Convocation celebrations
-
బహదూర్‌పల్లిలోని మహీంద్రా యూనివర్శిటీ మూడవ వార్షిక స్నాతకోత్సవం (ఫొటోలు)
-
CJI Chandrachud: నేటి యువత సామర్థ్యం అద్భుతం
వడోదర: అవకాశాలను అందిపుచ్చుకుంటూ, ఎన్నో సవాళ్లను పరిష్కరిస్తున్న నేటి యువత సామర్థ్యం చూసి తనకు ఆశ్చర్యం కలుగుతోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకోవాలని, ఓటమిని అభివృద్ధికి బాటగా మలుచుకోవాలని యువతకు ఆయన పిలుపునిచ్చారు. జీవితమంటే మారథాన్(సుదీర్ఘ 42 కిలోమీటర్ల పరుగు పందెం) వంటిదే తప్ప 100 మీటర్ల స్ప్రింట్(స్వల్ప దూరం పరుగు పందెం) కాదని ఆయన పేర్కొన్నారు. బరోడా లోని మహారాజా శాయాజీరావ్ యూనివర్సిటీ 72వ వార్షిక స్నాతకోత్సవాన్ని ఉద్దేశించి ఆదివారం జస్టిస్ డీవై చంద్రచూడ్ వర్చువల్‌గా ప్రసంగించారు. ఈ ఏడాది యూనివర్సిటీ ప్రదానం చేసిన మొత్తం 346 బంగారు పతకాల్లో అత్యధికంగా 336 పతకాలు మహిళలు అందుకోవడాన్ని మన దేశం మారుతోందనడానికి నిజమైన గుర్తుగా ఆయన అభివరి్ణంచారు. ‘చరిత్రలో ఇది ఒక ప్రత్యేకమైన సమయం. మునుపెన్నడూ లేనంతగా టెక్నాలజీ నేడు ప్రజలను అనుసంధానం చేస్తోంది. అదే సమయంలో వారిలో భయాలు, ఆందోళనలకు సైతం కారణమవుతోంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త వృత్తులు పుట్టుకొస్తున్నాయి. ఇవి సంప్రదాయ వృత్తులతో సంబంధం లేనివి. వీటిల్లో ఎవరికి వారు తమ ప్రయాణం సాగిస్తున్నారు. ఈ సమయంలో పట్టభద్రులుగా బయటికి వస్తున్న మీ అందరికీ ఇది ఉత్తేజకర సమ యం. అదే సమయంలో అనిశి్చతిని, గందరగోళాన్నీ సృష్టిస్తాయి’అని హెచ్చరించారు. -
ఘనంగా తమన్నా మేకప్ అకాడమీ కాన్వకేషన్ (ఫొటోలు)
-
ఎస్కేయూ స్నాతకోత్సవంలో పాల్గొన్న గవర్నర్ నజీర్
సాక్షి, అనంతపురం: ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ అనంతపురం పర్యటనలో ఉన్నారు. కాగా, ఎస్కే యూనివర్సిటీ 21వ స్నాతకోత్సవంలో గవర్నర్ నజీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్కే యూనివర్సిటీలో శ్రీ కృష్ణదేవరాయ విగ్రహానికి గవర్నర్ నజీర్ నివాళులు అర్పించారు. ఈ క్రమంలోనే నూతన అకాడమీ, హాస్టల్ భవనాలను గవర్నర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ నజీర్ మాట్లాడుతూ.. ప్రపంచంలో ఎన్ని సవాళ్లు ఉన్నాయో.. అన్ని అవకాశాలు ఉన్నాయి. విద్య శక్తివంతమైన ఆయుధం అన్న విషయం మరిచిపోవద్దు. కృషి, పట్టుదల, సృజనాత్మకత ఉంటే ఏదైనా సాధించవచ్చు. విద్యార్థులు ఎప్పుడూ సానుకూల దృక్పథంతో ఉండాలి. కేంద్రం తీసుకువచ్చిన నూతన జాతీయ విద్యావిధానం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి అని కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: కోటంరెడ్డి సోదరులకు ఎదురుదెబ్బ -
ఘనంగా శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం
-
విజయానికి షార్ట్ కట్స్ ఉండవు: ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి, సత్యసాయి జిల్లా: పిల్లల చదువు బాధ్యత నాదే అన్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. గోరంట్ల బెస్ట్ ఇన్నోవేషన్ ప్రైవేట్ వర్సిటీ స్నాతకోత్సవంలో ఆయనతో పాటు, బీజేపీ నేత రాంమాధవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, విద్య, వైద్య రంగాలకు సీఎం జగన్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. నవరత్నాలతో ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. చదవండి: మీ కెరీర్ మలుపు తిప్పే టర్నింగ్ పాయింట్.. నిజంగా ఇది గోల్డెన్ ఛాన్సే.. ‘‘పేదరికంతో ఏ ఒక్కరూ చదువుకు దూరం కాకూడదన్నదే సీఎం వైఎస్ జగన్ ఆశయం. విజయానికి షార్ట్ కట్స్ ఉండవు. కష్టపడితే సక్సెస్ సాధ్యం. ఇంటర్నెట్ యుగంలో విద్యార్థులకు అపార అవకాశాలు ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోవాలని’’ విజయసాయిరెడ్డి అన్నారు. -
చంద్రయాన్–2తో కథ ముగియలేదు
న్యూఢిల్లీ: చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్‌లో విఫలమైన చంద్రయాన్ –2 తో కథ ముగియలేదని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలకు సన్నద్ధం అవుతోందని ఇస్రో చీఫ్ శివన్ తెలిపారు. ఢిల్లీ ఐఐటీ స్వర్ణోత్సవాల్లో పాల్గొన్న శివన్ రాబోయే మరికొద్ది నెలల్లో మరింత అభివృద్ధి చెందిన అంతరిక్ష పరిశోధనలు చేయబోతున్నట్టు తెలిపారు. చంద్రయాన్–2 సాఫ్ట్ ల్యాండింగ్ చేయలేకపోయాం. అయితే జాబిల్లి ఉపరితలంపై 300 మీటర్ల దూరం వరకు సాంకేతికంగా అన్ని వ్యవస్థలూ సరిగ్గానే పనిచేశాయి. చంద్రయాన్–2 నుంచి గుణపాఠాలను తీసుకుని భవిష్యత్‌లో సాఫ్ట్ ల్యాండింగ్ చేస్తామని హామీ ఇస్తున్నానని శివన్ వ్యాఖ్యానించారు. చంద్రయాన్‌లాంటి భవిష్యత్ ప్రణాళికలేమైనా ఉన్నాయా? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ శివన్ చంద్రయాన్–2 తో కథ అంతంకాలేదనీ, ఆదిత్య ఎల్–1 సోలార్ మిషన్, మానవ స్పేస్‌ఫ్లైట్ ప్రోగ్రామ్స్ ప్రయత్నాల్లో ఉన్నామని వివరించారు. మీకు నైపుణ్యం, ఆసక్తి ఉన్న రంగంలో ఇష్టమైన కెరీర్‌ని ఎంచుకుని ముందుకుసాగాలని విద్యార్థులకు శివన్ సూచించారు. అయితే విజయం సాధించడమన్నది కేవలం అభిరుచిపైనే ఆధారపడి ఉండదనీ, విజయానికి అభిరుచి దోహదపడగలదని మాత్రమే గుర్తించాలని అన్నారు. -
ఏళ్లుగా లేరంట.. ఇవ్వలేరంట..!
ఆరేళ్ల తర్వాత ఓయూ స్నాతకోత్సవంజరగనుంది. స్వరాష్ట్రంలో నిర్వహిస్తున్న తొలి స్నాతకోత్సవం ఇది. 2014లోటీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌కుఓయూ గౌవర డాక్టరేట్ ఇవ్వాలనిప్రతిపాదించగా... విద్యార్థి సంఘాలువ్యతిరేకించడంతో విరమించుకున్నారు. సాక్షి, సిటీబ్యూరో: ఉస్మానియా విశ్వవిద్యాలయం ఒక మహోన్నతమైన విజ్ఞానభూమి. బోధన, పరిశోధనే లక్ష్యంగా ఆవిర్భవించిన విశ్వవిద్యాలయం. వేల ఏళ్ల మానవ ప్రస్థానాన్ని, చరిత్ర గమనాన్ని అధ్యయనం చేస్తూ పరిశోధిస్తూ సరికొత్త ఆవిష్కరణలతో ఒక తరం నుంచి మరో తరానికి విజ్ఞాన వారధిగా నిలిచిన ఈ యూనివర్సిటీ... విద్య, బోధన, పరిశోధన మాత్రమే కాదు, సమాజాన్ని ముందుకు నడిపించడంలో, ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించడంలో అగ్రభాగాన నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సముపార్జించిన ఎంతోమంది అతిరథ మహారథులకు గౌరవ డాక్టరేట్లను అందజేసి సముచితంగా గౌరవించింది. తన కీర్తి ప్రతిష్ఠలను విశ్వవిఖ్యాతం చేసుకుంది. అయితే ఇదంతా గత వైభవమే. గడిచిన 18 ఏళ్లుగా ఒక్క గౌరవ డాక్టరేట్‌ను కూడా ఇవ్వలేదు. ఇంచుమించు ఈ రెండు దశాబ్దాల కాలంలో ఎన్నో పరిణామాలు జరిగాయి. మరెంతో మంది తమ ప్రతిభా పాటవాలతోపరిశోధనలతో ప్రపంచాన్ని ప్రభావితం చేసి ఉండొచ్చు. కానీ అలాంటి ప్రముఖులకు గౌరవ డాక్టరేట్ ఇవ్వడంలో మాత్రం అధికారులు విఫలమవుతున్నారు. ఎంపికలో ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నారు. చరిత్ర, సైన్స్, కళలు, సాహిత్యం, సామాజిక, వైజ్ఞానిక శాస్త్రాలు, రాజకీయ రంగాల్లో గొప్ప కృషి చేసిన వారిని గుర్తించి గౌరవ డాక్టరేట్ ఇవ్వడమంటే ఆ వ్యక్తులను సమున్నతంగా గౌరవించడమే కాకుండా... ఉస్మానియా విశ్వవిద్యాలయం తనను తాను గౌరవించుకున్నట్లవుతుంది. కానీ ఈ 18 ఏళ్లలో ఆ దిశగా ఒక్క అడుగు కూడా పడకపోవడం గమనార్హం. ఆనాటి వెలుగులేవీ? ఆరేళ్ల తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయం స్నాతకోత్సవ వేడుకలకు సన్నద్ధమవుతోంది. ఈ నెల 17న వేడుకలను నిర్వహించనున్నారు. ఈ ఆరేళ్లలో పరిశోధనలు పూర్తి చేసిన ఎంతోమంది విద్యార్థులు పట్టాలందుకోనున్నారు. సుమారు 2,800 మందికి పైగా విద్యార్ధులు పీహెచ్‌డీలు పూర్తి చేశారు. వారిలో ఇప్పటికే 1,800 మంది పట్టాలు పొందారు. మరో 1,096 మందికి ఈ స్నాతకోత్సవ వేడుకల్లో పట్టాలందజేసేందుకు దరఖాస్తులను ఆహ్వానించగా.. ఇప్పటి వరకు సుమారు 680 మంది దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే ఈ వేడుకల్లో అసమాన ప్రతిభా పాటవాలను ప్రదర్శించిన 270 మంది టాప్‌మోస్ట్ విద్యార్థులు గోల్డ్‌మెడల్స్‌ను అందుకోనున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ వేడుకలను నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ అలాంటి స్నాతకోత్సవ సంరంభంలో యూనివర్సిటీ హోదాను, గౌరవాన్ని, కీర్తి ప్రతిష్టలను ద్విగుణీకృతం చేసే గౌరవ డాక్టరేట్లు మాత్రం లేవు. ఎందుకిలా? గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేయకపోవడానికి అనేక కారణాలున్నాయి. 2001 నుంచి దశాబ్దానికి పైగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కొనసాగింది. సమాజంలో ఒక బలమైన ఆందోళన కొనసాగుతున్న సమయంలో వివిధ రంగాల్లో గొప్ప వ్యక్తులను గుర్తించి అవార్డులను అందజేయడం అసాధ్యంగా మారింది. 2014లో కేసీఆర్‌కు ఇవ్వాలనుకున్నప్పటికీ విద్యార్థుల నుంచి వ్యతిరేకత రావడంతో విరమించుకున్నారు. సామాజిక శాస్త్రవేత్తలు, వైజ్ఞానిక, సాహిత్య, రాజకీయ రంగాల్లోని ప్రముఖులను గుర్తించి ఇవ్వడంలో యూనివర్సిటీ పాలకమండలిలో ఏకాభిప్రాయం లేకుండా పోయింది. మరోవైపు రాజకీయ పార్టీల ప్రభావం కారణంగా ఎంపికపై ఎవరికి వారు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ నాయకులకు ఇవ్వాలనుకున్నా అందరికీ, అన్ని పార్టీలకు ఆమోదయోగ్యుడైన నేతల ఎంపిక కూడా కష్టంగా మారింది. రవీంద్రనాథ్ ఠాగూర్, అంబేడ్కర్, జవహర్లాల్ నెహ్రూ లాంటి మహానుభావులకు, ఎంతోమంది వైజ్ఞానిక రంగ ప్రముఖులకు గౌరవ డాక్టరేట్లు ఇవ్వడం ద్వారా ఇతర యూనివర్సిటీల కంటే ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎంతో వైవిధ్యాన్ని కనబరిచింది. అదేస్థాయి వ్యక్తులను ఎంపిక చేయడంలో ఈ 18 ఏళ్ల కాలంలో సాధ్యం కాలేదు. ఎందరో మహానువుభావులు... నిజానికి వర్సిటీ ఆరంభం నుంచే గొప్ప సంస్కృతిని చాటుకుంది. మేధావులను, ఆయా రంగాల్లో అపారమైన సేవలందజేసిన వారిని గుర్తించి డాక్టరేట్లతో గౌరవించింది. అలా 1917లోనే అప్పటి అరబిక్ ప్రొఫెసర్, ఆరో నిజాం రాజు మహబూబ్అలీకి ఎంతో ప్రియమైన వ్యక్తి అయిన నవాబ్ ఇమాదుల్ ముల్క్ బహదూర్‌కు తొలి గౌరవ డాక్టరేట్ లభించింది. ఈయన ప్రెసిడెన్సీ కాలేజీలో, బెంగాల్, లక్నో కళాశాలల్లోనూ అధ్యాపకులుగా పని చేశారు. నిజాం ప్రభుత్వంలో ప్రధాన కార్యదర్శిగా, పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విభాగం డైరెక్టర్‌గా విధులు నిర్వహించారు. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్‌కు 1938 ఫిబ్రవరి 28న గౌరవ డాక్టరేట్ అందజేసింది. చారిత్రక ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ‘డాక్టరేట్ ఆఫ్ లిటరేచర్’ అవార్డును అందుకున్న తొలి సాహితీవేత్త రవీంద్రనాథ్ ఠాగూర్. అదే సంవత్సరం ప్రముఖ కవి ఇక్బాల్‌కు గౌరవ డాక్టరేట్‌ను అందజేశారు. బికనూర్ ప్రభువు మహారాజ్ ఆదిరాజ్‌కు కూడా గౌరవ డాక్టరేట్‌ను అందజేశారు. ఆ తర్వాత ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌ల చీఫ్ ఇంజినీర్ అయిన నవాబ్ అలీజంగ్కు 1949 మార్చి 19న ‘డాక్టరేట్ ఆఫ్ సైన్స్’ విభాగంలో అందజేశారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌కు 1953లో గౌరవ డాక్టరేట్ అందజేసే అరుదైన అవకాశం ఉస్మానియా విశ్వవిద్యాలయానికి దక్కింది. ఈ అపూర్వ ఘట్టంతో ఓయూ కీర్తిప్రతిష్టలు మరింత రెపరెపలాడాయి. అప్పటికే 1952లో కొలంబియా విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్‌ను అందజేసి సముచితంగా గౌరవించింది. బెల్ లెబోరేటరీస్ అధినేత, వైజ్ఞానిక రంగ నిపుణులు అయిన డాక్టర్ అరుణ్ నేత్రావలికి 2001 ఆగస్టు 8న గౌరవ డాక్టరేట్‌ను అందజేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్‌ను అందుకున్న 47వ వ్యక్తి ఆయన. ఆ తర్వాత ఇప్పటి వరకు ఎవ్వరికీ ఇవ్వలేదు. 2014లో టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు గౌరవ డాక్టరేట్ ఇవ్వాలని ప్రతిపాదించారు. కానీ విద్యార్ధుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ ప్రతిపాదనను ఉపసంహరించుకున్నారు. ఓయూ గౌరవ డాక్టరేట్ అందుకున్న ప్రముఖులు వీరే... 1. నవాబ్ ఇమాదుల్ ముల్క్ బహదూర్ – 1917 2. నవాబ్ సర్ అమీన్‌జంగ్ బహదూర్ – 1918 3. నవాబ్ మసూద్ జంగ్ బహదూర్ – 1923 4. మహరాజ్ సర్ కిషన్ పరిషద్ బహదూర్ – 1938 5. సర్ తేజ్ బహదూర్ సిప్రూ – 1938 6. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ – 1938 7. సర్ మహ్మద్ ఇక్బాల్ – 1938 8. మహరాజ్ ఆదిరాజ్ బికనూర్ ప్రభువు –1939 9. ప్రిన్స్ ఆజం జాహ్ బహదూర్ – 1939 10. ప్రిన్స్ మోజం జాహ్ బహదూర్ – 1940 11. నవాబ్ అలీ నవాజ్‌జంగ్ బహదూర్ –1943 12. సి.రాజగోపాలాచారి – 1944 13. దివాన్ బహదూర్ సర్ రామస్వామి మొదలియార్ – 1945 14. సర్ జాన్ సర్ గేంట్ – 1947 15. పండిత్ జవహర్లాల్ నెహ్రూ – 1947 16. మేజర్ జనరల్ చౌదరి – 1949 17. బాబు రాజేంద్రప్రసాద్ – 1951 18. టింగ్ సి–లిన్ – 1951 19. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ – 1953 20. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ – 1953 21. ఎంకే వెల్లోడి – 1953 22. కేఎం మున్షీ – 1954 23. వీకే కృష్ణమీనన్ – 1956 24. బూర్గుల రామకృష్ణరావు – 1956 25. ఆలియార్ జంగ్ – 1956 26. షేక్ అహ్మద్ యామనీ – 1975 27. డాక్టర్ జర్హర్ట్ హెర్డ్ బెర్గ్ – 1976 28. ప్రొఫెసర్ సయ్యద్ నురుల్ హసన్ – 1977 29. డాక్టర్ కలియంపూడి రాధాకృష్ణ – 1977 30. తాలాహ్ ఈ దైని తరాజీ – 1979 31. యాసర్ హరాఫత్ – 1982 32. డాక్టర్ వై.నాయుడమ్మ – 1982 33. ప్రొఫెసర్ రాంజోషి – 1982 34. జి.పార్థసారథి – 1982 35. డాక్టర్ జహీర్ అహ్మద్ – 1982 36. జస్టిస్ మహ్మద్ బౌడ్జౌయ్ – 1985 37. జస్టిస్ నాగేందర్‌సింగ్ – 1986 38. జస్టిస్ ని ఝంగ్యూ – 1986 39. ఆర్.వెంకట్రామన్ – 1986 40. ప్రొఫెసర్ సీఎస్ఆర్ రావు – 1986 41. జస్టిస్ పి.జగన్మోహన్రెడ్డి – 1986 42. డాక్టర్ రాజా రామన్న – 1990 43. బీపీఆర్ విఠల్ – 1993 44. ప్రొఫెసర్ జి.రాంరెడ్డి – 1993 45. డాక్టర్ లక్ష్మీ ఎం.సింగ్వీ – 1994 46. డాక్టర్ మన్మోహన్సింగ్ – 1996 47. డాక్టర్ అరుణ్ నేత్రావలి – 2001 -
స్నాతక సంబురం
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు ఉన్నత విద్యా ప్రదాయినీ అయిన పాలమూరు యూనివర్సిటీ రెండో స్నాతకోత్సవ (కాన్వకేషన్) కార్యక్రమానికి సిద్ధమవుతోంది. మొదటి స్నాతకోత్సవం 2014లో నిర్వహించగా, ప్రస్తుతం రెండో స్నాతకోత్సవం నిర్వహించేందుకు పీయూ అతాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఐదు సంవత్సరాలుగా పీయూ పరిధిలో ప్రైవేటు, ప్రభుత్వ కళాశాలల్లో వివిధ పీజీ కోర్సులు పూర్తి చేసి, ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఈనెల 6న జరిగే స్నాతకోత్సవ కార్యక్రమంలో గోల్డ్‌మెడల్, పట్టాల ప్రదానోత్సవం చేస్తారు. అతిథిగా గవర్నర్ రాక రెండో స్నాతకోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్, యూనివర్సిటీ చాన్స్‌లర్ నరసింహన్ ముఖ్యఅతిథిగా రానున్నారు. వీరితో పాటు మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, విద్యాశాఖ, ఉన్నత విద్యాశాఖ కార్యదర్శులను సైతం అధికారులుఆహ్వానించారు. యూనివర్సిటీలో ప్రతి సంవత్సరం స్నాతకోత్సవం నిర్వహించి ఆ సంవత్సరంలో ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేయడం ఆనవాయితీ. కానీ కొన్ని కారణాల వల్ల ఈ పదేళ్ల కాలంలో కేవలం రెండు సార్లు మాత్రమే స్నాతకోత్సవ కార్యక్రమం నిర్వహించారు. చకచకా సాగుతున్న పనులు స్నాతకోత్సవ కార్యక్రమానికి యూనివర్సిటీ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. వివిధ అంశాల వారీగా కమిటీలను ఏర్పాటు చేశారు. ఒక్కో కమిటీలో ఐదు మంది సభ్యుల చొప్పున ఎంపిక చేసి నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. గోల్డ్‌మెడల్స్, సర్టిఫికెట్ల నిర్వహణ, స్టేజ్ అతిథుల సీట్ల కేటాయింపు, పార్కింగ్, సీటింగ్, ఫైనాన్సరీ కమిటీల ఆధ్వర్యంలో పనులు కొనసాగుతున్నాయి. గోల్డ్‌మెడల్స్ తీసుకునే 115 మంది విద్యార్థులకు పీయూ అధికారులు 6న జరిగే కార్యక్రమానికి హాజరుకావాలని ఫోన్ ద్వారా, మెయిల్, పోస్టుల ద్వారా సమాచారం అందించారు. ఇందులో 30 మంది విద్యార్థులు ముందే కాన్వకేషన్ సర్టిఫికెట్లు తీసుకెళ్లగా తాజాగా 62 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. అంతేకాకుండా శనివారం వరకు 76 మంది విద్యార్థులు యూనివర్సిటీలో రిపోర్టు చేసి స్నాతకోత్సవానికి సంబంధించి పాస్‌లు తీసుకెళ్లారు. అభివృద్ధి ఆశలు యూనిర్సిటీలో నిర్వహించే స్నాతకోత్సవానికి గవర్నర్ నరసింహన్‌తో పాటు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి, రాష్ట్ర ఎక్సైజ్ శాఖ, యువజన, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను ఆహ్వానించారు. అయితే వీరు పీయూలో ఉన్న పలు సమస్యలపై దృష్టి కేంద్రీకరిస్తే మరింత అభివృద్ధి చెందుతుందని అటు విద్యార్థులు, ఇటు వారి తల్లిదండ్రులు, పీయూ ఉద్యోగులు కోరుకుంటున్నారు. ముఖ్యంగా పీయూలో ప్రస్తుతమున్న బాలికల హాస్టల్లో దాని పరిమితికి మించి విద్యార్థులు ఉంటున్నారు. ప్రత్యేకంగా ఒక భవనం అవసరం కాగా పీయూలో ఉంటున్న దాదాపు 1500 మంది విద్యార్థులకు వైద్యసేవలు అందించేం దుకు ప్రత్యేక హాస్పిటల్‌ను ఏరా>్పటు చేయాల్సి ఉంది. అంతేకాకుండా క్రీడలకు ప్రత్యేక మైదానం, పూర్తిస్థాయిలో ఇంటర్నెట్ సదుపాయం అవసరం. ప్రస్తుతం ఎగ్జామినేషన్ బ్రాంచ్, గెస్ట్‌హౌస్, వీసీ గృహం వంటి వాటి పనులు కొనసాగుతున్నాయి. వీటికి పూర్తి స్థాయిలో నిధులు అవసరం. అంతేకాకుండా గద్వాల, వనపర్తి, కొల్లాపూర్ పీజీ సెంటర్లలో పలు కళాశాలలు, హాస్టల్ భవనాలను అధికారులు నిర్మించ తలపెట్టారు. వీటికి నిధులు అవసరం. వీటిపై మంత్రులు అధికారులు దృష్టి కేంద్రీకరిస్తే బాగుంటుందని విద్యార్థులు కోరుతున్నారు. ఏర్పాట్లు చేస్తున్నాం.. యూనివర్సిటీలో ఈనెల 6న నిర్వహించే స్నాతకోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నాం. గవర్నర్‌తోపాటు, మంత్రులు కూడా అతిథులుగా విచ్చేస్తున్నారు. ఐదు సంవత్సరాలుగా పీజీ కోర్సుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎంపిక చేసి బంగారు పతకాలను అందిస్తాం. ఎంపకైన విద్యార్థులందరికీ సమాచారం చేరవేశాం. – ప్రొఫెసర్ రాజరత్నం, పాలమూరు యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ కమిటీలు ఏర్పాటుచేశాం రెండో స్నాతకోత్సవానికి పనులు పూర్తికావచ్చాయి. నిర్వహణ కమిటీలను ఏర్పాటు చేశాం. వారి ఆధ్వర్యంలో పనులు వేగంగా సాగుతున్నాయి. మంచి వాతావరణంలో కార్యక్రమం నిర్వహించడానికి చర్యలు చేపడుతున్నాం. – ప్రొఫెసర్ గిరిజ, పాలమూరు యూనివర్సిటీ రిజిస్ట్రార్ -
మద్దతు ధర పెంచడమే పరిష్కారం కాదు
సాక్షి, హైదరాబాద్: రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి కేవలం మద్దతు ధరలు పెంచడం ఒక్కటే పరిష్కారం కాదని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అన్నారు. ఆదివారం జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం రెండో స్నాతకోత్సవానికి ఆయన అధ్యక్షత వహించి ప్రసంగించారు. నీటి యాజమాన్యం, పంటల మార్పిడి, పంట కోత అనంతర నష్టాలను నివారించేందుకు కోల్డ్ స్టోరేజీ సౌకర్యాలు పెంచడం, సాగు ఖర్చులు తగ్గించడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. వ్యవసాయ రంగంలో అవకాశాలను అందిపుచ్చుకొని సృజనాత్మక పద్ధతులతో ఆలోచించి రైతులకు వ్యవసాయం లాభసాటిగా మార్చేందుకు కృషిచేయాలని విద్యార్థులకు సూచించారు. ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా రైతులకు ఆర్థిక భద్రత, ప్రజలకు ఆరోగ్య భద్రత, ఆహార భద్రత కల్పించడమే కాకుండా పర్యావరణానికి హాని కలుగని రీతిలో వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని చెప్పారు. సేంద్రియ సాగు, ఔషధ మొక్కలు పెంచాలి సేంద్రియ వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించి సహజ వనరులను కాపాడాల్సిన అవసరముందని గవర్నర్ సూచించారు. సమర్థ నీటి యాజమాన్యం కోసం జాతీయ నీటి విధానం తీసుకురావాలని.. అందుబాటులోని నీటి వనరులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని చెప్పారు. అలాగే ఔషధ మొక్కల పెంపకంపై దృష్టి పెట్టాలన్నారు. పట్టణాలు, గ్రామాల మధ్య అంతరం తొలగించేందుకు కృషి చేయడం వల్ల వలసలు నివారించవచ్చని తెలిపారు. సమాజ అభివృద్ధి, రైతుల అభ్యున్నతిలో వ్యవసాయ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు చురుకైన పాత్ర పోషించాలన్నారు. రైతులు పండించిన పంటలకు విలువ జోడింపు వల్ల వారికి ఆదాయం పెంచే మార్గాలను కనుగొనాలని సూచించారు. సమాజ అవసరాలకు అనుగుణంగా వర్సిటీ విద్యార్థులను తీర్చిదిద్దుతున్నందుకు వ్యవసాయ వర్సిటీ వీసీ వి.ప్రవీణ్‌రావును గవర్నర్ అభినందించారు. 27 మందికి బంగారు పతకాలు... 2016–17 విద్యా సంవత్సరానికి పీజీ, పీహెచ్‌డీకి చెందిన 162 మందికి, అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన 584 మంది విద్యార్థులకు స్నాతకోత్సవంలో పట్టాలు అందజేశారు. యూజీ, పీజీ, పీహెచ్‌డీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 27 మందికి బంగారు పతకాలు అందించారు. బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఐరెడ్ల మౌన్యారెడ్డి ఐదు బంగారు పతకాలతో సత్తా చాటింది. బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ విద్యార్థి ఎం.మునిమారుతి రాజు బంగారు పతకాలు అందుకున్నాడు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఎస్.సుధీర్‌కుమార్‌తో పాటు డీన్లు, డైరెక్టర్లు, పాలకమండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గౌరవప్రద వృత్తిగావ్యవసాయం గతంతో పోలిస్తే ప్రస్తుతం వ్యవసాయ రంగం గౌరవప్రదమైన వృత్తిగా సమాజంలో గుర్తింపు పొందిందని కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భారత వ్యవసాయ పరిశోధన మండలి మాజీ డైరెక్టర్ రాజేంద్రసింగ్ పరోడాఅన్నారు. ఆయనకు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఆకలి, దారిద్య్రం, అనారోగ్యం లేని సమాజ స్థాపనకు యువ శాస్త్రవేత్తలు కృషి చేయాలన్నారు. వ్యవసాయ విద్య పరిజ్ఞానాన్ని సమాజ అభివృద్ధికి వినియోగించాలన్నారు. అనంతరం వీసీ వి.ప్రవీణ్‌రావు 2016–17 విద్యా సంవత్సరంలో చేపట్టిన కార్యక్రమాల నివేదికను సమర్పించారు. బోధన, పరిశోధన, విస్తరణ రంగాల్లో సంస్కరణలను వివరించారు. -
నితిన్ గడ్కరీకి స్వల్ప అస్వస్థత
-
సొమ్మసిల్లిన కేంద్రమంత్రి
సాక్షి, ముంబై : కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. అహ్మద్‌నగర్‌లోని మహాత్మాపూలే వ్యవసాయ విశ్వవిద్యాలయంలో శుక్రవారం జరిగిన స్నాతకోత్సవంలో గడ్కరీ పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న గడ్కరీ సభను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం జాతీయగీతం ఆలపిస్తున్న సమయంలో ఆయన సొమ్మసిల్లారు. గడ్కరీ కుర్చీలో పడిపోతుండగా పక్కనే ఉన్న గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు, అక్కడున్న వారు స్పందించి కుర్చీలో కూర్చుండబెట్టారు. కొంత విశ్రాంతి అనంతరం ఆయన మామూలు స్థితికి వచ్చారు. అనంతరం ఆయన్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స అనంతరం గడ్కరీ షిర్డీ బయలుదేరి వెళ్లారు. కాగా, 2014 ఎన్నికల్లో నాగపూర్ పార్లమెంట్ స్థానం నుంచి గెలుపొందిన గడ్కరీ ఉపరితల రవాణా, నీటి వనరులు, షిప్పింగ్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే. -
కృషి మీ ఆయుధమైతే.. విజయం మీకు బానిస
కడప సిటీ/వేంపల్లె: ‘కృషి నీ ఆయుధమైతే విజయం నీకు బానిస’ అన్న జాతిపిత మహాత్మగాంధీ మాటలను ప్రతి ఒక్క ట్రిపుల్ ఐటీ విద్యార్థి గుర్తించుకుని ముందుకు సాగా లని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సూచించారు. శుక్రవా రం ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో 2012–18 విద్యా సంవత్సరానికి సంబంధించి నాల్గవ స్నాతకోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు గంటా శ్రీనివాసరావు, ఆదినారాయణరెడ్డి, చాన్సలర్ రాజిరెడ్డి, వైస్ చాన్సలర్ రామచంద్రరాజు, డైరెక్టర్ అమరేంద్రకుమార్ పండ్ర తదితరులు హాజరై పట్టాలు పొందిన విద్యార్థులకు గోల్డ్ మెడల్స్‌ను అందజేశారు. అనంతరం వారు విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. ప్రభుత్వ బడులలో చదివే గ్రామీణ విద్యార్థులకు ట్రిపుల్ ఐటీలు వరం లాంటివన్నారు. రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వ విద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలో రాష్ట్రం లో ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలు నడుస్తున్నాయన్నారు. ప్రతి ట్రిపుల్ ఐటీలో ప్రతి ఏడాది 6 వేలమంది విద్యార్థులకు ఇక్కడ చదివేందుకు అవకాశం వస్తోందన్నారు. ప్రధానంగా ప్రభుత్వ బడులలో చదివే విద్యార్థులకు 4 శాతం వెయిటేజీ మార్కులు కలుపుతున్నామన్నారు. అయినప్పటికి చివరి సీటు సాధించిన విద్యార్థికి కూడా 10 జీపీఏ పాయింట్లు సాధించిన వారే ఇక్కడ విద్యనభ్యసించడం జరుగుతోందన్నారు. ఆరేళ్ల సమీకృత కోర్సుకు సంబంధించి విద్యార్థులకు ల్యాప్‌టాప్, భోజన వసతి, వసతి, యూనిఫాం తదితర సదుపాయాలు కూడా ఏర్పాటు చేశామన్నారు. మరో రెండు ట్రిపుల్ ఐటీలు ప్రధానంగా ట్రిపుల్ ఐటీలలో బాలికలకు 65శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు తెలిపారు. 1985లో తాను ఆంధ్రా యూనివర్సిటీలో పట్టా తీసుకున్నానని, ఆ నాటి జ్ఞాపకాలు ఇప్పుడు గుర్తుకు వస్తున్నాయన్నారు. పట్టాలు తీసుకోవడంతోనే సరిపోదని, ఇంకా లాంగ్ జర్నీ ఎంతో ఉందన్నారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ ట్రిపుల్ ఐటీల వ్యవస్థను తీసుకొచ్చారన్నారు. మరో రెండు కొత్త ట్రిపుల్ ఐటీల ఏర్పాటుకు ముఖ్యమంత్రి చొరవ చూపుతున్నారని వెల్లడించారు. 2008లో ప్రొఫెసర్ రాజిరెడ్డి ఈ ట్రిపుల్ ఐటీలకు రూపకల్పన చేశారన్నారు. విద్యాభివృద్ధికి ప్రభుత్వం బడ్జెట్లో 17శాతం ఖర్చు చేస్తోందన్నారు. ఎడ్యుకేషన్ ఆఫ్ నాలెడ్జి హబ్‌గా వీటిని మార్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. వాన చుక్క పడే స్థానాన్ని బట్టి దానికి విలువ ఉంటుందని, ఆల్చిప్పలో పడితే ముత్యమవుతుందని, అటువంటి ఆల్చిప్పగా ట్రిపుల్ ఐటీని ఆయన అభివర్ణించారు. విలువలతో కూడిన విద్యనభ్యసించాలన్నారు. తల్లిదండ్రుల కలలు సాకారం చేయాలన్నారు. ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి.. మార్కెటింగ్ శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి మా ట్లాడుతూ మిమ్ములను చూస్తే స్టూడెంట్–1 సినిమా గుర్తుకు వస్తోందన్నారు. ఎక్కడో పుట్టి.. ఎక్కడో పె రిగి.. ఇక్కడే చదివాం అన్నట్లుగా ఉందని, బంగారు భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలని సూచించారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనారాయణ, సుందర్ పిచ్చయ్లను ఆదర్శంగా తీసుకుని చదవాలన్నారు. భావి శాస్త్రవేత్తలు ఎదగాలి చాన్సలర్ రాజిరెడ్డి మాట్లాడుతూ పేద గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం 6 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ డ్యూయల్ డిగ్రీని ట్రిపుల్ ఐటీలో ఏర్పాటు చేశామన్నారు. వినూత్న ప్రయోగాలతో ముందుకు సాగాలన్నారు. ప్రస్తుతం ట్రాన్స్‌సిస్టర్ రేడియో, డిస్కవరీ, రోబోస్టిక్స్ తదితర వినూత్న ప్రయోగాలపై శ్రద్ధ చూపి దేశాభివృద్ధికి పాటుపడటంతోపాటు భావి భారత శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. ప్రతి విద్యార్థికి ఇక్కడ చదువుకునేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయని, సద్వి నియోగం చేసుకోవడమే మీ వంతు అన్నారు. ఇప్పటికే ట్రిపుల్ ఐటీల ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లామన్నారు. రాబోయే రోజులలో మరింత ఖ్యాతిని గడించేలా క్రమశిక్షణతో చదివి లక్ష్యాన్ని ముందుంచుకుని ముందుకు సాగాలన్నారు. అనంతరం వివిధ రంగాలలో ప్రతిభ చూపిన విద్యార్థిని విద్యార్థులకు, ఫ్యాకల్టీకి నగదు బహుమతులతోపాటు ప్రశంసా పత్రాలను అందజేశారు. -
ఘనంగా ఎస్వీయూ స్నాతకోత్సవం
యూనివర్సిటీ క్యాంపస్ : మూడేళ్ల తర్వాత నిర్వహించిన ఎస్యీయూ స్నాతకోత్సవం సంప్రదాయ బద్ధంగా సాగింది. స్నాతకోత్సవానికి ఇస్రో చైర్మన్ శివన్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఎస్వీయూ వీసీ దామోదరం, రెక్టార్ జానకి రామయ్య, రిజిస్ట్రార్ అనురాధ, పాలక మండలి సభ్యులు, ఫ్యాకల్టీ డీన్ల సమక్షంలో ఈ స్నాతకోత్సవం వేడుకగా సాగింది. స్నాతకోత్సవానికి గవర్నర్ నరసింహన్ హజరు కాకపోవడంతో ఎస్వీయూ వీసీ దామోదరం చాన్సలర్ హోదాలో ఇస్రో చైర్మన్ కే.శివన్‌కు గౌరవ డాక్టరేట్ అందజేశారు. అనంతరం పీహెచ్డీ, ఎంఫిల్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంకామ్, ఎంఎస్సీ, ఎంఏ తదితర డిగ్రీలను ప్రదానం చేశారు. తరువాత వివిధ సబ్జెక్ట్‌లలో టాపర్లుగా నిలిచిన వారికి బంగారు పతకాలు ప్రదానం చేశారు. ఇస్రో చైర్మన్ స్నాతకోపన్యాసంతో ఈ వేడుక ముగిసింది. ఈ కార్యక్రమం పూర్తి కాగానే డిగ్రీలు పొందిన విద్యార్థులు అనందంతో గడిపారు. ఫొటోలు, సెల్ఫీలు తీసుకుని సంబరాలు చేసుకున్నారు. ఎస్వీయూతో ఎంతో అనుబంధం ఎస్వీయూతో ఇస్రోకు ఎంతో అనుబంధం ఉందని ఇస్రో చైర్మన్ కే.శివన్ అన్నారు. ఎస్వీయూ నుంచి గౌరవ డాక్టరేట్ స్వీకరించిన అనంతరం ఆయన స్నాతకోపన్యాసం చేశారు. ఎస్వీయూ ఎంతో పురోగతి సాధించడంతో పాటు విజ్ఞానాన్ని పంచుతుందన్నారు. దక్షిణ భారతదేశంలోనే ఎస్వీయూ విశిష్టస్థానం దక్కించుకుందన్నారు. ఎస్వీయూ గొప్ప వ్యక్తులను సమాజానికి అందించిందన్నారు. స్నాతకోత్సవంలో డిగ్రీలు పొందిన విద్యార్థుల కళ్లలో కాంతులు కనిపిస్తున్నాయన్నారు. డిగ్రీలు పొందిన వారు ఉన్నత లక్ష్యాలను చేరుకుని యూనివర్సిటీ ప్రతిష్ట పెంచడంతో పాటు దేశ అభివృద్ధిలో పాలు పంచుకోవాలన్నారు. నూతన ఆలోచనలు, సృజన్మాతకత కలిగిన వారికి అనేక అవకాశాలు ఉన్నాయన్నారు. దేశ అభివృద్ధికి, వ్యక్తిగత, కుటుంబ అభివృద్ధికి అవసరమైన వేయి మార్గాలు విద్యార్థుల ఎదుట ఉన్నాయన్నారు. సరైన మార్గాన్ని ఎంచుకొని విజయం సాధించాలని పిలుపునిచ్చారు. సృజనాత్మకత, నూతన ఆలోచన ధోరణి విద్యార్థులను ఉన్నత స్థానానికి చేర్చుతుందన్నారు. దేశం ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ ఇంకా పేదరికం, ఆకలి, ఆనారోగ్యం, నీటి కొరత, నిరుద్యోగం తదితర సమస్యలు ఉన్నాయన్నారు. ఈ సమస్యల పరిష్కారం దిశగా పరిశోధనలు సాగాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి దిశగా ఎస్వీయూ ఎస్వీయూనివర్సిటీ మూడేళ్లుగా ఎంతో పురోగతి సాధించిందని వర్సిటీ వైస్‌చాన్స్‌లర్ దామోదరం చెప్పారు. ఎస్వీయూ నాక్‌లో ఏ ప్లస్ గ్రేడ్‌తో పాటు యూజీసీ కేటగిరి–1 అటానమస్ హోదా పొందిందన్నారు. వివిధ జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి ఎస్వీయూ మంచి ర్యాంకులు సాధించిందన్నారు. వర్సిటీలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు తీసుకొచ్చామన్నారు. కొత్త కోర్సులు, నూతన పరిశోధనలతో వర్సిటీని ముందుకు తీసుకెళున్నామన్నారు. 1,128 మందికి డిగ్రీలు ఎస్వీయూలో శనివారం నిర్వహించిన 55వ స్నాతకోత్సవం సందర్భంగా 1,128 మందికి డిగ్రీలు ప్రదానం చేశారు. డిగ్రీలు పొందిన వారిలో 151 మంది పీహెచ్డీ, 1 ఎంఫిల్, 976 మంది పీజీ డిగ్రీలు పొందారు. వీరు కాకుండా ఇన్ అడ్వాన్స్ రూపంలో 21,094 మంది, ఇన్ ఆబ్సెన్సియా రూపంలో 4,109 మంది డిగ్రీలు పొందారు. 65 మందికి బంగారు పతకాలు స్నాతకోత్సవంలో 65 మందికి బంగారు పతకాలు ప్రదానం చేశారు. పసిడి పతకాలు పొందిన వారిలో పూర్ణ చంద్రిక, ముకుందవల్లి, సునీత (గణితం), భాస్కర్, యామిని(రసాయన శాస్త్రం), లీలాకుమారి(బయోటెక్నాలజీ), సాయి వైష్ణవి(బాటనీ), శ్వేత, హేమలత(కంప్యూటర్ సైన్స్), చరణ్‌కుమార్ రెడ్డి(జాగ్రఫీ), వైష్ణవి, భారతి(హోంసైన్స్), నాగేంద్ర, సరిత, రాము, గురవమ్మ, (ఫిజిక్స్), రెడ్డమ్మ(సైకాలజీ), స్వప్న (స్టాటిస్టిక్స్), భార్గవి(జువాలజీ), మోహన్ కృష్ణ( ఎకనామిక్స్), అశోక పుత్ర(ఇంగ్లిషు), సుధాకర్(హిందీ), శివకేశవర్ధన్(ఫిలాసపీ), చిన్ని(పబ్లిక్ అడ్మినిస్ట్రేçషన్), సురేఖ(పొలిటికల్ సైన్స్), వీరమణి(సంస్కృతం),సురేష్(సోషియాలజీ), వెంకటేశు, సురేఖ(తెలుగు), వడివేలు(తమిళం), గుణశేఖర్, మైర్టేల్(కామర్స్), సౌజన్య(లా), రామరెడ్డి(బీఎల్ఐసీ), జెస్సీ ప్రశాంతి (సోషియాలజీ) ఉన్నారు. స్నాతకోత్సవంలో పాలకమండలి సభ్యులు గురుప్రసాద్, సిద్ధముని, హరి, ఫ్యాకల్టీ డీన్లు సవరయ్య, త్యాగరాజు, మల్లికార్జున, కుమారస్వామి, బాలాజీ ప్రసాద్ పాల్గొన్నారు. -
సంబంధాల్లో సువర్ణాధ్యాయం
శాంతినికేతన్: గత కొద్ది సంవత్సరాలుగా భారత్–బంగ్లాదేశ్ దేశాల సంబంధాల్లో సువర్ణాధ్యాయం నడుస్తోందని ప్రధాని మోదీ అన్నారు. పరస్పర అవగాహన, సహకారమే ఇరు దేశాలను కలిపాయని పేర్కొన్నారు. శుక్రవారం పశ్చిమబెంగాల్ శాంతిని కేతన్లోని విశ్వభారతి యూనివర్సిటీ స్నాతకోత్సవంలో∙పాల్గొన్నారు. బంగ్లాదేశ్ ప్రధాని హసీనా, పశ్చిమబెంగాల్ గవర్నర్ త్రిపాఠి, సీఎం మమతా బెనర్జీతో వేదిక పంచుకున్నారు. వర్సిటీ క్యాంపస్‌లో హసీనాతో కలసి బంగ్లాదేశ్ భవన్‌ను ప్రారంభించారు. ఇరు దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలకు చిహ్నంగా ఈ భవన్‌ను బంగ్లాదేశ్ నిర్మించింది. స్నాతకోత్సవ కార్యక్రమంలో మోదీ ప్రసంగిస్తూ.. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ సొంతగడ్డపై అడుగుపెట్టినందుకు ఎంతో ఉద్విగ్నంగా ఉందని అన్నారు. యువ మెదళ్లను తీర్చిదిద్దుతున్న విశ్వభారతి వర్సిటీ ప్రయత్నాలను కొనియాడారు. ‘ మీరు 50 గ్రామాలను అభివృద్ధి చేస్తున్నారని విన్నా. విశ్వభారతి స్థాపించి 100 ఏళ్లు పూర్తయ్యే 2021 నాటికి మరో 50 గ్రామాల్లో విద్యుత్, గ్యాస్ కనెక్షన్, ఆన్లైన్ లావాదేవీలు కల్పించి అభివృద్ధి చేస్తామని ప్రతినబూనండి’ అని సూచించారు. రవీంద్రనాథ్ ఠాగూర్, ఆయన అన్న సత్యేంద్రనాథ్ ఠాగూర్‌లకు గుజరాత్‌తో ఉన్న సంబంధాల్ని మోదీ గుర్తు చేసుకున్నారు. స్నాతకోత్సవ వేదిక వద్ద తాగునీటికి కొరత ఏర్పడినందుకు మోదీ విద్యార్థులకు క్షమాపణ చెప్పారు. అనుసంధానత జోరు.. గత కొన్నేళ్లుగా భారత్, బంగ్లాదేశ్ సంబంధాల్లో సువర్ణాధ్యాయం కొనసాగుతున్నందున భూ, తీర ప్రాంత సరిహద్దు సమస్యలు పరిష్కారమయ్యాయని మోదీ అన్నారు. రోడ్డు, రైలు, జల రవాణాతో రెండు దేశాల మధ్య అనుసంధానత వేగంగా పురోగమిస్తోందని తెలిపారు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌కు సరఫరా చేస్తున్న 600 మెగావాట్ల విద్యుత్‌ను ఈ ఏడాదే 1100 మెగావాట్లకు పెంచుతామని హామీ ఇచ్చారు. అనంతరం మోదీ, హసీనా భేటీ అయ్యారు. -
కాన్వోకేషన్!
ప్రతిష్టాత్మక నిమ్స్ వైద్య విజ్ఞాన సంస్థ 14 ఏళ్లుగా స్నాతకోత్సవానికి నోచుకోవడం లేదు. స్వయంగా ముఖ్యమంత్రే చాన్స్‌లర్‌గా వ్యవహరించే ఈ సంస్థలో ఏటా దాదాపు 400 మందికిపైగా విద్యార్థులు వివిధ మెడికల్ కోర్సులు అభ్యసిస్తుంటారు. వీరంతా కోర్సులు పూర్తయ్యాక కాన్వొకేషన్లో పట్టాలు, డిగ్రీలు అందుకోవాలని ఆశిస్తారు. కానీ ఇక్కడ స్నాతకోత్సవం నిర్వహించడం మర్చిపోతున్నారు. మూడేళ్ల సూపర్ స్పెషాలిటీ కోర్సులు సహా బీఎస్సీ నర్సింగ్, ఫిజియోథెరపీ, పారామెడికల్ కోర్సులు ఈ సంస్థలో నిర్వహిస్తున్నారు. చాన్స్‌లర్ సమయం ఇవ్వకపోవడం వల్లో..లేక ఆసక్తి లేకనో ఇక్కడ కాన్వొకేషన్‌ను నిర్వహించడం లేదు. సాక్షి, సిటీబ్యూరో: స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చాన్సలర్‌గా వ్యవహరించే ఇనిస్టిట్యూట్ అది. ఎందరో వైద్య విద్యార్థులు ఇక్కడ ఉన్నత విద్యను అభ్యసిస్తారు. అలాంటి సంస్థ గత 14 సంవత్సరాలుగా స్నాతకోత్సవాలకు నోచుకోవడం లేదు. అంతే కాదు గత ఐదేళ్ల నుంచి పూర్తిస్థాయి డీన్ కూడా లేరంటే ఆశ్చర్యపోనవసరం లేదు. ఒకప్పుడు మెరుగైన వైద్య విద్య, పరిశోధనలతో ఓ వెలుగు వెలిగిన ప్రతిష్టాత్మాక నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) ప్రస్తుతం స్నాతకోత్సవాన్ని కూడా నిర్వహించలేకపోతోంది. సమస్యలు చెప్పుకుందామన్నా వినే నాథుడు లేరంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. నిజానికి రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలకు గవర్నర్ ఛాన్సలర్‌గా వ్యవహరిసుంటారు. కానీ నిమ్స్‌కు మాత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి ఛాన్సలర్‌గా, డైరెక్టర్ వైస్ చాన్సలర్‌గా వ్యవహరిస్తుంటారు. ఎగ్జిక్యూటివ్ బాడీ అధ్యక్షుడిగా వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కొనసాగుతుండగా, మరో 15 మంది సభ్యులుగా ఉంటారు. మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరకే మరింత మెరుగైన వైద్యసేవలు అందించడంతో పాటు, వైద్య ఉన్నత విద్య, పరిశోధనలు వంటి అంశాలే ప్రధాన లక్ష్యంగా ఈ ఆస్పత్రి ఏర్పడింది. 1961 నుంచి 1976 వరకు నిజామ్స్ చారిటీ ట్రస్ట్ సహకారంతో నడిచింది.ఆ తర్వాత అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ ఆధీనంలోకి తీసుకుంది. మొదట్లో ఇక్కడ కేవలం ఎముకల వైద్యం మాత్రమే అందేది. ఆ తర్వాత క్రమంగా జనరల్ ఆస్పత్రిగా మారింది. కాన్వొకేషన్పై ఏదీ శ్రద్ధ? ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)కు ధీటుగా దీన్ని రూపొందించారు. ఇది పూర్తిగా స్వయంప్రతిపత్తిగల సంస్థ. దీనికి ప్రత్యేక పాలక మండలితో పాటు ప్రత్యేక చట్టాలు కూడా ఉన్నాయి. తొలినాళ్లలో అరుదైన చికిత్సలు, పరిశోధనలతో ఓ వెలుగు వెలిగింది. ఇక్కడ సూపర్ స్పెషాలిటీ కోర్సులు సహా బీఎస్సీ నర్సింగ్, ఫిజియోథెరపీ, పారామెడికల్ కోర్సులు నిర్వహిస్తున్నారు. ఆస్పత్రిలో ప్రస్తుతం 30పైగా విభాగాలు ఉండగా, వీటిలో మూడేళ్ల సూపర్‌స్పెషాలిటీ (పీజీ) కోర్సుల్లో సుమారు 280 మంది చదువుతున్నారు. వందకు పైగా నర్సింగ్ విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. కోర్సు పూర్తి చేసుకున్న ప్రతి విద్యార్థి స్నాతకోత్సవం రోజు చాన్సలర్ చేతుల మీదుగా డిగ్రీ సహా అవార్డులను పొందడం ఓ గొప్ప అనుభూతిగా భావిస్తుంటారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా, ప్రొఫెసర్ కాకర్ల సుబ్బారావు డైరెక్టర్‌గా కొనసాగినన్ని రోజులు నిర్విరామంగా స్నాతకోత్సవాలు జరిగాయి. అప్పట్లో ఇక్కడ చదువుకుని కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థులు చాలా ఆనందంగా ఫీలయ్యేవారు. ఇప్పుడు మాత్రం చాన్సలర్‌గా ఉన్న సీఎంలు సమయం ఇవ్వక పోవడం, డైరెక్టర్ ఇతర ఉన్నతాధికారులు శ్రద్ధ చూపకపోవడం వల్లే స్నాతకోత్సవాలు జరపడం లేదన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఫ్యాకల్టీ, రెసిడెంట్ల సమస్యలు వినేవారేరి? వైద్య సీట్ల పెంపు, విద్యాభోధన సహా పరీక్షల నిర్వహణ, డిగ్రీల రూపకల్పనలో డీన్ పాత్ర కీలకం. 2014 నుంచి ఇప్పటి వరకు నిమ్స్‌కు పూర్తిస్థాయి డీన్ లేడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇన్‌ఛార్జీలే డీన్లుగా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు పరిపాలనలో కీలకమైన ఎగ్జిక్యూటివ్ రిజిస్ట్రార్ పోస్టు కూడా గత ఐదేళ్ల నుంచి ఖాళీగానే ఉంది. దీంతో ఆ పోస్టులోనూ ఇన్‌చార్జీలే ఉన్నారు. ఏదైనా సమస్య వస్తే..ఎవరికి చెప్పుకోవాలో తెలియని దుస్థితి నెలకొంది. పూర్తిస్థాయిలో ఒక డీన్‌ను కూడా నియమించుకోలేని సంస్థకు ఎంసీఐ అదనపు సీట్లను ఎలా మంజూరు చేస్తుందో అర్థం కావడం లేదని ఫ్యాకల్టీ అసోసియేషన్, రెసిడెంట్స్ అసోసియేషన్లు ఆరోపిస్తున్నాయి. ఎందరో ప్రముఖుల చేత ప్రశంసలందుకున్న నిమ్స్ పూర్వ వై భవాన్ని పునరుద్దరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నిమ్స్ డైరెక్టర్ వీ విషయంలో శ్రద్ధ చూపాలంటున్నారు. వెంటనే ఖాళీగా ఉన్న డీన్ సహా అన్ని పోస్టులను భర్తీ చేయడంతో పాటు స్నాతకోత్సవాన్ని నిర్వహించి, విద్యార్థులకు డిగ్రీలు అందజేయాలని కోరుతున్నారు. -
క్షమాపణ కోరిన ప్రియాంక.. ఎందుకంటే?
సాక్షి, న్యూఢిల్లీ: 'నన్ను క్షమించండి..' అంటూ ఉత్తరప్రదేశ్, బరేలీ ప్రజలను కోరారు బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా. అదేంటి.. బరేలీ వాసులకు నటి క్షమాపణ ఎందుకు చెప్పారనేగా మీ సందేహం. ఆ వివరాలిలా.. బరేలీలో ఇంటర్నేషనల్ యూనివర్సిటీ మొదటి స్నాతకోత్సవానికి మాజీ ప్రపంచ సుందరి ప్రియాంకను విశిష్ట అతిథిగా ఆహ్వానించగా, కచ్చితంగా హాజరవుతానని ఆమె మాటిచ్చారు. నటి రానుందని బరేలీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీని అలంకరించారు. ఆమెను చూడాలని వర్సిటీ విద్యార్థులతో పాటు స్థానిక ప్రజలు ప్రియాంక కోసం ఎంతగానో ఎదురుచూశారు. అయితే ప్రియాంక ఈవెంట్‌కు హాజరుకాలేదు. కేంద్ర మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ చేతుల మీదుగా విద్యార్థులకు మెడల్స్, సర్టిఫికెట్లను అందజేశారు. ఢిల్లీలో దట్టమైన పొగ, పొగమంచు కారణంగా తాను ఈవెంట్‌కు హాజరు కాలేకపోయానని, సోషల్ మీడియా ద్వారా క్షమాపణ కోరారు. ఎయిర్‌పోర్ట్‌లో విమానం టేకాఫ్ కాలేదని వాతావరణం అనుకూలించలేదన్న ప్రియాంక.. బరేలీ వర్సిటీ విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటూ ఆల్ ది బెస్ట్ చెబుతూ పోస్ట్ చేశారు. -
3 కాదు.. 5 ‘సీ’లను అలవరచుకోవాలి
సాక్షి, చెన్నై: సాధారణంగా సమాజంలో క్యాస్ట్ (కులం), కమ్యూనిటీ (వర్గం), క్యాష్ (డబ్బు) అనే మూడు ‘సీ’లు కనిపిస్తుంటాయనీ, అలాకాకుండా క్యారెక్టర్ (వ్యక్తిత్వం), క్యాలిబర్ (సామర్థ్యం), కెపాసిటీ (శక్తి), కండక్ట్ (ప్రవర్తన), కంపాషన్ (కరుణ) గుణాలను విద్యార్థులు అలవరచుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కోరారు. నేటి డిజిటల్ యుగానికి తగ్గట్లుగా విద్యాలయాల్లో బోధనా ప్రమాణాలను మెరుగుపరచుకోవాలని ఆయన సూచించారు. చెన్నై శివార్లలోని కాటాన్ కొళత్తూరులో ఉన్న ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయంలో గురువారం జరిగిన స్నాతకోత్సవంలో వెంకయ్య మాట్లాడారు. ధార్మిక చింతన లేకుండా సైన్స్ మాత్రమే చదువు అన్నట్లుగా ప్రస్తుత పరిస్థితి తయారైందని విమర్శిస్తూ, బహుముఖ ప్రజ్ఞతో కూడిన విద్యతో మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలని పిలుపునిచ్చారు. దాదాపు 6 వేల మంది విద్యార్థులు పట్టాలను అందుకున్న ఈ కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్, వర్సిటీ చాన్స్‌లర్ పారివేందర్, అధ్యక్షుడు సత్యనారాయణన్ పాల్గొన్నారు. -
సమాజానికి తిరిగివ్వండి: కోవింద్
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లోని పేద విద్యార్థులకు బోధించడం, స్కాలర్షిప్లను అందజేయడం ద్వారా సమాజానికి కొంత తిరిగి ఇవ్వాలని ఐఐటీ ఢిల్లీ పుర్వ విద్యార్థులకు రాష్ట్రపతి కోవింద్ సూచించారు. ఐఐటీ ఢిల్లీ క్యాంపస్‌లో 48వ స్నాతకోత్సవంలో కోవింద్ పాల్గొన్నారు. ప్రపంచంలోని గొప్ప వర్సిటీలు అన్నింటిలోనూ పూర్వ విద్యార్థులకు.. విద్యా సంస్థలకు మధ్య అవినాభావ సంబంధం ఉందన్నారు. పూర్వ విద్యార్థులను ఆర్థిక సాయం కోణంలోనే కాకుండా.. విజ్ఞానాన్ని పంచుకోవడానికి వినియోగించుకోవాలని సూచించారు. -
మేకప్‌తో మరింత అందం
-
హిప్.. హిప్ హుర్రే
సంగారెడ్డి డివిజన్: సంగారెడ్డి మండలం కందిలోని ‘ఐఐటీ హైదరాబాద్’ కొత్త క్యాంప్ ఆడిటోరియంలో. సందడి నెలకొంది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న యువ ఐఐటీయన్లు పట్టాలు చేతపట్టుకుని గాల్లోకి టోపీలు విసిరి ఆనందోత్సాహాలతో కేరింతలు కొట్టారు. శుక్రవారం ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌లోని ఆడిటోరియంలో తృతీయ స్నాతకోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఐఐటీ డెరైక్టర్ యు.బి.దేశాయ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి హిందూజా గ్రూపు ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ ఆర్.శేషసాయి, ఐఐటీహెచ్ పాలకవర్గం అధ్యక్షులు బి.వి.ఆర్.మోహన్‌రెడ్డి హాజరయ్యారు. బీటెక్, ఎంటెక్, ఎమ్మెస్సీ, పీహెచ్డీ, ఎంఫిల్ పూర్తి చేసుకున్న 266 మంది విద్యార్థులు, స్కాలర్స్‌కు ఐఐటీ డెరైక్టర్ దేశాయ్ పట్టాలు అందజేశారు. శేషసాయి బీటెక్, ఎంటెక్‌లో ఉత్తమ ప్రతిభను కనబర్చిన ఐదుగురు విద్యార్థులు బంగారు, పదిహేను మంది విద్యార్థులకు రజత పతకాలను అందజేశారు. పట్టాలు అందుకున్న విద్యార్థులు సహ చరులు, తల్లిదండ్రులతో తమ సంతోషాన్ని పంచుకున్నారు. పట్టాలు అందుకున్న విద్యార్థులు టోపీలు ఎగురవేసి హిప్..హిప్ హుర్రే అంటూ హుషారుగా సంబరాలు చేసుకున్నారు. ఐఐటీలో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న తమ బిడ్డలను తల్లిదండ్రులు అభినందించి హత్తుకున్నారు. ఐఐటీ హైదరాబాద్‌లో బీటెక్, ఎంటెక్, ఎమ్మెస్సీ పూర్తి చేసుకున్న మూడవ బ్యాచ్ విద్యార్థులకు పట్టాలు అందజేశారు. అలాగే మొదటి సారిగా ఎంఫిల్ పూర్తి చేసుకున్న స్కాలర్స్ స్నాతకోత్సవ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక ఆకర్శణగా నిలిచారు. తృతీయ స్నాతకోత్సవ వేడుకల్లో మొత్తం 266 మంది విద్యార్థులకు డిగ్రీ పట్టాలు అందజేశారు. వీరిలో 116 మంది బీటెక్, 106 మంది ఎంటెక్, 34 మంది ఎమ్మెస్సీ పూర్తి చేసిన విద్యార్థులు ఉన్నారు. వీరితోపాటు లిబరల్ ఆర్ట్స్‌లో ఎంఫిల్ పూర్తి చేసిన స్కాలర్స్ ఐదుగురు, పీహెచ్డీ పూర్తి చేసిన ఐదుగురు స్కాలర్స్ పట్టాలు అందుకున్నారు. వీరందరినీ ఐఐటీహెచ్ పాలకవర్గ అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, హిందూజా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ వైస్ శేషసాయి అభినందించారు. సంగారెడ్డి పట్టణానికి చెందిన సత్యనారాయణ సింగ్, నారాయణఖేడ్‌కు చెందిన సుమన్ జాదవ్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి చెందిన వసుంధరలు పట్టాలు అందుకున్న వారిలో ఉన్నారు. బంగారు, రజతపతకాల విజేతలు వీరే... ఐఐటీ ప్రామాణిక శ్రేణుల్లో ఉత్తమ ఫలితాలను కనబర్చిన ఎస్.సుదర్శన్ ప్రెసిడెంట్ గోల్డ్‌మెడల్ కైవసం చేసుకోగా అర్చిత్, ప్రియాంకవర్మ, అశ్విన్ అస్సామ్, అమేయ్ ధనుంజయ్‌లు బంగారు పతకాలు పొందారు. బీటెక్‌లో ఉత్తమ ప్రతిభను కనబర్చినందుకు ఎస్.సుదర్శన్, ప్రియాంకవర్మలు రజతపతకాలను సైతం కైవసం చేసుకున్నారు. 15 మంది విద్యార్థులు రజతపతకాలు పొందారు. ప్రెసిడెంట్ గోల్డ్ మెడల్ పొందిన బెంగుళూరుకు చెందిన ఎస్.సుదర్శన్ మాట్లాడుతూ ప్రెసిడెంట్ మెడల్ పొందటం ఎంతోఆనందంగా ఉందన్నారు. పట్టుదలగా చదివి తాను ఉత్తమ గ్రేడ్ సాధించినట్లు చెప్పారు. అమెరికా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఉన్నత విధ్యాభ్యాసం చేయటం తన లక్ష్యంగా తెలిపారు. పరిశోధకునిగా తాను ఎదగాలనుకుంటున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఐఐటీహెచ్ బోధనాసిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.