scooty
-
రోడ్డు ప్రమాదంలో యువతి దుర్మరణం
మూసాపేట: చిన్ననాటి స్నేహితునితో కలిసి స్కూటీపై వెళ్తున్న యువతిని రెడీమిక్స్ లారీ ఢీకొనడంతో దుర్మరణం పాలైంది. కూకట్పల్లి పోలీసులు, స్థానికులు తెలిపిన మేరకు.. శ్రీకాకుళం జిల్లా, పాతపట్నం గ్రామానికి చెందిన కుమారి తన కుమార్తె మమత, కుమారుడితో కలిసి మూసాపేటలోని ముష్కిపేటలో ఉంటోంది. కుమారి కూతురు మమత(17) మంగళవారం రాత్రి తన స్నేహితురాలి ఇంటికి వెళ్తున్నానని చెప్పి వెళ్లింది. రాత్రి 11 గంటల సమయంలో మమత తన చిన్ననాటి స్నేహితుడైన నరేశ్‌తో కలిసి మూసాపేట నుంచి కూకట్పల్లి వైపు స్కూటీపై వెళ్తుండగా మూసాపేట మెట్రో స్టేషన్ పిల్లర్ 878 వద్ద గుర్తు తెలియని రెడీమిక్స్ లారీ ఢీ కొట్టింది. దీంతో ఇద్దరూ కింద పడిపోగా రెడీమిక్స్ వాహనం మమత నడుం మీదనుంచి వెళ్లడంతో తీవ్రంగా గాయపడింది. వెంటనే ఇద్దర్నీ స్థానిక ఆస్పత్రికి తరలించగా మమత మృతిచెందినట్లు వైద్యులు వెల్లడించారు. తల్లి ఫిర్యాదు మేరకు కూకట్పల్లి పోలీసులు కేసు నమోదు చేసి..మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాగా ఢీకొట్టిన రెడీమిక్స్ లారీ వివరాలు తెలియవని, సీసీ ఫుటేజీలు పరిశీలించాక వివరాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా..మమత మృతిపై తమకు అనుమానాలు ఉన్నాయని మృతురాలి బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
ఏలూరులో విషాదం.. స్కూటీపై క్రాకర్స్ తీసుకెళ్తుండగా పేలుడు..
సాక్షి, ఏలూరు: దీపావళి పండుగ వేళ ఏలూరు విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్కూటీపై బాణాసంచా తరలిస్తుండగా అవి ఆకస్మాత్తుగా పేలడంతో ఓ యువకుడు మృతిచెందాడు. దీంతో, స్థానికంగా విషాదకర ఛాయలు అలుముకున్నాయి.వివరాల ప్రకారం.. ఏలూరు జిల్లాలో తూర్పు వీధి గౌరీ దేవీ గుడి వద్ద ప్రమాదం జరిగింది. పండుగ నేపథ్యంలో ఇద్దరు వ్యక్తులు స్కూటీపై బస్తాలో బాణాసంచా తరలిస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ క్రమంలో స్కూటీపై వెళ్తున్న ఇద్దరిలో ఓ యువకుడు మృతిచెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ క్రమంలో రోడ్డు పక్కనే ఉన్న మరికొందరు గాయపడ్డారు. ఇక, గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం ఏలూరు సర్వజన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
Software Employees: ప్రాణాలు తీసిన ఓవర్ టేక్
శామీర్‌పేట్: మితిమీరిన వేగం.. నిర్లక్ష్యం.. ఇద్దరు యువ సాఫ్ట్వేర్ ఉద్యోగులను బలిగొంది. ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేసే క్రమంలో మొదట రోడ్డు డివైడర్‌ను ఢీకొని ఆ తర్వాత ఫార్మా కంపెనీ బస్సును ఢీకొట్టిన ప్రమాదంలో కారులోని ఇద్దరూ దుర్మరణం చెందారు. ఈ ఘటన శుక్రవారం నగర శివారులోని శామీర్‌పేట మండలం జినోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తూంకుంట మున్సిపాలిటీ హకీంపేటకు చెందిన మోహన్ (25), మౌలాలీకి చెందిన దీపిక(23) స్నేహితులు. మాదాపూర్ మైండ్‌స్పేస్‌లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో వీరు పని చేస్తున్నారు. శుక్రవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ఇన్నోవా కారులో కరీంనగర్– హైదరాబాద్ రాజీవ్ రహదారి తుర్కపల్లిలో అల్పాహారం తిని తిరిగి వెళ్తున్నారు. ఈ క్రమంలో లాల్‌గడి మలక్‌పేట విమల ఫీడ్స్ వద్ద.. ముందు వెళ్తున్న వాహనాన్ని వీరి కారు ఓవర్ టేక్ చేయబోయి డివైడర్‌ను ఢీకొట్టి.. శామీర్‌పేట నుంచి తుర్కపల్లి వైపు వస్తున్న బయోలాజికల్ ఫార్మా కంపెనీకి చెందిన బస్సుతో పాటు స్కూటీని ఢీకొని పల్టీలు కొట్టి నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో ఇన్నోవా కారులో ప్రయాణిస్తున్న మోహన్, దీపిక అక్కడికక్కడే మృతి చెందారు. బయోలాజికల్ కంపెనీకి చెందిన బస్సులో ప్రయాణిస్తున్న 10 మందితో పాటు, స్కూటీపై వెళ్తున్న ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మోహన్, దీపిక మృతదేహాలను గాంధీ మార్చురీకి పంపించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన డీసీపీ.. ప్రమాద స్థలాన్ని మేడ్చల్ జోన్ డీసీపీ కోటిరెడ్డి, పేట్ బషీరాబాద్ ఏసీపీ రాములు, అల్వాల్ ట్రాఫిక్ ఏసీపీ వెంకట్‌రెడ్డి, ట్రాఫిక్ సీఐ హన్మంత్‌రెడ్డి పరిశీలించారు. ఇన్నోవా కారు అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక దర్యాప్తులో తెలుస్తోందని పోలీసులు అంచనా వేస్తున్నారు. చాకచక్యంగా వ్యవహరించిన బస్సు డ్రైవర్.. ఇన్నోవా కారు అతివేగంతో వచ్చి ఢీకొన్న ఘటనలో ఫార్మా కంపెనీ బస్సు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో భారీ ప్రమాదం తప్పింది. ఆ సమయంలో బస్సులో 44 మంది ఉన్నారు. కారు ఢీ కొనడంతో బస్సును డ్రైవర్ ఎడమవైపు చెట్ల పొదల్లోకి తీసుకెళ్లాడు. బస్సులో ఉన్నవారిలో 10 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. -
అసలే మైనర్.. ఆపై ముగ్గురితో డ్రైవింగ్
ప్రొద్దుటూరు క్రైం: మైనర్ బాలుడి వయసు 12 ఏళ్లు. మరో ముగ్గురిని స్కూటీలో కూర్చోపెట్టుకొని డ్రైవింగ్ చేస్తున్నాడు. నలుగురు పిల్లలు స్కూటీలో వెళ్తున్న దృశ్యం ఆదివారం ప్రొద్దుటూరు డీఎస్పీ మురళీధర్ కంట పడింది. గాంధీ రోడ్డు గుండా వెళ్తున్న డీఎస్పీ పిల్లలు వెళ్తున్న స్కూటీని ఆపారు. ఎక్కడికి వెళ్తున్నారని ప్రశ్నించగా దుకాణానికి వచ్చినట్లు పిల్లలు తెలిపారు. వెంటనే వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. మైనర్ పిల్లలు స్కూటీ నడపడం ప్రమాదకరమని చెప్పారు. గాంధీరోడ్డు చాలా రద్దీగా ఉండే ఏరియా అని.. అలాంటి చోట చిన్న పిల్లలు స్కూటీ నడపడం అత్యంత ప్రమాదకర మన్నారు. బాలుడికి సరిగా కాళ్లు కూడా అందవని తెలిపారు. తల్లిదండ్రులు మైనర్ డ్రైవింగ్‌ను ప్రోత్సహించరాదని సూచించారు. ఇకపై స్కూటీ ఇవ్వరాదని తల్లిదండ్రులకు సూచించారు. -
Viral Video: స్కూటీ నడుపుతూ వర్క్ కాల్.. ఈ ఐటీ ఉద్యోగి కష్టం చూడండి..
ఏ ఉద్యోగంలో అయినా పని ఒత్తిడి మామూలే. అయితే ఇది ఐటీ పరిశ్రమలో మరీ ఎక్కువగా కనిపిస్తోంది. బెంగళూరులో ఓ వ్యక్తి ల్యాప్‌టాప్‌లో వర్క్ కాల్లో అటెండ్ అవుతూ స్కూటర్ నడుపుతున్న వీడియో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన తర్వాత వర్క్-లైఫ్ బ్యాలెన్స్, 70 గంటల వర్క్ వీక్ చర్చ సోషల్ మీడియాలో తిరిగి మొదలైంది. పీక్ బెంగుళూరు అనే హ్యాండిల్‌పై ‘ఎక్స్’ (ట్విటర్)లో షేర్ చేసిన ఈ క్లిప్ దేశ ఐటీ రాజధాని మూసచిత్రాన్ని చూపించింది. ఇక్కడ టెక్ నిపుణులు బహిరంగ ప్రదేశాల్లో తమ ల్యాప్‌టాప్‌లపై పనిలో నిమగ్నమై ఉండటం సర్వసాధారణమే. అయితే ఈ ఉద్యోగి మాత్రం ఓ వైపు స్కూటర్ నడుపుతూ.. మరోవైపు ల్యాప్‌టాప్‌ను ఒళ్లో పెట్టుకుని వర్క్ కాల్ అటెండ్ అవుతున్న తీరు చర్చనీయాంశంగా మారింది. వైరల్‌గా మారిన ఈ వీడియోపై నెటిజనులు పలు విధాలుగా స్పందించారు. "బ్రో ఐటీ కంపెనీలో ఉండాలంటే పని చేస్తూనే ఉండాలి. వారానికి 70 గంటల సమయం కూడా సరిపోదు" అని ఓ యూజర్ కామెంట్ చేశారు. "క్లయింట్ కాల్, మరణం ఎప్పుడైనా రావచ్చు" అని మరో యూజర్ చమత్కారంగా రాసుకొచ్చారు. "ఈ రోజుల్లో పని ఒత్తిడి చాలా ఎక్కువే. అయినా ఇలా మాత్రం చేయొద్దు" అని ఇంకొక యూజర్ హితవు పలికారు. Bengaluru is not for beginners 😂 (🎥: @nikil_89) pic.twitter.com/mgtchMDryW — Peak Bengaluru (@peakbengaluru) March 23, 2024 -
రోడ్డు ప్రమాదంలో తల్లి, పిల్లల మృతి
మనోహరాబాద్(తూప్రాన్): తల్లి, ఇద్దరు కుమార్తెలు, కుమారుడుతో కలిసి స్కూటీపై శుభకార్యానికి వెళ్ళి ఇంటికి వస్తున్న క్రమంలో లారీ ఢీకొంది. దీంతో ముగ్గురూ అక్కడికక్కడే మృతి చెందారు. పాప మాత్రం ప్రాణాలతో బయటపడింది. ఎస్ఐ కరుణాకర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం రాంనగర్‌కు చెందిన మహ్మద్ అహ్మద్ కూతురైన మలైక (30) రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లోని బాబాగూడలోని ఒక శుభ కార్యానికి తన పిల్లలతో కలిసి స్కూటీపై వెళ్లింది. శుభకార్యం ముగించుకుని తిరిగి మెదక్‌కు వస్తున్న క్రమంలో మనోహరాబాద్ మండలం కాళ్ళకల్ శివారులోని జాతీ య రహదారిపై వెనుక నుంచి వచ్చిన ఒక లారీ అదుపు తప్పి వారి స్కూటీపై నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటనలో ఆమెతో పాటు ఇద్దరు పిల్లలు అద్నాన్, సుల్తాన అక్కడికక్కడే మృతి చెందారు. సీఐ శ్రీధర్, ఎస్ఐ కరుణాకర్‌రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
స్కూటీలో దూరి.. చుక్కలు చూపించి..
సాక్షి, రాజన్న సిరిసిల్ల: చిన్నదే కానీ చుక్కలు చూపించింది. స్కూటీలో దూరి ఓనర్ని టెన్షన్ పెట్టించింది. దానిని చూసేందుకు జనం సైతం ఎగబడడంతో భారీగా ట్రాఫిక్‌ఝామ్ కూడా అయ్యింది. సిరిసిల్ల పాత బస్టాండ్ వద్ద జరిగిన హైడ్రామా.. స్నేకా.. మజాకా అని అందరితో అనిపించింది. సిరిసిల్ల పట్టణం పాత బస్టాండ్ వద్ద షబ్బీర్ అనే వ్యక్తి ఓ షాప్ ముందుకు తన స్కూటీని ఉంచాడు. అయితే.. నెమ్మదిగా అందులోకి దూరింది ఓ పాము. సమాచారం అందన్కున్న స్నేక్ క్యాచర్ గంటపాటు శ్రమించి బండి మొత్తం పార్ట్స్ విప్పదీశాడు. ఎట్టకేలకు ఆ చిన్నపామును పట్టుకోగలిగాడు. ఆపై దానిని వాటర్ బాటిల్లో దూర్చి దూరంగా తీసుకెళ్లాడు. స్కూటీలో పాము దూరిందనే వార్త సాధారణంగానే జనాలను ఆకట్టుకుంది. చుట్టూ మూగి ఆ డ్రామా అంతా చూస్తూ ఉండిపోయారు. చివరకు పామును స్నేక్‌క్యాచర్ పట్టేయడంతో స్కూటీ ఓనర్ ఊపిరి పీల్చుకున్నాడు. -
పట్టపగలు బైక్‌కు తాడుతో కట్టేసి.. యువకుడిని కిలోమీటర్ ఈడ్చుకెళ్లి..
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని బరేలీలో అమానుష ఘటన వెలుగుచూసింది. బైక్‌పై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులు ఓ యువకుడిని రోడ్డుపై విచక్షణారహితంగా లాక్కెళ్లారు. యువకుడిని తాళ్లతో కట్టేసి బైక్‌పై కిలోమీటర్ వరకు ఈడ్చుకెళ్లారు. జూలై 25న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో స్కూటీపై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులు యువకుడిని తాడుతో కట్టి లాక్కెళ్లడం స్పష్టంగా కనిపిస్తోంది. పట్టపగలే నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా ఈ దారుణం జరగడం మరింత విచారకరం. ఈ ఘటనలో బాధితుడికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. అయితే దుండగులు ఇలా దుర్మార్గంగా ప్రవర్తించడానికి గల కారణాలు తెలియరాలేదు. వీడియో వైరల్ అవ్వడంతో పోలీసులు రంగంలోకి దిగారు. బరాదరి పోలీస్ స్టేషన్ పరిధిలోని సంజయ్ నగర్లో ఘటన జరిగినట్లు గుర్తించారు. ఈ చర్యపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. నిందితులెవరైనా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. చదవండి: ‘మహాభారతంలోనూ లవ్ జిహాద్’.. కాంగ్రెస్ చీఫ్ క్షమాపణలు बरेली में दबंगों ने युवक को स्कूटी के पीछे बांधकर घसीटा ◆ सीसीटीवी में कैद हुई घटना #Bareilly | CCTV Video Bareilly #CrimeNews pic.twitter.com/NhZnCdI9lQ — News24 (@news24tvchannel) July 28, 2023 -
స్కూటీలో చెలరేగిన మంటలు
కర్ణాటక: రన్నింగ్‌లో ఉన్న స్కూటీలో మంటలు చెలరేగిన ఘటన బొరిగుమ్మ సమితి అవుంలి కూడలి వద్ద సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఒక ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో నవరంగపూర్ ఆర్కే కాలనీకి చెందిన అశోక్ సాహు పనిచేస్తున్నాడు. సోమవారం తన స్కూటీపై నవరంగపూర్ నుంచి బొరిగుమ్మ మీదుగా జయపురం బయల్దేరాడు. అతడు నవరంగపూర్ – బొరిగుమ్మ 26వ జాతీయ రహదారిలో బొరిగుమ్మ సమితి అవుంలి కూడలి వద్దకు వచ్చే సమయానికి స్కూటీ ఇంజన్ నుంచి మంటలు చెలరేగాయి. వెంటనే అవుంలి జంక్షన్లో ఉన్నవారు గమనించి అశోక్‌ను బండి ఆపమని అప్రమత్తం చేశారు. అశోక్ బండి ఆపి దిగేసరికి ఒక్కసారిగా స్కూటీ అంతా మంటలు వ్యాపించి ఎగిసిపడ్డాయి. వెంటనే స్థానికులు అగ్నిమాపక విభాగానికి సమాచారం తెలియజేసినా, వాళ్లు వచ్చేటప్పటికే బండి పూర్తిగా దగ్ధమయ్యింది. అశోక్ రెండు నెలల క్రితమే స్కూటీ కొన్నట్లు తెలుస్తోంది. షార్ట్ సర్క్యూట్ వలనే ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. పెట్రోలు వాహనం కావడంతో వేగవంతంగా మంటలు వ్యాపించాయి. -
నడిరోడ్డుపై స్నానం.. నవ్వులపాలే కాదు జైలుపాలు కూడా!
వైరల్ వీడియో: సోషల్ మీడియాలో ఓవర్‌నైట్ సెలబ్రిటీగా, టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయేందుకు కొందరు చేసే ప్రయత్నాలు చిత్రవిచిత్రంగా ఉంటున్నాయి. తాజాగా.. ఓ వ్యక్తి, ఓ యువతితో కలిసి స్కూటీపై స్నానం చేసిన వీడియో వైరల్ కాగా, దానికి పోలీసులు అంతే లెవల్లో రిప్లై ఇచ్చారు. థానే(మహారాష్ట్ర) ఉల్లాస్‌నగర్‌లోని ఓ సిగ్నల్ వద్ద ఆ ఇద్దరూ ఈ చేష్టలకు దిగారు. వెనక కూర్చున్న యువతి బకెట్లో నీటిని తానూ పోసుకుంటూ.. ఆ యువకుడి మీద పోస్తూ కనిపించింది. దారినపోయేవాళ్లంతా వాళ్ల వేషాలు చూసి తెగ నవ్వుకున్నారు. అయితే.. ఆ వీడియో వైరల్ కావడం, అది కాస్త థానే పోలీసుల దాకా చేరడం, వాళ్లూ స్పందించడం చకచకా జరిగిపోయాయి. వీ డిజర్వ్ బెటర్ గవర్నమెంట్ అనే ట్విటర్ హ్యాండిల్ నుంచి ఈ వీడియో థానే నగర పోలీసులకు చేరింది. దీంతో స్పందించిన పోలీసులు.. సరైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే.. ట్రాఫిక్ డిపార్ట్మెంట్కు ఆ వీడియోను షేర్ చేసి మరీ చర్యలు తీసుకోవాలని కోరారు. నడిరోడ్డుపై పబ్లిక్ న్యూసెన్స్‌కు పాల్పడడిన కారణంగా అతనిపై కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది. అలాగే.. హెల్మెట్ ధరించకపోవడంతో ట్రాఫిక్ పోలీసులు సైతం అతనిపై కేసు నమోదు చేసి ఛలానా విధించారు. ఆ వీడియోలో ఉన్న వ్యక్తి ముంబైకి చెందిన యూట్యూబర్ ఆదర్శ్ శుక్లా అట. తాను చేసిన పనికి క్షమాపణలు చెబుతూ.. ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్చేశాడతను. అయినా కూడా చర్యలు తప్పవని థానే పోలీసులు చెబుతున్నారు. @DGPMaharashtra @ThaneCityPolice This is ulhasnagar, Is such nonsense allowed in name of entertainment? This happened on busy Ulhasnagar Sec-17 main signal.Request to take strict action lncluding deletion of social media contents to avoid others doing more nonsense in public. pic.twitter.com/BcleC95cxa — WeDeserveBetterGovt.🇮🇳 (@ItsAamAadmi) May 15, 2023 -
హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేసిన పోలీసులు.. ఛేజ్ చేసి పట్టుకున్న అమ్మాయిలు
-
ఓలా స్కూటర్ పోయింది... ఈ టెక్నాలజీతో దొరికింది
-
హెల్మెట్ లేకుండా స్కూటీ నడిపిన మహిళా పోలీసులు.. నెటిజన్ల ఫైర్..
ముంబై: ద్విచక్రవాహనం నడిపేవారు హెల్మెట్ ధరించడం మన దేశంలో తప్పనిసరి. ఈ రూల్ అందరికీ వర్తిస్తుంది. మోటారు వాహన చట్టం సెక్షన్ 129లో ఈ నిబంధన ఉంది. దీంతో హెల్మెట్ ధరించకుండా బైక్ నడిపితే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినట్లు అవుతుంది. అయితే ముంబైలో ఇద్దరు మహిళా పోలీసులు హెల్మెట్ ధరించకుండానే స్కూటీ నడపడం చూసిన ఓ వ్యక్తి వెంటనే ఫొటో తీశాడు. ఓ సాధారణ పౌరుడు ఇలా చేస్తే ఉరుకుంటారా అని అధికారులను ప్రశ్నిస్తూ ఈ ఫొటోను ట్వీట్ చేశాడు. ఏకంగా మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌తో ముంబై పోలీసులను కూడా ట్యాగ్ చేశాడు. ట్రాఫిక్ నిబంధనలు వీళ్లకు వర్తించవా? వీరిపై ఎలాంటి చర్యలు తీసుకోరా అని ఫైర్ అయ్యాడు. MH01ED0659 What if we travel like this ?? Isn't this a traffic rule violation ?@MumbaiPolice @mieknathshinde @Dev_Fadnavis pic.twitter.com/DcNaCHo7E7 — Rahul Barman (@RahulB__007) April 8, 2023 దీనిపై నెటిజన్లు కూడా స్పందించారు. ఈ మహిళా పోలీసులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరికొందరేమో.. రూల్స్ ఎప్పుడూ సామాన్యులకే వర్తిస్తాయి, చట్టాలు చేసేవారికి, చట్టపరిరక్షకులకు అవి వర్తించవు అని అసహనం వ్యక్తం చేశారు.సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరగడంతో ముంబై ట్రాఫిక్ పోలీసులు ఈ విషయంపై స్పందించారు. ఆ ఫొటో సరిగ్గా ఎక్కడ తీశారో చెప్పాలని పోస్టు చేసిన వ్యక్తిని అడిగారు. దీంతో అతడు ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవే (దాదర్) అని బదులిచ్చాడు. అనంతరం ఈ మహిళా పోలీసులపై చర్యలు తీసుకుంటామని, మాతుంగా ట్రాఫిక్ డివిజన్ పోలీసులకు ఈ మేరకు ఆదేశాలు జారే చేశామని చెప్పుకొచ్చారు. దీంతో నెటిజన్లు శాంతించారు.భారత్‌లో హెల్మెట్ ధరించకుండా బైక్ నడిపితే జరిమానా విధిస్తారు. ఇదే తప్పును పదే పదే రిపీట్ చేస్తే.. డ్రైవింగ్ లైసెన్స్‌ను కూడా రద్దు చేస్తారు. అరుదైన సందర్బాల్లో మూడు నెలల వరకు జైలు శిక్ష కూడా విధిస్తారు. చదవండి: ఒక్క బైక్‌పై ఐదుగురు యువకులు.. ఇదేం సరదా.. మైండ్ దొబ్బిందా..? -
స్కూటీని గుద్ది, 2 కి.మీ. లాక్కెళ్లి...
మహోబా(యూపీ): తాత, మనవడు వెళ్తున్న స్కూటీని ఓ ట్రక్కు ఢీకొట్టి, వారిని రెండు కిలోమీటర్ల దూరం వరకు లాక్కెళ్లింది. ఈ ఘటనలో తాత, మనవడు ప్రాణాలు కోల్పోయారు. యూపీలోని మహోబా జిల్లా కేంద్రంలో శనివారం సాయంత్రం ఈ విషాదం చోటుచేసుకుంది. ఉదిత్ నారాయణ్ చౌరాసియా(66) అనే విశ్రాంత ఉపాధ్యాయుడు, ఆయన ఆరేళ్ల మనవడు మార్కెట్ నుంచి ఇంటికి వెళ్తుండగా స్థానిక బిజనగర్ మలుపులో ప్రమాదం జరిగిందని సీఐ రామ్ పర్వేశ్ రాయ్ చెప్పారు. తాత, మనవడు సహా ట్రక్కు కింద ఇరుక్కుపోయిన స్కూటీని ట్రక్కు రెండు కిలోమీటర్ల దూరం లాక్కెళ్లింది. స్థానికులు ట్రక్కును అడ్డగించి ఆపేశారు. చిద్రమైన తాత, మనవడి మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టంకు పంపారు. -
లక్ష రూపాయల స్కూటీకి కోటి రూపాయల నంబర్!
ఖరీదైన కార్లకు ఖరీదైన ఫ్యాన్సీ నంబర్లు కొనుగోలు చేయడం చూస్తుంటాం. కానీ లక్ష రూపాయలు విలువ చేసే స్కూటీకి ఫ్యాన్సీ నంబర్ కోసం కోటి రూపాయలకుపైగా వెచ్చించడం గురించి ఎప్పుడైనా విన్నారా..? ప్రస్తుతం ఈ వార్త వైరల్‌గా మారింది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సిమ్లా జిల్లా కోట్‌ఖాయ్ పట్టణంలో రవాణా శాఖ HP-99-9999 నంబర్‌ను ఆన్లైన్లో వేలానికి ఉంచింది. దీని కనీస ధరను రూ. 1000గా నిర్ణయించింది. ఈ నంబరును దక్కించుకునేందుకు మొత్తం 26 మంది బిడ్డింగ్‌లో పాల్గొన్నారు. అందులో రూ.1.12 కోట్లకు పైగా ఆన్లైన్ బిడ్ రావడం అధికారులను ఆశ్చర్యపరిచింది. ఓ ఫ్యాన్సీ నంబర్‌కు ఇంత మొత్తం కోట్ చేయడం ఆ రాష్ట్రంలో ఇదే తొలిసారి. అయితే భారీ మొత్తంలో కోట్ చేసిన ఆ వ్యక్తి వివరాలు తెలియరాలేదు. బిడ్లు ముగించి నంబర్‌ను కేటాయించిన తర్వాతే వివరాలు తెలుస్తాయని అధికారులు చెబుతున్నారు. అయితే దీనిపై సిమ్లా డీసీ ఆదిత్య నేగి స్పందిస్తూ HP-99-9999 నంబర్ కోసం అత్యధికంగా రూ. 1,12,15,500 కోట్ చేశారని, సదరు వ్యక్తి ఈ నంబర్‌ను కొనుగోలు చేస్తున్నది ద్విచక్ర వాహనం కోసమా లేదా నాలుగు చక్రాల వాహనం కోసమా అన్నది తెలియలేదని వివరించారు. (ఇదీ చదవండి: యూపీఐకి క్రెడిట్ కార్డుల అనుసంధానం.. ఫస్ట్ టైమ్!) -
కారు కింద ఇరుక్కుందని తెలుసట!
న్యూఢిల్లీ: ఢిల్లీలో డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి దాటాక స్కూటీపై వెళ్తున్న అంజలీ సింగ్‌ను ఢీకొట్టి, 12 కిలోమీటర్లు లాక్కెళ్లిన ఘటనలో పోలీసు విచారణలో మరికొన్ని విషయాలు వెలుగు చూశాయి. తమ కారు కింద ఒక మహిళ ఇరుక్కుపోయిన విషయం తెలుసునని, కారాపి ఆమెను విడిపించినప్పటికీ హత్య కేసు నమోదవుతుందని భయపడ్డామని నిందితులు తెలిపారని పోలీసులు ఆదివారం వెల్లడించారు. అందుకే, మహిళ శరీరం కారు నుంచి విడిపోయేదాకా ఆపకుండా నడిపినట్లు చెప్పారన్నారు. సుల్తాన్‌పురి నుంచి కంఝావాలా వరకు పలుమార్లు కారును యూ టర్న్ తీసుకుని 12 కిలోమీటర్ల మేర అంజలిని లాక్కెళ్లగా ఆమె తీవ్ర గాయాలతో చనిపోయిన విషయం తెలిసిందే. తమ కారు కింద ఒక మహిళ ఇరుక్కున్న విషయం తెలియదని, విషయం తెలిశాక అక్కడి నుంచి పరారైనట్లు అంతకుముందు నిందితులు తెలిపిందంతా అబద్ధమని తేలింది. అంజలి, తన స్నేహితురాలు నిధి కలిసి స్కూటీపై వెళ్తుండగా వెనుక నుంచి కారు ఢీకొట్టడంతో నిధి స్వల్పగాయాలతో బైటపడగా, అంజలి కారు కింద ఇరుక్కుంది. కాగా, ఈ కేసులో పోలీసులు ఇప్పటి వరకు ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. -
షాకింగ్.. స్కూటీపై వెళ్తున్న టీచర్‌ను ఢీకొట్టి 3 కి.మీ ఈడ్చుకెళ్లిన ట్రక్కు
లక్నో: ఢిల్లీలో 20 ఏళ్ల యువతిని కారుతో ఢీకొట్టి 12 కిలోమీటర్ల దూరం ఈడ్చుకెళ్లిన ఘటన మరువకముందే అలాంటి ఘటనే మరొకటి వెలుగుచూసింది. ఉత్తర్‌ప్రదేశ్ బాందాలో స్కూటీపై వెళ్తున్న టీచర్‌ను ఢీకొట్టిన ట్రక్కు.. ఆమెను మూడు కిలోమీటర్లు అలాగే ఈడ్చుకెళ్లింది. బాందా జిల్లాలోని మవాయ్ బుజర్గ్ గ్రామంలో బుధవారం ఈ దారుణం జరిగింది. మహిళ మృతదేహం చిక్కుకోవడంతో రాపిడికి ట్రక్కు కింద నుంచి మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. దీంతో అగ్నిమాపక యంత్రాలు వెళ్లి మంటలను ఆర్పాయి. పోలీసులు మహిళ మృతదేహాన్ని బయటకు తీసేందుకు శ్రమించారు. చదవండి: భారత్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్‌ను అరికట్టడం ఎలా? -
షాకింగ్ ఘటన.. స్నేహితురాలితో కలిసి స్కూటీపై వెళ్తుండగా..
తొండంగి(కాకినాడ జిల్లా): హాస్టల్లో చదువుతున్న ఆ ఇంజినీరింగ్ విద్యార్థిని తల్లిదండ్రులను పలకరించేందుకు స్వగ్రామానికి వచ్చి తిరిగి వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురై మృతిచెందిన ఘటన ఆదివారం బెండపూడి జతీయ రహదారిపై చోటు చేసుకుంది. ఒక్కగానొక్క కుమార్తె రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడటంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. చదవండి: ఏడు పేజీల సూసైడ్ నోట్.. కుమార్తెలతో సహా తండ్రి ఆత్మహత్య మృతురాలి బంధువులు, పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం కోటనందూరు మండలం కాకరాపల్లి గ్రామానికి చెందిన కట్టా కాశీవిశ్వనాథం కుమార్తె కట్టా నందిని(21) కాకినాడ సూరంపాలెం ప్రగతి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతోంది. తన స్నేహితురాలు వసంతతో కలిసి ఆదివారం మధ్యాహ్నం హాస్టల్ నుంచి స్కూటీపై బయలుదేరి కోటనందూరు మండలం కాకరాపల్లి వెళ్లింది. తల్లిదండ్రులను పలకరించిన అనంతరం భోజనం చేసి స్కూటీపై మళ్లీ సూరంపాలెం హాస్టల్‌కు బయలుదేరారు. అన్నవరం బైపాస్ నమూనా టెంపుల్ సమీపంలో బెండపూడి శివారు జాతీయ రహదారిపై వీరి స్కూటీ అదుపు తప్పి ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో నందిని అక్కడికక్కడే మృతిచెందగా వసంతకు స్వల్పగాయాలయ్యాయి. దీనిపై తొండంగి ఎస్ఐ రవికుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం తుని ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
బీడీల కంపెనీ ఎదుట నిలిపి ఉంచిన ఎలక్ట్రిక్ స్కూటీ ఒక్కసారిగా...
దుబ్బాక: లంగర్ బీడీ కంపెనీ ఎదుట పార్కింగ్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటీ బ్యాటరీలో పేలుడు సంభవించి మంటల్లో కాలిపోయింది. ఈ ఘటన దుబ్బాక మున్సిపల్ పరిధిలోని లచ్చపేట 10వ వార్డులో మంగళవారం చోటుచేసుకుంది. దుబ్బాక మండలం రామక్కపేట గ్రామానికి చెందిన దోర్నాల హరిబాబు బీడీ కంపెనీ టేకేదార్‌గా పని చేస్తున్నాడు. ఏడాది కిందట పట్టణంలోని ఓ వాహన షోరూం నుంచి ఎలక్ట్రిక్ స్కూటీని కొనుగోలు చేశాడు. ప్రతీరోజు బీడీల గంపను స్కూటీపై పెట్టుకొని రామక్కపేట నుంచి లచ్చపేట లంగర్ బీడీ కంపెనీకి తీసుకెళ్తుంటాడు. ఈ క్రమంలో మంగళవారం స్కూటీని కంపెనీ ఎదుట నిలిపి ఉంచగా, స్కూటీ బ్యాటరీ పేలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో స్కూటీ పూర్తిగా దగ్ధమ వడంతోపాటు పక్కనే నిలిపి ఉన్న సైకిల్ పాక్షికంగా కాలిపోయింది. స్థానికులు అప్రమత్తమై నీళ్లు చల్లి మంటలను అదుపు చేయడంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఎలక్ట్రిక్ కంపెనీ ప్రతినిధులు ఘటనా స్థలానికి చేరుకుని వాహనాన్ని అక్కడి నుంచి తరలించారు. -
ముంబై వీధుల్లో స్కూటీపై షికార్లు
-
ఢీ కొట్టి.. ఈడ్చుకెళ్లి..
భువనగిరి: బంధువుల అంత్యక్రియలకు వెళ్లేందుకు స్కూటీపై బయల్దేరిన వారిని డీసీఎం వాహనం రాంగ్ రూట్లో వేగంగా వచ్చి ఢీ కొట్టింది. దీంతో వెనుక కూర్చున్న మహిళ ఎగిరి రోడ్డుపై పడి అక్కడికక్కడే దుర్మరణం పాలైంది. వీరిని ఢీ కొట్టిన తర్వాతైనా బండిపై ఉన్నవారు వేసిన కేకల్ని వినిపించుకుని వాహనాన్ని ఆపితే కనీసం రెండు ప్రాణాలైనా నిలిచేవి. కానీ, మద్యంమత్తులో వాహనాన్ని అత్యంత నిర్లక్ష్యంగా నడుపుతున్న ఆ డ్రైవర్ వీరు వేసిన కేకల్ని వినిపించుకోలేదు. స్కూటీతో పాటు వీరిని కూడా వంద మీటర్లు దూరం ఈడ్చుకెళ్లిపోయాడు. దీంతో వీరు కూడా అక్కడికక్కడే మృతి చెందారు. మద్యం తాగి నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపి ముగ్గురు ప్రాణాలు తీయడమే కాకుండా ముగ్గురు పిల్లలు అనాథలయ్యేందుకు కారణమయ్యాడు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండల పరిధిలోని హన్మాపురం గ్రామ పరిధిలో గురువారం చోటుచేసుకున్న ఘటన వివరాలిలా ఉన్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం టేకుల సోమారం గ్రామానికి చెందిన దండబోయిన నర్సింహ(35), రాజ్యలక్ష్మి(30) దంపతులతో పాటు నర్సింహ వదిన దండ బోయిన జంగమ్మ(40) గురువారం బొమ్మల రామారం మండలం లోని చౌదరిపల్లి గ్రామంలో బంధువుల అంత్య క్రియలకు హాజరయ్యేందుకు స్కూటీపై బయల్దే రారు. అంతకు ముందేగానే జంగమ్మ భర్త బాలు మల్లు అంత్యక్రియలకు బయల్దేరి వెళ్లాడు. అయితే స్కూటీపై బయల్దేరిన ముగ్గురూ భువనగిరి పట్టణం దాటిన తర్వాత హన్మాపురం గ్రామ పరిధిలోని బచ్పన్ స్కూల్ సమీపంలో చేరుకున్నారు. సరిగ్గా ఇదే సమయంలో జగదేవ్‌పూర్ నుంచి భువనగిరి వైపు వేగంగా వస్తున్న డీసీఎం వాహనం వీరిని ఢీకొట్టింది. దీంతో స్కూటీ డీసీఎం వాహనం ముందు భాగంలో ఇరుక్కుపోయింది. స్కూటీపై వెనుక కూర్చున్న జంగమ్మ ఎగిరి రోడ్డుపైపడి అక్కడికక్కడే మృతి చెందింది. కేకలు పెడుతున్నా వినిపించుకోకుండా.. స్కూటీ ముందుభాగం డీసీఎంలో ఇరుక్కుపోవ డంతో రాజ్యలక్ష్మి, నర్సింహ కేకలు వేశారు. ఎంత గా అరుస్తున్నా వినిపించుకోకుండా డీసీఎం డ్రైవర్ ముందుకు దూసుకెళ్లాడు. కొంతదూరం వెళ్లగానే రాజ్యలక్ష్మి స్కూటీ నుంచి విడిపోయి మృతి చెంద గా..నర్సింహను సుమారు 100 మీటర్ల దూరం వరకు ఈడ్చుకెళ్లిపోయాడు. అప్పటికే అతడు కూడా మృతి చెందాడు. ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి వెళ్లి డీసీఎం వాహనాన్ని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాగా, పారిపోతున్న డ్రైవర్‌ను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బంధువులు కూడా గుర్తించలేదు మృతుల బంధువులు కూడా అదే దారిలో అంత్య క్రియలకు వెళ్తుండగా అప్పటికే ప్రమాదం జరగ డంతో జనం గుమికూడారు. దీంతో చనిపోయింది తమ బంధువులేనని గుర్తించలేకపోయామని వా రు వాపోతున్నారు. జంగమ్మ భర్త బాలుమల్లు ఇ చ్చిన ఫిర్యాదు మేరకు నిర్లక్ష్యంగా వాహనాన్ని నడి పిన డీసీఎం డ్రైవర్‌పై 304( జీజీ) సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనాథలైన పిల్లలు నర్సింహా, రాజ్యలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. తల్లిదం డ్రులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ముగ్గురూ అనాథలయ్యారు. మరో మృతు రాలు జంగమ్మకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. -
ఎంతపని చేశావ్.. ఎంత భార్యపై కోపం ఉంటే మాత్రం..
విడవలూరు(బుచ్చిరెడ్డిపాళెం) నెల్లూరు జిల్లా: భార్య మీద కోపంతో ఆమె స్కూటీకి భర్త నిప్పు పెట్టిన సంఘటన బుచ్చిరెడ్డిపాళెంలోని జొన్నవాడ సర్కిల్ వద్ద బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. షేక్.అబ్దుల్ రజాక్ అనే వ్యక్తి సుధా అనే మహిళను గతంలో వివాహం చేసుకున్నాడు. కొంత కాలం వీరి కాపురం సజావుగా సాగింది. అయితే ఇటీవల కాలంలో వీరి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో బుధవారం భార్య మీద కోపంగా ఉన్న అబ్దుల్‌రజాక్ ఫూటుగా మద్యం సేవించి ఆమె స్కూటీలో బయటకు వెళ్లారు. కొంతసేపటికి స్కూటీలో పెట్రోల్ అయిపోయింది. చదవండి: భర్తతో విడాకులు.. మరో వ్యక్తితో రెండో పెళ్లి.. చివరికి ఏం జరిగిందంటే? దీంతో వాహనాన్ని జొన్నవాడ సర్కిల్ వద్ద ఉంచి ఓ బాటిల్లో పెట్రోల్ తీసుకొచ్చారు. ఇంతలో భార్య సుధా నుంచి ఫోన్ రావడంతో తాను జొన్నవాడ సర్కిల్ వద్ద ఉన్నట్లు తెలిపారు. వెంటనే భార్య అక్కడికి చేరుకోవడంతో ఆమెను చూసిన అబ్దుల్ రజాక్ మరింత కోపానికి గురై స్కూటీపై పెట్రోల్ పోసి నిప్పంటించి పరారయ్యాడు. స్థానికుల సాయంతో ఆమె వెంటనే మంటలను ఆర్పి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వీరప్రతాప్ తెలిపారు. -
భయంకరమైన యాక్సిడెంట్: మహిళ పైకి దూసుకుపోయిన బీఎండబ్ల్యూ కారు
Speeding Car In Mangaluru Jumps Divider: రోడ్ల పై ప్రమాదాలను నివారించేందుకు పోలీసులు ఎన్నిరకాలుగా చర్యలు తీసుకున్నప్పటికీ జరుగుతూనే ఉండటం బాధకరం. ఆఖరికి పరిమితికి మించి స్పీడ్‌గా వెళ్లకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నా ఏదో ఒక చిన్న తప్పిదంతో ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. డ్రింక్ అండ్ డ్రైవ్ వద్దని చెప్పిన యువత పెడచెవిన పెట్టి మరీ థ్రిల్లింగ్ అంటూ డ్రైవ్ చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అచ్చం అలాంటి ఘటనే మంగళూరులో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...మంగళూరులో రహదారికి ఒకవైపు వాహానాలన్ని ట్రాఫిక్‌లో నెమ్మదిగా ఒక దాని తర్వాత ఒకటి వెళ్తున్నాయి. అయితే రహదారికి కుడివైపు నుంచి స్పీడ్‌గా వస్తున్న ఒక బీఎండబ్ల్యూ కారు గాల్లోకి ఎగిరి డివైడర్ అవతల వైపున ఉన వాహనాలని ఢీ కొట్టింది. అదే సమయంలో రోడ్డు దాటేందుకు డివైడర్ పై నిలబడి ఉన్న మహిళ, అవతల వైపు స్కూటీ నడుపుతున్న మరో మహిళ పైకి దూసుకుపోయింది. ఈ ఘటనలో ఏడేళ్ల బాలుడు, ఒక మహిళతో సహా ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. అయితే ఆ డివైడర్ పై ఉన్న మహిళ మాత్రం కొద్దిలో ప్రమాదాన్ని తప్పించుకుంది. ఈ ప్రమాదం మంగళూరులోని బల్లాల్‌బాగ్ జంక్షన్ వద్ద చోటు చేసుకుంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే కారు డ్రైవర్ మద్యం మత్తులో డ్రైవ్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. #Karnataka A 2 wheeler rider critically injured after a BMW car jumped over a divider and crashed into another car and two wheeler in #Mangaluru @IndianExpress pic.twitter.com/tuTouAg6FP — Kiran Parashar (@KiranParashar21) April 9, 2022 (చదవండి: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు తప్పించుకోబోయి.. చుట్టుపక్కల గమనించకపోడంతో..) -
బిడ్డకు హెల్మెట్.. సూపర్ తల్లి! కారులో వెళ్తూ వీడియో తీసిన ఎమ్మెల్సీ కవిత
సాక్షి, బంజారాహిల్స్: రోడ్డు ప్రమాదాలు నగరంలో అంతకంతకు పెరుగుతున్నాయి. బయటికి వెళ్లిన వాహనదారులు ఇంటికి క్షేమంగా వచ్చేవరకు ఆందోళనకరంగా గడపాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురైనప్పుడు తలకు దెబ్బలు తగిలి కొన్నిసార్లు ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితులు చూస్తున్నాం. హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని ఎంతగా ప్రచారం చేస్తున్నా చాలా మందికి పట్టింపు ఉండటం లేదు. అయితే కొంత మంది మాత్రం తమతో పాటు తమ పిల్లలు, వాహనాలు నడిపే సమయంలో భద్రంగా ఉండాలనే ఉద్దేశంతో తప్పనిసరిగా శిరస్త్రాణం ధరిస్తున్నారు. బుధవారం నానక్‌రాంగూడ చౌరస్తాలో ఓ మహిళ తాను హెల్మెట్ ధరించడమే కాకుండా స్కూల్‌కు తీసుకెళ్తున్న నాలుగేళ్ల కూతురికి కూడా హెల్మెట్ ఏర్పాటు చేసి స్కూటీ నడిపిస్తున్న దృశ్యం తనను ఎంతగానో ఆకట్టుకున్నట్లు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్వీట్ చేశారు. ముచ్చటపడ్డ ఈ దృశ్యాన్ని ఆమె వీడియో తీసి ట్విట్టర్ వేదికగా షేర్చేసుకోగా వేలాది మంది ఆ వీడియోకు ఫిదా అయ్యారు. తల్లి తానే కాకుండా తన కూతురికి కూడా హెల్మెట్ ధరించి స్కూటీ నడిపిస్తూ తనకు స్ఫూర్తిగా నిలిచిందంటూ ఆమె ట్వీట్ చేసింది. ప్రతి ఒక్కరు హె ల్మెట్ ధరించి తమ ప్రాణాలు కాపాడుకోవాంటూ సందేశాన్నిచ్చింది. Inspiring Mother & Daughter duo I ran into at Nanakram guda chourastha today !!! Wear Helmet & Be safe 😊🙏🏻 pic.twitter.com/0RfV6Bj2rH — Kavitha Kalvakuntla (@RaoKavitha) March 23, 2022 -
ఇంట్లో వీల్‌చైర్.. రోడ్డుపై స్కూటర్!
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని హౌసింగ్‌బోర్డ్‌కు చెందిన చంద్రకాంత్ 2018లో అనారోగ్య సమస్య రావడంతో నడవలేని స్థితిలో ఉన్నారు. తనకు వచ్చిన కొత్త ఆలోచనలతో పరిగెడుతున్నారు. చెన్నైలోని ఐఐటీ స్టాండప్ కంపెనీ వారు తయారుచేసిన వీల్ చైర్ కం స్కూటీ రూ.95 వేల ఖర్చుతో ప్రత్యేకంగా కొనుగోలు చేసి తెప్పించుకున్నారు. ఈ వాహనం ఇంట్లో వీల్ చైర్ లాగా.. బయటకు వెళ్తే స్కూటీ లాగా ఉపయోగించుకోవచ్చు. 4 గంటలు చార్జింగ్ పెడితే 30 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని చంద్రకాంత్ తెలిపారు. -
కారు, స్కూటీకి ఒకే నంబర్! ఇంతకీ కారు ఎవరిది?
సాక్షి, జోగిపేట(అందోల్): ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా రోడ్డుపై నిలిపిన కారుకు ట్రాఫిక్ పోలీసులు చలాన్ విధించారు. అనంతరం చలాన్‌ను వాహనం అడ్రస్‌కు పోస్టు చేయగా, అది కారు యజమానికి కాకుండా అదే నంబర్‌తో ఉన్న స్కూటీ యజమానికి చేరిన ఘటన జోగిపేటలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జోగిపేటకు చెందిన బండారు మహేశ్ అనే వ్యక్తికి ఈనెల 14న పోస్టు ద్వారా వచ్చిన చలాన్ చూసిన మహేశ్ ఖంగుతిన్నాడు. ఈనెల 12వ తేదిన సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో రోడ్డుపై నిలిపిన టీఎస్ 15 ఎఫ్ఇ 8745 నంబరుగల ఎర్టిగా వాహనానికి పోలీసులు జరిమానా విధించారు. వాహనాన్ని పరిశీలించకుండా చలాన్‌ను స్కూటీ యజమాని అడ్రస్‌కు పోస్టు చేశారు. జరిమానా రశీదు అందుకున్న మహేశ్ వెంటనే జోగిపేట పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించగా, చలాన్ పటాన్చెరు పరిధిలో వేసినందున అక్కడికే వెళ్లాలని పోలీసులు సూచించినట్లు తెలిపాడు. ఇంతకీ కారు ఎవరిది? ఒకే నంబరుతో రెండు వాహనాలు ఉండడం అనుమానాలకు తావిస్తోంది. స్కూటీకి కూడా ఆర్టీఏ అధికారులు అదే నంబర్ కేటాయించినట్లుగా ఆన్లైన్లో చూపిస్తుంది. కారుకు కూడా అదే నంబరు ఇచ్చారా, లేక కారు యజమాని నంబర్ మార్చాడా అనే విషయం తెలియాల్సి ఉంది. చదవండి: ఎంత జాగ్రత్తపడ్డా.. అడ్డంగా దొరికిపోతారు.. ఏమిటీ యెల్లో డాట్స్? ఎక్కడుంటాయి? -
పోలీసులకే షాక్ ఇచ్చిన దొంగ.. పోలీస్ స్టేషన్ ఎదుటే..
సాక్షి, మొయినాబాద్: ఓ దొంగ పోలీసులకే షాక్ ఇచ్చాడు. ఎక్కడో చాటుమాటున దొంగతనం చేస్తే కిక్ ఏముంటుందనుకున్నాడో ఏమో... ఏకంగా ఠాణా ఎదుట నిలిపి ఉంచిన స్కూటిని అపహరించి పోలీసులకు సవాల్ విసిరాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన మండలంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వివరాలు.. మండల పరిధిలోని కేతిరెడ్డిపల్లికి చెందిన మంగలి నర్సింలు ఓ కేసు విషయంలో మూడు రోజుల క్రితం మొయినాబాద్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. సాయంత్రం 5 గంటల సమయంలో పోలీస్‌స్టేషన్ ఎదుట తన టీవీఎస్ స్కూటీని పార్కుచేసి లోపలికి వెళ్లాడు. రాత్రి 8 గంటల సమయంలో బయటకు వచ్చి చూడగా స్కూటీ కనిపించలేదు. కొద్దిదూరంలో మరో స్కూటీ పార్కుచేసి ఉంది. మళ్లీ.. మళ్లీ రావొద్దు తన స్కూటీ పోయిందని నర్సింలు పోలీసులకు ఫిర్యాదు చేయగా సీసీ కెమెరాలను పరిశీలించారు. ఓ వ్యక్తి స్కూటీపై వచ్చి దానిని పోలీస్‌స్టేషన్ ఎదుట పార్కుచేసి నర్సింలు స్కూటీని తోసుకుంటూ వెళ్లినట్లు సీసీ కెమరాల్లో రికార్డు అయింది. రెండు రోజుల తరువాత పోలీసులు కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ను బాధితుడి చేతిలో పెట్టారు. తన స్కూటీ కోసం నర్సింలు రోజూ పోలీస్‌స్టేషన్ చుట్టూ తిరుగుతుండడంతో మళ్లీమళ్లీ రావద్దని.. స్కూటీ దొరికినప్పుడు పిలుస్తామని పోలీసులు చెప్పి పంపడం గమనార్హం. పోలీస్‌స్టేషన్ ఎదుట వదిలేసి వెళ్లిన స్కూటీ ఎవరిదనే విషయమై ఆరా తీస్తే అది ఆంధ్రప్రదేశ్‌కు చెందినదిగా గుర్తించినట్లు సమాచారం. పోలీస్‌స్టేషన్ ముందు నుంచి స్కూటీ చోరీకి గురవగా.. తహసీల్దార్ కార్యాలయం ముందు నుంచి దొంగిలించారని ఎఫ్ఐఆర్లో పోలీసులు నమోదు చేయడం గమనార్హం. చదవండి: న్యూఇయర్ వేడుకల అనుమతులపై అభ్యంతర పిటిషన్ -
మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే ఆర్కే రోజా
సాక్షి, చిత్తూరు: నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా కష్టమొస్తే నేనున్నానంటూ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. నగరి మున్సిపాలిటీలోని పుదుపేటలో చేనేత కుటుంబానికి చెందిన పళణి కుమారుడు కె.పి.బాలమురుగున్ (21) ఏప్రిల్ నెల 6న తేదీన రేణిగుంట రైల్వే స్టేషన్లో రైలు దిగుతుండగా కాలు జారడంతో రెండు కాళ్లు నలిగిపోయాయి. దీంతో వైద్యులు.. అతని రెండు కాళ్లు తొలగించి కృతిమ కాళ్లు ఏర్పాటు చేశారు. చదవండి: ఎమ్మెల్యే కాటసాని కుమారుడి వివాహానికి హాజరైన సీఎం జగన్ ఎమ్మెల్యే రోజా.. బాధితుడు నడిచి కాలేజీకి వెళ్లలేని దయనీయ పరిస్థితి తెలుసుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు సందర్భంగా రోజా ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా బాలమురుగన్‌కు టీవీఎస్ స్కూటీని అందించి.. భరోసా కల్పించారు. -
స్కూటీలో తాచుపాము
కేసముద్రం: పాఠశాల ఆవరణలో పార్కింగ్ చేసిన స్కూటీలోకి దూరిన తాచుపామును బయటకు రప్పించేందుకు మెకానిక్ రెండు గంటల పాటు శ్రమించాడు. దానిని బటయకు రప్పించి పట్టుకుని వెళ్లి అడవిలో వదిలిన ఘటన కేసముద్రం మండల కేంద్రంలోని జెడ్పీఎస్‌ఎస్‌లో జరిగింది. ఉపాధ్యాయురాలు సునీత రోజు మాదిరిగానే స్కూటీపై వచ్చి పాఠశాల ఆవరణలో పార్కింగ్ చేసింది. ఈ క్రమంలో ముళ్లపొదల నుంచి వచ్చి స్కూటీలోకి దూరిన పామును విద్యార్థులు గమనించి, ఉపాధ్యాయులకు తెలిపారు. దానిని బయటకు రప్పించేందుకు ఉపాధ్యాయులు చేసిన ప్రయత్నం ఫలించలేదు. దీంతో అమీనాపురం గ్రామానికి చెందిన బైక్‌మెకానిక్ విజయ్‌ని పాములు పట్టే వ్యక్తి కుమారస్వామి పిలిపించాడు. ఆయన రెండు గంటల పాటు శ్రమించి స్కూటీ పార్టులన్నీ విప్పి పామును బయటకు రప్పించాడు. కాగా కుమారస్వామి పామును పట్టుకుని వెళ్లి అడవిలో వదిలేయడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. -
నంబర్ ప్లేట్‌తో తంటా
న్యూఢిల్లీ: ఆమె ఫ్యాషన్ డిజైన్ చదువుతున్న విద్యార్థిని. ఢిల్లీలోని జనక్‌పురి నుంచి నోయిడాకు రోజూ వెళ్లి రావడం కష్టమవుతోందని... ‘నాన్నా నాకో స్కూటీ కొనిపెట్టవు’ అని తండ్రిని కోరింది. ముద్దుల కూతురి కోరిక తీరుస్తూ ‘దీపావళి’ కానుకగా స్కూటర్ కొనిపెట్టారాయన. ఆ అమ్మాయి ఎంతో సంతోషించింది. తర్వాత బండి రిజిస్ట్రేషన్ పూర్తయి ‘నెంబరు రావడం’తో ఆమె బిక్కచచ్చిపోయింది. స్కూటీని బయటకు తీయాలంటేనే సిగ్గుతో చితికిపోతున్నానని, ఇరుగుపొరుగుతో, వీధుల్లో ఎగతాళికి గురవుతున్నానని, అసభ్య పదజాలంతో వేధిస్తున్నారని వాపోతోంది. ఎందుకంటారా? నెంబరులో ఉన్న సిరీస్ తెచ్చిన తంటా ఇది. ఢిల్లీలోని వాహనాలకు నెంబరు కేటాయించేటపుడు మొదటి రెండు అక్షరాలు DL అని వస్తాయి. తర్వాత ఒక అంకె సంబంధిత జిల్లాను సూచిస్తుంది. ఆపై ఫోర్ వీలర్ అయితే ‘సి’ అక్షరం, టూ వీలర్ అయితే ‘ఎస్’ అక్షరం వస్తుంది. ఆపై వచ్చే రెండు ఆంగ్ల అక్షరాలు సిరీస్‌ను సూచిస్తాయి. ఈ అమ్మాయిది టూ వీలర్ కాబట్టి DL3 SEX (నాలుగు అంకెల నెంబర్) వచ్చింది. దాంతో బండిని బయటికి తీయాలంటేనే భయపడిపోతోంది. చివరకు ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ)ను ఆశ్రయించింది. దీంతో ఆమెకు కేటాయించిన సిరీస్‌ను మార్చి కొత్త నెంబరును ఇవ్వాలని మహిళా కమిషన్ సంబంధిత ఆర్టీవోకు నోటీసు జారీచేసింది. -
రిజిస్ట్రేషన్ ప్లేట్ రచ్చ చేస్తోంది!... అందుకే ఈ స్కూటీ నడపను!!
న్యూఢిల్లీ: మన ఇంట్లో పిల్లలు వాళ్లకు నచ్చిన వస్తువును కొనేంతవరకు మనల్ని ఒక పట్టాన వదలరు. ఒకవేళ ఎంతో ప్రయాసపడి కొంటే దాన్ని కొద్దిరోజులు వాడి పక్కన పెట్టేస్తారు. పైగా పెద్దవాళ్లకి కూడా తమ పిల్లలకు ఇష్టమైనవి కొనడం ఒక సరదా. అయితే ఇక్కడొక అమ్మాయి కూడా అలానే ఇంట్లో వాళ్లని ఒప్పించి మరీ తనకు నచ్చిన స్కూటీ కొనుక్కుంది కానీ నడిపేందుకు వీల్లేకుండా అయిపోయింది. (చదవండి: వామ్మో! అప్పుడే ఈ ఒమ్రికాన్ వైరస్ 12 దేశాలను చుట్టేసింది!!) అసలు విషయంలోకెళ్లితే...ఫ్యాషన్ డిజైనింగ్ విద్యార్థిని అయిన ఆ అమ్మాయి జంకాపురి నుంచి నోయిడాకు మెట్రోలో ప్రయాణించేది. అయితే రద్దీగా ఉండే మెట్రో రైళ్లలో ప్రయాణించడం కష్టంగా ఉందంటూ తన తండ్రిని స్కూటీ కొనివ్వమని అడిగింది. ఈ మేరకు ఆమె తన తండ్రిని ఒప్పించేందకు ఏడాది పాటు ప్రయత్నించింది. అయితే ఆమె తండ్రి ఎట్టకేలకు అంగీకరించి ఆ అమ్మాయికి ఒక మంచి స్కూటీని కొనిచ్చాడు. అయితే స్కూటీకి వచ్చిన రిజిస్ట్రేషన్ నెంబర్‌తో అసలు తలనొప్పి మొదలైంది. ఆఖరికి కుటుంబ సభ్యులు ఆ రిజిస్ట్రేషన్ నెంబర్‌ను మార్చుకునేందుకు ప్రయత్నాలు కూడా చేశారు. అయితే ఒకసారి వాహనానికి నంబర్‌ను కేటాయించిన తర్వాత దానిని మార్చడం ఏమాత్రం కుదరదని, మొత్తం ప్రక్రియ ఒక సెట్ నమూనాలో నడుస్తుంది అని ఢిల్లీ రవాణా కమిషనర్ కెకె దహియా ఆమె తండ్రితో అన్నారు. అయితే ఆ అమ్మాయికి కేటాయించిన నెంబర్ ప్లేట్ మీద కాస్త ఇబ్బందికరమైన విధానంలో నెంబర్ సిరీస్ ఉంది. పైగా ఆమె స్కూటిని నడుపుతున్నప్పుడు వెనుక నుంచే వచ్చే మిగత వాహనదారులంతా ఆ నెంబర్ ప్లేట్‌ని చూసి నవ్వడం మొదలుపెట్టారు. దీంతో ఆ అమ్మాయి ఆ స్కూటీని నడపను అంటూ తన తండ్రి వద్ద వాపోయింది. ఈ క్రమంలో రవాణా కమిషనర్ ఆశిష్ కుంద్రా మాట్లాడుతూ..."వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లు ఆటోమేటిక్‌గా రూపపొందింబచడతాయి. అయితే ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ఆ సిరీస్‌లను నిలిపివేశాం" అని ఆయన అన్నారు. అంతేకాదు ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా మరో సిరీస్‌ను విడుదల చేయనున్నట్లు కూడా చెప్పారు (చదవండి: టిక్‌టాక్ పిచ్చి.. డాక్టర్ వికృత చేష్టలు.. ఆపరేషన్ మధ్యలోనే వదిలేసి..) -
ఇంట్లో వీల్‌చైర్‌లా... బయట స్కూటీలా
IIT Madras Created: దివ్యాంగులు ఎక్కడికైనా వెళ్లాలంటే ఎవరో ఒకరి తోడు ఉండాల్సిందే. అలాంటి వారి కోసం ఐఐటీ మద్రాస్ తయారు చేసిన బ్యాటరీ వాహనం ఎంతో ఉపయోగపడుతోంది. దానిని ఇంట్లో వీల్ చైర్‌లా..బయటకు వెళ్తే స్కూటీలాగా వాడొచ్చు. ఎవరి సహాయం లేకుండా ఒక్కరే ఎక్కడికైనా వెళ్లొచ్చు. ఒక్కరే దానిని అటాచ్ చేసుకునేలా, తొలగించుకునేలా తయారు చేశారు. (చదవండి: హ్యాట్సాఫ్ సార్!... హీరోలా రక్షించారు!) నాలుగు గంటలు చార్జ్ చేస్తే ఇరవై కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరా నగర్‌కు చెందిన శ్రావణ్ పద్నాలుగు సంవత్సరాల క్రితం ప్రమాదంలో నడవలేని స్థితికి చేరుకున్నాడు. అప్పటినుంచి ఎవరైనా తోడుంటేనే బయటకు వచ్చాడు. కానీ ఈ వెహికిల్ సహాయంతో ఒక్కడే బయటకు రాగలుగుతున్నాడు. కాగా, దీని ఖరీదు రూ.95,000. దీన్ని శ్రావణ్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నట్టు చెబుతున్నాడు. – బి.శివ ప్రసాద్, సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సంగారెడ్డి -
స్కూటీ అమ్మకాల్లో టీవీఎస్ రికార్డ్ !
హెదరాబాద్, బిజినెస్ బ్యూరో: టీవీఎస్ మోటార్ కంపెనీ సరికొత్త రికార్డు సృష్టించింది. ఎలక్ట్రిక్ వాహనాల హవాలోనూ తన సత్తా చాటింది. ముఖ్యంగా స్కూటీ అమ్మకాలు రికార్డు స్థాయిలో జరిగాయి. దీంతో స్కూటీ అమ్మకాలు 50 లక్షల యూనిట్లను దాటి కొత్త మైలురాయిని అధిగమించినట్టయ్యింది. ఈటీఎఫ్ఐ ఎకోథ్రస్ట్ టెక్నాలజీతో 87.8 సీసీ ఇంజన్‌తో ఇది తయారైంది. ఫోర్ స్ట్రోక్ సింగిల్ సిలిండర్, 6.5 ఎన్ఎం టార్క్, 4 కిలోవాట్ పవర్, పేటెంటెడ్ ఈజీ స్టాండ్ టెక్నాలజీ, టెలిస్కోపిక్ సస్పెన్షన్, డీఆర్ఎల్ ఎల్ఈడీ ల్యాంప్స్, 4.2 లీటర్ల సామర్థ్యంతో ఇంధన ట్యాంక్ పొందుపరిచారు. అయిదు రంగుల్లో లభిస్తుంది. హైదరాబాద్ ఎక్స్‌షోరూంలో ధర మోడల్‌నుబట్టి రూ.56–59 వేల మధ్య ఉంది. -
బైక్ కొనే వారికి యమహా గుడ్‌న్యూస్...!
కొత్తగా బైక్‌లను కొనే వారికి ప్రముఖ జపానీస్ ఆటోమొబైల్ దిగ్గజం యమహా గుడ్‌న్యూస్‌ను అందించింది. ఫెస్టివల్ సీజన్లో భాగంగా యమహా స్కూటీలపై సుమారు రూ. 4000 వరకు క్యాష్‌బ్యాక్‌ను అందించనుంది. ఈ ఆఫర్ యమహా 125సీసీ స్కూటీ రేంజ్‌పై అందుబాటులో ఉండనుంది. ఫాసినో 125 ఎఫ్ఐ(హైబ్రిడ్+నాన్ హైబ్రిడ్), రే జెడ్ఆర్ 125ఎఫ్ఐ, రే జెడ్ ఆర్ స్ట్రీట్ ర్యాలీ 125 ఎఫ్ఐ(హైబ్రిడ్+నాన్ హైబ్రిడ్) మోడల్ స్కూటీలపై క్యాష్‌బ్యాక్ ఆఫర్ లభించనుంది. ఈ ఆఫర్ అక్టోబర్ 31 వరకు అందుబాటులో ఉండనుంది. చదవండి: చైనా బొమ్మల్లో ‘విషం’.. అమెరికా అలర్ట్! యమహా స్కూటీ ధరలు ఇలా..(ఎక్స్‌షోరూమ్ ధరలు) యమహా ఫాసినో 125 ఎఫ్ఐ(హైబ్రిడ్+నాన్ హైబ్రిడ్) ధర రూ. 78,530 రే జెడ్ ఆర్ స్ట్రీట్ ర్యాలీ 125 ధర రూ. 79,830 యమహా ఫాసినో 125 ఎఫ్ఐ ఫీచర్స్.. యమహా బ్లూ కోర్ ఇంజన్ టెక్నాలజీతో కొత్త BS-6-మోడల్ ఫాసినో రానుంది, ఎయిర్-కూల్డ్, ఫ్యూయల్-ఇంజెక్ట్ (Fi), 125 cc ఇంజిన్‌ను అమర్చారు. 5000 ఆర్పీఎమ్వద్ద 10.3 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను అందిస్తోంది. ఈ బైక్ సుమారు 66కెఎమ్పీఎల్ మైలేజీను ఇస్తుంది. చదవండి: ‘ఈవీ’ మేకర్స్ ఆశలపై డ్రాగన్ నీళ్లు.. సప్లయ్ అంతా అటు వైపే! -
యాదాద్రిలో విషాదం: దోసల వాగులో ఇద్దరు యువతుల గల్లంతు
యాదాద్రి: రాజపేట మండలం కుర్రారం గ్రామంలోని దోసల వాగులో ఇద్దరు యువతులు గల్లంతు అయ్యారు. హిమబిందు, సింధుజ అనే యువతులు ఇటుకలపల్లి వెళ్లి తిరిగి కుర్రారం గ్రామానికి వెళ్తుండగా వాగులో నీటి ప్రవాహనికి గల్లంతు అయ్యారు. వాగు దాటుతుండగా మధ్యలో స్కూటీ ఆగిపోవడంతో వాగు ఉదృతికి కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు స్థానికులతో కలిసి గల్లంతైన యువతులిద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఘటనాస్థలికి కొంతదూరంలో కొట్టుకుపోతున్న సింధుజను గమనించిన స్థానికులు ఆమెను కాపాడి బయటకు తీసుకొచ్చారు. అనంతరం సింధుజను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సింధుజ మృతి చెందింది. వాగులో గల్లంతైన హిమబింధు కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
స్కూటీ రాంగ్ రూట్ లో రావడంతో....
-
స్కూటీపై వచ్చి పుస్తెల తాడులాగిన దుండగులు.. ట్విస్ట్ ఏంటంటే..
సాక్షి, త్రిపురారం(నల్లగొండ): ఇద్దరు దుండగులు ఒంటరిగా ఉన్న మహిళ మెడలో పుస్తెలతాడును అపహరించారు. చేశారు. బాధితురాలి సమాచారం మేరకు గ్రామస్తులు వారిని పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన త్రిపురారం మండలం బొర్రాయిపాలెంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీ సులు, బాధితుల వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండల పరిధిలోని తుంగపాడ్ గ్రామంలో ఓ మహిళ రోడ్డుపై ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుండాన్ని దుండగులు గమనించారు. స్కూటీపై వచ్చి ఆమె మెడలోని పుస్తెలతాడు లాక్కొని పరారయ్యారు. అప్రమత్తమైన మహిళ సమీపంలో ఉన్న తన బంధువులకు ఫోన్‌చేసి సమాచారం ఇచ్చింది. దుండగులు అదేసమయంలో బొర్రాయిపాలెంలో గ్రామస్తులకు అనుమానంగా తారసపడ్డారు. దీంతో వారిని నీలదీయగా పారిపోబో యారు. వెంబడించి పట్టుకుని చితకబాది పోలీసులకు సమాచారం ఇచ్చారు. త్రిపురారం ఎస్ఐ రాంముర్తి సిబ్బందితో అక్కడికి చేరుకొని దుండగులను అరెస్ట్ చేశారు. అనంతరం వారిని ఘటన జరిగిన ప్రాంతం మేరకు మిర్యాలగూడ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. -
ఆపదలో ఆదుకునే అంబులెన్స్.. వారి పాలిట మృత్యు శకటమైంది..
సాక్షి, యశవంతపుర(కర్ణాటక): ఆపదలో ఆదుకునే అంబులెన్స్ మృత్యు శకటమైంది. స్కూటీని ఢీకొనడంతో ముగ్గురు యువకులు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన సోమవారం రాత్రి చిత్రదుర్గ పట్టణానికి సమీపంలో జరిగింది. హొళల్కెరె రోడ్డు తిరుమల డాబా వద్ద హొళెల్కెరె నుంచి కాంతరాజు (22), శ్రీకాంత(20), నంజుండ(20) అనే యువకుడు స్కూటీపై చిత్రదుర్గకు వెళ్తున్నారు. ఎదురుగా వచ్చిన అంబులెన్స్ వారిని వేగంగా ఢీకొనడంతో దూరంగా ఎగిరిపడి చనిపోయారు. అంబులెన్స్ చెట్టును ఢీకొని నిలిచిపోగా డ్రైవర్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి. అంబులెన్స్ అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. చదవండి: డీజే బంద్ చేయమన్నందుకు పోలీసులపైనే దాడి.. -
5 అడుగుల విషనాగు.. ఒంటి చేత్తో పట్టుకొంది!
భువనేశ్వర్: సాధారణంగా మనలో చాలా మంది చిన్న బల్లిని చూస్తేనే అరిచి గోల గోల చేస్తుంటారు. అలాంటిది పామును చూస్తే ఇంకేమైనా ఉందా! పై ప్రాణాలు పైనే పోతాయి. అలాంటిది ఓ మహిళ మాత్రం ఐదడగుల పామును సునాయాసంగా చేత్తో పట్టుకుని అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఒడిశాలోని భువనేశ్వర్‌లో ఉండే స్వరూప భట్నాగర్ బయటకు వెళ్దామని ఇంటి తలుపు తీసింది. సరిగ్గా అప్పుడే అనుకోని అతిథి ఇంటికి రావడాన్ని చూసి షాక్‌కు గురైంది. వెంటనే లోపలికి వెళ్ళి డోర్ పెట్టేసుకుంది. ఇంతకీ ఆ అతిథి ఏవరోకాదు.. 5 అడుగుల నాగుపాము. దాని భయంతో ఇంట్లోనే ఉండిపోయిన ఆమె ఆ సర్పం అక్కడ నుంచి వెళ్లిపోయిందా? లేదా? అని కిటికిలో నుంచి తొంగి చూసింది. ఆ నాగుపాము బయట పార్కింగ్ చేసిన ఒక స్కూటీపై ఎక్కి పడగ విప్పింది. ఇది గమనించిన స్వరూపభట్నాగర్ వెంటనే, స్నేక్ క్యాచర్ సుబేందు మల్లిక్‌కు సమాచారం అందించింది. పాములను పట్టుకొవడంలో మంచి ఎక్స్పర్ట్ అయిన సుబేంద్ క్షణాల్లో అక్కడకు చేరుకుంది. బుసలు కొడుతున్న నాగుపామును ఒక కర్ర సహయంతో పట్టుకుని అటవీ ప్రదేశంలో వదిలేసింది. సాధారణంగా పాములు ఆహరం కోసం బయట సంచరిస్తాయని, ఆ క్రమంలోనే ఇక్కడకు వచ్చి ఉంటుందని చెప్పింది. గత కొన్నిరోజులుగా ఆ పాముకు ఆహారం కరువైనట్లు కనిపిస్తోందని, దానివల్ల కొంత నీరసంగా ఉందని తెలిపింది. చదవండి: వైరల్: చేతిలో పైథాన్, భుజంపై చిలుక.. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువతులు మృతి
సాక్షి, కొవ్వూరు: పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది. స్కూటీపై వెళుతున్న ఇద్దరు యువతులను క్వారీ లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది. దాంతో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. స్కూటీని లారీ ఢీకొని వారిపై నుండి వెళ్లిపోవడంతో యువతుల శరీరాలు నుజ్జు నుజ్జు అయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతి చెందిన యువతులు కొవ్వూరు 23వ వార్డుకు చెందిన ఈర్ని భార్గవి, తనూషగా గుర్తించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
భార్యను చంపి శవంతో స్కూటీపై 10 కి.మీ
గాంధీనగర్: గుజరాత్ రాజ్‌కోట్‌లో ఆదివారం దారుణం చోటు చేసుకుంది. తాళి కట్టిన భార్యను ఓ వ్యక్తి కిరాతకంగా హత్య చేసి.. పట్టపగలు అందరూ చూస్తుండగా మృతదేహాన్ని స్కూటీ మీద వేసుకుని తీసుకెళ్లాడు. ఇది గమనించిన స్థానికులు అతగాడిని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన రాజ్‌కోట్ పలితాన సమీపంలోని ఓ గ్రామంలో చోటు చేసుకుంది. వెరవాల్ గ్రామం సింధ్ క్యాంప్ కాలనీకి చెందిన హేమ్నాని, నైనా దంపతులకు గత ఏడాది వివాహం అయింది. హేమ్నాని స్థానిక ఎల్పీజీ డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య ఆదివారం చిన్న గొడవ మొదలయ్యింది. దాంతో హేమ్నాని ఆగ్రహంతో భార్య గొంతు పిసికి చంపేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని స్కూటీ మీద వేసుకుని రోహిషాల గ్రామం వైపు వెళ్లసాగాడు. స్టీరింగ్, ఫూట్ రెస్ట్‌కి మధ్య నైనా మృతదేహాన్ని ఉంచాడు. దాంతో ఆమె కాళ్లు నేల మీద ఉన్నాయి. ఇదేం పట్టించుకోకుండా అలానే ఓ 10 కిలోమీటర్ల దూరం లాక్కెళ్లాడు. (చదవండి: సూసైడ్‌లో నోట్లో షాకింగ్ విషయం) ఇది గమనించిన స్థానికులు షాక్‌కు గురయ్యారు. స్కూటీని ఆపాల్సిందిగా అరిచారు. కానీ హేమ్నాని ఇదే పట్టించుకోకుండా అలానే ముందుకు వెళ్లాడు. దాంతో స్థానికులు తమ వాహనాల మీద అతడి వెనకే వెళ్లి.. పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ సందర్భంగా పాలితాన ఎస్సై మాట్లాడుతూ.. ‘దర్యాప్తులో నిందితుడు తన భార్య శవాన్ని పాలితాన తాలూకాలోని రోహిషాల గ్రామం చివర ఉన్న అటవి ప్రాంతంలో పడేయాలని భావించినట్లు తెలిపాడు. ఇక తన భార్యను హత్య చేయడానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. ఇరువురు కుటుంబ సభ్యులను విచారిస్తే.. హత్య చేయడానికి గల కారణాలు తెలుస్తాయి’ అన్నారు. -
సరూర్‌నగర్ చెరువులో వ్యక్తి గల్లంతు..
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలతో హైదరాబాద్ నగరం అతలాకుతలం అవుతోంది. తాజాగా సరూర్‌నగర్ గ్రీన్ పార్క్ కాలనీలో స్కూటీపై ఇద్దరు వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. అయితే వీరు ప్రయాణిస్తున్న క్రమంలో తపోవన్ కాలనీ వద్ద రోడ్డు పై వరద నీటిలో బైక్ మొరాయించింది. కాగా స్కూటీపై వెనక ఉన్న వ్యక్తి బైక్ దిగి నెడుతున్న సమయంలో ప్రమాదవశాత్తు సరూర్‌నగర్ చెరువు నీటిలో అతడు పడిపోయాడు. వ్యక్తిని గమనించిన స్థానికులు కాపేడే లోపు లోపలికి కొట్టుకుపోవడంతో సరూర్‌నగర్ పోలీసులకు సమాచారం అందించారు. కాగా తప్పిపోయిన వ్యక్తి ఆచూకి కోసం జీహెచ్ఎంసీ రెస్క్యూ టీమ్, పోలీసులు గాలిస్తున్నారు. -
స్కూటీ వదలండి ప్లీజ్
కర్ణాటక,బనశంకరి: కరోనా లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన మహిళ స్కూటీని పోలీసులు సీజ్ చేసేందుకు యత్నించడంతో ఆమె ఖాకీల కాళ్లు పట్టుకుని వేడుకున్న సంఘటన బెంగళూరు శిర్కి సర్కిల్ వద్ద చోటుచేసుకుంది. గురువారం ఉదయం లాక్డౌన్ సడలింపు సమయం ముగిశాక స్కూటీపై వెళుతున్న మహిళను పోలీసులు అడ్డుకున్నారు. ఎందుకు బయటకు వచ్చావంటూ ఆమెను మందలించారు. స్కూటీ తాళాలు తీసుకోవడంతో ఆమె విలపిస్తూ వదిలిపెట్టండి అంటూ పోలీసులు కాళ్ల మీద ప్రాధేయపడింది. చివరికి పోలీసులు స్కూటీతో సహా వదిలేశారు. (ఉల్లంఘనులకు శుభవార్త) -
హోండా బీఎస్–6 డియో స్కూటర్
బెంగళూరు: హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా కంపెనీ డియో మోడల్లో బీఎస్–6 వేరియంట్‌ను బెంగళూరు మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ స్కూటర్ ధరలు రూ.64,584(ఎక్స్ షోరూమ్, బెంగళూరు) నుంచి ఆరంభమవుతాయని కంపెనీ తెలిపింది. ఈ స్కూటర్ రెండు వేరియంట్లు–స్టాండర్డ్, డీలక్స్ల్లో లభ్యమవుతుందని వెల్లడించింది. మార్కెట్లోకి విడుదల చేసిన రోజే 301 స్కూటర్లను డెలివరీ చేశామని పేర్కొంది. దక్షిణాదిలో తమదే నంబర్ వన్ టూ వీలర్ బ్రాండని, ఈ ప్రాంతంతో తమ మార్కెట్ వాటా 34 శాతమని వివరించింది. -
‘ఇదే యూపీ అయితే డ్రైవర్ ఆమెను కొట్టేవాడు’
తిరువనంతపురం: మనం చేస్తున్న పని సరైనదే అయినప్పుడు దేని గురించి, ఎవరి గురించి భయపడాల్సిన పనిలేదు. ఈ మాటలను నిజం చేసే సంఘటన ఒకటి కేరళలో చోటు చేసుకుంది. రాంగ్ రూట్లో వస్తోన్న ఓ బస్సుకు ఎదురుగా తన స్కూటినీ నడుపుతూ.. బస్సు కరెక్ట్ రూట్లోకి వెళ్లేలా చేసిందో మహిళ. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. వివరాలు.. ఓ మహిళ రోడ్డు మీద స్కూటితో వెళ్తుంది. ఇంతలో ఓ బస్సు రాంగ్ రూట్లో మహిళకు ఎదురుగా వచ్చింది. అయితే బస్సును చూసి ఆ మహిళ ఏ మాత్రం బెదరలేదు. అలానే ముందుకు వెళ్లసాగింది. ఇక చేసేదేం లేక ఆ బస్సు డ్రైవరే డైవర్షన్ తీసుకుని కరెక్ట్ రూట్లోకి వెళ్లాడు. ఈ మొత్తం సంఘటనను వీడియో తీసి ట్విటర్లో షేర్ చేశాడో వ్యక్తి. When you are RIGHT it gives you a very different kind of MIGHT. See Joe a lady rider down South doesn't budge an inch to give in to an erring Bus Driver. Kudos to her. @TheBikerni @IndiaWima @UrvashiPatole @utterflea @anandmahindra @mishramugdha #GirlPower #BikerLife #BikerGirl pic.twitter.com/3RkkUr4XdG — TheGhostRider31 (@TheGhostRider31) September 25, 2019 ఈ వీడియో చూసిన నెటిజన్లు సదరు మహిళ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. లేడీ బాస్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే కొందరు నెటిజన్లు మాత్రం ‘ఉత్తర భారతదేశంలో ఇలాంటి సంఘటనలు జరిగే చాన్సే లేదు. ఇదే సంఘటన యూపీలో జరిగితే ఆ బస్సు డ్రైవర్ కిందకు దిగి.. సదరు మహిళను కొట్టేవాడు. బస్సును పక్కకు తిప్పేవాడు కాదు’ అంటున్నారు. -
చెన్నై: ప్రాణం తీసిన పొలిటికల్ ఫ్లెక్సీ
-
యువతిని బలిగొన్న పెళ్లి బ్యానర్
సాక్షి, చెన్నై: పల్లావరం సమీపంలోని ఓ బ్యానర్ స్కూటర్‌పై వెళ్తున్న యువతిని బలికొంది. వివాహ ఆహ్వానం పేరిట ఏర్పాటు చేసిన ఆ బ్యానర్ నేలకొరిగి స్కూటర్‌పై పడడంతో అదుపు తప్పి ఆ యువతి కింద పడింది. అదే సమయంలో వెనుక వైపున వచ్చిన లారీ ఆమె మీదుగా వెళ్లడంతో మృతిచెందింది. గురువారం సాయంత్రం ఈ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. పల్లావరం రెడియల్ రోడ్డులో పళ్లికరణై వద్ద శుభశ్రీ అనే యువతి స్కూటర్ మీద వెళుతోంది. ఓ సంస్థలో పనిచేస్తున్న ఆమెను అక్కడ ఏర్పాటు చేసిన ఓ బ్యానర్ రూపంలో మృత్యువు కబళించింది. అనుమతి లేకుండా బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకూడదని హెచ్చరికలు, ఆదేశాలు ఇచ్చినా, వాటిని భేఖాతరు చేయడంతో ఓ నిండు ప్రాణం బలి అయింది. వివాహ ఆహ్వానం పేరిట మాజీ కౌన్సిలర్ ఒకరి కోసం ఏర్పాటు చేసిన ఈ బ్యానర్ నేలకొరిగింది. స్కూటర్ మీద బ్యానర్ పడడంతో అదుపు తప్పింది. స్కూటర్ నుంచి కింద పడ్డ శుభశ్రీపై వెనుక వైపున వచ్చిన వాటర్ ట్యాంకర్ వెళ్లింది. దీంతో సంఘటన స్థలంలోనే ఆమె మృతిచెందింది. సమాచారంతో పళికరణై పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమ్తితం క్రోంపేట ఆసుపత్రికి తరలించారు. ఆ బ్యానర్‌ను ఎలాంటి అనుమతి అన్నది పొందకుండా ఏర్పాటు చేసి ఉన్నట్టు విచారణలో తేలింది. ఈ బ్యానర్ రూపంలో శుభశ్రీ మరణించడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పదేపదే ఈ మార్గంలో ఇష్టానుసారంగా రాజకీయ పార్టీల నాయకుల బ్యానర్లు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. వీటి కారణంగా ప్రమాదాలు పెరుగుతున్నాయన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా, పోలీసులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, అధికారులు సైతం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. -
జీఎస్టీ తగ్గింపుపై త్వరలో నిర్ణయం
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ రంగానికి జీఎస్టీ తగ్గింపు విషయమై రాష్ట్రాలతో సంప్రదింపులు చేస్తున్నామని, త్వరలోనే దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటామని కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. రేటు తగ్గింపుపై నిర్ణయం తీసుకునే అధికారం జీఎస్టీ మండలికే ఉంటుందని తెలిసిందే. ‘‘రాష్ట్రాలతో ఆరి్థక శాఖ చేస్తున్న సంప్రదింపులపై నేను నమ్మకంతో ఉన్నాను. ఒకవేళ సాధ్యపడితే వారు ఓ నిర్ణయం తీసుకుంటారు’’ అని మంత్రి తెలిపారు. బుధవారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. ప్రమాదాల నివారణకే అధిక జరిమానాలు ట్రాఫిక్ జరిమానాలను భారీగా పెంచడాన్ని గడ్కరీ సమర్థించుకున్నారు. 30 ఏళ్ల తర్వాత జరిమానాలను పెంచినట్టు గుర్తు చేశారు. అధిక జరిమానాలు రోడ్డు ప్రమాదాలను నివారించంతోపాటు రహదారి భద్రతను ప్రోత్సహిస్తాయన్నారు. ఆదాయ పెంపు కంటే ప్రాణాలను కాపాడటానికే జరిమానాలను పెంచినట్టు వివరణ ఇచ్చారు. ఈ విషయమై సానుకూల స్పందన వచి్చనట్టు చెప్పారు. రాష్ట్రాలు కావాలనుకుంటే జరిమానాలను తగ్గించుకోవచ్చని సూచించారు. బీఎస్–6 ప్రమాణాలతో ‘యాక్టివా 125’ విడుదల ధరల శ్రేణి రూ. 67,490 – 74,490 న్యూఢిల్లీ: దేశీ రెండో అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ కంపెనీ హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా తన బెస్ట్ సెల్లింగ్ స్కూటర్ ‘యాక్టివా 125’లో భారత్ స్టేజ్–6 (బీఎస్6) ప్రమాణాలతో కూడిన అధునాతన వెర్షన్‌ను బుధవారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. వచ్చే ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి బీఎస్–6 ప్రమాణాలు కలిగిన వాహనాలను మాత్రమే కంపెనీలు విడుదలచేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో తాజా వాహనాన్ని హోండా విడుదల చేసింది. మొత్తం మూడు వేరియంట్లలో అందుబాటులోకి వచి్చన ఈ నూతన స్కూటర్ ధరల శ్రేణి రూ. 67,490 – రూ. 74,490 (ఎక్స్–షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయించింది. ఇందులో 124సీసీ, సింగిల్ సిలిండర్ ఇంజిన్ అమర్చింది. ఈనెల చివరికి వినియోగదారులకు చేరనుందని ప్రకటించింది. -
స్కూటీలో నాగుపాము పిల్ల
-
హీరో అధునాతన ఈ–స్కూటర్లు
న్యూఢిల్లీ: ప్రముఖ విద్యుత్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో ఎలక్ట్రిక్.. హెవీ డ్యూటీ, హై–స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లను సోమవారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. వినియోగదారుల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా రెండు అధునాతన స్కూటర్లను రూపొందించి మార్కెట్లోకి విడుదలచేసినట్లు ప్రకటించింది. ఆప్టిమా ఈఆర్, ఎన్వైఎక్స్ ఈఆర్ పేర్లతో ఇవి అందుబాటులోకి రాగా, వీటి ధరల శ్రేణి రూ.68,721–రూ.69,754 (ఢిల్లీ–ఎక్స్‌షోరూం)గా నిర్ణయించింది. ఈ వాహనాలకు ఫేమ్–2 పథకం కింద రాయితీ వర్తిస్తుంది. హీరో ఎలక్ట్రిక్ డీలర్ల వద్ద స్కూటర్లు అందుబాటులో ఉన్నట్లు కంపెనీ సీఈఓ సోహిందర్ గిల్ వివరించారు. విస్తరణ ప్రణాళికల్లో భాగంగా బెంగళూరులో కార్పొరేట్ కార్యాలయాన్ని ప్రారంభించినట్లు ఈ సందర్భంగా కంపెనీ ప్రకటించింది. -
రూ.8,600 వరకు తగ్గిన ఒకినావా స్కూటర్స్ ధర
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ కంపెనీ ఒకినావా స్కూటర్స్.. ఎలక్ట్రిక్ వాహనాల ధరలను తగ్గించించి. రూ.8,600 వరకు ధరలను తగ్గించిన ఈ సంస్థ.. లెడ్ యాసిడ్ శ్రేణి వాహన ధరలను రూ.2,500–రూ.4,700 వరకు తగ్గించింది. లిథియం అయాన్ శ్రేణి స్కూటర్ ధరలను రూ.3,400–రూ.8,600 వరకు తగ్గించినట్లు ప్రకటించింది. రూ.37,000–రూ.1.08 లక్షల ధరల శ్రేణిలో ఈ సంస్థ వాహనాలను విక్రయిస్తోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలపై వస్తు సేవల పన్ను రేటును 12 నుంచి 5 శాతానికి తగ్గించిన నేపథ్యంలో ఈ ప్రయోజనాన్ని వినియోగదారులకు బదిలీ చేయడం కోసం ఈ మేరకు ధరలను తగ్గించినట్లు కంపెనీ ప్రకటించింది. -
స్కూటీ.. నిజం కాదండోయ్
సాక్షి, వీరఘట్టం(శ్రీకాకుళం) : మంచి పది మందికి తెలిసేలోపు.. చెడు క్షణాల్లో ప్రపంచాన్నే చుట్టి వస్తుందని నానుడి. నేటి ఆధునిక ప్రపంచంలో పరిస్థితి ఇలాగే ఉంది. ఇంటర్నెట్ నెట్ విస్తృతంగా అందుబాటులోకి వచ్చాక అసత్య ప్రచారాలు జోరందుతుకున్నాయి. విషయ పరిజ్ఞానం, అవగాహన లేని కొందరు అమాయకులు ఇటువంటి అసత్య ప్రచారాలకు బలైపోతున్నారు. ఇటీవల స్కూటీ యోజన అనే పథకం ఉందంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేయడం కూడా ఇలాంటిదే. అసలు ఈ పథకమే లేకపోయినా.. స్కూటీ యోజన నిజమే కాబోలని భావించి మహిళలు ఆతృతగా దరఖాస్తులు చేసుకునేందుకు సిద్ధపడుతున్నారు. అర్హత కలిగిన బాలికలకు స్కూటీలు ఇవ్వాలనే లక్ష్యంతో ప్రధాని మోదీ స్కూటీ యోజన ప్రవేశపెట్టినట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఇందుకు సంబంధించిన వైబ్‌సైట్ పరిశీలిస్తే అటువంటిదేమీ లేదని తెలుస్తోంది. అయినప్పటికీ ఈ పథకం ద్వారా స్కూటీని పొందేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తుండటం గమనార్హం. ఇందు కోసం ప్రతీ ఒక్కరికీ ఉండాల్సిన డ్రైవింగ్ లైసెన్స్‌ల కోసం ఆర్టీఓ కార్యాలయాలకు క్యూ కడుతున్నారు. ఇదీ అసలు విషయం... పదో తరగతి తర్వాత బాలికల ఉన్నత చదువులకు కళాశాలకు వెళ్లి రావడానికి, వర్కింగ్ ఉమెన్ల కోసం ప్రధానమంత్రి మోదీ స్కూటీ యోజన పథకం అమల్లోకి తీసుకొచ్చారనే ప్రచారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సర్కారు యోజన వైబ్సైట్లోకి వెళ్లి దరఖాస్తు నింపాలని, ఈ నెల 30తో దరఖాస్తు స్వీకరణ గడువు ముగియనుదని అందులో సారాంశం. పదో తరగతి మా ర్కుల జాబితా, ఆధార్‌కార్డు, రేషన్, ఆదాయ ధ్రువపత్రాలతో పాటు ఎల్ఎల్ఆర్ లైసెన్సు కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకో వాలని, ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే అర్హత కల్పిస్తారని, దరఖాస్తుదారులు పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలని, వయస్సు 18 నుంచి 40 ఏళ్లలోపు ఉండాలని, ఆదాయం 2.50 లక్షల లోపు ఉండాలని చెబుతున్నారు. ఇది నిజమేనని నమ్మి కొందరు నెట్‌సెంటర్లకు పరుగులు తీస్తున్నారు. అంతా బూటకం.. వాస్తవానికి స్కూటీ అనేది ఓ ద్విచక్ర వాహన కంపెనీ పేరు. ఓ ప్రవేటు కంపెనీ పేరుతో కేంద్ర ప్రభుత్వం పథకాన్ని అమలు చేయదు. ఇటువంటి ప్రచారాలపై విజ్ఞతతో ఆలోచించి దూరంగా ఉండాలని పలువురు హితవుపలుకుతున్నారు. తమిళనాడులో ఓపెన్ అవుతుందట.... స్కూటీ యోజన పథకంలో స్కూటీలు తమ సొంతం చేసుకుందామని ఆశిస్తున్న కొందరు మహిళలను ‘సాక్షి’ ఈ విషయంపై ఆరా తీయగా ఆసక్తి విషయాలు వెలుగుచూశాయి. ఆంద్రప్రదేశ్‌లో ఈ పథకం వెబ్సైట్ ఓపెన్ కావడం లేదు గాని తమిళనాడులో ఓపెన్ అవుతుందని తన ఫ్రెండ్ తనతో చెప్పినట్లు చెప్పింది. అయితే ఇక్కడే అసలు విషయం దాగుంది. తమిళనాడులో ఉన్న పథకం పేరు ‘అమ్మ స్కూటర్ స్కీం’. గత సంవత్సరం తమిళనాడులో ప్రారంభించారు. మాజీ ముఖ్యమంత్రి జయలలిత జ్ఞాపకార్థం ఆమె 70వ జయంతి సందర్భంగా అక్కడి విద్యార్థినులు, ఉద్యోగం చేసే మహిళల కోసం ఈ స్కీం స్టార్ట్ చేశారు. అది కూడా 50 శాతం రాయితీపై స్కూటర్ ఇచ్చేలా పథకం రూపొందించారు. ఇది కేవలం తమిళనాడు ప్రజలకే పరిమితం. ఈ విషయం తెలియక మోదీ యోజన అంటూ కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి ఇటువంటి పధకాలు ప్రవేశ పెడితే కేంద్ర ప్రభుత్వం గ్రాండ్‌గా ఇనా గరేట్ చేస్తుందే తప్ప ఇలా గుట్టుగా చేయదని, మహిళలు ఈ విషయాన్ని గ్రహించాలని విద్యావేత్తలు చెబుతున్నారు. ఆ పథకమే లేదు.. స్కూటీ యోజన అనే పథకమే ప్రారంభించలేదు. అనవసరంగా ఇటువంటి బూటకపు ప్రచారం విని డబ్బులు వృథా చేసుకోవద్దు. – జి.పైడితల్లి, ఎంపీడీఓ, వీరఘట్టం -
స్కూటీలో దూరిన నాగుపాము
సాక్షి, బెంగళూరు : పాము కప్పను మింగి భయంతో స్కూటీలోకి దూరిపోయి ఐదు గంటల పాటు స్కూటీ యజమానిని భయపెట్టింది. ఈ ఘటన చిక్కమగళూరు కల్యాణనగరలోని పుష్పగిరిలేఔట్లో జరిగింది. ఎస్ఐ కుమారస్వామి భార్యకు స్కూటీ ఉంది. స్కూటీని ఇంటి వద్ద నిలిపి ఉండగా, ఎక్కడి నుంచో వచ్చిన ఓ నాగుపాము కప్పను స్వాహా చేసింది. పామును చూసిన వారు పెద్దగా కేకలు వేశారు. దీనితో పాము భయపడి పక్కలోని స్కూటీ హెడ్‌లైట్ లోపలికి చేరింది. మొదట మెకానిక్‌ను రప్పించి డూంను తీయించటానికీ ప్రయత్నించారు. అయితే మెకానిక్ భయంతో వెనుదిరిగి వెళ్లాడు. పాములు పట్టే స్నేక్ నరేశ్ సమాచారం అందించారు. ఆయన రాగానే స్కూటీని దూరంగా తీసుకెళ్లి దానిని ఆన్ చేయించారు. డూం లోపలికి పైప్‌తో వేగంగా నీటిని చిమ్మడంతో పాము బయటకు వచ్చింది. నరేశ్ దానిని పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలారు. -
స్నేహితురాలిని పరామర్శించేందుకు వెళ్తూ..
కర్నూలు ,మహానంది: స్నేహితురాలి తండ్రి మృతి చెందాడన్న విషయం తెలుసుకుని ఆమెను పరామర్శించేందుకు అక్కా చెల్లెళ్లు స్కూటీపై బయలుదేరారు. అయితే.. వీరిని కూడా విధి చిన్నచూపు చూసింది. రోడ్డు ప్రమాదంలో చెల్లెలు మృతి చెందగా.. అక్కకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మంగళవారం మహానంది మండలం బోయిలకుంట్ల మెట్ట వద్ద చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. నంద్యాల పట్టణానికి చెందిన అస్మా, రూబీన్(23) అక్కాచెల్లెళ్లు. వీరికి గాజులపల్లెలో అలియా అనే స్నేహితురాలు ఉంది. అలియా తండ్రి పఠాన్‌రఫి గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో స్నేహితురాలిని పరామర్శించేందుకు అక్కాచెల్లెళ్లు మంగళవారం స్కూటీపై బయలుదేరారు. మార్గమధ్యంలో ఎదురుగా ఇద్దరు యువకులు బైక్‌పై వస్తూ వారి స్కూటీని ఢీకొట్టారు. దీంతో అక్కాచెల్లెళ్లిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. అక్కడే ఉన్న ప్రైవేటు ఉద్యోగి ప్రసాద్ వెంటనే 108కి సమాచారం ఇచ్చారు. మహానంది ఎస్ఐ తులసీనాగప్రసాద్ కూడా వెంటనే అక్కడికి చేరుకోవడం, రోడ్‌సేఫ్టీ పోలీసుల వాహనం సైతం రావడంతో ఇద్దరినీ రెండు వాహనాల్లో చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి వైద్యుల సూచన మేరకు కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ రూబీన్ మృతిచెందింది. అస్మా పరిస్థితి సైతం విషమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రూబీన్ భర్త షేక్ షహీన్‌బాష నంద్యాల కూరగాయల మార్కెట్లో కమీషన్ వ్యాపారం చేస్తుంటాడు. వీరికి మూడు నెలల బాబు ఉన్నాడు. ఆ చిన్నారికి తల్లి దూరం కావడం ఆ కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని మిగిల్చింది. భార్య మృతదేహం వద్ద షహీన్ బాష రాత్రి వరకు అక్కడే కూర్చుని రోదిస్తున్న తీరు చూపరులకు సైతం కంటతడి పెట్టించింది. ప్రమాదంపై కేసు నమోదు చేసినట్లు మహానంది ఎస్ఐ తులసీనాగప్రసాద్ తెలిపారు. -
పేలిన స్కూటీ టైర్
మహేశ్వరం: స్కూటీ టైర్ పేలిపోవడంతో వాహనం అదుపుతప్పడంతో డీఎంఅండ్‌హెచ్‌ఓ సీనియర్ అసిస్టెంట్ దుర్మరణం చెందాడు. ఈ సంఘటన మండల పరిధిలోని సిరిగిరిపురం గేటు సమీపంలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. సీఐ వెంకన్న నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని వనస్థలిపురానికి చెందిన పోల చంద్రశేఖర్(45 ) రంగారెడ్డి జిల్లా డీఎంఅండ్‌హెచ్‌ఓ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం కందుకూరు మండలంలోని ఉద్యోగుల వేతనాలు, ఇతర పత్రాలను ఇచ్చేందుకు తన స్కూటీ (టీఎస్ 08 ఈహెచ్ 5491)పై మహేశ్వరం ఎస్టీఓ కార్యాలయం వైపు వస్తున్నాడు. ఈక్రమంలో సిరిగిరిపురం గేటు వద్ద స్కూటీ టైర్ పగిలిపోవడంతో వాహనం కిందపడింది. ఈ ప్రమాదంలో చంద్రశేఖర్ కిందపడిపోవడంతో తలకు బలమైన గాయాలై తీవ్ర రక్తస్త్రావం జరిగి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. వెంటనే వాహనదారులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతుడి జేబులో లభించిన ఐడెంటిటీ కార్డుతో సాయంతో అతడి వివరాలు గుర్తించి కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. స్కూటీ టైర్ పగిలిపోవడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు, స్థానికులు తెలిపారు. మృతుడి తోటి ఉద్యోగులు ఘటనా స్థలానికి చేరుకొని బోరున విలపించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈమేరకు కేసు దర్యాప్తులో ఉంది. -
దర్జాగా... దోచారు!
నరసరావుపేట టౌన్: స్కూటీలో దాచిన నగదు అపహరించుకు వెళ్లిన సంఘటన గురువారం పట్టణంలో కలకలం రేపింది. నిత్యం జన సంచా రంతో రద్దీగా ఉండే ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకోవటం అందరినీ ఆశ్చర్యపరిచింది. అం దరూ చూస్తుండగానే దుండగులు అత్యంత చాకచక్యంగా వాహన సీటును తొలగించి రూ.2.25 లక్షలను అపహరించారు. గమనించిన యజమాని స్థానికుల సహాయంతో చోరులను వెంబడించినా ఫలితం దక్కకుండా పోయింది. వివరాల్లో కెళితే.. పట్టణంలోని బరంపేటకు చెందిన గంధం సూర్యనారాయణ గురువారం ఉదయం 11.30 గంటల సమయంలో ఇండియన్ బ్యాంక్‌లో రూ.3.5 లక్ష ల నగదును విత్‌డ్రా చేశాడు. ఆ నగదును తన స్కూటీ వాహనంలో భద్రపరిచి మెయిన్ రోడ్డు ఏరియా ప్రభుత్వ వైద్యశాల సమీపంలో గల తన స్నేహితుడి వస్త్ర దుకాణం గౌరీ శంకర్ టెక్స్టైల్స్ వద్దకు వచ్చాడు. దుకాణం ఎదుట వాహనాన్ని నిలిపి యజమానితో మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో ఇద్దరు దుండగులు స్కూటీ వద్ద నిల్చొని వేచిఉన్నట్లుగా నటిస్తూ సీటును బలవంతంగా పైకిఎత్తి అందులో ఉన్న రూ.2.25 నగదును అపహరించారు. గమనించిన వస్త్ర దుకాణ యజమాని కొండారెడ్డి కేకలు వేయడంతో అప్రమత్తమైన దుం డగులు ఇద్దరూ ద్విచక్రవాహనంపై పరారయ్యా రు. బాధితుడు సూర్యనారాయణ స్థానికుల సహా యంతో చోరులను వెంబడించినప్పటికీ ప్రయోజనం దక్కలేదు. సమాచారం అందుకున్న వన్‌టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని చోరీ జరిగిన తీరును పరిశీలించారు. సమీపంలోని దుకాణంలో ఉన్న సీసీ ఫుటేజ్‌లను సేకరించి, నిందితులను కనుగొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బిలాలుద్దీన్ తెలిపారు. -
మహిళలకు ఉచిత బ్యాటరీ స్కూటర్లు
కర్ణాటక, బనశంకరి: ప్రతివార్డులో 20 మంది మహిళలకు మోపెడ్ (ఎలక్ట్రిక్ స్కూటీలు) అందిస్తారు. ♦ మహిళల ఆర్దికస్వావలంబనకోసం రుణాల సౌలభ్యం ♦ ఉత్తమ పాలన వ్యవçస్థ కోసం ఒకే ఫైల్ నిర్వహణ పద్దతి అమలు ♦ 400 ప్రాంతాల్లో ఉచిత వైఫై వ్యవస్థ ♦ పాలికె ఆదాయం పెంచడానికి జాగృతదళం స్థాపన ♦ ప్రతివార్డులో ఎస్సీఎస్టీ స్లంబోర్డు అభివృద్ధికి రూ.30 కోట్లు ♦ పౌర కార్మికుల మధ్యాహ్న భోజనానికి రూ.12 కోట్లు ♦ ప్రతివార్డులో ఎస్సీ, ఎస్టీలకు పది ఇళ్ల నిర్మాణం ♦ మహిళలకోసం ఆరోగ్య కవచ పథకం క్యాన్సర్ పరీక్షలకు వాహనం ♦ క్యాన్సర్ జబ్బు నిర్ధారణ పరీక్షలు చేసే బస్ కొనుగోలుకు రూ. 3 కోట్లు ♦ మహిళా పాలికె కార్పోరేటర్లు వార్డులకు తలా రూ.10 లక్షల నిధులు ♦ నిరాశ్రయుల నిలయానికి రూ. కోటి నిధులు ♦ విభిన్నప్రతిభావంతుల సంక్షేమ కార్యక్రమాల కోసం రూ.75 కోట్లు ♦ బాబు జగ్జీవన్‌రాం ప్రజా ఆసుపత్రిలో క్యాన్సర్ చికిత్సా కేంద్రం తెరవడానికి రూ.50 లక్షలు ♦ బీబీఎంపీ ఆస్తులు, భూములు నిర్వహణ కు రూ.55 కోట్లు ♦ నిరుపేద గుండెజబ్బు రోగులకు ఉచితంగా స్టెంట్లు అమర్చడానికి రూ.4 కోట్లు ♦ కొత్తగా డయాలసిస్ కేంద్రాల స్థాపనకు రూ.25 కోట్లు ♦ కిద్వాయ్ ఆసుపత్రి ధర్మశాల ఆధునీకరణకు రూ.5 కోట్లు ♦ నగరంలో కాలుష్యం అధికంగా ఉన్నచోట్ల వాయు శుద్ధీకరణ యంత్రాలను అమర్చడానికి రూ.5 కోట్లు ♦ తాయి మడిలు పథకానికి రూ.1.50 కోటి ♦ ప్రాణుల చికిత్సా కేంద్రానికి రూ.5 కోట్లు ♦ నిరుపేద క్రీడాకారులకు సాయానికి రూ. కోటి కేటాయింపు -
స్కూటీలో అనుకోని అతిథి
కృష్ణరాజపురం (బెంగళూరు): స్కూటీలో అనుకోని అతిథి మకాం వేసింది. దీంతో బెంబేలెత్తిన యజమాని జనం సహకారంతో దానిని తొలగించుకోవడానికి నానా పాట్లు పడ్డాడు. బెంగళూరు సమీపంలో హొసకోటె పట్టణంలోని వీవీ లేఔట్లో ఈ విడ్డూరం చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన ఓ వ్యక్తి సోమవారం వీవీ లేఅవుట్లో తెలిసిన వ్యక్తుల ఇంటికి స్కూటీపై వచ్చాడు. కొద్దిసేపటి తరువాత ఇంటికి వెళ్లడానికి స్కూటీపై కూర్చుని స్టార్ట్ చేయబోతుంటే దాని లోపల దాక్కున్న చిన్న నాగుపాము బుసలు కొడుతూ బయటకు వచ్చింది. పామును చూసిన ఆ వ్యక్తి ఉలిక్కిపడి పరుగందుకున్నాడు. ఇది గమనించిన స్థానికులు మెకానిక్ సహాయంతో వాహన భాగాలు ఊడదీశారు. స్థానికంగా పాములు పట్టే నిపుణుడు పామును బయటకు తీసి పట్టణ శివార్లలో పొదల్లో సురక్షితంగా వదిలేశారు. అది చిన్నపామే అయినా కాటేసి ఉంటే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదన్నారు. -
బండి వెనకాల పరిగెత్తి ఫైన్ విధించింది
-
రూల్స్ బ్రేక్ చేసింది.. తర్వాత
గాంధీనగర్ : ఎక్కడైనా సరే ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే ఏం చేస్తారు.. మహా అయితే ఆ వాహనాల నంబర్ నోట్ చేసుకోవడం, ఫోటో తీయడం వంటివి చేస్తారు. తర్వాత ఆ నంబర్ మీద రిజిష్టర్ చేయించుకున్న వ్యక్తికి చలాన్ రాస్తారు. లేదంటే అక్కడే బండి ఆపి ఫైన్ కట్టించుకుంటారు, అంతే తప్ప వాహనం వెనకాల అయితే పరిగెత్తరు కదా. కానీ గుజరాత్, రాజ్‌కోట్‌కు చెందిన ఓ మహిళా ట్రాఫిక్ కానిస్టేబుల్ మాత్రం ఇందుకు మినహాయింపు. ట్రాఫిక్ నియమాలను పాటించని ఓ మహిళ స్కూటరిస్ట్ వెనకాల పరిగెత్తి మరీ స్కూటీని ఆపి ఫైన్ విధించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. వీడియోలో ఉన్న దాని ప్రకారం స్కూటీ మీద వెళ్తున్న మహిళ ట్రాఫిక్ నియమాలను అతిక్రమించింది. దాంతో ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆ మహిళ బండి పక్కకు ఆపి, లైసెన్స్ చూపించమంది. అయితే అక్కడ బాగా రద్దీగా ఉండటంతో సదరు మహిళ, కానిస్టేబుల్ దృష్టి మరలగానే తప్పించుకుపోయే ప్రయత్నం చేసింది. కానీ వెంటనే అప్రమత్తమైన కానిస్టేబుల్, మహిళ స్కూటీ రేర్ హ్యాండిల్‌ను పట్టుకుని స్కూటీ వెనకే పరిగెత్తింది. అలా కొంత దూరం వెళ్లిన తర్వాత మహిళ స్కూటీని ఆపి కానిస్టేబుల్ని తిట్టడం ప్రారంభించింది. అయితే ఆ మహిళ బండి ఆపగానే అధికారి వెళ్లి స్కూటీ తాళం తీసుకుంది మరోసారి పారిపోయే అవకాశం ఇవ్వకుండా. అనంతరం ఆ మహిళను చలనా చెల్లించి బండి తీసుకెళ్లమని హెచ్చరించింది. ఈ మొత్తం తతంగాన్ని ప్రముఖ హిందీ న్యూస్ చానెల్ జీ న్యూస్‌లో ప్రసారం చేశారు. (వీడియో జీ న్యూస్ సౌజన్యంతో) -
పార్కింగ్ చేసి వచ్చే లోపు స్కూటీ మాయం
-
స్కూటీ ఎలా కొట్టేశారో చూడండి..
సాక్షి, హైదరాబాద్ : చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో వాహనాల దొంగలు రెచ్చిపోతున్నారు. పార్కింగ్ చేసి పక్కకు వెళ్లి వచ్చే లోపు బండిని అదృశ్యం చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే చందానగర్‌లోని ఫాస్ట్స్టెప్ షాపు ముందు జరిగింది. వివరాలు.. శుక్రవారం సాయంత్రం షాపింగ్ కోసం వచ్చిన మహిళ తన ద్విచక్ర వాహనాన్ని చందానగర్ లోని ఫాస్ట్స్టెప్ షాపు ముందు నిలిపి లోపలి వెళ్లారు. తిరిగి వచ్చేసరికి స్కూటీ కనపడలేదు. దీంతో ఆందోళనకు గురైన ఆమె.. తన స్కూటీ కనిపించట్లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సమీపంలోని సీసీ కెమెరా పుటేజీలను పరిశీలించి గుర్తు తెలియని వ్యక్తి వాహనాన్ని తీసుకుని వెళ్తున్నట్లు గుర్తించారు. అనంతరం పుటేజీ ఆధారంగా నిందితుని కోసం గాలిస్తున్నారు. -
మెట్రో జర్నీ.. మేడ్ ఈజీ!
సనత్‌నగర్: అమీర్‌పేట్–ఎల్బీనగర్ రూట్లో ఆగస్టులో మెట్రో రైళ్లు పరుగులు తీస్తాయని హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మెట్రో ప్రయాణికులకు లాస్ట్‌మైల్ కనెక్టివిటీ వరకు సౌకర్యవంతమైన ప్రయాణం సాకారం చేసేందుకు మెట్రోస్టేషన్ల వద్ద ద్విచక్ర వాహనాలతో పాటు కార్లను అందుబాటులో ఉంచుతున్నామన్నారు. మెట్రో స్టేషన్ల వద్ద నూతనంగా ప్రవేశపెట్టిన ‘డ్రైవ్ జీ’ యాక్టివా వాహనాలను గురువారం ఆయన బేగంపేట తాజ్‌వివంతా హోటల్ వేదికగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్వీఎస్రెడ్డి మాట్లాడుతూ.. ఏ నగరానికైనా ప్రజా రవాణా ముఖ్యమని, నగరాలను కార్ల కోసం అభివృద్ధి చేయడం కాదని, ప్రజల కోసం, వారి అవసరాల కోసమేనని స్పష్టం చేశారు. గ్రేటర్లో హైదరాబాద్ మెట్రో రైల్ తరుఫున అన్ని హంగులతో కూడిన ప్రజారవాణా వ్యవస్థను తీర్చిదిద్దేదిశగా కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే పెడల్, జూమ్‌కార్ సంస్థలతో కలిసి మియాపూర్, కేపీహెచ్‌బీ, కూకట్పల్లి, బేగంపేట, నాగోలు, పరేడ్‌గ్రౌండ్ మెట్రోస్టేషన్లలో ద్విచక్రవాహనాలు, కార్లను అద్దె ప్రాతిపదికన అందజేసే ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మరో ఐదు స్టేషన్లలో ‘డ్రైవ్‌జీ’ యాక్టివా వాహనాలను ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. ఫస్ట్ టు లాస్ట్ మైల్ కనెక్టివిటీ అందించే దిశగా డ్రైవ్‌జీ వాహనాలను ప్రారంభించినట్లు వివరించారు. 125 డ్రైవ్ జీ యాక్టివా వాహనాలు షురూ... మొదటి విడతగా 125 డ్రైవ్‌జీ వాహనాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ వాహనాలను బాలానగర్, కూకట్పల్లి, ప్రకాష్‌నగర్, తార్నాక, మెట్టుగూడ మెట్రోస్టేషన్లలో అందుబాటులో ఉంచారు. డబ్లు్యడబ్లు్యడబ్లు్య.డ్రైవ్‌జీ.కామ్ వెబ్సైట్ ద్వారా వాహనాన్ని బుక్ చేసుకుని ఆయా స్టేషన్ల వద్ద వీటిని పికప్ చేసుకోవచ్చు. అయితే ముందుగా మీ డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు పాన్‌కార్డును కూడా ఈ వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కిలోమీటర్‌కు రూ.3... డ్రైవ్‌జీ వాహనాలను అద్దెకు తీసుకునే వారి నుంచి కిలోమీటరుకు రూ.3 ఛార్జీగా వసూలు చేస్తారు. కనీస దూరం ఐదు కిలోమీటర్లుగా పరిగణించి రూ.15 వసూలు చేయాలని నిర్ణయించారు. నెలవారీగా అద్దెకు తీసుకోవాలంటే రూ.2,700 చెల్లించాల్సి ఉంటుంది. భవిష్యత్తులో వినియోగదారుల సంఖ్యను బట్టి ఈ ధర మారుతుందన్నారు. త్వరలో ఏడు రోజులు, 15 రోజుల చొప్పున పాస్‌లు ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మల్టీలెవల్ పార్కింగ్‌కు ప్రతిపాదనలు... ప్రకాష్‌నగర్ స్టేషన్ మినహాయించి అన్ని మెట్రోస్టేషన్లలోనూ పార్కింగ్‌కు ఏర్పాట్లు చేసినట్లు ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. రద్దీగా ఉండే మెట్రో స్టేషన్లకు సమీపంలో మల్టీలెవల్ పార్కింగ్ కేంద్రాలకు ప్రతిపాదనలు సిద్ధంచేశామన్నాన్నారు. ఎంజీబీఎస్ వద్ద స్కైవాక్‌లు... ఎంజీబీఎస్‌కు అనుసంధానం చేసేలా రెండు వైపులా స్కైవాక్‌ల నిర్మాణం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. దీని ద్వారా మెట్రో స్టేషన్ల నుంచి నేరుగా ఎంజీబీఎస్‌లోకి వెళ్లేందుకు సౌలభ్యంగా ఉంటుందని చెప్పారు. త్వరలోనే ఈ పనులను పూర్తి చేయనున్నట్లు ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. -
అక్క ఆనందం కోసం...తమ్ముడు...
జైపూర్, రాజస్థాన్: అక్కా, చెల్లెళ్లను ఆటపట్టించి సరదాగా వారిని ఏడిపించే అన్నా, తమ్ముళ్లను మనం చూస్తూనే ఉంటాం. ఖర్చులకు సరిపోక వారి పాకెట్ మనీ కూడా కొట్టేసే తోబుట్టువులను చూసే ఉంటాం. కానీ, సోదరి ఆనందం కోసం జైపూర్‌లోని ఓ కుర్రాడు ఏం చేశాడో తెలిస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. ఎందుకంటే.. ఆమె కోసం ఒకటా, రెండా ఏకంగా 62 వేల రూపాయలు కూడ బెట్టాడు. ఇందులో విశేషమేముంది అనుకోవచ్చు. పదమూడేళ్ల కుర్రాడు పాకెట్ మనీని కూడబెట్టడం, అందులోనూ అవన్నీ నాణేల రూపంలో ఉండడం విశేషమే కదా..! వివరాలు... రూపాల్, యాష్ అక్కాతమ్ముళ్లు. రూపాల్‌కు స్కూటీ అంటే ఇష్టం. యాష్ ఎలాగైనా, ఆమెకు స్కూటీని బహుమతిగా ఇవ్వాలనుకున్నాడు. తల్లిదండ్రులు పాకెట్ మనీగా ఇచ్చిన ఒక్కో రూపాయిని కూడబెట్టాడు. అలా జమ చేసిన మొత్తాన్ని ఓ పెద్ద బ్యాగులో వేసుకుని రూపాల్‌తో పాటు గతేడాది దీపావళి రోజున హోండా షోరూమ్‌కు మోసుకొచ్చాడు. అప్పటికే షోరూమ్ మూసే వేళయింది. అయితే, యాష్ తన అక్క కోసం దాచిన సొమ్ముని వారికి చూపించి ఎలాగైనా ఈరోజు ఆమెకు స్కూటీ కానుకగా ఇవ్వాలనీ, షోరూమ్ అప్పుడే మూసేయవద్దని వేడుకున్నాడు. కుర్రాడి మాటలకు ముచ్చట పడిన సిబ్బంది సరే అన్నారు. యాష్ తెచ్చిన బ్యాగులోని నాణేలను లెక్క పెట్టడం మొదలు పెట్టారు. రెండు గంటల పాటు అయిదుగురు సిబ్బంది ఆ మొత్తం నాణేలను లెక్కించగా అరవై రెండు వేల రూపాయలుగా తేలింది. స్కూటీకి సరిపడా డబ్బు అందడంతో సిబ్బంది వెంటనే బండిని వారికి అప్పగించారు. కళ్లలో కొండంత ఆనందం నింపుకున్న యాష్ తన సోదరి రూపాల్‌కు స్కూటీని బహుమతిగా ఇచ్చాడు. ఎంతో మంది పిల్లలకు ఆదర్శంగా నిలిచాడు. చివరివరకు ఈ విషయం పిల్లలు వారి తల్లిదండ్రులకు చెప్పకపోవడం గమనార్హం. మామూలుగా బండి కొనేందుకు వచ్చిన వారు కొంత మొత్తాన్ని నాణేల రూపంలో చెల్లించడం అప్పుడప్పుడూ జరుగుతూనే ఉంటుందనీ, కానీ.. ఇలా మొత్తం సొమ్ము నాణేలుగా అందించడం ఎప్పుడూ చూడలేదని షోరూమ్ జనరల్ మేనేజర్ సంతోష్ కుమార్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అక్కకు బహుమతి ఇవ్వడం కోసం యాష్ ఇంతగా కష్టపడడం నిజంగా గొప్ప విషయమని అన్నారు. -
అత్తమ్మను చూసి తిరిగివస్తూ..
కాశీబుగ్గ: అత్తమ్మ ఆస్పత్రిలో ఉండటంతో ఆమెను చూడటానికి ఆస్పత్రికి వెళ్లిన యువకుడు.. ద్విచక్ర వాహనంపై ఇంటికి తిరిగి వస్తుండగా లారీ ఢీ కొనడంతో దుర్మరణం చెందాడు. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో ప్రమాదాల జంక్షన్‌గా పేరుపొందిన కోసంగిపురం జాతీయరహదారి కూడలి వద్ద ఈ విషాదకర సంఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మందస మండలం బహాడపల్లి పంచాయతీ నల్లబొడ్లూరు గ్రామానికి చెందిన తిమ్మల పాపారావు(35).. అత్తయ్య కాశీబుగ్గలో ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమెను చూసేందుకు మందస నుంచి కాశీబుగ్గకు స్కూటీపై వెళ్లారు. ఆమెను పరామర్శించి మందస వస్తుండగా కోసంగిపురం కూడలి వద్ద సాయంత్రం 5గంటల సమయంలో జాతీయ రహదారి దాటుతుండగా పాపారావు ద్విచక్రవాహనాన్ని లారీ(ఏపీ 30 టీటీ 0479) వేగంగా ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయింది. దీంతో పాపారావు తలకు, కాలికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ‘108’కు సమాచారం అందించారు. అప్పటికీ వాహనం రాకపోవడంతో.. హైవే పెట్రోలింగ్ వ్యానులో పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. స్కూటీని ఢీకొట్టిన లారీని స్థానికంగా ఓ యువకుడు వెంబడిచి 1వ వార్డు మెగిలిపాడు వంతెన దాటుతుండగా పట్టుకున్నారు. ఇంతలో యువకుడిని పలాస ప్రభుత్వ ఆస్పత్రిలో అత్యవసర వైద్యం అందించినప్పటికీ తలకు తీవ్ర గాయమవడంతో అక్కడే మరణించారు. పాపారావు అన్నయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాశీబుగ్గ ట్రాఫిక్ ఏఎస్ఐ అప్పలరాజు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. మృతుడు కూలి పనిచేస్తూ కుటుంబానికి జీవిస్తున్నారు. మొదటి భార్యతో విడాకులు తీసుకుని మూడేళ్ల క్రితం మరో వివాహం చేసుకున్నారు. రెండవ భార్యతో నల్లబొడ్లూరులో జీవిస్తున్నారు. వీరికి రెండేళ్ల బాబు ఉన్నాడు. పెద్ద దిక్కు కోల్పోవడంతో .. ఆ ఇంట్లో విషాద చాయలు అలుముకున్నాయి. -
కాంతి పుంజం..తీసింది ప్రాణం
తుమకూరు: మిరిమిట్లు గొలిపే కాంతి పుంజం ఒకరి మృతికి కారణమైంది. కారు హెడ్లైట్ల వెలుతురులో దారి కనిపించక స్కూటీ ట్రాక్టర్‌ను ఢీకొంది. ఘటనలో ఒక మహిళ మృతి చెందగా మరో మహిళ గాయపడింది. ఈఘటన సోమవారం రాత్రి తుమకూరు జిల్లా, హులియూరు సమీపంలో చోటు చేసుకుంది. హులియూరు గ్రామ పంచాయతీ సభ్యుడు ఎస్ఎస్ఆర్ ధయానంద్ భార్య కళావతి(28) సోమవారం రాత్రి తన వదిన వినూతతో కలిసి తిపటూరు వెళ్లింది. తిరిగి వస్తుండగా హులియూరు వద్ద కారు ఎదురైంది. హెడ్లైట్ల వెలుతురులో దారి కనిపించక స్కూటీ ముందు వెళ్తున్న ట్రాక్టర్‌ను ఢీకొంది. ప్రమాదంలో కళావతి అక్కడికక్కడే మృతి చెందింది. మరో మహిళ వినూతకు తీవ్ర గాయాలయ్యాయి. హందనకెరె పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని, క్షతగాత్రురాలిని ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. -
ఏఎన్ఎంలకు స్కూటీలు
మంచిర్యాలటౌన్/హాజీపూర్: గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు త్వరితగతిన అందేలా ప్రభుత్వం ‘రెక్కలు’ పథకంలో ఏఎన్ఎంలకు సబ్సిడీపై ద్విచక్ర వాహనాలను అందించనుంది. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించడంలో ఏఎన్ఎంలు కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే మారుమూల ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు సరిగా లేక ఏఎన్ఎంలు సమయానికి వెళ్లలేకపోతున్నారు. ఇక రవాణా పరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సకాలంలో రోగుల వద్దకు చేరుకునేలా ప్రభుత్వం ఈ వాహనాలను అందించనుంది. 171 దరఖాస్తులు.. జిల్లాలో 17 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉండగా, వాటి పరిధిలో 126 ఆరోగ్య ఉప కేం ద్రాలు ఉన్నాయి. మొత్తం 250 మంది ఏఎన్ఎంలు పని చేస్తున్నారు. వీరిలో 98 మంది రెగ్యులర్ ఏఎన్ఎంలు కాగా, 108 మంది సెకండ్ ఏఎన్ఎంలు, మిగతావారు కాంట్రాక్టు పద్ధతిలో విధులు నిర్వహిస్తున్నారు. వీరు రోజూ పీహెచ్‌సీల నుంచి సబ్ సెంటర్లకు, అక్కడి నుంచి గ్రామాలకు వెళ్లేందుకు రవాణా పరంగా ఇబ్బందులు పడుతుండటంతో ప్రభుత్వం స్కూటీల పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు జిల్లాలోని 171 మంది ఏఎన్ఎంలు స్కూటీల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. దరఖాస్తుకు గడువు ముగిసినప్పటికీ మిగిలిన వారు ఆసక్తి చూపిస్తుండడంతో వారి నుంచి దరఖాస్తులను స్వీకరించి, వాటిని కలెక్టర్‌కు పంపించేందుకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు సిద్ధంగా ఉన్నారు. రూ.13వేల వరకు సబ్సిడీ.. బ్యాంక్ లోన్ స్కూటీల కొనుగోలు కోసం ప్రభుత్వం ఏఎన్ఎంలకు నేరుగా రూ.10 వేల సబ్సిడీ అందించనుంది. అయితే కలెక్టర్ ఆర్వీ.కర్ణన్ ప్రభుత్వం అందించే రూ.10 వేల సబ్సిడీతో పాటు షోరూంల ద్వారా మరో రూ.3వేలు సబ్సిడీని ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందించారు. అటు ప్రభుత్వం, ఇటు షోరూంల ద్వారా సబ్సిడీ అందితే స్కూటీ ధరలో దాదాపుగా 40 శాతం మాఫీ అయ్యే అవకాశం ఉంది. ఈ పథకం ద్వారా ఏఎన్ఎంలకు స్కూటీలు ఇచ్చేందుకు సుజుకీ, యమహా, హీరో, హోండా, టీవీఎస్ కంపెనీలు ముందుకు రాగా, రుణ సౌకర్యం కల్పించేందుకు బ్యాంకులు సిద్ధమయ్యాయి. ఏఎన్ఎంలు వారికి నచ్చిన వాహనాన్ని బుక్ చేసుకోవచ్చు. సబ్సిడీ పోగా, బ్యాంకుల నుంచి తీసుకున్న రుణానికి నెలవారీ కిస్తీలు చెల్లించాల్సి ఉంటుంది. వాహనం బుకింగ్ చేసుకునేందుకు రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలు, ఐడీకార్డు, పాన్‌కార్డు, ఓటర్ ఐడీ, మూడు నెలల బ్యాంక్ స్టేట్మెంట్, పాస్‌బుక్ జిరాక్స్ కాపీలను జతచేసి దరఖాస్తు చేసుకోవాలి. మెరుగుపడనున్న వైద్యసేవలు ప్రస్తుతం ఏఎన్ఎంలు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లేందుకు ఆటోలు, బస్సులు మారుస్తూ ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రమాదాలకు గురవుతూ విధుల నిర్వహణలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. సమయానికి వాహనాలకు అందుబాటులో లేక ఏఎన్ఎంలు పని చేయని సందర్భాలు సైతం ఉన్నాయి. ఇప్పుడు స్కూటీలు అందిస్తుండడంతో వారు సమయానికి గ్రామాలకు చేరుకుని వైద్య సేవలు అందించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ముఖ్యంగా అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ఐదేళ్లలోపు చిన్నారులతో పాటు బాలింతలు, గర్భిణులకు ప్రభుత్వం లక్షలాది రూపాయల నిధులను వెచ్చించి ఉచితంగా టీకాలను సరఫరా చేస్తోంది. అయితే ఈ టీకాలు నిర్ణీత గడువులోగా వేయకపోతే ఇటు ఆరోగ్యపరంగా అటు ప్రభుత్వానికి ఆర్థికంగా నష్టం కలుగుతోంది. ఇక మీదట అలాంటి ఇబ్బందులు తప్పుతాయని అధికా రులు పేర్కొంటున్నారు. సేవలు మెరుగవుతాయి.. జిల్లాలో పనిచేస్తున్న ఒక్కో ఏఎన్ఎం మూడు నుంచి నాలుగు గ్రామాల్లో తిరుగుతూ ప్రజలకు వైద్య సేవలు అందించడంతో పాటు వైద్య ఆరోగ్య శాఖ ప్రవేశపెట్టే పథకాలపై అవగాహన కల్పించాల్సి ఉంటుంది. ఇంతకాలం ఏఎన్ఎంలు తమ పరిధిలోని గ్రామాలను తిరిగేందుకు వారి కుటుంబ సభ్యుల సహకారమో లేదా ఆటోలనో ఆశ్రయించేవారు. స్కూటీలు అందించడం ద్వారా రవాణా సమస్యలు తీరనున్నాయి. సరైన సమయంలో గ్రామాలకు చేరుకుని వైద్యసేవలు అందిస్తారు. – డాక్టర్ భీష్మ, డీఎంహెచ్‌వో -
మెర్సిడెస్ స్పీడుకు ఇంటర్ విద్యార్థి బలి
-
మెర్సిడెస్ స్పీడుకు ఇంటర్ విద్యార్థి బలి
న్యూఢిల్లీ: బడాబాబుల విలువైన కార్లు ఢిల్లీ పౌరుల పాలిట శాపంగా మారుతున్నాయి. హై ఎండ్ వాహనాలు.. అదుపులేని వేగంతో దూసుకొస్తూ మనుషుల ప్రాణాలు బలిగొనడం ఇటీవల దేశ రాజధానిలో పరిపాటిగా మారింది. తాజాగా అక్కడ ఓ 17 ఏళ్ల ఇంటర్ కుర్రాడు మెర్సిడెస్ కారు స్పీడుకు బలైపోయాడు. అతుల్ అరోరా అనే విద్యార్థి ఆదివారం రాత్రి స్కూటర్‌పై తన స్నేహితుడిని డ్రాప్ చేసి వస్తుండగా.. మెర్సిడెస్ కారు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. పశ్చిమ్ విహార్ ప్రాతంలో చోటు చేసుకున్న ఈ ఘటనలో.. 100 కిలోమీటర్లకు పైగా వేగంతో ప్రయాణించిన కారు విద్యార్థిని సుమారు 50 మీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. ప్రమాదం జరిగాక కనీసం ఆగి కూడా చూడకుండా.. మెర్సిడెస్ కారులోని వ్యక్తి పరారయ్యాడు. సీసీటీవీ ఫోటేజీ ఆధారంగా ప్రమాదానికి కారణమైన వ్యక్తిని కనుగొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దక్షిణ ఢిల్లీ ప్రాంతంలో బీఎమ్‌డబ్ల్యూ కారు అతివేగం మూలంగా ఓ ఉబర్ డ్రైవర్ ప్రాణాలు కోల్పోయిన ఘటన జనవరిలో జరిగింది. అదే నెలలో ఢిల్లీ శివార్లలో జరిగిన మరో ఘటనలో ఆడీ స్పీడు.. ఓ మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్‌తో సహా నలుగురిని పొట్టనబెట్టుకుంది. రోడ్డు ప్రమాదాల్లో 97 శాతం అతివేగం, నిర్లక్ష్య పూరిత డ్రైవింగ్ మూలంగానే జరుగుతున్నాయని రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. -
స్కూటీని ఢీకొన్న ఆర్జ్టీసీ బస్సు
-
స్కూటీని ఢీకొట్టిన లారీ : ఇద్దరు మృతి
హైదరాబాద్ (సంతోష్ నగర్) : స్కూటీని లారీ ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని డీఆర్డీఎల్ సంస్థ కార్యాలయుం సమీపంలో శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు చోటుచేసుకుంది. స్కూటీ పై వెళుతున్న వారిని వెనక నుంచి వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలపాలైన బాధితులు అక్కడికక్కడే మృతి చెందారు. కాగా ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
లారీ నుంచి స్కూటీలోకి పాము జంప్
తిరువళ్లూరు: ఇసుక లారీలో నుంచి జంప్ చేసిన నాగుపాము పెట్రోల్ బంక్ వద్ద నిలిపి వున్న స్కూటీలో దాక్కోవడంతో పామును పట్టుకోవడానికి దాదాపు రెండు గంటల పాటు అగ్నిమాపక సిబ్బంది శ్రమించాల్సి వచ్చింది. ఇసుక లారీ తిరువళ్లూరు వైపు బయల్దేరింది అయితే ట్రాఫిక్ సిగ్నల్ పడడంతో పెట్రోల్ బంక్ వద్ద ఆగింది. ఇదే సమయంలో ఇసుక లారీ నుంచి ఓ నాగుపాము కింద పడింది. అక్కడ జనసంచారం ఎక్కువగా వుండడంతో పామును చూడగానే జనం కేకలు వేస్తూ పరుగులు తీశారు. దీంతో రోడ్డుపై పడిన పక్కనే వున్న స్కూటీలో దాక్కుంది. కొందరు యువకులు స్కూటీ లో దాక్కున్న పామును బయటకు రప్పించడానికి ప్రయత్నించి విఫలయ్యారు. ఇక చేసేదేమీ లేక తిరువళ్లూరు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. స్కూటీలో వున్న పామును పట్టుకోవడానికి వారు సకల ప్రయత్నాలు చేశారు. ద్విచ క్ర వాహనాన్ని కింద పడేసి అటు ఇటూ పొర్లించినా పాము బయటకురాలేదు.దీంతో పోలీసులు వాటర్ క్యాన్‌ను ప్రయోగించడంతో నీటి వేగాన్ని తట్టుకోలేక నాగుపాము బయటకు వచ్చింది. దీంతో అగ్నిమాపక సిబ్బంది పామును సజీవంగా పట్టుకున్నారు. -
విరుచుకుపడ్డ మృత్యువు...