
ఆలయంలో గంట కొడుతున్న ఎలుగుబంటి
సాక్షి, సత్యసాయి జిల్లా (రొళ్ల): అర్ధరాత్రి ఆలయంలోకి చొరబడిన ఎలుగుబంటి ఆలయంలోని గంటను మోగించి అందరినీ ఆశ్చర్యపరిచింది. సీసీకెమెరా ఫుటేజీల్లో నిక్షిప్తమైన ఈ సమాచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వివరాలు... శ్రీసత్యసాయి జిల్లా రొళ్ల మండలంలోని జీరిగేపల్లిలో వెలసిన అమ్మాజీ ఆలయంలో సోమవారం రాత్రి పూజాదికాలు ముగించుకున్న తర్వాత అర్చకులు తాళం వేసి ఇళ్లకు వెళ్లిపోయారు.
అర్ధరాత్రి దాటిన తర్వాత ఆలయంలోకి రెండు ఎలుగు బంట్లు ప్రవేశించాయి. అందులో ఒకటి నేరుగా గరుడ స్తంభం వద్ద ఏర్పాటు చేసిన 105 కిలోల బరువైన గంటకు కట్టిన తాడును నోటితో లాగేందుకు ప్రయత్నించింది. సాధ్యం కాకపోవడంతో ముందరి కాళ్లతో దానిని పట్టుకుని లాగి గంట మోగించి పక్కకు వైదొలిగింది. మంగళవారం ఉదయం ఆలయం తలుపులు తీసిన అర్చకులు సీసీ కెమెరా ఫుటేజీల్లో నిక్షిప్తమైన దృశ్యాలను చూసి అవాక్కయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment