
సాక్షి, విజయవాడ : ‘డర్టీ హరి’ సినిమా వాల్ పోస్టర్‌పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాత, దర్శకుడు, అడ్వర్టయిజ్‌మెంట్ ఏజెన్సీలపై కేసు నమోదు చేయాలని డీజీపీ గౌతం సవాంగ్‌ను కోరారు. ఈ పోస్టర్లు మహిళలను అగౌరవపరిచేలా, యువతను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయన్నారు. గుంటూరు ఉండవల్లి సెంటర్‌లో, ఇతర పట్టణాలలో అసభ్యకరంగా వేసిన పోస్టర్లను తక్షణమే తొలగించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ప్రముఖ నిర్మాత ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో రూపొందిన రొమాంటిక్ థ్రిల్లర్ ‘డర్టీ హరి’. శ్రవణ్ రెడ్డి, రుహానీ శర్మ, సిమ్రత్ కౌర్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఫ్రైడే మూవీస్ యాప్ ద్వారా ఈనెల 18న ఈ సినిమాను విడుదల చేశారు.
(చదవండి : డర్టీ హరి మూవీ రివ్యూ)
Comments
Please login to add a commentAdd a comment