OTT Successful Dirty Hari Movie To Release In Theatres On Jan 8th | బిగ్‌స్క్రీన్‌పై ‘డర్టీ హరి’ రొమాన్స్‌ - Sakshi
Sakshi News home page

బిగ్‌స్క్రీన్‌పై ‘డర్టీ హరి’ రొమాన్స్‌

Published Sat, Jan 2 2021 2:39 PM | Last Updated on Sat, Jan 2 2021 4:51 PM

Dirty Hari To Hit Big Screens On 8th January - Sakshi

ప్రముఖ నిర్మాత ఎం.ఎస్‌. రాజు దర్శకత్వం వహించిన ‘డర్టీ హరి’ సినిమా ఓటీటీ వేదికగా విడుదలై ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.  ఫ్రైడే మూవీస్ అనే యాప్ ద్వారా విడుదలైన ఈ సినిమా యూత్‌ని బాగా అట్రాక్ట్ చేసింది. తక్కువ సమయంలోనే కోటి రూపాయలకు పైగా కలెక్షన్స్‌ను రాబట్టి సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత 'ఆహా'యాప్‌తో డీల్‌ కుదుర్చుకొని ప్రసారం చేయడంతో మరింత లాభాన్ని తెచ్చిపెట్టింది. 

ఇదిలా ఉంటే ఓటీటీలో సంచలనం సృష్టించిన ఈ చిత్రాన్ని ఇప్పుడు థియేటర్లలోకి తీసుకురానున్నారు. సినిమా మంచి టాక్‌ సొంతం చేసుకోవడంతో థియేటర్లలో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 8న ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.  ఓటీటీలో అదరగొట్టిన ఈ సినిమా బిగ్‌స్క్రీన్‌పై ఎంత వరకు అలరిస్తుందో చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement