సాక్షి, న్యూఢిల్లీ: 'నన్ను క్షమించండి..' అంటూ ఉత్తరప్రదేశ్, బరేలీ ప్రజలను కోరారు బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా. అదేంటి.. బరేలీ వాసులకు నటి క్షమాపణ ఎందుకు చెప్పారనేగా మీ సందేహం. ఆ వివరాలిలా.. బరేలీలో ఇంటర్నేషనల్ యూనివర్సిటీ మొదటి స్నాతకోత్సవానికి మాజీ ప్రపంచ సుందరి ప్రియాంకను విశిష్ట అతిథిగా ఆహ్వానించగా, కచ్చితంగా హాజరవుతానని ఆమె మాటిచ్చారు.
నటి రానుందని బరేలీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీని అలంకరించారు. ఆమెను చూడాలని వర్సిటీ విద్యార్థులతో పాటు స్థానిక ప్రజలు ప్రియాంక కోసం ఎంతగానో ఎదురుచూశారు. అయితే ప్రియాంక ఈవెంట్‌కు హాజరుకాలేదు. కేంద్ర మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ చేతుల మీదుగా విద్యార్థులకు మెడల్స్, సర్టిఫికెట్లను అందజేశారు. ఢిల్లీలో దట్టమైన పొగ, పొగమంచు కారణంగా తాను ఈవెంట్‌కు హాజరు కాలేకపోయానని, సోషల్ మీడియా ద్వారా క్షమాపణ కోరారు. ఎయిర్‌పోర్ట్‌లో విమానం టేకాఫ్ కాలేదని వాతావరణం అనుకూలించలేదన్న ప్రియాంక.. బరేలీ వర్సిటీ విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటూ ఆల్ ది బెస్ట్ చెబుతూ పోస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment