
విద్య, వైద్య రంగాలకు సీఎం జగన్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. నవరత్నాలతో ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు.
సాక్షి, సత్యసాయి జిల్లా: పిల్లల చదువు బాధ్యత నాదే అన్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. గోరంట్ల బెస్ట్ ఇన్నోవేషన్ ప్రైవేట్ వర్సిటీ స్నాతకోత్సవంలో ఆయనతో పాటు, బీజేపీ నేత రాంమాధవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, విద్య, వైద్య రంగాలకు సీఎం జగన్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. నవరత్నాలతో ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు.
చదవండి: మీ కెరీర్ మలుపు తిప్పే టర్నింగ్ పాయింట్.. నిజంగా ఇది గోల్డెన్ ఛాన్సే..
‘‘పేదరికంతో ఏ ఒక్కరూ చదువుకు దూరం కాకూడదన్నదే సీఎం వైఎస్ జగన్ ఆశయం. విజయానికి షార్ట్ కట్స్ ఉండవు. కష్టపడితే సక్సెస్ సాధ్యం. ఇంటర్నెట్ యుగంలో విద్యార్థులకు అపార అవకాశాలు ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోవాలని’’ విజయసాయిరెడ్డి అన్నారు.