Dirty Hari Movie
-
'7 డేస్ 6 నైట్స్'.. డర్టీ హరీని మించి ఉంటుంది
‘శత్రువు’, ‘దేవి’, ‘మనసంతా నువ్వే’, ‘ఒక్కడు’, ‘వర్షం’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఎంఎస్ రాజు దర్శకునిగా మారిన సంగతి తెలిసిందే. గత ఏడాది ‘డర్టీ హరి’తో దర్శకుడిగా మంచి విజయం అందుకున్న ఎంఎస్ రాజు పుట్టినరోజు నేడు (మే 10). ఈ సందర్భంగా దర్శకుడిగా తన తదుపరి చిత్రాన్ని ప్రకటించారు. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో వైల్డ్ హనీ ప్రొడక్షన్ పతాకంపై ‘7 డేస్ 6 నైట్స్’ పేరుతో ఈ చిత్రం తెరకెక్కనుంది. వింటేజ్ పిక్చర్స్, ఏబీజీ క్రియేషన్స్ వారు ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వాములు. సుమంత్ అశ్విన్, రజనీకాంత్ .ఎస్ నిర్మాతలు. ఈ సందర్భంగా సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ– ‘‘జూన్ 7న ‘7 డేస్ 6 నైట్స్’ చిత్రీకరణ ప్రారంభించాలనుకుంటున్నాం. హైదరాబాద్, గోవా, మంగుళూరు, అండమాన్ నికోబార్ దీవుల్లో షూటింగ్ చేయనున్నాం. ప్రస్తుతానికి నటీనటుల వివరాలు గోప్యంగా ఉంచుతున్నాం’’ అన్నారు. ఎంఎస్ రాజు మాట్లాడుతూ– ‘‘న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రమిది. ‘డర్టీ హరి’ని మించి ఉంటుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సమర్థ్ గొల్లపూడి, కెమెరా: నాని చమిడిశెట్టి, లైన్ ప్రొడ్యూసర్: జె. శ్రీనివాసరాజు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: యువి సుష్మ, కో ప్రొడ్యూసర్: మంతెన రాము. -
థియేటర్లో హరి
శ్రవణ్‌రెడ్డి, సిమ్రత్ కౌర్, రుహానీ శర్మ ముఖ్యపాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘డర్టీహరి’. ఈ సినిమా మొదట ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఫ్రైడే మూవీస్ ఏటీటీలో డిసెంబర్ 18న, ఆ తర్వాత ఆహాలో విడుదలైంది. ఈ నెల 8న ఈ సినిమా థియేటర్లలో విడుదలవుతున్న సందర్భంగా యం.ఎస్. రాజు మాట్లాడుతూ – ‘‘రొమాంటిక్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. థియేటర్లో మా సినిమా ప్రేక్షకులకు ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని అనుకుంటున్నాను. కంటెంట్ బాగుంటే సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందని ‘డర్టీ హరి’ నిరూపించింది’’ అన్నారు. ‘‘యం.యస్. రాజుగారు సినిమా తీసిన విధానం అద్భుతంగా ఉందని సినిమా చూసినవాళ్లందరూ అంటున్నారు’’ అన్నారు శ్రవణ్‌రెడ్డి. -
బిగ్స్క్రీన్పై రొమాన్స్ చేయనున్న ‘డర్టీ హరి’
ప్రముఖ నిర్మాత ఎం.ఎస్. రాజు దర్శకత్వం వహించిన ‘డర్టీ హరి’ సినిమా ఓటీటీ వేదికగా విడుదలై ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫ్రైడే మూవీస్ అనే యాప్ ద్వారా విడుదలైన ఈ సినిమా యూత్‌ని బాగా అట్రాక్ట్ చేసింది. తక్కువ సమయంలోనే కోటి రూపాయలకు పైగా కలెక్షన్స్‌ను రాబట్టి సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత 'ఆహా'యాప్‌తో డీల్ కుదుర్చుకొని ప్రసారం చేయడంతో మరింత లాభాన్ని తెచ్చిపెట్టింది. ఇదిలా ఉంటే ఓటీటీలో సంచలనం సృష్టించిన ఈ చిత్రాన్ని ఇప్పుడు థియేటర్లలోకి తీసుకురానున్నారు. సినిమా మంచి టాక్ సొంతం చేసుకోవడంతో థియేటర్లలో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 8న ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఓటీటీలో అదరగొట్టిన ఈ సినిమా బిగ్స్క్రీన్పై ఎంత వరకు అలరిస్తుందో చూడాలి. -
2020 మూవీ రివ్యూ: ఓటీటీలో హిట్టు, ఫట్టు ఇవే
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. దీని దెబ్బకు యావత్ ప్రపంచం చిగురుటాకులా వణికిపోయింది. అన్ని రంగాలు కుదేలైపోయాయి. ముఖ్యంగా చిత్ర పరిశ్రమకు అయితే గట్టి దెబ్బ కొట్టింది. 2020లోకి ఎంటరైన మూడు నెలలకే సినిమా థీయేటర్లు మూతపడ్డాయి. దీంతో వేసవిలో విడుదల కావాల్సిన సినిమాలు బేల చూపులు చూశాయి. దసరా, దీపావళి పండగలు బోసిగా వెళ్లిపోయాయి. ఇక లాక్డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన జనాలు.. టీవీలో సీరియల్స్, సినిమాలు చూసి బోర్‌గా ఫీలయ్యారు. ఇలాంటి తరుణంలో కొత్త సినిమాలతో దూసుకువచ్చాయి ఓటీటీ వేదికలు. (చదవండి : కలిసిరాని 2020.. కళ తప్పిన ‘సినీ’ పండగ) అప్పటికే వెబ్ సిరీస్‌లతో వినోదాన్ని అందిస్తున్న ఓటీటీలు.. లాక్డౌన్ పుణ్యమా అని కొత్త సినిమాలను విడుదల చేసే చాన్స్ కొట్టేశాయి. ఇక థియేటర్లు మూతపడటంతో దర్శక- నిర్మాతలకు కూడా ఓటీటీ వేదికలు ఆపద్భావుడిలా కనిపించాయి. వడ్డీల భారం నుంచి బయట పడేందుకు నిర్మాతలకు సరైన మార్గం దొరికింది. తమ చిత్రాలను ప్రేక్షుల దగ్గరకు తీసుకెళ్లేందుకు ఓటీటీ వేదికలు ఉపయోగపడ్డాయి. అలా అన్ని భాషల చిత్రాలు ఓటీటీలో సందడి చేశాయి. తెలుగులో కూడా పలు చిత్రాలు ఓటీటీ వేదిక ద్వారా విడుదలై, ప్రేక్షకులను పలకరించాయి. అలా తెలుగులో ఓటీటీ వేదిక ద్వారా విడుదలైన చిత్రాలేవో, అవి ఎంతమేరకు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయో.. సమగ్ర సమాచారం మీకోసం. ధైర్యం చేసిన ‘అమృతరామమ్’ లాక్డౌన్ సమయంలో ఓటీటీ వేదికగా విడుదలైన తొలి తెలుగు చిత్రం ‘అమృతరామమ్’.కొత్త దర్శకుడు సురేందర్ కొంటడ్డి తెరకెక్కించిన ఈ చిత్రంలో రామ్ మిట్టకంటి, అమితా రంగనాథ్ నటించారు. ఈ చిత్రం ఎప్రిల్ 29న జీ5 వేదికగా విడుదలైంది. యూత్ కంటెంట్‌తో వచ్చిన ఈ సినిమా ఆశించినంత ఫలితాన్ని రాబట్టలేకపోయింది. బెడిసికొట్టిన ‘మహానటి’ ప్రయోగం ‘మహానటి’ ఫేమ్ కీర్తి సురేష్ నటించిన `పెంగ్విన్` జూన్ 19న అమేజాన్ ప్రైమ్‌లో వచ్చింది. థ్రిల్లర్ నేపథ్యంలో సాగిన ఈసినిమా ఫ్లాప్ టాక్ మూటగట్టుకుంది. ఈశ్వర్ కార్తిక్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో కీర్తి ఓ బిడ్డకు తల్లిగా, గర్భంతో ఉన్న మహిళగా విలక్షణ పాత్రలో నటించి మెప్పించింది. అయితే ఆమె ప్రయోగం ఫలించలేదు. వినోదాన్ని పంచడంలో విఫలమయింది. లీల చేసిన ‘కృష్ణ అండ్ హీజ్ లీలా’ హీరో రానా సమర్పణలో సంజయ్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘కృష్ణ అండ్ హీజ్ లీలా’. ‘ఆహా’లో విడుదలైన ఈ సినిమాలో సిద్దు జొన్నగడ్డ, శ్రద్ధా శ్రీనాథ్, సీరత్ కపూర్, షాలిని నటించారు. రానా సమర్పించడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరగాయి. అయితే ఇది మరీ పెద్దగా హిట్ కాకపోయినా.. యూత్‌ని మాత్రం బాగా ఆకట్టుకుంది. మెప్పించిన ‘బానుమతి రామకృష్ణ’ల ప్రేమ నవీన్ చంద్ర, సలోని లుత్రా నటించిన ‘భానుమతి రామకృష్ణ’ సినిమా ‘ఆహా’ వేదికగా విడుదలైన యూత్‌ని మెప్పించింది. మెచ్యూరిటీ కలిగిన ప్రేమ కథతో రూపొందిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సత్యదేవ్ ఖాతాలో మరో హిట్ సత్యదేవ్ హీరోగా కంచరపాలేం ఫేమ్ వెంకటేశ్ మహా దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య'. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ప్రతీకారం, చిన్నచిన్న ఎమోషన్స్‌తో రూపొందిన ఈ సినిమాలో సత్యదేవ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ‘ఆహా’ను ఆదుకున్న ‘జోహార్’ ‘ఆహా’ లో రిలీజ్ అయినా మరో చిత్రం జోహార్. ప్రస్తుత రాజకీయాల ఇతివృత్తంతో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాలను ఆకర్షించింది. స్వార్థ రాజకీయాల కోసం భారీ మొత్తంలో ఖర్చు పెట్టి విగ్రహాలు ఏర్పాటు చేస్తే దాని ప్రభావం ఎలా ఉంటుంది అనేది దర్శకుడు కళ్లకు కట్టినట్టు చూపించాడు. మంచి లాభాలు తీసుకొచ్చింది విజయానికి దూరంగా ‘వి’ నాని, సుధీర్ బాబు నటించిన ‘వి’ చిత్రం సెప్టెంబర్ 5న భారీ అంచనాలతో అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. నాని 25వ సినిమా కావడం, తొలిసారి ప్రతినాయకుడి ఛాయలున్న పాత్రలో నటించడంతో అభిమానులో ఎన్నో అంచనాలు పెట్టుకొని సినిమా చూశారు. కానీ వారి అంచనాలు ‘వి’ అందుకోలేకపోయింది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి నెగిటివ్ టాక్ వచ్చింది. ‘నిశ్శబ్ధం’గా వెళ్లిన అనుష్క అనుష్క శెట్టి, మాధవన్ జంటగా ‘వస్తాడు నా రాజు’ ఫేమ్ హేమంత్ మధుకర్ తెరకెక్కించిన నిశ్శబ్ధం దారుణంగా నిరాశ పరిచింది. అమెరికాలో భారీగా రూపొందించిన ఈ చిత్రం అత్యంత దారుణంగా ఫ్లాప్ అయింది. నవ్వులు పూయించిన ‘ఒరేయ్ బుజ్జిగా’ యంగ్ హీరో రాజ్ తరుణ్, మాళవిక నాయర్, హెబా పటేల్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఒరేయ్ బుజ్జిగా...’. శ్రీమతి లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ నిర్మించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్కు కొండా విజయ్ కుమార్ దర్శకత్వం వహించారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ఈ చిత్రాన్ని నేరుగా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం ‘ఆహా’లో విడుదల చేశారు. ఈ చిత్రానికి ప్రేక్షకులు, విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. కాసులు కురిపించిన ‘కలర్ ఫోటో’ ఆహాలో విడుదలైన ‘కలర్ ఫోటో’ చిత్రానికి మంచి టాక్ వచ్చింది. సుహాస్, చాందిని చౌదరి జంటగా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను నవ్వించి, కవ్వించి... చివర్లో అందరి చేత కంటతడి పెట్టించింది. ఈ చిత్రాన్ని సందీప్ రాజ్ తెరకెక్కించాడు. సునీల్ విలన్‌గా నటించాడు. ఆహాకు మంచి లాభాలు తీసుకొచ్చింది ఈ చిత్రం. మిస్‌ఫైర్ అయిన ‘మిస్ ఇండియా’ కీర్తి సురేష్ నుంచి వచ్చిన మరో ఓటిటి సినిమా మిస్ ఇండియా. నరేంద్ర నాథ్ తెరకెక్కించిన ఈ చిత్రంపై ట్రోలింగ్ కూడా జరిగింది. అమెరికాలో ఛాయ్ అమ్మడం కాన్సెప్టు బాగున్నా స్క్రీన్ ప్లే లేకపోవడంతో తేలిపోయింది మిస్ ఇండియా. ‘గతం’మెరిసింది ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన సినిమా ‘గతం’. కొత్త దర్శకుడు కిరణ్ కొండమాడుగుల తెరకెక్కించిన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో నవంబర్ 6న విడుదలైంది. రిలీజ్ అయిన తర్వాత మంచి సస్పెన్స్ థ్రిల్లర్ అంటూ పేరు తెచ్చుకుంది. ఇండియన్ పనోరమాకు ఈ చిత్రం ఎంపికైంది. హృదయానికి హత్తుకున్న‘మిడిల్ క్లాస్ మెలొడీస్’ ఆనంద్ దేవరకొండ, వర్ష బొల్లమ్మ జంటగా కొత్త దర్శకుడు వినోద్ అనంతోజు తెరకెక్కించిన సినిమా మిడిల్ క్లాస్ మెలొడీస్. నవంబర్ 20న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. ఈ చిత్రానికి తొలిరోజే మంచి టాక్ వచ్చింది. పల్లెటూరు నుంచి గుంటూరు సిటీలో హోటల్ పెట్టుకోవాలనుకునే మధ్యతరగతి కుర్రాడి కథ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. సూర్యకి హిట్ ఇచ్చిన ‘ఆకాశం నీ హద్దురా’ సూర్య హీరోగా సుధ కొంగర తెరకెక్కించిన సినిమా ‘ఆకాశం నీ హద్దురా’. అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. సూర్యకు చాలా రోజుల తర్వాత వచ్చిన అద్భుతమైన విజయం ఇది. ‘డర్టీ హరి’కి యావరేజ్ టాక్ సీనియర్ నిర్మాత ఎమ్మెస్ రాజు దర్శకుడిగా మారిన చేసిన సినిమా డర్టీ హరి. ఎరోటిక్ సస్పెన్స్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రంలో శ్రవణ్ రెడ్డి, రుహానీ శర్మ, సిమ్రత్ కౌర్ నటించారు. డిసెంబర్ 18న ఫ్రైడే మూవీస్ యాప్‌లో విడుదలైన ఈ చిత్రానికి యావరేజ్ టాక్ వచ్చినా కూడా మంచి వసూళ్లు సాధిస్తుంది. -
‘డర్టీ హరి’పై వాసిరెడ్డి పద్మ సీరియస్
సాక్షి, విజయవాడ : ‘డర్టీ హరి’ సినిమా వాల్ పోస్టర్‌పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాత, దర్శకుడు, అడ్వర్టయిజ్మెంట్ ఏజెన్సీలపై కేసు నమోదు చేయాలని డీజీపీ గౌతం సవాంగ్‌ను కోరారు. ఈ పోస్టర్లు మహిళలను అగౌరవపరిచేలా, యువతను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయన్నారు. గుంటూరు ఉండవల్లి సెంటర్లో, ఇతర పట్టణాలలో అసభ్యకరంగా వేసిన పోస్టర్లను తక్షణమే తొలగించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రముఖ నిర్మాత ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో రూపొందిన రొమాంటిక్ థ్రిల్లర్ ‘డర్టీ హరి’. శ్రవణ్ రెడ్డి, రుహానీ శర్మ, సిమ్రత్ కౌర్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఫ్రైడే మూవీస్ యాప్ ద్వారా ఈనెల 18న ఈ సినిమాను విడుదల చేశారు. (చదవండి : డర్టీ హరి మూవీ రివ్యూ) -
డర్టీ హరి మూవీ రివ్యూ
టైటిల్ : డర్టీ హరి నటీనటులు : శ్రవణ్ రెడ్డి, రుహాణి శర్మ, సిమ్రత్ కౌర్, సురేఖ వాణి, అప్పాజీ, జబర్దస్త్ మహేష్ తదితరులు నిర్మాణ సంస్థ: ఎస్పీజే క్రియేషన్స్ నిర్మాత: గూడురు సతీష్ బాబు, గూడూరు సాయి పునీత్ స్క్రీన్‌ప్లై, దర్శకత్వం: ఎం.ఎస్. రాజు సంగీతం: మార్క్ కె రాబిన్ సినిమాటోగ్రఫీ: ఎంఎన్ బాల్ రెడ్డి ఎడిటర్ : జునైద్ సిద్ధిఖి విడుదల తేది : డిసెంబర్ 18, 2020 (ఫ్రైడే మూవీస్ ఏటీటీ ) కరోనా మహమ్మారి కారణంగా సినిమా థీయేటర్లన్నీ మూతబడటంతో కొత్త కొత్త మార్గాల్లో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అన్ని రకాల సినిమాలు ఓటీటీ వేదికగా ప్రేక్షకులను పలకరిస్తున్నాయి. ఈ క్రమంలోనే సీనియర్ నిర్మాత, దర్శకుడు ఎమ్.ఎస్ రాజు దర్శకత్వంలో వచ్చిన సినిమా డర్టీ హరి. ఈ చిత్రాన్ని ఫ్రైడే మూవీస్ ఏటీటీ (ఎనీ టైమ్ థియేటర్)లో డిసెంబర్ 18 సాయంత్రం 6 గంటలకు విడుదల చేసారు. వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి ప్రేమ కథా చిత్రాలను నిర్మించిన ఎం.ఎస్. రాజు తొలి సారి బోల్డ్ రొమాన్స్ డ్రామా సినిమాను తెరకెక్కించడం, ప్రచార చిత్రాలు కూడా వైరల్ కావడం సినిమాపై అంచనాలను పెంచాయి. మరి ఈ డర్టీ హరి అంచనాలను రీచ్ అయ్యాడో లేదో చూసేద్దాం. కథ మధ్యతరగతికి చెందిన హరి(శ్రవణ్ రెడ్డి) ఎన్నో కలలు కంటూ హైదరాబాద్‌కు వస్తాడు. అక్కడ వసుధ(రుహాని శర్మ) అనే ధనవంతుల అమ్మాయితో పరిచయడం ఏర్పడుతుంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్తుంది.ఇంతలో వసుధ సోదరుడి గర్ల్ ఫ్రెండ్ జాస్మిన్(సిమ్రాత్ కౌర్)కు హరి ఆకర్షితుడవుతాడు. వసుధతో ప్రేమలో ఉంటూనే జాస్మిన్‌తో ఎఫైర్ నడిపిస్తాడు. వసుధకి తెలియకుండా జాస్మిన్ వ్యవహారాన్ని హరి ఎలా దాచి పెట్టాడు? జాస్మిన్ ఎఫైర్ సీక్రెట్ గా దాస్తూ మేనేజ్ చేసే హరి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కున్నాడు? ఈ చిక్కు నుంచి బయట పడటానికి డర్టీ హరి ఏం చేసాడు? అనేది మిగతా కథ. విశ్లేషణ వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలతో సక్సెస్ ఫుల్ నిర్మాత గా మారిన ఎం ఎస్ రాజు.. దర్శకుడిగా కూడా అలాంటి ప్రేమ కథా సినిమాలే తీశాడు. వాన, తూనీగ తూనీగ సినిమాలు ప్లాప్ అయినప్పటికీ దర్శకుడిగా ఆయన ప్రతిభకి మంచి మార్కులు పడ్డాయి. అయితే ఈసారి ప్రేమ కథలను పక్కనబెట్టి అడల్ట్ కంటెంట్ ని నమ్ముకున్నాడు. డర్టీ హరి అనే టైటిల్ తో సినిమాలో డర్టీ ఎంతుంటుందో చెప్పకనే చెప్పేసాడు. ట్రైలర్లో కూడా అదే చూపించాడు. ఇలాంటి సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్‌కి నచ్చవని తెలిసినా కూడా ఎంఎస్ రాజు తొలిసారి పెద్ద సాహసమే చేశాడు. సినిమా స్టారింగ్లోనే బోల్డ్ సన్నివేశాలతో ప్రారంభించి రిచ్ లైఫ్ ని పరిచయం చెయ్యడం కోసం ప్రతి సీన్ లో ప్రతి ఒక్కరి చేతిలో మందు గ్లాస్, చేతిలో సిగరెట్స్, హీరోయిన్స్ తో స్కిన్ షోస్ తో బూతు డైలాగ్స్ తో సరిపెట్టాడు. యువతరం ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొనే ఈ సినిమాను తెరకెక్కించాడు. శృంగారాన్ని కూడా టైటిల్‌కు తగ్గట్టే చూపించాడు. ఫస్టాఫ్‌లో ఎక్కువగా శృంగార సన్నివేశాలను చూపించిన దర్శకుడు.. సెకండాఫ్‌లో మాత్రం అసలు కథను చూపించాడు. వేరే యువతితో ఎఫైర్ పెట్టుకోవడం వల్ల హీరో పడే కష్టాలు,తన ఇల్లీగల్ సంబంధాన్ని దాచలేక ఇద్దరి హీరోయిన్స్ మధ్యలో నలిగిపోయే హీరో ఇబ్బందులును, ఆ ఇబ్బందులను అధిగమించే క్రమంలో ఒక హత్య జరగడం, ఆ మర్డర్ కేసు నుండి హీరో ఎలా తప్పించుకున్నాడు లాంటి సన్నివేశాలను ఆసక్తికరంగా చూపించాడు. అయితే సినిమా మొత్తం వాస్తవానికి దూరంగా సినిమాటిక్‌గా సాగిపోతుంది. హీరో రావడంతో ధనవంతుల అమ్మాయితే ప్రేమలో పడిపోవడం, అలాగే వేరే యువతికి ఆకర్షితుడైపోవడం.. ఇవన్ని వాస్తవానికి చాలా దూరంగా ఉన్నట్లు కనిపిస్తాయి. ప్రేక్షకుడి ఊహకు తగ్గట్టుగానే సినిమా సాగుతోంది. ఇక సెకండాఫ్‌లో మాత్రం కొన్ని ట్విస్ట్ ఇచ్చి సినిమాను నిలబడేలా చేశాడు దర్శకుడు. సినిమాకు ప్రధాన బలం సెకండాఫ్ అనే చెప్పాలి. అలాగే హరి-జాస్మిన్ మధ్య వచ్చే సన్నివేశాలు ఆసక్తి కరంగా ఉంటాయి. హత్య కేసును కాస్త ఆసక్తికరంగా మలిస్తే బాగుండేది. నటీనటులు సినిమా మొత్తం మూడు కేరెక్టర్స్ చుట్టూనే తిరుగుతుంది. హరి పాత్రలో శ్రవణ్ రెడ్డి మెప్పిస్తాడు. ఆయన డైలాగ్ డెలివరీతో పాటు,యాక్టింగ్ చాల బాగుంది. హీరోయిన్స్ గా నటించిన రుహని శర్మ – సిమ్రత్ కౌర్ లు తమ పాత్రల్లో చెలరేగిపోయాయిరు. సిమ్రత్ కౌర్ అయితే బోల్డ్ రోల్ లో పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. కేవలం శృంగార సీన్స్‌లోనే కాకుండా తన నటనతో కూడా ప్రేక్షకులను కట్టిపడేశారు. సురేఖ వాణి, మహేష్ వంటి నటులు పాత్రల పరిధి మేర ఆకట్టుకున్నారు. మార్క్ కె రాబిన్ సంగీతం అంతగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. ఎంఎన్ బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. నిర్మాణ విలువలు కథానుసారం ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ కథ శ్రవణ్ రెడ్డి నటన యూత్‌ను మెప్పించే అంశాలు సెకండాఫ్ మైనస్ పాయింట్స్ థ్రిలింగ్ అంశాలు లేకపోవడం సన్నివేశాలు ప్రేక్షకుడి ఊహకు తగ్గట్టుగానే సాగుతుండటం ఫస్టాఫ్ సాగతీత