
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: చంద్రబాబు కుట్రలో భాగంగానే షర్మిల కాంగ్రెస్‌లో చేరారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర విభజనకు కారణం చంద్రబాబేనంటూ దుయ్యబట్టారు. ఏపీలో కాంగ్రెస్ చచ్చిపోయిందని.. కాంగ్రెస్ శవాన్ని షర్మిల, రఘువీరారెడ్డి, కేవీపీ, గిడుగు రుద్రరాజు మోస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్‌లో ఉన్న వారంతా వైఎస్సార్‌సీపీలోకి వచ్చేశారు. చంద్రబాబు రాజకీయ కుట్రలో భాగంగా షర్మిల సీఎం జగన్‌పై విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు ఉచ్చులో ఉన్నంత వరకు షర్మిలను ప్రతిపక్షంగానే భావిస్తామని పెద్దిరెడ్డి అన్నారు.
‘‘చంద్రబాబు పచ్చి మోసకారి. రుణమాఫీ పేరుతో రైతులు డ్వాక్రా మహిళలను మోసం చేశారు. చంద్రబాబు హయాంలో డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేశారు. వైఎస్సార్ ఆసరా, చేయూత ద్వారా మహిళలను ఆదుకున్న ఘనత సీఎం జగన్‌దే. ఓటు హక్కు లేని వారికీ కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ఎందుకు అని వెంకయ్య నాయుడు, చంద్రబాబు అంటున్నారు. మీ పిల్లలను ఏ మీడియంలో చదివించారో చెప్పాలని మంత్రి ప్రశ్నించారు.
కుల, మత పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏకైక సీఎం జగన్. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. టీడీపీ నేతలకు ఓట్లు అడిగే నైతిక అర్హత లేదని మంత్రి పెద్దిరెడ్డి ధ్వజమెత్తారు.
ఇదీ చదవండి: జాగ్రత్త.. చంద్రముఖి మళ్లీ నిద్రలేస్తుంది: సీఎం జగన్
Comments
Please login to add a commentAdd a comment