
సిమ్రత్ కౌర్, శ్రవణ్ రెడ్డి
ప్రముఖ నిర్మాత ఎం.ఎస్. రాజు దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘డర్టీ హరి’. శ్రవణ్ రెడ్డి హీరోగా పరిచయం అవుతున్నారు. సిమ్రత్ కౌర్, రుహాణి శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. గూడూరు సతీష్ బాబు, గూడూరు సాయి పునీత్ నిర్మిస్తున్న ఈ సినిమా రీ–రికార్డింగ్ మొదలయింది. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘రొమాంటిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న చిత్రమిది. ఇందులో బోల్డ్ అంశాలతో పాటు సున్నితమైన, భావోద్వేగభరితమైన సన్నివేశాలు ఉంటాయి. రొమా¯Œ్సని దర్శకుడు చాలా పొయెటిక్‌గా చూపిస్తున్నారు. ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీసిన దర్శక–నిర్మాత ఎం.ఎస్. రాజుగారికి ఇది కమ్‌బ్యాక్ చిత్రం అవ్వడంతో భారీ అంచనాలున్నాయి. త్వరలోనే టీజర్‌ని విడుదల చేసి, సినిమా రిలీజ్ డేట్‌ని ప్రకటిస్తాం’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment