సాక్షి, అనంతపురం: పవన్ కళ్యాణ్‌కు రైతుల గురించి ఏం తెలుసు? అని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శంకర్ నారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన బుధవారం మీడియాతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలు పవన్‌కు కనబడటం లేదా? అని ప్రశ్నించారు. పవన్ పరామర్శించిన రైతులకు ప్రభుత్వం ఇప్పటికే ఆర్థిక సాయం చేసిందని తెలిపారు. రైతుల కోసమే వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకువచ్చారని తెలిపారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు అర్థరహితమని, ఆయనకు వ్యవసాయంపై అవగాహన లేదని మండిపడ్డారు.
ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబాన్ని సీఎం జగన్ సర్కార్ ఆదుకుందని తెలిపారు. ఒక్కొ రైతు కుటుంబానికి రూ.7 లక్షల ఆర్థిక సాయం అందజేసిందని చెప్పారు. చంద్రబాబు హయాంలో వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని దుయ్యబట్టారు. 469 మంది రైతులకు చంద్రబాబు చిల్లిగవ్వ సాయం కూడా సాయం చేయలేదని అన్నారు. చంద్రబాబు పాలనలో చనిపోయిన రైతు కుటుంబాలకు కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిహారం అందించారని తెలిపారు. చంద్రబాబు బినామీల్లో పవన్ కల్యాణ్ ఒకడు అని తీవ్రస్థాయిలో విమర్శించారు. సినిమా షూటింగ్‌లు లేనప్పుడు పవన్ రాజకీయాలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు.
రైతు ఆత్మహత్యలపై చంద్రబాబును ఎందుకు ప్రశ్నించలేదని పవన్‌ను సూటిగా ప్రశ్నించారు. అప్పుడు గాడిదలు కాస్తున్నావా? అని మండిపడ్డారు. సీఎం జగన్ ప్రభుత్వం కౌలుదారులకు అండగా నిలిచిందని, పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని ఆరోపించారు. కౌలు రైతులకు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎందుకు సాయం చేయలేదని నిలదీశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రైతుల పక్షపాతి అని శంకర్ నారాయణ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment