
సాక్షి, చిత్తూరు: నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా కష్టమొస్తే నేనున్నానంటూ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. నగరి మున్సిపాలిటీలోని పుదుపేటలో చేనేత కుటుంబానికి చెందిన పళణి కుమారుడు కె.పి.బాలమురుగున్ (21) ఏప్రిల్ నెల 6న తేదీన రేణిగుంట రైల్వే స్టేషన్‌లో రైలు దిగుతుండగా కాలు జారడంతో రెండు కాళ్లు నలిగిపోయాయి. దీంతో వైద్యులు.. అతని రెండు కాళ్లు తొలగించి కృతిమ కాళ్లు ఏర్పాటు చేశారు.
చదవండి: ఎమ్మెల్యే కాటసాని కుమారుడి వివాహానికి హాజరైన సీఎం జగన్
ఎమ్మెల్యే రోజా.. బాధితుడు నడిచి కాలేజీకి వెళ్లలేని దయనీయ పరిస్థితి తెలుసుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా రోజా ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా బాలమురుగన్‌కు టీవీఎస్ స్కూటీని అందించి.. భరోసా కల్పించారు.
Comments
Please login to add a commentAdd a comment