ఇది అలాంటి సినిమా కాదు! | MS Raju opens up on the story of Dirty Harry | Sakshi
Sakshi News home page

ఇది అలాంటి సినిమా కాదు!

Published Thu, Dec 10 2020 12:17 AM | Last Updated on Thu, Dec 10 2020 5:42 AM

MS Raju opens up on the story of Dirty Harry - Sakshi

శ్రవణ్, ఎం.ఎస్‌. రాజు, సిమ్రత్‌

‘‘శృంగారానికి, బూతుకు చాలా తేడా ఉంది. ‘డర్టీ హరి’ అనేది ఎం. ఎస్‌. రాజు ఫిల్మ్‌. బూతు ఫిల్మ్‌ కాదు. ఈ సినిమాలో మంచి హ్యూమన్‌ డ్రామా ఉంది’’ అన్నారు దర్శక–నిర్మాత ఎం.ఎస్‌. రాజు. శ్రవణ్‌ రెడ్డి, సిమ్రత్‌ కౌర్, రుహానీ శర్మ హీరో హీరోయిన్లుగా ఎం.ఎస్‌. రాజు దర్శకత్వం వహించిన చిత్రం ‘డర్టీ హరి’. గూడూరు సతీష్‌ బాబు, గూడూరు సాయి పునీత్, కేదార్‌ సెలగం శెట్టి, వంశీ కారుమంచి ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా ఫ్రైడే మూవీస్‌ అనే ఏటీటీ ప్లాట్‌ఫామ్‌ ద్వారా ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సినిమా సెకండ్‌ ట్రైలర్‌ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఎం.ఎస్‌. రాజు మాట్లాడుతూ– ‘‘నాకు క్లీన్‌ ప్రొడ్యూసర్‌గా పేరు ఉంది. కానీ ఒక బోర్డర్‌ దాటి నేను ‘డర్టీ హరి’ లాంటి సినిమాను ఎందుకు తీయాల్సి వచ్చిందనే విషయం ఈ నెల 18న తెలుస్తుంది.

ఎం.ఎస్‌. రాజు వివాదాస్పద  సినిమా తీశారేంటి? అనుకునేవారికి సమాధానం దొరుకుతుంది’’ అన్నారు. ‘‘ఇది మంచి ఎంటర్‌టైనింగ్‌ మూవీ’’ అన్నారు శ్రవణ్‌. ‘‘నా ముందు సినిమాలో నేను సంప్రదాయంగా ఉండే పాత్ర చేశాను. కానీ ఇందులో ముద్దు సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయి. యాక్టర్‌గా అన్ని రకాల పాత్రలు చేయాలి. వందశాతం కష్టపడాలని మా అమ్మగారు అనడంతో ఈ సినిమాకు ఓకే చెప్పాను’’ అన్నారు సిమ్రత్‌ కౌర్‌. ‘‘ఇదొక రొమాంటిక్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌’’ అన్నారు నిర్మాత వంశీ. ‘‘మా ఫ్రైడే మూవీస్‌ యాప్‌లో ప్రతి శుక్రవారం ఓ సినిమాను రిలీజ్‌ చేద్దాం అనుకుంటున్నాం. ‘డర్టీ హరి’ సినిమా సక్సెస్‌ కావాలని కోరుకుంటున్నాం’’ అన్నారు విజయ్‌. ఈ కార్యక్రమంలో కేదార్, మదన్, భాస్కర్, అనురాగ్, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement