
ప్రతీకాత్మక చిత్రం
పెనుకొండ(శ్రీసత్యసాయి జిల్లా): విషం తాగిన మహిళను వార్డు వలంటీర్ దిశ పోలీసుల సాయంతో రక్షించిన ఉదంతం శ్రీసత్యసాయి జిల్లా పెనుగొండలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెనుకొండకు చెందిన ఓ మహిళకు ఏడేళ్ల క్రితం నరేష్‌తో వివాహమైంది. ఆ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం కూడా ఘర్షణ జరిగింది.
దీంతో భర్త ఇంటి నుంచి బయటకు వెళ్లిన వెంటనే విషం తాగి ఆత్మహత్యకు యత్నించింది. అదే సమయంలో ఆ ఇంటికి వెళ్లిన వార్డు వలంటీర్ అశ్విని వెంటనే అప్రమత్తమై దిశ ఎస్‌వోఎస్‌కు కాల్ చేసింది. నిమిషాల వ్యవధిలోనే ఘటనా స్థలానికి చేరుకున్న దిశ టీం బాధితురాలిని వలంటీర్ సాయంతో ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం వివాహితకు ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పారు.
చదవండి: శభాష్ వలంటీర్.. వెన్నుచూపలేదు.. వెనక్కి తగ్గలేదు..
Comments
Please login to add a commentAdd a comment