Breadcrumb
- HOME
YSR Uchita Pantala Bheema: 15.61 లక్షల మంది ఖాతాల్లోకి రూ.2,977.82 కోట్ల బీమా జమ
Published Tue, Jun 14 2022 8:31 AM | Last Updated on Tue, Jun 14 2022 4:17 PM
Live Updates
Live Updates: సీఎం జగన్ సత్యసాయి జిల్లా పర్యటన
15.61 లక్షల మంది ఖాతాల్లోకి రూ.2,977.82 కోట్ల బీమా జమ
పుట్టపర్తి: ఏరువాకతో సాగుకు సన్నద్ధమవుతున్న అన్నదాతకు అండగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి వైఎస్సార్ ఉచిత పంటల బీమా పరిహారాన్ని అందించారు. 2021 ఖరీఫ్‌లో వైపరీత్యాలు, చీడపీడల వల్ల పంట నష్టపోయిన చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 15.61 లక్షల మంది రైతన్నలకు రూ.2,977.82 కోట్ల బీమా పరిహారాన్ని మంగళవారం వారి ఖాతాల్లో నేరుగా జమ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా చెన్నే కొత్తపల్లిలో జరిగిన కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కి రైతన్నల ఖాతాల్లో నగదు జమ చేశారు.
టెన్త్ విద్యార్థులను రెచ్చగొట్టే ప్రయత్నం
టెన్త్‌లో 67 శాతం మంది విద్యార్థులు పాస్ అయ్యారు. గుజరాత్లో 65 శాతమే పాస్ అయ్యారు. ఇలాంటి సమయంలో విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం నింపేలా మాట్లాడాలి. టెన్త్ విద్యార్థులను సైతం రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. నెల రోజుల్లో సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నాం. సప్లిమెంటరీలో పాస్ అయిన రెగ్యులర్‌గానే పరిగణిస్తామని సీఎం జగన్ అన్నారు.
వారు రాజకీయాల్లో ఉండటానికి అర్హులేనా?
చంద్రబాబు తానా అంటే దత్తపుత్రుడు తందాన అంటాడు.ఈనాడు, చంద్రబాబు, టీవీ5, చంద్రబాబు, దత్తపుత్రుడు ఏకమై ఉన్నది లేనట్లుగా.. లేనిది ఉన్నట్లుగా చేస్తారు. మోసం చేయడంలో చంద్రబాబు, దత్తపుత్రుడు తోడు దొంగలు. వీరిద్దరూ రాజకీయాల్లో ఉండటానికి అర్హులేనా? అంటూ సీఎం జగన్ ప్రశ్నించారు.
సవాల్ చేసిన.. చంద్రబాబు ఆయన దత్తపుత్రుడు స్పందించలేదు
ఎవరైనా రైతన్న చనిపోతే ఆదుకుంటున్నాం. పరిహారం అందని ఒక్క కౌలు రైతునైనా చంద్రబాబు, దత్తపుత్రుడు చూపించలేకపోయారు. నేను సవాల్ చేసిన.. చంద్రబాబు ఆయన దత్తపుత్రుడు స్పందించలేదు. బాబు అధికారంలో ఉన్నప్పుడు దత్తపుత్రుడికి గుర్తురాలేదు, ఇవ్వాలనే తపన చంద్రబాబుకు లేదు.
గత ప్రభుత్వం బకాయిలను మనమే తీర్చాం
దేశం యావత్తు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోంది
దేశం యావత్తు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోంది. ఆర్బీకేలు రైతన్నను పట్టుకొని నడిపిస్తున్నాయి. మూడేళ్లలో రైతులకు ఉచిత విద్యుత్ కోసం రూ. 25,800 కోట్లు ఖర్చు పెట్టాం. గత ప్రభుత్వం రూ.8750 కోట్లు పెట్టిన ఉచిత విద్యుత్ బకాయిలను తీర్చాం. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశాం. పంటల బీమా పథకంపై దృష్టి పెట్టి విప్లవాత్మక మార్పులు తెచ్చామని సీఎం జగన్ అన్నారు.
ఆ విషయంలో దేశంతో పోటీ పడుతున్నాం: సీఎం జగన్
రైతన్నలకు మేలు చేసే విషయంలో దేశంతో పోటీ పడుతున్నాం. మన రాష్ట్రంలో జరగుతున్న మార్పులను పక్క రాష్ట్రాలు వచ్చి చూస్తున్నాయి. రైతు భరోసా కింద రూ.23,875 కోట్లు చెల్లించాం. రైతన్నల కోసం మూడేళ్లలో రూ.1,27,823 కోట్లు ఖర్చు చేశాం.
గత ప్రభుత్వం బకాయిలను మనమే తీర్చాం
గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో రూ.3,411 కోట్ల పంట బీమా మాత్రమే ఇచ్చారు. మన ప్రభుత్వ మూడేళ్ల హయాంలో మూడేళ్లలోనే రూ.6,685 కోట్ల బీమా చెల్లించాం. రైతులను చంద్రబాబు ప్రభుత్వం ఏనాడు పట్టించుకోలేదు. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను కూడా మనమే తీర్చాం. ఏ సీజన్లో జరిగిన నష్టాన్ని ఆ సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ అందిస్తున్నామని సీఎం జగన్ అన్నారు.
మార్పును గమనించాలని కోరుతున్నా: సీఎం జగన్
గత ప్రభుత్వానికి - మన ప్రభుత్వానికి తేడా గమనించండి. ఇంతకుముందు ఇన్సూరెన్స్ ఎప్పుడు వస్తుందో, ఎవరికి వస్తుందో తెలియని పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు బటన్ నొక్కగానే లబ్దిదారుల ఖాతాల్లో బీమా సొమ్ము జమ అవుతోంది. ఈ మార్పును గమనించాలని కోరుతున్నా.
మన ప్రభుత్వంలో పారదర్శకంగా అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి మంచి జరుగుతోంది. మనిషికి బీమా ఉన్నట్లే పంటకు బీమా ఉండకపోతే రైతు పరిస్థితి ఏంత దయనీయంగా ఉంటుందో గత ప్రభుత్వ హయాంలో చూశామని సీఎం జగన్ అన్నారు.
దేవుడి దయతో మరో మంచి కార్యక్రమం: సీఎం జగన్
దేవుడి దయతో ఈ రోజు మరో మంచి కార్యక్రమం జరుగుతోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఈ మేరకు సీఎం జగన్ మాట్లాడుతూ.. 15.61లక్షల మంది రైతులకు రూ.2977.92 కోట్లను అందిస్తున్నాం. ఒకప్పుడు అనంతపురం కరువు జిల్లా. ఇవాళ దేవుడి దయ వల్ల నీళ్లు కూడా పుష్కలంగా అందుబాటులోకి వచ్చాయి.
ఒక్క ఏడాదే రూ.2977 కోట్లు ఇవ్వడం చారిత్రాత్మకం: కాకాణి
శ్రీసత్యసాయి జిల్లా: రైతులను ఆదుకునేందుకే పంటల బీమా అమలు చేస్తున్నామని వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. రైతుల ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తోంది. ఒక్క ఏడాదే రూ.2977 కోట్లు ఇవ్వడం చారిత్రాత్మకం.
విత్తనం నుంచి విక్రయం దాకా అన్నింటికీ జగన్ సర్కార్ అండగా ఉంటోంది. సీఎం జగన్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రైతు పక్షపాతి' అని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు.
చంద్రబాబు ఓ రావణాసురుడు: తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి
చంద్రబాబు ఓ రావణాసురుడు. రుణమాఫీ పేరుతో రైతులు, డ్వాక్రా మహిళలను మోసం చేశారు. ఏపీని అప్పుల ఊబిలోకి నెట్టింది చంద్రబాబే. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సంక్షేమ పథకాలు దిగ్విజయంగా అమలు చేస్తున్న ఘనత సీఎం జగన్దేని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అన్నారు.
గ్రామ స్వరాజ్యం తెచ్చిన ఘనత సీఎం జగన్‌దే: తోపుదుర్తి
'ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అపర భగీరథుడు. కరవు ప్రాంతాలకు హంద్రీనీవా నీరిచ్చి ఆదుకున్నారు. పంటల బీమా రైతులకు వరం. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం తెచ్చిన ఘనత జగన్‌దే. సచివాలయ వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాలు డోర్ డెలివరీ అవ్వడం గొప్ప విషయమని' ప్రకాష్‌రెడ్డి అన్నారు.
సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపిన తోపుదుర్తి
కార్యక్రమంలో భాగంగా సత్యసాయి జిల్లా ఏర్పాటయిన తర్వాత మొదటిసారి జిల్లాకు విచ్చేసిన సీఎం జగన్‌కు రాప్తాడు శాసన సభ్యులు తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. టీడీపీ హయాంలో 2001లో మూతపడిన బంగారు గనులను తెరిపిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేశారు. వైఎస్జగన్ నాయకత్వంలో ఇళ్ల ముంగిటకే సంక్షేమం అందుతోందని ప్రకాష్ రెడ్డి అన్నారు.
జ్యోతి ప్రజ్వలన గావించిన సీఎం జగన్
చెన్నేకొత్తపల్లి: వైఎస్సార్ ఉచిత పంటల బీమా పరిహారాన్ని అందించే కార్యక్రమంలో భాగంగా సత్యసాయి జిల్లాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా నాయకులతో కలిసి జ్యోతి ప్రజ్వలన గావించారు.
చెన్నే కొత్తపల్లి చేరుకున్న సీఎం జగన్
2021 ఖరీఫ్‌లో వైపరీత్యాలు, చీడపీడల వల్ల పంట నష్టపోయిన చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 15.61 లక్షల మంది రైతన్నలకు రూ.2,977.82 కోట్ల బీమా పరిహారాన్ని మంగళవారం వారి ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు. అందుకోసం సీఎం జగన్ శ్రీ సత్యసాయి జిల్లా చెన్నే కొత్తపల్లికి కాసేపటి క్రితమే చేరుకున్నారు.
గన్నవరం విమాశ్రయంకు చేరుకున్న సీఎం వైఎస్ జగన్
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సత్యసాయి జిల్లా పర్యటనకు బయల్దేరారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ నుంచి శ్రీ సత్యసాయి జిల్లా చెన్నే కొత్తపల్లికి బయల్దేరారు. సీకే పల్లిలో అన్నదాతలకు అందించే వైఎస్సార్ పంటల బీమా కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొననున్నారు.
నేడు చెన్నే కొత్తపల్లికి సీఎం జగన్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం శ్రీ సత్యసాయి జిల్లా చెన్నే కొత్తపల్లిలో పర్యటించనున్నారు. 2021 ఖరీఫ్ పంటల బీమా పరిహారాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమాన్ని సీఎం ప్రారంభిస్తారు. ఆయన ఉదయం 9 గంటలకు తాడేపల్లి నుంచి బయల్దేరి 10.50 గంటలకు చెన్నే కొత్తపల్లి చేరుకుంటారు.
10.50 నుంచి 11.05 గంటల మధ్య స్థానిక నేతలను కలుస్తారు. 11.15 నుంచి 12.45 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొంటారు. వేదికపై రైతులతో ముఖాముఖి నిర్వహించి, అనంతరం ప్రసంగిస్తారు. తర్వాత పంటల బీమా మెగా చెక్‌ను రైతులకు అందజేస్తారు. మధ్యాహ్నం 1 గంటకు అక్కడి నుంచి బయల్దేరి 2.50 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
టీడీపీ ప్రభుత్వం కంటే మిన్నగా సాయం
టీడీపీ ఐదేళ్ల పాలనలో 30.85 లక్షల మంది రైతులకు రూ.3,411.2 కోట్ల బీమా పరిహారాన్ని అందించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలతో కలిపి ఇప్పటికే 28.67 లక్షల మందికి రూ.3,707.02 కోట్ల బీమా పరిహారం అందించింది.
తాజాగా ఖరీఫ్–2021లో నష్టపోయిన రైతులకు రూ.2,977.82 కోట్ల బీమా పరిహారం అందిస్తోంది. దీంతో కలిపితే 44.28 లక్షల మంది లబ్ధిదారులకు రూ.6,684.84 కోట్లు లబ్ధి చేకూర్చింది. గడిచిన మూడేళ్లలో రాష్ట్రంలో రైతులకు అన్ని పథకాలూ కలిపి రూ. 1,27,823 కోట్లు సాయంగా నేరుగా అందించింది.
గ్రామ సచివాలయంలో అర్హుల జాబితా
పైసా భారం పడకుండా ఆర్బీకేల ద్వారానే ఈ–క్రాప్‌లో నమోదే ప్రామాణికంగా పంటల బీమా వర్తింపజేస్తున్నారు. పంట వేసినప్పుడే ఈ క్రాప్‌లో నమోదు చేయించి రసీదు ఇస్తున్నారు. పంట నష్టాన్ని శాస్త్రీయంగా అంచనా వేస్తున్నారు. దీంతో అర్హులైన ప్రతి ఒక్కరికీ బీమా అందుతోంది.
పారదర్శకతకు పెద్దపీట వేస్తూ గ్రామ సచివాలయంలో అర్హుల జాబితా ప్రదర్శిస్తున్నారు. వైపరీత్యాల వల్ల ఏ సీజన్లో జరిగిన పంట నష్టానికి ఆ సీజన్ ముగిసేలోగానే నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తున్నారు. ప్రభుత్వ అధికారులు, దళారుల చుట్టూ తిరగాల్సిన అవస్థలు రైతన్నలకు తప్పాయి.
గతంలో అస్తవ్యస్తం.. నేడు పూర్తి పారదర్శకం
గత ప్రభుత్వంలో పంట నష్టాల అంచనా అశాస్త్రీయంగా ఉండేది. అయిన వారికే పరిహారం అందేది. రైతన్నలు ప్రభుత్వ ఉద్యోగుల చుట్టూ ఏళ్ల తరబడి తిరిగినా పరిహారం అందుతుందో లేదో తెలియని దుస్ధితి. దళారులను ఆశ్రయించి, లంచాలు ఇస్తే అరకొరగా అందేది. ఇప్పుడా పరిస్థితి లేదు.
చీడ పీడలు, అకాల వర్షాలు, వరదలు, కరువు కాటకాల వల్ల ఏ కష్టమొచ్చినా, ఏ నష్టం జరిగినా ఆదుకోవాలన్న తపనతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రైతులకు అన్ని విధాలుగా అండదండగా నిలుస్తున్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా..
ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. దేశంలో ఎక్కడా లేని విధంగా పంటల బీమాకు ప్రీమియంను రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా చెల్లిస్తోంది. వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం కింద రైతన్నలపై ఒక్క రూపాయి కూడా ఆర్థిక భారం పడకుండా చూస్తోంది.
సాగు చేసిన ప్రతి ఎకరాన్ని ఆర్బీకేల ద్వారా ఈ–క్రాప్‌లో నమోదు చేయించి బీమా రక్షణ కల్పిస్తోంది. బీమా పరిహారం సొమ్ము కూడా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తోంది. ఒక సీజన్ పంటల బీమా మరుసటి ఏడాది అదే సీజన్ రాకముందే క్రమం తప్పకుండా చెల్లిస్తోంది.
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా..
2021 ఖరీఫ్‌లో వైపరీత్యాలు, చీడపీడల వల్ల పంట నష్టపోయిన చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 15.61 లక్షల మంది రైతన్నలకు రూ.2,977.82 కోట్ల బీమా పరిహారాన్ని మంగళవారం వారి ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా చెన్నే కొత్తపల్లిలో జరిగే కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కి రైతన్నల ఖాతాల్లో నగదు జమ చేస్తారు.
నేడు వైఎస్సార్ ఉచిత పంటల బీమా పరిహారం
సాక్షి, అమరావతి/సాక్షి, పుట్టపర్తి: ఏరువాకతో సాగుకు సన్నద్ధమవుతున్న అన్నదాతకు అండగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి వైఎస్సార్ ఉచిత పంటల బీమా పరిహారాన్ని అందించనున్నారు.
Related News By Category
Related News By Tags
-
AP: అందరి చూపు మనవైపే.. దేశంతోనే పోటీ పడుతున్నాం..
మొన్నామధ్య చంద్రబాబు అనంతపురం వచ్చారు.. గోదావరి జిల్లాలకూ వెళ్లారు.. ఆత్మహత్య చేసుకున్న నిజమైన రైతు (పట్టాదారు పాసుపుస్తకం ఉన్న) ఎవరికైనా పరిహారం అందకపోతే చూపించండని సవాల్ విసిరితే స్పందన లేదు. మన కు...
-
మీ ఆశీస్సులు ఉన్నంతవరకు ఎవరినైనా ఎదుర్కొంటా: సీఎం జగన్
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: అనంతపురం జిల్లాను ఎడారి జిల్లా అనేవారని.. దేవుడి దయ వల్ల అలాంటి పరిస్థితులు మారిపోతున్నాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. గంగమ్మ తల్లి నేరుగా పైకి వచ్చే పర...
-
తండ్రీ కొడుకుల దెబ్బ.. చంద్రబాబు అబ్బా
తనకు ఎదురేలేదని విర్రవీగిన ఆయనకు పెద్దాయన గట్టిదెబ్బే కొట్టారు. దారుణ ఓటమి రుచిచూపించారు. అయితే, అలాంటి వ్యక్తి ఆకస్మిక మరణంతో మళ్లీ తెరమీదికి వచ్చిన ఆయన.. ప్రజలను బురిడీ కొట్టించి మళ్లీ గద్దెనెక్కారు...
-
పుట్టపర్తిలో టీడీపీకి భారీ దెబ్బ
పుట్టపర్తి: శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో టీడీపీకి భారీ దెబ్బ తగిలింది. 2009 నుంచి ఆ పార్టీలో గట్టి పట్టున్న అమడగూరు మండల మాజీ జెడ్పీటీసీ సభ్యుడు పుట్టా పురుషోత్తమరెడ్డి, ఆయన సోదరుడు మల...
-
మేమంతా సిద్ధం@డే5: సీఎం జగన్‌కు అడుగడుగునా జన నీరాజనాలు
CM YS Jagan Memantha Siddam Bus Yatra 2024 Updates కదిరిలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు హాజరైన సీఎం జగన్ శ్రీసత్యసాయి జిల్లా. కదిరిలో జనమే జగన్– జగనే జనం 5.45 గంటలకు కదిరి...
Comments
Please login to add a commentAdd a comment