లాగా ప్రభాస్‌కి ఇది టర్నింగ్ పాయింట్. త్రిషకు సూపర్ క్రేజ్. కోలా రంగారావు పాత్రలో ప్రకాశ్‌రాజ్ డీలింగ్‌కి ఫుల్ మార్క్స్. భద్రన్నగా గోపీచంద్‌కు సూపర్బ రెస్పాన్స్. గోపాలరెడ్డి కెమెరావర్క్‌కు అందరూ ఫ్లాట్. దేవి మ్యూజిక్ క్రియేటెడ్ వండర్. ఎమ్మెస్ రాజుకు డేరింగ్ డ్యాషింగ్ అండ్ డైనమిక్ ఫిలిం మేకర్‌గా బ్రాండ్. ఆ రోజు భారీ వర్షం. ఎమ్మెస్ రాజు కారులో వెళ్తూ ఆ వర్షాన్నే మురిపెంగా చూస్తున్నారు. ఎప్పుడు వర్షం వచ్చినా, ఆయన్ని ‘వర్షం’ సినిమా జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉంటాయి. వెరీ ఇంట్రస్టింగ్... * హైదరాబాద్ - తెలుగు లలిత కళాతోరణంలో సిల్వర్‌జూబ్లీ ఫంక్షన్ చేశారు. చిరంజీవి, వెంకటేశ్, మహేశ్‌బాబు చీఫ్ గెస్ట్‌లు. * ఈ సినిమాకు పనిచేసిన వీరు పోట్ల (కథారచయిత), వంశీ పైడిపల్లి - గౌతమ్ పట్నాయక్ - శ్రావణ్ (అసోసియేట్ డెరైక్టర్స్), కె.రాంబాబు (కో-డెరైక్టర్), ప్రభుదేవా - లారెన్స్ - సుచిత్రా చంద్రబోస్ (కొరియో గ్రాఫర్స్), ఎస్.గోపాల్‌రెడ్డి (కెమెరా మ్యాన్) తర్వాతి కాలంలో డెరైక్టర్స్‌గా మారారు. ఎమ్మెస్ రాజు కూడా. * తమిళంలో ‘జయం’ రవితో ఎస్పీ బాలసుబ్రమణ్యం ‘మళై’గా రీమేక్ చేశారు. - పులగం చిన్నారాయణ -
నీ స్నేహం ఇకరాను అని...
సినిమా వెనుక స్టోరీ - 6 ‘‘నేనండీ... ఎమ్మెస్ రాజుని. ఓసారి ఆఫీసుకి రాగలరా?’’... వీఎన్ ఆదిత్య హాస్పిటల్కెళ్లే హడావిడిలో ఉన్నాడు. అపాయింట్మెంట్ టైమ్‌కి వెళ్లకపోతే డాక్టర్ డీబీఎన్ మూర్తి తిడతారు. అందుకే హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో ఉన్న హాస్పిటల్‌కు వెళ్ళడానికి ఆదరాబాదరాగా రెడీ అవుతున్నాడు. ఆ టైమ్‌లోనే ఈ ఫోన్. ‘‘అర్జంట్ హాస్పిటల్ పనుంది. నేను మళ్లీ చేస్తానండీ’’ అని ఫోన్ పెట్టేశాడు ఆదిత్య.డాక్టర్ని కలిసి వచ్చేసరికి బాగా లేటయిపోయింది. అప్పుడు గుర్తొచ్చింది ఎమ్మెస్ రాజు ఫోను. ఎంత ఆలోచించినా ఆయనెవరో గుర్తుకురావడం లేదు. సురేష్ ప్రొడక్షన్స్ ఆఫీసులో తెలిసిన ఆపరేటర్ ఉంటే, అతన్నడిగాడు. ‘‘అదేంటీ... రాజుగారు తెలియదా? ‘దేవి, దేవీపుత్రుడు’ సినిమాలు తీసిన హనీబాబు ఆయనే కదా!’’ అని చెప్పాడతను. ఆదిత్య తెగ ఫీలైపోయాడు. ‘‘అరే... అంత పెద్దాయన ఫోన్ చేస్తే గుర్తుపట్టలేక పోయానే! హనీబాబుగా గుర్తుపెట్టుకుని అసలు పేరు మరిచిపోయానే...’’ అని బాధపడిపోయాడు. అయినా... ఆయన నాకెందుకు ఫోన్ చేసుంటారు? ఆదిత్య రకరకాలుగా ఆలోచిస్తున్నాడు. అక్కడ ఎమ్మెస్ రాజు కూడా ఆలోచిస్తున్నారు. ‘దేవీపుత్రుడు’ సినిమా ఫలితం... ఆయన్ని బాగా కుదిపేసింది. ఈసారి ట్రెండు మార్చాలి... రూట్ మార్చాలి... కొత్త దర్శకుడితో క్యూట్ లవ్‌స్టోరీ తీయాలి. ఎమ్మెస్ రాజుకి రాత్రింబవళ్లూ ఇదే ఆలోచన. కెమెరామ్యాన్ ఎస్. గోపాలరెడ్డి ఆయనకు క్లోజ్ ఫ్రెండ్. అన్ని విషయాలూ ఇద్దరూ షేర్ చేసుకుంటారు. గోపాలరెడ్డి దగ్గర ఇదే టాపిక్ వచ్చింది. ‘‘మీక్కావల్సింది చాకు లాంటి కొత్త డెరైక్టరేగా? వీఎన్ ఆదిత్య అని సింగీతం, జయంత్ సి. పారాన్జీల దగ్గర పని చేశాడు. ఆదిత్య మీకు సెట్ అవుతాడు’’ అని ఆదిత్య ఫోన్ నెంబరిచ్చారు గోపాలరెడ్డి. ఎమ్మెస్ రాజు వెంటనే ఆదిత్యకు ఫోన్ కొట్టారు. అప్పుడే అతను డాక్టర్ అపాయింట్మెంట్ ఉందని చెప్పింది. సరే... నెక్ట్స్ డే చేస్తాడేమోనని ఎమ్మెస్ రాజు వెయిట్ చేశారు. నో రెస్పాన్స్. మర్చిపోయాడా? భయపడ్డాడా? ఆదిత్యకు మళ్లీ కాల్ చేశారు ఎమ్మెస్ రాజు. ‘‘సారీ సార్... అర్జంట్‌గా రాజమండ్రి వెళ్తున్నా. అక్కడ టెంపుల్లో పూజ చేయించడానికి వెళ్తున్నా’’ చెప్పాడు ఆదిత్య. ‘‘వెరీ గుడ్. వచ్చాక కలవండి’’ అన్నారు ఎమ్మెస్ రాజు. వారం గడిచినా ఆదిత్య నుంచి కాల్ రాలేదు. ‘మంచి కుర్రాడని చెప్పారు. ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నాడేంటి?’ ఎమ్మెస్ రాజుకి కోపం వచ్చింది. ఫైనల్ కాల్. వస్తే వచ్చాడు. లేకపోతే కట్. సుమంత్ ఆర్ట్స్ ఆఫీస్. ఎమ్మెస్ రాజు ముందు బిక్కు బిక్కుమంటూ కూర్చున్నాడు ఆదిత్య. ‘‘సారీ సార్! నాతో మీరు సినిమా చేస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కోడి రామకృష్ణగారు ఉండగా నన్నెందుకు పిలుస్తారనుకున్నా. అందుకే కలవడానికి ఇబ్బంది పడ్డా. క్షమించండి.’’ ఎమ్మెస్ రాజు చాలా ప్రశాంతంగా ఆదిత్య మాటలు వింటున్నారు. ‘‘సార్! మీరు పెద్ద ప్రొడ్యూసరు. నేను కొత్తవాణ్ణి. లవ్‌స్టోరీతోనే కెరీర్ స్టార్ట్ చేద్దామను కుంటున్నవాణ్ణి. మీరింతవరకూ లవ్‌స్టోరీ తీయలేదు. నా కథను ఎలా జడ్జ్ చేయగలరు?’’ అని కాస్తంత ధైర్యం కూడ దీసుకుని డౌట్ ఎక్స్‌ప్రెస్ చేశాడు ఆదిత్య. ‘‘గుడ్ క్వశ్చన్. ఓ పది రోజులు ఆఫీసుకి రా! ఇద్దరం సరదాగా డిస్కస్ చేసుకుందాం. ట్యూనింగ్ కుదిరితేనే కలిసి పని చేద్దాం’’ అన్నారు ఎమ్మెస్ రాజు. ఆదిత్య షాకైపోయాడు. అంత పెద్ద ప్రొడ్యూసర్ తనలాంటి కొత్త కుర్రాణ్ణి ఇంతలా ఆదరిస్తారని కలలో కూడా ఊహించలేదు. రోజూ ఆఫీసుకొస్తున్నాడు ఆదిత్య. ఓ రోజు ఎమ్మెస్ రాజు ‘‘నీకు రెండు స్టోరీ ఐడియాలు చెబుతా. ఏది నచ్చితే దాంతోనే సినిమా చేద్దాం’’ అన్నారు. ఎమ్మెస్ రాజు ఫస్ట్ ఐడియా చెప్పారు. ‘‘ఇదేంటి సార్... ఇది ‘ప్రేమించుకుందాం రా’ కథలా ఉంది. ఆ సినిమాకి నేను అసోసియేట్ డెరైక్టర్ని. మళ్లీ అదే కథతో ఎలా సినిమా చేస్తాం?’’ అనడిగేశాడు ఆదిత్య. ఎమ్మెస్ రాజు నవ్వుతూ ‘‘గుడ్... డెరైక్షన్ ఆఫరివ్వగానే ఏది పడితే అది చేసేస్తావా, లేక ఆలోచిస్తావా అని టెస్ట్ చేశానంతే’’ అన్నారు. ఇప్పుడు రెండో ఐడియా చెప్పారు. ఆదిత్యకు నచ్చేసింది. వర్క్ మొదలైంది. హిందీలో వచ్చిన ‘అన్మోల్ ఘడీ’ (1946) సినిమా ఇన్స్పిరేషన్తో కొంతవరకూ కథను తీర్చిదిద్దారు. యాంటిక్ వాచ్ బహుమతిగా ఇవ్వడం, తన ప్రేమకథనే నవలగా రాయడం లాంటి కొన్ని సీన్స్ అలానే డెవలప్ అయ్యాయి. దర్శక - రచయిత కె. భాగ్యరాజా తీసిన ‘డార్లింగ్... డార్లింగ్’ సినిమా కూడా కొంచెం అదే తరహాలో ఉంటుంది. ఆ సినిమా ప్యాట్రన్‌లో చైల్డ్‌హుడ్ నుంచి లవ్‌స్టోరీ మొదలుపెట్టాలని ఆదిత్య కోరిక. అలాగే ‘అప్పు చేసి పప్పు కూడు’లో రేలంగి పాత్ర అంటే ఆదిత్యకు చాలా ఇష్టం. ఆ ఇన్స్పిరేషన్తో హీరో ఫ్రెండ్ కేరెక్టర్ని డిజైన్ చేశారు. ఇలా ఎమ్మెస్ రాజు, ఆదిత్య కలిసి స్క్రిప్టు చేసుకుంటూ వెళ్తున్నారు. ఆ రోజు ఎమ్మెస్ రాజుకి ఓ సీన్ వినిపించాడు ఆదిత్య. సముద్రపు ఒడ్డున భోరున వర్షం. హీరో ఏడుస్తూ ఉంటే, అతని ఫ్రెండ్ వచ్చి ఓ డైలాగ్ చెబుతాడు. ‘‘ఒరేయ్! వర్షం కూడా అప్పుడప్పుడూ మనకు మేలు చేస్తుందిరా! మన కన్నీళ్లను ఎదుటివాళ్లకు కనబడకుండా దాచేస్తుంది.’’ ఈ డైలాగ్‌కి ఎమ్మెస్ రాజు మనసు చెమర్చింది. వెంటనే చెక్‌బుక్ తీసి పాతికవేలకు చెక్ రాసిచ్చేశారు. నెక్ట్స్ డే అనౌన్స్మెంట్. ప్రముఖ నిర్మాత ఎమ్మెస్ రాజు, కొత్త కుర్రాడు వి.ఎన్.ఆదిత్యకు డెరైక్షన్ ఛాన్స్ ఇస్తూ చేస్తున్న సినిమా... ‘మనసంతా నువ్వే’. ఆ టైటిల్ కూడా ఎమ్మెస్ రాజు పెట్టిందే. ‘మనసంతా నువ్వే’ని మహేశ్‌బాబుతో చేస్తే? ఎమ్మెస్ రాజుకి ఎగ్జయిటింగ్‌గా ఉందీ ఐడియా. కానీ ఆదిత్య ఏమో కొత్తవాడైతే కరెక్ట్ అంటాడు. ఇప్పటికిప్పుడు కొత్త హీరో ఎక్కడ దొరుకుతాడు? ఆదిత్య దగ్గర ఆప్షన్ ఉంది. ‘చిత్రం’ హీరో ఉదయ్‌కిరణ్. ఇప్పుడు ‘నువ్వు-నేను’ చేస్తున్నాడు. వెంటనే ఎమ్మెస్ రాజు ‘నువ్వు-నేను’ రష్ చూడ్డానికెళ్లారు. ఆ రష్ చూసీ చూడగానే ఈ సినిమాకు ఉదయ్‌కిరణ్‌ను ఫిక్స్ చేసేశారు. ఫైనల్‌గా స్క్రిప్ట్ పరుచూరి బ్రదర్స్ దగ్గరకు వెళ్లింది. ఇక్కడే అసలు బాంబు పేలింది. కథ బాలేదన్నారు పరుచూరి గోపాలకృష్ణ. సెకండాఫ్ సరిగ్గా లేదు... చైల్డ్ ఎపిసోడ్ అంతసేపు వేస్టు... ఇలా ఒక్కోటీ చెబుతుంటే ఆదిత్య గుండె జారిపోయింది. షూటింగ్కెళ్లే టైమ్‌లో... బ్లాస్ట్. అరకులోయలో ఓ గెస్ట్‌హౌస్. టెన్ డేస్ సిట్టింగ్స్. పరుచూరి బ్రదర్స్... ఎమ్మెస్ రాజు... వీఎన్ ఆదిత్య... వీరూ పోట్ల... స్క్రిప్టు విషయంలో కిందా మీదా పడుతున్నారు. స్క్రీన్‌ప్లే ఆర్డర్ మారింది. కథ కొత్త మలుపులు తిరుగుతోంది. హమ్మయ్య... మొత్తానికి కథ పర్ఫెక్ట్లీ ఆల్రైట్. ఆర్పీ పట్నాయక్ మ్యూజిక్ డెరైక్టర్. ట్యూన్స్ విరగ్గొట్టేస్తున్నాడు. యాంటిక్ వాచ్ సౌండ్ కోసమైతే ఆర్పీ చాలా కష్టపడ్డాడు. మలయాళంలో విద్యాసాగర్ ‘ప్రణయ వర్ణంగల్’ (1998) కోసం ‘కన్నాడి కూడుంకూట్టి’ పాట చేశాడు. అది సూపర్ డూపర్ హిట్. దాన్ని యథాతథంగా వాడితే సిట్యుయేషన్ అదిరిపోతుంది. ఇక్కడ అదే ‘తూనీగ... తూనీగ...’ పాట అయ్యింది. 95 పర్సంట్ షూటింగ్ ఓవర్. ఓన్లీ 5 పర్సంట్ బ్యాలెన్స్. అమీర్‌పేట - చర్మాస్ షోరూమ్‌లో హాఫ్ డే షూటింగ్. రీమాసేన్ బట్టలు కొనుక్కోవడానికి వచ్చే సీన్ తీయాలి. లైటింగ్ రెడీ అవుతోంది. ఇంకాసేపట్లో సీన్ తీయాలి. చిత్రనిర్మాణంలో ప్రతి చిన్న అంశాన్ని దగ్గరుండి జాగ్రత్తగా చూసుకునే ఎమ్మెస్ రాజుకు సడెన్‌గా డౌటొచ్చింది. ఈ సీన్ బట్టల షాపులో కంటే బుక్‌షాప్‌లో తీస్తే బెటరేమో! చిన్నపాటి డిస్కషన్. షూటింగ్ ఆగింది. ఆదిత్య హర్టయిపోయాడు. అలాగే నడుచుకుంటూ బయటికొచ్చేశాడు. కృష్ణానగర్ దాకా వెళ్లాడు. ఏవేవో ఆలోచనలు. ఇప్పటికే షూటింగ్ దాదాపు అయిపోవచ్చింది. ఇప్పుడీ కోపం వల్ల మొత్తం ప్రాజెక్ట్ డామేజ్ అవుతుంది. అదేదో వాళ్లను కన్విన్స్ చేసుకుంటే బెటర్ కదా! ఆదిత్య మళ్లీ వెనక్కు తిరిగొచ్చేశాడు. లొకేషన్లో అందరూ ఆదిత్య కోసం వెతుకుతున్నారు. అప్పటికే పరుచూరి వెంకటేశ్వరరావు వచ్చి చెప్పడంతో ఎమ్మెస్ రాజు కన్విన్స్ అయ్యారట. అంతా ఓకే... రామానాయుడు స్టూడియో... ఆవిడ్ ఎడిటింగ్ రూమ్‌లో రష్ చూస్తున్నారు. ఎవరూ ఏమీ మాట్లాడడం లేదు. ఎమ్మెస్ రాజు, పరుచూరి గోపాలకృష్ణ, ఎస్. గోపాలరెడ్డి... ముగ్గురూ పక్కకెళ్లి సీరియస్ డిస్కషన్. ఆదిత్యకు ఏమీ అర్థం కావడం లేదు. క్లైమాక్స్ తేడా కొట్టేసింది... సినిమా కష్టం... పరుచూరి గోపాలకృష్ణ జడ్జిమెంట్ చెప్పేశారు. ఇదంతా ఎడిటర్ కె.వి. కృష్ణారెడ్డి అబ్జర్వ్ చేస్తున్నాడు. అతను వీళ్ల దగ్గరకొచ్చి ‘‘ఒక్కసారి మళ్లీ క్లైమాక్స్ చూడండి... ఎడిటింగ్‌లో చిన్న ఛేంజ్ చేశాను’’ అన్నాడు. వీళ్లు నిర్లిప్తంగానే లోపలికెళ్లారు. కాసేపటికి బయటికొచ్చిన గోపాలకృష్ణ, ఆదిత్య దగ్గరకొచ్చి ‘‘అదిరిపోయింది’’ అంటూ హగ్ చేసుకున్నాడు. ఎడిటింగ్ మేజిక్. ఫస్ట్ హాఫ్‌లోని ‘నీ స్నేహం’ పాటను మళ్లీ క్లైమాక్స్‌లో యాడ్ చేసేసరికి, ఎక్కడలేని డెప్త్ వచ్చేసింది. 2001 అక్టోబర్ 19. ఎమ్మెస్ రాజు నిర్మాతగా కొత్త ట్రెండ్ సృష్టించిన రోజు... వీఎన్ ఆదిత్య లైఫ్ టర్న్ అయిన రోజు... ఉదయ్కిరణ్కి హ్యాట్రిక్ (‘చిత్రం’, ‘నువ్వు - నేను’, ‘మనసంతా నువ్వే’) పూర్తయిన రోజు... ఎక్కడ చూసినా ‘మనసంతా నువ్వే’ టాపిక్కే. బాక్సాఫీసంతా కనక వర్షమే! - పులగం చిన్నారాయణ -
ఏ ప్రేమ గొప్పది?
తల్లిప్రేమ, ప్రియురాలి ప్రేమ ఈ రెంటినీ ఏకకాలంలో చవిచూస్తున్న ఓ కుర్రాడి జీవితంలో జరిగిన అనూహ్య సంఘటనల సమాహారమే ప్రధానాంశంగా నూతన నిర్మాత ఎం.ఎస్.రాజు నిర్మించిన చిత్రం ‘జననం’. భువన్‌తేజ్, రాజ్ ప్రియాంత్, గీతాభగత్, శ్రావణి ఇందులో ప్రధాన పాత్రధారులు. ఎస్.ఎల్.మణిగంజి దర్శకుడు. ఇటీవల హైదరాబాద్‌లో ఈ చిత్రం ప్రచార చిత్రాలను విడుదల చేశారు. ఈ నెల 26న చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. ప్రేమ, కామెడీ, సెంటిమెంట్ మేళవించిన కథాంశంతో రూపొందిన ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకుల ఆదరణ చూరగొంటుందని దర్శకుడు నమ్మకం వెలిబుచ్చారు. చిత్రం యూనిట్ సభ్యులతో పాటు తుమ్మలపల్లి రామసత్యనారాయణ, సాయివెంకట్ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. -
హిట్ 'జపం' చేస్తున్న ఎమ్మెస్ రాజు
-
విజయం కోసం జపం!.
నిర్మాతగా ఎమ్మెస్ రాజుది ఓ చరిత్ర. సుమంత్ ఆర్ట్స్‌పై శత్రువు, ఒక్కడు, మనసంతా నువ్వే, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్లు తీశారాయన. అయితే దర్శకునిగా మాత్రం ఎమ్మెస్ రాజు విజయాన్ని అందుకోలేకపోయారు!. ఎలాగైనా విజయం సాధించాలనే కసితో ఆయన ‘జపం’ చేస్తున్నారు. ‘జపం’ అంటే ఇంకేదో అనుకునేరు. ఆయన దర్శకునిగా సెలైంట్‌గా ఓ సినిమా మొదలైంది. ఆ సినిమా టైటిల్ ‘జపం’. విజయ్ కార్తీక్ అనే కొత్తబ్బాయిని హీరోగా పరిచయం చేస్తున్నారు. ‘ఇష్క్’ చిత్రానికి పనిచేసిన సామల రమేష్ దీనికి స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంతో చిత్రీకరణ జరుగుతోంది. మే నెలలో ఈ సినిమాను విడుదల చేసే ఉద్దేశంలో ఉన్నారు ఎమ్మెస్ రాజు. -
వినూత్న జననం
భువన్, ప్రియంత్, గీతాభగత్, శ్రీవాణి ముఖ్య తారలుగా ఎస్.ఎల్. మణి దర్శకత్వంలో ఎమ్మెస్ రాజు నిర్మిస్తున్న చిత్రం ‘జననం’. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ -‘‘తొగ రాణా అద్భుతమైన పాటలు స్వరపరిచారు. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం పాటలకు మంచి స్పందన లభిస్తోంది. త్వరలో ప్రచార చిత్రాన్ని, ఈ నెల ద్వితీయార్ధంలో సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాం. ఓ వినూత్న కథాంశంతో తీసిన ఈ చిత్రానికి ప్రేక్షకాదరణ లభిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. -
నా కెరీర్ మొత్తం లేవడం పడడం... పడడం లేవడమే!
ఎమ్మెస్ రాజు ఎమ్మే ఎకనమిక్స్. అర్థశాస్త్ర పట్టభద్రుడు ఎలా ఉండాలి? పైగా నిర్మాత! ఎలా ఉండాలి? ఎంత పెట్టి, ఎంత రాబట్టాలో తెలిసుండాలి. పోగొట్టుకున్నదుంటే, తిరిగి పోగేసుకుని లాభపడాలి. అవునా? ఈయనేం చేశారో చూడండి! ఒక హీరో కన్నా ఎక్కువగా దుస్సాహసాలు చేశారు. ఒక దర్శకుడి కన్నా ఎక్కువగా ప్రయోగాలు చేశారు. హిట్లనుంచీ ఫ్లాపుల్లోకి... ప్లాఫుల్లోంచి హిట్లలోకి... అత్యంత ప్రమాదకరమైన విన్యాసాలు ఎన్నో చేశారు. అన్నీ డబ్బుతోనే! ఏం చేసినా - తనే కష్టపడ్డారు, తనే నష్టపడ్డారు. తెలిసి చేసిన మిస్టేక్‌లు కొన్ని, తెలియక జరిగిపోయినవి కొన్ని. ‘‘ఎందుకండీ రాజుగారూ ఇలా?!’’ అంటే - ‘‘మిస్టేక్‌లు జరక్కుండా ఎలా నేర్చుకుంటామండీ’’ అంటారు! ఇంతకీ నిర్మాత నేర్చుకోవలసిందేమిటి? ఎమ్మెస్ రాజుకు పాతికేళ్ల సినీ జీవితం నేర్పిందేమిటి? చదవండి... ఈవారం ‘తారాంతరంగం’. మీ నుంచి సినిమా వచ్చి చాలాకాలమైంది. సెలైంట్ అయ్యారేం? ఎమ్మెస్ రాజు: ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ తర్వాత ఎందుకో.. నా ఆలోచనలు యూత్‌కి కాస్త దూరంగా జరిగాయేమో అనిపించింది. అందుకే.. మళ్లీ వారికి దగ్గర కావాలనుకుంటున్నాను. ప్రస్తుతం యూత్ ఇష్టపడే కథను తయారుచేసే పనిలో ఉన్నాను. ఇందులో భాగంగానే.. నేటి యువతరం పోకడలను వారికి తెలీకుండా వారి మధ్యే ఉండి గమనిస్తున్నా. త్వరలో నా నుంచి ఓ అద్భుతమైన యూత్స్టోరీని మీరు ఆశించొచ్చు. ఒక్కసారి మీ ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళదాం. నిర్మాత కొడుకు కాబట్టే మీరు నిర్మాత అయ్యారా? ఎమ్మెస్ రాజు: మా నాన్న రాయపరాజుగారు... కృష్ణంరాజు, చిరంజీవి కాంబినేషన్లో ‘ప్రేమతరంగాలు’ సినిమా తీశారు. అప్పట్లో పెద్దగా ఆడలేదు. తర్వాత చిరంజీవిగారితో ‘ప్రియ’ తీశారు. అది కూడా నష్టాలనే తెచ్చింది. అయితే... దాసరిగారి దర్శకత్వంలో తీసిన ‘ఎమ్మెల్యే ఏడుకొండలు’ మాత్రం మాకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత నాన్న తీసిన కొన్ని చిత్రాలు అనుకున్నట్లు ఆడలేదు. దాంతో ఆయన ఇండస్ట్రీకి దూరంగా వెళ్లిపోయారు. ఇక నా విషయానికొస్తే... చిన్నతనం నుంచీ నేను సినీ నేపథ్యంలోనే పెరిగినా.. ఏనాడూ యాక్టింగ్ సైడ్కానీ, డెరైక్షన్ సైడ్ కానీ, రచన సైడ్ కానీ ఆలోచించలేదు. పైగా అప్పటి పరిస్థితుల్లో నాకు నాన్నను ఫాలో అవ్వడం తప్ప వేరొకటి తెలీదు. అందుకే నిర్మాతగా మారాను. 24 శాఖల్లోనూ నిర్మాతలు ఇన్వాల్వ్ అయ్యే నాగిరెడ్డి, చక్రపాణి నాటి రోజులు పోయి, నిర్మాత అంటే... కేవలం డబ్బు పెట్టేవాడు మాత్రమే అన్నట్లు పరిస్థితులు తయారవుతున్న తరుణంలో నిర్మాతగా మారారు. నాటి చరిత్రను పునరావృతం చేసి, ప్రతి శాఖలో మీ ముద్ర చూపించారు. ఎమ్మెస్ రాజు: అది కరెక్ట్ కాదండీ. నాగిరెడ్డి, చక్రపాణి తర్వాత రామానాయుడు ఉన్నారు. విజయావారి ట్రెండ్‌ని నాయుడుగారు కొనసాగించారు. నాయుడుగారి తర్వాత సి.అశ్వనీదత్ కూడా ప్రతిశాఖలో తన ముద్ర చూపించారు. అలాగే శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, ఇప్పటి నిర్మాతల్లో దిల్ రాజు. లేటెస్ట్గా చెప్పాలంటే దామోదరప్రసాద్.. ఇలా మంచి నిర్మాతలు ఎప్పుడూ ఉన్నారు. పర్సంటేజ్ తక్కువ అంతే. బాల్యం నుంచి సినిమాతో అటాచ్మెంట్ ఉండేదా? ఎమ్మెస్ రాజు: నేను చిన్నప్పట్నుంచీ ఎన్టీఆర్‌గారి అభిమానిని. సినిమాపై నాకు అభిమానం మొదలైంది ఆయన సినిమాల నుంచే. మా రోజుల్లో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్‌బాబు స్టార్‌హీరోలు. వారి సినిమాలంటే.. అప్పట్లో రీ-రన్స్ ఉండేవి. అందుకే.. మాగ్జిమమ్ వారి సినిమాలు చూసేశాను. కొన్నిరోజులు గడిచాక వీసీఆర్ల యుగం వచ్చింది. వాటి పుణ్యమా అని నేను పుట్టక ముందు వచ్చిన ఇతర భాషలకు చెందిన క్లాసిక్స్ అన్నీ చూసేశాను. అయితే సినిమాను టైంపాస్‌గా చూసేవాణ్ణి కాదు. ఓ సినిమాను ‘హిట్’ అంటే, అది ఎందుకు హిట్ అయ్యింది? దానిలో ఉన్న ప్లస్ పాయింట్లేంటి? ఎందుకు ఆ సినిమా ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యింది?’ అనే విషయాలు తెలుసుకోవడానికి మళ్లీ మళ్లీ చూసేవాణ్ణి. అలాగే సినిమా ఫ్లాప్ అయితే.. ఆడియన్స్‌కి ఇందులో నచ్చని అంశం ఏంటని పరిశీలించి మరీ తెలుసుకునేవాణ్ణి. ఎంఏ ఎకనామిక్స్ పూర్తి చేశాక కూడా.. ఉద్యోగం చూసుకోవాలని నాకు అనిపించలేదు. సినిమాలపైనే ధ్యాస. నాన్న ప్రొడక్షన్ ఆపేద్దామనుకుంటున్న టైమ్‌లో ధైర్యంగా నిర్మాతగా మారాను. మీరు పుట్టింది, పెరిగింది ఎక్కడ? ఎమ్మెస్ రాజు: మాది పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సమీపంలోని ఓ పల్లెటూరు. పుట్టింది మాత్రం రాజమండ్రిలో. కొంతవరకూ అక్కడే చదువుకున్నాను. వ్యాపారరీత్యా కృష్ణాజిల్లా గుడివాడకు షిఫ్టయ్యాం. అక్కడే హైస్కూల్ చదువు పూర్తి చేసి, ఏఎన్నార్ కాలేజ్‌లో ఇంటర్ జాయినయ్యాను. కొన్నాళ్లకు నాన్న నిర్మాత కావడంతో మకాం మద్రాస్‌కు మారింది. అక్కడి వివేకానంద కాలేజ్‌లో పీజీ పూర్తి చేశాను. ఆ రోజుల్లో సినిమాల తర్వాత నాకు అత్యంత ఇష్టమైంది క్రికెట్. నేను ఓపెనింగ్ బ్యాట్స్‌మేన్‌ని కూడా. నిర్మాతగా మీ తొలి అడుగు? ఎమ్మెస్ రాజు: ‘మనవడొస్తున్నాడు’. మా తమ్ముడు కూడా ఆ సినిమాలో ఇన్వాల్వ్ అయ్యాడు. ఎస్.ఎస్.ఫిలిం సర్క్యూట్ పతాకంపై ఆ సినిమా తీశాం. ‘మనవడొస్తున్నాడు’ నిర్మాణం విషయంలో మా కజిన్ కొంతవరకూ హెల్ప్ చేశాడు. నాన్నకు ఇండస్ట్రీలో మంచి గుడ్‌విల్ ఉంది. ఎన్ని కష్టాల్లో ఉన్నా... రుణం మాత్రం ఉంచుకునేవారు కాదు. ఉన్నదాన్ని అమ్మి మరీ ఇచ్చేసేవారు. నాదీ అదే రక్తం కావడంతో డిస్ట్రిబ్యూటర్లు చాలామంది అండగా నిలిచారు. దాంతో ‘మనవడొస్తున్నాడు’ పూర్తి చేయగలిగాను. కోడి రామకృష్ణగారితో బంధం ఎలా మొదలైంది? ఎమ్మెస్ రాజు: కోడిరామకృష్ణగారిది దాసరిగారి స్కూల్. పైగా నిర్మాతల దర్శకుడని అప్పట్లో ఆయనకు పేరు. నాన్నగారితో ఆయనకు మంచి అనుబంధం ఉంది. అందుకే, ‘మనవడొస్తున్నాడు’ సినిమాకు దర్శకునిగా ఆయన్నే తీసుకున్నాం. కోడి రామకృష్ణగారు పట్టిందల్లా బంగారం అవుతున్న టైమ్‌లో ‘మనవడొస్తున్నాడు’ విడుదలై.. ఆయన విజయ పరంపరలో ఒకటిగా నిలిచింది. ఆ సినిమా విడుదలైంది 1988లో. అంటే... నిర్మాతగా నాకు 25 ఏళ్లన్నమాట. ఆ సినిమా తర్వాత 1991లో మా అబ్బాయి సుమంత్ అశ్విన్ పేరు మీద ‘సుమంత్ ఆర్ట్స్’ని స్థాపించి ‘శత్రువు’ తీశాను. నా ఫస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీ అది. నేను చిన్నప్పట్నుంచీ ఎన్టీఆర్‌గారి మాస్ సినిమాలు చూస్తూ పెరిగినా... నాలో ఎక్కడో హాలీవుడ్ సినిమా ప్రభావం ఉండేది. ఆ ప్రభావం ‘శత్రువు’ సినిమాలో కనిపిస్తుంది. నా అభిరుచికి తగ్గట్టుగా, స్టయిలిష్‌గా కోడి రామకృష్ణగారు ఆ సినిమాను తీసిపెట్టారు. ఆయన సృజన, నా అభిరుచి కలిసిందే ‘శత్రువు’. ఆ సినిమా తర్వాత ఆయన దర్శకత్వంలోనే ‘పోలీస్ లాకప్’ తీశాను. అది కూడా హిట్. సినిమా స్క్రిప్ట్ ఇలా ఉండాలి, కలర్ ఇలా ఉండాలి, పాత్రల తీరుతెన్నులు ఇలా ఉండాలి.. వంటివన్నీ కోడి రామకృష్ణ దగ్గరేనేర్చుకున్నాను. నేను ఓ నిర్మాత, ఆయన ఓ దర్శకుడు అనడం కంటే.. ఆయన గురువు, నేను శిష్యుడు అనడం కరెక్ట్. నిర్మాతగా మీ తొలి ఎదురుదెబ్బ? ఎమ్మెస్ రాజు: ‘స్ట్రీట్‌ఫైటర్’... నిర్మాతగా మూడు విజయాలతో నేను సంపాదించింది మొత్తం ఆ సినిమాతో ఊడ్చుకుపోయింది. ‘స్ట్రీట్ ఫైటర్’ అని టైటిల్ పెట్టడం వల్లే స్ట్రీటున పడ్డావ్’ అని కొందరన్నారు. ఆ సినిమా తర్వాత మీరు అనుభవించిన స్ట్రగుల్స్? ఎమ్మెస్ రాజు: నిజానికి ‘స్ట్రీట్‌ఫైటర్’ నాకు పెద్ద ఎదురుదెబ్బ అనిపించలేదు. కారణం... నేను మా నాన్నగారిని దగ్గరుండి చూసినవాణ్ణి. జీరో దగ్గర కెరీర్ మొదలుపెట్టి, ఈ స్థాయికి వచ్చిన వాణ్ణి. అందుకే... మళ్లీ పూర్వవైభవం వస్తుందని కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. పైగా ఆ టైమ్‌లో కోడిరామకృష్ణగారు అందించిన మోరల్ సపోర్ట్ మరచిపోలేను. ‘ఏం బాధ పడకు... నా సినిమాలు కూడా ఫ్లాపయ్యాయి. నేనేమన్నా కృంగిపోయానా. ధైర్యంగా ఉండు’ అని నాలో స్ఫూర్తిని నింపారు. కొన్నాళ్లకు ఆయనే మా ఆఫీస్కొచ్చి, పాము నేపథ్యంలో సినిమా చేద్దాం అన్నారు. అదే ‘దేవి’. కెరీర్లో ఎదురుదెబ్బ తగిలితే.. నెక్ట్స్ స్టెప్‌గా ఎవరైనా సేఫ్ జోన్నే ఆశ్రయిస్తారు. కానీ మీరు ‘దేవి’రూపంలో రిస్కీ ప్రాజెక్ట్ మొదలుపెట్టారు. ఏంటి మీ ధైర్యం? ఎమ్మెస్ రాజు: ‘స్ట్రీట్‌ఫైటర్’ తర్వాత వెంకటేష్‌ని కలిస్తే డేట్స్ ఇచ్చేవారేమో! కానీ, నాకు అలా వెళ్లడం సుతరామూ ఇష్టం లేదు. ఒక హిట్ తర్వాత వెంకటేష్‌తో ‘శత్రువు’ చేశాను. అప్పుడు నా గౌరవం వేరు. ఇప్పుడు ఫ్లాప్‌లో ఉండి ఆయన దగ్గరకెళితే... నాకు గౌరవం దక్కుతుందా? అనేది నా ఫీలింగ్. అందుకే హిట్ కొట్టాకే ఆయన్ను కలవాలనుకున్నా. నాకు తెలిసి నిజమైన స్టార్ అంటే.. కథ మాత్రమే. కథ, కథనాలు సరిగ్గా ఉండే ఏ సినిమా అయినా ఆడుతుందని నా నమ్మకం. ఆ ధైర్యంతోనే ముందుకెళ్లాను. అప్పట్లో కోడి రామకృష్ణగారి ‘అమ్మోరు’ సెన్సేషన్ క్రియేట్ చేసి ఉంది. అదే ప్యాట్రన్‌లో కాస్త భిన్నంగా వెళ్తే సినిమా విజయం తథ్యమని కోడి రామకృష్ణ ధైర్యం చెప్పారు. అందుకే రిస్క్ చేసి ‘దేవి’ నిర్మాణానికి పూనుకున్నాను.‘అమ్మోరు’లో గ్రాఫిక్స్ ఓ పది నిమిషాలుంటాయి. కానీ ‘దేవి’లో 26 నిమిషాలు గ్రాఫిక్స్. కేవలం స్పెషల్ ఎఫెక్ట్స్‌కే కోటీ యాభై లక్షలు ఖర్చయ్యాయి. పైగా అది మా అబ్బాయి ఎదుగుతున్న టైమ్. ఎక్కడ కెరీర్ స్టార్ట్ చేశానో, మళ్లీ అక్కడే ఉన్నా. అయినా ధైర్యంతో ‘దేవి’ని స్టార్ట్ చేశా. ఆ సినిమా పూర్తి చేయడానికి రెండున్నరేళ్లు పట్టింది. ‘దేవి’ ఎలాంటి అనుభవాన్నిచ్చింది? ఎమ్మెస్ రాజు: దైవబలం వల్లే కొన్ని ప్రాజెక్టులు స్టార్టవుతాయి. ‘దేవి’ అలాంటి సినిమానే. తెలుగులో వన్ ఆఫ్‌ది బెస్ట్ స్క్రీన్‌ప్లే ‘దేవి’. ఈ సినిమాలో చెప్పుకోదగ్గ స్టార్లు ఎవరూ ఉండరు. కేవలం కథ, కథనం, టెక్నాలజీ ఇవే ఈ సినిమాకు అఖండ విజయాన్ని తెచ్చిపెట్టింది. తెలుగులోనే కాదు, తమిళం, హిందీలో కూడా విజయం సాధించిందీ సినిమా. రెండున్నరేళ్లు పడ్డ ఫైనాన్షియల్ టెన్షన్ మొత్తం దూదిపింజెలా ఎగిరిపోయింది. ఆ సినిమా ఇప్పుడు తీయాలంటే వితవుట్ స్టార్కాస్ట్ పాతికకోట్లు అవుతుంది. సరే నెక్ట్స్ సినిమా ‘దేవీపుత్రుడు’ సంగతేంటి? ఎమ్మెస్ రాజు: ‘దేవి’ సక్సెస్ అని తెలియగానే వెంకటేష్ నాకు ఫోన్ చేసి మరీ అభినందించారు. ఆ తర్వాత ఇద్దరం చెన్నయ్‌లో కలుసుకున్నాం. ‘ఏదైనా మంచి సబ్జెక్ట్ ఉంటే చూడు.. సినిమా చేద్దాం’ అన్నారు. నా నుంచి ‘దేవి’ లాంటి స్పెషల్ ఎఫెక్ట్స్ సినిమానే ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లు మాటల్లో నాకనిపించింది. అందుకే స్పెషల్ ఎఫెక్ట్స్తోనే ఏదైనా కొత్తగా వెళదాం అనుకున్నాను. అప్పుడు రచయిత జొన్నవిత్తుల ఇచ్చిన సజెషనే ‘దేవీ పుత్రుడు’. నీటిలో ద్వారక మునిగిపోవడం, ఒక ఆర్కియాలజిస్ట్ ఆ రహస్యాన్ని ఛేదించడం... ఇవన్నీ ఆయనే చెప్పారు. ఆయన చెబుతున్నప్పుడు ఆది ఆడియన్స్‌కి హెవీ అవుతుందని నాకు అనిపించలేదు. ప్రేక్షకుల మేథస్సును ఎందుకు తక్కువ చేసి చూడాలి? సరిగ్గా తీస్తే ప్రయోగాలను ప్రేక్షకులు ఎందుకు చూడరు? అనే మొండి పట్టుదలతో ‘దేవి పుత్రుడు’ తీశాం. అయితే... సంక్రాంతికి విడుదల చేయాలని చివర్లో కాస్త హడావిడి పడ్డాం. సినిమా చూసినవారందరూ మంచి ఎఫర్ట్ అని అభినందించారు. కానీ డిస్ట్రిబ్యూటర్లను మాత్రం డిజప్పాయింట్ చేసింది. ఆ సినిమాకు విపరీతంగా ఖర్చుపెట్టాం. స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం చేయని లొకేషన్లేదు. తిరగని దేశం లేదు. చివరకు ఫ్లాప్‌ని మూటకట్టుకున్నాం. మళ్లీ ‘దేవి’కి ముందు పరిస్థితి. ఎక్కడ మొదలయ్యానో మళ్లీ అక్కడికే చేరుకున్నాను. ఆ పరిస్థితుల్లో చేదు అనుభవాలేమైనా ఎదురయ్యాయా? ఎమ్మెస్ రాజు: కొన్ని చెప్పుకోకూడదు. ఇప్పుడు అందరం కలిసే ఉన్నాం కాబట్టి, అవన్నీ నెమరువేసుకోవడం ఇప్పుడు పద్ధతి కాదు. అయితే... పంపిణీదారుల్ని ముంచేశానని కొందరన్న మాటలు మాత్రం నాకు బాధను కలిగించాయి. అవి నాలో కసిని పెంచాయి. ఇండస్ట్రీకి వచ్చి పన్నెండేళ్లు అయ్యింది. ఏం సాధించాం. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లు ఉంది పరిస్థితి. ఇలా కాదు... తక్కువ బడ్జెట్లో సినిమా తీసి, భారీ విజయం కొట్టాలి. ఇదే నా ఆలోచన. అలా ‘మనసంతా నువ్వే’ మొదలు పెట్టాను. ఆ సినిమాకు పరుచూరి బ్రదర్స్ నాకు హెల్ప్ అవుతారని ఎవరూ అనుకోలేదు. కానీ హెల్ప్ అయ్యారు. వీఎన్ ఆదిత్యను దర్శకునిగా పరిచయం చేశాను. నేనే సొంతంగా రిలీజ్ చేసుకున్నాను. నిజంగా ఆ సినిమా నాకు పెద్ద జాక్‌పాట్. ‘దేవిపుత్రుడు’ వల్ల ఇబ్బంది పడ్డ డిస్ట్రిబ్యూటర్లందరినీ పిలిచి ఎవరి డబ్బులు వాళ్లకు ఇచ్చేశాను. మీ హవా మొదలైంది అప్పట్నుంచే అనుకుంటా? ఎమ్మెస్ రాజు: అవును... ఆ తర్వాత నీ స్నేహం, ఒక్కడు చిత్రాలు ప్యార్లర్‌గా మొదలయ్యాయి. ‘ఒక్కడు’ స్టార్ట్ అవ్వడం వెనుక కొన్ని ఆసక్తికర సంఘటనలు జరిగాయి. అవేంటంటే... 2001 సంక్రాంతి పోటీలో నా ‘దేవీపుత్రుడు’తో పాటు నరసింహనాయుడు, మృగరాజు చిత్రాలు కూడా నిలిచాయి. ఆ పోటీలో నేనెంతో కష్టపడి తీసిన ‘దేవీపుత్రుడు’ ఫ్లాప్ అయినప్పుడు నేను ఆర్థికంగా ఫేస్ చేసిన స్ట్రగుల్స్ అన్నీఇన్నీ కావు. అదే టైమ్‌లో విడుదలైన ‘మృగరాజు’ది కూడా సేమ్ సిట్యుయేషన్. అందుకే, నాకెందుకో దేవీవరప్రసాద్‌గారిని ఒక్కసారి కలవాలనిపించి ఆయన ఇంటికెళ్లాను. ‘మృగరాజు’ డెరైక్టర్ అయిన గుణశేఖర్‌తో కూడా ఫోన్ చేసి మాట్లాడాను. ఆయనతో కలిసి సినిమా చేయాలని కూడా అప్పుడు నాకు లేదు. మాటల్లో మాట ఆయన వెంకటేష్‌గారితో ‘లవకుశ’ లాంటిదేదో తీస్తే బావుంటుందని చెప్పాడు. అయితే.. దాని గురించి నేను సీరియస్‌గా ఆలోచించలేదు. అప్పటికి ఆ టాపిక్ ముగిసింది. అలాంటి టైమ్‌లోనే ‘మురారి’ సినిమా విడుదలైంది. నాకు సినిమా తెగ నచ్చేసింది. ఆ విషయమే కృష్ణగారికి చెప్పాను. మహేష్‌తో ఓ సినిమా చేయాలని ఉందని ఆయనతో అన్నాను. మాటల్లో మాట దివిసీమ నేపథ్యంలో ఓ ప్రేమకథ చేస్తే బావుంటుందని కృష్ణగారితో చెప్పాను. ఆయన కూడా బావుంటుందన్నారు. మహేష్‌తో కూడా ఆ టైమ్‌లో కొన్ని డిస్కషన్స్ జరిగాయి. ‘మనసంతా నువ్వే’ కథ కూడా మహేష్‌కి చెప్పాను. కానీ ఆయన పెద్ద ఇంట్రస్ట్ చూపలేదు. అదే టైమ్‌లో మహేష్‌కి గుణశేఖర్ ఓ కథ చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడని, కథానుగుణంగా ఓ భారీ సెట్‌ని నిర్మించాలని, దాంతో ఆ సినిమాను హ్యాండిల్ చేయడానికి నిర్మాతలెవరూ ముందుకు రావడం లేదని తెలిసింది. సరిగ్గా అప్పుడే గుణశేఖర్ ఫోన్ చేసి, ‘నేను మహేష్‌బాబు దగ్గర ఉన్నాను.. ఓసారి వస్తారా.. మాట్లాడాలి’ అన్నాడు. సరేనని వెళ్లాను. ‘ముగ్గురం కలిసి ఓ ప్రాజెక్ట్ చేద్దాం’ అన్నాడు గుణశేఖర్. అదే ‘ఒక్కడు’. ‘మీ ఫుల్ ఎఫర్ట్ పెట్టండి రాజుగారూ... చేద్దాం’ అన్నాడు మహేష్. ‘ఫుల్ ఎఫెర్ట్ పెట్టడం అంటే... ఇప్పుడు నా దగ్గర అంత డబ్బులేదు. ఈ సినిమా నేను హ్యాండిల్ చేసేదీ... చేయందీ నా ‘మనసంతా నువ్వే’ విజయంపైనే ఆధారపడి ఉంది. ఆ సినిమా హిట్ అయితే.. వచ్చిన డబ్బంతా మీ సినిమాకు పెడతాను. హిట్ కాకపోతే.. మాత్రం మీ సినిమాను నేను హ్యాడిల్ చేయలేను’ అని మహేష్‌కి నిర్మొహమాటంగా చెప్పేశాను. కానీ మహేష్ మాత్రం ససేమిరా అన్నాడు. ‘మనసంతా నువ్వే’ హిట్ అయినా... అవ్వకపోయినా ‘ఒక్కడు’ మీరే తీయాలి’ అని పట్టుపట్టాడు. ‘చార్మినార్ సెట్ వేయడమే ఆ సినిమాకు భారం అనుకుంటే... ఆ సెట్టే వేయొద్దు. అవసరం అనుకుంటే... రియల్ చార్మినార్ దగ్గరే షూటింగ్ చేద్దాం. అప్పుడు బడ్జెట్ కూడా తగ్గిపోతుంది’ అన్నాడు. నేను అన్యమనస్కంగానే అంగీకరించాను. లక్కీగా ‘మనసంతా నువ్వే’ భారీ విజయం సాధించింది. ఆ సినిమాకు వచ్చిన డబ్బు మొత్తం ‘ఒక్కడు’కి పెట్టేశాను. ప్రేక్షకులను అబ్బుర పరిచే రేంజ్లో చార్మినార్ సెట్ వేయించాను. నిర్మాతకు కేరక్టర్ ఎంత ముఖ్యమో... డబ్బు కూడా అంతే ముఖ్యమని, ఓ భారీ ప్రాజెక్ట్ నిర్మించాలంటే... నిర్మాతకు వెనుక ఓ విజయం ఉండాలని ‘మనసంతా నువ్వే’ విజయంతో నాకు తెలిసొచ్చింది. ఆ సినిమా హిట్ అవ్వకపోతే.. ‘ఒక్కడు’ తీయగలిగేవాణ్ణి కాదు. ‘ఒక్కడు’తో మా తలరాతలే మారిపోయాయి. ‘నీ స్నేహం’ చిత్రానికి కొంత మేర నష్టం వాటిల్లితే... ‘ఒక్కడు’ దాన్ని పూడ్చేసింది. అంత పెద్ద విజయాన్ని మహేష్‌తో తీసిన నేను, మళ్లీ ఆయనతో సినిమా చేయకపోవడమేమిటనేది ఇప్పటికీ నాకు సమాధానం దొరకని ప్రశ్న. {పభాస్తో ‘వర్షం’ ఎలా మొదలైంది? ఎమ్మెస్ రాజు: ‘ఒక్కడు’ పోస్ట్‌ప్రొడక్షన్ టైమ్‌లో ప్రభాస్ నాన్నగారైన సూర్యనారాయణరాజుగారు.. ఫోన్ చేస్తే వెళ్లి కలిశాను. అప్పుడే ప్రభాస్‌తో సినిమా చేస్తానని మాటిచ్చాను. అదే ‘వర్షం’. ‘అర్జున్’ సినిమా ఆఫీస్‌లో త్రిష స్టిల్స్ చూసి, ఆమెను ‘వర్షం’ హీరోయిన్గా తీసుకున్నాం. ‘బాబీ’ లాంటి ఫ్లాప్ సినిమాను తీసిన శోభన్ని ఏ ధైర్యంతో ‘వర్షం’కి డెరైక్టర్‌గా తీసుకున్నారు? ఎమ్మెస్ రాజు: సినిమా హిట్, ఫ్లాప్ ఎవరి చేతిలో ఉండవని నమ్ముతాన్నేను. శోభన్ మంచి రైటర్. ‘బాబీ’ టైమ్‌లోనే ఇద్దరం కలిసి పనిచేద్దాం అని అతనికి మాటిచ్చాను. కానీ ‘బాబీ’ ఫ్లాప్ అవ్వడంతో అతను నన్ను అడగడానికి ధైర్యం చేయలేకపోయాడు. కానీ, ‘వర్షం’కు డైలాగ్‌లు రాస్తానని అడిగాడు. ‘డైలాగులు రాయడం దేనికి.. డెరైక్ట్ చేయ్’ అన్నాను. ‘జోక్ చేయకండి సార్..’ అన్నాడు. ‘జోక్ కాదు నిజంగానే చెబుతున్నా.. ‘వర్షం’కి నువ్వే డెరైక్టర్’ అని కన్ఫర్మ్ చేసి చెప్పాను. ఆ టైమ్‌కి ఏది అనిపిస్తే... అది చేసేయడం నాకలవాటు. ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ ఆలోచనెలా వచ్చింది? ఎమ్మెస్ రాజు: ‘మైనే ప్యార్‌కియా’ ప్రేరణతో ఈ కథ అల్లుకున్నాం. హీరోగా ఓ ఫ్రెష్ కుర్రాడు కావాలి. లండన్ నుంచి దిగొచ్చిన వాడిలా ఉండాలి. అలాంటి అబ్బాయి కోసం వెతుకుతున్న తరుణంలో అనుకోకుండా చెన్నయ్‌లో ‘బోయ్స్’ సినిమా పాటను ఓ టీవీలో చూశాను. ఈ సినిమాకు ఈ కుర్రాడు బావుంటాడేమో అనిపించింది. త్రిష మేనేజర్ నజీర్‌కి ఫోన్ చేసి సిద్దార్థ్ గురించి అడిగాను. ‘మీరెక్కడున్నారో చెప్పండి... వచ్చి కలుస్తాను’’ అన్నాడు నజీర్. ఫలానా చోట ఉన్నానని చెప్పాను. అంతే అయిదునిమిషాల్లో నజీర్ నా ముందున్నాడు. అతని వెనుకే సిద్దార్థ్ కూడా. ఆ తర్వాత కథ మీకు తెలిసిందే. ‘పౌర్ణమి’ సినిమాక్కూడా కథ మీరే అనుకుంటా? ఎమ్మెస్ రాజు: అవును.. ‘నువ్వొస్తానంటే..’ తర్వాత ‘పౌర్ణమి’ తీశాను. నెక్ట్స్ సినిమా కూడా నాతోనే చేస్తానని ప్రభుదేవా పట్టుపట్టడంతో.. ప్రభాస్ డేట్స్ కూడా రెడీగా ఉండటంతో ఆ సినిమా మొదలుపెట్టాను. అందరికీ తెలిసిందే... ఆ సినిమా పేరుకే ‘పౌర్ణమి’కానీ... నాకు మాత్రం అమావాస్యగానే పరిణమించింది. టెక్నికల్‌గా అది ఫార్వార్డ్ థాట్‌తో తీసిన సినిమా. ‘వర్షం’లో ప్రభాస్‌ని హీమ్యాన్‌లా చూపించాను. మళ్లీ తనతో సినిమా అంటే... జనాల అంచనాలు కూడా ‘వర్షం’ రేంజ్లో ఉంటాయి. కానీ ‘పౌర్ణమి’లో ప్రభాస్‌ని సాఫ్ట్‌గా చూపిస్తాడు. అది కూడా సినిమా పరాజయానికి కారణం అయ్యిందనుకుంటా. జీవితంలో నేను చేసిన ఖరీదైన తప్పు ‘పౌర్ణమి’. ఆ తప్పు తర్వాత వెంటనే నేను చేసిన మరో తప్పు ‘ఆట’. కథ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండే మీరు ‘ఆట’ విషయంలో ఎందుకు తడబడ్డారు? ఎమ్మెస్ రాజు: నిజానికి ఆ సినిమా టైమ్‌లో నా దగ్గర కథ లేదు. సిద్దార్థ్ ఏమో.. ‘ఎంతమంది అడిగినా సరే.. మీ సినిమా చేశాకే మరో సినిమా చేస్తాను’ అని పట్టుపట్టాడు. దాంతో ‘ఆట’ తీయక తప్పలేదు. ఇలా నా కెరీర్ మొత్తం లేవడం పడడం... పడటం లేవడమే అయిపోయింది. ఇప్పుడు మీకు ఇంటర్వ్యూ ఇచ్చే సమయానికి అన్ సక్సెస్‌ఫుల్‌గా, మళ్లీ సక్సెస్ కొట్టాలనే కసితో ఉన్నాను. త్వరలోనే సక్సెస్ కొట్టి చూపిస్తా... మీ అబ్బాయిని హీరోగా పరిచయం చేస్తూ మీరు చేసిన ‘తూనీగ తూనీగ’ అనుకున్నట్లు ఆడనప్పుడు మీరెలా ఫీలయ్యారు? ఎమ్మెస్ రాజు: ఆ సినిమా ఆడకపోవచ్చు... కానీ వాడికి యాక్టర్‌గా పేరు తెచ్చింది. ఆ సినిమా వల్లే వాడికి సెకండ్ సినిమా వచ్చింది. వేరే నిర్మాత తీసిన ఆ సినిమా బాగా ఆడింది. ప్రస్తుతం వాడు హీరోగా రెండుమూడు సినిమాలు తయారవుతున్నాయి. ‘తూనీగ తూనీగ’ విషయంలో నాకు బాధ అనిపించింది ఒక్కటే. ఇన్నాళ్లూ నా సినిమాల వల్ల ఆనందాన్ని కానీ, బాధల్ని కానీ నేనొక్కడ్నే అనుభవించాను. కానీ ఆ సినిమాకు నిర్మాతలు వేరే వారు అవ్వడం, అనుకున్న స్థాయిలో ఆ సినిమా ఆడకపోవడం నన్ను ఆవేదనకు లోనుచేసిన అంశం. ఒక నిర్మాతగా అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు. ఓ హిట్ తగలడమే ఆలస్యం... నా సినిమాల వల్ల నష్టపోయిన పంపిణీదారులకు డబ్బును వెనక్కు ఇచ్చేసేవాణ్ణి నేను. అలాగే.. మళ్లీ హిట్ కొట్టి ఆ సినిమా నిర్మాతల నష్టాన్ని పూడ్చేయాలనుకుంటున్నా. {పేమకథ అంటున్నారు. మీ అబ్బాయితోనే చేస్తారా? ఎమ్మెస్ రాజు: నా సినిమా అనగానే... మా అబ్బాయే హీరో అనుకుంటారు. ఏ హీరోని నా అంతట నేను అడగనని ఇంతకు ముందు చెప్పాను కదా. అలాగే మా అబ్బాయిని కూడా అడగను. సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్లు ఎక్కువ. కానీ మీరేమో అందుకు భిన్నంగా ఫ్లాపుల్లో ఉన్నవాళ్లకు పిలిచి అవకాశం ఇస్తారు. దేనికి? ఎమ్మెస్ రాజు: మనిషి ప్రతిభను ఒక ఫ్లాప్‌తో అంచనా వేయలేం. ఈ సారి నేను ఓ ఫ్లాప్ డెరైక్టర్‌తో సినిమా చేయబోతున్నాను. అతనెవరో తెలుసా? నేనే. ఉన్నట్టుండి బాగా చిక్కిపోయారేంటి? ఎమ్మెస్ రాజు: వర్క్‌లో ఉన్నప్పుడు మనకు పెద్దగా తెలీదు కానీ... కాస్త రిలాక్సయ్యాక మన ఆరోగ్య పరిస్థితేంటో మనకు తెలుస్తుంది. ఓ సారి ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు నేను హెవీ బరువు పెరిగానా అనిపించింది. సక్సెస్ మనం తెచ్చుకోగలం. కానీ హెల్త్ ఒక్కసారి పాడైతే మళ్లీ మనం తెచ్చుకోలేం. అందుకే తగ్గాలని గట్టిగా నిర్ణయించుకొని 30, 40 కేజీలు తగ్గాను. వాకింగ్, డైట్... ఈ రెండిటినీ క్రమం తప్పకుండా మూడేళ్ల పాటు చేశాను. - బుర్రా నరసింహ మీ వల్ల స్టార్స్ అయిన వారు చాలామంది ఉన్నారు. మీరు ఫ్లాప్స్‌లో ఉన్నప్పుడు వాళ్లొచ్చి మిమ్మల్ని కలవడం కానీ, కలిసి సినిమా చేద్దాం అని అడగడం కానీ చేశారా? ఎమ్మెస్ రాజు: ఆకాశంలో చుక్కల్ని చూస్తూ కూర్చోవడమే నాకు ఆనందం. అంతే తప్ప ఆ చుక్కలు కిందకొచ్చి నన్ను కూడా తీసుకెళ్లి వాటి సరసన కూర్చోబెట్టాలని మాత్రం కోరుకోను. నా నైజం అది కాదు. ఒకవేళ వాళ్ళొచ్చి అడిగినా... సరే అనే... తేలికైన వ్యక్తిత్వం కాదు నాది. ‘స్ట్రీట్ ఫైటర్’ ఫ్లాప్ తర్వాత వెంకటేష్బాబుని కలవమని కొందరు చెప్పినా కూడా... ‘దేవి’ తీసిన తర్వాతే ఆయన్ను కలిశాను. అప్పుడు నా కేరక్టర్ ఎలా ఉందో, ఇప్పుడూ అలాగే ఉంది. 2014లో నేను భారీ హిట్ ఇవ్వబోతున్నాను. తర్వాత మళ్లీ ఎమ్మెస్రాజు వైభవం మొదలవుతుంది. ఇది కాన్ఫిడెంట్‌గా చెబుతున్న మాట. కొరియోగ్రాఫర్ ప్రభుదేవాలో ఓ మంచి డెరైక్టర్ ఉన్నాడని మీరెలా పసికట్టారు? ఎమ్మెస్ రాజు: ‘శత్రువు’ సినిమా టైమ్‌లో సుందరం మాస్టార్కి కాస్త హెల్త్ బావుండకపోతే... తన బదులుగా ఆయన ప్రభుదేవాను పంపాడు. తనను చూడగానే నాకు భయమేసింది. ‘చూస్తే చిన్నపిల్లాడిలా ఉన్నాడు. వీడేం కొరియోగ్రఫీ చేస్తాడు’ అని అనుమానించాను. కానీ... అందరికీ పెద్ద షాక్ ఇచ్చేశాడు. ‘పొద్దున్నే వచ్చింది చందమామ’ పాటకు మైండ్ బ్లోయింగ్ అయ్యేలా కొరియోగ్రఫీ చేశాడు. ఇప్పటికీ నా సినిమాల్లో బెస్ట్ కొరియోగ్రఫీ అంటే ఆ పాటే చెబుతా. అప్పట్నుంచీ ప్రభు నాకు పరిచయం. తాను ‘ప్రేమికుడు’ సినిమాతో హీరో అయ్యాక కూడా ఇంటికెళ్లి అభినందించా. తరచూ ఇద్దరం రెస్టారెంట్లలో కలుస్తూ కబుర్లు చెప్పుకునేవాళ్లం. వయసు పరంగా మా ఇద్దరి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. అయినా రాత్రుళ్లు డిస్కోథెక్‌లకు కూడా వెళ్లేవాళ్లం. తాను డాన్స్ చేస్తుంటే నేను చూస్తూ ఎంజాయ్ చేసేవాణ్ణి. అప్పుడప్పుడు తను సరదాగా కథలు కూడా చెబుతుండేవాడు. బేసికల్‌గా కొన్ని పొరపాట్లు ఉన్నా... చెప్పే విధానం మాత్రం బావుండేది. అయితే.. దాన్ని సీరియస్‌గా మాత్రం తీసుకోలేదు. ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ అనుకున్న తర్వాత డెరైక్ట్ చేసిపెట్టమని ఎస్.గోపాల్‌రెడ్డిగారిని ఆడిగాను. ఆయన సొంత సినిమా పనుల్లో బిజీగా ఉండటంతో చేయలేనని చెప్పేశారు. డెరైక్టర్‌గా ఎవర్ని తీసుకోవాలా? అని ఆలోచిస్తున్న టైమ్‌లో క్యాజువల్‌గా ప్రభుదేవా ఫోన్ చేశాడు. ‘సార్... ఓ కథ చెబుతా వింటారా’ అన్నాడు. ‘నువ్వు కాదు... నేనే ఓ కథ చెబుతా వింటావా’ అన్నాను. ‘ఏం కథ సార్..’ అన్నాడు. ‘అదంతా నీకు అనవసరం. నీకు నా కథ నచ్చితే... ఆ కథను నువ్వే డెరైక్ట్ చేయాలి. అందుకు నువ్వు రెడీనా’ అన్నాను. వెంటనే తను హైదరాబాద్ వచ్చేశాడు. అలా తన దర్శకత్వంలో ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ సినిమా మొదలైంది. దర్శకుల్ని పక్కన కూర్చోబెట్టి సినిమా అంతా మీరే తీసేస్తారని మీపై అభియోగం. ఎమ్మెస్ రాజు: ఎవరు అనుకున్నట్లు వాళ్లు అనుకోనీయండి. ఇప్పుడు మనం ‘కాదు’ అని చెప్పినా వాళ్లు నమ్మరు. నా సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్‌కి నేనేంటో తెలుసు. వాళ్లేంటో నాకు తెలుసు. మరొకరికి తెలియాల్సిన అవసరం లేదు. మేకర్‌గా కింగ్ అనిపించుకున్న మీకు ఉన్నట్లుండి దర్శకునిగా మారాలని ఎందుకనిపించింది? ఎమ్మెస్ రాజు: నేను సినీ జీవితాన్ని మొదలుపెట్టేటప్పుడు నా సినిమాలకు నేనే కథలు రాసుకుంటానని అనుకోలేదు. నా సినిమాల విషయంలో దర్శకులు ఓ వైపు పాటను షూట్ చేస్తుంటే... మరో వైపు నేను సీన్స్ తీసేవాణ్ణి. అలా సీన్‌ని డెరైక్ట్ చేయగలనని కూడా ఎప్పుడూ అనుకోలేదు. పైగా అవన్నీ హిట్లు. నేను దర్శకునిగా మారడమే మిస్టేక్ అని మీరంటే... ఆ తప్పు మళ్లీ మళ్లీ చేస్తాను. ఎందుకంటే, ఎన్ని మిస్టేక్‌లు చేస్తే అన్ని నేర్చుకోవచ్చు. త్వరలో మరో మిస్టేక్ చేయబోతున్నా. దర్శకునిగా నేనేంటో నిరూపించేది ఆ సినిమానే.