Sri Sathya Sai District
-
శ్రీసత్యసాయి జిల్లా రేగాటిపల్లిలో కూటమి నేతల మధ్య రగడ
-
పుట్టపర్తిలో టీడీపీకి భారీ దెబ్బ
పుట్టపర్తి: శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో టీడీపీకి భారీ దెబ్బ తగిలింది. 2009 నుంచి ఆ పార్టీలో గట్టి పట్టున్న అమడగూరు మండల మాజీ జెడ్పీటీసీ సభ్యుడు పుట్టా పురుషోత్తమరెడ్డి, ఆయన సోదరుడు మల్లికార్జునరెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడిన రిటైర్డ్ డీఎస్పీ వేణుగోపాల్‌తో పాటు పలువురు వడ్డెర సామాజికవర్గ నాయకులు వైఎస్సార్సీపీలో చేరారు. సోమవారం వారు పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డితో కలిసి బత్తలపల్లి మండలం సంజీవపురం వద్ద ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర శిబిరంలో సీఎం జగన్మోహన్రెడ్డిని కలిసి పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. సీఎం జగన్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అమడగూరు మండలంలో పురుషోత్తమరెడ్డికి మంచి సంబంధాలున్నాయి. ఆయన చేరికతో టీడీపీ బలమైన ఓటు బ్యాంకును కోల్పోయినట్లయింది. రిటైర్డు డీఎస్పీ వేణుగోపాల్.. చంద్రబాబు మాటలు నమ్మి తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే టికెట్ వస్తుందనే నమ్మకంతో నియోజకవర్గం మొత్తం కలియదిరిగారు. తనను దారుణంగా మోసగించిన చంద్రబాబుకు ఈ ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామని వేణుగోపాల్ ప్రకటించారు. కొత్తచెరువు మండలం వడ్డెర కులానికి చెందిన పెద్దన్న, వెంకటస్వామి, జనసేన నాయకుడు తిరుపతేంద్ర తదితరులు కూడా సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. వైఎస్సార్సీపీలోకి హిందూపురం నేతలు హిందూపురం: హిందూపురం టీడీపీ కీలకనేతలు సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో లేపాక్షి మండల టీడీపీ నేత, మాజీ ఎంపీపీ వి.హనోక్, చంద్రదండు వైస్ ప్రెసిడెంట్ అన్సార్ అహమ్మద్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్షుడు నవీన్ నిశ్చల్ తదితరులు పాల్గొన్నారు. -
మేమంతా సిద్ధం@డే5: సీఎం జగన్‌కు అడుగడుగునా జన నీరాజనాలు
CM YS Jagan Memantha Siddam Bus Yatra 2024 Updates కదిరిలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు హాజరైన సీఎం జగన్ శ్రీసత్యసాయి జిల్లా. కదిరిలో జనమే జగన్– జగనే జనం 5.45 గంటలకు కదిరిలో ప్రవేశించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బస్సుయాత్ర కదిరిలో జన సునామీ.. మేమంతా సిద్దమంటూ బస్సుయాత్రలో ముఖ్యమంత్రితో పాటు కదిరిలో కదం తొక్కిన జనప్రభంజనం దారిపొడువునా ముఖ్యమంత్రి బస్సుతో పాటు కడలితరంగాల్లా కదిలిన జనం గజమాలతో ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్‌కు ఆత్మీయ స్వాగతం బస్సు మీద నుంచి ప్రజలకు అభివాదం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సెల్ఫోన్లో టార్చ్ వెలిగిస్తూ... సీఎం వైఎస్ జగన్ బస్సుయాత్రకు సంఘీభావం తెలియజేస్తున్న ప్రజలు 7.55 వరకు సుమారు రెండు గంటల పదినిమిషాలు పాటు కదిరిలో రోడ్‌షోలో జనంలో ముఖ్యమంత్రి జన సందోహంతో దద్దరిల్లిన కదిరి పట్టణం అంబేద్కర్ చౌరస్తాకు చేరుకున్న సీఎం జగన్ బస్సుయాత్ర కదిరిలో ప్రవేశించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మేమంతా సిద్ధం బస్సుయాత్ర సీఎం జగన్‌కు అడుగడుగునా జన నీరాజనాలు దారి పొడవునా సీఎం జగన్‌కు అపూర్వ స్వాగతం కాసేపట్లో కదిరిలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొననున్న సీఎం జగన్ శ్రీ సత్యసాయి జిల్లా. ముదిగుబ్బలో మండుటెండలోనూ సీఎం వైఎస్ జగన్‌కు జన నీరాజనం 2.50 నిమిషాలకు ముదిగుబ్బ చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బస్సుయాత్ర గజమాలతో ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన ముదిగుబ్బ ప్రజలు. కాలే ఎండను సైతం లెక్కచేయకుండా బారుల తీరిన అభిమాన జనం ముదిగుబ్బ మెయిన్ రోడ్డులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బస్సుతో పాటు జనప్రవాహం ముదిగుబ్బలో బస్సుపై నుంచి ప్రజలకు అభివాదం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 3.27 గంటల వరకు సుమారు 37 నిమిషాల పాటు ముదిగుబ్బలో జనంతోనే సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్రలో సీఎం జగన్‌ను కలిసిన వృద్ధురాలు కొనసాగుతున్న ఐదోరోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర దారిపొడవునా గజమాలలతో సీఎం జగన్‌కు అపూర్వ స్వాగతం బస్సు యాత్ర ద్వారా ప్రజలతో మమేకమవుతున్న సీఎం జగన్ బస్సు యాత్రలో సీఎం జగన్‌ను కలిసిన వృద్ధురాలు నేనున్నానంటూ వృద్ధురాలికి కొండంత భరోసా ఇచ్చిన సీఎం జగన్ With my star campaigners from Day-5 of the Memantha Siddham Yatra. #MemanthaSiddham #VoteForFan pic.twitter.com/KzFCN40OCe — YS Jagan Mohan Reddy (@ysjagan) April 1, 2024 బత్తలపల్లి చేరుకున్న సీఎం జగన్ బస్సుయాత్ర దారిపొడువునా సీఎంకు స్వాగతం పలికిన ప్రజలు సంక్షేమ రథసారథి జగన్‌కు అడుగడుగునా నీరాజనాలు సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన టీడీపీ కీలక నేతలు మేమంతా సిద్ధం బస్సుయాత్రలో సీఎం జగన్ సమక్షంలో టీడీపీ నుంచి వైస్సార్ కాంగ్రెసు పార్టీలోకి చేరిన కీలక నేతలు సంజీవపురం స్టే పాయింట్ వద్ద వైఎస్సార్సీపీలో చేరిన పుట్టపర్తి నియోజకవర్గ అమడగూరు మండల మాజీ జెడ్పీటీసీ(మాజీ ఎంపీపీ), పొట్ట పురుషోత్తం రెడ్డి, పొట్ట మల్లిఖార్జున రెడ్డి వైఎస్సార్సీపీలోకి టీడీపీ కీలక నేతలు సంజీవపురం స్టే పాయింట్ వద్ద సీఎం జగన్ సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన హిందూపురం నియోజకవర్గం లేపాక్షి మాజీ ఎంపీపీ వి హనోక్, టీడీపీ నేత, చంద్ర దండు రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ అన్షార్ అహ్మద్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దారిపొడవునా సీఎం జగన్‌కు అపూర్వ స్వాగతం బత్తపల్లి, రామాపురం, మలకవేముల మీదగా పట్నంకు సాగుతున్న యాత్ర పట్నం నడింపల్లి, కాళసముద్రం, ఎర్ర దొడ్డి మీదుగా కుటాగుళ్లకు చేరుకుని మధ్యాహ్న భోజన విరామం తీసుకుంటారు అనంతరం బయలుదేరి కదిరి చేరుకుంటారు. అక్కడ పీవీఆర్ ఫంక్షన్ హాల్ లో మైనారిటీ సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొంటారు మోటుకపల్లె మీదుగా జోగన్నపేట, ఎస్.ములకలపల్లె, మీదుగా చీకటిమనిపల్లెలో రాత్రి బసకు వెళతారు సత్యసాయి జిల్లాలో కొనసాగుతున్న యాత్ర శ్రీసత్యసాయి జిల్లా సంజీవపురం నుంచి బస్సు యాత్ర ప్రారంభం బత్తపల్లి, రామాపురం, మలకవేముల మీదగా పట్నంకు యాత్ర సీఎం జగన్‌కు అడుగడుగునా జన నీరాజనాలు పచ్చ కుట్రల ఖండన.. సంక్షేమ సారథికి నీరాజనాలు మళ్లీ వైఎస్సార్సీపీని గెలిపించేందుకు ఏపీ ప్రజలు సిద్ధం మేమంతా సిద్ధం యాత్రకు పడుతున్న బ్రహ్మరథమే అందుకు నిదర్శనం వలంటీర్ వ్యవస్థ పై చంద్రబాబు కుట్రలను ఖండిస్తున్న ఏపీ ప్రజలు సంక్షేమ రథసారథి జగన్ కు అడుగడుగునా నీరాజనాలు నేడు సత్యసాయి జిల్లాలో కొనసాగనున్న యాత్ర శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం సంజీవపురం నుంచి ఇవాళ్టి యాత్ర ప్రారంభం నేడు సంజీవపురం నుంచి సీఎం బస్సు యాత్ర.. కదిరిలో ఇఫ్తార్ విందుకు హాజరు కానున్న సీఎం వైఎస్ జగన్ ఆత్మీయ స్వాగతం పలికేందుకు సిద్ధమైన వైఎస్సార్సీపీ శ్రేణులు, ప్రజలు సార్వత్రిక ఎన్నికల్లో దూసుకుపోతున్న వైఎస్సార్సీపీ సిద్ధం సభలు.. మేమంతా సిద్ధం బస్సు యాత్రతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్న సీఎం జగన్ సభలు.. రోడ్‌షో.. కార్యక్రమం ఏదైనా ప్రజల నుంచి విశేష స్పందన సంక్షేమ పాలనకు జై.. సమరోత్సాహంతో కదం తొక్కుతున్న వైఎస్సార్సీపీ శ్రేణులు Memantha Siddham Yatra, Day -5. ఉదయం 9 గంటలకు సంజీవపురం దగ్గర నుంచి ప్రారంభమవుతుంది. సాయంత్రం 5 గంటలకు కదిరిలో ఇఫ్తార్ విందు#MemanthaSiddham#YSJaganAgain#VoteForFan pic.twitter.com/6fJsNSfG0G — YSR Congress Party (@YSRCParty) April 1, 2024 నేడు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇలా.. మేమంతా సిద్ధం 5వ రోజు సోమవారం (ఏప్రిల్1) షెడ్యూల్ యాత్రలో భాగంగా సీఎం జగన్ ‘ శ్రీసత్యసాయి జిల్లాలోని సంజీవపురం వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస ప్రాంతం నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరి బత్తలపల్లి, రామాపురం, కట్ట కిందపల్లి, రాళ్ళ అనంతపురం, ముదిగుబ్బ, ఎన్ఎస్పీ కొట్టాల, మలకవేముల మీదుగా పట్నం చేరుకుంటారు. పట్నం నడింపల్లి, కాళసముద్రం, ఎర్ర దొడ్డి మీదుగా కుటాగుళ్లకు చేరుకుని మధ్యాహ్న భోజన విరామం తీసుకుంటారు అనంతరం బయలుదేరి కదిరి చేరుకుంటారు. అక్కడ పీవీఆర్ ఫంక్షన్ హాల్ లో మైనారిటీ సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొంటారు మోటుకపల్లె మీదుగా జోగన్నపేట, ఎస్.ములకలపల్లె, మీదుగా చీకటిమనిపల్లెలో రాత్రి బసకు వెళతారు. సీఎం జగన్ రోడ్ షోకు ఊరూరా ఘన స్వాగతం 58 నెలలుగా తమకు కాపు కాసిన నాయకుడి కోసం జనం ఆరాటం కళ్లారా చూసేందుకు పరితపిస్తున్న ప్రజానీకం.. రోడ్ షోలో ఊరూరా ఘన స్వాగతం మండుటెండైనా.. అర్ధరాత్రయినా ఆత్మీయ నేత కోసం ఉప్పొంగుతున్న అభిమానం.. మూడు జిల్లాల్లో అతి పెద్ద ప్రజా సభలుగా ప్రొద్దుటూరు, నంద్యాల, ఎమ్మిగనూరు సభలు పేదలకు మరింత గొప్ప భవిష్యత్తు కోసం అసమాన్యుడు చేస్తున్న యుద్ధ కవాతు.. మాటకు కట్టుబడి.. నిబద్ధతతో నిలబడే నేతను గుండెల్లో దాచుకుంటున్న జనం ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర దేశ చరిత్రలో మహోజ్వలఘట్టంగా నిలుస్తుందంటున్న పరిశీలకులు చంద్రబాబు కూటమి వెన్నులో వణుకు పుట్టించేలా సాగుతున్న బస్సు యాత్ర మాటపై ఎన్నడూ నిలబడని బాబును ఛీకొడుతున్న జనం.. టీడీపీ సూపర్ సిక్స్ హామీలను ఏమాత్రం పట్టించుకోని వైనం చంద్రబాబు కుట్రలను చిత్తు చేసేందుకు తామంతా సిద్ధమంటూ లక్షల మంది సెల్‌ఫోన్ టార్చిలైట్లు వెలిగించి సభలలో సీఎం జగన్‌కు సంఘీభావం ఇదీ చదవండి: మాస్.. లీడర్! సీఎం జగన్ రోడ్ షోకు ఊరూరా ఘన స్వాగతం ‘మేమంతా సిద్ధం’ యాత్రకు అడుగడుగునా ఆదరణ కర్నూలు జిల్లాలో సీఎం జగన్ రోడ్‌షో సూపర్ హిట్ అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో జన ప్రభంజనం రోడ్డుపై ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున అభిమాన జనం పూల వర్షం.. గజమాలలు.. జై జగన్ నినాదాలు -
పోలీస్ స్టేషన్లో దస్తగిరి దాదాగిరి
తాడిమర్రి: శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలోని తాడిమర్రి పోలీసుస్టేషన్, తహసీల్దార్ కార్యాలయంలో శనివారం ఓ భూమి విషయంలో మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ముద్దాయి దస్తగిరి దౌర్జన్యానికి పాల్పడ్డాడు. తాడిమర్రి మండలం నిడిగల్లు గ్రామానికి చెందిన దేవరకొండ నాగమ్మకు చెందిన 3.84 ఎకరాల భూమిని ముదిగుబ్బ మండలం జొన్నలకొత్తపల్లికి చెందిన రామ్‌నాయక్ తన భార్య శివాబాయి పేరున రూ.29 లక్షలకు కొనుగోలు చేశాడు. ఇటీవల రామ్‌నాయక్ ఆ భూమి పక్కనున్న శివాయి సాగు భూమి రెండెకరాలు కూడా చదును చేస్తుండగా నాగమ్మ, కుమారులు అడ్డుకున్నారు. దాన్ని విక్రయించనందున ఆ భూమి జోలికి రావొద్దని, అలాగే తమకు ఇవ్వాల్సిన రూ.3 లక్షలు చెల్లించాలని అడిగారు. అయితే, రామ్‌నాయక్ శివాయి సాగు భూమి కూడా తనకే చెందుతుందనడంతో ఇరువురి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో.. దస్తగిరి శనివారం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి తహసీల్దార్ నజ్మాబానుతో మాట్లాడారు. నిడిగల్లు గ్రామంలో రామ్ నాయక్ కొనుగోలు చేసిన పొలంపై స్టేటస్కో ఉందని, ఆ పొలం వద్దకు వీఆర్ఓను గానీ.. ఎస్ఐ, పోలీసులనుగానీ పంపవద్దని బెదిరించాడు. అలాగే, పోలీసుస్టేషన్‌కు వెళ్లి నాగమ్మ, ఆమె కుమారులు, అల్లుడు కలిసి రామ్‌నాయక్‌ను కొట్టారని, వారిపై కేసు నమోదు చేయాలని ఎస్ఐ నాగస్వామిని డిమాండ్ చేశాడు. ఫిర్యాదు లేనప్పుడు కేసు ఎలా పెడతామని ఎస్ఐ ప్రశ్నించారు. ఇలా దస్తగిరి ఆగడాలు పెరిగిపోయాయని సామాన్య ప్రజలు వాపోతున్నారు. ఇదీ చదవండి: దస్తగిరి కొత్త డ్రామా.. అసలు వాస్తవం ఏంటంటే? -
దస్తగిరి కొత్త డ్రామా.. అసలు వాస్తవం ఏంటంటే?
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: పులివెందుల-కదిరి మార్గమధ్యంలో ఉన్న నామాల గుండు వద్ద శనివారం జరిగిన బైక్ ప్రమాదంలో శ్రీసత్యసాయి జిల్లా తలుపుల మండలం పులిగుండ్లపల్లికి చెందిన కూలి పని చేసుకునే దళిత చిన్న కదిరప్పకు తీవ్ర గాయాలయ్యాయి. అతను ప్రస్తుతం కదిరి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. అయితే రోడ్డు ప్రమాదంలో గాయపడిన చిన్నకదిరప్ప తన తండ్రి షేక్ హాజీవలీని చంపడానికి వచ్చాడంటూ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి కట్టుకథ అల్లాడు. దీన్ని ఎల్లో మీడియా అందిపుచ్చుకుంది. నిజానిజాలు తెలుసుకోకుండానే దస్తగిరి చెప్పిందే వేదం అన్నట్లుగా తెగ ప్రసారం చేసింది. వాస్తవమేంటో బాధితుడు చిన్న కదిరప్ప మాటల్లోనే.. ‘నాకు ఏడుగురు కూతుర్లు. పెద్దకూతురు నాగేశ్వరిని పులివెందులలోని బాకరాపేటకు చెందిన ప్రసాద్‌కు ఇచ్చి పెళ్లి చేశాను. శుక్రవారం (8వ తేదీన) కూతురింటికి పోయి శనివారం మళ్లీ కదిరికి బయలుదేరాను. బస్సు కోసం పులివెందులలో రోడ్డు పక్కన నిలబడుకోంటే..మాకు బంధువైన తలుపుల మండలం శిద్దుగూరిపల్లికి చెందిన మల్లికార్జున బైక్ మీద వెళ్తూ నన్ను చూసి ఆపి బండిలో ఎక్కించుకున్నాడు. చార్జీ డబ్బులు మిగిలిపాయ.. అనుకొని ఎక్కాను. బండి స్పీడ్‌గా పోతూ నామాలగుండు దగ్గరకు రాగానే బ్రిడ్జి దగ్గర పొరపాటున ఫుట్‌పాత్‌కు తగిలింది. నేను కిందపడిపోయినా. అదే సమయంలో ఎదురుగా ఒకాయన వస్తుంటే ఆయనకు కూడా పొరపాటున బండి తగిలి కన్ను దగ్గర చిన్న గాయమైంది. ఆయన ఎవరో కూడా మాకు తెలీదు. కావాలనే బండి తగిలించారంటూ ఆయన నన్ను కొట్టడానికి వచ్చాడు. అక్కడ పడిపోయిన నా సెల్‌ఫోన్ తీసుకుంటుంటే దాన్ని కూడా లాక్కున్నాడు. నాకు తల నుంచి రక్తం కారిపోతుంటే అక్కడున్న స్థానికులు చూసి ఆయన దగ్గర నుంచి నా సెల్ ఇప్పించారు. అక్కడున్న వారిలో ఎవరో 108కు ఫోన్ చేసి అంబులెన్స్‌ను పిలిపించి నన్ను తలుపుల ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి కదిరి ప్రభుత్వాసుపత్రికి తెచ్చారు’ అని చిన్న కదిరప్ప వివరించాడు. ‘మీరే ఆయన్ను చంపాలని ప్రయత్నించారంట..నిజమేనా?’ అని కదిరప్పను పాత్రికేయులు ఆసుపత్రిలో ప్రశ్నించగా.. ‘నాకు దెబ్బలు తగిలి ప్రాణం పోతుంటే వాడెవడో ఎందుకు అట్ల జెప్పినాడు?! దీంట్లో ఏందో రాజకీయం ఉంది. మేము కూలీనాలీ చేసుకునేటోళ్లం. మాకెందుకు నాయనా అట్లాంటివి’ అని అన్నాడు. బైక్ ప్రమాదంలో గాయపడిన కదిరప్ప ఫిర్యాదు మేరకు పులివెందుల సీఐ శంకర్‌రెడ్డి కేసు నమోదు చేసుకున్నారు. ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ చేపట్టారు. ఇదీ చదవండి: దస్తగిరిది ఎంత క్రిమినల్ మైండ్ అంటే.. -
శ్రీ సత్యసాయి జిల్లాలో చంద్రబాబుకి భారీ షాక్
-
‘సిద్ధం’ సముద్రం.. ‘రా కదలిరా’ పిల్ల కాలువ’: మంత్రి ఉషశ్రీ
సాక్షి, శ్రీసత్య సాయి జిల్లా: ‘రా కదలిరా సభ’ టీడీపీకి ఇదే ఆఖరి సభ అని.. టీడీపీ సభలకు జనం రావడం లేదంటూ ఎద్దేవా చేశారు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్. పరిగి మండలంలో టీడీపీ నుంచి 430 కుటుంబాలు మంత్రి ఉషశ్రీ చరణ్ సమక్షంలో వైఎస్సార్సీపీలోకి చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రెండు రోజుల ముందు వరకు వాలంటీర్లను కించపరిచిన చంద్రబాబు.. పెనుగొండ సభలో వాలంటీర్లను కొనసాగిస్తాం.. టీడీపీకి పని చేయడంటూ అడుక్కోవడం చంద్రబాబు దిగజారుడు రాజకీయానికి నిదర్శనమన్నారు. అనంతపురం వద్ద జరిగిన సిద్ధం సభలో పార్కింగ్ స్థలంలో సగం కూడా లేదు చంద్రబాబు రా కదలిరా సభ అంటూ మంత్రి చురకలు అంటించారు. సిద్ధం సభ సముద్రమైతే రా కదలిరా సభ పిల్ల కాలువగా ఆమె అభివర్ణించారు. చంద్రబాబు పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడని మంత్రి ఉషశ్రీ చరణ్ దుయ్యబట్టారు. -
మడకశిర టీడీపీ అభ్యర్థికి ఘెర పరాభవం
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: మడకశిర టీడీపీ అభ్యర్థి సునీల్ కుమార్‌కు ఘెర పరాభవం ఎదురైంది. సునీల్ కుమార్‌పై మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి వర్గీయులు చెప్పులతో దాడి చేశారు. మడకశిర పట్టణంలోని టీడీపీ నేత గుండుమల తిప్పేస్వామి ఇంటి వద్ద ఘటన జరిగింది. మడకశిర నియోజకవర్గంలో కొంత కాలంగా మాజీ ఎమ్మెల్యే ఈరన్న, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి మధ్య వర్గపోరు సాగుతోంది. మాజీ ఎమ్మెల్యే ఈరన్న కొడుకు సునీల్ కుమార్‌కు చంద్రబాబు టికెట్ ఖరారు చేయగా, మద్దతు కోరేందుకు టీడీపీ అభ్యర్థి సునీల్ కుమార్, మాజీ ఎమ్మెల్యే ఈరన్న.. తిప్పేస్వామి ఇంటికెళ్లారు. దీంతో ఇద్దరిపైనా చెప్పులతో దాడి చేసి తరిమేశారు. మడకశిర టీడీపీ గ్రూపు రాజకీయాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. అనంతపురం జిల్లా టీడీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత అనంతపురం జిల్లా టీడీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. శింగనమల టీడీపీ అభ్యర్థి గా బండారు శ్రావణి నియామకంపై అసంతృప్తి భగ్గుమంది. టూమెన్ కమిటీ సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి, ఆలం నరసానాయుడు ఆధ్వర్యంలో నిరసన జరిగింది. జిల్లా టీడీపీ కార్యాలయంపై అసమ్మతి నేతలు రాళ్లు రువ్వారు. టీడీపీ కార్యాలయంలో అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసం చేశారు. చంద్రబాబు, లోకేష్‌లకు వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు నినాదాలు చేశారు. ఇదీ చదవండి: ‘తుప్పు పట్టిన సైకిల్-పగిలిపోయిన గ్లాసుకు గోల్డ్ కవరింగ్’ -
అప్పటిదాకా షర్మిల మాకు ప్రతిపక్షమే!: మంత్రి పెద్దిరెడ్డి
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: చంద్రబాబు కుట్రలో భాగంగానే షర్మిల కాంగ్రెస్‌లో చేరారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర విభజనకు కారణం చంద్రబాబేనంటూ దుయ్యబట్టారు. ఏపీలో కాంగ్రెస్ చచ్చిపోయిందని.. కాంగ్రెస్ శవాన్ని షర్మిల, రఘువీరారెడ్డి, కేవీపీ, గిడుగు రుద్రరాజు మోస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌లో ఉన్న వారంతా వైఎస్సార్సీపీలోకి వచ్చేశారు. చంద్రబాబు రాజకీయ కుట్రలో భాగంగా షర్మిల సీఎం జగన్‌పై విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు ఉచ్చులో ఉన్నంత వరకు షర్మిలను ప్రతిపక్షంగానే భావిస్తామని పెద్దిరెడ్డి అన్నారు. ‘‘చంద్రబాబు పచ్చి మోసకారి. రుణమాఫీ పేరుతో రైతులు డ్వాక్రా మహిళలను మోసం చేశారు. చంద్రబాబు హయాంలో డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేశారు. వైఎస్సార్ ఆసరా, చేయూత ద్వారా మహిళలను ఆదుకున్న ఘనత సీఎం జగన్‌దే. ఓటు హక్కు లేని వారికీ కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ఎందుకు అని వెంకయ్య నాయుడు, చంద్రబాబు అంటున్నారు. మీ పిల్లలను ఏ మీడియంలో చదివించారో చెప్పాలని మంత్రి ప్రశ్నించారు. కుల, మత పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏకైక సీఎం జగన్. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. టీడీపీ నేతలకు ఓట్లు అడిగే నైతిక అర్హత లేదని మంత్రి పెద్దిరెడ్డి ధ్వజమెత్తారు. ఇదీ చదవండి: జాగ్రత్త.. చంద్రముఖి మళ్లీ నిద్రలేస్తుంది: సీఎం జగన్ -
లేపాక్షి అద్భుతం..మోదీ ప్రశంసలు
-
సత్యసాయి జిల్లా పాలసముద్రంలో ‘నాసిన్’ ప్రారంభించిన మోదీ (ఫొటోలు)
-
లేపాక్షి ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు
-
నాసిన్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ
Updates.. ముగిసిన ప్రధాని మోదీ పర్యటన.. నాసిన్ నుంచి బయలుదేరిన ప్రధాని మోదీ అంతకుముందు నాసిన్‌ను ప్రారంభించి ప్రసంగించిన ప్రధాని నాసిన్ ప్రారంభించిన అనంతరం ప్రధాని మోదీ ప్రసంగం చారిత్రక ప్రదేశంలో నాసిన్ ఏర్పాటు చేయడం సంతోషకరం నాసిన్‌ను ప్రారంభించడం ఆనందకరంగా ఉంది అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ట కోసం 11 రోజుల అనుష్టానం చేస్తున్నాను పుట్టపర్తి సత్యసాయిబాబ జన్మస్థలం లేపాక్షిలో వీరభద్ర మందిరం దర్శించుకోవడం ఆనందంగా ఉంది రామరాజ్య భావన నిజమైన భావన అని మహాత్మాగాంధీ చెప్పారు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ప్రజలకు సేవకులు గతంలో పన్నుల విధానం అర్థమయ్యేది కాదు జీఎస్టీ తీసుకువచ్చి పన్నులను సరళతరం చేశాం ప్రజల నుంచి వచ్చిన పన్నులు వారి సంక్షేమానికే వాడాలి ఇదే రామరాజ్య సందేశం నాసిన్‌ను ప్రారంభించిన ప్రధాని నాసిన్‌ను రిమోట్ నొక్కి ప్రారంభించిన ప్రధాని మోదీ ప్రధాని వెంట సీఎం జగన్, గవర్నర్ ఉన్నారు వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూట్ రావడం గర్వంగా ఉంది : సీఎం జగన్ ఏపీకి నాసిన్ లాంటి వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూట్ రావడం గర్వంగా ఉంది నాసిన్‌తో ఏపీకి ప్రపంచస్థాయి గుర్తింపు రానుంది ఏపీ పేరును నాసిన్ అంతర్జాతీయంగా నిలబెట్టనుంది నాసిన్ అకాడమీని ఏర్పాటు చేసిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు ► పాలసముద్రం చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ ►నాసిన్ హెలిప్యాడ్ వద్ద ప్రధాని నరేంద్ర మోదీకి ఘనస్వాగతం పలికిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, గవర్నర్ అబ్దుల్ నజీర్ ►మరికాసేపట్లో నాసిన్ అకాడమీ ప్రారంభించనున్న ప్రధాని మోదీ, సీఎం జగన్ ►కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో రూ. 720 కోట్ల వ్యయంతో నిర్మించిన నాసిన్ ►ఐఆర్ఎస్కు ఎంపికైన వారికి నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ అండ్ ఇన్ డైరెక్ట్ టాక్సిస్ నార్కోటిక్స్ ఇనిస్టిట్యూట్ ► ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేపాక్షి వీరభద్రస్వామి ఆలయ అధికారులు, పూజారులు.. ఆలయ స్థల పురాణాన్ని తోలు బోమ్మలాట ప్రదర్శన ద్వారా చూపించారు. ఈ ప్రదర్శనను ప్రధాని మోదీ ఆసక్తిగా తిలకించారు. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) #WATCH | Prime Minister Narendra Modi visited and offered prayers at the Veerbhadra Temple in Lepakshi, Andhra Pradesh. pic.twitter.com/ipvU6Mnibx — ANI (@ANI) January 16, 2024 ► లేపాక్షి వీరభద్రస్వామి ఆలయంలో ప్రధానమంత్రి ‘శ్రీ రామ.. జయ రామ’ అని చప్పట్లు కొడుతూ.. వేదపండితులతో కలిసి భగవంతునికి భజన చేశారు. #WATCH | Prime Minister Narendra Modi sings 'Shri Ram Jai Ram' bhajan at the Veerbhadra Temple in Lepakshi, Andhra Pradesh pic.twitter.com/6F0lyyQSXN — ANI (@ANI) January 16, 2024 ► ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లేపాక్షి వీరభద్రస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితుల వద్ద ప్రధాని మోదీ ఆశీర్వాదం తీసుకున్నారు. #WATCH | Prime Minister Narendra Modi visits and offers prayers at the Veerbhadra Temple in Lepakshi, Andhra Pradesh pic.twitter.com/PxHdxbQaYv — ANI (@ANI) January 16, 2024 (చూడండి : ఫోటో గ్యాలరీ .. ప్రధాని దర్శించుకున్న వీరభద్రస్వామి ఆలయం ఇదే) Watch | PM @narendramodi listens to verses from the Ranganatha Ramayan at the Veerbhadra Temple in Lepakshi, #AndhraPradesh 📹 ANI pic.twitter.com/jPsdq2eGr0 — Hindustan Times (@htTweets) January 16, 2024 ► ప్రధాని నరేంద్ర మోదీ లేపాక్షి వీరభద్రస్వామి ఆలయానికి చేరుకున్నారు. ►కడప విమానాశ్రయానికి చేరుకున్న సీఎం జగన్ ►కడప విమానాశ్రయం నుంచి హెలీకాప్టర్ లో సత్యసాయి జిల్లాకు పయనం ►పాల సముద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనలో పాల్గొననున్న సీఎం ►కడప విమానాశ్రయంలో సీఎంకు స్వాగతం పలికిన డిప్యూటి అంజాద్ బాషా, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తదితరులు ►కాసేపట్లో లేపాక్షి దుర్గా, పాపనాశేశ్వర, వీరభద్రస్వామి ఆలయాన్ని సందర్శించనున్న ప్రధాని మోదీ ►శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ ►కాసేపట్లో పెనుకొండ నియోజకవర్గంలో పాలసముద్రంలో ఏర్పాటు చేసిన జాతీయ కస్టమ్స్, పరోక్ష పన్నులు, మాదక ద్రవ్యాల అకాడమీ (నాసిన్)ను ప్రారంభించనున్న మోదీ ►ఈ కార్యక్రమానికి హాజరుకానున్న రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి విమానాశ్రయంలో మంగళవారం మధ్యాహ్నం 12.50 గంటలక చేరుకున్న ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. డిప్యూటీ సీఎం నారాయణస్వామి, హిందూపురం పార్లమెంట్ సభ్యులు గోరంట్ల మాధవ్ పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ ,డిఐజి అమ్మి రెడ్డి, పుట్టపర్తి మున్సిపల్ చైర్మన్ తుంగ ఓబులపతి, పుట్టపర్తి ఆర్డిఓ భాగ్యరేఖ, బిజెపి నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, పార్థసారథి, శ్రీసత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు ఆర్.జె. రత్నాకర్ ఎయిర్పోర్ట్ భద్రత అధికారి తదితరులు ప్రధానిని కలిసి పుష్పగుచ్చాలను అందించే ఘన స్వాగతం పలికారు. నాసిన్ పూర్తి వివరాలేంటీ? నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, పరోక్ష పన్నులు & మాదక ద్రవ్యాల అకాడమీ (NACIN) కు సూక్ష్మరూపమే నాసిన్. ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లాలోని పెనుకొండ నియోజకవర్గంలో దీనిని ఏర్పాటు చేశారు. దాదాపు రూ. 541 కోట్లతో రూపుదిద్దుకున్న ఈ కేంద్రానికి ఎన్నో విశిష్టతలున్నాయి. గోరంట్ల మండల పరిధిలోని పాలసముద్రం సమీపంలో 44వ జాతీయ రహదారికి అనుకుని 503 ఎకరాల విస్తీర్ణంలో ఈ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. IASలకు ముస్సోరిలో, IPSలకు హైదరాబాద్‌లో శిక్షణ ఇస్తున్నట్టే.. ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్(IRS)కు ఎంపికైన వారికి పెనుకొండలోని నాసిన్‌లో శిక్షణ ఇస్తారు. నాసిన్‌ను సులభంగా చేరుకునేందుకు భవిష్యత్తులో రైల్వే లైన్ నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. నాసిన్‌లో పని చేసే సిబ్బంది పిల్లల విద్య కోసం నాసిన్ సమీపంలోనే కేంద్రీయ విద్యాలయం మంజూరు చేశారు. ఈ శిక్షణా సంస్థలో సమర్థవంతమైన పన్ను పరిపాలన కోసం అవసరమైన నైపుణ్యాన్ని బోధిస్తారు. ఈ రంగంలో అత్యుత్తమ అధికారులను ఎంపిక చేసి వారితో బోధన చేయిస్తాయి. సమగ్ర శిక్షణా పాఠ్యాంశాలు, అనుకూలమైన వాతావరణం మరియు పూర్తి మౌలిక సదుపాయాలున్న క్యాంపస్ ద్వారా అత్యున్నత ఆదాయపు పన్ను శాఖ అధికారులు దేశం కోసం సిద్ధమవుతారు. -
శ్రీసత్యసాయి జిల్లాలో ప్రధాని మోదీ, సీఎం జగన్ పర్యటన
-
16న శ్రీ సత్యసాయి జిల్లాలో ప్రధాని పర్యటన
సాక్షి, అమరావతి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 16వ తేదీన శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రంలో పర్యటించనున్నారు. ఆరోజు మధ్యాహ్నం ప్రధాని పాలసముద్రంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్‌ను సందర్శిస్తారు. అనంతరం జరిగే సభలో పాల్గొంటారు. ప్రధాని పర్యటనకు ప్రభుత్వం పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి శనివారం అధికారులతో సమీక్షించారు. ప్రధాన మంత్రి పర్యటనలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా పాల్గొనే అవకాశం ఉందని తెలిపారు. ప్రధాని పర్యటనకు పటిష్ట భద్రత చర్యలు చేపట్టాలని డీజీపీకి చెప్పారు. భద్రత, రవాణా, వసతి, వైద్యసేవలు వంటివి పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేలా చూడాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి జిల్లా యంత్రాంగం తరఫున పాస్‌లు జారీ చేయాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆదేశించారు. ఈ సమావేశంలో వర్చువల్‌గా పాల్గొన్న డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ ప్రధాని పర్యటనకు విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. తొలుత జీఏడీ ముఖ్య కార్యదర్శి ఆర్.ముత్యాలరాజు శాఖల వారీగా చేయాల్సిన ఏర్పాట్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సమావేశంలో ఎస్ఐబీ ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్, ఐ అండ్ పీఆర్ జేడీ పి.కిరణ్‌కుమార్ పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్‌బాబు, ఎస్పీ మాధవరెడ్డి, ప్రొటోకాల్ డైరెక్టర్ బాలసుబ్రహ్మణ్యంరెడ్డి, డీఎంఈ డాక్టర్ నరసింహం, ఐ అండ్ పీఆర్ జేడీ కస్తూరి, ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ డి.మురళి వర్చువల్‌గా హాజరయ్యారు. ప్రధాని పర్యటన ఇలా 16న మధ్యాహ్నం ప్రధాని మోదీ పాలసముద్రంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్‌లోని యాంటీక్యూస్ స్మగ్లింగ్ స్టడీ సెంటర్‌ను, నార్కోటిక్స్ స్టడీ సెంటర్‌ను సందర్శిస్తారు. తర్వాత వైల్డ్ లైఫ్ క్రైమ్ డిటెక్షన్ కేంద్రాన్ని సందర్శిస్తారు. అనంతరం గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఎక్స్– రే, బ్యాగేజ్ స్క్రీనింగ్ కేంద్రాన్ని సందర్శిస్తారు. తదుపరి అకాడమీ బ్లాకు వద్ద రుద్రాక్ష మొక్కలు నాటి, అక్కడ భవన నిర్మాణ కార్మికులతో మాట్లాడతారు. వారితో గ్రూప్ ఫొటో దిగుతారు. అనంతరం 74, 75వ బ్యాచ్‌ల ఆఫీసర్ ట్రైనీలతో ముఖాముఖిలో పాల్గొంటారు. తదుపరి పబ్లిక్ ఫంక్షన్లో ‘ఫ్లోరా ఆఫ్ పాలసముద్రం’ పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం అకాడమీ కేంద్రానికి అక్రెడిటేషన్ సర్టిఫికెట్‌ను అందిస్తారు. ఆ తర్వాత జరిగే సభలో ప్రసంగించిన అనంతరం ఢిల్లీకి బయలుదేరి వెళతారు. -
మడకశిరలో బడుగుల భారీ కవాతు
సాక్షి, పుట్టపర్తి: మడకశిర జన సాగరమైంది. బడుగులు భారీ కవాతు చేయగా.. తమకు మేలు చేసిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపేందుకు జన సునామీ తరలివచ్చింది. గుండెల నిండా అభిమానం నింపుకుని ‘జై జగన్’ నినాదాలతో హోరెత్తించింది. నాలుగున్నరేళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు జరిగిన మేలును వివరించేందుకు వైఎస్సార్సీపీ తలపెట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర గురువారం శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో కొనసాగింది. వైఎస్సార్సీపీ రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచన మేరకు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ అధ్యక్షతన స్థానిక వైఎస్సార్ సర్కిల్లో నిర్వహించిన సామాజిక సాధికార బస్సుయాత్రలో జనం పోటెత్తారు. అంతకుముందు సరస్వతి విద్యామందిరం ఉన్నత పాఠశాల నుంచి నిర్వహించిన ర్యాలీలోనూ అభిమానులు, కార్యకర్తలు సందడి చేశారు. సభలోనూ బడుగు, బలహీన వర్గాల సామాజిక సాధికారత వెల్లివిరిసింది. సామాజిక సాధికార బస్సు యాత్రలో వేలాదిగా పాల్గొని వైఎస్ జగన్ అండతో తాము ఎంత ఉన్నతంగా బతుకుతున్నదీ వెల్లడించారు. చంద్రబాబు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను ఓటు బ్యాంకుగా వాడుకుని వదిలేయగా.. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్నివిధాలా పెద్దపీట వేసి రాజ్యాధికారం కల్పించిన వైనాన్ని పలువురు నేతలు వెల్లడించగా.. సభికుల నుంచి పెద్దఎత్తున హర్షధ్వానాలు వ్యక్తమయ్యాయి. బడుగులకు సాధికారత కల్పించిన వైఎస్ జగన్మోహన్రెడ్డికి మరోమారు అధికారం కట్టబెడదామని మంత్రులు, నేతలు పిలుపునివ్వడంతో ప్రజలు ఈలలు, కేకలతో మద్దతు ప్రకటించారు. జగన్‌తోనే సామాజిక సాధికారత: మంత్రి జయరామ్ సీఎం జగన్‌తోనే సామాజిక సాధికారత సాధ్యం అవుతోందని జిల్లా ఇన్చార్జి మంత్రి గుమ్మనూరు జయరామ్ అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై జగన్ అపారమైన ప్రేమ చూపుతున్నారన్నారు. నాలుగున్నరేళ్లలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు వివిధ సంక్షేమ పథకాల ద్వారా సుమారు రూ.2.50 లక్షల కోట్లు నేరుగా బ్యాంకు ఖాతాలకు జమ చేసినట్టు వివరించారు. సంక్షేమ పాలన నిరంతరం అందాలంటే 30 ఏళ్లపాటు జగనన్నను సీఎంగా కొనసాగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జగన్ వచ్చాకే దళితులకు గౌరవం: ఎంపీ నందిగం జగన్ సీఎం అయ్యాక మంత్రివర్గంలో ఐదుగురికి చోటు కల్పించారని ఎంపీ నందిగం సురేష్ అన్నారు. అందులో ఒకరికి డిప్యూటీ సీఎంతో పాటు మరో మహిళకు హోంశాఖను కట్టబెట్టి గౌరవించారన్నారు. వైఎస్ కుటుంబం మేలు మరువలేం: ఎమ్మెల్యే తిప్పేస్వామి మడకశిర నియోజకవర్గానికి వైఎస్ కుటుంబం చేసిన మేలు మరువలేనిదని ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి అన్నారు. జగన్ సీఎం కాగానే.. ఏటా మడకశిరకు కృష్ణా జలాలు అందిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. నేరుగా మడకశిరకు కృష్ణా జలాలు తీసుకురావడానికి బైపాస్ కెనాల్ ఏర్పాటుకు రూ.214 కోట్లు మంజూరు చేశారని పేర్కొన్నారు. ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ మంగమ్మ, ఎమ్మెల్యే శంకరనారాయణ, జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, వివధ కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
సామాజిక జైత్ర యాత్ర.. హోరెత్తిన మడకశిర
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: మడకశిర నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి ఆధ్వర్యంలో సామాజిక సాధికార బస్సు యాత్ర జరిగింది. మడకశిర పట్టణంలోని సరస్వతి విద్యామందిరం నుంచి వైఎస్సార్ సర్కిల్ దాకా బస్సు యాత్ర సాగింది. అనంతం వైఎస్సార్ సర్కిల్ లో బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి గుమ్మనూరు జయరాం, ఎమ్మెల్యేలు డాక్టర్ తిప్పేస్వామి, శంకర్ నారాయణ, ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ మంగమ్మ, జెడ్పీ చైర్మన్ బోయగిరిజమ్మ, హిందూపురం వైఎస్సార్ సీపీ సమన్వయకర్త కురుబ దీపిక పాల్గొన్నారు. చంద్రబాబుకు విశ్వసనీయత లేదు. చంద్రబాబు ఇచ్చే హామీలను నమ్మొద్దు. మోసం చేయడం ఆయన అలవాటు. కులాలు పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత సీఎం జగన్‌దే. 2024 ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి 175 సీట్లు ఖాయం -మంత్రి గుమ్మనూరు జయరాం చంద్రబాబు-పవన్ కళ్యాణ్ పొత్తు ఎలాంటి ప్రభావం చూపదు. తెలంగాణ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కంటే బర్రెలక్కకే ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన దొంగ చంద్రబాబు. కేసుల భయంతో ఏపీ ప్రయోజనాలు తాకట్టు పెట్టిన దుర్మార్గుడు చంద్రబాబు. సీఎం జగన్ పేదల పక్షపాతి -హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ -
నేటి సామాజిక సాధికార బస్సుయాత్ర షెడ్యూల్..
శ్రీసత్యసాయి జిల్లా: వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సుయాత్ర జిల్లాలోని మడకశిర నియోజకవర్గంలో కొనసాగనుంది. ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి ఆధ్వర్యంలో బస్సుయాత్ర జరుగనుంది. మధ్యాహ్నం 12.30 గంటలకు మంత్రులు, ఎమ్మెల్యేల మీడియా సమావేశం ఉండనుంది. మడకశిర పట్టణం లోని సరస్వతి విద్యామందిరం నుంచి వైఎస్సార్ సర్కిల్ వరకూ బస్సుయాత్ర సాగనుంది. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు మడకశిర వైఎస్సార్ సర్కిల్లో బహిరంగ సభ నిర్వహించనున్నారు. -
బాలయ్యా.. పిచ్చివేషాలు మానుకో..
హిందూపురం టౌన్: ‘బాలయ్యా.. పిచ్చి వేషాలు మానుకో... మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించడం, నీచంగా మాట్లాడడం వంటి పిచ్చివేషాలు వేస్తే మహిళలే నిన్ను తరిమికొట్టడం ఖాయం..’అని హిందూపురం ఎమ్మెల్యే, సినీహీరో నందమూరి బాలకృష్ణను వైఎస్సార్సీపీ హిందూపురం నియోజకవర్గ సమన్వయకర్త టీఎన్ దీపిక హెచ్చరించారు. మహిళలు, తోటి నటీమణుల పట్ల బాలకృష్ణ అసభ్యకరంగా వ్యవహరించడం, అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ మంగళవారం హిందూపురంలో మహిళలు ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహం నుంచి అంబేడ్కర్ సర్కిల్ వరకు సాగిన ర్యాలీలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని బాలకృష్ణ డౌన్ డౌన్.. బాలకృష్ణ గో బ్యాక్.. సైకో బాలకృష్ణ... అని నినాదాలు చేశారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బాలకృష్ణ పోస్టరును చెప్పులతో కొడుతూ దహనం చేశారు. ఈ సందర్భంగా దీపిక మాట్లాడుతూ హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అని చెప్పుకోవడానికి కూడా ఇక్కడి మహిళలు సిగ్గుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. బాలకృష్ణ సంస్కారం లేకుండా తోటి సినీనటి విచిత్రతో ఎలా అసభ్యంగా ప్రవర్తించారో ఆమె నోటితోనే విన్నామని చెప్పారు. ఓ సినీ ఫంక్షన్లోనూ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని గుర్తుచేశారు. ఇలాంటి సైకో ఆలోచనలు ఉన్న వ్యక్తి ఎమ్మెల్యేగా అనర్హుడన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ ఇంద్రజ మాట్లాడుతూ హిందూపురం సమస్యలపై ఏ రోజూ అసెంబ్లీలో మాట్లాడని బాలకృష్ణ.. మహిళలపై మాత్రం నీచంగా మాట్లాడడం, అసభ్యంగా ప్రవర్తించడం రివాజుగా మార్చుకున్నాడని విమర్శించారు. మహిళలకు బాలకృష్ణ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చదవండి: ఇదేమి పని ‘నారాయణా’ -
బుక్కపట్నం సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస్ నాయక్ ఆత్మహత్య
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన శ్రీసత్యసాయి జిల్లా బుక్కపట్నం సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస్ నాయక్ (42).. ఏసీబీ అధికారుల నుంచి తప్పించుకుని పారిపోయి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఏసీబీ వలలో చిక్కినందుకు అవమాన భారంతో కుంగిపోయిన నాయక్ చెన్నై చేరుకుని.. అక్కడి లాడ్జిలో ఉరి వేసుకుని మృతి చెందారు. శ్రీసత్యసాయి జిల్లా గోనిపెంట తండాకు చెందిన శ్రీనివాస్ నాయక్ ఈ నెల 22న సురేందర్‌రెడ్డి అనే రైతు నుంచి రూ.10 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు మిగిలిన తతంగం పూర్తి చేస్తుండగా.. అదే రోజు రాత్రి గోడ చాటుకు వెళ్లిన శ్రీనివాస్ నాయక్ పారిపోయి చెన్నైలోని మాధవాపురంలో ఓ లాడ్జిలో దిగారు. అదే గదిలో ఉరి వేసుకోగా.. శనివారం లాడ్జి నిర్వాహకులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు సమాచారం. చదవండి: బర్త్‌డేకు దుబాయ్ తీసుకెళ్లలేదని భర్తను గుద్ది చంపేసింది -
క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్య అవసరం: ద్రౌపది ముర్ము
Updates.. ►సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ స్నాతకోత్సవం సందర్భంగా ద్రౌపది ముర్ము మాట్లాడుతూ.. క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్య అవసరం, ప్రతి ఒక్కరూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. ఆధ్యాత్మిక చింతనతో సమాజసేవ చేయాలి. సత్యసాయి బాబా సామాజిక సేవా కార్యక్రమాలు అభినందనీయం. విద్య, వైద్యం, తాగునీరు, ఆధ్యాత్మికత విస్తరణకు బాబా బాగా కృషి చేశారు అని అన్నారు. ►సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ►పాల్గొన్న రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్. ►పుట్టపర్తి సత్యసాయి బాబా మహాసమాధిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, గవర్నర్ అబ్దుల్ నజీర్ ►బాబా మహాసమాధికి నివాళులు అర్పించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, గవర్నర్ అబ్దుల్ నజీర్ ►సత్యసాయి బాబా జయంతి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్రపతి, గవర్నర్. ►పుట్టపర్తి చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ►రాష్ట్రపతికి స్వాగతం పలికిన గవర్నర్ అబ్దుల్ నజీర్ ►సత్యసాయి బాబా జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు పుట్టపర్తి వచ్చిన రాష్ట్రపతి, గవర్నర్ ►సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ►రాష్ట్రపతికి స్వాగతం పలికిన మంత్రి ఉషాశ్రీచరణ్, ఎమ్మెల్యేలు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, డాక్టర్ తిప్పేస్వామి, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ ఇక్బాల్ ►భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తికి రానున్నారు. దీనికి సంబంధించిన వివరాలను కలెక్టర్ అరుణ్‌బాబు మంగళవారం వెల్లడించారు. రాష్ట్రపతి మధ్యాహ్నం 1.05 గంటలకు ఒడిశాలో బయలుదేరి 2.35 గంటలకు పుట్టపర్తి సత్యసాయి విమానాశ్రయానికి, అక్కడి నుంచి రోడ్డు మార్గాన 2.45 గంటలకు ప్రశాంతి నిలయం చేరుకుంటారు. ►మధ్యాహ్నం 3.05 గంటలకు సాయికుల్వంత్ మందిరంలోని సత్యసాయి మహాసమాధిని దర్శించుకుంటారు. అనంతరం సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ 42వ స్నాతకోత్సవంలో పాల్గొంటారు. 3.35 గంటలకు స్నాతకోత్సవంలో భాగంగా 21 మంది విద్యార్థులకు బంగారు పతకాలు అందజేస్తారు. అనంతరం ప్రసంగిస్తారు. 4.20 గంటలకు రోడ్డు మార్గాన సత్యసాయి విమానాశ్రయం చేరుకుని, అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరి వెళతారు. -
పుట్టపర్తిలో నేడు రాష్ట్రపతి పర్యటన
పుట్టపర్తి అర్బన్: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తికి రానున్నారు. దీనికి సంబంధించిన వివరాలను కలెక్టర్ అరుణ్‌బాబు మంగళవారం వెల్లడించారు. రాష్ట్రపతి మధ్యాహ్నం 2.05 గంటలకు ఒడిశాలో బయలుదేరి 2.35 గంటలకు పుట్టపర్తి సత్యసాయి విమానాశ్రయానికి, అక్కడి నుంచి రోడ్డు మార్గాన 2.45 గంటలకు ప్రశాంతి నిలయం చేరుకుంటారు. మధ్యాహ్నం 3.05 గంటలకు సాయికుల్వంత్ మందిరంలోని సత్యసాయి మహాసమాధిని దర్శించుకుంటారు. అనంతరం సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ 42వ స్నాతకోత్సవంలో పాల్గొంటారు. 3.35 గంటలకు స్నాతకోత్సవంలో భాగంగా 21 మంది విద్యార్థులకు బంగారు పతకాలు అందజేస్తారు. అనంతరం ప్రసంగిస్తారు. 4.20 గంటలకు రోడ్డు మార్గాన సత్యసాయి విమానాశ్రయం చేరుకుని, అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరి వెళతారు. -
పుట్టపర్తి: వైఎస్సార్ రైతు భరోసా సీఎం జగన్ బహిరంగ సభ (ఫొటోలు)
-
సీఎం జగన్ సభ.. కదిలొచ్చిన జనసంద్రం
అది సీఎం జగన్ పుట్టపర్తికి వచ్చిన సందర్భం. రైతు భరోసా నిధులను విడుదల చేయడానికి సీఎం జగన్ పుట్టపర్తికి బయల్దేరివెళ్లిన వేళ. అయితే ఆ సభకు జనసంద్రం పోటెత్తింది. సీఎం జగన్ పుటపర్తికి వస్తున్నానరి తెలిసి అక్కడకు అశేష జనసందోహం తరలివచ్చింది. సీఎం జగన్ అక్కడకు వచ్చే సరికే సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఇసుకేసినా రాలనంతగా ‘జనసంద్రం’ పోటెత్తింది. సీఎం జగన్‌కు సంఘీభావం తెలపడానికి ప్రజలు ఇలా భారీగా తరలివచ్చారు. దీనికి సంబంధించిన డ్రోన్ విజువల్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఇవి కూడా చదవండి: చంద్రబాబు, ఎల్లో మీడియాకు సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్ ప్రతీ విషయంలో అన్నదాతకు అండగా నిలబడ్డాం: సీఎం జగన్ -
మీకు మంచి జరిగి ఉంటే మీరే సైనికులుగా నిలబడండి: సీఎం జగన్
Updates 12:40PM, Nov 7, 2023 ►రైతు భరోసా నిధులను బటన్ నొక్కి విడుదల చేసిన సీఎం జగన్ 11:50AM, Nov 7, 2023 వైఎస్సార్ రైతు భరోసా కార్యక్రమంలో సీఎం జగన్ ప్రసంగంఅ ►అక్క చెల్లెమ్మల మంచి కోసం అమ్మ ఒడి, ఆసరా, చేయూత, సున్నావడ్డీ పథకాలు అందిస్తున్నాం ►అబద్ధాలు, మోసాలు చేసేందుకు పెద్దపెద్ద మాటలు చెబుతారు ►మోసాలు, అబద్ధాలను నమ్మకండి ►ఈ నాలుగేళ్లలో మీ ఇంట్లో మంచి జరిగింది.. లేదా మీరే చూడాలి ►గెలిచేందుకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-5 సపోర్టు అవసరం లేదు ►మీ బిడ్డకు ఎల్లో మీడియా అండదండలు లేవు ►మీ బిడ్డ నమ్ముకుంది మిమ్మల్నే ►మీకు మంచి జరిగి ఉంటే మీరే సైనికులుగా నిలబడండి ►ఒక్క రైతు భరోసా ద్వారానే రూ. 33వేల 210 కోట్లు అందించాం ►రైతులకు అండగా నిలిచేందుకుందుకు రూ. 1లక్ష 73 వేల కోట్లు ఖర్చు చేశాం ►చంద్రబాబుకు అధికారం తాను తన గజదొంగల ముఠా కోసమే ►పేదలు, అవ్వాతాతలు, నిరుద్యోగుల కోసం చంద్రబాబు ఆలోచన చేయడం లేదు ►చంద్రబాబుకు దోచుకోవడం, దాచుకోవడం తెలుసు ►చంద్రబాబు పేరు చెబితే స్కామ్‌లే గుర్తుకొస్తాయి ►రాష్ట్రాన్ని దోచుకునేందుకు చంద్రబాబుకు అధికారం కావాలి ►బాబు హయాంలో ఫైబర్ గ్రిడ్, ఇన్నర్‌రింగ్ రోడ్డు, స్కిల్ డెవలప్మెంట్ ఇలా అన్నీ చంద్రబాబు హయాంలో స్కామ్‌లే ►మన ప్రభుత్వంలో ఇప్పటికే రూ. 2 లక్షల 42 వేల కోట్లు అక్క చెల్లెమ్మలకు అందించాం ►చంద్రబాబు హయాంలో ఈ డబ్బంతా ఎవరి జేజుల్లోకి వెళ్లింది ►చంద్రబాబు హయాంలో మన పిల్లల చదువులు, బడులు ఎందుకు మారలేదు ►ఇంటి వద్దకే వైద్య సేవలు అందేలా ఫ్యామిలీ డాక్టర్, విలేజ్ క్లినిక్ కార్యక్రమాలు తీసుకొచ్చాం ►ఆరోగ్యశ్రీని పరిధిని 3,300 ప్రొసీజర్లకు పెంచాం ►ఏ పేదవాడు వైద్యానికి అప్పులు చేయకూడదన్నదే మా లక్ష్యం ►ఆపదలో ఉన్న అక్క చెల్లెమ్మల కోసం దిశయాప్ తీసుకొచ్చాం ►గ్రామ సచివాలయాల్లో మహిళా పోలీసులను ఏర్పాటు చేశాం ►అక్క చెల్లెమ్మల మంచి కోసం అమ్మ ఒడి, ఆసరా, చేయూత, సున్నావడ్డీ పథకాలు అందిస్తున్నాం ►ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలున్న గిరిజన రైతున్నలకు రైతు భరోసా అందించాం ►పంట సీజన్లో నష్టం జరిగితే అదే సీజన్లో ఇన్పుట్ సబ్సిడీ అందిస్తున్నాం ►గడిచిన నాలుగేళ్లలో రూ. 60 వేల కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేశాం ►సున్నా వడ్డీకి నిజమైన అర్థం చెబుతూ రైతన్నకి భరోసా కల్పిస్తున్నాం ►గతంలో సున్నా వడ్డీ పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం జరిగింది ►చంద్రబాబు హయాంలో హెరిటేజ్ కంపెనీకి లాభాలు పెరిగాయి ►రైతులకు మంచి చేయాలన్న ఆలోచన చంద్రబాబుకు ఎందుకు రాలేదు..? ►మీ బిడ్డ ప్రభుత్వంలో పుష్కలంగా వర్షాలు పడ్డాయి ►గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా..? ►బాబు ప్రభుత్వంలో వ్యవసాయానికి 7 గంటల కరెంట్ కూడా ఇవ్వలేకపోయారు ►మనసున్న ప్రభుత్వానికి మనసులేని ప్రభుత్వానికి తేడా గమనించండి ►ఈ-క్రాప్ ద్వారా ప్రతి రైతుకు మంచి జరిగేలా చేస్తున్నాం ►ప్రతి గ్రామం్లో నేడు ఆర్బీకే కేంద్రాలు పని చేస్తున్నాయి ►ఏటా రూ. 13, 500 రైతు భరోసా సాయం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం ►రూ. 1700 కోట్లతో ఫీడర్ల సామర్థ్యం కూడా మన ప్రభుత్వంలోనే పెంచాం ►ఈ నాలుగేళ్లలో రూ, 7,800 కోట్ల బీమా అందించాం ►చంద్రబాబు హయాంలో వరుసగా ఐదేళ్లు కరువే ►దేవుడి దయతో గత నాలుగేళ్లుగా కరువు మాటేలేదు ►14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు రైతులకు చేసిందేమీ లేదు ►గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి తేడా చూడాలి ►ఎందుకు మీ బిడ్డ జగన్‌లా గత ప్రభుత్వం సంక్షేమం అందించలేకపోయింది? ►కేంద్రం పీఎం కిసాన్‌డబ్బులు కూడా ఈనెలలోనే వస్తాయి ►పీఎం కిసాన్ నిధులు కూడా విడుదల చేయాలని కేంద్రాన్ని కోరాను ►ప్రతి విషయంలో అన్నదాతలకు అండగా నిలబడ్డాం ►దేవుడి దయతో మంచి కార్యక్రమం జరుగుతుంది ►53 లక్షల 53 మంది రైతులకు పెట్టబడి సాయం ►రైతులకు రూ. 2,200 కోట్ల ఆర్థిక సాయం ►రైతులు ఇబ్బందులు పడకూడదనే రాష్ట్ర ప్రభుత్వం ముందుగా నిధులు ఇస్తోంది ►సామాజిక సాధికారిత బస్సుయాత్రకు విశేష స్పందన లభిస్తోంది. 11:24AM, Nov 7, 2023 ►వైఎస్సార్ రైతు భరోసా కార్యక్రమం పాల్గొన్న మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గుమ్మనూరు జయరాం, ఉషాశ్రీచరణ్, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, శంకర్ నారాయణ, అనంతవెంకటరామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, జొన్నలగడ్డ పద్మావతి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, డాక్టర్ సిద్ధారెడ్డి, డాక్టర్ తిప్పేస్వామి, ఎంపీలు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీలు మంగమ్మ, శివరామిరెడ్డి, జెడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ తదితరులు 11:21AM, Nov 7, 2023 ►ఐదో ఏడాది రెండో విడత రైతు భరోసా కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన సీఎం జగన్ 11:15AM, Nov 7, 2023 ►పుటపర్తి చేరుకున్న సీఎం జగన్ 10:54AM, Nov 7, 2023 ►కాసేపట్లో పుటపర్తికి సీఎం వైఎస్ జగన్ 9:17AM, Nov7, 2023 ►పుట్టపర్తి బయలుదేరిన సీఎం వైఎస్ జగన్ ►కాసేపట్లో వైఎస్సార్ రైతు భరోసా నిధులను విడుదల చేయనున్న సీఎం జగన్ ►వరుసగా ఐదో ఏడాది.. రెండో విడత వైఎస్సార్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం పంపిణీ చేయనున్న ఏపీ ప్రభుత్వం ►ఒక్కొక్కరికి రూ.4,000 చొప్పున 53.53 లక్షల మంది రైతన్నలకు రూ.2,204.77 కోట్ల రైతు భరోసా సాయం ►శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో మంగళవారం బటన్ నొక్కి నేరుగా రైతన్నల ఖాతాల్లో జమ చేయనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగనమోహన్‌రెడ్డి రైతన్నలకు వెన్నుదన్నుగా సీఎం జగన్ వ్యవసాయం దండగ అనే గత పరిస్థితులను సమూలంగా మార్చి వ్యవసాయాన్ని పండుగ చేసి రైతన్నలకు అడుగడుగునా వెన్నుదన్నుగా నిలుస్తూ చెప్పిన దాని కన్నా ముందుగా, మాట ఇచ్చిన దానికన్నా మిన్నగా.. రైతన్నలకు సాయం అందిస్తున్నారు. మేనిఫెస్టోలో ఏటా రూ.12,500 చొప్పున నాలుగేళ్లలో రూ.50 వేల సాయం అందిస్తామన్న హామీకి మిన్నగా.. ఏటా మూడు విడతల్లో రూ.13,500 చొప్పున ఐదేళ్లలో రూ.67,500 చొప్పున అంటే మేనిఫెస్టోలో చెప్పిన దాని కంటే రైతన్నకు అదనంగా రూ.17,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్నారు. ఖరీఫ్ పంట వేసే ముందు మేలో రూ.7,500, అక్టోబర్–నవంబర్ నెల ముగిసే లోపే ఖరీఫ్ కోతలకు, రబీ అవసరాల కోసం రూ.4,000, పంట ఇంటికి వచ్చే వేళ జనవరి/ఫిబ్రవరిలో రూ.2 వేల చొప్పున ప్రభుత్వం సాయం అందిస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కౌలు రైతులు, ఆర్వోఎఫ్ఆర్ (అటవీ), దేవదాయ భూ సాగుదారులకు భూ యజమానులతో సమానంగా రైతు భరోసా కింద ప్రభుత్వం రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తోంది. తాజాగా జమచేస్తున్న రూ.2,204.77 కోట్లతో కలిపి వైఎస్సార్ రైతు భరోసా కింద ఒక్కో రైతు కుటుంబానికి రూ.65,500 చొప్పున ఈ నాలుగున్నరేళ్లలో రూ.33,209.81 కోట్ల పెట్టుబడి సాయం అందించింది. -
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సీఎం జగన్
ధర్మవరం(శ్రీసత్యసాయి జిల్లా): వైఎస్సార్సీపీ తలపెట్టిన సామాజిక సాధికారిత బస్సుయాత్ర జైత్రయాత్రలా కొనసాగుతోంది. ఏడో రోజు బస్సుయాత్రలో భాగంగా జిల్లాలోని ధర్మవరంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ధర్మవరం పట్టణంలోని పోలీస్ స్టేషన్ నుంచి ఆర్డీవో కార్యాలయం వరకూ బస్సుయాత్ర సాగగా తహశీల్దార్ కార్యాలయం వద్ద బహిరంగ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో బస్సుయాత్ర జరగ్గా, ప్రజలు భారీ సంఖ్యలో హాజరై సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గుమ్మనూరు జయరాం, మాజీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు శంకర్ నారాయణ, డాక్టర్ సిద్ధారెడ్డి, దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, డాక్టర్ తిప్పేస్వామి, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ తదితరులు పాల్గొన్నారు. సభకు హాజరైన ప్రజలనుద్దేశించి పలువురు వైఎస్సార్సీపీ నేతలు ప్రసంగించారు. పెనుకొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ మాట్లాడుతూ.. ‘ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్ద పీట వేశారు. సీఎం జగన్‌కు వెనుకబడిన వర్గాలు రుణపడి ఉండాల్సిన అవసరం ఉంది. అణగారిన వర్గాల విద్యార్థుల అభ్యున్నతి కోసమే ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు’ అని స్పష్టం చేశారు. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ.. ‘బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. సంక్షేమ పథకాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ లకే అత్యధిక లబ్ది చేకూరింది. బస్సుయాత్రను ఆపేశక్తి టీడీపీ, జనసేనలకు లేదు’ అని తెలిపారు. మాజీ ఎంపీ బుట్టా రేణుక మాట్లాడుతూ.. ‘నాకు రాజకీయ భిక్ష పెట్టింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సీఎం జగన్ పెద్దపీట వేశారు. బీసీ మహిళ అయిన నాకు టీడీపీలో సరైన గుర్తింపు ఇవ్వలేదు. కులగణన కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు. కులాలు మతాలు పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు చారిత్రాత్మకం’ అని పేర్కొన్నారు. మంత్రి గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ.. ‘2024 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ కి మరోసారి పట్టం కట్టాలి. జగన్ సంక్షేమ పథకాలపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. జగన్ పాలనలో పేదలు మూడు పూటలా ఆహారం తింటున్నారు’ అని అన్నారు. మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ‘ సాధికార బస్సు యాత్ర లో నల్లజెండాలు ప్రదర్శించాలని లోకేష్ అంటున్నారు. గత ఐదు రోజులుగా చూస్తున్నా .. ఎవరైనా వస్తారని. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు అత్యధిక రాజకీయ ప్రాధాన్యత కల్పించిన ఘనత సీఎం జగన్‌దే. వెనుకబడిన వర్గాలకు నాలుగు రాజ్యసభ సీట్లు ఇచ్చిన ఘనత సీఎం జగన్‌దే. ఏపీలో సుపరిపాలన జరగకుండా చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు కుట్రలు. జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపైనే ఉంది. 2024 ఎన్నికల్లో వైఎస్సార్సీపీని 175 స్థానాల్లో గెలిపించాలి’ అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మాట్లాడుతూ.. ‘ సామాజిక న్యాయం సీఎం జగన్ వల్లే సాధ్యం. వెనుకబడిన వర్గాల ఉన్నత విద్య చదవాలనే మహానేత వైఎస్సార్ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం తెచ్చారు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అంటున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమే. ముస్లిం మైనార్టీల అభివృద్ధి కోసం సీఎం జగన్ చిత్తశుద్ధితో కృషి చేశారు’ అని నొక్కి చెప్పారు. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. ‘75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అన్యాయం జరిగింది. సమాజంలో 80 శాతం ఉన్న అణగారిన వర్గాలకు మేలు చేయాలన్న ఆలోచన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిదే. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పోరేషన్, మున్సిపల్, స్థానిక సంస్థల పదవులన్నీ బడుగు బలహీన వర్గాలకే ఇచ్చారు. సంక్షేమ పథకాలను డోర్ డెలివరీ చేస్తున్న ఘనత జగన్ ప్రభుత్వానిదే. గత నాలుగున్నరేళ్లలో ధర్మవరం నియోజకవర్గంలోనే రూ. 2500 కోట్ల లబ్ధి. వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్‌కు ప్రజలందరూ అండగా నిలవాలి’ అని ప్రజలను కోరారు. -
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది ఏపీ వాసులు మృతి
కర్ణాటక: చిక్కబళ్లాపుర్లో ఆగి ఉన్న ట్యాంకర్‌ను టాటా సుమో వాహనం ఢీకొట్టగా.. 12 మంది మరణించారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. టాటా సుమోలో మొత్తం 18 మంది ప్రయాణిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు. పొగ మంచు వల్లే ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. మృతులంతా సత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కూలీ పనుల కోసం బెంగళూరు వెళ్తుండగా ఘటన జరిగింది. ఘటనా స్థలాన్ని చిక్‌బళ్లాపూర్ ఎస్పీ నగేష్ పరిశీలించారు. ఉదయం 7 గంటల సమయంలో ప్రమాదం జరిగిందని, మృతుల్లో 9 మంది పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారని తెలిపారు. చదవండి: వాకింగ్ చేస్తూ.. గుండెపోటుతో ట్రాఫిక్ కానిస్టేబుల్ మృతి -
వామ్మో ఎలుగుబంటి.. పరుగో పరుగు
-
AP: విషం తాగిన మహిళను రక్షించిన వలంటీర్
పెనుకొండ(శ్రీసత్యసాయి జిల్లా): విషం తాగిన మహిళను వార్డు వలంటీర్ దిశ పోలీసుల సాయంతో రక్షించిన ఉదంతం శ్రీసత్యసాయి జిల్లా పెనుగొండలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెనుకొండకు చెందిన ఓ మహిళకు ఏడేళ్ల క్రితం నరేష్‌తో వివాహమైంది. ఆ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం కూడా ఘర్షణ జరిగింది. దీంతో భర్త ఇంటి నుంచి బయటకు వెళ్లిన వెంటనే విషం తాగి ఆత్మహత్యకు యత్నించింది. అదే సమయంలో ఆ ఇంటికి వెళ్లిన వార్డు వలంటీర్ అశ్విని వెంటనే అప్రమత్తమై దిశ ఎస్‌వోఎస్‌కు కాల్ చేసింది. నిమిషాల వ్యవధిలోనే ఘటనా స్థలానికి చేరుకున్న దిశ టీం బాధితురాలిని వలంటీర్ సాయంతో ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం వివాహితకు ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పారు. చదవండి: శభాష్ వలంటీర్.. వెన్నుచూపలేదు.. వెనక్కి తగ్గలేదు.. -
కదిరి కుట్టాగల రైల్వేస్టేషన్ వద్ద ట్రైన్ డ్రైవర్ అప్రమత్తతో తప్పిన పెను ప్రమాదం
-
కదిరిలో తప్పిన రైలు ప్రమాదం
-
కదిరి వద్ద తప్పిన రైలు ప్రమాదం
సాక్షి, శ్రీసత్యసాయి: ఓవైపు ఒడిశా బాలాసోర్ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో.. వైఫల్యం గురించి చర్చ నడుస్తున్న వేళ.. మరోవైపు జిల్లాలో రైలు ప్రమాదం తప్పింది. కదిరిలో రైలు ప్రమాదం తప్పింది. కూటాగుళ్ల వద్ద రైల్వే సిబ్బంది గేటు వేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో వాహనాలు యధేచ్ఛగా అటు ఇటు తిరిగాయి. ఈలోపు రైలు రాకను గమనించి కొందరు స్థానికులు అప్రమత్తమై.. అటు ఇటు వాహనాలు నిలిపివేశారు. గేటు వేయకపోవడాన్ని గమనించి రైలును ఆపేశాడు ట్రైన్ పైలట్. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
లోకేష్ యాత్రలో టీడీపీ కార్యకర్తలు అత్యుత్సాహం
సాక్షి, సత్యసాయి జిల్లా: లోకేష్ యాత్రలో టీడీపీ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. నడిరోడ్డుపై టీడీపీ కార్యకర్తలు బాణసంచా పేల్చడంతో ఐదుగురు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. బత్తలపల్లి మండలం పొట్లమర్రిలో ఘటన జరిగింది. -
భూమి కబ్జాచేసి చంపేస్తామంటున్నారు.. పరిటాల శ్రీరామ్ నుంచి రక్షణ కల్పించండి
సాక్షి, పుట్టపర్తి(శ్రీసత్యసాయి జిల్లా): తెలుగుదేశం నాయకుడు పరిటాల శ్రీరామ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన చెరుకూరి వెంకటరాముడు సోమవారం ఎస్పీ రాహుల్‌దేవ్‌సింగ్‌కు ఫిర్యాదు చేశారు. తన భూమిని కబ్జా చేయడమేగాక దాన్ని రాసి ఇవ్వమంటున్నారని, లేకపోతే చంపేస్తామని ఆయన అనుచరులు బెదిరిస్తున్నారని తెలిపారు. పరిటాల సునీత కబ్జాచేసిన తన భూమిని తనకు ఇప్పించాలని, తనకు రక్షణ కల్పించాలని కోరారు. ‘నా ఆస్తిని కబ్జా చేశారు. నన్ను కిడ్నాప్ చేశారు. ఆ ఆస్తి రాసిస్తాననడంతో వదిలేశారు. కానీ తర్వాత నేను నా ఆస్తి ఇచ్చేది లేదని స్పష్టం చేయడంతో నన్ను హత్యచేసేందుకు కుట్ర పన్నినట్లు తెలిసింది. టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ అండతోనే ఆయన అనుచరులు ఇలా చేస్తున్నారు. వారి నుంచి రక్షణ కల్పించాలి..’ అని పేర్కొన్నారు. జిల్లా కేంద్రం పుట్టపర్తిలోని జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘స్పందన’లో ఆయన ఎస్పీకి ఈ మేరకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల మేరకు.. అనంతపురం రూరల్ మండలం కక్కలపల్లి రెవెన్యూ లో 141–2 సర్వే నంబరులో 9.81 ఎకరాల భూమి ఉంది. ఆ భూమి 1930 సంవత్సరం ముందు నుంచి వెంకటరాముడు పూర్వీకుల పేరిట ఉంది. తర్వాత మూడు భాగాలుగా పంచుకున్నారు. అందులో మూడోవంతు.. అంటే 3.27 ఎకరాలు చెరుకూరి వెంకటరాముడుకు దక్కింది. అందులో 1.63 ఎకరాలను ఆయన ఇతరులకు విక్రయించారు. మిగిలిన 1.64 ఎకరాల భూమిని తమకు రాసివ్వాలంటూ పరిటాల సునీత మంత్రిగా ఉన్నప్పటి నుంచి వేధిస్తున్నారు. అంతేకాకుండా మొత్తం 9.81 ఎకరాల భూమి ఇంకా సబ్ డివిజన్లు కాకపోవడంతో మొత్తం భూమిపై పరిటాల కుటుంబం కన్నేసింది.. అని వెంకటరాముడు పేర్కొన్నారు. గత నెల 17న కిడ్నాప్ భూమి విషయమై గత నెల 17వ తేదీన ధర్మవరంలో ఉన్న వెంకటరాముడును కిడ్నాప్ చేశారు. పరిటాల అనుచరులు దాదా ఖలందర్, చింతలపల్లి మహేశ్‌నాయుడు, ఎల్.నారాయణచౌదరి, లిక్కర్ సుధాకర్‌నాయుడు ప్రోద్బలంతో కుంటిమద్ది అక్కులప్ప తన గ్యాంగ్‌తో వచ్చి కిడ్నాప్ చేసినట్లు అప్పట్లోనే వెంకట రాముడు అనంతపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుర్తుతెలియని చోటుకు తీసుకెళ్లి తనను తీవ్రంగా కొట్టారని, వారు కోరుకున్నట్లుగా భూమి రాసిస్తానని చెప్పిన తర్వాత అదేరోజు సాయంత్రం ప్రాణాలతో వదిలారని ఆ ఫిర్యాదులో తెలిపారు. చదవండి: టీడీపీ ‘సామాజిక’ చిచ్చు -
కదిరిలో ఉద్రిక్తత.. రెచ్చిపోయిన టీడీపీ నేతలు!
సాక్షి, సత్యసాయి: జిల్లాలోని కదిరిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆక్రమణల తొలగింపు వద్ద టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. సీఐ మధు ఇంటిపై టీడీపీ నేతలు, కార్యకర్తలు దాడికి యత్నించారు. ఈ సందర్బంగా సీఐకి మద్దతుగా వచ్చిన వైఎస్సార్సీపీ కార్యకర్తలపై కూడా టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయి రాళ్లలో విచ్చక్షణా రహితంగా దాడులు చేశారు. కాగా, ఈ దాడులను కదిరి టీడీపీ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ప్రేరేపించారు. మాజీ ఎమ్మెల్యే వెంకటప్రసాద్.. పోలీసులను దుర్బాషలాడుతూ టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టారు. -
పుట్టపర్తి: వస్తే.. వెళ్లలేమప్పా!.. విదేశీ అతిథుల మన్ననలు..
సాక్షి, పుట్టపర్తి: శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తి భిన్న సంస్కృతుల కలబోతగా ప్రతిబింబిస్తోంది. విదేశీ అతిథులు తమ సంప్రదాయాలను వదిలి.. తెలుగు డ్రెస్ కోడ్‌ను ఇష్టపడుతుంటారు. మన వంటకాలపై ఆసక్తి చూపిస్తున్నారు. భారతీయ జీవనశైలిని పాటిస్తున్నారు. పర్యాటక ప్రాంతాలు చుట్టేస్తున్నారు. ఆధ్యాత్మిక క్షేత్రాల సందర్శనలో సంప్రదాయాలను అనుసరిస్తారు. సుమారు 150 దేశాల నుంచి యాత్రికులు పుట్టపర్తి వస్తుంటారు. విదేశీ సంప్రదాయాలను పరిచయం చేయడంతో పాటు మన సంప్రదాయాలను అనుసరిస్తారు. భారతీయ జీవనశైలికి అలవాటు పడుతున్నారు. మన దేశ సంస్కృతులను ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. ఇదో గర్వకారణమని పుట్టపర్తివాసులు చెబుతున్నారు. సాయిబాబా చలువ వల్లే ఇది సాధ్యమైందని చెబుతున్నారు. విదేశీయులు మెచ్చే విధంగా పుట్టపర్తిలో వసతి అందుబాటులో ఉంది. హోటళ్లు, వస్త్ర దుకాణాలు, సంగీత పరికరాల అంగళ్లు ఉన్నాయి. విదేశీయులు మెచ్చే విధంగా హోటళ్లలో అలంకరణ కనిపిస్తుంది. సుమారు 10 లాడ్జిలు, 30 హోటళ్లు విదేశీయులకు నచ్చేశైలిలో అందుబాటులో ఉన్నాయి. భారత దేశానికి వచ్చినా.. ఇక్కడి దర్శనీయ స్థలాలను చూసినా వదిలి వెళ్లలేమని విదేశీ అతిథులు అంటున్నారు. ఇక్కడ పాటించే ఆచార వ్యవహారాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని చెబుతున్నారు. చదవండి: ఆగిన గుండెకు.. నేరుగా మసాజ్.. కడుపులో నుంచి చేతిని పంపించి.. -
ఏ ముహూర్తాన పార్టీ లేదు.. బొక్కా లేదు అన్నాడో కానీ.. నిజంగానే..!
రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి పరుగులు పెడుతోంది. అర్హతే ప్రామాణికంగా ఫలాలు ఇంటి ముందు వచ్చివాలుతున్నాయి. దేశంలోనే ఎక్కడా లేని విధంగా సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ హెల్త్ క్లినిక్‌లు వంటి విప్లవాత్మక కార్యక్రమాలతో గ్రామాల స్వరూపమే మారిపోతోంది. దీంతో అన్ని వర్గాల ప్రజలు వైఎస్సార్ సీపీ సర్కారుతో కనెక్ట్ అయిపోయారు. ప్రతిపక్షాల ఊసే మర్చిపోతున్నారు. ఎన్నికలకు ఏడాది ముందే జిల్లాలో టీడీపీ అభ్యర్థుల వేటలో నిమగ్నమైన టీడీపీ అధినేత చంద్రబాబుకూ ఈ విషయం బోధపడినట్లు తెలిసింది. ఇప్పటికే పలువురు నాయకులతో సమావేశమై బుజ్జగింపు పర్వాలు మొదలుపెట్టినా.. ఇప్పుడేం చేయలేమని ‘తమ్ముళ్లు’ సమాధానం ఇచ్చినట్లు సమాచారం. సాక్షి, పుట్టపర్తి: ఏ ముహూర్తాన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు టీడీపీ లేదు.. బొక్కా లేదు అని అన్నాడో తెలియదు కానీ నిజంగానే ఆ పార్టీ పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితికి చేరుకుంటోంది. కుదేలైన సైకిల్‌కు ఎన్ని మరమ్మతులు చేసినా ప్రయోజనం కానరావడం లేదు. జిల్లా టీడీపీలో అసమ్మతి మంటలు రగులుతూనే ఉన్నాయి. నిత్యం ఏదో ఒక చోట ఎవరో ఒకరు ఆ పార్టీ అధిష్టానంపై ధిక్కార స్వరం వినిపిస్తూనే ఉన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా ఏడు అసెంబ్లీ, ఒక పార్లమెంటు స్థానం నుంచి ఎవరు పోటీ చేస్తారనే దానిపై స్పష్టత లేదు. కేవలం ఉనికి కాపాడుకునేందుకు నేతలు యత్నిస్తున్నారు. పార్టీ పరిస్థితులను చక్కదిద్దేందుకు చంద్రబాబు నానా తంటాలు పడుతున్నట్లు సమాచారం. అయితే పరిస్థితి చేయి దాటిపోయిందని.. ఇప్పుడేం చేయలేమని ‘తమ్ముళ్లు’ సమాధానం ఇచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. టికెట్ రాని పక్షంలో అధిష్టానంతో అమీ తుమీ తేల్చుకుంటామని కొందరు నేతలు ఇప్పటికే సిద్ధమయ్యారు. పెనుకొండ, పుట్టపర్తి, ధర్మవరం, రాప్తాడు, హిందూపురం, కదిరి నుంచి టీడీపీ తరఫున ఎవరు పోటీ చేస్తారనే దానిపై స్పష్టత లేదు. ఒక్కో నియోజకవర్గం నుంచి ఇద్దరు ముగ్గురు పోటీలో ఉన్నారు. ‘పోటీ చేసేది నేనే’ అంటూ ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పెనుకొండ నుంచి బీకే పార్థసారథి, పుట్టపర్తి నుంచి పల్లె రఘునాథరెడ్డి, కదిరి నుంచి కందికుంట వెంకట ప్రసాద్, హిందూపురం నుంచి బాలకృష్ణ, ధర్మవరం నుంచి పరిటాల శ్రీరామ్, రాప్తాడు నుంచి పరిటాల సునీత పోటీ చేస్తున్నట్లు ఎవరికి వారు చెప్పుకొంటున్నారు. కానీ ఇందులో ఏ ఒక్కరికి కూడా టికెట్ గ్యారెంటీ లేదు. ప్రతి నియోజకవర్గంలో అసమ్మతి నేతల బెడద వెంటాడుతోంది. పెనుకొండలో సవితమ్మ, నిమ్మల కిష్టప్ప, బీకే పార్థసారథి టికెట్ రేసులో ఉన్నారు. పుట్టపర్తి నుంచి పల్లె రఘునాథరెడ్డి, సైకం శ్రీనివాసరెడ్డి, కదిరి నుంచి అత్తార్ చాంద్‌బాషా, కందికుంట వెంకట ప్రసాద్, ధర్మవరం నుంచి పరిటాల శ్రీరామ్‌తో పాటు బీజేపీ నేత వరదాపురం సూరి, పొత్తు కుదిరితే జనసేన నుంచి చిలకం మధుసూదన్‌రెడ్డి కూడా పోటీలో ఉండనున్నట్లు తెలిసింది. రాప్తాడు నుంచి పరిటాల సునీత పోటీ చేస్తారా? లేక తనయుడిని బరిలో దింపుతారా? అనేది తెలీదు. ధర్మవరం టికెట్ రాకుంటే రాజీనామా చేస్తానని పరిటాల శ్రీరామ్ సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో సీనియర్ వర్సెస్ జూనియర్స్ చందంగా టీడీపీ నేతల మధ్య కోల్డ్ వార్ తారస్థాయికి చేరింది. ఒకరితో ఒకరి పోరుతో జిల్లాలో చాలా మంది కీలక టీడీపీ నేతల రాజకీయ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే కొందరు కనుమరుగు కాగా.. మరికొందరు అదేబాటలో నడుస్తున్నట్లు సమాచారం. ఏదేమైనా.. నేతల వేరుకుంపట్లతో కిందిస్థాయి నాయకులు, కార్యకర్తలు కూడా తలోబాట పట్టినట్లు తెలుస్తోంది. -
రెచ్చగొట్టి.. రచ్చచేసి.. ఉనికి కోసం టీడీపీ కుయుక్తులు
రచ్చ చేయడం లబ్ధి పొందడం పచ్చ నేతలకు వెన్నతో పెట్టిన విద్య. అందుకు అవసరైతే ఎవరినైనా బలి చేస్తారు. ఎంతదాకైనా వెళ్తారు. ఎన్ని అసత్యాలైనా చెబుతారు. తమ రాజకీయ స్వార్థం కోసం అమాయకులను బలి చేస్తారు. అవసరమైతే రోడ్లెక్కి ఆందోళనలు చేస్తారు. జిల్లాలో ఇప్పుడు జరుగుతున్న రాజకీయం ఇదే. కుల, మత, పార్టీలకు అతీతంగా సీఎం పాలన సాగిస్తుండగా ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. దీన్ని జీర్ణించుకోలేని పచ్చ నేతలు అమాయకులు, మహిళలను ఉసిగొలిపి రచ్చ చేస్తున్నారు. అసత్యాలు ప్రచారం చేస్తూ జనం దగ్గర మార్కులు కొట్టేయాలని కుయుక్తులు పన్నుతున్నారు. సాక్షి, పుట్టపర్తి: ఒకప్పుడు మందీమార్బలం.. అధికార దర్పంతో హడావుడి చేసిన పచ్చ నేతలు ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. గతంలో ఇళ్లముందు బారులు తీరే జనం.. ఇప్పుడు ఎదురెళ్లినా పట్టించుకోలేదు. నమ్ముకున్న కేడరూ తలోదారి చూసుకున్నారు.. ఎన్నికలు దగ్గరకొస్తున్నాయి.. ఏం చేయాలో తెలియని ‘తమ్ముళ్లు’ అసత్యాలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉనికి కాపాడుకునేందుకు పడరానిపాట్లు పడుతున్నారు. నేరాల్లో ముద్దాయిలుగా ఉన్న మహిళలను నేతలు, అధికారులపై ఉసిగొలిపి రోడ్డెక్కుతున్నారు. ఎల్లో మీడియాను అడ్డు పెట్టుకుని విషపు రాతలు రాయిస్తున్నారు. అమాయక ప్రజలను రెచ్చగొట్టి కేసులు పెట్టిస్తున్నారు. ఇటీవల కాలంలో జిల్లాలో వెలుగు చూసిన కొన్ని ఘటనలు తెలుగు ‘తమ్ముళ్ల’ ఆగడాలకు అద్దం పడుతున్నాయి. వ్యభిచార గృహం నడుపుతూ.. ధర్మవరం టూటౌన్ సీఐ రాజా తనను వేధిస్తున్నారని.. అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నారని గీతాంజలి అనే మహిళ గత సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ‘స్పందన’లో ఫిర్యాదు చేశారు. వివరాలు ఆరా తీస్తే.. ఆమెపై ఇప్పటికే పలు ఫిర్యాదులున్నాయి. చీరల వ్యాపారం పేరుతో పలు అసాంఘిక కార్యకలాపాలు చేపడుతోంది. ధర్మవరంలో అద్దెకు ఇళ్లు తీసుకుని ఇంటి యజమానులను వేధించేది. అద్దె ఇవ్వకపోగా, దబాయించేది. చివరకు వ్యభిచార గృహం నడుపుతూ పోలీసులకు పట్టుబడింది. దీనిపై చుట్టుపక్కల వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఏం చేయాలో తెలియని గీతాంజలి తనకు బాగా తెలిసిన కొందరు పచ్చనేతలను కలిసి వారి డైరెక్షన్లో టూ టౌన్ సీఐ రాజాపై ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఇటీవల టీడీపీ నేత పరిటాల శ్రీరామ్‌కు, టూ టౌన్ సీఐ రాజాకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో గీతాంజలి సీఐపై ఫిర్యాదు చేయడం, ఆమెపై ఇప్పటికే కేసులుండటం తెలిసి జనం పచ్చనేతల దిగజారుడు ప్లాన్‌పై మండిపడుతున్నారు. చదవండి: (జనసేన నాయకుడి వేధింపుల పర్వం.. ప్రేమిస్తున్నానంటూ హల్చల్) నాటుసారా, కర్ణాటక మద్యం విక్రయిస్తూ.. పెనుకొండ మండలం శెట్టిపల్లి గ్రామానికి చెందిన లలితాబాయి నాటుసారా, కర్ణాటక మద్యం విక్రయిస్తూ పలుమార్లు పోలీసులకు పట్టుబడింది. ఆమె వితంతువు కాగా ప్రభుత్వం పింఛన్ మంజూరు చేసింది. అయితే ఆమె మళ్లీ పెళ్లి చేసుకోవడంతో విచారణ చేసిన అధికారులు వితంతు పింఛన్ నిలిపివేశారు. దీన్ని రాజకీయంగా వాడుకోవాలనుకున్న స్థానిక టీడీపీ నేతలు లలితాబాయిని రెచ్చగొట్టారు. దీంతో ఆమె అప్పటి మంత్రి శంకరనారాయణను ఇష్టానుసారం దూషించారు. దీంతో విచారణ చేయించగా...ఆమె పింఛన్‌కు అనర్హురాలిగా తేలింది. పైగా ఆమెపై నాటుసారా విక్రయాలకు సంబంధించి ఇప్పటికే కేసులున్నాయి. 10 రోజుల క్రితం కూడా రొద్దం మండల పరిధిలోని రాష్ట్ర సరిహద్దులో కర్ణాటక మద్యం విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడింది. ప్రచారం కోసం...హంగామా బుక్కపట్నం మండలం రాసింపల్లి – గూనిపల్లి మధ్యలో తమపై వైఎస్సార్ సీపీ నేతలు హత్యాయత్నం చేశారని తెలుగు యువత రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి అంబులెన్సు రమేశ్ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. యాదాలంకపల్లిలో ఓ కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తుండగా మారాలకు చెందిన చెన్నప్ప, రాజు, అగ్రహారానికి చెందిన వారాది, లక్ష్మీనారాయణ తదితరులు రాళ్లు, కర్రలతో దాడి చేయబోయారని ఫిర్యాదు చేశారు. వివరాలపై ఆరా తీయగా..అలాంటి ఘటనే చోటుచేసుకోలేదని తెలిసింది. కేవలం పబ్లిసిటీ కోసమే అంబులెన్స్ రమేశ్ ఇలా చేసినట్లు తేలింది. కేవలం పచ్చ మీడియా తన ఫొటోతో ప్రచారం చేస్తుందన్న ఉద్దేశంతోనే అధికార పార్టీ నేతలపై ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఎమ్మెల్యేపై దురుసు ప్రవర్తన పచ్చ నేతలు రెచ్చగొట్టడంతో నల్లమాడ మండలం మసకవంకపల్లి గ్రామస్తులు రెచ్చిపోయారు. సచివాలయం మార్చాలంటూ పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి నివాసానికి చేరుకుని గొడవ చేశారు. సర్దిజెప్పేందుకు ప్రయత్నించిన ఎమ్మెల్యేపై దురుసుగా ప్రవర్తించారు. పోలీసులు రంగంలోకి దిగి అందరినీ స్టేషన్‌కు తరలించారు. దీనిపై జనసేన, టీడీపీ, బీజేపీ, కమ్యూనిస్టు పార్టీల నేతలు దు్రష్పచారం చేశారు. ఎమ్మెల్యే అనుచరులు మసకవంకపల్లి వాసులపై దాడి చేశారంటూ ప్రచారం చేశారు. ఎల్లో మీడియా కూడా పలు కోణాల్లో అసత్య కథనాలు వండివార్చింది. కానీ జనం అసలు విషయం తెలిసి పచ్చనేతల నిసిగ్గు రాజకీయంపై పెదవి విరిచారు. మున్సిపల్ కార్యాలయానికి కంప పుట్టపర్తిలో టీడీపీ పూర్తిగా ఉనికి కోల్పోయింది. ఈ పార్టీ నేతలను పట్టించుకునే వారే కరువయ్యారు. ప్రతి పథకం అర్హత ఆధారంగా అర్హులందరికీ అందుతుండటంతో ఆపార్టీ కౌన్సిలర్లను జనం పలకరించడం కూడా మానేశారు. దీన్ని జీర్ణించుకోలేని కౌన్సిలర్ రత్నప్పచౌదరి ఎలాగైనా ప్రభుత్వంపై బురదజల్లి లబ్ధి పొందాలని భావించారు. మోటారు వర్షపు నీటిలో మునిగిపోగా, మరమ్మతులు చేయలేని పరిస్థితి నెలకొంది. దాని గురించి ప్రస్తావించకుండా నీటి సమస్య పరిష్కరించని మున్సిపల్ కార్యాలయం ఎందుకంటూ ఏకంగా కార్యాలయానికి కంప వేయించారు. అంతేకాకుండా ఎకరాకు రూ.50 వేలు లీజు రూపంలో చెల్లిస్తానని.. వైఎస్సార్సీపీ కార్యాలయానికి కేటాయించిన స్థలం తనకు ఇవ్వాలని కోరారు. అర్థంపర్థం లేకుండా ఆయన చేసే వ్యాఖ్యలు చూసి జనం నవ్వుకుంటున్నారు. పబ్లిసిటీ పిచ్చితో ఏదో ఒకటి మాట్లాడాలనే ఉద్దేశంతో రత్నప్ప నిత్యం వార్తల్లో కనిపించాలని సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారని టీడీపీ నేతలే చెప్పుకుంటున్నారు. -
నాన్నా.. నేనేం తప్పు చేశాను?.. నన్నెందుకిలా చేశావు?!
ఈ లోకానికి పరిచయం చేసినప్పుడు బోసినవ్వులతో మురిసిపోతిని.. బుడిబుడి అడుగులు వేయించినప్పుడు నువ్వున్నావన్న ధైర్యంతో ముందుకు నడిస్తిని.. గుండెల్లో దాచుకుంటావని, బంగారు భవితకు బాటలు వేస్తావని ఆశపడితిని.. అదే ధైర్యంతో, అదే అశతో ఇంటి నుంచి నీ వెంటే బయటకొస్తిని.. నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి.. నిర్జీవంగా మారుస్తావని కలలోనూ ఊహించలేదు.. నాన్నా..నేనేం తప్పు చేశాను?. నన్నెందుకిలా చేశావు?! పెనుకొండ రూరల్(శ్రీ సత్యసాయి జిల్లా): భార్యపై అనుమానంతో కన్న కొడుకును దారుణంగా హత్య చేశాడో కసాయి. ఈ ఘటన పెనుకొండ మండలంలో మంగళవారం సాయంత్రం ఆలస్యంగా వెలుగు చూసింది. ఎస్ఐ రమేష్‌బాబు, గ్రామస్తుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మడకశిర మండలం శివపురం గ్రామానికి చెందిన కవిత, గంగరాజు భార్యాభర్తలు. వీరికి ఒకటిన్నర సంవత్సరం వయసున్న వికాస్ అనే కుమారుడు ఉన్నాడు. గంగరాజు భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ నెల 20వ తేదీ కూడా గొడవ పడ్డారు. గంగరాజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో కుమారుడు వికాస్‌ను తీసుకుని ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు. తిరిగి వెళ్లలేదు. దీంతో కవిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తు సాగిస్తుండగానే.. గంగరాజు తన అన్నకు తారసపడ్డాడు. కుమారుణ్ని ఏమి చేశావని అతను ప్రశ్నించగా..ఎప్పుడో చంపేసినట్లు చెప్పాడు. దీంతో అతను కవితకు సమాచారమిచ్చాడు. చదవండి: నన్ను పెళ్లి చేసుకో.. లేదా పురుగు మందు తాగు.. ఆమె పోలీసులకు తెలపడంతో గంగరాజును మడకశిరలో అదుపులోకి తీసుకుని.. తమదైన శైలిలో విచారణ చేశారు. కుమారుణ్ని పెనుకొండ మండల పరిధిలోని 44వ జాతీయ రహదారి సమీపాన గల ఉలవలకుంట గుట్ట వద్దకు తీసుకెళ్లి గొంతు నులిమి హత్య చేసినట్లు అంగీకరించాడు. పోలీసులు అక్కడికి వెళ్లి పరిశీలించగా చిన్నారి మృతదేహం లభ్యమైంది. కుళ్లిపోయిన స్థితిలో కన్పించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెనుకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అభం శుభం తెలియని చిన్నారిని చంపేందుకు చేతులెలా వచ్చాయంటూ కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. -
సత్యసాయి జిల్లాలో క్షిపణుల తయారీ
సాక్షి, అమరావతి: దేశ రక్షణ రంగంలో అత్యంత కీలకమైన అధునాతన క్షిపణులు (మిస్సైల్స్) రాష్ట్రంలో ఉత్పత్తి కానున్నాయి. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) సత్యసాయి జిల్లా పాలసముద్రం వద్ద 914 ఎకరాల్లో వీటి తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. క్షిపణులతోపాటు రాడార్ టెస్ట్ బెడ్, ఇతర రక్షణ రంగ ఉత్పత్తులను కూడా ఇక్కడ తయారు చేయనుంది. ఈ యూనిట్‌కు రూ.384 కోట్లు కేటాయిస్తూ శనివారం మచిలీపట్నంలోని బీఈఎల్‌లో జరిగిన సంస్థ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం నిర్వాకంతో ఆగిపోయిన ఈ ప్రాజెక్టును వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని అన్ని రకాల అనుమతులు మంజూరు చేయించింది. 2016లో ఉమ్మడి అనంతపురం జిల్లా పాలసముద్రం వద్ద కేటాయించిన భూమి కన్వర్షన్, పర్యావరణ అనుమతులు తేవడంతో అప్పటి ప్రభుత్వం అలసత్వం ప్రదర్శించింది. దీంతో ఈ యూనిట్ నిలిచిపోయింది. వైఎస్ జగన్ సీఎం అయ్యాక దీనిపై దృష్టి సారించారు. త్వరితగతిన అనుమతులు వచ్చేలా చర్యలు చేపట్టారు. మరోపక్క యూనిట్ పనులు ప్రారంభించకపోతే భూ కేటాయింపులు రద్దు చేయడంతో పాటు, పెనాల్టీ విధిస్తామంటూ బీఈఎల్‌కు ఏపీఐఐసీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీంతో బీఈఎల్ కొంత సమయం ఇవ్వాలని, పెనాల్టీలు రద్దు చేయాలని కోరింది. గతంలో కంటే పెద్ద యూనిట్ ఏర్పాటు చేసేలా కొత్తగా సమగ్ర ప్రాజెక్టు ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. దీన్ని పరిశీలించిన ఏపీఐఐసీ బోర్డు అన్ని అనుమతులు మంజూరు చేసింది. అనుమతులు రావడంతో బీఈఎల్ కూడా యూనిట్ ఏర్పాటుకు త్వరితగతిన చర్యలు చేపట్టింది. నిధులు కూడా కేటాయించింది. రక్షణ రంగంలో అత్యంత కీలకమైన ఈ ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంపై బీఈఎల్ అధికారులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. శనివారం బోర్డు సమావేశం అనంతరం బెంగళూరు బీఈఎల్ డైరెక్టర్లు భాను పి.శ్రీవాత్సవ, వినయ్ కుమార్ కత్యాల్, మనోజ్ జైన్, డాక్టర్ పార్థసారధి మంగళగిరిలో ఏపీఐఐసీ చైర్మన్ మెట్టు గోవిందరెడ్డిని కలిసి ప్రభుత్వం చొరవను అభినందించారు. ఏమాత్రం ఆలస్యం కాకుండా వెంటనే టెండర్లు పిలిచి త్వరలోనే పనులు మొదలుపెడతామని తెలిపారు. 6 నెలలకు ఒకసారి సమావేశమై పనుల పురోగతిని సమీక్షిస్తామన్నారు. -
వీడియో: ఆ తల్లి కుక్కలా చేయలేదు.. పాముతో పోరాడి చిలుకలు..
మనుషులైనా జంతువులైనా సరే ఐకమత్యంతో ఉంటే కొన్ని సందర్భాల్లో ఆపదల నుంచి తప్పించుకోవచ్చు అని ఇప్పటికే చాలాసార్లు రుజువైంది. తాజాగా కొన్ని చిలుకలు ఐకమత్యంతో ఉండి.. పాము తరమిమేసి తమ ప్రాణాలను నిలుపుకున్నాయి. ఈ ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో చోటుచేసుకుంది. అయితే, జిల్లాలోని పెనుగొండలో ఓ కొబ్బరిచెట్టుపై కొన్ని చిలుకలు గూడుకట్టుకున్నాయి. కాగా, చిలుకల గూడును ఎక్కడి నుంచి పసిగట్టిందో ఏమో ఓ పాము వాటిని చినేందుకు చెట్టుపైకి ఎగబాకింది. ఆ సమయంలో పాము రాకను గమనించిన చిలుకలు తమ ప్రాణాలను కాపాడుకునేందు సర్వశక్తులొడ్డాయి. ఐకమత్యంతో పోరాటం చేశాయి. చెట్టుపై ఉన్న పాము బుసలుకొడుతూ చిలుకలను కాటువేసేందుకు ప్రయత్నించగా అక్కడున్న చిలుకలన్నీ ఐకమత్యంతో పామును ఎదుర్కొన్నాయి. పాముపై చిలుకలన్నీ కలిసి ముప్పెటదాడి చేశాయి. దీంతో, చేసేదేమీ లేక పాము తోకముడిచింది. కాగా, చిలుకల ఐకమత్యంపై నెటిజన్లు స్పందిస్తూ.. కలిసి పోరాడితే ఎంతటి కష్టానైనా జయించవచ్చని నిరూపించాయంటూ ప్రశంసిస్తున్నారు. ఇది కూడా చదవండి: పెద్దగా బుసలు కొడుతూ.. బయటకు లాక్కొచ్చి మరీ కాటేసింది! -
అమ్మానాన్న.. నా పుట్టినరోజు ఎవరు చేస్తారు?
ఎంజీఎం: కూతురు పుట్టిన రోజును జరుపుకునేందుకు ఎంతో సంతోషంగా బయల్దేరారు. కారులో మంచిచెడులు.. పుట్టిన రోజు ప్లానింగ్ చర్చించుకుంటూ వస్తున్నారు. కానీ రోడ్డు ప్రమాదం వారి గమ్యస్థానం చేరకముందే అనంతలోకాలకు చేర్చింది. అమ్మా, నాన్న, నానమ్మను బలి తీసుకుంది. ఇద్దరు చిన్నారులు ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీసత్యసాయి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వరంగల్ నగరంలోని ఎల్లంబజార్‌కు చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు. ఇక్కడ పుట్టిన రోజు వేడుకల ఏర్పాట్లలో ఉన్న వారు వీరి మరణవార్త విని షాక్‌కు గురయ్యారు. ఏడాదిన్నర క్రితమే తండ్రిని కబళించిన కరోనా.. వరంగల్ నగరంలోని ఎల్లంబజార్‌కు చెందిన ఎల్లంకుల గోపీనాథ్ (38) బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగి. భార్య శ్వేత రమ్యశ్రీ (32), పిల్లలతో కలిసి అక్కడే ఉంటున్నాడు. తండ్రి ఏడాదిన్నర క్రితం కరోనా బారిన పడి చనిపోయాడు. దీంతో తల్లి తారకేశ్వరి (56)ని బెంగళూరుకు తీసుకెళ్లాడు. గోపీనాథ్‌కు ఇద్దరు పిల్లలు. కుమారుడు సాహిత్, కూతురు హాసిని. హాసిని గతేడాది జన్మించింది. ఈనెల 25న తనది మొదటి పుట్టిన రోజు. అందరి బంధువుల మధ్య వైభవంగా జరుపుకుందామని అనుకున్నారు. దీంతో వరంగల్‌లో ఓ ఫంక్షన్‌హాల్‌ను కూడా బుక్ చేశారు. ఈమేరకు ఇక్కడి బంధువులు ఆ ఏర్పాట్లలో ఉన్నారు. గోపీనాథ్ కుటుంబంతో సహా శనివారం సొంత కారులో ఉదయం వరంగల్‌కు బయల్దేరారు. దూర ప్రయాణం కావడంతో మధ్యమధ్యలో ఆగుతూ వస్తున్నారు. విధి చిన్నచూపు చూసింది. మార్గమధ్యలో శ్రీ సత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం పర్వతదేవరపల్లి సమీపంలో అదుపుతప్పి కల్వర్టు దిమ్మెను వేగంగా ఢీకొట్టింది. డ్రైవింగ్ చేస్తున్న గోపీనాథ్‌తో పాటు ముందు సీట్లో కూర్చున్న భార్య శ్వేత రమ్యశ్రీ (32) తీవ్రంగా గాయపడి కారులోనే ప్రాణాలు వదిలారు. గాయపడిన తారకేశ్వరీ చికిత్స పొందుతూ మృతి చెందింది. చిన్నారులు సాహిత్, హాసిని అనంతపురం సర్వజనాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుడు గోపీనాథ్ సోదరుడు దుబాయ్‌లో ఉంటారని తెలిసింది. ముగ్గురి మృతదేహాలను వరంగల్‌కు తీసుకువచ్చే ఏర్పాట్లలో బంధువులు ఉన్నారు. వర్ధన్నపేట ఘటన మరువకముందే.. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని స్వగ్రామానికి వెళ్లి తిరిగివస్తుండగా వర్ధన్నపేట సమీపంలో జరిగిన ప్రమాదంలో పెరకవాడకు చెందిన ఒకే కుటుంబంలోని దంపతులతోపాటు వారి కొడుకు మరణించిన విషయం తెలిసిందే. ఆఘటన మరువకముందే ఎల్లంబజార్‌కు చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు చనిపోవడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. ఆ.. చిన్నారులకు దిక్కెవరు? రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులతోపాటు, నానమ్మను సైతం కోల్పోయిన ఇద్దరు చిన్నారులు ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు. ఇప్పుడు వారికి దిక్కెవరంటూ బంధువులు.. ఆ ప్రాంతవాసులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నా పుట్టినరోజు ఎవరు చేస్తారు? అమ్మా.. నాన్న.. 25న నా మొదటి పుట్టిన రోజు కదా.. గ్రాండ్‌గా చేయాలని ఎన్నో ప్లాన్లు వేసుకున్నారు. సొంతింటి దగ్గర చేస్తేనే అందరూ వస్తారని చెప్పారు.. మన వాళ్లందరినీ పిలుద్దామని.. ఫోన్లు కూడా చేశారు. అందరం కలిసి ఆనందంగా కారులో బయల్దేరాం.. నానమ్మ కథలు చెబుతుంటే ఊహల్లో ప్రయాణించా.. నిద్రపోతూ..లేస్తూ.. అన్నయ్యను అల్లరి పట్టిస్తూ వస్తున్నా.. ఇప్పుడు నేను ఆస్పత్రిలో ఉన్నా.. ఏమైందో తెలియట్లేదు.. నేనొక బెడ్‌పై, అన్నయ్య మరో బెడ్‌పై.. మాకు ఏమేమో పెట్టారు.. సూదులు గుచ్చుతున్నారు. నొప్పిగా ఉంది.. అమ్మ నాకు పాలివ్వట్లేదు.. మీ అమ్మా.. నాన్న దేవుడి దగ్గరకు వెళ్లారంటున్నారు మా దేవుళ్లు మీరే కదమ్మా.. మరి మమ్మల్ని వదిలి ఎక్కడికెళ్లారు? ఇప్పుడు నాకు, అన్నయ్యకు దిక్కెవరు? నా పుట్టిన రోజును ఎవరు జరుపుతారు? – శ్రీసత్యసాయి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అమ్మానాన్న, నానమ్మను కోల్పోయి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారికి మాటలొస్తే తన ఆవేదనకు అక్షర రూపమిది.. -
పుట్టపర్తి వైభవం.. ఖండాంతరం!
పుట్టపర్తి అర్బన్: నాలుగు దశాబ్దాల క్రితం పది పూరి గుడిసెలతో ఉన్న కుగ్రామం నేడు బహుళ అంతస్తులకు కేంద్రీకృతమైంది. ఒకప్పడు రోడ్డు పక్కన కర్ణాటకలోని బాగేపల్లి నుంచి వచ్చే ఆర్టీసీ బస్సు కోసం గంటల తరబడి వేచి చూసిన జనం.. నేడు కేవలం గంటల వ్యవధిలోనే ప్రపంచంలోని ఏ ప్రాంతానికైనా విమానంలో చేరుకునేలా ఏర్పాటైన విమానాశ్రయాన్ని చూస్తున్నారు. కుగ్రామం నుంచి జిల్లా కేంద్రంగా ఎదిగిన పుట్టపర్తి ప్రస్థానంపై సత్యసాయి జయంత్యుత్సవాలను పురస్కరించుకుని ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. నాటి గొల్లపల్లే.. నేటి పుట్టపర్తి.. పుట్టపర్తి ఆవిర్భావం వెనుక పురాణ కథను స్థానికులు నేటికీ గుర్తు చేస్తుంటారు. ‘కులాలు, వర్ణాల వారీగా కమ్మవారిపల్లి, బ్రాహ్మణపల్లి, కర్ణాటక నుంచి వచ్చి చిత్రావతి నది ఒడ్డున స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న ఆ ప్రాంతంలో పది ఇళ్లు మాత్రమే ఉండేవి. గొల్ల సామాజిక వర్గానికి చెందిన వారు ఎక్కువగా ఉండడంతో ఆ ప్రాంతానికి గొల్లపల్లి అని పిలుచుకునేవారు. జీవనం కోసం ఎక్కువగా గోవులను పెంచేవారు. ఓ ఆవు పాలు ఇవ్వకుండా మొరాయిస్తుండడంతో దాని యజమాని నిఘా ఉంచాడు. ఓ మధ్యాహ్న సమయంలో ఆవు పుట్ట వద్దకెళ్లి నిల్చోన్నప్పుడు పొదుగు నుంచి పాలు పుట్టలోకి ధారాపాతంగా కారుతుండడం గమనించాడు. ఇది గమనించిన యజమాని బండరాయితో ఆవును కొట్టబోగా అది తప్పించుకుంది. అదే సమయంలో పుట్టలోని నుంచి వెలుపలకు వచ్చిన పాముకు బండరాయి తగిలి చనిపోతూ గొల్లపల్లి పుట్టల మయంగా మారుతుందని, పాడి పశువులు కనుమరుగవుతాయని శపించింది. విషయాన్ని తెలుసుకున్న గ్రామస్తులు శాప విమోచనం కోసం పుట్ట ఉన్న ప్రాంతంలో పూజలు నిర్వహించి వేణుగోపాల స్వామి ఆలయాన్ని నిర్మించారు’. అలా గొల్లపల్లి కాస్త పుట్టపర్తిగా రూపాంతరం చెందింది. సత్యసాయి ఆవిర్భావంతో మహర్దశ.. గొల్లపల్లిలో 1926 నవంబర్ 23వ తేదీన పెద్ద వెంకమరాజు, ఈశ్వరమ్మ దంపతులకు జన్మించిన సత్యనారాయణ.. 1940 అక్టోబర్‌లో అవతార ప్రకటనతో సత్యసాయిగా మారారు. ఎన్నో అద్భుతాలు ప్రదర్శిస్తూ ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. దీంతో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలి వస్తున్న భక్తుల సౌకర్యార్థం 1948లో ప్రశాంతి నిలయానికి సత్యసాయి శంకుస్థాపన చేశారు. 1950 నవంబర్ 23 నాటికి ప్రశాంతి నిలయం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది. అక్కడే పూర్ణచంద్ర ఆడిటోరియం నిర్మించి అన్ని కార్యకలాపాలు నిర్వహించేవారు. సత్యసాయిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుండడంతో ఇక్కడి ప్రజల జీవన స్థితిగతులు మారాయి. వచ్చే భక్తులకు విడిది, ఇతర సౌకర్యాల కల్పనలో భాగంగా గ్రామ పరిధి విస్తరించింది. దీంతో 1964లో పంచాయతీగా పుట్టపర్తి మారింది. అనంతరం పుట్టపర్తి, కొత్తచెరువు, బుక్కపట్నం మండలాలను కలుపుతూ 1980 నవంబర్‌లో సత్యసాయి తాలూకాను ఏర్పాటు చేశారు. సత్యసాయి సేవా కార్యక్రమాల్లో భాగంగా విద్యాభివృద్ధి కోసం 1981లో డీమ్డ్ యూనివర్సిటీని స్థాపించారు. 1984లో నిర్మాణ పనులు చేపట్టి 1991లో అన్ని రకాల సదుపాయాలతో సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని అందుబాటులోకి తీసుకువచ్చారు. మారుతున్న కాలానికి అనుగుణంగా 1990లో ఆర్టీసీ బస్టాండ్, 1991 నవంబర్‌లో సత్యసాయి విమానాశ్రయం, 2000 నవంబర్‌లో ప్రశాంతినిలయం రైల్వే స్టేషన్‌ను ప్రారంభించారు. 1995 జూలైలో సత్యసాయి తాగునీటి పథకాన్ని ప్రారంభించి అప్పట్లో 771 గ్రామాలకు మంచినీటిని సరఫరా చేశారు. 1995 జూలైలో సాయికుల్వంత్ మంటపాన్ని నిర్మించారు. అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం పంచాయతీని 1980లో సమితిగాను, 2006 ఆగస్టులో మేజర్ పంచాయతీగా, 2011 ఆగస్టులో నగర పంచాయతీగా, 1991లో పుట్టపర్తి అర్బన్ డెవలప్మెంట్(పుడా)గా అనంతరం 2009లో అసెంబ్లీ నియోజకవర్గం కేంద్రంగా రూపాంతరం చెందుతూ వచ్చింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది జిల్లా కేంద్రంగా ఆవిర్భవించింది. (చదవండి: మూడు రాజధానులకు మద్దతుగా సత్యాగ్రహ దీక్ష) -
జేసీ మనుషులమంటూ దౌర్జన్యం
చిలమత్తూరు(శ్రీసత్యసాయి జిల్లా): తాము జేసీ ప్రభాకరరెడ్డి మనుషులమని, తమను ప్రశ్నించినా... చర్యలను అడ్డుకున్నా పరిస్థితి తీవ్రంగా ఉంటుందని కర్ణాటక ప్రాంతానికి చెందిన కొందరు దౌర్జన్యానికి దిగారు. వివరాలు... రాష్ట్రంలో ప్రభుత్వ భవన నిర్మాణాలకు సరఫరా చేసిన సిమెంట్ కర్ణాటకకు యథేచ్ఛగా తరలిపోతోంది. వందలాది సిమెంట్ బస్తాలు కర్ణాటక ప్రాంతంలోని ప్రైవేట్ భవన నిర్మాణాలకు వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం ఉదయం బాగేపల్లిలో ప్రైవేట్ భవన నిర్మాణానికి ఏపీ ప్రభుత్వ సిమెంట్ వినియోగిస్తున్నట్లుగా సమాచారం అందుకున్న చిలమత్తూరు మండల అధికారులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఆ సమయంలో అక్కడి వారు అధికారులను అడ్డుకున్నారు. ఫొటోలు డెలిట్ చేయాలని బలవంతం చేశారు. తాము తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకరరెడ్డి మనుషులమని, తాము తలుచుకుంటే అక్కడి నుంచి అడుగు కూడా పక్కకు వేయలేరంటూ బెదిరింపులకు దిగారు. అవసరమైతే జేసీ ప్రభాకరరెడ్డితో ఫోన్లో మాట్లాడిస్తామంటూ దౌర్జన్యానికి దిగారు. విచారణలు, దర్యాప్తులు ఏవైనా ఉంటే ఆంధ్రలో చూసుకోవాలని తమ ప్రాంతానికి వచ్చి ప్రశ్నిస్తే తిరిగి వెళ్లలేరంటూ హెచ్చరించడంతో మారు మాట్లాడకుండా అధికారులు వెనుదిరిగి వచ్చారు. ఈ విషయంగా చిలమత్తూరు ఎంపీడీఓ రామ్‌కుమార్‌ను వివరణ కోరగా... అక్కడ వినియోగిస్తున్న సిమెంట్ ఏపీ ప్రభుత్వం సరఫరా చేసిందేనని స్పష్టం చేశారు. అయితే అది చిలమత్తూరు మండలానికి సంబంధించినది కాదన్నారు. భవన యాజమాన్యం మాట్లాడిన తీరును బట్టి అది కచ్చితంగా అనంతపురం జిల్లా నుంచే సరఫరా అయినట్లుగా తెలుస్తోందన్నారు. దీనిపై లోతైన విచారణ చేపడితే వాస్తవాలు వెలుగు చూస్తాయన్నారు. -
గుడిలోకెళ్లి గంట కొట్టిన ఎలుగుబంటి!.. 105 కిలోల బరువైన..
సాక్షి, సత్యసాయి జిల్లా (రొళ్ల): అర్ధరాత్రి ఆలయంలోకి చొరబడిన ఎలుగుబంటి ఆలయంలోని గంటను మోగించి అందరినీ ఆశ్చర్యపరిచింది. సీసీకెమెరా ఫుటేజీల్లో నిక్షిప్తమైన ఈ సమాచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వివరాలు... శ్రీసత్యసాయి జిల్లా రొళ్ల మండలంలోని జీరిగేపల్లిలో వెలసిన అమ్మాజీ ఆలయంలో సోమవారం రాత్రి పూజాదికాలు ముగించుకున్న తర్వాత అర్చకులు తాళం వేసి ఇళ్లకు వెళ్లిపోయారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఆలయంలోకి రెండు ఎలుగు బంట్లు ప్రవేశించాయి. అందులో ఒకటి నేరుగా గరుడ స్తంభం వద్ద ఏర్పాటు చేసిన 105 కిలోల బరువైన గంటకు కట్టిన తాడును నోటితో లాగేందుకు ప్రయత్నించింది. సాధ్యం కాకపోవడంతో ముందరి కాళ్లతో దానిని పట్టుకుని లాగి గంట మోగించి పక్కకు వైదొలిగింది. మంగళవారం ఉదయం ఆలయం తలుపులు తీసిన అర్చకులు సీసీ కెమెరా ఫుటేజీల్లో నిక్షిప్తమైన దృశ్యాలను చూసి అవాక్కయ్యారు. చదవండి: (ఇక కుప్పం పోలీసు సబ్‌డివిజన్.. విడుదలైన రాజపత్రం) -
సిరులు కురిపించే శ్రీగంధం.. ఎకరాకు రూ.3 కోట్ల వరకూ ఆదాయం! రైతు ఏమన్నారంటే..
Sagubadi- Sri Gandham(Sandalwood Cultivation): సాధారణ సీజనల్ పంటల సాగులో సమస్యలతో సతమతమైన రైతు తాళ్లపల్లి బయారెడ్డికి శ్రీగంధం సాగు గొప్ప భరోసాగా నిలిచింది. పొరుగు రాష్ట్రం కర్ణాటకలో విస్తారంగా సాగులో ఉన్న శ్రీగంధం తోటల గురించి తెలుసుకొని ఆసక్తి పెంచుకున్నారు. బెంగళూరులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఉడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఐడబ్ల్యూఎస్టి)’ శ్రీగంధం సాగు, నర్సరీ నిర్వహణ, మార్కెటింగ్ తదితర అంశాలపై 5 రోజులపాటు శిక్షణ ఇస్తోంది. 2018లో బయారెడ్డి శిక్షణ పొందారు. శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువు మండలం ఇరగంపల్లి వాస్తవ్యుడైన ఆయన తనకున్న 10 ఎకరాల పొలం (ఇసుక పాళ్లు ఎక్కువగా ఉండే ఎర్ర నేల)లో శ్రీగంధం సాగుకు శ్రీకారం చుట్టారు. ఐ.డబ్ల్యూ. ఎస్.టి.లోనే 3 వేల మొక్కలను కొనుగోలు చేసి పొలంలో నాటారు. ఎకరాకు 300 చొప్పున పది ఎకరాల్లో 15“10 అడుగుల దూరంలో నాటారు. ఇతర చెట్ల వేర్లే ఆధారం శ్రీగంధం మొక్క వేర్లకు నేలలో నుంచి కొన్ని పోషకాలను నేరుగా తీసుకునే శక్తి ఉండదు. అందువల్ల పక్కనే ఉండే ఇతర చెట్ల వేర్లపై ఆధారపడి శ్రీగంధం మొక్కల వేర్లు పోషకాలను తీసుకుంటూ ఉంటాయి. అందుకని, శ్రీగంధం సాగు చేసే రైతులు పక్కనే సరుగుడు, రోజ్ఉడ్ తదితర మొక్కల్ని కూడా నాటుకోవాలి. అయితే, శ్రీగంధం మొక్కలకు ఎండ సరిగ్గా తగిలేలా జాగ్రత్తపడాలి. బయారెడ్డి తన పదెకరాల్లో 300 సరుగుడు, 300 రోజ్ఉడ్ మొక్కల్ని సైతం నాటారు. ఒకటిన్నర ఇంచ్‌ల నీళ్లు వస్తున్న బోరుకు డ్రిప్పు అమర్చి పంటను సంరక్షించుకుంటున్నారు. ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తల ద్వారా సాగులో ఉన్న అనుమానాలను నివృత్తి చేసుకుంటున్నారు. తదనంతరం బయారెడ్డి శ్రీగంధం మొక్కల నర్సరీని నెలకొల్పారు. మూడేళ్ల కాలంలో ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర రైతులకు సుమారు 2.5 లక్షల శ్రీగంధం మొక్కలను అందిస్తూ రైతులకు నిరంతరం సలహాలు, సూచనలు అందిస్తున్నారు. ఫోన్ ద్వారానే గాక యూట్యూబ్ వీడియోల ద్వారా సలహాలు అందిస్తున్నారు. కంది, సరుగుడు, రోజ్ఉడ్... నల్లరేగడి, ఒండ్రు నేలలు, నీరు నిల్వ ఉండే భూములు, చౌడు నేలలు తప్ప ఏ ఇతర నేలల్లో అయినా శ్రీగంధం తోట నాటుకోవచ్చు. శ్రీగంధం మొక్కలతో పాటు విధిగా కంది, సరుగుడు, రోజ్ఉడ్ మొక్కలను నాటుకోవాలి, శ్రీగంధం మొక్కకు వరసలో రెండు వైపులా 1–1,5 అడుగుల దూరంలో కంది మొక్కలు నాటాలి. 3–5 అడుగుల దూరంలో సరుగుడు, 7.5–8 అడుగుల దూరంలో రోజ్ఉడ్ మొక్కల్ని నాటుకోవాలి. ఈ మొక్కల వేళ్లపై ఆధారపడి శ్రీగంధం మొక్కలు ఏపుగా పెరుగుతాయి. కరివేపాకు, అవిశ, కానుగ, సర్కారు తుమ్మ మొక్కల్ని కూడా హోస్ట్ ప్లాంట్లుగా నాటుకోవచ్చు. అయితే, ఈ రకాలను పెంచడం ద్వారా రైతుకు అంతగా ఆదాయం రాదు. కాబట్టి సరుగుడు, రోజ్ఉడ్ మొక్కల్ని నాటుతున్నట్లు బయారెడ్డి వివరించారు. మామిడి, సపోట, నేరేడు వంటి తోటల్లోనూ ఎప్పటిప్పుడు ప్రూనింగ్ చేసుకునే పరిస్థితి ఉంటే శ్రీగంధం మొక్కలు నాటుకోవచ్చన్నారు. ఎన్ని రకాల మొక్కలు, పంటలనైనా అంతర పంటలుగా వేసుకోవచ్చని, అయితే శ్రీగంధం మొక్కలపై నీడ పడకుండా ఉండేలా చూసుకోవటం ముఖ్యమని ఆయన అంటున్నారు. 12–15 ఏళ్లకు భారీగా ఆదాయం మొక్కల మధ్య 10 అడుగులు, వరుసల మధ్య 15 అడుగుల దూరం ఉండాలి, మూడేళ్ల పాటు నీటి తడులు అందిస్తూ సంరక్షించుకోవాలి. అప్పుడప్పుడూ సేంద్రియ ఎరువులు వేస్తే చాలని బయారెడ్డి అంటున్నారు. మూడేళ్ల తరువాత నీటి తడులు అవసరం లేదన్నారు. శ్రీగంధం పక్కన ఉండే చెట్ల వేర్లపై ఆధారపడి పోషకాలను గ్రహిస్తూ ఉంటాయి. 20 అడుగుల ఎత్తు వరకూ పెరుగుతాయి. 12 నుంచి 15 ఏళ్లకు చేవదేలి కోతకు వస్తాయన్నారు. ఒక్కో చెట్టును సగటున కనీసం 15–20 కిలోల చేవగల శ్రీగంధం చెక్క వస్తుంది. ఎకరాకు రూ.3 కోట్ల వరకూ ఆదాయం! ప్రస్తుత మార్కెట్లో కిలో రూ.6 వేల నుండి రూ.12 వేల ధర పలుకుతోందని బయారెడ్డి తెలిపారు. ఈ లెక్కన ఒక్కో చెట్టుకు కనీసం రూ.ఒక లక్ష వరకూ ఆదాయం వస్తుందన్నారు. దీంతో ఒక ఎకరాకు రూ.3 కోట్ల వరకూ ఆదాయం వస్తుందని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. దొంగల బెడద అయితే, ఖరీదైన చెట్లు కావడంతో ముదురు తోటలకు దొంగల బెడద అధికంగా ఉంటుంది. చెట్టుకు ఆరేళ్లు దాటిన తరువాత అక్కడక్కడా సీసీ కెమెరాలు అమర్చుకొని కాపాడుకోవాలన్నారు. శ్రీగంధం చెట్ల మద్య ఇతర పంటలను సాగు చేసుకోవచ్చన్నారు. శ్రీగంధం చెట్టుకు కొమ్మలను కత్తిరించకూడదన్నారు. మొదలుకు ఎండ అధికంగా తగలకుండా రక్షించుకుంటే మొక్క ఏపుగా పెరుగుతుందన్నారు. ఎటువంటి చీడపీడల బాధ ఉండదన్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా తదితర దేశాల నుంచి శ్రీగంధం చెక్కలను మన దేశం ఏటా వేల టన్నులు దిగుమతి చేసుకుంటున్నందున మార్కెటింగ్ సమస్య లేదన్నారు. బయారెడ్డి తోటను ఇటీవల సందర్శించిన ఐ.డబ్ల్యూ.ఎస్.టి. సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఆర్.సుందరరాజ్ సంతృప్తిని వ్యక్తం చేశారు. మన శ్రీగంధం అత్యుత్తమమైనది అత్యంత ఖరీదైన కలప జాతుల్లో రెండోది శ్రీగంధం. 17 శ్రీగంధం జాతుల్లోకెల్లా శాంటాలం ఆల్బం అనే భారతీయ జాతి శ్రీగంధం అత్యుత్తమమైనది. 1965లో 2,680 టన్నుల శ్రీగంధం తైలాన్ని ఎగుమతి చేసిన మన దేశం ఇప్పుడు వేల టన్నుల్ని ఆస్ట్రేలియా నుంచి దిగుమతి చేసుకుంటున్నది. ఆస్ట్రేలియా 30 ఏళ్ల క్రితం మన జాతి శ్రీగంధం విత్తనాలను తీసుకెళ్లి వేలాది ఎకరాల్లో సాగు చేస్తోంది. అటవీ జాతి అయిన శ్రీగంధం చెట్లను పొలాల్లో సాగు చేయటంపై 2006లో ఆం«క్షలు తొలగిపోయాయి. 2010 నుంచి మా సంస్థ సాగుపై రైతులకు శిక్షణ ఇస్తోంది. రైతుల పొలాల్లో 15 ఏళ్లు పెరిగిన చెట్టు నుంచి 12 కిలోల చావదేలిన చెక్క వస్తుంది. దీని నుంచి 6% నూనె వస్తుంది. కిలో చావదేలిన చెక్క ఖరీదు రూ. 12,500 ఉంది. శ్రీగంధం నూనె ప్రయోజనాలెన్నో ఉన్నాయి. కేన్సర్ మందుల్లోనూ వాడుతున్నారు. మార్కెట్ ధర పెరగడమే గానీ తగ్గటం ఉండదు. రైతులు శ్రీగంధం మొక్కల్ని ఇతర పంటలతో కలిపి సాగు చేసుకోవచ్చు. – డాక్టర్ ఆర్.సుందరరాజ్. (97404 33959), సీనియర్ శాస్త్రవేత్త, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఉడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, బెంగళూరు శ్రీగంధం తోటలకు బీమా కల్పించాలి ప్రభుత్వం ఉద్యాన తోటలతో సమానంగా శ్రీగంధం సాగుకు రాయితీలు కల్పించి, డ్రిప్‌ను సబ్సిడీపై ఇచ్చి, బీమా సదుపాయం కల్పించి ప్రోత్సహించాలి. శ్రీగంధం చెట్లు కోతకు వచ్చినప్పుడు ఎకరానికి రూ. 4 లక్షల వరకు ప్రభుత్వానికి పన్ను రూపంలో ఆదాయం వస్తుంది. పర్యావరణ పరిరక్షణతో పాటు జీవవైవిధ్యం, పచ్చదనం పెంపుదలకు శ్రీగంధం సాగు దోహదపడుతుంది. సీజనల్ పంటలు, పాడిపై ఆదాయం ద్వారా జీవనం సాగించే చిన్న, సన్నకారు రైతులు కొన్ని శ్రీగంధం మొక్కలు పెంచుకుంటే భవిష్యత్తు బాగుంటుంది. తమకున్నది ఎకరం పొలం అయినా 10 సెంట్లలో 30 శ్రీగంధం మొక్కలు నాటుకుంటే 15 ఏళ్లకు ఒకేసారి మంచి ఆదాయం వస్తుంది. – తాళ్లపల్లి బయారెడ్డి, (94400 16995), శ్రీగంధం రైతు, ఇరగంపల్లి, కొత్తచెరువు మండలం, శ్రీసత్యసాయి జిల్లా – జి.కేశవరెడ్డి, పుట్టపర్తి అర్బన్ చదవండి: 18 ఎకరాలు: బత్తాయి, వరి, సీతాఫలం సాగు.. బియ్యం కిలో రూ. 80 చొప్పున! 450 రకాల మొక్కలు.. ఇంకా Bio Fence: వారెవ్వా.. అప్పుడు ఖర్చు 40 వేలు.. ఇప్పుడు 1500.. కోతుల బెడద లేదు! కాకర, చిక్కుడు.. అదనపు ఆదాయం కూడా.. -
అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలో భారీ వర్షాలు
-
శ్రీ సత్యసాయి జిల్లా : సంధ్యారాణి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి ఉషశ్రీ చరణ్
-
కీచక టీడీపీ నేత రాళ్లపల్లి ఇంతియాజ్ అరెస్టు
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: కీచక టీడీపీ నేత రాళ్లపల్లి ఇంతియాజ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. ఇంతియాజ్ లైంగిక వేధింపులు తాళలేక ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఇంతియాజ్‌పై 306, 506 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో కీలక పురోగతి ప్రేమించకపోతే నీ ఫొటోలు మార్ఫింగ్ చేసి ఫేస్బుక్లో పెడతానని బెదిరించడంతో భయపడిపోయిన ఓ ఇంటర్ విద్యార్థిని ఉరి వేసుకుంది. టీడీపీ నాయకుడి బెదిరింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ బలవన్మరణానికి ముందు సెల్ఫీ వీడియోలో చెప్పింది. శ్రీసత్యసాయి జిల్లా తనకల్లు మండలం ఎర్రబల్లిలో బుధవారం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఎర్రబల్లికి చెందిన కురుబ శ్రీనివాసులు, రాధమ్మ దంపతుల ఏకైక కుమార్తె సంధ్యారాణి(17). అన్నమయ్య జిల్లా మొలకలచెరువులోని మెడల్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. అయితే టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ కందికుంట వెంకటప్రసాద్ అనుచరుడైన నల్లచెరువుకు చెందిన తెలుగు యువత మండల ప్రధాన కార్యదర్శి రాళ్లపల్లి ఇంతియాజ్.. ఫేస్బుక్లో సంధ్యారాణితో పరిచయం పెంచుకున్నాడు. ఆ తర్వాత ప్రేమించాలంటూ వేధించడం మొదలెట్టాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో ఎర్రబల్లికి వెళ్లి వారి తల్లిదండ్రుల సమక్షంలోనే తనని ప్రేమించాలంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇటీవల సంధ్యారాణి తల్లిదండ్రులతో కలిసి పాలపాటిదిన్నె ఆంజనేయస్వామి గుడి వద్దకు వెళ్లగా.. అక్కడికీ వచ్చి మరీ వేధించాడు. తనను ప్రేమించకుంటే ఫొటోలు మార్ఫింగ్ చేసి ఫేస్బుక్లో పెడతానంటూ బెదిరించాడు. దీంతో సంధ్యారాణి తీవ్ర భయాందోళలనకు లోనైంది. ఈ క్రమంలోనే దసరా సెలవులకు ఇంటికొచ్చిన సంధ్యారాణి బుధవారం తెల్లవారుజామున ఇంట్లో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. -
టీడీపీ నేత లైంగిక వేధింపులు: బాలిక సెల్ఫీ వీడియో.. బయటపడ్డ షాకింగ్ నిజాలు
సాక్షి, కదిరి (శ్రీసత్యసాయి జిల్లా): టీడీపీ నేత లైంగిక వేధింపులకు ఓ బాలిక బలైంది. కదిరి నియోజకవర్గం తనకల్లు మండలం ఎర్రబెల్లి గ్రామంలో బాలిక ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఫేస్ బుక్ ద్వారా పరిచయం చేసుకున్న టీడీపీ నేత రాళ్లపల్లి ఇంతియాజ్ తనను లైంగికగా వేధించాడని, ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియోలో బాలిక తెలిపింది. చదవండి: డేటింగ్ యాప్‌కు బానిసగా వైద్యుడు.. రూ.1.53 కోట్లు కొట్టేశారు ప్రేమ పేరుతో బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఇంతియాజ్.. చెప్పినట్లు చేయకపోతే మార్ఫింగ్ ఫోటోలు ఆన్లైన్లో ఉంచుతానని బెదిరింపులకు దిగాడు. దీంతో వేధింపులు తట్టుకోలేక బాలిక ఆత్మహత్య చేసుకుంది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కదిరి రూరల్ పోలీసులు సమగ్ర విచారణ చేపట్టారు. -
అరే ఏంట్రాఇది.. ఏకంగా పోలీసు వాహనాన్నే..
సాక్షి, అమరాపురం (సత్యసాయి జిల్లా): ఓ వ్యక్తి ఏకంగా పోలీసు వాహనాన్నే ఎత్తుకెళ్లాడు. చాలా దూరం వెళ్లి ఓ చెట్టును ఢీకొన్నాడు. సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు సదరు వ్యక్తి మతిస్థిమితం లేని వ్యక్తి అని తెలిసి అవాక్కయ్యారు. అమరాపురంలో సోమవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. కుందుర్పి మండలం వడ్డేపాళ్యం గ్రామానికి చెందిన రామన్న కుమారుడు నవీన్‌కుమార్ సోమవారం ఉదయం అమరాపురం పోలీస్‌స్టేషన్‌కు వచ్చాడు. పరిసరాల్లో నిలిపి ఉంచిన పోలీసు జీపులో తాళం కూడా ఉండడంతో వేసుకుని వెళ్లిపోయాడు. మండలంలోని వలస సమీపంలో ఓ చింతచెట్టుకు ఢీ కొట్టాడు. అక్కడున్న వారు వెంటనే 108 వాహనానికి సమాచారం అందించగా, వారు వచ్చి నవీన్‌కుమార్‌ను ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకొచ్చారు. పరీక్షించిన వైద్యులు సదరు వ్యక్తికి మతిస్థిమితం లేదని తెలిపారు. పోలీసులు నవీన్‌కుమార్‌ను తీసుకెళ్లారు. పోలీసు వాహనాన్ని ఓ వ్యక్తి ఎత్తుకెళ్లాడన్న విషయం చర్చనీయాంశమైంది. చదవండి: (కారు డ్రైవర్‌కు మద్యం తాగించి.. ఈ జంట చేసిన పనికి షాక్ అవ్వాల్సిందే) -
Plastic: అంతం కావాలంటే పంతం కొనసాగాలి
ప్లాస్టిక్ వాడకం తగ్గించి భయంకర జబ్బులను నియంత్రించే దిశగా జూలై ఒకటో తేదీన ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా అధికారులు అడుగులు వేశారు. కానీ రెండు మాసాలు కూడా గడవక ముందే అధికారులు శ్రద్ధ తగ్గించారు. దీంతో మున్సిపాలిటీల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు మళ్లీ యథాతథంగా పెరిగాయి. ప్లాస్టిక్ వ్యర్థాలకు చిరునామాగా నిలిచిన అనంతపురం నగరపాలక సంస్థలో జూలై నెలకు ముందు ఎంత ఉత్పత్తి అయ్యేవో అంత కంటే ఎక్కువగా ఆగస్టులో పెరిగాయి. దీన్ని బట్టి ప్లాస్టిక్ అంతం కోసం అధికారులు దూకుడు కొనసాగించాల్సిన అవసరం కనిపిస్తోంది. సాక్షి ప్రతినిధి, అనంతపురం: అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో ఒక కార్పొరేషన్, ఎనిమిది మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇక్కడే ఎక్కువగా ప్లాస్టిక్ వినియోగం జరిగేది. ఈ ఏడాది జూలై ఒకటో తేదీకి ముందు నెలకు సగటున 28.5 టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అయ్యేవి. జూలై ఒకటి తర్వాత అధికారులు ప్లాస్టిక్ నియంత్రణ కోసం విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. దీంతో ఆ మాసంలో ఐదు టన్నుల వరకు ప్లాస్టిక్ వ్యర్థాలు తగ్గాయి. అనంతపురంలో టన్నులకొద్దీ... అనంతపురం కార్పొరేషన్ పరిధిలో మరీ దారుణంగా ఉంది. నియంత్రణ చర్యలు తీసుకోకమునుపు నెలకు 12 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తయ్యేవి. జూలైలో రెండు టన్నులు తగ్గి 10 టన్నులకు చేరింది. అధికారులు తనిఖీలు తగ్గించడంతో ఆగస్టులో గతం కంటే ఎక్కువగా 14 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు పెరిగాయి. ముఖ్యంగా అనంతపురం పాతూరులోని హోల్‌సేల్ దుకాణాల నుంచి టన్నుల కొద్దీ ప్లాస్టిక్ కవర్లు, కప్పులు ఇలా రకరకాల వస్తువులు ఇతర మున్సిపాలిటీలకు సరఫరా అవుతున్నాయి. చిన్న చిన్న షాపులు మొదలుకొని పెద్ద హోటళ్ల వరకూ మళ్లీ ప్లాస్టిక్ ఉత్పత్తులు వాడుతున్నారు. మున్సిపల్ అధికారుల తనిఖీలు తగ్గడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. అధికారులు దాడులు చేస్తేనే నియంత్రణలోకి రాదని, ప్లాస్టిక్‌పై ప్రజలు కూడా ఆలోచించి వాడకాన్ని తగ్గిస్తేనే ఫలితం ఉంటుందని నిపుణులు అంటున్నారు. ప్రజల్లోనూ మార్పు రావాలి అధికారులు చర్యలు తీసుకోవడంతో పాటు ప్లాస్టిక్ వాడకంతో కలిగే నష్టాలపై ప్రజలూ ఆలోచించాలి. అత్యంత భయంకర జబ్బులకు మూలమైన ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడంలో ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు రావాలి. అందరిలో మార్పు వస్తేనే ప్లాస్టిక్ వినియోగ నియంత్రణ సాధ్యం. – శంకర్రావు, పర్యావరణ ఇంజినీర్, కాలుష్యనియంత్రణ మండలి స్పెషల్ డ్రైవ్ చేపడతాం ప్లాస్టిక్ నివారణ చర్యల్లో భాగంగా మళ్లీ స్పెషల్ డ్రైవ్ చేపడతాం. ఇప్పటికే శానిటేషన్ కార్యదర్శులు వారి పరిధిలోని వ్యాపార సముదాయాల్లో రోజూవారీ తనిఖీలు చేయాలని ఆదేశాలు జారీ చేశాం. నిబంధనలకు విరుద్ధంగా ప్లాస్టిక్‌ను వినియోగిస్తే..అపరాధ రుసుం వసూలు చేస్తాం. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత. ప్రజలు సైతం సామాజిక బాధ్యతగా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేయాలి. – కె.భాగ్యలక్ష్మి, కమిషనర్, అనంతపురం నగరపాలక సంస్థ -
దొంగల హల్చల్: పాడి పశువులే టార్గెట్
ఓడీ చెరువు మండలం దాదిరెడ్డిపల్లికి చెందిన రైతు హనుమంతరెడ్డి రెండు రోజుల క్రితం తన కాడెద్దులు, రెండు పాడి ఆవులను ఇంటి పక్కనే ఉన్న పశువుల పాకలో కట్టేసి నిద్రపోయాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఇద్దరు యువకులు పాకలో చొరబడి ఆవులను, కుర్రలను తోలుకెళ్లారు. సీసీ ఫుటేజీల్లో చోరీ ఘటన స్పష్టంగా రికారై్డంది. దీనిపై బాధిత రైతు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అపహరణకు గురైన పశువుల విలువ దాదాపు రూ.2 లక్షలు ఉంటుంది. పెనుకొండ పట్టణం గోనిపేట ప్రాంతంలో నివసించే గొల్ల నాగేంద్ర, బోయ వెంకటేష్ నాలుగు పాడి ఆవులను మేపుకుంటూ, వచ్చే పాలను అమ్ముకుని కుటుంబాలను పోషించుకుంటున్నారు. జూలై 21 రాత్రి వీరి పశువుల పాకలోకి చొరబడిన దుండగులు పాడి ఆవులను ఎత్తుకెళ్లిపోయారు. కత్తులతో తాళ్లను తెగ్గోసి పశువులను అపహరించుకెళ్లారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటికీ దొంగలను పట్టుకోలేకపోయారు. పెనుకొండ: శ్రీసత్యసాయి జిల్లాలో పశువుల దొంగలు హల్చల్ చేస్తున్నారు. లక్షల రూపాయల విలువ చేసే పాడి ఆవులను ఎత్తుకెళ్లిపోతున్నారు. ఒక్క పెనుకొండ నియోజకవర్గంలోనే గడచిన 40 రోజుల్లో 20కి పైగా పశువులు అపహరణకు గురయ్యాయి. గోరంట్ల మండలం మల్లాపల్లిలో రూ. లక్ష విలువజేసే ఎద్దులు, పెనుకొండ మండలం తిమ్మాపురంలో రమేష్ అనే వ్యక్తికి చెందిన 4 పాడి ఆవులు, సమీపంలోనే రాంపురం వద్ద షిర్డీసాయి గ్లోబల్ ట్రస్ట్‌కు చెందిన 3 పాడి ఆవులు, సోమందేపల్లిలో శనివారం రాత్రి పోలీస్‌స్టేషన్‌కు సమీపంలోనే నివాసముంటున్న పాడి రైతు వెంకటేశులుకు చెందిన 3 పాడి ఆవులు, నలగొండ్రాయనిపల్లిలో కంబాలరాయు డికి చెందిన 3 ఆవులను దుండుగులు ఎత్తుకెళ్లారు. చోద్యం చూస్తున్న పోలీసులు వరుస చోరీలతో పశువుల దొంగలు బెంబేలెత్తిస్తున్నా పోలీసులు ఏమీ చేయలేకపోతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసి చేతులు దులిపేసుకుంటున్నారు. చోరీ జరిగిన రెండు మూడు రోజులు సీసీ కెమెరాలు పరిశీలించడం, గస్తీ పెంచామంటూ హంగామా చేసి తర్వాత మిన్నకుండిపోతున్నారు. బాధితులు మాత్రం నిత్యం కాళ్లరిగేలా పోలీసుస్టేషన్ల చుట్టూ తిరిగి చివరకు లాభం లేదని తెలుసుకుని లోలోనే కుమిలిపోతున్నారు. పాడి రైతుకు పెద్ద దెబ్బ రైతన్నలు వ్యవసాయంతో పాటు పాడి పెంపకంపై ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రభుత్వం కూడా సహకరిస్తుండడంతో బయటి నుంచి కొంత మొత్తం అప్పుగా తీసుకొచ్చి పశువులు కొనుగోలు చేస్తున్నారు. పాల ఆదాయంతో కుటుంబం మొత్తాన్ని పోషించుకుంటున్నారు. ఎన్నో ఆశలతో రూ.లక్షలు పెట్టి తీసుకొచ్చిన జీవాలను దొంగలు పట్టుకెళ్లిపోతుండడంతో వారి ఆవేదన అంతా ఇంతా కాదు. దుండగులు రెచ్చిపోతుండడంతో జిల్లాలో పశువుల పెంపకందారులకు కంటిమీద కునుకులేని పరిస్థితి. సీసీ కెమెరాలున్నా ఫలితం శూన్యం అసాంఘిక కార్యకలాపాల కట్టడికంటూ పోలీసులు అక్కడక్కడా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. రూ. వేలతో ఏర్పాటు చేసిన కెమెరాలు కొన్నిచోట్ల నేలచూపులు చూస్తున్నాయి. మరికొన్నిచోట్ల పర్యవేక్షణ లేని దుస్థితి. దీంతో దుండగులు సులువుగా తమ పని చేసుకుపోతున్నారు. చేతుల్లో కత్తులు పెట్టుకుని యథేచ్ఛగా సంచరిస్తున్నారు. ఏకంగా గ్రామాల సమీపాల్లోకి వాహనాలు తీసుకొచ్చి చోరీ చేసిన పశువులను ఎత్తుకెళ్లిపోతున్నారు. నలగొండ్రాయనిపల్లిలో కళ్లెదుటే ఆవుల తాళ్లు విప్పుతున్నా దొంగల చేతుల్లో ఉన్న కత్తులను చూసి ప్రాణభయంతో అక్కడ నిద్రిస్తున్న పాడి రైతు ఏమీ చేయలేని స్థితిలో ఉండిపోయినట్లు తెలిసింది. ఒక్కో పాడి ఆవు తక్కువలో తక్కువ రూ. 50 వేలు విలువ చేస్తుండడంతో దొంగలు ఎత్తుకెళ్లి భాఈగా సంపాదిస్తున్నారు. బిహార్ గ్యాంగ్‌గా అనుమానం పాడి పశువుల చోరీలకు పాల్పడుతున్న దుండగులు బిహార్ గ్యాంగ్‌గా పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక, ఆంధ్ర ప్రాంతాలకు చెందిన పలువురితో సంబంధాలు కలిగి ఉన్న ఈ నేరస్తులు ఆవులను ఎత్తుకెళుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో హిందూపురం, బాగేపల్లి, చిక్కబళాపురం, బెంగళూరుకు చెందిన పాత నేరస్తుల హస్తం ఉన్నట్లు సమాచారం. -
ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీలో అదే హాట్ హాట్ టాపిక్
ఆయన ఓ సీనియర్ పొలిటీషియన్. ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా పనిచేశారు. పన్నేండేళ్ల క్రితం నియోజకవర్గాల పునర్విభజనలో అసెంబ్లీ స్థానాన్ని కోల్పోయారు. ఆ నేత ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో తన భవిష్యత్తు కోసం ప్రశ్నార్థకంగా ఎదిరిచూస్తున్నారు. ఆయనే నిమ్మల కిష్టప్ప. ఉమ్మడి అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు. గోరంట్ల అసెంబ్లీ స్థానం నుంచి రెండుసార్లు విజయం సాధించిన నిమ్మల కిష్టప్ప చంద్రబాబునాయుడు క్యాబినెట్లో రెండుసార్లు మంత్రిగా పనిచేశారు. 2004 నిమ్మల కిష్టప్ప ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో గోరంట్ల అసెంబ్లీ నియోజకవర్గం రద్దయింది. దాని స్థానంలో పుట్టపర్తి నియోజకవర్గం ఏర్పడింది. గోరంట్ల మండలం పెనుకొండ నియోజకవర్గంలో కలిసిపోయింది. దీంతో నిమ్మల కిష్టప్ప హిందూపురం పార్లమెంటుకు షిప్ట్ అయ్యారు. హిందూపురం నుంచి ఎంపీగా ఒకసారి విజయం సాధించారు. ఆ తర్వాత పుట్టపర్తి లేదా పెనుకొండ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేద్దామనుకున్నా ఉపయోగం లేకుండా పోయింది. అసెంబ్లీకి వెళ్ళడానికి వీలు లేకపోయినా... మళ్ళీ హిందూపురం పార్లమెంటు స్థానం నుంచే పోటీ చేద్దామని అనుకుంటున్నారు. మారిన పరిస్థితుల్లో ఇప్పుడు అదీ దక్కే పరిస్థితులు కనిపించడంలేదు. వచ్చే ఎన్నికల్లో హిందూపురం ఎంపీ టిక్కెట్ నిమ్మల కిష్టప్పకు ఇవ్వకూడదని చంద్రబాబు నిర్ణయించినట్లు ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీలో హాట్ హాట్‌గా చర్చ జరుగుతోంది. నిమ్మల కిష్టప్ప స్థానంలో మరో బీసీ నేతకు ఇక్కడ అవకాశం కల్పించాలని టీడీపీ నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే నిమ్మల కిష్టప్పకు టిక్కట్ ఉండదన్న సంకేతాలు ఇచ్చినట్లు టీడీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో అధిష్టానం వైఖరిపై నిమ్మల కిష్టప్ప గుర్రుగా ఉన్నట్లు సమాచారం. పార్టీలో అత్యంత సీనియర్ అయిన తనకే టిక్కెట్ ఇవ్వకపోతే ఎలా అని నిమ్మల కిష్టప్ప సన్నిహితుల వద్ద వాపోయినట్లు తెలుస్తోంది. తనకు టిక్కెట్ దక్కకపోతే తన సామాజిక వర్గమైన నేతన్నలు తెలుగుదేశం పార్టీకి దూరమవటం ఖాయమని కిష్టప్ప స్పష్టం చేస్తున్నట్లు చెబుతున్నారు. ఒకవేళ ప్రచారం జరుగుతున్నట్లుగా టిక్కెట్ ఇవ్వకపోతే తెలుగుదేశం పార్టీని ఏవిధంగా దెబ్బతీయాలి. ప్రతీకారం ఎలా తీర్చుకోవాలన్న దానిపై ఇప్పటికే నిమ్మల కిష్టప్ప వ్యూహ ప్రతివ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నట్లు ఉమ్మడి అనంతపురం జిల్లా పచ్చ పార్టీలో చర్చ జరుగుతోంది. -
విజయానికి షార్ట్ కట్స్ ఉండవు: ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి, సత్యసాయి జిల్లా: పిల్లల చదువు బాధ్యత నాదే అన్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. గోరంట్ల బెస్ట్ ఇన్నోవేషన్ ప్రైవేట్ వర్సిటీ స్నాతకోత్సవంలో ఆయనతో పాటు, బీజేపీ నేత రాంమాధవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, విద్య, వైద్య రంగాలకు సీఎం జగన్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. నవరత్నాలతో ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. చదవండి: మీ కెరీర్ మలుపు తిప్పే టర్నింగ్ పాయింట్.. నిజంగా ఇది గోల్డెన్ ఛాన్సే.. ‘‘పేదరికంతో ఏ ఒక్కరూ చదువుకు దూరం కాకూడదన్నదే సీఎం వైఎస్ జగన్ ఆశయం. విజయానికి షార్ట్ కట్స్ ఉండవు. కష్టపడితే సక్సెస్ సాధ్యం. ఇంటర్నెట్ యుగంలో విద్యార్థులకు అపార అవకాశాలు ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోవాలని’’ విజయసాయిరెడ్డి అన్నారు. -
పెన్నా నది పరవళ్లు.. సువర్ణముఖి చిందులు
సాక్షి, రామగిరి(శ్రీ సత్యసాయి జిల్లా): ఎగువ ప్రాంతం కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు పెన్నమ్మ పరవళ్లు తొక్కుతూ పేరూరు చేరింది. దీంతో డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంటుండటంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. ఇప్పటి వరకూ ఒకటిన్నర టీఎంసీ దిగువకు వదిలినా పేరూరు డ్యాంకు ఇన్‌ఫ్లో ఏమాత్రం తగ్గలేదని, అందుకే నీటిని ఏకధాటిగా వదలుతున్నట్లు డీఈ వెంకటరమణ తెలిపారు. భారీ వర్షాలతో మూడు దశాబ్దాల తర్వాత పేరూరు డ్యాం నిండుకుండను తలపించగా... గత నెలలో తొలిసారి పేరూరు డ్యాం గేట్లు ఎత్తారు. తాజాగా సోమవారం మరోసారి గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతుండగా.. ఈ సుందర దృశ్యాన్ని తిలకించేందుకు పలు గ్రామాల ప్రజలు డ్యాం వద్దకు వస్తున్నారు. సువర్ణముఖి చిందులు నాలుగు దశాబ్దాల తర్వాత తొలిసారి మరువ పారిన చెరువులు అగళి: 20 రోజులుగా కర్ణాటక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షానికి సువర్ణముఖి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద నీరు అగళి మండలంలోని మధూడి, ఇరిగేపల్లి, కోడిపల్లి, రావుడి, వడగుంటనపల్లి చెరువుల్లో చేరడంతో నాలుగు దశాబ్దాల తర్వాత అవన్నీ మరువ పారాయి. దీంతో స్థానికులు తండోపతండాలుగా వచ్చి మరువపారుతున్న ప్రాంతాల్లో జలకాలాటలు ఆడారు. (క్లిక్: ప్రాణం పోసుకుంటున్న నల్ల రాతి శిలలు!) -
శ్రీసత్యసాయి జిల్లా కదిరి ఎన్జీవో కాలనీలో ఉద్రిక్తత
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: సత్యసాయి జిల్లా కదిరి పట్టణం ఎన్జీవో కాలనీలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అనుచరులు దౌర్జన్యానికి దిగారు. ఎన్జీవో కాలనీలో ప్రజలు కొనుగోలు చేసిన భూమిలో జరుగుతున్న పనులను అడ్డుకున్నారు. ఆ భూమి తమదంటూ టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. అనంతరం జేసీబీని ధ్వంసం చేశారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళన కారులను చెదరగొట్టారు. చదవండి: (అనంతలో టీడీపీ నేతల దౌర్జన్య కాండ) -
వందేమాతరం నినాదాలతో హోరెత్తిన ‘శిరసాని హిల్స్’ పరేడ్
పుట్టపర్తి అర్బన్: ప్రతి హృదయమూ పులకించింది. దేశభక్తితో ఉప్పొంగిపోయింది. చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శన సందర్భంగా పుట్టపర్తి ‘శిరసాని హిల్స్’ పరేడ్ మైదానం వందేమాతర నినాదాలతో హోరెత్తింది. శ్రీసత్యసాయి జిల్లా నలుమూలల నుంచి విచ్చేసిన విద్యార్థులు స్వాతంత్య్ర దినోత్సవంలో ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆహూతులను అలరించాయి. చిన్నారులంతా త్రివర్ణపతాకం చేబూని దేశ భక్తి గీతాలకు నృత్యాలు చేస్తూ ఆకట్టుకున్నారు. వేదికపైన ఉన్న జిల్లా ఇన్చార్జ్ మంత్రి గుమ్మనూరు సహా ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు సుమారు గంట పాటు మైమరచిపోయి ప్రదర్శనలను వీక్షించారు. కార్యక్రమంలో గోరంట్లకు చెందిన ఉదయ్‌కిరణ్ పాఠశాల, శ్రీకృష్ణదేవరాయ జూనియర్ కళాశాల, వివేకానంద పాఠశాల, కేజీబీవీ పాఠశాల, ఎస్డీజీఎస్ కళాశాల హిందూపురం, కేజీబీవీ బుక్కపట్నం, గురుకుల పాఠశాల కొడిగిన హళ్లి, మోడల్‌స్కూల్ పుట్టపర్తి, శ్రీసత్యసాయి జిల్లా స్పోర్ట్స్ అథారిటీ తదితర పాఠశాలల విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ‘మా తుజే సలాం, జయహో.., దేశ్ మేరా రంగీలా.., ఎత్తర జెండా, పోరాట యోధుల త్యాగాలు.., దేశం మనదే..,వందేమాతరం.., మేమే ఇండియన్స్ తదితర పాటలతో హోరెత్తించారు. పిరమిడ్ యోగా విన్యాసాలు, ఆదివాసీ గిరిజన నృత్యాలతో అందరి ప్రశంసలు అందుకున్నారు. -
నేనెక్కడున్నా మీ వాడినే
మడకశిర రూరల్(శ్రీసత్యసాయి జిల్లా): ‘నేనెక్కడున్నా మీ వాడినే. నా పేరులోని ‘నీల్’ అంటే నీలకంఠాపురమే. ఇదే నా స్వగ్రామం. ఎక్కడున్నా మరచిపోను. నా చివరి మజిలీ తప్పకుండా నీలకంఠాపురమే ఉంటుంది’ అని కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ భావోద్వేగంతో వెల్లడించారు. సోమవారం ఆయన తన చిన్నాన్న, మాజీ మంత్రి రఘువీరారెడ్డితో కలిసి నీలంకంఠాపురం జెడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవంలో పాల్గొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం, తన తండ్రి జన్మదిన దినోత్సవం ఒకే రోజు కావడం తనకు ఎంతో ఆనందంగా ఉంటుందన్నారు. అనంతరం నీలకంఠేశ్వరస్వామి దేవాలయ సముదాయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అదే విధంగా తన తండ్రి సుభాష్ సమాధిని సందర్శించి నివాళులర్పించారు. ఆ తర్వాత స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో నిర్వహించిన ఎల్వీ ప్రసాద్ కంటి పరీక్ష కేంద్రాన్ని సందర్శించారు. ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి సహకారంతో ఈ ప్రాంతంలోని వారికి వైద్యసేవలందించేందుకు సహకారం అందిస్తామన్నారు. త్వరలోనే ఎన్టీఆర్‌తో సినిమా ప్రసుత్తం ప్రభాస్ హీరోగా ‘సలార్’ శరవేగంగా రూపుదిద్దుకుంటోందని, రానున్న ఏప్రిల్, లేదా మే నెలల్లో జూనియర్ ఎన్టీఆర్‌తో మరో భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు ప్రశాంత్ నీల్ వెల్లడించారు. కార్యక్రమంలో రఘువీరారెడ్డి కుటుంబ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే సుధాకర్, పలు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. -
Puttaparthi: ఆధ్యాత్మిక వైభవం.. పర్యాటక నందనం
సాక్షి, పుట్టపర్తి: శ్రీసత్యసాయి జిల్లా కేంద్రంగా ప్రకటించిన తర్వాత పుట్టపర్తి.. సాయి బాబా ఉన్నప్పటి రోజులను తలపిస్తోంది. గత కొన్ని రోజులుగా సాయిబాబా మందిరానికి భక్తుల తాకిడి ఎక్కువైంది. వివిధ పనులపై కలెక్టరేట్ తదితర ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే వారు.. మందిరానికి వెళ్లి సాయిబాబా సమాధి సందర్శిస్తున్నారు. కొన్ని రోజులుగా నిత్యం రెండు వేలకు మందికి పైగా ఇక్కడికి వస్తున్నారు. మందిరం లోపల నిర్వహిస్తున్న క్యాంటీన్ (తక్కువ ధరకే)కు ప్రతి పూట సుమారు వెయ్యి మంది భోజనానికి వస్తున్నట్లు రికార్డుల ద్వారా స్పష్టం అవుతోంది. మ్యూజియం, నక్షత్రశాల కిటకిట.. పుట్టపర్తిలోని చైతన్యజ్యోతి మ్యూజియం, నక్షత్ర శాల సందర్శించే వారి సంఖ్య కూడా పెరిగింది. సాయిబాబా మరణం తర్వాత చైతన్యజ్యోతి మ్యూజియం చూసేందుకు రోజుకు సరాసరి 200 మంది మాత్రమే వచ్చేవారు. జిల్లా కేంద్రం అయ్యాక రోజుకు సగటున 400 మంది వస్తున్నారు. పక్కనే ఉన్న జంతుశాలకు కూడా జనం క్యూ కడుతున్నారు. ఇక్కడ సుమారు 300 మూగజీవులు ఉన్నాయి. జింకలు, కృష్ణజింకలు, దుప్పిలు ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తాయి. ఎదురుగా ఉన్న నక్షత్రశాలను సందర్శించే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటోంది. ఇక.. జిల్లా కేంద్రమైన తర్వాత ఏర్పాటు చేసిన చిత్రావతి నదిలో బోటింగ్‌కు వారాంతపు రోజుల్లో విపరీతమైన గిరాకీ ఉంటోంది. పెరిగిన రవాణా సౌకర్యాలు.. పుట్టపర్తిని జిల్లా కేంద్రంగా ప్రకటించిన తర్వాత రవాణా సౌకర్యాలు పెరిగాయి. జిల్లాలో మొత్తం 32 మండలాలు ఉండగా.. 30 మండలాలకు నేరుగా బస్సు సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చారు. త్వరలోనే రామగిరి, కనగానపల్లి మండల కేంద్రాలకు బస్సు సర్వీసులు నగుపుతున్నట్లు జిల్లా రవాణా శాఖాధికారి మధుసూదన తెలిపారు. తిరుపతి, శ్రీశైలం తదితర పుణ్యక్షేత్రాలకు నేరుగా బస్సు సౌకర్యం ఉంది. దీనికి తోడు బెంగళూరులోని యలహంక జంక్షన్ నుంచి శ్రీసత్యసాయి ప్రశాంతి నిలయం వరకు ప్యాసింజర్ రైలును రెండు నెలల క్రితం పట్టాలెక్కించారు. సాయిబాబా విమానాశ్రయం అప్పటి నుంచి అందుబాటులో ఉంది. అతి చిన్న గ్రామంలో విమానాశ్రయం ఉండటం దేశంలోనే ప్రత్యేకం కావడం విశేషం. అంతేకాకుండా అతి చిన్న పంచాయతీలోనే వందల సంఖ్యలో పెద్ద పెద్ద భవనాలకు కేరాఫ్‌గా పుట్టపర్తిని చెప్పవచ్చు. భూముల ధరలకు రెక్కలు.. జిల్లా కేంద్రం ప్రకటించిన తర్వాత పుట్టపుర్తి నలుమూలలా భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. గతేడాదితో పోలిస్తే చుట్టూ పది కిలోమీటర్ల మేర రెట్టింపు ధరలు పలుకుతున్నాయి. కొత్తచెరువు మండల కేంద్రంలో వ్యాపారాలు వృద్ధి చెందాయి. నాలుగు ప్రధాన మార్గాలకు కేంద్రంగా ఉండటంతో ప్రైవేటు కంపెనీల షోరూం లు, బంగారు దుకాణాలు వెలిశాయి. ధర్మవరం, పెనుకొండ, కదిరి, బెంగళూరు మార్గాల కూడలిలో కొత్తచెరువు ఉంటుంది. నాణ్యమైన వైద్యం.. శ్రీ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఉచితంగా నాణ్యమైన వైద్యం అందిస్తారు. ఆప్తమాలజీ, యూరాలజీ, కార్డియాలజీ, ఆర్థోపెడిక్ విభాగాలకు వైద్యం చేస్తారు. రాష్ట్రం నలుమూలల నుంచి వైద్యం కోసం ఇక్కడికి వస్తుంటారు. ఆరు లేన్ల రహదారులు జిల్లాలోనే రెండు.. కొత్తగా ఏర్పడిన శ్రీసత్యసాయి జిల్లాలో రెండు ప్రధాన రోడ్డు మార్గాలు వెళ్లనున్నాయి. హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు 576 కిలోమీటర్ల మేర ఆరు లేన్ల మార్గానికి డీపీఆర్ (డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు) పూర్తయింది. మొత్తం రూ.4,750 కోట్లతో అంచనా వేశారు. అదేవిధంగా బెంగళూరు నుంచి కొడికొండ మీదుగా అమరావతికి నిర్మించనున్న మరో మార్గం శ్రీసత్యసాయి జిల్లాలో నుంచి వైఎస్సార్ కడప జిల్లాలో ప్రవేశించేలా ప్రణాళిక ఉంది. మొత్తం 332 కిలోమీటర్లకు గానూ 13 కట్ పాయింట్లుగా ఉండే మార్గానికి మొత్తం రూ.30 వేల కోట్లతో అంచనాలు తయారు చేశారు. ఆశాజనకంగా వ్యాపారాలు శ్రీసత్యసాయి జిల్లా ఏర్పాటయ్యాక పుట్టపర్తికి రాకపోకలు సాగించే వారి సంఖ్య పెరిగింది. ఫలితంగా వ్యాపారాలు ఆశాజనకంగా ఉన్నాయి. చిన్న హోటళ్లు, పెట్రోల్ బంకులకు గిరాకీ పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి మాకు మంచిగా వ్యాపారం ఉంటోంది. – హరినాథ్, సాయి గోకుల్ సూపర్ బజార్, పుట్టపర్తి రెట్టింపు సంఖ్యలో జనం జిల్లా కేంద్రం ఏర్పాటైనప్పటి నుంచి రెట్టింపు సంఖ్యలో జనాలు తరలి వస్తున్నారు. ఇలాగే కొనసాగితే మంచి లాభాలు వస్తాయి. సీఎం వైఎస్ జగన్ నిర్ణయానికి కృతజ్ఞులై ఉన్నాం. చిత్రావతి నదిలో బోటింగ్‌కు కలెక్టర్ కూడా స్పందించారు. కొనసాగించాలని కలెక్టర్ కోరారు. – కేశవ, బోటింగ్ నిర్వాహకుడు విపరీతమైన గిరాకీ గత మూడు నెలలుగా వ్యాపారం బాగుంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి ఆస్పత్రులకు వస్తున్నారు. గతంలో సాయిబాబా ఉన్న సమయంలో మంచి స్పందన వచ్చేది. దుకాణంతో పాటు చుట్టుపక్కల అద్దె గదులు కూడా హౌస్‌ఫుల్ అవుతున్నాయి. – మనోహర్, చిల్లర దుకాణం, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ భూములకు రెట్టింపు ధరలు కొత్తచెరువు, బుక్కపట్నం, పుట్టపర్తి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తదితర ప్రాంతాల్లో భూముల ధరలు పెరిగాయి. కొత్త చెరువులో కార్ల షోరూం, ఈ–కామర్స్ స్టోర్లకు కూడా అడిగారు. అవి వస్తే ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. – సత్యనారాయణ, కమ్మవారిపల్లి -
మహాత్ముడు నడయాడిన నేల
భరతమాత దాస్య శృంఖలాలు తెంచుకొని 75 ఏళ్లవుతోంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు అంబరమంటుతున్నాయి దేశమంతటా. ఇంటింటా జాతీయ పతాకం రెపరెపలాడుతోంది. స్వాతంత్య్ర సంగ్రామంలో కీలకపాత్ర పోషించిన మహాత్మా గాంధీతో ‘అనంత’కు ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన అడుగుజాడల్లో ఎందరో నడిచారు. జిల్లాతో మహాత్మునికి ఉన్న అనుబంధం గురించి మరోసారి మననం చేసుకుందాం. అనంతపురం కల్చరల్: స్వాతంత్య్రోద్యమ కాలంలో గాంధీజీ అనేక పర్యాయాలు రాష్ట్రంలో పర్యటించారు. అందులో భాగంగా ఉమ్మడి అనంతపురం జిల్లాకూ వచ్చారు. 1921లో లోకమాన్య తిలక్ నిధి వసూలు, 1929లో ఖద్దరు నిధి వసూలు కార్యక్రమాలు, 1933లో హరిజన చైతన్య యాత్రలో భాగంగా గాంధీజీ అనంతలో విస్తృతంగా పర్యటించారు. ఆయన ఎప్పుడు వచ్చినా జిల్లా హార్థికంగా, ఆర్థికంగా ఆదరించి దేశభక్తిని చాటుకుంది. గ్రామాల నుంచి ప్రజలు బండ్లు కట్టుకుని వచ్చి గాంధీజీని చూసి, ఆయన చెప్పింది విని అనుసరించేవారు. ప్రజలు వస్తు రూపంలో ఇచ్చిన కానుకల్ని బహిరంగ వేలం వేస్తే పోటీ పడి కొనేవారు. దురాచారాలు రూపుమాపండి 1921 సెప్టెంబర్ 20న గాంధీజీ మద్రాసు నుంచి తాడిపత్రికి వచ్చారు. కలచవీడు వెంకటరమణాచార్యులు గాంధీజీని పద్యాలతో స్తుతించారు. గాంధీజీ హిందూ– ముస్లింల ఐక్యత, జూదం, తాగుడు, వ్యభిచారం మానమని, అస్పృశ్యతను వీడాలని బోధించారు. ఆ సభలో వేలాది మంది స్త్రీలు తమ ఆభరణాలను స్వాతంత్య్ర సమరానికి విరాళంగా ఇచ్చారు. సెప్టెంబరు 30న గాంధీజీని అరెస్టు చేస్తారన్న వదంతులు వ్యాపించడంతో బ్రిటీష్‌వారిని అడ్డుకోవడానికి కల్లూరు సుబ్బారావు ఆయన వెన్నంటే ఉన్నారు. అప్పుడే ఖద్దరు వస్త్రధారణ.. 1929 మే 16న గాంధీజీ మరోసారి ‘అనంత’ పర్యటనకొచ్చారు. కదిరి, కుటాగుళ్ల, ముదిగుబ్బ, దంపెట్ల గ్రామాలు తిరిగి అదే రోజు రాత్రి ధర్మవరం చేరుకున్నారు. దంపెట్ల గ్రామ ప్రజలు చిత్రావతి నది ఇసుకలో ఇరుక్కుపోయిన గాంధీజీ కారును దాటించారు. ధర్మవరంలో ప్రసంగించిన అనంతరం ఆయన అనంతపురం చేరుకున్నారు. గాడిచర్ల హరి సర్వోత్తమరావు ఆయన వెంట ఉన్నారు. ఖద్దరు కట్టండని గాంధీజీ ఇచ్చిన పిలుపుతో విదేశీ వస్త్రాలు తగలబెట్టి అనంతవాసులు భారతీయత ఉట్టిపడే ఖద్దరు వస్త్రాలు ధరించారు. అనంతరం గాంధీజీ తాడిపత్రికి వెళ్లారు. అక్కడ హైస్కూలు డ్రాయింగ్ మాస్టర్ 107 అక్షరాలు రాసి బహూకరించిన బియ్యపు గింజ వేలం వేశారు. రూ.5,330 నిధి వసూలు అయ్యింది. అడుగడుగునా విరాళాల వెల్లువ 1934లో గాంధీజీ గుత్తి స్టేషన్‌కు వచ్చారు. కల్లూరు సుబ్బారావు తదితరులు తోడుగా ఆయన పెద్దవడుగూరుకు వెళ్లారు. అక్కడ చిన్న నారపరెడ్డి రూ.1116 విరాళంగా వచ్చిన «మొత్తాన్ని కేశవ పిళ్లై స్మృతి చిహ్నంగా హరిజనుల కోసం నిర్మించిన కేశవ విద్యాలయానికి అందజేశారు. అంటరానితనం కొనసాగితే హిందూమతం అదృశ్యమవుతుందని గాంధీజీ ప్రబోధించారు. అక్కడ కూడా మరో డ్రాయింగ్ టీచర్ శ్రీనివాసన్ ఒక బియ్యపు గింజపై గాంధీ బొమ్మను చెక్కి బహూకరించారు. గుత్తి హైస్కూలు మైదానంలో జరిగిన సభలో కొందరు హరిజన విద్యార్థులు గాంధీజీని పద్యాలతో సత్కరించారు. అనంతరం గుత్తి నుంచి గుంతకల్లు వెళ్లే మార్గంలో తిమ్మన దర్గాలో ఒక తోళ్ల యజమాని కొడుకైన మహదేవ అనే ఏడేళ్ల కుర్రాడు గాంధీజీకి బంగారు ఉంగరం ఇచ్చాడు. అక్కడ నుండి ఉరవకొండ చేరుకున్న గాంధీజీ అందరిలోనూ హృదయ పరివర్తన రావాలని.. అప్పుడే స్వాతంత్య్రం త్వరగా సిద్ధిస్తుందని చైతన్యపరిచారు. అక్కడ ఇద్దరు రైతులు విడివిడిగా కానుకలివ్వడంతో అందరూ ఐకమత్యంగా ఉంటేనే కానుకలు స్వీకరిస్తానని సంఘటితపరిచారు. అక్కడి నుంచిఅనంతపురం చేరుకున్న గాంధీజీ హరిజన కాలనీలో కుళాయి ప్రారంభించారు. ఆ తర్వాత హిందూపురం వెళ్లారు. అక్కడ జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ హరిజనుల పట్ల భేదభావం రూపుమాపుకోవాలని పిలుపునిచ్చారు. అంటరానితనం పోయేంత వరకు తనకు మనశ్శాంతి లేదని ఆవేదన చెందారు. ఇలా జిల్లాలో పర్యటించిన గాంధీజీని చూడడానికి వేల సంఖ్యలో బండ్లు కట్టుకుని వచ్చేవారని అప్పటివారు చెపుతారు. ఆయన్ను చూడడం, ఆయన చెప్పింది శ్రద్ధగా వినడం, మనసా వాచా కర్మణా ఆచరించడం చేసేవారు. గాంధీజీ రగిలించిన స్ఫూర్తితోనే భారతమాత స్వాతంత్య్ర సముపార్జనలో ‘అనంత’ వాసులు కీలక పాత్ర పోషించారు. ఆ రోజులు ఇంకా గుర్తున్నాయి.. స్వాతంత్య్రోద్యమ పోరును కనులారా చూసిన భాగ్యం భగవంతుడు నాకు కల్పించినందుకు మురిసిపోతుంటాను. నా వయసు 95 ఏళ్లు. నేను ఇప్పటికీ పాత విషయాలన్నీ మా పిల్లలకు తరచుగా చెబుతుంటా. మా నాన్న వెంకటరమణప్ప, అమ్మ నారాయణమ్మ. రైతు కుటుంబం. అనంతపురంలోనే ఉండేవాళ్లం. బహుశా నాకు 9, 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడనుకుంటా.. మహాత్మా గాంధీ ధర్మవరానికి వచ్చిన సమయంలో నేను బంధువుల ఇంట్లో అక్కడ ఉన్నా. ఆనాడు గాంధీజీ మాట్లాడిన మాటలు అర్థం కాలేదు కానీ మేము దేశానికి స్వాతంత్య్రం సిద్ధించేదాకా అనేక కార్యక్రమాలలో పాల్గొన్నాం. నేను పాతూరులోని కస్తూరిబా పాఠశాలలో చదువుకునేదాన్ని. – ఆనెగొంది సుభద్రమ్మ, అనంతపురం -
Madakasira: తవ్వుకున్నోళ్లకు తవ్వుకున్నంత!
మడకశిర: శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో దాదాపు 40 కలర్ గ్రానైట్, మెటల్ క్వారీలు ఉన్నాయి. అన్నీ కర్ణాటక సరిహద్దుల్లోనే ఉండడం నిర్వాహకులకు కలిసివస్తోంది. రాత్రికి రాత్రే సులభంగా విలువైన ఖనిజాన్ని సరిహద్దులు దాటిస్తున్నారు. అగళి మండలం పీ బ్యాడిగెర క్వారీల్లో తీసిన కలర్ గ్రానైట్ దిమ్మెలకు కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో భారీ డిమాండ్ ఉంటుంది. దక్షిణ భారతదేశంలోనే ఈ గ్రానైట్ చాలా నాణ్యమైంది. ఈ క్వారీల నిర్వాహకులు నెలకు రూ.కోట్లల్లో విలువ చేసే కలర్ గ్రానైట్ తరలిస్తారు. ఇందులో దాదాపు 50 శాతం అక్రమంగా రవాణా అవుతోంది. ఇక.. రొళ్ల మండలం హొట్టేబెట్ట వద్ద బుడ్డప్ప అనే వ్యక్తికి ప్రభుత్వం 3.09 ఎకరాల భూమికి డీపట్టా ఇచ్చింది. ఇందులో ఇతను ఎలాంటి అనుమతి పొందకుండా క్వారీ ప్రారంభించాడు. కర్ణాటకకు చెందిన వ్యక్తికి లీజుకిచ్చి కొన్ని నెలల పాటు అక్రమంగా కలర్ గ్రానైట్ దిమ్మెలు తీసి కర్ణాటకకు తరలించి సొమ్ము చేసుకున్నారు. స్థానికులు ఫిర్యాదు చేయడంతో రెవెన్యూ అధికారులు వెళ్లి పనులను నిలిపివేశారు. మైనింగ్ అధికారులు మాత్రం ఇంత వరకు చర్యలు తీసుకోలేదు. మైనింగ్ చేయడానికి నిర్వాహకులు ముందుగానే గనులశాఖ నుంచి అనుమతి పొందాలి. అధికారులు క్యూబిక్ మీటర్ల ప్రకారం తవ్వకాలకు అనుమతి ఇస్తారు. హద్దులు కూడా నిర్ణయిస్తారు. ఆ ప్రకారం ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించి మైనింగ్ చేసుకోవాలి. అయితే క్వారీ నిర్వాహకులు వందల క్యూబిక్ మీటర్లకు అనుమతి పొంది వేల క్యూబిక్ మీటర్లలో మైనింగ్ చేసిన సంఘటనలు ఇటీవల సీజ్ చేసిన క్వారీల్లో వెలుగులోకి వచ్చాయి. ఫలితంగా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. మడకశిర కలర్ గ్రానైట్ చాలా నాణ్యంగా ఉంటుంది. దీంతో దీనికి చాలా డిమాండ్. తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో మడకశిర గ్రానైట్ చాలా ప్రసిద్ధి. ఇతర దేశాలకు కూడా ఇక్కడి నుంచి ఎగుమతి అవుతోంది. రూ.కోట్లలో క్వారీ నిర్వాహకులకు ఆదాయం లభిస్తుంది. దీంతో అందరి కన్ను మడకశిర గ్రానైట్‌పైనే పడుతోంది. మడకశిర ప్రాంతంలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై స్థానిక ఎమ్మెల్యే తిప్పేస్వామి ఇటీవల అమరావతిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. గనులశాఖ డైరెక్టర్ వెంకటరెడ్డిని కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. స్థానిక మైనింగ్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఎమ్మెల్యే వారి దృష్టికి తీసుకెళ్లారు. విలువైన గ్రానైట్ సరిహద్దులు దాటుతున్నా మైనింగ్ శాఖ పత్తా లేదు. అక్రమ మైనింగ్‌పై స్థానిక పోలీసులే ఎక్కువ కేసులు నమోదు చేశారు. ఇటీవల కాలంలో మైనింగ్‌శాఖ అధికారులు పెద్దగా కేసులు నమోదు చేసిన దాఖలాలు లేవు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన ప్రారంభంలో మడకశిర ప్రాంతంలోని క్వారీలపై మైనింగ్‌శాఖ అధికారులు పెద్ద ఎత్తున దాడులు చేశారు. అక్రమంగా మైనింగ్ చేస్తున్న క్వారీలను సీజ్ చేసి రూ.కోట్లలో రాయల్టీ విధించారు. ప్రస్తుతం రూ. కోట్లల్లో అక్రమ రవాణా సాగుతున్నా, అటువైపు కన్నెత్తి చూడడం లేదు. మా దృష్టికి వస్తే చర్యలు మడకశిర ప్రాంతంలో అక్రమంగా మైనింగ్ నిర్వహిస్తున్నట్లు మా దృష్టికి వస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం. సరిహద్దుల్లో ఉన్న క్వారీలపై ప్రత్యేక నిఘా పెట్టాం. అక్రమంగా మైనింగ్ చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించే ప్రసక్తే లేదు. క్వారీల ద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడానికి చర్యలు తీసుకుంటున్నాం. – బాలసుబ్రమణ్యం, ఏడీ, గనులశాఖ -
చిత్రావతి నదిలో గల్లంతయిన ఆటో డ్రైవర్ మృతదేహం లభ్యం
-
సై‘కిల్’: టీడీపీ నేతల పోరు.. తముళ్ల బేజారు
సాక్షి, పుట్టపర్తి(శ్రీసత్యసాయి జిల్లా): ఎవరికి టికెట్టు దక్కుతుందో తెలియదు కానీ, మాకంటే మాకేనంటూ టీడీపీ నేతాగణం అప్పుడే ప్రచారం మొదలుపెట్టింది. అడ్డొస్తే సహించేది లేదంటూ పార్టీలోని తమ ప్రత్యర్థి వర్గంపై అడ్డంగా విరుచుకుపడుతున్నారు. రెండుగా విడిపోయి ఎవరికి వారు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అందర్నీ ఒకచోటకు తెచ్చి సయోధ్య కుదర్చాల్సిన పార్టీ జిల్లా అధినేత తనకే టికెట్టు దక్కుతుందో లేదో తెలియక బయటకు రావడమే మానేశారు. ఎన్నికలకు రెండేళ్లుండగానే నేతలు కుమ్ములాటల్లో తేలియాడుతుండడంతో కిందిస్థాయి నాయకులు, కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. జిల్లాలో టీడీపీ పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోంది. నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ల తీరుతో కేడర్ విసిగిపోతోంది. కొంత మంది ఆ పార్టీ కీలక నాయకులు బహిరంగంగానే అసమ్మతి గళం వినిపిస్తున్నారు. చదవండి: ఆ విషయంలో టీడీపీ ఎందుకు మౌనం దాల్చింది? ‘పల్లె’.. మూటాముల్లె సర్దుకోవాల్సిందే! తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డిపై తిరుగుబాటు చేస్తున్న నాయకుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కొన్ని రోజుల క్రితం జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టపర్తి నియోజకవర్గంలో పర్యటించి అగ్గిరాజేశారు. ఈసారి సైకం శ్రీనివాస రెడ్డికే టికెట్ అని బాంబు పేల్చారు. ఇదే క్రమంలో పుట్టపర్తి మున్సిపల్ మాజీ చైర్మన్ పీసీ గంగన్న కూడా ‘పల్లె’పై తిరుగుబావుటా ఎగరేశారు. నాలుగు రోజుల క్రితం బుక్కపట్నం మాజీ ఎంపీపీ పెదరాసు సుబ్రమణ్యం మీడియా ముందుకు వచ్చి.. ‘పల్లె’కు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే పనిచేయబోనని స్పష్టం చేశారు. ఓబుళదేవరచెరువు మండలానికి చెందిన మాజీ ఎంపీపీ ఇస్మాయిల్, కొత్తచెరువులో రఘుపతి (మార్కెట్ యార్డు మాజీ వైస్ చైర్మన్), పెద్దన్న (లోచెర్ల), నిషార్ అహ్మద్ (మాజీ డీలర్), మండల మాజీ కన్వీనర్ శ్రీనాథ్ తదితరులు పల్లె రఘునాథ రెడ్డికి దూరంగా ఉంటున్నారు. ఇంత జరుగుతున్నా ఆయన పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తుండడంతో కిందిస్థాయిలోని కార్యకర్తలు నిరుత్సాహంలో కూరుకుపోయారు. ‘పల్లె’ వెంట వెళ్లాలా? వద్దా? అనే సంశయంలో పడ్డారు. ధర్మవరంలో పరిటాల వర్సెస్ వరదా ధర్మవరంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్, బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి (గోనుగుంట్ల సూర్యనారాయణ) మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. టీడీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు వదిలేసి బీజేపీలో చేరిన వరదాపురం సూరిని మళ్లీ పార్టీలోకి తీసుకునే ప్రసక్తే లేదని పరిటాల శ్రీరామ్ చెబుతున్నారు. ఒకవేళ ఆయన చేరాల్సి వస్తే తానే కండువా వేసి ఆహ్వానిస్తానని.. పార్టీ కోసం కష్టపడ్డాక పదవుల కోసం రెకమెండ్ చేస్తానని గతంలో పేర్కొన్నారు. సూరికి ధర్మవరం టికెట్ ఇస్తే మాత్రం తాను రాజీనామా చేస్తానని ప్రకటించారు. పరిటాల శ్రీరామ్ వ్యాఖ్యలపై వరదాపురం సూరి వర్గీయులు కూడా ఘాటుగా స్పందిస్తున్నారు. సూరి టీడీపీలో చేరడం ఖాయమని, పరిటాల శ్రీరామ్ రాజకీయ సన్యాసానికి సిద్ధంగా ఉండాలని స్పష్టం చేస్తున్నారు. కదిరిలో అత్తార్ వర్సెస్ కందికుంట కదిరిలో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల మధ్య కుమ్ములాట తారాస్థాయికి చేరింది. అత్తార్ చాంద్‌బాషా, కందికుంట వెంకటప్రసాద్ మధ్య కోల్డ్‌వార్ కొన్నిరోజులుగా హీట్ పుట్టిస్తోంది. టికెట్ తమకంటే తమకేనంటూ ఎవరికి వారు సొంత కేడర్ ఏర్పాటు చేసుకుని వేరు కుంపట్లు పెట్టుకున్నారు. అన్ని మండలాల్లో వర్గాలను ప్రోత్సహిస్తున్నారు. కందికుంట అనుచరులు ఇటీవల అత్తార్ అనుచరుడిపై దాడికి దిగడం తీవ్ర చర్చనీయాంశమైంది. పెనుకొండలో తెరచుకోని టీడీపీ కార్యాలయం పెనుకొండ మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథిది విచిత్ర పరిస్థితి. ఈ సారి నియోజకవర్గ పార్టీ టికెట్ యూత్‌కేనంటూ అధిష్టానం తేల్చేయడంతో ఆయన దిక్కుతోచని స్థితిలో పడిపోయారని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడైన తనకే అధిష్టానం చెక్ పెట్టేలా వ్యవహరిస్తుండడంతో నెల రోజులుగా పట్టణంలోని టీడీపీ కార్యాలయాన్ని కూడా ఎక్కువగా తెరవడం లేదని తెలుస్తోంది. ఎమ్మెల్యే టికెట్ రేసులో అదే సామాజిక వర్గానికి చెందిన ఎస్.సవితమ్మతో పాటు మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప కూడా ఉన్నారు. బీకే నాయకత్వంపై సోమందేపల్లి, పరిగి, పెనుకొండ మాజీ జెడ్పీటీసీ సభ్యులు వెంకటరమణ, బోయ సూరి, నాగలూరు నారాయణస్వామి తదితరులు అసంతృప్తితో ఉన్నారు. మడకశిరలో ఈరన్న వర్సెస్ తిప్పేస్వామి మాజీ ఎమ్మెల్యే ఈరన్న.. మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి మధ్య సమన్వయం లోపించింది. గత కొన్ని రోజులుగా ఇద్దరూ ఒకే కార్యక్రమంలో కనిపించడంలేదు. ఈరన్న ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు. కాగా గుండుమల తిప్పేస్వామి తనకు అనుకూలంగా ఉన్న మరొకరిని ఎమ్మెల్యే రేసులోకి తెచ్చే ప్లాన్‌లో ఉన్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య దూరం పెరిగింది. బాలయ్యో.. ఇటు చూడయ్యో.. హిందూపురంలో అయితే తెలుగు తమ్ముళ్లది కక్కలేని మింగలేని పరిస్థితి. ఎంతో నమ్మకంతో గెలిపించిన నందమూరి బాలకృష్ణ ఈ మధ్య ఇటు చూడడమే మానేశారు. సినిమా షూటింగుల్లో బిజీబిజీగా ఉంటున్నారు. చుట్టుపు చూపుగా అప్పుడప్పుడు వస్తున్నా.. గృహ ప్రవేశాలు, వివాహాల ఫంక్షన్లకే పరిమితమవుతున్నారు. తను నమ్మి ఇక్కడ ఉంచిన పీఏనేమో అసాంఘిక కార్యకలాపాల్లో తలమునకలైన పరిస్థితి. దీంతో ఆ పార్టీ కేడర్ నైరాశ్యంలో మునిగిపోయింది. -
అసైన్డ్ భూమిపై ‘పచ్చ’ గద్దలు.. కోట్లు దండుకున్న ‘తమ్ముళ్లు’
ఇది హిందూపురం 14వ వార్డు పరిధిలోని సడ్లపల్లి పొలం సర్వేనంబర్ 433/11లోని 2.17 ఎకరాల స్థలం. దీనికి 1957 ప్రాంతంలో నల్లోడు అనే వ్యక్తి పేరిట డీ పట్టా మంజూరైంది. ఇది ప్రస్తుతం పట్టణంలో కలిసిపోయింది. ప్రస్తుతం అక్కడ సెంటు రూ.10 లక్షలకు పైగా పలుకుతోంది. 2012లో ఈ భూమిపై కన్నేసిన టీడీపీ నేతలు... పత్రాలు పుట్టించారు. ప్లాట్లుగా వేసి సెంటు రూ.6 లక్షల చొప్పున 58 మందికి విక్రయించారు. కానీ నల్లోడు వంశీయులు తాతల కాలం నాటి తమ భూమికి అక్రమ పట్టా పుట్టించి అమ్ముకుని తమకు అన్యాయం చేశారని న్యాయపోరాటం చేస్తున్నారు. చదవండి: ఆ విషయంలో టీడీపీ ఎందుకు మౌనం దాల్చింది? హిందూపురం(శ్రీసత్యసాయి జిల్లా): భూమిలేని నిరుపేదలకు ప్రభుత్వం డీ–ఫారం పట్టా మంజూరు చేస్తుంది. పట్టా పొందిన వ్యక్తి, ఆ తర్వాత వారి వంశీయులు సదరు భూమిని సాగు చేసుకుని జీవనం సాగించవచ్చు. అంతేకానీ ఇతరులకు విక్రయించే వీలు లేదు. ఈ విషయాన్ని 1977 పీఓటీ యాక్ట్ స్పష్టంగా చెబుతోంది. కానీ హిందూపురంలో డీ–ఫారం పట్టా ఉన్న 2.17 ఎకరాల భూమి తెలుగు తమ్ముళ్ల చేతుల్లోకి వెళ్లిపోయింది. కనీసం డీ–ఫారం పట్టా పొందిన వ్యక్తి వంశీయులకు కూడా తెలియకుండానే ఆ స్థలం ప్లాట్లుగా మారి ‘తమ్ముళ్ల’కు రూ. కోట్లు కురిపించింది. కొనుగోలు చేసినట్లు పత్రాలు సృష్టించి.. సడ్లపల్లి పొలం సర్వేనంబర్ 433/1లోని 26.84 ఎకరాలను 1957లో ప్రభుత్వం లేబర్ యూనియన్ అధ్యక్షుడు కదిరప్ప పేరిట డీ–ఫారం పట్టా ఇచ్చింది. అతను సంఘంలోని సభ్యులకు ఎకరా, రెండెకరాల చొప్పున కేటాయించి పట్టాలిప్పించాడు. ఈ క్రమంలో 433/11లో 2.17 ఎకరాల భూమిని దళితుడైన నల్లోడు పేరిట ప్రభుత్వం డీ–ఫారం పట్టా మంజూరు చేసింది. ఈ భూమిని 2012లో నల్లోడు వంశీయులైన కొల్లప్ప, పెద్దసింహప్ప, చిన్న నరసింహప్ప నుంచి తాము కొనుగోలు చేసినట్లు కృష్ణయ్య, కాంతమ్మ మరికొందరు పత్రాలు సృష్టించుకున్నారు. ఆ తర్వాత కృష్ణయ్య 2012లో టీడీపీ నాయకులు మంగేష్, పురుషోత్తంరెడ్డికి విక్రయించారు. రూ.కోట్లు పలికే భూమిని కన్వర్షన్ చేయకుండానే టీడీపీ నాయకుడు మంగేష్ ప్లాట్లు వేసి విక్రయాలు సాగించేశారు. సెంటు రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల చొప్పున 58 ప్లాట్లు విక్రయించారు. అసైన్డ్ ల్యాండ్ స్వాధీన ప్రక్రియలో భాగంగా బోర్డు పాతుతున్న రెవెన్యూ సిబ్బంది న్యాయం కోసం పోరాటం.. వాస్తవానికి ఆ భూమి పొందిన నల్లోడు అవివాహితుడు. అతను తన అన్న న్యాతప్పతో కలిసి ఉండేవాడు. అతని తదనంతరం ఈ భూమి వారసత్వంగా న్యాతప్ప కుమారులైన కొల్లప్ప తదితరులకు చెందాల్సి ఉంది. కానీ కొల్లప్పతో పాటు అతని అన్నదమ్ములు మృతి చెందిన తర్వాత వారి నుంచి ఆ భూమిని కొనుగోలు చేసినట్లు టీడీపీ నాయకులు పత్రాలు సృష్టించారు. దీనిపై కొల్లప్ప కుమారుడు సూరి అ«ధికారులకు ఫిర్యాదు చేశారు. తమ భూమికి కృష్ణయ్య, కాంతమ్మ, రమేష్ మరికొందరు పేరుతో పత్రాలు సృష్టించి టీడీపీ నాయకులు మంగేష్, పురుషోత్తంరెడ్డి పేరిట రిజిస్టర్ చేసుకున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని న్యాయ పోరాటం చేస్తున్నారు. మా భూమిని లాక్కున్నారు మా ముత్తాత కాలం నుంచి హక్కుగా వస్తున్న 2.17 ఎకరాల భూమిని టీడీపీ నేతలు కబ్జా చేశారు. తప్పుడు పత్రాలు సృష్టించుకుని ప్లాట్లుగా మార్చి విక్రయించారు. న్యాయం చేయాలని 2013 సంవత్సరం నుంచీ అధికారుల చుట్టూ తిరుగుతున్నాం. కానీ అప్పటి అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో కబ్జా దారులు దర్జాగా లేఅవుట్‌వేసి స్థలాలు అమ్ముకుంటున్నారు. ఇప్పటికైనా మాకు న్యాయంచేసి ఆ భూమిని మా కుటుంబసభ్యులకు అప్పగించాలి. – సూరి, కొల్లప్ప కుమారుడు, హిందూపురం స్థలాన్ని స్వాధీనం చేసుకుంటున్నాం సర్వేనంబర్ 433/11లోని 2.17 ఎకరాలను అసైన్డ్ల్యాండ్గా గుర్తించాం. సాగుచేసుకుని జీవనం సాగించేందుకు గతంలో నల్లోడు అనే వ్యక్తికి డీపట్టా మంజూరైంది. ఆ తర్వాత వారి వంశీయులు ఎవరూ భూమిని సాగు చేయలేదు. ప్రస్తుతం పట్టణ నడిబొడ్డున ఉన్న ఆ స్థలానికి విలువ పెరిగింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం సంబంధిత వారికి రీజెండర్ నోటీసులు జారీ చేసి స్థలాన్ని స్వాదీనం చేసుకునే ప్రక్రియ ప్రారంభించాం. ఆ స్థలంలో ఎవరూ ప్రవేశించడానికి వీలులేదని బోర్డు నాటించాం. – శ్రీనివాసులు, తహసీల్దార్, హిందూపురం -
టీడీపీ నేత అకృత్యాలు.. వివాహితపై లైంగిక వేధింపులు
సాక్షి, శ్రీసత్యసాయి: టీడీపీ నేత రెచ్చిపోయాడు. ధర్మవరంలో చారుగుండ్ల ఓబిలేసు ఓ వివాహితను లైంగిక వేధింపులకు గురిచేశాడు. అంతేకాకుండా ఆమె భర్తను బెదిరింపులకు గురిచేశాడు. ఈ క్రమంలో వివాహిత భర్త భాషా.. మనస్థాపంతో ఆత్మహత్యయత్నం చేశాడు. రైల్వే ట్రాక్‌పై సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు. తనను చారుగుండ్ల ఓబిలేసు.. చంపేస్తానని బెదిరించినట్టు భాషా తెలిపాడు. -
ఒక్కసారిగా మారిపోయిన సీన్.. అక్కడ ఎకరం కోటి రూపాయలపైనే..
సాక్షి, పుట్టపర్తి(సత్యసాయి జిల్లా): పుట్టపర్తి... సత్యసాయి నడయాడిన ప్రాంతం. ఆధ్యాత్మిక కేంద్రంగా అంతర్జాతీయంగా భాసిల్లిన ప్రదేశం. దేశవిదేశీ భక్తులతో కళకళలాడిన పట్టణం. ఇక్కడ సెంటు స్థలం రూ.లక్షల్లో పలికేది. కానీ సత్యసాయి భౌతికంగా దూరమయ్యాక ప్రాభవం తగ్గింది. విదేశీ అతిథుల రాక తగ్గగా వెలవెలబోయింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం శ్రీసత్యసాయి పేరుతో జిల్లా కేంద్రం ఏర్పాటు చేయడంతో ఇప్పుడు మళ్లీ కాంతులీనుతోంది. చదవండి: చెంప ఛెళ్లుమనిపించిన మహిళా హెచ్ఎం.. అసలు ఏం జరిగిందంటే? చుట్టూ కొండ ప్రాంతాలు. ఎటు చూసినా భూములు. ఓ వైపు చెరువు. మరో వైపు నది. ఇంకో వైపు గుట్టలు.. పుట్టపర్తి పేరు చెబితే కళ్లముందు కనిపించే దృశ్యమిది. అయితే పుట్టపర్తిని శ్రీ సత్యసాయి పేరుతో జిల్లా కేంద్రంగా ప్రకటించడంతో స్వరూపమే మారిపోయింది. గతంలో సత్యసాయిబాబా భక్తులతో రద్దీగా కనిపించినా అభివృద్ధి ప్రశాంతి నిలయం వరకే పరిమితమైంది. సత్యసాయి శివైక్యం తర్వాత ప్రాభావం మసకబారుతూ వచ్చింది. కానీ జిల్లా కేంద్రం ప్రకటనతో అభివృద్ధి కొంతపుంతలు తొక్కుతోంది. రహదారుల వెంట అభివృద్ధి పరుగులు పుట్టపర్తి నుంచి బెంగళూరు వెళ్లే మార్గంలో భూముల ధరలు భారీగా పెరిగాయి. మామిళ్లకుంట వరకు నాలుగు లేన్ల మార్గం ఉండగా రియల్ ఎస్టేట్ రంగం రెక్కలు విప్పుకుంది. బెంగళూరు వైపు పెడబల్లి వరకు.. ధర్మవరం వైపు కొత్త చెరువు వరకు భూములకు రేట్లు పెరిగాయి. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సమీపంలోనే ఏపీఐఐసీ వంద ఎకరాలకుపైగా భూమిని సేకరించింది. ప్రస్తుతం మౌలిక వసతులు కల్పిస్తూ అభివృద్ధి చేస్తోంది. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల భూములకు డిమాండ్ పెరగడంతో ధరలు రెట్టింపు అయ్యాయి. ♦కొత్తచెరువు చుట్టూ రోడ్డు పక్కన సెంటు రూ.10 లక్షలు పలుకుతోంది. గతంలో ఇక్కడ రూ.4 లక్షలు మించి పలికేది కాదు. ♦మామిళ్లకుంట క్రాస్‌లో సెంటు రూ.10 లక్షలు పైగానే ఉంది. ఇక్కడ కూడా గతంలో సెంటు స్థలం రూ.3 లక్షలు మాత్రమే ఉండేది. ♦సూపర్ స్పెషాలిటీ చుట్టూ కిలోమీటరు మేర సెంటు ధర ప్రస్తుతం రూ.10 లక్షలు పలుకుతోంది. గతంలో సెంటు రూ.4 లక్షలు మించి పలికేది కాదు. ♦విమానాశ్రయం సమీపంలో భూములు డబుల్ రేటు పలుకుతున్నాయి. ప్రస్తుతం సెంటు రూ.15 లక్షల వరకూ పలుకుతోంది. అభివృద్ధికి సర్కారు అండ పుట్టపర్తి ప్రాంత వాసులు గతంలో వర్షాధార పంటలు మాత్రమే పండించే వారు. వైఎస్ జగన్ సర్కార్ ప్రవేశపెట్టిన వైఎస్సార్ జలకళతో చాలామంది రైతుల భూముల్లో రెండో పంట పండిస్తున్నారు. అంతేకాకుండా బిందు, తుంపర సేద్య పరికరాలు రాయితీతో అందిస్తుండటంతో చాలా మంది భూములనే నమ్ముకుని సంతోషంగా జీవిస్తున్నారు. నీటి సౌకర్యం... దిగుబడులు బాగా పెరగడంతో పొలాల ధరలూ భారీగా పెరిగాయి. ఆయా గ్రామాల్లో ఎకరా రూ.కోటి వరకు ధర పలుకుతోంది. గతంలో అభివృద్ధి అంతా ఒకేవైపు.. గతంలో పుట్టపర్తి బస్టాండు చుట్టుపక్కల మాత్రమే అభివృద్ధి జరిగింది. ప్రశాంతి నిలయం ఉండటంతో అక్కడక్కడే పెద్ద పెద్ద భవనాలు వెలిశాయి. ఇతర దేశాల నుంచి వచ్చే వారికి అనుకూలంగా అక్కడే నివాసాలు ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం జిల్లా కేంద్రం కావడంతో పుట్టపర్తి చుట్టూ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఎటు వైపు చూసినా భూముల ధరలు పెరిగాయి. దీనికి తోడు మున్సిపల్, పుట్టపర్తి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు కూడా ఎత్తైన భవనాలకు బదులు విశాలమైన భవనాలను ఎక్కువ విస్తీర్ణంలో కట్టుకోవాలని సూచిస్తున్నారు. ఫలితంగా పట్టణం నలువైపులా నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. అద్దె ఇళ్లకూ డిమాండ్ జిల్లా కేంద్రంగా ప్రకటించడం.. ప్రభుత్వ కార్యాలయాలు తరలి రావడం.. ఉద్యోగులు చేరుకోవడంతో పాటు పలు వ్యాపారాల కోసం పుట్టపర్తికి వలస వచ్చేవారి సంఖ్య అధికమైంది. దీంతో అద్దె ఇళ్లకు భారీ డిమాండ్ పెరిగింది. గతేడాదిలో రూ.2 వేలకే ఇల్లు అద్దెకు దొరికేది. ప్రస్తుతం రూ.5 వేలు పెట్టినా సౌకర్యాలు అంతలా లేవు. అపార్ట్మెంట్లలో సింగిల్ బెడ్రూం ఫ్లాట్‌కు రూ.5 వేలు, డబుల్ బెడ్రూం ఫ్లాట్‌కు రూ.10 వేల దాకా అద్దె ఇవ్వాల్సి వస్తోంది. అయినా ఖాళీగా ఉండే ఇళ్లు కనిపించడం లేదు. -
అనంతపురంలో డెంగీ కలకలం
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలో డెంగీ కేసులు కలకలం రేపుతున్నాయి. ఒకటీ, రెండు నమోదయ్యే కేసులు పది రోజుల్లోనే అమాంతం పెరిగిపోయాయి. శ్రీసత్యసాయి జిల్లాలో తక్కువగా ఉన్నా.. అనంతపురం జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో కేసుల తీవ్రత ఎక్కువగా ఉంది. ఇప్పటికే ఆయా పట్టణాల్లోని డెంగీ ప్రభావిత ప్రాంతాలను అధికారులు గుర్తించి ప్రత్యేక చర్యలు చేపట్టారు. మొబైల్ మలేరియా, డెంగీ క్లినిక్స్ (ఎంఎండీసీ)లను రంగంలోకి దించారు. తొలకరి జల్లులు పడగానే డెంగీ జ్వరాలు వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. ఏ ప్రాంతాల్లో ఎక్కువ వ్యాప్తి చెందే అవకాశాలున్నాయి..తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజారోగ్య శాఖ కసరత్తు చేస్తోంది. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో ఇప్పటికే నాలుగు సెంటినల్ సర్వేలెన్స్ కేంద్రాల్లో డెంగీ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. అవసరమైతే వీటిని విస్తరించాలని యోచిస్తున్నారు. ప్లేట్లెట్స్ పేరిట భారీగా దోపిడీ వైరల్ జ్వరం వచ్చినా ప్లేట్లెట్లు తగ్గుతాయి. అయితే డెంగీ జ్వరమని చెబుతూ రోగిని, వారి కుటుంబ సభ్యులను ప్రైవేట్ ఆస్పత్రులు బెంబేలెత్తిస్తున్నాయి. రకరకాల వైద్య పరీక్షలు చేయించి.. వేలాది రూపాయలు వసూలు చేస్తున్నాయి. ఇలా ఎవరైనా వసూళ్లు చేస్తే నేరుగా జిల్లా వైద్యాధికారికి గానీ, కలెక్టర్‌కు గానీ ఫిర్యాదు చేయాలని అధికారులు చెబుతున్నారు. అయినప్పటికీ డెంగీ నిర్ధారణ కాకున్నా ప్లేట్లెట్స్ పేరిట దోపిడీ చేయడం ఆస్పత్రుల యాజమాన్యాలకు రివాజుగా మారింది. ధర్మవరం పట్టణానికి చెందిన ఖాదర్‌బాషా వారం రోజుల క్రితం జ్వరంతో అనంతపురం కమలానగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వచ్చారు. ప్లేట్లెట్స్ తగ్గాయని, డెంగీ లక్షణాలున్నాయని తెలిపి చికిత్స పేరుతో రూ.40వేలు వసూలు చేశారు. చివరకు అతనికి వైరల్ ఫీవర్ అని తేలింది. అనంతపురంలోని పాతూరుకు చెందిన నాగభూషణం వాంతులు, జ్వరంతో సాయినగర్‌లోని ఓ నర్సింగ్‌హోంలో చేరాడు. డెంగీ పేరుతో అతనినుంచి రూ.50వేలకు పైగా లాగారు. రోగి కోలుకున్నాడు కానీ, డెంగీ జ్వరం నిర్ధారణ కాలేదు. -
ప్రేమించి పెళ్లి చేసుకుని.. మరో వివాహితతో సహజీవనం
వారిద్దరూ వివాహితులే. ఇద్దరికీ కుటుంబాలున్నాయి. అతను వీఆర్ఓగా పనిచేస్తుండగా...ఆమె సచివాలయ ఉద్యోగి. కానీ ఇద్దరూ ప్రేమ పేరుతో దారితప్పారు. సహజీవనం చేస్తూ... రెండు కుటుంబాల్లో చిచ్చుపెట్టారు. సహచరులను, సంతానాన్ని శోకంలో ముంచారు. అనైతికమని తెలిసీ అదే కావాలంటూ పట్టుబడుతున్నారు. ఫలితంగా సచివాలయ ఉద్యోగికి తాళికట్టిన భర్త... వీఆర్‌ఓతో జీవితం పంచుకున్న భార్య మమత జీవితాలు ప్రశ్నార్థకమయ్యాయి. సాక్షి, పుట్టపర్తి: ఆయనో ప్రభుత్వ ఉద్యోగి. పైగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు కూతుళ్లు పుట్టాక... మరో వివాహితతో సహజీవనం చేస్తున్నాడు. అడ్డుతప్పించుకునేందుకు భార్యను వేధిస్తున్నాడు. అయినప్పటికీ తన భర్తతోనే కలిసి ఉండేలా చూడాలంటూ ఆ మహిళ పోలీసులను, అధికారులను వేడుకుంటోంది. కూలి పనులు చేసుకుంటూ పిల్లలను పోషించుకుంటోంది. ప్రేమ పెళ్లి...పిల్లలు పుట్టాక లొల్లి.. కొత్తచెరువు మండలం కొడపగానపల్లికి చెందిన ఒంటికొండ రామ్మోహన్ వీఆర్ఓగా పుట్టపర్తి మండలం చెర్లోపల్లిలో విధులు నిర్వర్తిస్తున్నారు. సొంత గ్రామానికే చెందిన మమతను ప్రేమించి 2015 ఫిబ్రవరి 13న బుక్కపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వివాహం చేసుకున్నారు. వీరికి యస్మిత, యక్షిత సంతానం. వీరి సంసారం సాఫీగా సాగుతున్న తరుణంలో రామ్మోహన్ దారి తప్పాడు. 2021 సెప్టెంబరు నుంచి భార్యకు దూరంగా ఉంటున్నారు. సచివాలయంలో ఉద్యోగం చేస్తున్న మరో వివాహితతో పరిచయం పెంచుకుని ఆమెతో సహజీవనం చేస్తున్నాడు. చదవండి: (వివాహమైనా ప్రియుడితో సన్నిహితంగా.. ఆహారంలో విషంపెట్టి..) ఆ మహిళ భర్త సంబంధీకులు గొడవకు దిగినా... రామ్మోహన్ తీరులో మార్పు రాలేదు. పైగాతన భార్య, పిల్లలను వదిలేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో విడాకులకు అంగీకరించాలని భార్య మమతపై ఒత్తిడి తేగా, ఆమె ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు యత్నించింది. ఆ తర్వాత ఉన్నతాధికారులను కలిసి తన గోడు వెళ్లబోసుకుంది. ఏ ఒక్కరూ స్పందించకపోవడంతో 2022 మార్చి 2న కొత్త చెరువు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసి చేతులు దులుపుకున్న పోలీసులు.. ఆమెకు ఎలాంటి న్యాయమూ చేయలేకపోయారు. కనీసం రామ్మోహన్‌ను స్టేషన్‌కు కూడా పిలిపించలేకపోయారు. ఈ క్రమంలోనే ఏప్రిల్ 11న మమత మరోసారి ‘స్పందన’లో తన గోడు వెళ్లబోసుకుని న్యాయం కోసం ఎదురుచూస్తోంది. నా భర్త దగ్గరకు చేర్చండి నా ఇద్దరు పిల్లలు అనాథలుగా మారరాదు. మాకు బతుకు తెరువు కావాలి. నా భర్తకు కౌన్సెలింగ్ ఇచ్చి అతని దగ్గరకు చేర్చండి. నా భర్తతో సహజీవనం చేస్తున్న వివాహిత భర్తకూ న్యాయం చేయండి. ఆ ఇద్దరి సంతోషం కోసం రెండు కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి. ఇప్పటికే చాలా సార్లు పోలీసు స్టేషన్లు, కలెక్టర్ కార్యాలయాలు తిరిగాను. ఎవరూ న్యాయం చేయలేదు. నాకు విడాకులు అవసరం లేదు. నా భర్తతో కలిసి జీవించాలని ఉంది. – మమత -
కంటి చూపు సరిగా లేకున్నా.. క్రికెటర్‌గా క్లిక్ అయ్యాడు!
పుట్టుకతోనే దృష్టి లోపం.. దానికి తోడు కటిక పేదరికం.. సమస్యను సవాల్‌గా స్వీకరించాడు... కృషి, పట్టుదలతో అంధత్వాన్ని జయించాడు. అన్నీ బాగుండి.. ఆర్ధికస్తోమత సహకరించి.. ఏ కళలోనైనా, క్రీడలోనైనా రాణించడం పెద్ద విషయమేమీ కాదు. కంటి చూపు సరిగా లేకపోయినా చదువుతో పాటు క్రికెట్లోనూ రాణిస్తూ పేరుతెచ్చుకున్న గణేష్ విజయ ప్రస్థానంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం నల్లమాడ: సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం గంగాపురం గ్రామానికి చెందిన సరస్వతి, ప్రభాకర్ దంపతులు వ్యవసాయ కూలీలు. అరకొర సంపాదనతో అతి కష్టంపై కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. వీరి రెండో కుమారుడు గణేష్.. పుట్టుకతోనే దృష్టి లోపంతో బాధపడుతుండేవాడు. తల్లిదండ్రులు పలు ఆస్పత్రుల్లో చూపించారు. శస్త్రచికిత్స చేస్తే చూపు మెరుగుపడుతుందన్న వైద్యుల సూచన మేరకు ఆపరేషన్‌నూ చేయించారు. అయినా ఫలితం లేకపోయింది. 30 శాతం కంటి చూపుతో ఉన్న కుమారుడి భవిష్యత్తు తలచుకుని నిరుపేద తల్లిదండ్రులు మరింత కుంగిపోయారు. చదువుల్లో టాప్.. గణేష్ విద్యాభ్యాసం ఆద్యంతం బ్రెయిలీ లిపిలోనే సాగింది. ఒకటి నుంచి ఐదో తరగతి వరకూ కదిరి సమీపంలోని మొటుకుపల్లి ఆర్డీటీ ప్రాథమిక పాఠశాలలో చదువుకున్నాడు. ఆరు నుంచి పదో తరగతి వరకూ అనంతపురం సమీపంలోని పంగల్ రోడ్డులో ఉన్న ఆర్డీటీ సమ్మిళిత ఉన్నత పాఠశాలలో, ఇంటర్ తిరుపతిలోని ఎస్వీ జూనియర్ కళాశాలలో, అక్కడే ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ, ఎస్వీ యూనివర్సిటీలో పీజీ పూర్తి చేశాడు. కృషి, పట్టుదల ఉంటే దేనినైనా సాధించవచ్చునని నిరూపించిన గణేష్ ప్రస్తుతం ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. క్రికెట్ అంటే మక్కువ.. గణేష్‌కు చిన్నప్పటి నుంచే క్రికెట్ అంటే ఆసక్తి ఎక్కువ. ఐదో తరగతిలో ఉన్నప్పుడే తోటి విద్యార్థులతో కలిసి క్రికెట్ ఆడడం ప్రారంభించాడు. ఈ క్రమంలో పాఠశాల స్థాయి, జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం దక్కింది. ఆయా పోటీల్లో ప్రతిభ చాటుకోవడంతో అతని క్రీడా ప్రస్థానం మలుపు తిరిగింది. 2012లో తిరుపతి జట్టు తరఫున ఆడి బీ2 (30 శాతం కంటి చూపు ఉన్నవారు) విభాగంలో ఆంధ్రా ప్రాబబుల్స్‌కు ఎంపికయ్యాడు. అనంతరం ఆంధ్రాజట్టులో స్థానం దక్కించుకుని ఆల్‌రౌండర్‌గా తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఇప్పటివరకూ తాను ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ అత్యధిక వికెట్లు, పరుగులు చేసిన క్రీడాకారుడిగా ఖ్యాతి గడించాడు. కెప్టెన్ అజయ్‌కుమార్‌రెడ్డి నాయకత్వంలో వరుసగా మూడు రంజీ ట్రోఫీలు గెలిచిన జట్టులో గణేష్ ఆటతీరు కీలకంగా మారింది. అజయ్‌కుమార్‌రెడ్డి తనకు స్ఫూర్తి అని, ఇండియా జట్టుకు ఆడాలన్నదే తన లక్ష్యమని గణేష్ తెలిపాడు. సాధారణ క్రికెటర్లలాగే అంధ క్రికెటర్లను కూడా ప్రభుత్వాలు గుర్తించి ఉద్యోగ అవకాశాలు కల్పించి ఆదుకోవాలని కోరుతున్నాడు. గణేష్ సాధించిన విజయాలు 2018 చెన్నైలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో ఏపీ నుంచి పాల్గొని జట్టు విజయంలో కీలకంగా మారాడు. 2018లో కోల్‌కత్తాలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో ఆల్‌రౌండ్ ప్రతిభ కనబరిచి బంగారు పతకం అందుకున్నాడు. 2019, 2020లో కేరళలో జరిగిన జాతీయ స్థాయి నగేష్ ట్రోఫీని ఆంధ్ర జట్టు కైవసం చేసుకోవడంలో కీలకంగా మారాడు. ఈ ఏడాది ఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయి క్రికెట్ పోటీల్లో ఆంధ్రా జట్టును విజయ తీరాలకు చేర్చాడు. -
ఘోర ప్రమాదం
సాక్షి, పుట్టపర్తి, అమరావతి/తాడిమర్రి/సాక్షి ప్రతినిధి, అనంతపురం: కూలీలు ప్రయాణిస్తున్న ఆటోపై విద్యుత్ తీగలు తెగి పడటంతో మంటలు చెలరేగి ఐదుగురు కూలీలు సజీవ దహనమయ్యారు. ఒకరు తీవ్రంగా గాయపడగా, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. శ్రీ సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లిలో గురువారం ఉదయం 7.30 గంటలకు ఈ దారుణం చోటుచేసుకుంది. స్థానికులు, కూలీలు తెలిపిన వివరాల మేరకు.. తాడిమర్రి మండలం పెద్దకోట్ల గ్రామానికి చెందిన గుండ్లమడుగు మెకానిక్ రాజా ఇటీవల 2 ఎకరాల్లో వేరుశనగ సాగు చేశాడు. కలుపు తొలగించేందుకు ఇతని భార్య కుమారి (28).. గుడ్డంపల్లికి చెందిన మరో 11 మంది కూలీలను తీసుకుని కునుకుంట్ల గ్రామానికి చెందిన పోతులయ్య ఆటోలో పొలానికి బయలుదేరింది. మొత్తం 13 మందితో వెళ్తున్న ఆటో చిల్లకొండయ్యపల్లి సమీపంలోకి రాగానే 11 కేవీ విద్యుత్ తీగ ఉన్నట్లుండి తెగి ఆటోపై పడింది. దీంతో ఆటోకు విద్యుత్ ప్రవహించి మంటలు చెలరేగాయి. దీంతో గుండ్లమడుగు కుమారితో పాటు కొంకా మల్లికార్జున భార్య రామలక్ష్మి (30), కొంకా చిన్న మల్లన్న భార్య పెద్ద కాంతమ్మ (45), కొంకా కిష్టయ్య భార్య రత్నమ్మ (40) కొంకా ఈశ్వరయ్య భార్య లక్ష్మీదేవి (41) సజీవ దహనమయ్యారు. కొంకా మంజునాథ్ భార్య గాయత్రికి తీవ్ర గాయాలు కాగా, కొంకా మధుసూదన్ భార్య అరుణ, కొంకా పెద్దన్న భార్య నాగేశ్వరమ్మకు స్వల్ప గాయాలయ్యాయి. ఆటో డ్రైవర్ పోతులయ్యతో పాటు కొంకా ఈశ్వరమ్మ, శివరత్నమ్మ, రమాదేవి, ఎ.రత్నమ్మలు ఆటోలోంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. తీవ్రంగా గాయపడిన గాయత్రిని మెరుగైన వైద్యం కోసం బెంగళూరు తరలించారు. మృతుల్లో కుమారి పెద్ద కోట్ల గ్రామానికి చెందగా.. మిగతా నలుగురు గుడ్డంపల్లి వాసులు. ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, ఎంపీపీ పాటిల్ భువనేశ్వర్‌రెడ్డి హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. అధికారులను అప్రమత్తం చేసి.. క్షతగాత్రులను అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ధర్మవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కొంప ముంచిన ఉడుత స్థంభంపై ఇనుప రాడ్డుకు, విద్యుత్ వైరు తగలకుండా మధ్యలో పింగాణీ పరికరాన్ని అమర్చుతారు. కానీ ఉడుత పొడవు ఆ పరికరాన్ని దాటి ఉండటంతో వైరును తాకింది. విద్యుత్ తీగకు స్తంభంపై ఉన్న ఇనుప రాడ్డుకి మధ్య ఉడుత పడటంతో దాని శరీరం గుండా విద్యుత్ ప్రవహించింది. ఆ వెంటనే షార్ట్ సర్క్యూట్, ఎర్త్ కారణంగా స్పార్క్ ఏర్పడి వైరు తెగిపోయింది. అప్పుడే అటుగా వచ్చిన ఆటోపై ఆ వైరు పడింది. అయినప్పటికీ ఆటోకి ఉండే టైర్లు ఎర్త్ అవ్వకుండా అడ్డుకోగలవు. కానీ ఆటోపై ఇనుప మంచం ఉంది. అదీగాక ఆ కంగారులో ఆటోలో ఉన్నవారెవరో కిందకు దిగే ప్రయత్నం చేశారు. వారు ఒక కాలు నేలపై, మరోకాలు ఆటోలో ఉంచడం వల్ల ఎర్త్ అయ్యి ఆటోకి వేల వాట్ల హై టెన్షన్ విద్యుత్ ప్రసరించి క్షణాల్లో కాలి బుగ్గయ్యింది. కాగా, ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్) సీఎండీ హరినాథరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శాఖ పరమైన విచారణకు ఆదేశించామని తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు (సీఎం ప్రకటించిన పరిహారం కాకుండా), తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షల తక్షణ సహాయం అందించనున్నట్టు వెల్లడించారు. ఇటీవలే కొత్త లైన్లు వేశాం కరెంటు పోళ్లు గానీ, వైర్ల విషయంలో గానీ ఎక్కడా లోపం లేదని, ఆరుమాసాల కిందటే కొత్త ఫీడర్లు వేశామని విద్యుత్ శాఖ అనంతపురం ఎస్ఈ నాగరాజు తెలిపారు. విద్యుత్ సరఫరా నిర్వహణలో లోపంగానీ, సాంకేతిక సమస్యలు గానీ ఎక్కడా లేవన్నారు. ఈ ఘటనపై విచారణాధికారిగా ఎస్పీడీసీఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ రషీద్‌ను నియమించారు. ఆయన శుక్రవారం ఘటన స్థలికి చేరుకుని పరిశీలించనున్నారు. ఉడుతలతో ప్రమాదం విద్యుత్ తీగలపై ఉడుతలు, తొండలు, పాములు, పక్షులు వంటివి పడటం సాధారణంగా తరచూ జరుగుతుంటుంది. పవర్ గ్రిడ్లలో వీటివల్ల అనేక సార్లు విద్యుత్ అంతరాయం ఏర్పడుతుంటుంది. ప్లాస్టిక్ యానిమల్ గార్డ్లను దాటేసి, చిన్న సందు దొరికితే చాలు సబ్‌స్టేషన్‌లోకి ఇవి దూరిపోతుంటాయి. ఇవి మోషన్ డిటెక్టర్లను దాటి కంచెల కింద సొరంగం కూడా చేయగలవు. టన్నెలింగ్, ఎలక్ట్రికల్ ఇన్సులేషన్ ద్వారా కొరకడం, నమలడం, వేర్వేరు విద్యుత్ పొటెన్షియల్స్లో ఉన్న రెండు కండక్టర్లపై ఏకకాలంలో పడటం ద్వారా విద్యుత్ పంపిణీ వ్యవస్థను దెబ్బతీస్తాయి. ఫలితంగా షార్ట్ సర్క్యూట్ జరిగి తీగలు తెగిపోవడం, విద్యుత్ సరఫరా నిలిచిపోవడం ఏకకాలంలో జరుగుతుంది. ఇంటర్నెట్, మౌలిక సదుపాయాలు వంటి సేవలకు ఉడుతల వల్ల కలిగే ముప్పు సైబర్, ఉగ్ర దాడుల వల్ల కలిగే ముప్పు కంటే ఎక్కువగా ఉంటుందని అంతర్జాతీయ భద్రత సంస్థ ప్రకటించింది. ఇప్పటికే ఉడుతలు అనేక దేశాల్లో పవర్ గ్రిడ్లను నిర్వీర్యం చేయగలవని రుజువైంది. గవర్నర్, సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి చిల్లకొండయ్యపల్లిలో జరిగిన ప్రమాదంపై గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు గవర్నర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. పారిస్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి.. సీఎంఓ ద్వారా ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని తెలిపారు. ఈ ఘటనపై రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు. -
సత్యసాయి జిల్లా: ఆటో ప్రమాదానికి కారణం ఇదే..
సాక్షి, సత్యసాయి జిల్లా: తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లిలో విషాద ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆటోలో వెళ్తున్న కూలీలపై హై టెన్షన్ కరెంట్ వైర్లు తెగిపడటంతో మంటలు చెలరేగి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు మృతిచెందగా.. ఆరుగురు గాయపడ్డారు. ఈ ఘటనపై డీఎస్పీ రమాకాంత్ స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కుటుంబ సభ్యులు వ్యవసాయ పనుల కోసం ఆటోపై ఇనుప మంచం తీసుకెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఇనుప మంచానికి తెగిపడిన విద్యుత్ తీగ తగలడంతో మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో కొందరు ఆటో నుంచి దూకి బయటపడ్డారు. ఆటోలో ఉన్న ఐదుగురు మహిళలు మాత్రం మంటల్లో సజీవ దహనమయ్యారు. మృతులను గుడ్డంపల్లి వాసులుగా గుర్తించాము అని తెలిపారు. ఇదిలా ఉండగా.. విద్యుత్ ప్రమాద ఘటనపై ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ హరినాధ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ప్రమాద ఘటనలో వెలుగు చూసిన దాని ప్రకారం ఒక ఉడుత కారణంగా ఈ ప్రమాదం జరిగిందని నిర్ధారించారు. కరెంట్ వైర్‌ను ఎర్త్‌ను ఉడుత క్రాస్ చేయడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ప్రమాద ఘటనపై శాఖ పరమైన విచారణకు ఆదేశించనట్టు వెల్లడించారు. అనంతపురం ఎస్.ఈతో పూర్తి విచారణకు ఆదేశించామని, ప్రమాదంలో మృతి చెందిన వారికి రూ. 5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 2 లక్షల తక్షణ సహాయం అందిచనున్నట్టు తెలిపారు. ఇక, ఈ ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. పారిస్ పర్యటనలో ఉన్న ఆయన.. సీఎంవో ద్వారా ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరపున మృతుల కుటుంబాలకు పది లక్షల రూపాయాల చొప్పున పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే.. ఈ ప్రమాదంలో గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని తెలిపారు. బాధితుల కుటుంబాలకు అండగా నిలవాలని సీఎం జగన్ ఈ సందర్భంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఇది కూడా చదవండి: సీఎం జగన్ దిగ్భ్రాంతి.. ఎక్స్‌గ్రేషియాకు, మెరుగైన చికిత్సకు ఆదేశం -
ఆటో ప్రమాదం: సీఎం జగన్ దిగ్భ్రాంతి.. ఎక్స్‌గ్రేషియాకు ఆదేశం
సాక్షి, అమరావతి: శ్రీ సత్యసాయి జిల్లా ఘోర ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. పారిస్ పర్యటనలో ఉన్న ఆయన.. సీఎంవో ద్వారా ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. గురువారం ఉదయం ధర్మవరం నియోజకవర్గం తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లి వద్ద హైటెన్షన్ విద్యుత్ వైర్లు తాకి ఆటో ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఐదుగురు మహిళా కూలీలు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం జగన్.. ప్రభుత్వం తరపున మృతుల కుటుంబాలకు పది లక్షల రూపాయాల చొప్పున పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే.. ఈ ప్రమాదంలో గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని తెలిపారు. బాధితుల కుటుంబాలకు అండగా నిలవాలని సీఎం జగన్ ఈ సందర్భంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లి వద్ద ఆటోపై హైటెన్షన్ విద్యుత్తు తీగ పడిన ఘటనలో.. ఐదుగురు మహిళలు సజీవదహనం అయ్యారు. ప్రమాద సమయంలో 12 మంది ఆటోలో ప్రయాణిస్తున్నారు. మృతిచెందిన వారిని గుడ్డంపల్లి వాసులు కాంతమ్మ, రాములమ్మ, రత్తమ్మ, లక్ష్మీదేవి, పెద్దకోట్లకు చెందిన కుమారిగా గుర్తించారు. ఇద్దరికి తీవ్రగాయాలు కాగా, ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. -
సత్యసాయి జిల్లా: ఘోర ప్రమాదం.. 5 మంది సజీవ దహనం
సాక్షి, సత్యసాయి: జిల్లాలోని తాడిమర్రి మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. చిల్లకొండయ్యపల్లిలో గురువారం ఉదయం వ్యవసాయ పనుల కోసం 5 మంది మహిళా కూలీలు ఆటోలో వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆటోపై.. హైటెన్షన్ కరెంట్ తీగలు తెగిపడిపోయాయి. దీంతో, ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటల్లో ఆటోలో వెళ్తున్న ఐదు మంది మహిళా కూలీలు అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిని గుడ్డంపల్లి వాసులుగా గుర్తించారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇది కూడా చదవండి: ‘దృశ్యం’ సినిమాను తలపించిన ప్రీప్లాన్డ్ కిడ్నాప్ డ్రామా.. -
కులాంతర వివాహంతోనే హత్య
రాప్తాడు: ఉమ్మడి జిల్లాలో సంచలనం సృష్టించిన చిట్రా మురళి హత్య కేసును పోలీసులు ఛేదించారు. స్థానిక పోలీసుస్టేషన్లో బుధవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన మేరకు.. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండల కేంద్రానికి చెందిన కురుబ చిట్రా నాగన్న, ముత్యాలమ్మ దంపతుల కుమారుడు చిట్రా మురళి, అదే గ్రామంలో కమ్మ సామాజికవర్గానికి చెందిన ములుగూరు రామానాయుడు (లేట్), యశోదమ్మ దంపతుల కుమార్తె వీణలు ప్రేమించుకున్నారు. గతేడాది జూన్ 23న ఉరవకొండ మండలం పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వివాహం చేసు కున్నారు. కొన్ని రోజుల తర్వాత రాప్తాడు ఎస్సీ కాలనీలో కాపురం పెట్టారు. మురళి కియా కంపెనీలో ఉద్యోగానికి కుదరగా, వీణ కనగానపల్లి మండలం ఎలక్కుంట్ల సచివాలయంలో మహిళా పోలీస్‌గా విధులు నిర్వర్తించేది. మురళిని కడతేర్చుతానని యశోదమ్మ శపథం కుమార్తె కులాంతర వివాహం చేసుకోవడం ఇష్టం లేని వీణ తల్లి యశోదమ్మ రగిలిపోయేది. కొన్ని రోజుల క్రితం కూతురితో మాట్లాడిన ఆమె నీ మొగుణ్ణి కడతేర్చుతానని శపథం చేసింది. తన బంధువులైన అప్పన్న గారి వెంకటేశులు (అనంతపురం), సుబ్రమణ్యం (మాజీ సర్పంచ్, కనగానపల్లి) ద్వారా అనంతపురానికి చెందిన సాకే సర్దార్తో మురళిని హత్య చేసేందుకు రూ.10 లక్షలకు ఒప్పందం చేసుకుంది. రూ.2 లక్షలు అడ్వాన్స్ ఇచ్చి మిగతా మొత్తం హత్య తర్వాత ఇస్తామని చెప్పింది. రంగంలోకి దిగిన సర్దార్ తన ముఠా సభ్యులైన రవి, సయ్యద్ సద్దాం, పెనకలపాటి సుబ్రమణ్యం అలియాస్ మణి, పెనకలపాటి ప్రకాష్‌తో కలిసి మురళి హత్యకు రెక్కీ నిర్వహించాడు. కియా కంపెనీకి వెళ్లేందుకు మురళి రోజూ రాప్తాడు సమీపంలోని జాతీయ రహదారిపై బస్సు కోసం వేచి ఉండడం గమనించాడు. ఎప్పటిలాగే మురళి ఈ నెల 16న వేచి ఉండగా నలుగురూ కలిసి ఓ ఆటోలో కిడ్నాప్ చేశారు. బొమ్మేపర్తి సమీపంలోని పొలాల్లోకి తీసుకెళ్లి కత్తులతో విచక్షణారహితంగా గొంతు కోసి హత్య చేశారు. దీనిపై మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు బుధవారం అనంతపురం మండలం సోమలదొడ్డిలో 8 మంది నిందితులను అరెస్టు చేశారు. నిందితుల నుంచి ఆటో, బైక్, 2 చాకులు, 8 సెల్ఫోన్లతో పాటు రూ.4.70 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. హత్య జరిగిన 6 రోజుల్లోనే కేసును ఛేదించిన డీఎస్పీ శ్రీనివాసులు బృందాన్ని ఎస్పీ ఫక్కీరప్ప అభినందించారు. కార్యక్రమంలో ఇటుకల పల్లి సీఐ మురళీధర్, ఎస్ఐ రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. (చదవండి: రాధ మిస్సింగ్ కేసు: హైకోర్టు అడ్వకేట్ శిల్ప ఇంట్లో ఎన్ఐఏ తనిఖీలు) -
వింత ఆచారం.. సమాధులే దేవాలయాలు!
ధర్మవరం రూరల్(శ్రీ సత్య సాయి జిల్లా): చనిపోయిన వారి జ్ఞాపకార్థంగా సమాధులు కట్టడం, వర్ధంతులు, జయంతులు, పండుగ పూట పూజలు చేయడం మామూలుగా మనం చూస్తుంటాం. అయితే ధర్మవరం మండలం సుబ్బరావుపేట గ్రామంలో వింత ఆచారం నడుస్తోంది. చనిపోయిన వారికి ఇక్కడ సమాధులు కట్టడమే కాకుండా పైన దేవతామూర్తుల విగ్రహాలు ఉంచి చిన్న పాటి గుడిలాంటిది నిర్మిస్తున్నారు. ఇక్కడ గ్రామస్తులు నిత్యం పూజలు చేస్తుంటారు. దీంతో పాటు ఏటా తొలి ఏకాదశి రోజున ఇక్కడ జాతర నిర్వహిస్తుండం గమనార్హం. సమాధిపైన చనిపోయిన వారి చిత్రం.. 45 ఏళ్ల క్రితం బళ్లారి ప్రాంతం నుంచి ధర్మవరం మండలం సుబ్బరావుపేట గ్రామానికి పెద్ద బొమ్మయ్య వంశీకులు వచ్చి స్థిరపడిపోయారు. ప్రస్తుతం ఆ వంశానికి చెందిన కుటుంబాలు గ్రామంలో 14 వరకు ఉన్నాయి. పెద్ద బొమ్మయ్య మరణానంతరం అతని జ్ఞాపకార్థం సమాధి నిర్మించిన కుటుంబీకులు.. పూడ్చిన చోటనే గంగమ్మ దేవాలయాన్ని నిర్మించారు. అప్పటి నుంచి పెద్ద బొమ్మయ్య వంశీకులు ఎవరు చనిపోయినా ఆలయం పక్కనే వారిని ఖననం చేసి సమాధి కడుతున్నారు. పెద్ద బొమ్మయ్య సమాధిపై ప్రతిష్టించిన గంగమ్మ దేవత విగ్రహాలు అనంతరం వాటిపై చిన్నదేవాలయం లాంటి నిర్మాణమో.. లేకుంటే పూడ్చిన వ్యక్తి చిత్రాన్నో దానిపై నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి చిన్నచిన్న ఆలయాలు కట్టిన ఆలయాలు నాలుగుదాకా ఉన్నాయి. ఇక.. సమాధులపై వేసిన చిత్రాలను దూరం నుంచి చూస్తే ఎవరో పడుకుని ఉన్నట్లుగా భ్రమ కలుగుతుండడం గమనార్హం. పెద్ద బొమ్మయ్య వంశస్తుల మరో ప్రత్యేకత ఏమిటంటే తమ కుటుంబంలో పుట్టే ప్రతి బిడ్డకూ పూరీ్వకుడు బొమ్మయ్యే పేరు కొనసాగిస్తుండడం. ప్రస్తుతం గ్రామంలో చిన్న బొమ్మయ్య, పెద్ద బొమ్మయ్య, నడిపి బొమ్మయ్య, సన్న బొమ్మయ్య ఇలా మగవాళ్ల పేర్లన్నీ ఒకేలా ఉన్నాయి. తాతల కాలం నుంచి అఖండం వెలుగుతోంది మేమంతా పూరీ్వకులను పూజిస్తుంటాం. వారి జ్ఞాపకార్థం సమాధులను నిర్మించి వాటిపై ప్రతిమలు ఏర్పాటు చేయించి పూజలు చేస్తాం. సమాధిపై నిర్మించిన గంగమ్మ గుడిలో మా తాతలు పెట్టిన అఖండం నేటికీ వెలుగుతోంది. కేవలం ఒత్తులు మాత్రమే మారుస్తుంటాం. ఆచారాన్ని మా పిల్లలకు కూడా నేర్పుతాం. – చిన్నబొమ్మయ్య, సుబ్బరావుపేట -
AP: అందరి చూపు మనవైపే.. దేశంతోనే పోటీ పడుతున్నాం..
మొన్నామధ్య చంద్రబాబు అనంతపురం వచ్చారు.. గోదావరి జిల్లాలకూ వెళ్లారు.. ఆత్మహత్య చేసుకున్న నిజమైన రైతు (పట్టాదారు పాసుపుస్తకం ఉన్న) ఎవరికైనా పరిహారం అందకపోతే చూపించండని సవాల్ విసిరితే స్పందన లేదు. మన కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఎంత ఆవేదన వ్యక్తం చేస్తామో.. అంతగా ఆ రైతు కుటుంబాలకు తోడుగా నిలబడ్డాం. గత ప్రభుత్వంలో 458 మంది రైతులు చనిపోతే ఇదే బాబు పరిహారం ఇవ్వకపోతే.. మన ప్రభుత్వం వచ్చాక ఇచ్చాం. జిల్లాలకు వెళ్లాలి.. పల్లెలకు వెళ్లాలని ఈ దత్తపుత్రుడు అప్పుడు ఎందుకు ముందుకు రాలేదు? కోనసీమలో క్రాప్ హాలిడే అంటూ చంద్రబాబు రైతులను రెచ్చగొడుతున్నారు. మీరు ఎగ్గొట్టిన ధాన్యం బకాయిలను మేము తీర్చినందుకా? కేంద్రం నుంచి సకాలంలో డబ్బు రాకపోయినా ధాన్యం డబ్బులు ఇవ్వడం కోసం కిందా మీద ప్రయాస పడుతున్నందుకా? రైతుల కోసం ఇన్ని పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్నందుకా? చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు ఏం సమాధానం చెబుతారు? ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా దేవుడి దయ, ప్రజలందరి ఆశీస్సులతో మీ బిడ్డ ఎవ్వరినైనా ఎదుర్కోగలడు. గతంలో పాలన, ఇప్పుడు మీ బిడ్డ పాలన ఎలా ఉందో ఒక్కసారి మార్పులు గమనించాలని కోరుతున్నా. – సీఎం వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘రైతులకు మేలు చేయడంలో మనం పోటీ పడుతున్నది ప్రతిపక్షాలతో కాదు.. దేశంతోనే పోటీ పడుతున్నాం. చాలా రాష్ట్రాల ప్రతినిధులు మన రాష్ట్రంలో వ్యవసాయ కార్యక్రమాలు ఎలా ఉన్నాయో చూసి వెళ్తున్నారు. తమ ప్రాంతంలో కూడా ఇలాంటివి ఎలా అమలు చేయాలని అడుగుతున్నారు. దేశం యావత్తు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోంది’ అని సీఎం వైఎస్ జగన్ అన్నారు. అన్నదాతలకు అడుగడుగునా అండగా నిలుస్తున్న ప్రభుత్వం మనదని స్పష్టం చేశారు. మంగళవారం ఆయన శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని చెన్నేకొత్తపల్లిలో వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం కింద 2021 ఖరీఫ్‌లో పంట నష్టపోయిన రాష్ట్రంలోని 15.61 లక్షల మంది రైతులకు రూ.2,977.82 కోట్ల బీమా పరిహారాన్ని కంప్యూటర్లో బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతంలోలాగా పరిహారం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసే పరిస్థితి నేడు లేదన్నారు. ఒక్క పైసా ఖర్చు లేకుండా ఈ–క్రాప్‌లో పేరు నమోదు చేసుకుంటే చాలు.. రైతు ఖాతాలోనే నేరుగా సొమ్ము వచ్చి పడేలా చేస్తున్నామని చెప్పారు. దీన్ని బట్టి గతంలో పాలన ఎలా సాగింది.. ఇప్పుడు మీ బిడ్డ పాలన ఎలా ఉందో బేరీజు వేసుకోవాలని కోరారు. ఏ సీజన్లో నష్టం జరిగితే ఆ సీజన్ మళ్లీ మొదలయ్యేలోగా పరిహారం ఇస్తున్న ప్రభుత్వం ఇదేనని చెప్పారు. ప్రభుత్వం ఓవైపు నవరత్నాలు పథకాల ద్వారా తోడుగా ఉంటూనే.. మరోవైపు చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా వ్యవసాయానికి అండగా నిలుస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. చెన్నేకొత్తపల్లిలో జరిగిన బహిరంగసభలో ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడేళ్లలోనే రూ.6,685 కోట్లు ఇచ్చాం ► 2014 – 2019లో తెలుగుదేశం పాలన సాగింది. ఆ ఐదేళ్లలో పంటల బీమా కింద ఆ ప్రభుత్వం 30.85 లక్షల మంది రైతులకు కేవలం రూ.3,411 కోట్లు మాత్రమే పరిహారం ఇచ్చింది. అదే మనం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వమే పూర్తిగా ప్రీమియం చెల్లిస్తూ ఈ మూడేళ్లలోనే 44.28 లక్షల మందికి రూ.6,685 కోట్లు ఇచ్చామని సగర్వంగా చెబుతున్నా. ► 2012 – 2013 సంవత్సరానికి సంబంధించి రూ.120 కోట్లకు పైగా పంటల బీమా బకాయిలు ఇచ్చే అవకాశం ఉన్నా ఇవ్వలేదు. ఆ తర్వాత చంద్రబాబు హయాంలో రూ.590 కోట్లు రైతులకు ఎగ్గొట్టారు. గత ప్రభుత్వాలు పెట్టిన రూ.715.84 కోట్ల బకాయిలను మీ బిడ్డ ప్రభుత్వంలోనే ఇచ్చామని చెబుతున్నా. ఇన్ని మార్పులు ఎక్కడైనా జరిగాయా? ► వైఎస్సార్ రైతు భరోసా–పీఎం కిసాన్ పథకం కింద 53 లక్షల రైతు కుటుంబాలకు మంచి చేస్తూ ఈ మూడేళ్లలోనే రూ.23,875 కోట్లు వారి చేతుల్లో పెట్టాం. జూన్ అంటేనే వ్యవసాయ పండుగ నెల. దీంతో రైతుకు తోడుగా నిలబడేందుకు రైతు భరోసా కింద రూ.7,500 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేశాం. చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో రైతుల కోసం మీ బిడ్డ రూ.1.28 లక్షల కోట్లు ఖర్చు చేశాడు. ► గతంలో పాలకులకు అనుకూలమైన వారికే పరిహార ఫలాలు అందేవి. ఇప్పుడలా కాకుండా, వివక్షకు తావు లేకుండా అందరికీ ఇస్తున్నాం. ఇన్పుట్ సబ్సిడీ రూపంలో రూ.1,613 కోట్లు, వడ్డీ లేని రుణాల కింద రూ.1,283 కోట్లు చెల్లించాం. గతంలో చంద్రబాబు ఐదేళ్లలో సున్నా వడ్డీ కింద కేవలం రూ.780 కోట్లు మాత్రమే ఇచ్చారు. అదే మనం మూడేళ్లలోనే రూ.1,283 కోట్లు ఇచ్చాం. ► ఈ మూడేళ్లలో 10,778 రైతు భరోసా కేంద్రాలు మన కళ్లెదుటే కనిపిస్తున్నాయి. ఆ కేంద్రాల్లో 24,480 మంది మన పిల్లలు సేవలందిస్తున్నారు. విత్తనం నుంచి విక్రయం వరకు ఆర్బీకేలు రైతుల చెయ్యి పట్టుకుని నడిపిస్తున్నాయి. కమ్యూనిటీ హైరింగ్ సెంటర్ల ద్వారా యంత్ర సామగ్రిని రాయితీతో ఇస్తున్నాం. ఉచిత విద్యుత్, ధాన్యం బకాయిలూ చెల్లించాం ► రైతులకు ఈ మూడేళ్లలో ఉచిత విద్యుత్ కింద పగటిపూట తొమ్మిది గంటల పాటు విద్యుత్ ఇచ్చేందుకు రూ.25,800 కోట్లు ఖర్చు చేశాం. ఫీడర్లు మెరుగు పడాలని మరో రూ.1,700 కోట్లు ఖర్చు చేస్తున్నాం. గత ప్రభుత్వం రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని మోసం చేసింది. ఆ బకాయిలు రూ.8,750 కోట్లు ఉంటే వాటిని కూడా మన ప్రభుత్వమే చెల్లించింది. ► ధాన్యం డబ్బు చెల్లింపుల్లో గత ప్రభుత్వం రూ.960 కోట్లు బకాయిలు పెడితే ఆ డబ్బూ మనమే చెల్లించాం. విత్తనాల కొనుగోలుకు కూడా అప్పటి ప్రభుత్వం రూ.430 కోట్లు బకాయి పెడితే మనమే ఇచ్చాం. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, రూ.2 వేల కోట్లతో ప్రకృతి వైపరీత్యాల నిధి ఏర్పాటు చేశాం. ప్రతి ఏడాది వచ్చిన నష్టాన్ని భర్తీ చేస్తున్నాం. ► గతంలో దురదృష్టవశాత్తు రైతు ఆత్మహత్య చేసుకుంటే అవి ఆత్మహత్యలు కావని ప్రభుత్వాలు చెప్పేవి. ఈరోజు ఎవరైనా రైతు చనిపోతే ఆ కుటుంబాన్ని పక్కాగా ఆదుకుంటున్నాం. కౌలు రైతుకు సీసీఆర్సీ కార్డు ఉంటే వెంటనే రూ.7 లక్షల పరిహారం ఇస్తున్నాం. ► పాడి రైతులకు మంచి చేయడానికి అమూల్‌ను తీసుకొచ్చాం. ఈ కాంపిటీషన్ తట్టుకోవడానికి హెరిటేజ్ కంపెనీ కూడా లీటరుకు రూ.5 నుంచి రూ.10 పెంచాల్సి వచ్చింది. అప్పుడు నాయకుల జేబుల్లోకి డబ్బు వెళ్లేది. ఇవాళ మీ బిడ్డ బటన్ నొక్కి మీ ఖాతాల్లోకి వేస్తున్నారు. బాబు.. దత్తపుత్రుడు.. ఆ మూడు ► మనం ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేస్తున్నామంటే ముందు బాబు, తర్వాత ఆయన దత్తపుత్రుడు.. వీళ్లిద్దరికీ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 అందరూ ఏకమవుతారు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు అబద్ధానికి రంగులు పూస్తారు. ► చంద్రబాబు లేదా దత్తపుత్రుడు వస్తే అడగండి.. గతంలో మేనిఫెస్టోను చూసి ఓట్లేశాం.. ఆ మేనిఫెస్టోను ఎందుకు అమలు చేయలేదని నిలదీయండి. రుణమాఫీ అంటూ మోసం చేసి.. ఉచిత విద్యుత్, ధాన్యం, విత్తన బకాయిలు, పంటల బీమా కూడా చెల్లించకుండా బకాయిలు ఎగ్గొటిన చంద్రబాబు వీళ్ల దృష్టిలో మంచోడట. ► కోవిడ్ వల్ల రెండేళ్ల తర్వాత పదో తరగతి పరీక్షలు జరిగాయి. ఆ రెండేళ్లూ పరీక్షలు లేకుండా పాస్ చేశాం. ఇప్పుడు పరీక్షలు పెడితే 67 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. గుజరాత్లో 65 శాతం మందే ఉత్తీర్ణులయ్యారు. ఇలాంటి సమయంలో వారికి ఆత్మస్థైర్యం ఇవ్వాల్సిందిపోయి వారిని రెచ్చగొట్టడానికి యత్నిస్తున్నారు. ► మన పిల్లలకు ఇవ్వాల్సింది నాణ్యమైన చదువులు. ప్రపంచంతో పోటీ పడేటప్పుడు వారి చదువుల్లో క్వాలిటీ ఉండాలి. విద్యా రంగంలో తీసుకు వస్తున్న మార్పులను తట్టుకోలేక దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. ► మాట ఇచ్చి తప్పితే ఏమనుకుంటారోనన్న బాధ లేని వారు రాజకీయాలకు అర్హులా.. అని అడుగుతున్నా. ఏం చేస్తే చంద్రబాబుకు మంచి జరుగుతుందో.. అది చేయడానికి ఉరుకులు పరుగులు తీసే మరో వ్యక్తి దత్తపుత్రుడు. ప్రజలను మోసం చేసే వీళ్లిద్దరూ తోడుదొంగలు. రాజకీయాల్లో ఉండేందుకు వీళ్లు అర్హులేనా అనేది మీరు చెప్పాలి. ► మూడేళ్ల పాలనలో మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశాన్నీ అమలు చేశాం. ఆ మేనిఫెస్టోను చూసి మీరే టిక్ పెట్టండి. ఇద్దరికీ తేడా మీరే గమనించండి. అంబేడ్కర్ పేరు పెడితే మంత్రి ఇంటిని తగలబెడతారా? ► కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ మహానుభావుడి పేరు పెట్టాం. దీంతో ఒక దళిత మంత్రి, బీసీ ఎమ్మెల్యే ఇంటిని కాల్చేశారు. అంబేడ్కర్ పేరు పెడితే జీర్ణించుకోలేక పోయారు. ఇదా మీరు చూపించే సామాజిక న్యాయం? ఇలాంటి వాళ్లు రాజకీయాల్లో ఉండేందుకు అర్హులేనా? ► మీ బిడ్డ మంత్రి వర్గంలో 70 శాతం బీసీ, ఎస్సీ ఎస్టీ, మైనార్టీలు మంత్రులుగా ఉన్నారు. సామాజిక న్యాయానికి నిజమైన అర్థం చెబుతున్నాం. ఉద్యోగుల విషయంలోనూ ఇదే ధోరణి. ఉద్యోగులకు ప్రతి విషయంలోనూ మంచి చేస్తున్నాం. అయినా వారిని రెచ్చగొట్టే దిక్కుమాలిన ఆలోచన చేస్తున్నారు. ► ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్దన్ రెడ్డి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్, జిల్లా ఇన్చార్జ్ మంత్రి గుమ్మనూరు జయరాం, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఇతర నేతలు, అధికారులు పాల్గొన్నారు. ఒక్క ఏడాదే రూ.2,977 కోట్లు పంటల బీమా కోసం రైతుల ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లిస్తోంది. ఒక్క ఏడాదే రూ.2,977 కోట్ల బీమా ఇవ్వడం చరిత్రాత్మకం. విత్తనం నుంచి విక్రయం దాకా అన్నింటికీ జగన్ సర్కార్ అండగా ఉంటోంది. సీఎం జగన్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. మొత్తంగా ఈ మూడేళ్లలో రైతన్నలకు ఈ ప్రభుత్వం రూ.1,27,823 కోట్లు అందించింది. ఇన్ని చేస్తున్నా, ప్రతిపక్షం పసలేని ఆరోపణలు చేస్తోంది. వారికి ఇప్పటికైనా దేవుడు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుకుంటున్నాం. – కాకాణి గోవర్ధన్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి మూడేళ్లలో రూ.2.70 లక్షలు ఇవాళ ఉగాది వచ్చినంత సంతోషంగా ఉంది. బీమా సొమ్ము ఇచ్చినందుకు రైతులందరి తరఫున సీఎంకు ధన్యవాదాలు. నాకు రూ.9 వేల ఇన్సూరెన్స్ అందింది. మొన్న రైతు భరోసా–పీఎం కిసాన్ కింద రూ.7,500 ఇచ్చారు. గతేడాది నవంబర్, డిసెంబర్లో అధిక వర్షాలు కురిసి నష్టం రాగా, రూ.24 వేల ఇన్పుట్ సబ్సిడీ వచ్చింది. వివిధ పథకాల ద్వారా ఈ మూడేళ్లలో నా కుటుంబానికి రూ.2,70,000 లబ్ధి కలిగింది. – ఫక్కీరప్ప, రైతు, శ్రీసత్యసాయి జిల్లా చంద్రబాబు రావణుడి లాంటివాడు చంద్రబాబు హయాంలో ఒక్క సంక్షేమ పథకాన్నీ తీసుకు రాలేదు. పైగా ఏకంగా రూ.3 లక్షల కోట్లు మాయం చేశారు. రావణుడి లాంటివాడు. అదే జగనన్న ప్రభుత్వం గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చింది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ నిర్దేశించిన సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపించింది. జగనన్న నాయకత్వంలో పని చేస్తున్నందుకు మాకు గర్వంగా ఉంది. ప్రస్తుతం ఒక్క రాప్తాడు నియోజకవర్గానికే రూ.116 కోట్ల పంటల బీమా అందించడం పట్ల సీఎం జగన్‌కు ధన్యవాదాలు. – తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, రాప్తాడు ఎమ్మెల్యే -
YSR Uchitha Pantala Bheema Scheme: రైతుకు అండగా.. సీఎం వైఎస్ జగన్ పవర్ ఫుల్ స్పీచ్
-
అన్నదాతకు అండగా సీఎం జగన్ (ఫొటోలు)
-
మీ ఆశీస్సులు ఉన్నంతవరకు ఎవరినైనా ఎదుర్కొంటా: సీఎం జగన్
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: అనంతపురం జిల్లాను ఎడారి జిల్లా అనేవారని.. దేవుడి దయ వల్ల అలాంటి పరిస్థితులు మారిపోతున్నాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. గంగమ్మ తల్లి నేరుగా పైకి వచ్చే పరిస్థితులు ఉన్నాయన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా చెన్నే కొత్తపల్లిలో జరిగిన కార్యక్రమంలో రైతన్నలకు రూ.2,977.82 కోట్ల బీమా పరిహారాన్ని మంగళవారం వారి ఖాతాల్లో నేరుగా జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. 2021 ఖరీఫ్‌లో పంటనష్టపోయిన 15.61 లక్షలమంది రైతులకు రూ.2,977.72 కోట్లు ఇస్తున్నామన్నారు. చదవండి: ఈ నెల 22న ఏపీ కేబినెట్ భేటీ సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ‘‘ఒక్క ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే రైతులకు బీమా కింద రూ.885 కోట్లు చెల్లిస్తున్నాం. ప్రభుత్వ పాలనలో మార్పును గమనించాలని కోరుతున్నాం. ఇంతకు ముందు బీమా వస్తుందో లేదో తెలియని పరిస్థితి. ఎవరికి వస్తుందో, ఎవరికి రాదో తెలియని పరిస్థితి. ఒక సీజన్లో నష్టం జరిగితే.. మళ్లీ మరుసటి ఏడాది అదే సీజన్ రాకముందే నేరుగా రైతుల చేతుల్లో పెడుతున్నాం. లంచాలు, వివక్ష లేకుండా పంటల బీమా పరిహారాన్ని చెల్లిస్తున్నాం. పారదర్శకంగా ప్రతిరైతన్న కుటుంబానికీ మంచి జరుగుతోంది. పంట నష్టపోతే, రైతు నష్టపోతే రాష్ట్రం నష్టపోతుంది. అందుకే పంటల బీమా విషయంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాం. గడచిన మూడేళ్లుగా రైతులకు పంట నష్టం విషయంలో ఈ ప్రభుత్వం తోడుగా నిలబడింది. గత ప్రభుత్వం.. ఈ ప్రభుత్వం.. తేడా గమనించండి... గత తెలుగుదేశం పార్టీ పాలనలో అక్షరాల ఐదేళ్ల కాలానికి పంటల బీమా కింద 30.85 లక్షల మంది రైతులకు రూ.3411 కోట్లు ఇచ్చారు. ఇవాళ మీ బిడ్డ పాలనలో మూడేళ్ల కాలంలో అక్షరాల 44.28లక్షల మంది రైతులకు ఉచితంగా పంటల బీమా చేయించి రూ.6.685 కోట్లు చెల్లిస్తున్నాం. గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి తేడాను గమనించమని కోరుతున్నాను. గత ప్రభుత్వం పెట్టిన రూ.715.84 కోట్ల రూపాయల పంటల బీమా బకాయిలను కూడా మీ బిడ్డ ప్రభుత్వం చెల్లించింది. పంటల బీమాకు సంబంధించి గత ప్రభుత్వం బకాయిలు పెడితే.. ఈ ప్రభుత్వం ఏ సీజన్లో జరిగిన నష్టాన్ని.. మళ్లీ అదే సీజన్ వచ్చేలోగా పెడుతున్నారు. రైతన్నలకు మేలు చేసే విషయంలో మనం గత పాలకులతో కాదు పోటీపడేది.. దేశంతో పోటీపడుతున్నాం. మన గ్రామాల్లో ఆర్బీకేలను చూసేందుకు కేంద్ర ప్రభుత్వ పెద్దలు వస్తున్నారు. ఆర్బీకేల ద్వారా వస్తున్న మార్పులను చూస్తున్నారు. మూడేళ్లుగా మన పాలనలో వచ్చిన మార్పులను చూడండి గతంలో ఎప్పుడూ చూడని విధంగా.. గతంలో ఎప్పుడూ చూడని విధంగా వైఎస్సార్ రైతుభరోసా, పీఎం కిసాన్ కింద రూ.23,875కోట్ల రూపాయలు ఈ ఒక్క పథకం ద్వారానే నేరుగా రైతన్నల చేతుల్లో పెట్టాం. జూన్ మాసం రాకముందే.. వ్యవసాయ పనులు రాకముందే... రైతు భరోసా సొమ్మును నేరుగా రైతన్నల ఖాతాల్లో వేశాం. మూడేళ్లలో చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా రైతుల కోసం మీ బిడ్డ ప్రభుత్వం చేసిన ఖర్చు అక్షరాల రూ.1,27,823 కోట్లు. పంటల బీమాకు మొత్తం ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తోంది. ఇ-క్రాపింగ్ చేయించి ప్రతి రైతన్నకు పారదర్శకంగా చెల్లింపులు చేస్తున్నాం. సీజన్లో నష్టం జరిగితే.. సీజన్ ముగియకముందే ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నాం. రైతులకు సున్నావడ్డీకింద రూ.1283 కోట్లు చెల్లించాం మూడేళ్లలో. గత ప్రభుత్వంలో ఐదేళ్లకాలంలో సున్నావడ్డీ కింద చెల్లించింది కేవలం రూ.782 కోట్లు. ఆర్బీకేలు రైతన్నలకు తోడుగా నిలుస్తున్నాయి. పగటి పూటే 9 గంటలపాటు రైతన్నలకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. దీని కోసమే ఫీడర్లకోసం రూ.1700 కోట్లు పెట్టాం. గత ప్రభుత్వం పెట్టిన రూ. 8,845 కోట్ల ఉచిత విద్యుత్ బకాయిలను చెల్లించాం. ధాన్యం చెల్లింపులకోసం గత ప్రభుత్వం రూ.960 కోట్లు బకాయిలు పెడితే దాన్ని చెల్లించాం. విత్తనాల కొనుగోలు కోసం బకాయిలు పెట్టిన రూ. 384 కోట్ల డబ్బునుకూడా ఈ ప్రభుత్వమే చెల్లించింది. దురదృష్టవశాత్తూ రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఆ రైతన్న కుటుంబానికి రూ.7 లక్షల వెంటనే ఇస్తున్నాం. కౌలు రైతు ఆత్మహత్య దురదృష్టవశాత్తు చేసుకుంటే వెంటనే ప్రభుత్వం ఆదుకుంటుంది దత్త పుత్రుడికి ఆరోజు గుర్తుకు రాలేదు.. చంద్రబాబు దత్తపుత్రుడు అనంతపురం వచ్చాడు. గోదావరి జిల్లాలకు కూడా వెళ్లాడు. పట్టాదారు పాసు పుస్తకం ఉండి, ఆత్మహత్య చేసుకుంటే పరిహారం అందని రైతు కుటుంబాన్ని చూపించగలవా? అని సవాల్ విసిరితే.. చూపించలేకపోయారు. సీసీఆర్సీ కార్డు ఉండి.. ఆత్మహత్యచేసుకుని ఉన్న కౌలు రైతును ఒక్కరినైనా చూపించగలవా? అంటే చూపించలేకపోయారు. మన కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఎంత బాధపడతామో.. అదే రకంగా రైతులు చనిపోతే ఆవేదన వ్యక్తంచేస్తూ వారికి తోడుగా నిలబడ్డాం. 458 కుటుంబాలకు చంద్రబాబు పరిహారం ఇవ్వకపోతే.. జగనన్న ప్రభుత్వం మాత్రమే వారికి ఇచ్చింది. ఈ జిల్లాలకు పోవాలి, ఇలా గ్రామాలకు పోవాలని అని ఆ దత్తపుత్రుడికి ఆ రోజు గుర్తుకు రాలేదు. పరిహారం ఇవ్వాలని చంద్రబాబుకు అనిపించలేదు. అవినీతి లేకుండా, వివక్ష లేకుండా.. ధాన్యం కొనుగోలు కోసం మూడేళ్లలో దాదాపు రూ.45వేల కోట్లు ఖర్చు చేశాం. చంద్రబాబు ఐదేళ్లలో రూ.30-32వేల కోట్లు కూడా ఖర్చు చేయలేదు. పాడి రైతులకు మంచి చేయడానికి అమూల్‌ను తీసుకు వచ్చాం. ప్రపంచంలోనే 8వ స్థానంలో ఉంది. చంద్రబాబు కంపెనీ హెరిటేజ్‌తోపాటు అందరు కూడా లీటరు రూ.5 నుంచి రూ.10లు పెంచాల్సిన పరిస్థితి వచ్చింది. అవినీతి లేకుండా, వివక్ష లేకుండా పథకాలు అమలు చేస్తున్నాం. ఒక్కపైసా కూడా అవినీతి లేదు. మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు.. నేరుగా మీ చేతికే వస్తోంది. గతంలో ఇది ఎందుకు జరగలేదు?. అప్పుడు నేరుగా గత పాలకుల చేతుల్లోకి డబ్బులు పోయేవి. గతంలో జరగనిది.. ఇప్పుడు మీ బిడ్డ పాలనలో జరుగుతుంది. ఆ బాధ కూడా గత పాలకులకు లేదు.. గతంలో మాదిరిగా మోసాలు చేసే పరిస్థితి లేదు. మాట ఇచ్చి తప్పితే.. రైతు ఏమవుతాడన్న బాధ కూడా గత పాలకులకు లేదని మనం చూశాం. అలాంటి వాళ్లు రాజకీయాలకు తగునా?. ఒక వ్యక్తి ఎలా మాట ఇచ్చాడు.. ఎలా మోసం చేశాడో మీరు చూశారు. ఆయన చంద్రబాబు నాయుడు. చంద్రబాబుకు ఏం చేస్తే మంచి జరుగుతుందని.. అది చేయడానికి ఉరుకులు పరుగులు తీసే మరో వ్యక్తి దత్తపుత్రుడు. ప్రజలను మోసం చేసి.. తోడుదొంగలైన వీరిద్దరు... రాజకీయాల్లో ఉండేందుకు అర్హులేనా?. మనం ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేస్తున్నాం అంటే... దాన్ని డైవర్ట్ చేయడానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఒక టీవీ–5, ఒక చంద్రబాబు, ఒక దత్తపుత్రుడు.. వీళ్లంతా ఏకం అవుతారు. ఉన్నది లేనట్టుగా.. లేనిది ఉన్నట్టుగా .. అబద్ధానికి రంగులు పూస్తారు రైతులను నట్టేట ముంచిన ఈ చంద్రబాబు మంచోడంట.. చంద్రబాబుగారు వచ్చినా, దత్తపుత్రుడు వచ్చినా అడగండి. మీరిచ్చిన మేనిఫెప్టోను చూసి ఓట్లేశాం.. ఆ మేనిఫెస్టోను ఎందుకు అమలు చేయలేదని అడగండి. మేనిఫెస్టోలో రైతుకు ఇచ్చిన ఏ హామీని అమలు చేయని ఈ చంద్రబాబు మంచోడంట. రుణమాఫీ అంటూ మోసం చేసి రైతులను నట్టేట ముంచి ఈ చంద్రబాబు మంచోడంట. ఉచిత విద్యుత్, ధాన్యం, విత్తన బకాయిలను, పంటల బీమాకూడా చెల్లించకుండా బకాయిలు పెట్టి ఎగ్గొట్టిన ఈ చంద్రబాబు మంచోడంట. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశం అమలు చేశామని మేనిఫెస్టో చూపించి మీరే టిక్ పెట్టండి అని మీ ఇంటి దగ్గరకు మూడేళ్ల పాలన తర్వాత వచ్చి ఆశీస్సులను మీ బిడ్డ అడుగుతున్నాడు. ఇద్దరికీ తేడాను గమనించండి: రైతులను ఎందుకు రెచ్చగొడుతున్నారు.. కోనసీమలో క్రాప్ హాలిడే అని రైతులను ఎందుకు రెచ్చగొడుతున్నారు. మీరు ఎగ్గొట్టిన ధాన్యం బకాయిలను జగన్ అనే నేను తీర్చినందుకా?. కేంద్రం నుంచి సకాలానికే డబ్బు రాకపోయిన 21 రోజుల్లోనే వారికి ధాన్యం డబ్బులు ఇవ్వడంకోసం కిందా మీదా ప్రయాస పడుతున్నా.. మీ బిడ్డ ప్రయత్నాన్ని చూడలేకపోతున్నారా? అంటూ ఇదే చంద్రబాబును, మీ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్‌ని అడుగుతున్నాను. మార్పులను తట్టుకోలేక రాజకీయాలు.. 2 సంవత్సరాల కోవిడ్ తర్వాత టెన్త్‌పరీక్షలు జరిగాయి. పరీక్షలు లేకుండా పాస్ చేసుకుంటూ రెండేళ్లు వచ్చాం. 67శాతం మంది ఉత్తీర్ణులు అయ్యారు. గుజరాత్లో 65శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. రెండేళ్ల తర్వాత పరీక్షలు రాసిన పిల్లలకు ఆత్మస్థైర్యం కల్పించే మాటలు చెప్పాలి. సప్లిమెంటరీ తీసేసి.. రెగ్యులర్‌గానే వారిని భావిస్తూ వారికి మళ్లీ పరీక్షలు పెడుతున్నాం. ఆ పిల్లలను సైతం రెచ్చగొట్టడానికి, చెడగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. మన పిల్లలకు ఇవ్వాల్సింది క్వాలిటీ చదువులు. ప్రపంచంతో పోటీపడేటప్పుడు వారి చదువుల్లో క్వాలిటీ ఉండాలి. విద్యారంగంలో తీసుకు వస్తున్న మార్పులను తట్టుకోలేక దాన్ని కూడా రాజకీయంచేస్తున్నారు. సామాజిక న్యాయానికి నిజమైన అర్థం చెప్తున్నాం.. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ అనే మహానుభావుడి పేరును పెట్టాం. ఒక దళిత మంత్రి, బీసీ మంత్రి ఇళ్లను కాల్చేశారు. ఒక జిల్లాకు అంబేద్కర్ కోనసీమ జిల్లా అని పేరుపెడితే జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదా సామాజిక న్యాయం?. ఇలాంటి వాళ్లు రాజకీయాల్లో ఉండేందుకు అర్హులేనా?. మీ బిడ్డ మంత్రివర్గంలో 70శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు మంత్రులుగా ఉన్నారు. సామాజిక న్యాయానికి నిజమైన అర్థం చెప్తున్నాం. ఉద్యోగుల విషయంలో కూడా ఇదే ధోరణి. ఉద్యోగలకు ప్రతి విషయంలో మంచి చేస్తున్నాం. ఇంతకు ముందు ఎవ్వరూ కూడా సాహసం చేయలేదు. వారికి మంచి జరుగుతుందని వారికి నచ్చజెప్పి, వారిని కలుపుకుంటూ పోతే.. వారినికూడా రెచ్చగొట్టే దిక్కుమాలిన ఆలోచన చేస్తున్నారు. వీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా.. మీ బిడ్డ ఎదుర్కోగలడు. దేవుడి దయ, మీ అందరి ఆశీస్సులతో మీ బిడ్డ ఎవ్వరినైనా ఎదుర్కోగలడని’’ సీఎం జగన్ అన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)