చంద్రబాబు చేతిలో షర్మిల రిమోట్ కంట్రోల్: వాసిరెడ్డి పద్మ | Vasireddy Padma Comments On Sharmila And Sunitha | Sakshi
Sakshi News home page

చంద్రబాబు చేతిలో షర్మిల రిమోట్ కంట్రోల్: వాసిరెడ్డి పద్మ

Published Wed, May 1 2024 6:09 PM | Last Updated on Wed, May 1 2024 6:56 PM

Vasireddy Padma Comments On Sharmila And Sunitha

సాక్షి, తాడేపల్లి: సీఎం జగన్ ఫ్యామిలీపై షర్మిల విషం కక్కుతున్నారని వైఎస్సార్‌సీపీ మహిళా నేత వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. బుధవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఒకరి చేతిలోని రిమోట్‌లాగా జగన్ వ్యవహరిస్తారా? ఆ సంగతి మీకు తెలీదా? అంటూ దుయ్యబట్టారు.

చంద్రబాబు జేబు బొమ్మలులాగా షర్మిల, సునీత మాట్లాడుతున్నారు. వ్యక్తిగతమైన ఎజెండాతో షర్మిల మాట్లాడుతున్నారు. అవినాష్‌రెడ్డికి సీటు ఇస్తే ఇంత విషం చిమ్మాలా?. వైఎస్సార్‌సీపీ ఓటు చీల్చటమే పనిగా షర్మిల పెట్టుకున్నారు. ఆమె టార్గెట్ వెనుక చంద్రబాబు ఉన్నారు. చంద్రబాబు చేతిలో రిమోట్ కంట్రోల్ షర్మిల’’ అంటూ వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు.

‘‘ఎన్నో కోట్లమంది ప్రజల గుండెల్లో జగన్ ఉన్నారు. జగన్‌కి చెల్లెళ్లు అనే హోదా తప్ప షర్మిల, సునీతలకు ఈ రాష్ట్రంలో ఏముంది?. వారు మాట్లాడేవన్నీ ఎల్లో మీడియా హైలెట్ చేస్తోంది. వారం తర్వాత ఎల్లోమీడియా మీ ముఖాలను టీవీలో చూపించదు. ఆ సంగతి గుర్తు పెట్టుకోండి. ఎన్నికల తర్వాత చంద్రబాబు, ఎల్లోమీడియా అసలు పట్టించుకోదు.షర్మిల, సునీత చూపుతున్న ఉన్మాదం వలన వారికే నష్టం’’ అని వాసిరెడ్డి పద్మ చెప్పారు.

వైఎస్సార్‌కుటుంబం ఎటుపోయినా పర్లేదు అన్నట్టుగా వారు వ్యవహరిస్తున్నారు. వివేకా పరువు నడిరోడ్డు మీద పెట్టారు. షర్మిలకి మెదడు పని చేస్తుందా?. కాంగ్రెస్ పార్టీ తప్పు లేదని ఇప్పుడు షర్మిల అనటం వెనుక కారణం ఏంటి?. వైఎస్సార్ పేరును ఎఫ్.ఐ.ఆర్.లో చేర్చారనే బాధతో లాయర్ సుధాకర్ రెడ్డి కేసు వేశారు. ఆ కేసులో వైఎస్సార్ పేరు ప్రస్తావన ఉందా?. అవినాష్‌కి సీటు ఇస్తే షర్మిలకు ఎందుకు అంత కోపం?. మీరు చెప్పినట్టు జగన్ వినలేదని చంద్రబాబు జేబులో బొమ్మలుగా మారుతారా?. జగన్ చెల్లెల్లు కాకపోతే అసలు షర్మిల, సునీతలను ఎవరు పట్టించుకుంటారు?’’ అని వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యానించారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement