7 డేస్‌ 6 నైట్స్‌... షూటింగ్‌ మొదలైంది | MS Raju Says 7 Days 6 Nights Movie Shooting Starts Again After Gap | Sakshi
Sakshi News home page

7 Days 6 Nights: గోవా, అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో షూటింగ్‌

Published Mon, Jun 28 2021 7:59 AM | Last Updated on Mon, Jun 28 2021 7:59 AM

MS Raju Says 7 Days 6 Nights Movie Shooting Starts Again After Gap - Sakshi

'డర్టీ హరి' చిత్రం తర్వాత ఎంఎస్‌ రాజు దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం '7 డేస్‌ 6 నైట్స్‌'. సుమంత్‌ అశ్విన్‌, ఎం. రజనీకాంత్‌ ఎస్‌. నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌, హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఎంఎస్‌ రాజు మాట్లాడుతూ.. 'ఇదొక కూల్‌ అండ్‌ న్యూ ఏజ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సర్‌. వినోదానికి మంచి అవకాశం ఉంది. నటీనటుల వివరాల్ని గోప్యంగా ఉంచాం' అన్నారు.

'జూలై 10 వరకు హైదరాబాద్‌లో చిత్రీకరిస్తాం. ఆ తర్వాత 15 నుంచి గోవా, మంగుళూరు, ఉడిపి, అండమాన్‌- నికోబార్‌ దీవుల్లో చిత్రీకరిస్తాం. సెప్టెంబర్‌లో చిత్రాన్ని విడుదల చేస్తాం' అన్నారు సుమంత్‌ అశ్విన్‌. ఈ చిత్రానికి సంగీతం: సమర్థ్‌ గొల్లపూడి, కెమెరా: నాని చమిడిశెట్టి, లైన్‌ ప్రొడ్యూసర్‌: జె.శ్రీనివాసరాజు, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: యువి సుష్మ, కో ప్రొడ్యూసర్‌: ఎం.రాము.

చదవండి: '7 డేస్‌ 6 నైట్స్‌'.. డర్టీ హరీని మించి ఉంటుంది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement