లక్నో: ఉత్తర ప్రదేశ్లోని బరేలీలో అమానుష ఘటన వెలుగుచూసింది. బైక్పై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులు ఓ యువకుడిని రోడ్డుపై విచక్షణారహితంగా లాక్కెళ్లారు. యువకుడిని తాళ్లతో కట్టేసి బైక్పై కిలోమీటర్ వరకు ఈడ్చుకెళ్లారు. జూలై 25న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇందులో స్కూటీపై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులు యువకుడిని తాడుతో కట్టి లాక్కెళ్లడం స్పష్టంగా కనిపిస్తోంది. పట్టపగలే నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా ఈ దారుణం జరగడం మరింత విచారకరం. ఈ ఘటనలో బాధితుడికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం.
అయితే దుండగులు ఇలా దుర్మార్గంగా ప్రవర్తించడానికి గల కారణాలు తెలియరాలేదు. వీడియో వైరల్ అవ్వడంతో పోలీసులు రంగంలోకి దిగారు. బరాదరి పోలీస్ స్టేషన్ పరిధిలోని సంజయ్ నగర్లో ఘటన జరిగినట్లు గుర్తించారు. ఈ చర్యపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. నిందితులెవరైనా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
చదవండి: ‘మహాభారతంలోనూ లవ్ జిహాద్’.. కాంగ్రెస్ చీఫ్ క్షమాపణలు
बरेली में दबंगों ने युवक को स्कूटी के पीछे बांधकर घसीटा
— News24 (@news24tvchannel) July 28, 2023
◆ सीसीटीवी में कैद हुई घटना #Bareilly | CCTV Video Bareilly #CrimeNews pic.twitter.com/NhZnCdI9lQ
Comments
Please login to add a commentAdd a comment